Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 4 State Government to prepare for their exam.
TS Inter 2nd Year Political Science Notes Chapter 4 State Government
→ The Governor is the constitutional head of the State.
→ The Governor is appointed by the President of India.
→ The Chief Minister is the Leader of the Majority part in the Legislative Assembly.
→ The Chief Minister has full Liberty in the formation of the Ministry.
→ The Real Powers are exercised by the Council of Ministers headed by the Chief Minister.
→ The State Council of Ministers includes i) The Chief Minister ii) Ministers of cabinet rank iii) Ministers of State rank and some times Deputy Ministers.
→ The lower house of State Legislature is called Legislative Assembly.
→ Legislative Assembly is more powerful than Legislative Council.
→ The term of a member of the Legislative council is 6 years and 1/3 rd of its members retire every 2 years.
→ The Union and State relations are divided into three heads. They are:
- Legislative
- Administrative and
- Financial relations.
→ Our constitution divides the powers into three lists V12, the union list, the State list and the concurrent list.
→ Sarkaria Commission was appointed in 1983 to review Centre-State Relations.
→ The Inter-State Council settles the disputes which arise between States.
→ Finance commission is appointed by the President for every 5 years.
→ NITI Ayog replaces the planning commission.
TS Inter 2nd Year Political Science Notes Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం
→ భారత రాజ్యాంగం ఆరో భాగంలో 152 నుండి 237 వరకు ఉన్న ప్రకరణాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను పేర్కొంటున్నాయి
.
→ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి వారికి పరిపాలనలో సహకరించేందుకు ఉన్నతస్థాయి అధికారులు ఉంటారు.
→ గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు రాజ్యాంగబద్ధమైన అధిపతి. ఇతను రాష్ట్రపతిచే నియమించబడతాడు.
→ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నర్ పేరు మీదే అమలవుతాయి.
→ రాష్ట్ర శాసన సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తాడు.
→ ముఖ్యమంత్రి సలహాపై ఇతర మంత్రులను గవర్నర్ నియమించును.
→ వాస్తవంగా రాష్ట్రపాలనా యంత్రాంగాన్ని నడిపించేది ముఖ్యమంత్రి, ఆయన ఆధీనంలో పనిచేసే మంత్రిమండలి.
→ రాష్ట్ర శాసన నిర్మాణశాఖ గవర్నర్, రెండు సభలు ఉన్నప్పుడు విధానసభ, విధాన పరిషత్లతో, ఒకే సభ ఉన్నప్పుడు విధాన సభతో కూడి ఉంటుంది.
→ కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు i) శాసన ii) పరిపాలన iii) ఆర్థిక సంబంధాలుగా విభజింపబడినాయి.
→ శాసన సంబంధాలు i) కేంద్ర జాబితా, ii) రాష్ట్ర జాబితా iii) ఉమ్మడి జాబితాలుగా విభజింపబడినాయి.
→ కేంద్ర – రాష్ట్ర సంబంధాలను పునః పరిశీలించేందుకు 1983 జూన్ 9న భారత ప్రభుత్వం సర్కారియా కమీషన్ ను ఏర్పాటు చేసింది.
→ ప్రతి 5 సంవత్సరాలకొకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. కేంద్రం – రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ విషయంలో ఆర్థిక సంఘం రాష్ట్రపతికి తగిన సిఫార్సులు చేస్తుంది.
→ రాష్ట్రాల మధ్య సహకార, సమన్వయాలను సాధించేందుకు 1990 మే 28న అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేశారు.