Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 6th Poem మహైక Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 6th Poem మహైక
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు
ప్రశ్న 1.
‘మహైక’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరుపొంది న కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణలో నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.
మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.
భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. దీర్ఘకవితను చదివినపుడు ఏడో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు. ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటివాడు.
తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.
అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.
కుండలు వేరైనా మట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే. మానవులలో భేదాలు సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.
ప్రశ్న 2.
‘మహైక’ కవితలో కవి ఆశయాన్ని విశ్లేషించండి?
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగం కవిరాజుమూర్తి చే రచించబడిన ‘మహైక ‘ దీర్ఘ కవిత నుండి గ్రహించబడింది. ఈ కవితలో అభ్యుదయ భావాలే కాదు. ఆధునికతను అడుగడుగునా కవి చూపించాడు. సంక్షిప్తత సాంద్రత ఈ రచనా ప్రధాన లక్షణం.
‘మహైక’’ దీర్ఘకవిత సామాన్య మానవుడు, కవి, కార్మికుడు పతితల పాత్రల పరస్పర సంభాషణలతో నడుస్తుంది. నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నివేదించటం ఈ రచనలోని విశేషం. ఈ రచనలోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదారుస్తూ మనిషి తనపై తాను విశ్వాసాన్ని కోల్పోకుండా ఒక విముక్తిని విప్లవాత్మక ధోరణిలో చూపించాడు మూర్తి. భవిష్యత్తుపై ఆశలను పెంచుతూ, మానవీయ విలువల ప్రాధాన్యతను ఈ కవిత ద్వారా తెలియచేశాడు.
మనిషి శ్రమిస్తేనే జీవితంలో విజయాలను అందుకోగలడు. ఐకమత్యంతో మెలగితేనే అభివృద్ధి సాధించగలుగుతాడు.
“చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
ధరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం” అంటాడు.
రంగులు, వర్ణాలు మానవులను విడదీయకూడదు. ప్రతి ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడిస్తేనే విజయం అన్నాడు. మనిషి ఎప్పుడూ సోమరి పోతుగా మారకూడదు. నిత్య చైతన్యంతో బతకాలి.
“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక
మలోమన చీలిక
మత్యుదేవతకు నాలిక”
కాబట్టి నూతన భావాలతో ఐకమత్యంగా జీవించి జగత్తును శాసిద్ధాం అఅని ‘మహైక’ కవిత ద్వారా మూర్తి తన ఆశయాలను వివరించాడు.
II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న 1.
కవిరాజు మూర్తి రచనలను పేర్కొనండి?
జవాబు:
‘మహైక’ అను పాఠ్య భాగము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ ‘దీర్ఘ కవిత’ నుండి గ్రహించబడింది. మూర్తిగారు ఉన్నత కుటుంబంలో పుట్టినా ఆనాటి నియంతృత్వ, భూస్వామ్య అధికారులు పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. రైతుల పక్షాన, అణగారిన పీడిత ప్రజల పక్షాన మధ్యతరగతి జీవుల కోసం రచనలు చేశాడు.
మూర్తిగారు దీర్ఘకవితలు రాసిన తొలితరం కవులలో అగ్రగణ్యులు. మహైక, ప్రణుతి, మానవ సంగీతం దీర్ఘకవితా సంపుటాలను వ్రాసారు. “మైఁగరీబ్ హుఁ” ఉర్దూనవలలను రాసి జవహర్లాల్ నెహ్రూకు అంకితం చేశాడు. గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు. హీరాలాల్ మోరియా ఉర్దూలో రాసిన కావ్యాన్ని మహాపథంగా తెలుగులోకి అనువదించారు.
గాంధీజీ దివ్య చరితను జముకుల కథగా రాసాడు. ఉర్దూలో ‘లాహుకే లఖీర్’ అంగారే. తెలుగులో చివరి రాత్రి, మొదటి రాత్రి జారుడు బండ నవలలను రచించాడు. నవయుగ శ్రీ పేరుతో గేయాలు, ఉర్దూ పారశీకవుల గజళ్ళు “మధుధారలు” పేరుతో ముక్త కాలుగా రాశాడు” తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగా దాశరథి చేత ప్రశంసించబడ్డాడు.
ప్రశ్న 2.
‘మహైక’లోని ఐకమత్య భావనలను వివరించండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజు మూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత నుండి గ్రహించబడింది.
“మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కనిపించని దేవుణ్ణి”
మానవులు ఐకమత్యంతో మెలగాలని లేనిపక్షాన మానవజాతికి విముక్తి లేదన్నాడు. అన్నదమ్ములుగా జాతివర్ణ భేదం లేకుండా చేయి చేయి కలిపి ముందుకు నడవాలి. అందుకు అక్క చెల్లెళ్ళు ఆనందగీతికలను ఆలపిస్తూ చైతన్యంతో అందరిని ఏకతాటిపైకి తీసుకురావాలి. అదే భూమికి నూతనత్వం అన్నాడు.
“రంగులు జాతులు
కావు మనకు జ్ఞాతులు
మనమంతా మానవులం
కలయికలో ఉంది జయం”
రంగులు, జాతులు అని చూడకుండా మనమంతా మానవులం అనే భావనతో ఐకమత్యంగా ఉండాలని లేని యెడల
“మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక”.
అని ఐకమత్యాన్ని గురించి ‘మహైక’ కవితలో మూర్తిగారు వివరించారు.
ప్రశ్న 3.
కవిరాజుముర్తి దృక్పథాన్ని తెలపండి.
జవాబు:
‘మహైక’ అను పాఠ్యభాగము ‘కవిరాజమూర్తి’ చే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. మూర్తిగారు నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను వేదనలను నిరాశతో, నిట్టూర్పులతో నివేదించటం జరిగింది. సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓదార్చుతూ విశ్వాసం కోల్పోకుండా విప్లవాత్మక ధోరణిలో ఊతాన్నివ్వాలని చూశాడు. భవిష్యత్తుపై ఆశను ప్రేరేపిస్తూ మానవీయ విలువలను -పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజాన్ని కోరుకున్నాడు.
ఈ ‘మహైక’ కావ్యాన్ని చూసిన్పుడు ‘ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది’ అన్న బెల్లంకొండరామదాసు, రెంటాల గోపాల కృష్ణ మాటలను బట్టి కవి నూతన దృష్టి ఎంతటిదో మనకు అర్థమౌతుంది. ఈ కావ్యాన్ని తెలంగాణ యోధుడు “సర్దార్జమలాపురం కేశవరావుకు అంకితం ఇవ్వడంలోనే కవి అభ్యుదయ విప్లవాత్మక దృక్పధాలు మనకు తెలుస్తున్నాయి.
ప్రశ్న 4.
‘మహైక’ కావ్య విశిష్టతను వర్ణించండి?
జవాబు:
‘మహైక కావ్యం ‘కవిరాజుమూర్తి’చే రచించబడిన ‘మహైక’ దీర్ఘకవిత కావ్యం నుండి గ్రహించబడింది. వచన కవితా ప్రక్రియలో వచ్చిన దీర్ఘకావ్యం ‘మహైక’, ఇది సెప్టెంబరు 1953లో ప్రచురించబడింది. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతితల పాత్రల పరస్పర సంభాషణలతో సాగింది. నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్నకష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పులతో నిర్వేదంగా నివేదించుట ఈ కావ్యంలోని ముఖ్య అంశం.
భవిష్యత్తుపై ఆశలను ప్రేరేపిస్తూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారిని రక్షిస్తూ మానవ విలువలను తెలియచేస్తూ అసమానతలు లేని సోషలిజానికి ‘మహైక కావ్యం బాటలు వేసింది. దీనికి ముందు మాటలు రాసిన బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణ మాటలలో “మహోజ్వలమైన ఈ ‘మహైకా’ కావ్యం చదివినపుడు ఏదో నూతనలోకాన్ని చూసినట్టుంది” అన్న మాటలే ఈ కావ్యం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. ఈ కావ్యాన్ని తెలంగాణ పోరాటయోధుడు ‘జమలాపురం కేశవరావుకు అంకితం ఇచ్చినపుడే కవి అభ్యుదయ విప్లవాలు తెలుస్తున్నాయి. దీర్ఘ కవితలలో ‘మహైక’ అత్యంత విశిష్ట కావ్యంగా పేర్కొనవచ్చు.
III. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న 1. కవిరాజు మూర్తి నెలకొల్పిన సాహిత్య సంస్థ పేరు ఏమిటి?
జవాబు:
‘ప్రజాసాహిత్య పరిషత్తు’ను ఖమ్మంజిల్లాలో స్థాపించాడు.
ప్రశ్న 2.
‘మై గరీబు’ నవలనను ఎవరికి అంకితమిచ్చాడు?
జవాబు:
భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అంకితమిచ్చాడు.
ప్రశ్న 3.
‘మహైక’ కావ్యాన్ని ఎవరు అంకితంగా స్వీకరించారు?
జవాబు:
తెలంగాణ యోధుడు ‘సర్దార్ జమలాపురం కేశవరావుకు అంకితమిచ్చాడు.
ప్రశ్న 4.
కవిరాజుమూర్తిని ఏ మహాకవితతో పోల్చవచ్చు?
జవాబు:
చిలీ దేశ మహాకవి! బ్లో నెరుడాపాతో పోల్చవచ్చు.
ప్రశ్న 5.
పువ్వులు పరిమళాన్ని ఎప్పుడు వ్యాపింపచేస్తాయి?
జవాబు:
తోటమాలి బలిదానం చేసినపుడు
ప్రశ్న 6.
మానవజాతికి ఎప్పుడు మేలు కలుగుతుంది?
జవాబు:
మానవత్వంతో మెలగినపుడు
ప్రశ్న 7.
మనలో మన చీలిక వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
asn:
మనలో మన చీలిక మన పతనానికి దారి తీస్తుంది. మృత్యువు దరికి చేరుస్తుంది.
ప్రశ్న 8.
మనిషి ఏవిధంగా బ్రతకాలి ?
జవాబు:
మనిషి మనిషిగా మానవత్వంతో బ్రతకాలి.
IV. సందర్భ సహిత వాఖ్యలు
ప్రశ్న 1.
చరిత్రలు మన ఉనికిని కావు ప్రమాణం
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మ హైక’ దీర్ఘకవితా గ్రంథము నుండి గ్రహించబడింది.
సందర్భము :-
మానవజాతి చరిత్రలను వివరిస్తున్న సందర్భం లోనిది.
భావము :
మానవత్వమొక్కటే మానవజాతికి శ్రేయస్కరమైనది. చరిత్రలు మన ఉనికి ప్రమాణం కాదని ఇందలి భావం.
ప్రశ్న 2.
రంగులు వేరైనా నరజాతి నరంగు మానవత్వమే.
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యము కవిరాజుమూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము :-
కవి మానవతను గూర్చి వివరించిన సందర్భంలోనిది.
భావము :
ఏడురంగుల సమ్మేళనం ఇంద్రధనస్సు. కాని దాని ఛాయ ఒకటే. ఏడు రంగుల సమ్మేళం అయినా చంద్రుని కాంతి తెలుపే. ఎన్ని వర్ణాలవారున్నా మానవులు నందరిని నడిపించే సరంగు మానవత్వమే అని ఇందలి భావము.
ప్రశ్న 3.
మనలోమన చీలిక మృత్యుదేవకి నాలుక.
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ దీర్ఘ కావ్య సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భము : :-
కవి మానవులలో ఐకమత్యము యొక్క ఆవశ్యకతను వివరించిన సందర్భం లోనిది.
భావము :-
మనమంతా మానవులం. రంగు రూపు వేరైనా మానవజాతి ఒక్కటే. అందుకే మానవజాతి అంతా ఐకమత్యంతో మెలగాలి. లేని ఎడల, మానవుల మధ్య చీలికలు వచ్చిన ఎడల అది జాతి పతనావస్థకు దారి తీస్తుంది. మఋత్యువుకు దగ్గర చేస్తుందని ఇందలి భావం.
ప్రశ్న 4.
అంబరాన్ని చుంబించాలి మనం
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక ‘ దీర్ఘకవితా సంపుటి గ్రంథం నుండి గ్రహిబచబడినది.
సందర్భము :-
మానవుడు అభ్యుదయ భావనలతో భవిష్యుత్తుపై ఆశలతో బ్రతకాలని చెప్పిన సందర్భము లోనిది.
భావము :-
మానవులంతా ఆశాపాశాలతో బ్రతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనంతమైన ఈ ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచ మానవులంతా సోదర భావంతో మెలగాలని ఇందలి భావం.
V. సంధులు
1. భానోదయము = భాను+ఉదయము = సవర్ణదీర్ఘ సంధి
సూత్రము :- అ, ఇ, ఉ, ఋ వర్ణములకు సవర్ణములైన అచ్చులు పరమైనచో వానికి దీర్ఘములు ఏకాదేశమగును.
2. లేదెన్నటికి = లేదు+ఎన్నటికి – లేదెన్నటికి – ఉకారసంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు
3. సంగమమైనా = సంగమము +ఐన – సంగమమైనా – ఉ.కార సంధి/ఉత్వసంధి
సూత్రము :- ఉత్తనకచ్చు పరంబగునపుడు సంధియగు
4. వేరైనా = వేరు+ఐన – వేరైన – ఉత్వసంధి /ఉ. కార సంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
5. క్షణమాగాలి = క్షణము + ఆగాలి – క్షణమాగాలి – ఉకార సంధి/ఉత్వసంధి
సూత్రము ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగును.
6. నలుపైన = నలుపు +ఐన = నలుపైన – ఉకార సంధి/ఉత్వసంధి
VI. సమాసాలు
1. సప్తరంగులు – వైరి సమాసం
2. నరజాతి – నరుల యొక్క జాతి – షష్ఠీతత్పురుష సమాసం
3. యమపాశము – యముని యొక్క పాశము – షష్ఠీతత్పురుష సమాసం
4. ఆహ్లాదగీతిక – ఆహ్లాదమైన గీతిక – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. భానుకాంతి – భానుని యొక్క కాంతి – షష్ఠీతత్పురుష సమాసం
6. ఉదధి నీరు – ఉదధి యందలి నీరు – సప్తమీ తత్పురుష సమాసం
అర్థతాత్పర్యాలు
1వ పద్యం :
తోటమాలి బలిదానం చేస్తేనే
పువ్వులు పరిమళాల నీపగలవు.
మానవుడు కలవాలి మానవుణ్ణి
తిడితే ఏం లాభం కన్పించని దేవుణ్ణి
అర్థాలు :-
తోటమాలి = తోటకు కాపలాదారు
బలిదానం = జీవితాన్ని బలిచేస్తేనే
పరిమళాలన్ = సువాసనలను
ఈవగలవు = ఇస్తాయి
భావము :
తోటమాలి తన జీవితాన్ని బలిదానంగా చేస్తేనే పువ్వులు సువాసనలను వెదజల్లుతాయి. మానవులు ఒకరితో ఒకరు కలిసి పోవాలి. మనం చేయాల్సింది చేయకుండా దేవుని తిడితే ప్రయోజనం ఏమిటి?
2వ పద్యం :
అకాశానికి శోభ చందమామ.
మిణుగురుతో విద్యుత్ కాంతులు ప్రసరించవు.
ఘరాలి నేటి నాటు వ్యక్తి
కాకుంటే లేదెన్నటికి విముక్తి
అర్థాలు :
శోభ = అందం
ప్రసరించవ = సోకవు
విముక్తి = విడుదల
భావం :
చందమామ ఆకాశానికి అందాన్నిస్తుంది. మిణుగురు పురుగుకాంతితో విద్యుత్ కాంతులు వ్యాప్తించవు. మనిషికి మార్పు తప్పనిసరి. అలా మారకపోతే విముక్తే లేదు మనిషికి.
3వ పద్యం :
మానవునికి మానవుడే ధ్యేయం
మానవత్వమే మానవతానికి శ్రేయం
చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం
చరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం
అర్థాలు :
ధ్యేయం = లక్ష్యము
మానవత్వము = మంచి చెడులను తెలుసుకుని ప్రవర్తించటం
శ్రేయం = మంచిది
ఉనికి = జాడ
ధరిత్రి = భూమి
ప్రమాణం = కొలత
భావం :
మానవునకు మానవుడే లక్ష్యంకావాలి. మానవత్వము మానవజాతికి మేలును చేకూరు స్తుంది. చరిత్రకు ఉనికికి కొలబద్దకాదు. ధరిత్రిని గెలిపించటానికి మనందరం ప్రమాణం చేయాలి.
4వ పద్యం :
మనం కోరే క్షణం శాంతి
జగత్కల్యాణానికి కాదు క్రాంతి
మన కాళ్ళల్లోని బొబ్బలు
దౌర్జన్యానికి చావుదెబ్బలు
అర్ధాలు :
శాంతి = ప్రశాంతత
జగత్ = భూమియొక్క
కళ్యాణానికి = శుభానికి
క్రాంతి = వెలుగు
భావం :
మనం కోరుకునే క్షణం ప్రశాంతత ఈలోకాలకు శుభాల నివ్వాలి. మన కాళ్ళలోని బొబ్బలు దౌర్జన్యానికి నిజంగా చావు దెబ్బలే!
5వ పద్యం :
ఆకాశంలో ఎగిరే కీరం
ఎల్లప్పుడు తిరిగే గోళం
మధురగీతికలు పాడే గోళం
విశ్రాంతిని కోరవు నిజం
అర్థాలు :
కీరం = చిలుక
మధుర = మధురమైన
గీతికలు = గేయాలు
గళం = గొంతుక
భావం :
ఆకాశాన ఎగిరే చిలుక ఎల్లవేళల పరిభ్రమిస్తూనే ఉంటుంది. అందమైన గీతాలను ఆలపించే గొంతుక విశ్రాంతిని ఎరుగదు.
6వ పద్యం :
యుగయుగాల నైరాశ్యం
మన బ్రతుక్కియమపాశం
తరతరాల ఈ శాంతం
మనజీవిత ఆసాంతం
అర్ధాలు :
నైరాశ్యం = నిరాశ
యమపాశ = ముగింపు
ఆసాంతం = చివరి వరకు
భావం:
యుగయుగాలుగా మానవులలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలు మన బ్రతుకులకు. యమపాశాలు. తరతరాల ప్రశాంతతను జీవితాంతం కావాలని ఆశించాలి.
7వ పద్యం :
అడుగడుగు కదలికలో
అవవీగర్భం కంపించాలి.
మనకన్నుల కాంతి ప్రసరణతో
కాలగమనం క్షణమాగాలి.
అర్ధాలు :
అడుగడుగున = ప్రతి అడుగులో
అవని = భూమి
కంపించాలి = కదలిపోవాలి
ప్రసరణ = అలముకొను వ్యాపించు
గమనం = ప్రయాణం
భావము:
మన ప్రతి అడుగు కదలికలో భూమి కంపించి పోవాలి. మన కన్నుల కాంతి అలముకొని కాలగమనం క్షణకాలం ఆగిపోవాలి.
8వ పద్యం :
అన్నలూ
చేతులో చేతులు కలపండి.
విశ్రాంతిని విసర్జించి నడవండి.
అక్కలూ
” ఆహ్లాదగీతిక లాలాపించండి.
ఆనందంతో కందళిస్తూ కదలండి.
మనందరి ఏకత్వం
పృథ్వీకి నవ్యత్వం
అర్ధాలు :
విసర్జించు = వదలివేయు
ఆహ్లాదగీతికలు = సంతోష గేయాలు
ఆలపించండి = పాడండి
కందళిస్తూ = వికసిస్తూ
పృథ్వీ = భూమి
నవ్యత్వం = నూతనత్వం
భావము :
అన్నా తమ్ములు చేతిలో చేయివేసి ముందుకు కదలండి. బద్దకాన్ని వదలివేసి ముందుకు నడవండి. అక్కా చెల్లెళ్ళు మీరు ఆనందకర గీతాలను పాడండి. ఆనందంతో అంకురంలా వికసిస్తూ కదలండి. మనమధ్య ఏకత్వం కావాలి. ఐకమత్యంగా ముందుకు నడవాలి. అపుడే ఈ భూమిపై నూతనత్వం వెల్లివిరుస్తుంది.
9వ పద్యం :
అన్నలూ విన్నారా ?
అక్కలూ విన్నారా ?
ఉదధి నీరు అంతటా ఉప్పే ?
మందే మంట అంతా నిప్పే ?
ఆకలికి అన్నం కోరడం ఒప్పే ?
దౌర్జన్యం ప్రతి దేశంలో తప్పే
నిర్వీర్యత ప్రాణానికి ముప్పే
అర్ధాలు :
ఉదధి = సముద్రము
నిర్వీర = పౌరుషము లేని తత్వం
ముప్పే = ప్రమాదమే!
భావము :
అన్నలూ అక్కలూ విన్నారా! సముద్రపునీరు అంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండుతున్న మంట అంతా నిప్పుతో కూడి ఉంటుంది. అది తన దగ్గరకు వచ్చిన వాటిని కూడా మండిస్తుంది. ఆకలి వేసినపుడు అన్నాన్ని కోరటం తప్పేమీకాదు. దౌర్జన్యం ఈ లోకానికి అపరాధమే! పౌరుషం లేకపోతే మనల్నిం మనం కాపాడుకోలేం!
10వ పద్యం :
సప్తరంగుల సంగమమైనా.
ఇంద్ర ధనస్సు ఛాయ ఒకటే
ఏడు రంగుల కూడికఐనా
భానుకాంతి తెలుపే
రంగులు వేరైనా నరజాతి.
స రంగు మానవత్వమే
చంద్రికలను వెదజల్లే చందమామ నలుపైనా
చంద్రుడు నలుపని మనమనగలమా!
అర్ధాలు :
సప్తరంగులు = ఏడురంగులు
ఛాయ = నీడ
కూడిక = కలయిక.
సరగు = మనలను నడిపించేది
మానవత్వమే = మానవతే
చంద్రికలు = వెన్నెల
వెదజల్లే = వ్యాపింపచేయు
భావము :
ఏడురంగులను కలిగియున్నా ఇంద్రధనస్సునీడ ఒకటే ఏడు రంగులతో ఉన్నా చంద్రుని కాంతి తెలుపే! మానవులలో వివిధ వర్ణాల వారు ఉన్నా అందరిని నడిపించేది. మానవత్వమే.
11వ పద్యం :
రంగులు జాతులు
కావు మనకు – జ్ఞాతులు
కుండలు చేరైనా
మృత్తిక ఒకటే
కొమ్మలు, రెమ్మలు వేరైనా
ఏక వృక్ష భాగాలే!
మనమంతా మానవులం
కలయికలో ఉంది బలం.
మనలో మన చీలిక
మన పతనానికి ఏలిక
మనలో మన చీలిక
మృత్యుదేవికి నాలుక
అర్ధాలు :
జ్ఞాతులు = పినతండ్రి, పెదతండ్రి
మృత్తిక = మట్టి
చీలిక = వేరు బడుట
భావము :
రంగులు జాతులు మనకి జ్ఞాతులు. కుండలను ఎన్ని రకాలుగా మలచినా వాటికి మూలం మట్టే. కొమ్మలు రెమ్మలు వేరుగా కన్పిస్తున్నా అవన్నీ ఒక చెట్టు భాగాలే! మానవులంతా కలిసి బతకాలి ఐకమత్యంలోనే బలం ఉంది. ఐకమత్యాన్ని కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లే.
12వ పద్యం :
ఆశాపాశాలతో
బ్రతకాలి మనం
అంబరాన్ని ముంచించాలి మనం
అనంత విశ్వాన్ని శాసించాలి మనం
అఖిల జగత్పాదరుల
కలవాలి మనం
అర్థాలు :
ఆశాపాశాలు = కోరికలనే భావనలు
అంబరాన్ని = ఆకాశాన్ని
చుంబించాలి = ముద్దు పెట్టుకోవాలి
అనంతం = అంతమనేది లేని
శాసించు = నియంత్రించు
జగత్ + సోదరులం = ప్రపంచ సోదరులము
భావము :
ఆశలను చిగురింపచేసుకుని మనం బతకాలి. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి మనం పరిధులు లేని ప్రపంచాన్ని నియంత్రించాలి. ప్రపంచం మొత్తంలో ఉన్న అందరికి స్నేహస్తం అందించాలి.
13వ పద్యం :
భానూదయం కాకపోడు.
నేటి చీకటి రేపురాదు.
చేతికి చేయి కలిస్తే
రెండవక మానవు
మానవుడు మానవుణ్ణి కలిస్తే
బాధలు తీరకపోవు.
అర్థాలు :
భానూదయం = సూర్యోదయం
భావము :
సూర్యోదయం రాకపోదు. నేడు ఉన్న చీకటి రేపు ఉండకపోవచ్చు. చేయికి చేయి కలిస్తే మరింత బలం చేకూరుతుంది. మానవులంతా కలిసిమెలసి ఉంటే బాధలన్నీ మానవు.
మహైక Summary in Telugu
కవి పరిచయం
కవి : కవిరాజుమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి)
పుట్టిన తేదీ : అక్టోబరు 1926
పుట్టిన ఊరు : ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామం
రచనలు :
- మహైక
- ప్రణుతి
- మానవ సంగీతం
ఉర్దూ అనువాదాలు : –
- మైగరీబ్ హు
- హీరాలాల్ మోరియా రాసిన ఉర్దూ కావ్యం మహాపధంగా తెలుగుకు అనువాదించారు.
- జముకుల కథ, నవలలు
- గాంధీజీ జీవిత చరిత్ర
- లాహుకే, లభీర్, నవలలను ఉర్దూలోను, చివరిరాత్రి, మొదటిరాత్రి, జారుడు బండ నవలలను వ్రాశాడు
గేయాలు :
- నవయుగ శ్రీ పేరుతో రాశాడు.
- ఉర్దూ పారశీకవుల గజళ్ళను ‘మధురధారలుగా’ ముక్తకాలుగా తెచ్చారు.
దాశరథి కృష్ణమాచార్యుల చేత “తిరుగుబాటు సాహిత్య ధ్రువతార” ప్రశంసలు అందుకున్న కవిరాజుమూర్తి అసలు పేరు ‘దేవభట్ల నరసింహమూర్తి’. వీరు అక్టోబరు 1926న ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా ఖమ్మంజిల్లా మామిళ్ళ గూడెంలో సాగింది. ఉన్నత కుటుంబంలో పుట్టినా నాటి నియంతృత్వ భూస్వాముల అధికార పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్య్ర సమయంలోను పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఖమ్మం జిల్లాలో “ప్రజాసాహిత్య పరిషత్తును” స్థాపించారు.
తెలుగు వచన కవితారంగంలో దీర్ఘకవితలు రాసిన తొలి తరం కవులలో మూర్తి ముఖ్యుడు. వీరి ‘మహైకా’ మానవ సంగీతం, పణుతి దీర్ఘ కవితలు ప్రశంసలను అందుకున్నాయి. ‘మైగరీబు’ అన్న ఉర్దూ నవల మంచి గుర్తింపు పొందింది. దీనిని జవ హర్లాల్ నెహ్రూకు అంకితం చేశారు. దీనిని గిడుతూరి సూర్యం తెలుగులోకి అనువదించాడు.
ఉర్దూలో హీరాలాల్ మోరియా రాసిన కావ్యాన్ని ‘మహాపథం’ పేరుతో తెలుగులోకి మూర్తి అనువదించారు. గాంధీ దివ్య చరిత్రను ‘జముకుల’ కథా రూపంలో రచించాడు. ఉర్దూలో ‘లాహుకే, లఖీర్, అంగారే నవలలను తెలుగులో ‘చివరి రాత్రి’ ‘మొదటిరాత్రి’ జారుడుబండ నవలలను రాశాడు. తెలుగులో, నవయుగశ్రీ, పేరుతో గేయాలను, ఉర్దూ పారశీకవుల గజళ్ళను ముక్తకాలుగా రాశాడు.
పాఠ్యాంశ సందర్భం
వచన దీర్ఘకవితా రూపంలో వెలువడిన కావ్యం ‘మహైక’. దీనిలో సామాన్య మానవుడు, కవి కార్మికుడు, పతితల పాత్రల సంభాషణతో కూడి ఉంటుంది. నాగరిక సమాజంలో సామాన్యులు అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశలో నిట్టూర్పులతో కవి నివేదించటం ఈ కవిత లోని ప్రధానాంశం. ఆనాటి నియంతృత్వ భూస్వామ్య, అధికారుల పీడనలను నేటి తరానికి తెయలిజేయాలనే ఈ రచన మూర్తి చేశారు.
పాఠ్యభాగ సారాంశం
‘మహైక’ అనుపాఠ్యభాగం “తిరుగుబాటు సాహిత్యంలో ధ్రువతారగ’ పేరు పొందిన కవిరాజు మూర్తిచే రచించబడిన ‘మహైక’ అను దీర్ఘకవిత నుండి గ్రహించబడింది. తెలంగాణ లో నియంతృత్వ, భూస్వామ్య అధికారుల పీడనలకు వ్యతిరేకంగా కవిరాజుమూర్తి పోరాడాడు.
మహైక దీర్ఘకవిత సమాజంలో ఆధునికతను కోరుకుంటూ ప్రయోగాత్మకంగా నడచిన కవిత. ఇది సామాన్య మానవుడు, కవి, కార్మికుడు, పతతి పాత్రల పరస్పర సంభాషణలతో కూడి ఉన్నది. నేటి నాగరిక సమాజంలో తాను అనుభవిస్తున్న కష్టాలను, వేదనలను, నిరాశతో నిట్టూర్పుతో కవి చెప్పటం ఈ కవిత లోని ప్రధానాంశం. సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిని ఓదారుస్తూ మనిషిపై మనిషికి విశ్వాసం తగ్గకుండా ప్రోత్సహించే విప్లవ రచన ఇది.
భవిష్యత్తుపై ఆశలను నిలుపుతూ మానవీయ లక్షణాలను పెంపొందిస్తూ అసమానతలు లేని సోషలిజానికి దారులు వేసిందీ కవిత. ఈ దీర్ఘకవితను చదివినపుడు ఏదో నూతన లోకాన్ని చూసినట్లుంది అంటారు. ఈ కావ్యానికి ముందుమాట రాసిన బెల్లకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణులు. ‘మహైకా’ను చదువుతుంటే టి.ఎస్. ఇలియట్ వేస్టాండ్ జ్ఞాపకం వస్తుంది. చిలి దేశ మహాకవి ‘పోబ్లో నెరుడా’ ఎలాంటి కవో తెలుగులో మూర్తి అలాంటివాడు.
తోటమాలి తనని తాను బలిదానంగా సమర్పించుకుంటేనే పువ్వులు పరిమళాలను వెదజల్లుతాయి. మనిషి మనిషి కలిస్తేనే దేశం వృద్ధి చెందుతుంది. యుగ యుగాల నైరాశ్యం మన బతుకులను నాశనం చేస్తున్నది. చేయి చేయి కలిపి సోమరితనాన్ని వదలిపెట్టి ఆనందంతో శ్రమ చేస్తే అందరికి సంతోషం భూగోళానికి నూతనత్వం వస్తాయి.
అన్నలూ, అక్కలూ మీకు తెలియనిదేమున్నది. సముద్రపు నీరంతా ఉప్పే. త్రాగటానికి పనికిరాదు. మండే మంటంతా నిప్పే ప్రక్కనున్న వాటిని కూడా దహిస్తుంది. ఆకలితో ఆహారాన్ని కోరటం తప్పుకాదు. నిస్సత్తువ ప్రాణానికే ప్రమాదకరం.
కుండలు వేరైనా మట్టి ఒక్కటే, రంగులు వేరైనా మానవులంతా ఒక్కటే. కొమ్మలు రెమ్మలు వేరైనా అవి వృక్షంలో భాగాలే. ఎన్ని దేశాలున్నా మానవులంతా ఒక్కటే. మానవులలో భేదాల సృష్టి మానవ వినాశనానికి దారి తీస్తుంది. అందరం ఒకటిగా నడిస్తే ప్రమాదాలను దాటగలం అని ఐకమత్యాన్ని గూర్చి ‘మహైక’ కవిత వివరిస్తుంది.