Telangana TSBIE TS Inter 1st Year Physics Study Material 1st Lesson భౌతిక ప్రపంచం Textbook Questions and Answers.
TS Inter 1st Year Physics Study Material 1st Lesson భౌతిక ప్రపంచం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భౌతికశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు:
భౌతికశాస్త్రం ప్రకృతి సహజమైన దృగ్విషయాలను అధ్యయనం చేస్తూ, పరిశీలనలు మరియు ప్రయోగాల ద్వారా ప్రకృతిని నియంత్రించే నియమాలను తెలియచేసే శాస్త్రము.
ప్రశ్న 2.
సి.వి. రామన్ ఆవిష్కరణ ఏమిటి ? (మార్చి 2014, మే 2014)
జవాబు:
భౌతిక శాస్త్రానికి (సి.వి. రామన్ అందించిన ఆవిష్కరణ రామన్ ప్రభావము.) ఇది “యానకంలోని అణువులు కంపన శక్తి స్థాయిలలోకి ఉద్రిక్తం చెందినపుడు జరిగే కాంతి పరిక్షేపణం” గురించి వివరిస్తుంది.
ప్రశ్న 3.
ప్రకృతిలో ప్రాథమిక బలాలు ఏవి ?
జవాబు:
ప్రకృతిలో ప్రాథమిక బలాలు :
- గురుత్వాకర్షణ బలం,
- విద్యుదయస్కాంత బలాలు,
- ప్రబల కేంద్రక బలాలు,
- దుర్బల కేంద్రక బలాలు.
ప్రశ్న 4.
క్రింది వాటిలో దేనికి సౌష్ఠవం ఉంది ?
- గురుత్వ త్వరణము,
- గురుత్వాకర్షణ నియమము
జవాబు:
- గురుత్వ త్వరణం ప్రదేశాన్ని బట్టి మారుతుంది. అందువల్ల ఇది సౌష్ఠవమైనది కాదు.
- గురుత్వాకర్షణ నియమము సౌష్ఠవమైనది. ఎందుకంటే ఇది ఏ భౌతికరాశి వలన ప్రభావం చెందదు.
ప్రశ్న 5.
భౌతిక శాస్త్రానికి ఎస్. చంద్రశేఖర్ చేసిన అంశదానం ఏమిటి ?
జవాబు:
భౌతిక శాస్త్రానికి చంద్రశేఖర్ చేసిన అంశదానము నక్షత్రాల నిర్మాణము, పరిణామక్రమాల వివరణ మరియు చంద్రశేఖర్ పరిమితి.
చంద్రశేఖర్ పరిమితి, నక్షత్రాల నిర్మాణం మరియు పరిణామంను ఆధ్యానం చేసారు.