TS Inter 1st Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు.
ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతం తెలియజేయును.

ఒక ఉత్పత్తి కారకం అదనపు యూనిట్ ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత అంటారు. దీనిని అనుసరించి ఉత్పత్తిదారుడు కారకానికి ఇచ్చే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాడు. డేవిడ్ రికార్డో ఈ సిద్ధాంతాన్ని భూమికి మాత్రమే అన్వయించాడు. జె.బి. క్లార్క్ ఈ సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పించి దానిని అభివృద్ధిపరిచారు. ఉపాంత ఉత్పాదకతను వస్తురూపంలో గాని, ద్రవ్యరూపంలో గాని లెక్కించవచ్చు.

ఒక కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను ఈ క్రింది విధంగా వివరించవచ్చు.
ఉదా : నలుగురు టైలర్లు రోజుకు పది చొక్కాలు కుట్టగలరని అనుకుందాం. అదే ఐదుగురు టైలర్లు 13 చొక్కాలు కుట్టగలరు. 5వ టైలర్ ఉపాంత భౌతిక ఉత్పత్తి మూడు చొక్కాలు. ఒక్క చొక్కా కుట్టినందుకు వేతనం 100/- అనుకుంటే 5వ శ్రామికునికి 3 చొక్కాలు కుట్టినందుకు 300/- వేతనం ఇవ్వవలసి వస్తుంది. ఈ కౌ 300/-ను ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు.

ఉపాంత భౌతిక ఉత్పత్తి సిద్ధాంతం సంపూర్ణ పోటీ మార్కెట్ ప్రమేయంపై ఆధారపడటం వల్ల ఒక ఉత్పత్తి కారకం సగటు వ్యయం దాని ఉపాంత వ్యయంకు సమానంగా ఉంటుంది. ఉత్పత్తి మొదటి దశలో శ్రామికుల సంఖ్య పెంచుతూపోతే తరహాననుసరించి పెరుగుతున్న ప్రతిఫలాల వల్ల అదనపు ఉత్పత్తి రాబడి పెరుగుతుంది.

తరువాత ఇంకా శ్రామికులను పెంచితే క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. అందువల్ల ఉపాంత ఉత్పత్తి రాబడి, సగటు ఉత్పత్తి రాబడి ఒక స్థాయి వరకు పెరిగి క్షీణిస్తాయి. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు 1

పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద ఉపాంత కారక వ్యయం (MFC), ఉపాంత కారక రాబడి (MRP) సమానంగా ఉండి సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. AFC, ARP ఇక్కడ సమానంగా ఉండటం వల్ల సాధారణ లాభాలు పొందుతుంది. శ్రామికులను OL యూనిట్లకు తగ్గిస్తే ‘E’ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ఈ బిందువు వద్ద ARP కంటే AFC తక్కువగా ఉండటం వల్ల లాభాలు వస్తాయి.

అందువల్ల శ్రామికులను OL వరకు పెంచవచ్చు. కాని శ్రామికులను OLకు పెంచితే ‘E’ బిందువు వద్ద MFC, MRP సమానమైనాయి. ARP కంటే AFC ఎక్కువగా ఉండటం వల్ల సంస్థకు నష్టాలు వస్తాయి. అందువల్ల శ్రామికులను OL యూనిట్లకు తగ్గించడం జరిగింది. ఇక్కడ శ్రామికుల ఉపాంత ఉత్పత్తికి సమానంగా వేతనం ఉంటుంది.

ప్రమేయాలు :

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్ లో పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్ని సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  4. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  5.  ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 2.
భాటకాన్ని నిర్వచించి, రికార్డో భాటక సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా వివరించండి.
జవాబు.
ఉత్పత్తి కారకంగా భూమి వస్తూత్పత్తి ప్రక్రియలో అందించే సేవలకు లభించే ప్రతిఫలం భాటకము. “డేవిడ్ రికార్డో భాటకాన్ని ఈ విధంగా నిర్వచించారు. “భూమికి ఉన్న సహజమైన, నశింపు కాని ఉత్పాదక శక్తులను ఉపయోగించుకొన్నందుకు పొందే ఫలసాయంలో భూస్వామికి చెల్లించే భాగమే భాటకము”.

రికార్డో భాటక సిద్ధాంతము :
డేవిడ్ రికార్డో భాటకాన్ని వైవిధ్యం వల్ల ఏర్పడే మిగులుగా భావించాడు. భూసారాలలోని వైవిధ్యం వల్ల భాటకం జనిస్తుంది. ఈ భాటకం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో రికార్డో ఈ విధంగా వివరించాడు. ఒక ఆర్థిక వ్యవస్థలోని భూములను వాటి సారాన్నిబట్టి 3 రకాలైన భూములున్నాయి అనుకుంటే భాటకం లేదా వైవిధ్యం మిగులు ఏ విధంగా ఏర్పడుతుందో ఈ విధంగా వివరించాడు.

ఒక కొత్త దేశానికి కొంతమంది వలస వెళ్లారనుకుందాం. వాళ్లు అతిసారవంతమైన భూములను సాగు చేస్తారనుకుంటే ముందుగా ‘A’ గ్రేడ్ భూములను సాగుచేస్తారు. ఈ భూమిపై 20 క్వింటాళ్ళు పండించటానికి ఉత్పత్తి వ్యయం ₹ 300 అనుకుందాం.

అంటే యూనిట్ వ్యయం ₹ 15. ప్రతి వ్యవసాయదారుడు కనీసం ఉత్పత్తి వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధరను కూడా ₹ 15గా నిర్ణయించాల్సి ఉంటుంది. అప్పుడు ‘A’ గ్రేడ్ భూములపై మిగులు ఉండదు. కాని ఇంకా కొంతమంది ఆ దేశానికి వలస వస్తే లేదా ఆ దేశ జనాభా పెరిగి ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది.

‘A’ గ్రేడ్ భూములన్నీ సాగు చేశారనుకుంటే ‘B’ గ్రేడ్ ₹ 300 ఖర్చు చేస్తే 15 క్వింటాళ్ళ ధాన్యాన్ని మాత్రమే పండించగలుగుతారు. ‘B’ గ్రేడ్ భూమిపై చేసిన వ్యయాన్ని రాబట్టటానికి ధాన్యం యూనిట్ ధరను ₹ 20గా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘B’ గ్రేడ్ భూమిపై మిగులుండదు.

కాని ‘A’ గ్రేడ్ భూమిపై భౌతిక రూపంలో భాటకం 5 క్వింటాళ్ళు. విలువ రూపంలో ₹ 100 ఇంకా జనాభా పెరిగితే ఆహారధాన్యాలకు డిమాండ్ పెరిగి ‘C’ గ్రేడ్ భూములను కూడా సాగుచేయవలసి ఉంటుంది.

‘C’ గ్రేడ్ భూములు, ‘B’ గ్రేడ్ భూముల కంటే ఇంకా తక్కువ సారవంతమైనవి కనుక ₹ 300 ‘C’ గ్రేడ్ భూములపై వ్యయం చేస్తే 10 క్వింటాళ్ళు మాత్రమే పండించటం జరుగుతుంది. వ్యయాన్ని రాబట్టుకోవటానికి యూనిట్ ధాన్యం ధరను ₹ 30గా నిర్ణయించాలి.

అప్పుడు ‘C’ గ్రేడ్ భూమిపై మిగులు ఉండదు. ‘B’ గ్రేడ్ భూమిపై భౌతికంగా 5 క్వింటాళ్ళు మిగులుంటుంది. దాని విలువ ₹ 150. ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం పెరుగుతుంది. ‘A’ గ్రేడ్ భూమిపై భౌతికంగా భాటకం 10 క్వింటాళ్ళు దాని విలువ ₹ 300. దీనిని ఈ క్రింది పట్టిక ద్వారా పరిశీలించవచ్చును.

పై పట్టికలో భాటకం లేని భూమిని ఉపాంత భూమి అంటారు. భాటకం భూసారంలోని వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది. అన్ని ‘A’ గ్రేడ్ భూములైతే భాటకం ఉండదు.’B’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘A’ గ్రేడ్ భూమిపై భాటకం ఏర్పడుతుంది. ‘C’ గ్రేడ్ భూములను సాగుచేస్తే ‘B’ గ్రేడ్ భూములపై భాటకం ఏర్పడుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణప్రతిఫలాలు ఏర్పడతాయి.

TS Inter 1st Year Economics Study Material 6th Lesson పంపిణీ సిద్ధాంతాలు 3

పై రేఖాపటంలో షేడెడ్ ఏరియా వివిధ గ్రేడు భూములలో భాటకం లేదా మిగులును తెలియజేస్తుంది. ‘C’ గ్రేడ్ భూమి ఉపాంత భూమి. కాబట్టి ఈ భూమిలో భాటకం లేదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 3.
వాస్తవిక వేతనాలు అంటే ఏమిటి ? వాస్తవిక వేతనాలను నిర్ణయించు అంశాలు ఏమిటి ?
జవాబు.
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫలంగా ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపంలో చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు శక్తిపై ఆధారపడుతుంది.

ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది.
ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని జీవన ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి వారి జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు :

1. ద్రవ్యం కొనుగోలు శక్తి :
సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2. వేతనమిచ్చే విధానము :
శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా : ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3. ఉద్యోగ స్వభావము :
చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ.

ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా : గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

4. పనిచేసే పరిస్థితులు :
అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5. ఆకస్మిక లాభాలు :
యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 4.
స్థూల వడ్డీ, నికర వడ్డీలను గురించి వివరించండి.
జవాబు.
సాధారణంగా అప్పు తీసుకొన్న వ్యక్తి, అప్పు ఇచ్చిన వ్యక్తికి చెల్లించవలసిన సొమ్మును వడ్డీ అని అంటారు. దీనిని సాధారణంగా సంవత్సరానికి వంద రూపాయలకు ఇంత రేటు అని నిర్ణయిస్తారు. కానీ అర్థశాస్త్రంలో మూలధన సేవలకు చెల్లించే దానిని వడ్డీ అని పిలుస్తారు.

జాతీయాదాయంతో తన వాటాగా పెట్టుబడిదారుడు తన మూలధనానికి పొందే ధరను వడ్డీ అంటారు. మూలధన యజమానికి అందే ఆదాయమే వడ్డీ అని కార్వర్ అన్నాడు.

వడ్డీ భావనలు:

వడ్డీ భావనలు రెండు రకాలు అవి :

  1. స్థూల వడ్డీ
  2. నికర వడ్డీ.

1. స్థూల వడ్డీ :
రుణం ఇచ్చిన వ్యక్తి రుణం తీసుకున్న వ్యక్తి నుంచి అసలు మొత్తం కాకుండా అదనంగా పొందే దాన్ని స్థూల వడ్డీ అంటారు. స్థూల వడ్డీలో కింద వివరించిన చెల్లింపులు ఉంటాయి.

2. నికర వడ్డీ :
నికర వడ్డీ అంటే కేవలం మూలధనం లేదా ద్రవ్య సేవకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం. ఆర్థిక పరిభాషలో ఇదే వడ్డీ రేటు.

కీన్స్ ద్రవ్యత్వాభిరుచి సిద్ధాతం (Liquidity Preference Theory of JM Keynes):

కీన్స్ వడ్డీ రేటుకు ద్రవ్యపరమైన వివరణను ఇచ్చాడు. ద్రవ్యానికున్న డిమాండ్, సప్లయ్ ను బట్టి వడ్డీ రేటు నిర్ణయించబడుతుందని కీన్స్ అన్నాడు. కీన్స్ ప్రకారం ‘ద్రవ్యత్వాన్ని కొంతకాలం వదులుకున్నందుకు చెల్లించే ప్రతిఫలం వడ్డీ.

ద్రవ్య సప్లయ్ :
ద్రవ్య సరఫరా అంటే చలామణిలో ఉన్న మొత్తం ద్రవ్య పరిమాణం. వడ్డీ రేటు కొంత మేరకు ద్రవ్య సప్లయ్న ప్రభావితం చేసినప్పటికీ, ద్రవ్య సప్లయ్ ఒక నిర్ణీత కాలానికి స్థిరంగా లేదా సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటుంది. ద్రవ్య సరఫరా దేశంలోని కేంద్ర బ్యాంకు వల్ల నిర్ణయించబడుతుంది.

ద్రవ్య డిమాండ్ :
కీన్స్ ద్రవ్యత్వాభిరుచి అను నూతన భావనను ఉపయోగించాడు. ద్రవ్యానికి ఉన్న ద్రవ్యత్వం వల్ల ప్రజలు ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో తమవద్ద ఉంచుకోవాలనే కోరికే ద్రవ్యత్వాభిరుచి.

ద్రవ్యత్వాభిరుచి ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యత్వ ఆస్తులను వదులుకోవడానికి ప్రేరేపించాలంటే అధిక వడ్డీ రేటును చెల్లించాలి. ద్రవ్యత్వాభిరుచి తక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేటు చెల్లించడం జరుగుతుంది. ప్రజలు ప్రాథమికంగా మూడు కారణాలు వల్ల ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. అవి :

  • వ్యాపార వ్యవహారాల కోసం (transaction motive)
  • ముందు జాగ్రత్త కోసం (precautionary motive)
  • అంచనా వ్యాపారం కోసం (speculative motive).

i) వ్యాపార వ్యవహారాల కోసం :
వ్యక్తులు, వ్యాపార సంస్థలు తమ రోజువారి కార్యకలాపాల కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. వ్యక్తులు వినియోగ అవసరాల కోసం, వ్యాపార సంస్థలు వ్యాపార అవసరాల కోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ అవసరాల కోసం ఉంచుకొనే మొత్తం ఆదాయంపైన, వ్యాపార లక్ష్యాలపైన ఆధారపడుతుంది.

ii) ముందు జాగ్రత్త కోసం :
అనారోగ్యం, ప్రమాదం, నిరుద్యోగం మొదలైన వాటికి అనుకోకుండా ఎదురయ్యే వ్యయాల కోసం ప్రజలు కొంత ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకొంటారు. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో ఊహించని వ్యాపార వ్యవహారాలవల్ల లాభాన్ని పొందడానికి కొంత ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకోవాలనుకుంటాయి. వ్యక్తులు, వ్యాపారస్తులు ఊహించని అవసరాల కోసం ద్రవ్యాన్ని తమ వద్ద అట్టిపెట్టుకుంటారు.

iii) అంచనా వ్యాపారం కోసం :
భవిష్యత్లో వడ్డీ రేట్లు, బాండ్ల ధరలలో వచ్చే మార్పుల వల్ల ప్రయోజనాన్ని పొందడానికి వ్యక్తులు, సంస్థలు తమ వద్ద కొంత ద్రవ్యాన్ని ఉంచుకోవాలనుకుంటారు. దీనినే అంచనా వ్యాపారం కోసం డిమాండ్ అంటారు. బాండ్ల ధరలు, వడ్డీ రేట్లు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి.

బాండ్ల ధరలు పెరుగుతాయనుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. కాబట్టి వ్యాపారస్తులు బాండ్లను కొని భవిష్యత్తులో వాటి ధరలు పెరిగినప్పుడు అమ్ముతారు. అలాగే బాండ్ల ధరలు తగ్గుతాయనుకుంటే వడ్డీ రేటు పెరిగి వ్యాపారస్తులు బాండ్లను అమ్ముతారు.

బాండ్ల ధరలు తక్కువగా ఉండే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్లు. అలాగే బాండ్ల ధరలు ఎక్కువ ఉండే వడ్డీ రేటు తక్కువ ఉన్నట్లు. వడ్డీ రేటుకు, ద్రవ్యానికున్న డిమాండ్కు విలోమ సంబంధం ఉంది.

వ్యాపార వ్యవహారాల కోసం, ముందు జాగ్రత్త కోసం ద్రవ్యాన్నికున్న డిమాండ్కు వడ్డీ రేటుకున్న సంబంధం సాపేక్ష అవ్యాకోచంగా ఉంటుంది. అయితే ఆదాయంలో మాత్రం అధిక వ్యాకోచత్వ సంబంధాన్ని కలిగి ఉంటుంది. వడ్డీ రేటును నిర్ణయించడంలో ఈ రెండు రకాల డిమాండుకు ఎలాంటి పాత్ర లేదు.

అంచనా వ్యాపారం కోసం ఉన్న డిమాండ్లకు వడ్డీకున్న సంబంధం వ్యాకోచంగా ఉండి ద్రవ్య సరఫరా స్థిరంగా ఉన్నప్పుడు వడ్డీ రేటును నిర్ణయించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఎప్పుడైతే ద్రవ్యాన్నికున్న డిమాండ్, ద్రవ్య సప్లయ్ సమానం అవుతాయో అప్పుడు సమతౌల్యంతో పాటుగా వడ్డీ రేటు కూడా నిర్ణయించబడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 5.
లాభం అంటే ఏమిటి ? వివిధ లాభ భావనలను వివరించండి.
జవాబు.
సాధారణ అర్థంలో ఉత్పత్తి వ్యయానికంటే అధికంగా ఉన్న మిగులు ఆదాయాన్ని లాభం అంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉద్యమదారుడు వ్యవస్థాపకుడు అందించే సేవలకు పొందే ప్రతిఫలాన్ని లాభం అంటారు. రాబడి నుంచి మిగిలిన ఉత్పత్తి కారకాలకు భాటకం, వేతనం, వడ్డీ రూపంలో ప్రతిఫలాలు చెల్లించిన తరువాత మిగిలిన ఆదాయాన్ని ఉద్యమదారుడు ప్రతిఫలంగా అంటే లాభం రూపంలో పొందుతాడు.

లాభాల సిద్ధాంతాలు:
లాభం ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివరించడానికి ఆర్థికవేత్తలు చాలా సిద్ధాంతాలను రూపొందించారు. ఈ యూనిట్ లో మూడు లాభ సిద్ధాంతాలను మాత్రమే చర్చించుకుంటాం.

1. నవకల్పనల సిద్ధాంతం (Innovation Theory) :
ఈ సిద్ధాంతాన్ని జోసెఫ్ షుంపీటర్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్యమదారుని నవకల్పనా నైపుణ్యాలకు పారితోషికంగా లాభం చెల్లించబడుతుంది. ఉద్యమదారుడు ఉత్పత్తి కార్యక్రమంలో ప్రవేశపెట్టే నవకల్పనల వల్ల ధర కంటే ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండి లాభం వస్తుంది.

షుంపీటర్ ప్రకారం ఉద్యమదారుని విధి ఏమిటంటే చక్రీయ ప్రవాహాన్ని లేదా స్థిర సమతౌల్యాన్ని చేదించడానికి నవకల్పనలు ప్రవేశపెట్టడం. అవి :

  1. నూతన వస్తువులను ప్రవేశపెట్టడం
  2. నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టడం
  3. నూతన మార్కెట్లను తెరవడం
  4. నూతన ముడి సరుకులను కనుగొనడం
  5.  పరిశ్రమ పునర్వ్యవస్థీకరణ, ఈ నవకల్పనలు ప్రవేశపెట్టినందువల్ల ధరల కంటే ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండి లాభాలు వస్తాయి.

2. హాలే నష్ట భయ లాభ సిద్ధాంతం (The Risk Theory of Profit) :
ప్రొఫెసర్ ఎఫ్.బి. హాలే ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఉద్యమదారుడు నష్ట భయాన్ని భరించినందుకు వచ్చే ప్రతిఫలం లాభం. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమదారుడు తప్ప మిగిలిన ఏ ఉత్పత్తి కారకం నష్ట భయాన్ని భరించదు.

అందువల్ల ఇతర ఉత్పత్తి కారకాలకు పంచగా మిగిలిన ఆదాయం ఉద్యమదారునికి చెందుతుందనేది ఈ సిద్ధాంత సారాంశం. వస్తువుల ధర, డిమాండ్లలో ఏర్పడే ప్రతికూల మార్పుల వల్ల, అనూహ్య ఉపద్రవాల వల్ల నష్టభయాన్ని ఎదుర్కొవలసి ఉంటుంది.

అందువల్ల ఉద్యమదారునికి నష్ట భయానికి మించి వచ్చే ఆదాయమే లాభం. హాలే ప్రకారం ఉద్యమదారుడు కొన్ని రకాల నష్ట భయాన్ని బీమా చేసి నష్ట భయాన్ని తొలగించుకోవచ్చు. అయితే అన్ని రకాలు కాదు. ఒకవేళ మొత్తం నష్ట భయాన్ని బీమా చేస్తే వచ్చే లాభాలను బీమా కంపెనీ తీసుకుంటుంది.

కాబట్టి ఉద్యమదారుడు కేవలం వేతనం మాత్రమే తీసుకుంటాడు. ఈ విదంగా వ్యాపారంలో నష్ట భయాన్ని భరించేవారే నష్టం భయం వాస్తవిక విలువకంటే అధిక మొత్తాన్ని లాభం రూపంలో ఆర్జిస్తారు. అందువల్ల ఉద్యమదారుడు తెలివిగా ఎంపిక చేసుకున్న నష్ట భయాలను భరించినందుకు లభించేదే లాభం.

3. అనిశ్చితత్వ లాభ సిద్ధాంతం (Uncertainty Theory of Profit) :
ప్రొఫెసర్ ఎఫ్. హెచ్. నైట్ అనిశ్చితత్వ లాభ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది మెరుగుపరచబడిన నష్ట భయ సిద్ధాంతం. బీమా చేయలేని నష్ట భయాన్ని అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు చెల్లించే ప్రతిఫలమే లాభం అని నైట్ పరిగణించాడు.

అతను నష్ట భయాలను రెండు రకాలుగా వర్గీకరించాడు. అవి :

  1. ఊహించి బీమా చేయగలిగిన నష్ట భయాలు. ఉదా : అగ్నిప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి.
  2. ఊహకందని, బీమా చేయలేని నష్ట భయాలు. ఉదా : ధర, డిమాండ్, సప్లయ్లో మార్పులు మొదలైనవి. ఈ భీమా చేయలేని నష్ట భయాలను లెక్కించలేం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆదాయ పంపిణీలో రకాలను వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రంలో పంపిణీ భావనను రెండు అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే జాతీయాదాయ పంపిణీని రెండు విధాలుగా పరిశీలించవచ్చు.

  1. విధులననుసరించి పంపిణీ
  2. వైయక్తిక పంపిణీ

1. విధులననుసరించి పంపిణీ :
ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు సేవలందించినందుకు గాను, అవి ప్రతిఫలాలుగా భాటకం, వేతనం, వడ్డీ, లాభాల రూపంలో పొందుతాయి. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలియజేస్తుంది.

కొంతమంది ఒకటికంటే ఎక్కువ ఉత్పత్తి కారకాలకు యజమానులుగా ప్రతిఫలాలను పొందవచ్చు. ఒక ఉత్పత్తి కారకం ఏవిధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో విధులననుసరించి పంపిణీ తెలుపుతుంది. విధులననుసరించి జరిగే పంపిణీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

a) సూక్ష్మ పంపిణీ :
సూక్ష్మ పంపిణీ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు ఒక ఉత్పత్తి కారకం ధర ఏవిధంగా ఎంత నిర్ణయించబడుతుందో వివరిస్తుంది.
ఉదా : శ్రామికుల వేతన రేటు నిర్ణయం. వివరిస్తుంది.

b) స్థూల పంపిణీ :
జాతీయాదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల వాటా ఎంత ఉందో స్థూల పంపిణీ
ఉదా : మొత్తం జాతీయాదాయంలో వేతనాల వాటా ఎంత ఉంది అనే విషయాన్ని స్థూల పంపిణీ తెలియజేస్తుంది.

2. వైయక్తిక పంపిణీ :
దేశంలోని వ్యక్తుల మధ్య జాతీయాదాయాన్ని పంపిణీ చేయడాన్ని వైయక్తిక పంపిణీ అంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత ఆదాయం పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలిస్తారు. అంతేగాని ఏవిధంగా లేదా ఎన్ని విధాలుగా పొందారు అనే విషయ పరిశీలన ప్రధానం కాదు. వైయక్తిక పంపిణీ పరిశీలన ద్వారా ఆదాయ అసమానతలను అందుకు గల కారణాలను తెలుసుకోవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 2.
ఉత్పత్తి కారకాల ధరను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్లు కలసి నిర్ణయిస్తాయి.
ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయించే అంశాలు :

  1. ఉత్పత్తి కారకాల డిమాండ్ ఉత్పన్న డిమాండ్ లేదా పరోక్ష డిమాండ్ అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు డిమాండ్పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తి తనకు సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది.
    ఉదా : కంప్యూటరీకరణ వల్ల శ్రామికుల డిమాండ్ గణనీయంగా తగ్గింది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకం డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
  6. ఉత్పత్తి కారకాల సప్లయ్ ని నిర్ణయించే అంశాలు. ఉదా : శ్రామికుల సప్లయ్.

ప్రశ్న 3.
ఉపాంత ఉత్పాదకతా సిద్ధాంతపు ప్రమేయాలను, పరిమితులను పేర్కొనండి.
జవాబు.
ఒక యూనిట్ ఉత్పత్తి కారకాన్ని అదనంగా నియమిస్తే మొత్తం ఉత్పత్తిలో వచ్చే మార్పును ఉపాంత భౌతిక ఉత్పత్తి (marginal physical product) అని అంటారు. అదనపు ఉత్పత్తిని మార్కెట్ ధరతో గుణిస్తే, ఉపాంత ఉత్పత్తి విలువ (marginal value product) లేదా ఉపాంత ఉత్పత్తి రాబడి (marginal revenue product) వస్తుంది.

అదనంగా ఒక ఉత్పత్తి కారకపు యూనిట్ను ఉపయోగించినప్పుడు మొత్తం రాబడిలో వచ్చిన మార్పునే ఉపాంత ఉత్పత్తి రాబడి అంటారు. ఉత్పత్తి కారకాల యూనిట్లను పెంచుతుంటే ప్రారంభంలో ఉపాంత ఉత్పాదక రాబడి పెరిగి తరవాత గరిష్ఠ స్థాయికి చేరుతుంది.

ఆ తరవాత ఇది తగ్గుతూ ఉత్పత్తి కారకం ధరకు (సగటు కారక వ్యయంకు) సమానమవుతుంది. చరానుపాతాల సూత్రం ప్రమేయాన్ని బట్టి ఉపాంత ఉత్పాదక రాబడి తగ్గుతుంది. సంపూర్ణ పోటీలో పరిశ్రమలో ఉత్పత్తి కారకానికి ఉన్న ధరనే సంస్థ కూడా చెల్లించాలి. గరిష్ఠ లాభార్జనకు సంస్థ ప్రతిస్థాపన సూత్రాన్ని పాటిస్తుంది.

ఉత్పత్తి కారకం ధర అంటే సగటు కారక వ్యయంకు (average factor cost) ఉపాంత ఉత్పాదక రాబడి (MRP) సమానమయ్యేంత వరకు అధిక ధరలున్న ఉత్పత్తి కారకాలకు బదులుగా తక్కువ ధరలున్న ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఈ స్థితిలో ఉత్పత్తి కారకాల సమ్మేళనం సమర్థవంతంగా ఉండటంతోపాటుగా సంస్థ లాభాలు గరిష్ఠంగా ఉంటాయి.

సిద్ధాంతానికున్న ప్రమేయాలు : సిద్ధాంతం కింది ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది.

  1. ఉత్పత్తి కారకాల మార్కెట్లో వస్తువు మార్కెట్లో పరిపూర్ణ పోటీ ఉంటుంది.
  2. ఉత్పత్తి కారకాలు అన్నీ సజాతీయాలు.
  3. ఉత్పత్తి కారకాలకు సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది.
  4. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.
  5. ఉత్పత్తి కారకాలు ఒక దానికి బదులు మరొకటి పూర్తి ప్రత్యామ్నాయాలు.
  6. ఉద్యమదారులు లాభాలవల్ల ప్రేరితమవుతారు.
  7.  వివిధ కారకాల యూనిట్లు విభాజ్యం.
  8. ఈ సిద్దాంతం దీర్ఘ కాలానికి వర్తిస్తుంది.
  9.  ఇది చరానుపాతాల సూత్రంపై ఆధారపడింది.
  10. ఒక ఉత్పత్తి కారకం ఉపాంత ఉత్పత్తిని కొలవవచ్చు.

సిద్ధాంతం పై విమర్శ : ఉపాంత ఉత్పాదక పంపిణీ సిద్ధాంతం అవాస్తవిక ప్రమేయాలపై ఆధారపడింది. అందుచేత ఇది విమర్శంపబడింది.

  1. కారకాల మార్కెట్లో, వస్తువు మార్కెట్లో సంపూర్ణ పోటీ లేదు.
  2. కారక యూనిట్లన్నీ సజాతీయం కాదు.
  3. కారకాలన్నీ ఉపయోగింపబడవు.
  4. కారకాలకు పూర్తి గమనశీలత లేదు.
  5. కారకాల మధ్య అన్ని వేళలా ప్రతిస్థాపన సాధ్యం కాదు.
  6. లాభం పొందడం ముఖ్య ఉద్దేశం కాదు.
  7. కారకాలన్నీ విభాజ్యం కావు.
  8. స్వల్ప కాలంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
  9. ఉత్పత్తి కేవలం ఒక కారకం యొక్క ఫలితం కాదు.
  10. కారకాల చెల్లింపు మొత్తం విలువకు సమానం కాదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 4.
నిజ వేతనాలను నిర్ణయించే కారకాలు ఏమిటి ?
జవాబు.
శ్రామికులు వివిధ రంగాలలో వస్తూత్పత్తి ప్రక్రియలో తన సేవలను అందించారు. అందుకు ప్రతిఫలంగా ఉత్పత్తిదారులిచ్చే ప్రతిఫలం లేదా ధరను వేతనం అంటారు. శ్రామికులకు ప్రతిఫలం లేదా ధరను ద్రవ్య రూపంలో చెల్లిస్తారు. ద్రవ్య రూపంలో ఇచ్చిన వేతనం కొనుగోలు శక్తిని వాస్తవిక వేతనం అంటారు. ఇది ద్రవ్యం కొనుగోలు శక్తిపై ఆధారపడుతుంది. ఈ కొనుగోలు శక్తి సాధారణ ధర సూచికపై ఆధారపడి ఉంటుంది.

ధరల స్థాయి మారుతున్నప్పుడు ద్రవ్యవేతనంలో మార్పులు లేకపోయినా వాస్తవిక వేతనంలో మార్పు వస్తుంది. వాస్తవిక వేతనమే శ్రామికుని జీవన ప్రమాణస్థాయిని నిర్ణయిస్తుంది. ప్రజలు వినియోగిస్తున్న వస్తువులు, వాటి పరిమాణాలు, నాణ్యతను అనుసరించి వారి జీవన ప్రమాణాలు నిర్ణయించబడతాయి.

వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు :

1. ద్రవ్యం కొనుగోలు శక్తి :
సాధారణంగా ద్రవ్యానికుండే కొనుగోలు శక్తిపై వాస్తవిక వేతనాలు ఆధారపడి ఉంటాయి. ద్రవ్యానికి కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు శ్రామికులు తమ వేతనంలో ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోగలరు. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గినప్పుడు శ్రామికుల వాస్తవిక వేతనం తగ్గుతుంది.

2. వేతనమిచ్చే విధానము :
శ్రామికులకు ఇచ్చే ద్రవ్య వేతనంతోపాటు యాజమాన్యం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఉదా : ఉచిత వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మొదలైనవాటివల్ల వారి వాస్తవిక వేతనాలు అధికమవుతాయి.

3. ఉద్యోగ స్వభావము :
చేసే పని స్వభావం మీద కూడా వాస్తవిక వేతనాలు ఆధారపడతాయి. కొన్ని వృత్తులలో పని దుర్భరంగా ఉంటుంది. కొన్ని వృత్తులు ఆపదతో కూడినవిగా ఉంటాయి. అటువంటి వృత్తులలో ద్రవ్యవేతనాలు ఎక్కువగా ఉన్నా వాస్తవిక వేతనాలు తక్కువ.

ఆహ్లాదకరమైన వృత్తులలో ద్రవ్యవేతనాలు తక్కువైనా వాస్తవిక వేతనాలు ఎక్కువని ఉద్యోగ స్వభావాన్నిబట్టి చెప్పవచ్చును. ఉదా : గనులలో పనిచేసేవారి వృత్తి దుర్భరంగా ఉంటుంది. కనుక ద్రవ్య వేతనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

4. పనిచేసే పరిస్థితులు :
అనారోగ్యకరమైన పరిసరాలలో పనిచేసే శ్రామికుల వేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ గంటలు పనిచేసేవారి ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నా వారి వాస్తవిక వేతనం రేటు తక్కువగా ఉంటుంది.

5. ఆకస్మిక లాభాలు :
యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, పోటీ సంస్థలు మూతపడుట మొదలైన కారణాల వల్ల ధరలు పెరిగి లభించే ఆకస్మిక లాభాలు నికరలాభంలో అంతర్భాగంగా ఉంటాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 5.
స్థూల లాభాల భావనలను వివరించండి.
జవాబు.
మొత్తం రాబడి నుండి మొత్తం వ్యయం తీసివేయగా మిగిలినదానిని స్థూలలాభం అని అంటారు.
స్థూలలాభంలో ఉన్న అంశాలు :

1. ఉద్యమదారుని సొంత మూలధనం మీద వడ్డీ :
వ్యవస్థాపకుడు ఉత్పత్తి ప్రక్రియలో సొంత మూలధనం ఉపయోగిస్తే దానిమీద చెల్లించే వడ్డీని లెక్కలోకి తీసుకోవాలి.

2. సొంత భూమి మీద భాటకం :
ఉత్పత్తి ప్రక్రియలో తన సొంత భూమిని ఉపయోగిస్తే దానికి భాటకం లెక్కగట్టాలి. దానిని లాభంగా అన్వయించకూడదు.

3. నిర్వహణ వేతనాలు :
వ్యవస్థాపకుడే వ్యాపారాన్ని నిర్వహించి, అజమాయిషీ చేస్తే అతని సేవలకు వేతనం ఇవ్వాలి. అది స్థూలలాభంలో తీసివేయాలి.

4. బీమా ఖర్చులు :
యంత్రాల తరుగుదల, బీమా వ్యయాలు మొదలైనవాటిని స్థూలలాభాల నుండి తీసివేయాలి.

5. నికరలాభం :
వ్యవస్థాపనకు ఉత్పత్తికరమైన సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికరలాభం.

6. భవిష్యదవకాశాలు :
భవిష్యత్తులో పదోన్నతి జరిగి ఎక్కువ సంపాదించుకునే అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది.

7. వృత్తి స్థిరత్వం : ప్రతి శ్రామికుడు ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ శాశ్వతమైన ఉద్యోగం కోరుకుంటాడు. కాని తాత్కాలికమైన ఉద్యోగంలో ద్రవ్యవేతనం ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో నిరుద్యోగిగా ఉండిపోవలసి వస్తుంది. కనుక వాస్తవిక వేతనం తక్కువగా ఉంటుంది.

8. అదనపు రాబడి : అదనపు రాబడి ఆర్జించటానికి అవకాశమున్న వృత్తులలో ద్రవ్యవేతనం తక్కువగా ఉన్నప్పటికీ వారి వాస్తవిక వేతనం ఎక్కువగా ఉంటుంది. ఉదా : అధ్యాపకులు, టైపిస్టులు మొదలైనవారు అదనపు రాబడిని ఆర్జించగలరు.

నికరలాభంలో ఉన్న అంశాలు : స్థూలలాభంలో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థాపక సేవలకు వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే నికర లాభం అంటారు.

ఎ) నష్టభయాన్ని భరించడం:
వ్యాపారంలో బీమా చేయలేని నష్టభయాలను, అనిశ్చితాలను భరించినందుకు వచ్చే ప్రతిఫలం నికర లాభంలో అంతర్భాగంగా ఉంటుంది.

బి) ఉత్పత్తి కారకాల సమన్వయం:
ఉత్పత్తి కారకాలను ఒకచోట చేర్చి అభిలషణీయ అనుపాతంలో కూర్చి, సమన్వయపరిచినందుకు వచ్చే ప్రతిఫలాలు నికరలాభంలో ఇమిడి ఉంటాయి.

సి) మార్కెటింగ్ సేవలు :
ఉత్పత్తి కారకాలను కొనుగోలుచేసి తయారైన వస్తువులను విక్రయించటంలో వ్యవస్థాపకుని మార్కెటింగ్ సమర్థతకు ప్రతిఫలం నికరలాభంలో అంతర్భాగం.

డి) నవకల్పనలు ప్రవేశపెట్టడం :
నూతన ఉత్పత్తి పద్ధతులు ప్రవేశపెట్టడం, నూతన మార్కెట్లు కనుక్కోవడం, నూతన వస్తువులను తయారుచేయడంలాంటి నవకల్పనలు ప్రవేశపెట్టినందుకు చెల్లించే పారితోషికం నికరలాభంలో అంతర్భాగం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కారక డిమాండ్ను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.
ఉత్పత్తికి ధర నిర్ణయించబడినట్లుగానే ఉత్పత్తి కారకాల ధరలను వాటి డిమాండ్, సప్లయ్ లు కలిసి నిర్ణయిస్తాయి. అయితే రెండింటికి తేడాలున్నాయి. ఉత్పత్తి కారకానికి డిమాండ్ను నిర్ణయించే అంశాలు (కారకాలు) :

  1. ఉత్పత్తి కారకాల డిమండ్ ఉత్పన్న డిమాండ్. అంటే ఉత్పత్తి కారకం డిమాండ్ అది ఉత్పత్తి చేసే వస్తువు మాండ్ పై ఆధారపడి ఉంటుంది.
  2. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ దాని ధరపై ఆధారపడి ఉంటుంది.
  3. ఒక ఉత్పత్తి కారకం డిమాండ్ ఉత్పత్తిలో దానికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడి ఉంటుంది.
  4. సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తుంది. ఉదా : సాంకేతిక పరిజ్ఞానం పెరిగితే శ్రామికుల డిమాండ్ తగ్గుతుంది.
  5. తరహాననుసరించి ప్రతిఫలాలు ఉత్పత్తి కారకాల డిమాండ్ను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిలో పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తుంటే ఉత్పత్తి కారకాలను డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 2.
శ్రమ సరఫరాను నిర్ణయించే అంశాలు ఏమిటి ?
జవాబు.

  1. ధరల స్థాయి
  2. చెల్లింపు విధానం
  3. ఉద్యోగ క్రమబద్ధత
  4. పని స్వభావం
  5. పనిచేసే పరిస్థితులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 3.
ఒప్పంద భాటకం అంటే ఏమిటి ?
జవాబు.
ఒప్పంద భాటకం అంటే నిర్ణీతకాలానికి భూమి సేవలకు, గృహాలకు ముందుగా నిర్ణయించిన ఒప్పందం ప్రకారం చెల్లించే ప్రతిఫలం.

ప్రశ్న 4.
ఆర్థిక భాటకం అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక భాటకం కేవలం భూమికే పరిమితం కాకుండా మిగతా మూడు ఉత్పత్తి కారకాలైన శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు వర్తిస్తుంది. ఇది మూడు రకాలు.

  1. కొరత భాటకం
  2. కృత్రిమ భాటకం
  3. బదిలీ సంపాదన

ప్రశ్న 5.
ద్రవ్య వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
ద్రవ్య వేతనం అంటే శ్రామికుని శ్రమకు నగదు రూపంలో చెల్లించే ధర లేదా ప్రతిఫలం.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 6.
వాస్తవిక వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
వాస్తవిక వేతనాన్ని అభివృద్ధి పరిచినది ఆడమస్మిత్, వాస్తవిక వేతనం అంటే శ్రామికుడి శ్రమకు ప్రతిఫలంగా పొందిన ద్రవ్యవేతనం కొనుగోలుశక్తి.

ప్రశ్న 7.
కాలాన్ని బట్టి వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
కాలాన్ని బట్టి వేతనం అంటే శ్రామికుల ఉత్పాదకతతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి ఒక వృత్తిలో పనిచేసే వారందరికి ఒకే వేతనం చెల్లించడం.

ప్రశ్న 8.
పనిని బట్టి వేతనాలు అంటే ఏమిటి ?
జవాబు.
శ్రామికుల ఉత్పాదకత, నైపుణ్యం బట్టి చెల్లించే వేతనంను పనిని బట్టి వేతనం అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 9.
స్థూల వడ్డీ అంటే ఏమిటి ?
జవాబు.
ఋణం తీసుకున్న వ్యక్తి తాను తీసుకొన్న మొత్తంతో పాటు అదనంగా ఋణదాతకు ఎంత చెల్లిస్తున్నాడో, మొత్తాన్ని స్థూల వడ్డీ అంటారు.

ప్రశ్న 10.
నికర వడ్డీ అంటే ఏమిటి ?
జవాబు.
మూలధన సేవలకు మాత్రమే ఇచ్చే ప్రతిఫలం.
ఉదా : ప్రభుత్వ బాండ్లు, ప్రభుత్వ ఋణాలపై వడ్డీ.

ప్రశ్న 11.
స్థూల లాభం అంటే ఏమిటి ?
జవాబు.
రాబడి నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు, తరుగుదల తీసివేయగా మిగిలినది స్థూల లాభం. స్థూల లాభం = నికర లాభం + అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు

ప్రశ్న 12.
నికర లాభం అంటే ఏమిటి ?
జవాబు.
వ్యవస్థాపకుని సేవలకు మాత్రమే వచ్చే ప్రతిఫలం నికర లాభం.
నికర లాభం = స్థూల లాభం – అప్రకటిత భాటకం + అప్రకటిత వేతనం + అప్రకటిత వడ్డీ + తరుగుదల + భీమా చెల్లింపులు.

Leave a Comment