TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 5th Lesson वृक्षरक्षिका पितामही Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 5th Lesson वृक्षरक्षिका पितामही

निबन्धप्रश्नौ (Essay Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)

पश्न 1.
वृक्षरक्षणार्थं पितामहया उक्तान् उपायान् लिखत ।
(Write the ideas given by grandmother to save trees)
पश्न 2.
वृक्षणां रक्षणे कसरसिंहस्य श्रद्धां विरादयत ।
(Explain the devotion of Kesara Simha for the protection of trees.)
उत्तर:
‘వృక్షా రక్షికా పితామహీ’ అనే పాఠ్యభాగాన్ని శ్రీ పద్మశాస్త్రిగారు రచించారు. ఇందులో చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం వంటి విషయాలను చక్కగా చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను కవి చక్కగా పాఠంలో ఆవిష్కరించారు.

పూర్వం కాశ్మీర దేశంలో ఒక రైతు కుటుంబం ఉండేది. రైతు కుమారుడు కేసర సింహుడు. అతని తల్లిదండ్రులు, నాయనమ్మ పశుపోషణ, పండ్లను అమ్మడం వంటి పనులు చేస్తూ జీవితం గడుపుతున్నారు. కేసరసింహుని నాయనమ్మ చెట్లను నాటడంలోను, వాటిని పెంచడంలోను ఆసక్తి చూపేది. మంచుపడే కాలంలో మొక్కలను రక్షించడానికి వాటిపై గడ్డిని కప్పి ఉంచేది. కేసరసింహుడు తెలియక చెట్ల కొమ్మలు విరిస్తే ఆమె బాధపడేది. అతడిని కోపగించేది. ఆమె కేసరసింహునికి పక్షులు కొరికిన పండ్లను ‘పండ్లతో ఆహారంగా ఇచ్చేది.

మంచి పండ్లను ఇవ్వమని కేసరసింహుడు అడిగితే కడుపు నింపుకోవడం సాధ్యంకాదు. నీవు యువకుడివై ఆహారాన్ని ఉత్పత్తిచేసే స్థాయికి వచ్చినప్పుడు నేను పండ్లను విక్రయించను. నీవు పండ్లను తినాలంటే మొక్కలను పెంచు’ అని పలికింది. నాయనమ్మ మాటలు కేసరసింహుడిని ఆకట్టుకున్నాయి.

కేసరసింహుడు చెట్ల పెంపకంపై ఆసక్తిని చూపాడు. చెట్లను నాటడంలోను, వాటిని పెంచడంలోను నాయనమ్మకు సహకరించాడు. కొత్త మొక్కలను నాటాడు. తరువాత ఐదు సంవత్సరాలకు నాయనమ్మ మరణించింది. ఆ సమయంలో అతనికి పదహారేళ్ళు. నాయనమ్మ మరణం కేసరసింహునికి బాధ కలిగించింది.

బాగా తలచుకొని దుఃఖించాడు. ఒకరోజు అతనికి రాత్రి కలలో నాయనమ్మ కనిపించింది. అతడు ఆనందంతో ఆమెను కౌగిలించుకున్నాడు. ఇంటికి రమ్మని పిలిచాడు. నీవు నాటిన, పెంచిన చెట్లు నిన్ను ‘నాయనా ! గుర్తుకు తెస్తున్నాయని చెప్పాడు. అది విని నాయనమ్మ కేసరసింహునితో నేను మరణించలేదు.

నా దేహం కృశించిపోవడంతో మరొక శరీరంలో ప్రవేశించాను. నేను ఉన్న చోటు నుండి ప్రస్తుతం నేను రాలేను. నీవు మొక్కలను నాటు, వాటిని పెంచు. దానివల్ల నీవు నన్ను మరచిపోగలవు’ అని చెప్పింది. వెంటనే నాయనమ్మ అదృశ్యమైంది.

కేసరసింహుని నిద్ర చెదరిపోయింది. వెంటనే లేచి చెట్లకు పరిచర్యలు చేయటం మొదలు పెట్టాడు. మరుసటి రోజున మరల నాయనమ్మ కలలో కనిపించింది. ఆమెతోపాటుగా ఇద్దరు దేవకన్యలు కూడా ఉన్నారు. నాయనమ్మ అనేక విధములైన పండ్లతో ఉన్న వెండి పళ్ళెమును అతని ముందు ఉంచింది. కేసరసింహుడు ఒక పండును తీసుకొని తినటం మొదలుపెట్టాడు. ఆ పండు యొక్క రుచి ఇంతకు ముందు తాను ఎపుడూ చూడలేదు.

అపుడు అతనికి మెలకువ వచ్చింది. చాలాకాలం అయింది. కేసరసింహుడు పండ్లను అమ్ముతూ చాలా ధనం సంపాదించాడు. అతడు చాలా శ్రమ పడ్డాడు. చాలా రోజులు గడచినా అతనికి కలలో తన నాయనమ్మ కనబడలేదు. కానీ ఆ రోజు రాత్రి నాయనమ్మ కలలో కనిపించింది. ఆమె తెల్లని సింహాసనంపైన కూర్చుని తెల్లని వస్త్రాలతో దేవకన్యలా కనబడింది. కేసరసింహుడు ఆమెకు నమస్కరించాడు.

ఆమె చాలా ప్రసన్నంగా, ‘నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు చాలా చెట్లు నాటి చాలా మంచిపని చేశావు. ఇక నుండి గ్రామంలో అనారోగ్యం ఉండదు’. ఆ మాటలు విని కేసరసింహుడు ‘నాయనమ్మా, నేను వైద్య సంబంధ మొక్కలు నాటలేదు. అనారోగ్యం ఎలా లేకుండా ఉంటుంది ?’ అన్న మనుమడి మాటలకు ‘ఒరే మనుమడా, చెట్ల నుండి మన ఆరోగ్యానికి అవసరమైన స్వచ్ఛమైన గాలి వస్తుంది, అని చెప్పి చప్పట్లు కొట్టగానే, ఇద్దరు “దేవకన్యలు వచ్చారు.

వారు రాగానే ‘నా మనుమడికి పచ్చటి నగరాన్ని, తెల్ల పర్వతాన్ని చూపండి. అపుడు దేవకన్యలు చప్పట్లు కొట్టగానే తెల్లని గుఱ్ఱాలతో ఉన్న తెల్లని రథం కనబడింది. దేవకన్యలు కూడా ఆ రథాన్ని అనుసరిస్తున్నారు. మార్గంలో స్వచ్ఛమైన నదులు ప్రవహిస్తున్నాయి. మంచుతో కప్పబడిన కొండలు, మంచి పూలతో కూడిన చెట్లు మార్గంలో ఉన్నాయి. కేసరసింహుడు మిక్కిలి ఆనందించాడు. నాయనమ్మ కేసరసింహునితో, “నాయనా ! వృక్షాలకు ఈ లోకంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. చెట్లు మనకు మంచి మట్టిని, నీటిని, గాలిని అందిస్తాయి.

స్వేచ్ఛగా అడవులను పాడుచేస్తే భూగోళంపై ఉష్ణోగ్రత పెరుగుతుంది. హిమాలయ పర్వతాలు చివరకు కనుమరుగై పోతాయి. సముద్రాలు తమ పరిధిని దాటి ముందుకు వస్తాయి. దానివల్ల ఎన్నో ఉపద్రవాలు కలుగుతాయి. ఈ పరిణామాలను అధ్యయనం చేయాలి. అప్పుడే మానవ జీవన పరిస్థితులు మెరుగుపడతాయి.” అని పలికింది. అప్పటి నుండి కేసరసింహుడు మొక్కలను నాటడం లోను, వాటిని సంరక్షించడంలోను శ్రద్ధ చూపాడు.
वृक्षो रक्षति रक्षितः

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

Introduction: The lesson Vriksharakshika Pitamahi was written by Padma Sastri. It is taken from the author’s Sanskritakatha- satakam Part 1. This lesson narrates the importance of planting the trees.

Kesara Simha’s Grandmother : Kesara Simha lived with his parents in one of the valleys of Kasmir. His grandmother was interested in planting trees. She would cover the trees with grass during winter to protect them from snow. She advised Kesara Simha to plant trees if he wanted to eat fruits. By that, he would get merit. Mother Earth would be pleased. त्वं प्रुथिवि अनेन प्रसन्ना भवति| They would get flowers, fruits and wood. Influenced by the words of his grandmother, Kesara Simha also planted trees, and took care of them. Five years later grandmother died.

Kesara Simha’s Dreams: One day, Kesara’s grandmother appeared in his dream, and consoled him. She looked young. She advised him to plant trees everyday so that he could forget her. Kesara Simha woke up and started to take care of trees. His grandmother again appeared in his dream and offered him delicious fruits in a silver bowl.

Grandmother’s Advice : After many days grandmother appeared in Kesara Simha’s dream sitting on a throne like a celestial damsel. She was pleased as he planted many trees. She said that from that day onwards there would be no disease in the village. As trees would give pure air, there would be the benefit of health. The nymphs who appeared there took him in chariot to see the clear streams and trees full of fruits and flowers. His grandmother advised him that trees alone were the most important ones in this world.

अस्मिन संसारे वृक्षाणामेव प्राधानयम वर्तेते| They would give pure air, water and soil. If the trees were cut indiscriminately, earth would heat up, snow would melt, and oceans would flood the earth. People would suffer. She also advised that education was necessary to know the secrets. अतः पाठनमावश्यकं वर्तते |
Kesara Simha took a firm decision that he would protect the world by growing trees.

लघु समाधान प्रश्नाः  (స్వల్ప సమాధాన ప్రశ్నలు) (Short Answer Questions)

पश्न 1.
वृक्षाः अस्मभ्यं किं किं प्रयच्छन्ति ?
समादान:
वृक्षाः अस्मभ्यं स्वच्छां मृत्तिकां स्वच्छं जलं प्रयच्छन्ति ।

पश्न 2.
केसरिसिंहः कुत्र न्यवसत् ?
समादान:
केसरिसिंहः काश्मीरोपत्यकायां न्यवसत् ।

पश्न 3.
मार्गे नद्यः कथं प्रवहन्ति ?
समादान:
मार्गे स्वच्छाः नद्यः निर्झराः प्रावहन् ।

एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions) 

पश्न 1.
शीतर्तौ पितामही वृक्षाणाम् उपरि किम् आच्छादयति स्म ?
समादान:
शीतार्तौ पितामही वृक्षाणां उपरि घासं आच्छादयति स्म ।

पश्न 2.
केसरसिंहः श्रद्धया कस्मिन् संलग्नः ?
समादान:
केसरसिंहः श्रद्धया वृक्षारोपणे संलग्नः ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

पश्न 3.
केसरसिंहः कथं धनं आर्जितवान् ?
समादान:
केसरसिंहः फलानि विक्रीय धनं आर्जितवान् ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలకు అర్ధాలు)

1. उपत्यका = निम्नभूभागः, అడుగు భూభాగము
2. आजीविका = जीवननिर्वाहाय साधनम्, वृत्तिः, వృద్ధి
3. घासम् = तृणम्, గడ్డి
4. उच्छिष्टफलानि = भुक्तावशिष्टानि फलानि, తినగా మిగిలిన పండ్లు
5. भृशम् = अत्यर्थम्, అధికము
6. जर्जरम् = जीर्णम्, కృశించిన
7. भैषजवृक्षाः = ओषधिगुणयुक्ताः वृक्षाः, ఔషధ చెట్లు
8. तालिकावादनम् = करताडनम्, చప్పట్లు

व्याकरणांशाः (వ్యాకరణం)

सन्धयः (సంధులు)

1. अतः + अस्य = अतोऽस्य – विसर्गसन्धिः
2. पुष्पभाक् + अपि = पुष्पभागपि – जश्त्वसन्धि:
3. तस्मात् + न = तस्मान्न – अनुनासिकसन्धिः
4. पुनः + आगता = पुनरागता – विसर्गसन्धिः
5. हिमवत् + श्वेतवस्त्रवृता = हिमवच्छ्वेतवस्त्रावृता
6. केसरसिंहः + तं = केसरसिंहस्तम् – विसर्गसन्धिः
7. श्वेतपर्वतं + च = श्वेतपर्वतञ्च – परसवर्णसन्धिः
8. पर्वताः + च = पर्वताश्च – श्चुत्वसन्धिः

समासाः సమాసాలు

1. पुण्यं भजतीति – पुण्यभाक् – उपपदतत्पुरुषसमासः
2. निद्रायाः भङ्गः – निद्राभङ्गः – षष्ठीतत्पुरुषसमासः
3. रजतस्य स्थाली – रजतस्थाली तस्या रजतस्थलाम् – षष्ठीतत्पुरुषसमासः
4. स्वादु च तत् फलञ्च स्वादुफलम्, अतिशयेन स्वादुफलं, सुस्वादुफलं – प्रादितत्पुरुषसमासः
5. श्वेतञ्च तत् वस्त्रञ्च श्वेतवस्त्रं, हिमवत् च तत् श्वेतवस्त्रं च हिमवच्छ्छ्रेत- वस्त्रं, तेन आवृता हिमवच्छ्रेतवस्त्रावृता – तृतीयातत्पुरुषसमासः
6. भैषजाश्च ते वृक्षाश्च – भैषजवृक्षाः – विशेषणपूर्वपदकर्मधारयसमासः
7. श्वेतश्च असौ अश्वश्च – श्वेताश्वः, तेन संयुतः – श्वेताश्वसंयुतः – तृतीयतत्पुरुषसमासः
8. पुष्पाणि च फलानि च पुष्पफलानि, तैः सङ्कुलाः पुष्पफलसङ्कुलाः – तृतीयातत्पुरुषसमासः

वृक्षरक्षिका पितामही Summary in Sanskrit

कविपरिचयः

वृक्षरक्षिका पितामही इति पाठ्यांशः पद्मशास्त्रिमहोदयेन रचिते संस्कृतकथा शतकम् इत्याख्ये प्रथमभागे अस्ति । विद्वानयं संस्कृतकथाशतकं भागद्वये रचितवान् । भागद्वये आहत्य शतं कथाः वर्तन्ते । पद्मशास्त्रिमहाभागः १९३५ तमे वर्षे भारतस्य उत्तरप्रदेशे जनिं प्राप्तवान् । राजस्थानराज्ये सर्वकारस्य शिक्षाविभागे प्रशासकपदं निरवहत् । राजस्थानसाहित्य अकाडमीतः सम्मानितोऽयं महाकविः लेनिनामृतं नाम महाकाव्यम् अरचयत् । अपि च सिनेमाशतकम्, विश्वकथाशतकम्, पद्मपञ्च तन्त्रम्, बंग्लादेशविजयः इत्यादीन् विंशत्यधिकान् ग्रन्थान् व्यरचयत् । प्रायः सर्वानपि ग्रन्थान् सरलसंस्कृतभाषया विरच्य आधुनिककाले संस्कृतं सर्वत्र परिव्यापयितुं प्रायतत ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

सारांश

काश्मीरदेशे कस्मिंश्चन ग्रामे केसरसिंहो नाम युवा वसति स्म । तस्य पितरौ पितामही च कृषिकर्मणा सह पशून् पालयित्वा वृक्षाणां फलानि विक्रीय जीवनं यापयन्ति स्म । केसरसिंहस्य पितामही तु वृक्षाणामारोपणे तेषां रक्षणे वर्धने च निमग्ना भवति स्म । अपि च एनं सर्वथा वृक्षाणां संवर्धनार्थं प्रेरयति स्म । यथा मया तव पालनं कृतं तथा त्वया जागरूकतया वृक्षाणां पालनं कर्तव्यम् इति वृक्षाः स्वयमातपे स्थित्वा बोधयति स्म । “वृक्षारोपणेन माता पृथिवी प्रसन्ना भवति, उपकरिष्यन्ति । लोकाय छायां दास्यन्ति । वृक्षाः अस्माकं स्वास्थ्यलाभाय बहुधा ते अस्मभ्यं स्वच्छां मृत्तिकां, स्वच्छं जलं, स्वच्छं वायुं च प्रयच्छन्ति । यदि वयं यथेच्छं वनानां कर्तनं कुर्मः तर्हि पृथिवी उष्णा भवति, परिसराः कलुषिताः समुद्रस्य उद्वलज्जलं पृथिव्यां प्रसरिष्यति, जनाः सङ्कटग्रस्ताः भवन्ति” इति अनुदिनं प्रबोधयति स्म । तया प्रभावितः केसरसिंहः स्वस्य अध्ययनेन सह वृक्षारोपणं तेषां संवर्धनेन लोकस्य संरक्षणं विधास्यामि इति दृढनिश्चयम् अकरोत् ।

वृक्षरक्षिका पितामही Summary in English

Introduction

Vriksharakshika Pitamahi is a story from Padma Sastri’s Sanskritakathasatakam Part One. The author wrote hundred stories in two parts. Sri Padma Sastri was born in 1935 in Uttara Pradesh. He wrote more than 20 books, which include Cin-ema Satakam, Viswakatha Satakam etc. He writes simple Sanskrit.

वृक्षरक्षिका पितामही Summary in Telugu

కవి పరిచయం

‘వృక్షరక్షికా పితామహి’ అనే పాఠ్యభాగాన్ని పద్మశాస్త్రిగారు రచించారు. ఈ పాఠ్యభాగం వారు రచించిన సంస్కృత కథా శతకంలోని ప్రథమ భాగంలో ఉంది. విద్వాంసుడైన ఇతడు సంస్కృత కథా శతకాన్ని రెండు భాగాలుగా రచించాడు. రెండు భాగాల్లో కలిపి వంద కథలు ఉన్నాయి. పద్మశాస్త్రిగారు. 1935వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో జన్మించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ శిక్షా విభాగంలో అధికార పదవిలో ఉన్నారు.

రాజస్థాన్ సాహిత్య అకాడమీ నుండి సన్మానం పొందారు. ‘లేనినామృతం’ అనే కావ్యాన్ని రచించారు. మరియు సినేమా శతకం, విశ్వకథా శతకం, పద్మపంచతంత్రం, బంగ్లాదేశ విజయ: మొదలైన ఇరవైకి పైగా గ్రంథాలను రచించారు. అన్ని గ్రంథాలను సరళ సంస్కృత భాషలో రచించారు. ఆధునిక కాలంలో సంస్కృత భాష అంతట వ్యాప్తి చెందడానికి కృషి చేశాడు.

సారాంశము

కాశ్మీర దేశంలో ఒకానొక గ్రామంలో కేసరసింహుడు అనే పేరుగల యువకుడు ఉన్నాడు. అతని తల్లిదండ్రులు, నాయనమ్మ వ్యవసాయ పనులు చేస్తూ, పశువులను కాపలా కాస్తూ, చెట్ల పండ్లను అమ్ముతూ జీవితాన్ని గడుపుతున్నారు. కేసరసింహుని యొక్క నాయనమ్మ అయితే మొక్కలను నాటడం, వాటిని రక్షించడం, పెంచడం అనే పనుల్లో మునిగిపోయేది. అంతేగాదు చెట్లను పెంచడానికి ప్రేరేపిస్తుంది. తాను ఎలా చెట్లను కాపాడుతుందో అదేవిధంగా జాగ్రత్తగా చెట్లను రక్షించాలని బోధించేది. మొక్కలను నాటడంవల్ల భూమాత ప్రసన్నురాలౌతుంది. చెట్లు తాము ఎండలో ఉంటూ ఇతరులకు చల్లని నీడను ఇస్తుంటాయి. ఆ చెట్లు ఆరోగ్యపరంగా మనకు ఉపయోగపడుతున్నాయి.

అవి మనకు స్వచ్ఛమైన మట్టిని, స్వచ్ఛమైన నీటిని, వాయువును ఇస్తుంటాయి. ఒకవేళ మనం యధేచ్ఛగా చెట్లను నరికినట్లైతే భూగోళం వేడెక్కుతుంది. పరిసరాలు కలుషితంగా మారుతాయి. సముద్రంలో జలాలు ముందుకు వస్తాయి. జనాలు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఇలాంటి విషయాలను మనకు చెట్లు ఉపదేశిస్తుంటాయి. ఈ విషయాలతో కేసరసింహుడు ప్రభావితుడు అయ్యాడు. మొక్కలను నాటాలని, వాటిని పోషించాలని, రక్షించాలని నిశ్చయించుకున్నారు.

కాశ్మీర దేశంలో ఒక రైతు కుటుంబం ఉండేది. వారంతా పశుపోషణ, పండ్లను అమ్మటం వంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రైతుకు కేసరసింహుడు అనే -కుమారుడు ఉన్నాడు. అతని నాయనమ్మ మొక్కలను నాటడం, వాటిని పోషించడం వంటి పనులు చేసేది. ఒకరోజు కేసరసింహునికి పక్షులు కొరికిన పండ్లను తినటానికి ఇచ్చింది. పెద్ద అయిన తరువాత పండ్లను అమ్మి డబ్బు సంపాదించే సమయానికి మంచి పండ్లు తిందువుగాని అని చెప్పింది.

కేసరసింహుడు కూడా నాయనమ్మ మాటలతో మార్పు చెందాడు. మొక్కలను నాటడం ఆరంభించాడు. ఐదు సంవత్సరాల తరువాత నాయనమ్మ చనిపోయింది. కేసరసింహుడు చాలా విచారించాడు. ఒకరోజు రాత్రి కలలో కేసరసింహునికి కలలో నాయనమ్మ కనిపించింది. కేసరసింహుడు ఆమెను కౌగిలించుకొని ఇంటికి రమ్మని కోరాడు. దానికి అంగీకరించక ఓదార్చింది. ఒకసారి కలలో నాయనమ్మ ముసలిదానిగా కాక యువతిలా కన్పించింది. నాయనమ్మ మాటలతో కేసరసింహుడు మొక్కలను నాటడం, పెంచే విషయంలో నిమగ్నుడైనాడు.

ఒకరోజు ఆమె అతనికి కలలో కనిపించింది. ఆమెతోపాటు ఇద్దరు దేవకన్యలు కూడా వచ్చారు. నాయనమ్మ అనేక పండ్లతో కూడిన ఒక వెండి పళ్ళాన్ని కేసరసింహుని ముందు ఉంచింది. ఆమె తెల్లని సింహాసనంపైన కూర్చొని తెల్లని వస్త్రాలతో దేవకన్యలా ఆమె అతడికి కన్పించింది. చెట్ల వల్ల అందరికి మంచి గాలి, మంచి మట్టి లభిస్తుంది. ఆ తరువాత ఆమె రథం ఎక్కి వెళ్ళింది. దేవకన్య ఆమెను అనుసరించారు.

మొక్కలను మనం నాటాలి. వాటిని మనం రక్షించాలి. అంతేగాని చెట్లను విచక్షణారహితంగా నరక కూడదు. దీనివల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మానవులు ఎల్లప్పుడు పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం చేయాలి. లేకపోతే మానవాళి మనుగడ కష్టమౌతుంది.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

अनुवादः (అనువాదములు) (Translations)

कश्मीरस्योपत्यकायां कृषकस्य पुत्रः केसरसिंहो न्यवसत् । तस्य पितरौ पशून् पालयित्वा फलानि विक्रीय च कार्यमचालयताम् । केसरसिंहस्य पितामही सर्वदा कार्ये व्यापृता तिष्ठति । वृक्षारोपणमासीत् तस्या अभिरुचिः । शीतर्तौ सा वृक्षाणामुपरि घासमाच्छादयति येन हिमकणेभ्यो वृक्षाणां रक्षा भवति स्म । पशुभ्यो वृक्षान् रक्षितुमपि सा सर्वदा प्रयतते ।

यदा कदा केसरसिंहो वृक्षेभ्यो लघुशाखाः पृथक् करोति स्म । तद्वीक्ष्य पितामही दुःखिता सती तं निर्भर्त्सयति स्म । सा कथयति स्म – “यथा मया तव पालनं कृतं तथैव वृक्षाणामेतेषामपि । केसरसिंहः प्रत्युवाच – “त्वन्तु वृक्षाफलानां विक्रयं करोषि । अस्मत्कृते तु पक्षिणा – मुच्छिष्टफलान्यवशिष्यन्ते” । पितामही ब्रूते – “केवलं फलैः उदरं पूरयितुं न शक्यते, फलानि विक्रीयान्नमेतदर्थमेव क्रीयते चास्माभिः । त्वं युवा भूत्वा यदा अन्नोत्पादने समर्थो भविता तदा प्रभृति नाहं फलानां विक्रयं करिष्यामि ” ||

కాశ్మీర దేశంలో ఒక రైతు పుత్రుడు ఉన్నాడు. అతని పేరు కేసరసింహుడు. అతని తల్లిదండ్రులు పశువులను కాస్తూ, పండ్లను అమ్ముతూ ఉండేవారు. కేసరసింహుని యొక్క నాయనమ్మ ఎల్లప్పుడు పనిలో నిమగ్నురాలై ఉండేది. మొక్కలు నాటడంలో ఆమెకు అభిరుచి. చలికాలంలో ఆమె చెట్లపై పడే మంచు బిందువుల నుండి చెట్లను కాపాడటానికి వాటిపై గడ్డి కప్పేది. పశువులు మొక్కల్ని పాడుచేయకుండా ఆమె వాటిని కాపాడుతూ ఉండేది.

ఎప్పుడెప్పుడు కేసరసింహుడు చెట్ల కొమ్మలను విరిచినా ఆమె బాధపడేది. ఆ సమయంలో ఆమె అతడితో – “నాయనా ! నిన్ను నేను ఎలా పెంచానో అదేవిధంగా మొక్కలను పెంచాలి”. అని చెప్పింది. అది విని కేసరసింహుడు “నీవు చెట్లకు కాసిన పండ్లను అమ్ముతావు. నాకు మాత్రం పక్షులు తిన్నవి ఉంచుతావు’ అని పలికాడు. వెంటనే నాయనమ్మ – “నాయనా ! కేవలం పండ్లతో కడుపును నింపుకోవడం సాధ్యంకాదు. పండ్లను అమ్మి అన్నము మొదలైన ఆహార పదార్థాలను తయారుచేసుకోవడం సాధ్యం అవుతుంది. నీవు యువకుడవై ఆహారాన్ని ఉత్పత్తిచేసే స్థాయికి వచ్చినప్పుడు నేను పండ్లను విక్రయింపను” అని పలికింది.

Kesara Simha, a son of a farmer, lived in Kashmir valley. Rearing cattle, and selling fruits, his parents passed days. Kesara Simha’s grandmother was always engaged in work. She was interested in planting trees. During winter, she would cover the trees with grass to protect them from snow. She always tried to protect the trees from cattle also.

Sometimes Kesara Simha would cut the small branches of the trees. On seeing this, his grandmother would become sorrow-ful, and chide him. She said, “Just as I take care of you, so also of these trees”. Kesara Simha replied, ‘You sell the fruits of the trees. For us the fruits eaten by birds remain”. Grandmother said, You cannot fill your stomach with fruits only. Hence, we sell fruits and buy rice for that purpose. When you become young, and be able to grow rice, then I will stop selling the fruits”.

“यदि त्वं फलानि खादितुमिच्छसि चेत् तर्हि वृक्षारोपणं कुरु । अनेन त्वं पुण्यभागपि भविता माता पृथिवी अनेन प्रसन्ना भवति । इत्थं फलानि, पुष्पाणि, काष्ठान्यपि प्राप्यन्ते | वृक्षच्छायायां परिश्रान्तो जनः सुखं लभते” । केसरसिंहः पितामह्याः वचनं निशम्य नितरां प्रभावितोऽभवत् । स वृक्षाणां पर्यवेक्षणे तस्याः साहाय्यमप्यकरोत् नवीनान् वृक्षानप्यारोपयत् । पञ्चवर्षानन्तरं पितामही दिवङ्गता । तदा सा षोडशवर्षदेशीयश्चासीत् । पितामहीं स्मृत्वा स रोदिति स्म । एकदा स्वप्ने स पितामहीमपश्यत् । तामालिङ्ग्य स भृशं रुरोद । तस्य नेत्राभ्यामश्रूणि न्यपतन् ।

इत्थं प्ररुदन्तं केसरसिंहं विलोक्य पितामही प्राह – “पुत्र ! अलं रुदितेन । पश्य, नाहं मृता, मम शरीरं जर्जरमभूदतो मया नूतनं शरीरं धारितम्” | केसरसिंहेन दृष्टं यत्तस्य पितामही युवती दृश्यते सम्प्रति । स प्राह पितामही ! गृहं चल, त्वया विना शून्यमिव प्रतीयते मम गृहम् । तव कराभ्यामारोपिता वृक्षाः सर्वदा तव स्मृतिं कारयन्ति ।

ఒకవేళ నీవు పండ్లను తినాలని ఇష్టపడితే అప్పుడు ముందుగా చెట్లను నాటడం మొదలుపెట్టు. దీనివల్ల నీకు పుణ్యం కూడా కలుగుతుంది. దాంతో భూమాత కూడా ప్రసన్నురాలౌతుంది. ఈవిధంగా పండ్లు, పూలు, కట్టెలు పొందవచ్చు. అలసట పొందిన ప్రజలు చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటారు” అని పలికింది. కేసరసింహుడు నాయనమ్మ మాటలు విని మిక్కిలి ప్రభావితుడు. అయ్యాడు.

చెట్లను సంరక్షించే విషయంలో నాయనమ్మకు బాగా సహకరించాడు. కొత్త మొక్కలను కూడా నాటినాడు. ఐదు సంవత్సరాల తరువాత నాయనమ్మ మరణించింది. ఆ సమయంలో కేసరసింహుని వయసు పదహారు సంవత్సరాలు. నాయనమ్మను తలచుకొని అతడు దుఃఖించాడు. ఒకసారి నాయనమ్మ అతని కలలో కన్పించింది. ఆమెను కౌగిలించుకొని మిక్కిలిగా దుఃఖించాడు. ఆ సమయంలో అతని కన్నుల నుండి కన్నీళ్ళు వచ్చాయి.

ఈ విధంగా దుఃఖిస్తున్న కేసరసింహునితో నాయనమ్మ – “నాయనా ! ఎందుకు ఏడుస్తున్నావు ? నీవు ఏడవవద్దు. నేను మరణించలేదు. నా శరీరంలో బలం తగ్గినందున నేను మరొక శరీరంలో చేరాను” అని పలికింది. ఆ సమయంలో అతడి నాయనమ్మ వృద్ధురాలుగా కాకుండా యువతిగా కనిపించింది. పిమ్మట అతడు నాయనమ్మతో- “నాయనమ్మా ! నీవు ఇంటికి రా ! నీవు లేకపోతే ఇంటిలో వెలితిగా ఉంది నీ చేతులతో నాటిన మొక్కలు నిన్ను గుర్తుకు తెస్తున్నాయి.” అని పలికాడు.

“If you want to eat fruits, then plant trees. You will get merit also by that. Mother Earth will be pleased. By that, we can get fruits, flowers and wood too. People take rest under the shade of the trees.” Kesara Simha was very much influenced by those words of his grandmother. He helped her in taking care of the trees. He planted new trees also. Five years later grandmother died. Then he was sixteen years old. He mourned a lot thinking about his grandmother. One night, he saw her in his dream. He hugged her, and wept inconsolably. Tears dropped from his eyes.

Grandmother said to Kesara Simha who was weeping like that. “Son, don’t cry. See, I am not dead. As my body became old, I took a new one.” Kesara Simha observed that his grandmother looked young. He asked, “Grandmother, let us go home. -Without you, I feel vacuum in the house. The trees you planted with your hands bring back your memories”.

पितामही प्रोवाच – “सम्प्रति यत्राहं निवसामि तस्मान्नाहमागन्तुं शक्रोमि । त्वं प्रत्यहं नूतनान् वृक्षानारोपय, येन त्वं मां विस्मरिष्यसि । अयमेव संसारस्य क्रमः” । इत्युक्त्वा पितामही तिरोहिताऽभवत् । केसरसिंहस्य निद्राभङ्गो जातः । उत्थाय तेन वृक्षाणां परिचर्या प्रारब्धा । अन्यदा पितामही स्वप्रे पुनरागता । तया सह द्वे देवकन्ये चास्ताम् । पितामही रजतस्थाल्यां अनेकविधान्यद्भुतानि फलानि तत्समक्षमुपस्थापितवती । केसरसिंहः फलमेकमादाय खादितुं लग्नः । तेनाद्यावधि एवंविधं सुस्वादुफलं न भक्षितमासीत्कदाचिदपि । तदैव तस्य निद्रा भग्ना |

నాయనమ్మ అతడితో “నాయనా ! ప్రస్తుతం నేను ఉన్న ప్రదేశం నుండి రాలేను. నీవు ప్రతిరోజు కొత్త కొత్త మొక్కలను నాటుతూ ఉండుము. దానివల్ల నీవు నన్ను మరచిపోగలవు. ఇదే జీవన విధానం” అని పలికింది. ఈ విధంగా పలికి నాయనమ్మ తిరిగి వెళ్ళిపోయింది. కేసరసింహునికి నిద్రాభంగం అయింది. నిద్ర నుండి లేచి చెట్లకు పరిచర్యలు చేయడం మొదలుపెట్టాడు. మరుసటిరోజు మరల నాయనమ్మ కలలో కనిపించింది. ఆమెతోపాటుగా ఇద్దరు దేవకన్యలు కూడా వచ్చారు. నాయనమ్మ అనేక విధములైన పండ్లతో ఉన్న వెండి పళ్ళాన్ని అతని ముందు ఉంచింది. కేసరసింహుడు ఒక పండును తీసుకొని తినటం మొదలుపెట్టాడు. ఆ పండు యొక్క రుచి ఇంతకు ముందు తాను ఎప్పుడూ చూడలేదు. వెంటనే అతనికి నిద్రాభంగమై మేల్కొన్నాడు.

Grandmother said. “Now I cannot leave the place where I live. You plant new trees so that you forget me. This is the process of the world.” Having said so, she disappeared. Kesara Simha woke up. He started to take care of the trees after getting up. On another day, grandmother again appeared in his dream. There were two divine damsels with her. Grandmother placed a silver bowl with many wonderful fruits in front of him. Kesara Simha took one fruit and started to eat. He never tasted such a fruit till then. Then he woke up.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 5 वृक्षरक्षिका पितामही

भूयान् समयो व्यतीतः । केसरसिंहः फलानि विक्रीय प्रभूतं धनमर्जितवान् । स भृशं श्रममप्यकरोत् । स व्यचारयत् बहूनि दिनानि व्यतीतानि स्वप्ने न दृष्टा पितामही । तस्यामेव रात्रौ पितामहीं दृष्टवानयम् । सा हिमशुभ्रवस्त्रावृता श्वेतसिंहासने समुपविष्टा देवकन्येव प्रतीयते स्म । केसरसिंहस्तां प्रणनाम | सा स्नेहेन प्रावोचत् – “अतीव प्रसन्नाहं सम्प्रति । वृक्षारोपणं कृत्वा त्वया सुकर्म कृतम् । अद्यारभ्य ग्रामेऽस्मिन् रोगा नागमिष्यन्ति । केसरसिंहः प्राह – “पितामहि ! न मया भैषजवृक्षाः समारोपिताः, कथं तर्हि रोगा न भविष्यन्ति” । पितामही प्रोवाच – पुत्र ! वृक्षेभ्यो वयं शुद्धं वायुं प्राप्स्यामः । येन स्वास्थ्यलाभो भवति । सहसा सा तालिकावादनमकरोत् । तदैव द्वे देवकन्ये समुपस्थिते । सा प्रोवाच – “दर्शय मत्पौत्रं हरितनगरं श्वेतपर्वतञ्च । देवकन्ये तालिकावादनमकुरुताम् । सहसा तत्र श्वेताश्वसंयुतः श्वेतरथः समुपस्थितः । देवकन्ये सहैव प्राचलताम् । मार्गे स्वच्छाः नद्यो निर्झराः प्रावहन् । सर्वत्र पुष्पफलसंकुला वृक्षा हिमाच्छादिताः पर्वताश्चासन् तत्र ।

చాలాకాలం గడిచింది. కేసరసింహుడు పండ్లను అమ్మి ఎంతో ధనాన్ని సంపా దించాడు. అతడు ఎంతో శ్రమపడ్డాడు. చాలా రోజులు గడిచినా అతనికి కలలో నాయనమ్మ కనిపించలేదు. కాని ఆరోజు రాత్రి నాయనమ్మ కలలో కనిపించింది. ఆమె తల్లిని సింహాసనంపైన కూర్చుని తెల్లని వస్త్రాలతో దేవకన్యలా ఆమె కనిపించింది. కేసరసింహుడు ఆమెకు నమస్కరించాడు. నాయనమ్మ చాలా ప్రసన్నంగా ‘నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు చాలా చెట్లు నాటి చాలా మంచిపని చేశావు. ఇక నుండి గ్రామంలో అనారోగ్యం ఉండదు” అని పలికారు. ఈ మాటలు విని కేసరసింహుడు “నాయనమ్మా ! నేను వైద్య సంబంధమైన మొక్కలు నాటలేదు.

అనారోగ్యం లేకుండా ఎలా ఉంటుంది ? అని పలికారు. అది విని నాయనమ్మ “ఓరీ ! చెట్ల నుండి మన ఆరోగ్యానికి అవసరమైన స్వచ్ఛమైన గాలి వస్తుంది”. అని చెప్పి చప్పట్లు కొట్టగానే ఇద్దరు దేవకన్యలు వచ్చారు. వారు రాగానే మనుమడికి పచ్చటి నగరాన్ని, తెల్ల పర్వతాన్ని చూపండి. అప్పుడు దేవకన్యలు చప్పట్లు కొట్టగానే తెల్లని గుర్రాలతో ఉన్న తెల్లని రథం కనబడింది. దేవకన్యలు కూడా ఆ రథాన్ని మంచుతో కప్పబడిన అనుసరిస్తున్నారు. మార్గంలో స్వచ్ఛమైన నదులు ప్రవహిస్తున్నాయి. పర్వతాలు, పుష్పాలతో కూడిన చెట్లు మార్గంలో ఉన్నాయి.

Much time passed. Kesara Simha earned a lot of money by selling fruits. He worked very hard. He spent many days. Grand-mother was not seen in dreams. However, on that day itself he saw her in his dream. She sat on a throne wearing snow white clothes, and looked like a celestial damsel. Kesara Simha bowed to her. She spoke affectionately, “I am very much pleased today. By planting trees you did a meritorious deed.

From today onwards there will not be any disease in this village”. Kesara Simha said, “Grandmother, I have not planted any medicinal plants. Then how is it possible that there will not be any diseases?” Grandmother replied, “Son, we get pure air from trees. By that, there will be the benefit of health”. She clapped her hands. At once two nymphs appeared. She said to them, “Show my grandson the green wood and white mountain”. The nymphs clapped their hands. Immediately there came a white chariot having white horses. He went along with the nymphs. On the way, clear streams and rivers flowed. Everywhere there were trees full of flowers and fruits. Snow covered mountains were also there.

केसरसिंहश्चातीव प्रसन्न आसीत् । पितामही पुनस्तमवदत् – “अस्मिन् संसारे वृक्षाणामेव प्राधान्यं वर्तते । वृक्षा एवास्मभ्यं स्वच्छां मृत्तिकां, स्वच्छं जलं वायुञ्च प्रयच्छन्ति । यदि वयं यथेच्छं वनानां कर्तनं करिष्यामस्तर्हि पृथिवी उष्णा भविष्यति, हिमानी द्रविता भविष्यति । समुद्रस्योद्वलज्ञ्जलं पृथिव्यां प्रसरिष्यति । संसारस्य जनाः संकटग्रस्ता भविष्यन्ति । अध्ययनबलेनैव त्वं सर्वं रहस्यं ज्ञास्यसि । अतः पठनमप्यावश्यकं वर्तते । सः पितामहीं प्रणनाम । पुनः श्रद्धया वृक्षारोपणे संलग्नः केसरसिंहः । दृढनिश्चयमकरोत्सः, यदहं वृक्षसंवर्धनेन संसारस्य संरक्षणं विधास्यामि ।

కేసరసింహుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. అతడి నాయనమ్మ మరల అతనితో ఈ సృష్టిలో వృక్షాలకు చాలా ప్రాధాన్యత ఉంది. చెట్లు మనకు మంచి మట్టిని ఇచ్చి మంచి గాలిని ఇస్తాయి. మనం స్వేచ్ఛగా అడవులను పాడుచేస్తే దానివల్ల భూమిపై ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. హిమాలయ పర్వతాలు కరుగుతాయి. సముద్రాలు తమ పరిధిని దాటి ముందుకు వచ్చి ఊళ్ళల్లోకి ప్రవహిస్తాయి.

ఈ పరిణామాలను అధ్యయనం చేస్తే నీకు రహస్యం మొత్తం తెలుస్తుంది. పరిస్థితులను అధ్యయనం చేయాలి. తరువాత అతడు నాయనమ్మకు నమస్కరించాడు. పిమ్మట కేసరసింహుడు చెట్లను నాటే విషయంలో మిక్కిలి శ్రద్ధ చూపాడు. అప్పటి నుండి అతడు చెట్లను నాటే విషయంలో, వాటిని పెంచే విషయంలో దృఢ నిశ్చయాన్ని తీసుకున్నాడు.

Kesara Simha was very much pleased. Grandmother said to him again, ‘Trees are the most important ih this world. Trees alone give us pure soil, water and air. If we cut woods indiscriminately, then the earth will heat up; snow will melt; the ocean will flood the earth; people in the world would be put to difficulty. You know all the secrets by the strength of study only. Hence, education is also necessary”. He bowed to grandmother. Kesara Simha was engaged in planting trees with devotion again. He made a firm decision that he would guard the world by planting trees.

Leave a Comment