Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 5th Poem నాపేరు ప్రజాకోటి Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 5th Poem నాపేరు ప్రజాకోటి
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానములు
ప్రశ్న 1.
‘నా పేరు ప్రజాకోటి’ కవితలో దాశరథి అందించిన సందేశాన్ని తెలియచేయండి?
జవాబు:
‘నాపేరు ప్రజా కోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించిబడిన “పున్నవం” అను కవితాఖండిక నుండి గ్రహించబడింది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని తెలంగాణ వైభవాన్ని వివరించిన కవి దారశథి. ఆయన పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’గా అమర్చాడు.
కవి అయిన వానికి మానవత ఉండాలి. మంచి చెడులకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పధాలకు కేంద్ర బిందువుమానవుడే! తోటి మానవుని ప్రేమించ లేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిషత్తుకు బాటలు వేయాలన్నాడు. మన దేశం అనాది నుండి శాంతి అహింసలకు ఉపాసించిందన్నాడు. విశ్వశ్రేయస్సును కోరేవారు భారతీయులని అభివర్ణించాడు. తనతో అందరిని కలుపుకోవటం అందరిలో తాను ఒకడిగా కలిసిపోవటమే భారతీయత. చెడు నుండి మంచి వైపుకు ప్రయాణం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
అహింసను అలవరచుకోవాలి. హింసద్వారా విజయాన్ని పొందినవారు ఈ. ప్రపంచంలో ఎవరూ ఉండరు. అహింసే జీవిత పరమావధి కావాలని ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు.
గతమంతా బూది కుప్పకాదు. వర్తమానం అద్భుతమూ కాదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని నడిస్తేనే ప్రజా విజయ మౌతుందన్నాడు. ఎన్ని శక్తులను సాధించినా మానవత ముందు దిగదుడుపే. ఏ జెండా పట్టుకున్నా మైత్రీ బంధం కూర్చేనేరు అహింసకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ మానవున్నాడ వాడు మానవుడే. రంగు రూపు భేదమున్నా స్నేహం చేయటం నేర్చుకోవాలన్నాడు. హింసాత్మక ధోరణులను వదలి హాయిగా జీవనం గడపమని దాశరథి ఈ కవిత ద్వారా ప్రబోధించాడు.
ప్రశ్న 2.
అహింస ఆవస్యకతను పాఠ్యాంశం ఆధారంగా వివరించండి?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ‘పునర్నవం’ అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని కలుపుకోవటం, అందరిలో తానై పర్యవసించటమే భారతీయత. హింసను ఆధారంగా చేసుకుని ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించ లేదు. అహింస జీవన పరమావధి కావాలని దాశరథి కోరుకున్నాడు.
“నిజం ఏమిటోగాని వట్టి చేతితో శత్రువు పైకి దుమికే శక్తి ఉంది”.
వట్టి చేతితో శత్రువుపైకి దూకేశక్తి అహింస సొంతం. మాటలనే ఈటెలుగా చేసుకుని ఎదిరించే బలం అహింసకున్నది. వీరశైనికుని కూడా చూసి భయపడని ఈ లోకం నన్ను చూసి భయపడుతుంది. నేను కోతల రాయుణ్ణిని భావించవద్దు. ఎర్రజెండా పట్టుకున్న వారిని పచ్చజెండా పట్టుకున్న వారిని కలిపే శక్తిఅహింసకున్నది. రాక్షసులతో కూడ స్నేహం చేయగల సత్తా అహింసా మార్గనికున్నది.
“హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నాకంటికి ఏ వస్తువూ రుచించదు”.
హృదయం నా ఆయుధం. ఉషోదయం తప్ప నాకు ఏదీ నచ్చదు. అణ్వస్రా లను అఘాతంలో పడవేసిన శక్తినాది. ప్రజల సుఖశాంతులే నాకు పరమావధి. ఘర్షణలో ఏనాటికీ ఆనందం లభించదు. కనుక లోకాలకు అహింస పరమావధికావాలి. అదే ప్రపంచానికి అవస్యం కావలసిన నీతి.
II. సంగ్రహరూప ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న 1.
దాశరథి కవితా సంపుటాలను తెలియచేయండి?
జవాబు:
‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించ బడింది.
ఆధునికాంధ్ర సాహిత్యంలో దాశరథిది విశిష్ట స్థానం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు. ఉర్దూ, తెలుగు సంస్కృం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయనం చేశాడు.
వీరి కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం ఆలోచనా లోచనలు, తిమిరంతో సమరం. మహాబోధి కథాకావ్య రచన చేశాడు. నవ మంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా అన్న గేయ రచనలు చేసాడు. వీటితో పాటుగా ‘నవిమి’ నాటికల సంపుటిని వెలువరించాడు. దాశరథి శతకంతోపాటు గాలిబుగీతాలను తెలుగునకు అనువదించారు.
ప్రశ్న 2.
యుద్ధానికి సంబంధించి దాశరథి అభిప్రాయాలను తెలపండి?
జవాబు:’
నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులుచే రచించబడిన “పునర్నవం” కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన దాశరథి తాడిత పీడితుల కోసం తన కవితను ‘మైక్’గా అమర్చాడు. ఒకరినొకరు ద్వేషించటం తగదని రాక్షస స్వభావం గల వారితో కూడా మైత్రిని చేయాలని అంటారు దాశరథి. ఆయన దృష్టిలో యుద్ధం రాక్షసక్రీడ. నవ సమాజానికి పనికిరానిది.
అందరికంటే ముందే
అణ్వస్త్రము గొనిపోయి
అఖాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి”
అని అణ్వస్త్ర ప్రయోగాన్ని నిరసించాడు.
కత్తి పట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు
మెత్తని హృదయం దాటికి
తుత్తునియలు కానిదెవరు?
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు”
అని నవసమాజానికి యుద్ధం పనికిరాదని మెత్తని హృదయంతో అహింసా యుతంగా విజయాలను పొందాలని దాశరథి భావన.
ప్రశ్న 3.
పాఠ్యాంశంలోని కవి ప్రతిపాదించిన త్రికాల దృష్టిని వివరించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” అను కవితా సంపుటి నుండి గ్రహించబడింది. కవి అనేవాడు. మొదట మానవతా వాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును తెలుసుకోగలగాలి.
గతకాలాన్ని మంచి కాలంగా భావించి జీవితాలను గడిపే వ్యక్తులను వెక్కిరించే మనస్తత్వ దృష్టి ఉండకూడదంటాడు.
“గతమే జీవిత మనుకుని
వర్తమానమె వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదంటాడు”
అలాగే గతమంతా శూన్యం జ్ఞాన ప్రదమైన వర్తమానాన్ని మాత్రమే మంచిగా భావించాలను తలపొగరు గలవారిని నిందించే ఆలోచనా చేయకూడదు. గతము వర్తమానము కత్తికి రెండు వైపులా ఉండే పదును. రెండింటిని సమర్థిస్తానన్నాడు.
“గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనుబోను భవిష్యత్తు వదులుకోను”
అని గతాన్ని, వర్తమాన్ని భవిష్యత్తును ఒకటిగా చూసే దృష్టి కలవాడు దాశరథి.
ప్రశ్న 4.
పాఠ్యాంశం ఆధారంగా కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ?
జవాబు:
‘నా పేరు ప్రజాకోటి’ అను పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “పునర్నవం” కవితాసంపుటి నుండి గ్రహించబడింది. ఆధునిక ఆంధ్రసాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యులు ఒక విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించి పీడిత తాడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని ‘మైక్’ గా అమర్చాడు.
కృష్ణమార్యుల గారి దృష్టిలో కవి అయినవాడు మానవతా వాది కావాలన్నాడు కనిపించే మంచికిచెడుకి స్పందించాలన్నాడు. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే. మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరీక్షించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలన్నాడు. శాంతి అహింసలు తోడుగా విశ్వశ్రేయస్సును కోరుకున్నాడు. అహింసనే జీవిత పరమావధిగా అందరూ తలచాలని అందుకు కవులు తమ రచనల ద్వారా దోహదకారులవ్వాలని భావించాడు.
III. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
దాశరథి తల్లిదండ్రులెవరు?
జవాబు:
దాశరథి తల్లిదండ్రులు వేంకటమ్మ, వేంకటచార్యులు
ప్రశ్న 2.
దాశరథి ఏ గ్రామంలో జన్మించాడు?
జవాబు:
వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చిన గూడూరు గ్రామంలో జన్మించాడు
ప్రశ్న 3.
దాశరథి ప్రసిద్ధ నినాదమేది?
జవాబు:
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్నది దాశరథి ప్రసిద్ధనినాదం.
ప్రశ్న 4.
దాశరథి తన పేరు ఏమని చెప్పకున్నాడు?
జవాబు:
నా పేరు ప్రజాకోటి అని చెప్పుకున్నాడు.
ప్రశ్న 5.
అజ్ఞానాన్ని కవి దేనితో పోల్చాడు.
జవాబు:
అజ్ఞానాన్ని “అడుసు”తో పోల్చాడు
ప్రశ్న 6.
దాశరథి అణ్వస్త్రాలను ఎక్కడ పారేయాలని ఆకాంక్షించాడు?
జవాబు:
“అఖాదం”లో పడవేయాలని ఆకాంక్షించాడు.
ప్రశ్న 7.
కవి కంటికి రుచించేదేమిటి?
జవాబు:
హృదయం, ఉదయాలు కవి కంటికి రుచించేవి
ప్రశ్న 8.
కాలాన్ని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
కంఠ మాలతో పోల్చాడు.
IV. సందర్భ సహిత వాఖ్యలు
ప్రశ్న 1.
వెనక్కు నడిచేవారిని వెక్కిరించే కోర్కిలేదు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, నా పేరు ప్రజాకోటి అను పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను కవితా ఖండికలోనిది.
సందర్భము :-
ప్రతికాలాలను గురించి కవి తెలియచేయు సందర్భంలోనిది
భావము :-
గతించిన కాలమే జీవితం అనుకుని వర్తమానాన్ని నిందిస్తూన్న వారిని పరిహాసం చేసే కోరిక తనకు లేదని ఇందలి భావం.
ప్రశ్న 2.
వట్టిచేతితో శత్రువుపై దుమికే శక్తి ఉంది
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన “నా పేరు ప్రజాకోటి” అని పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. “పునర్నవం” అన్న కవితాఖండికలోనిది.
సందర్భము :-
కవి “అహింసా” శక్తిని గురించి వివరించే సందర్భములోనిది.
భావము :
చిన్నపాటి అంకుశంతో గున్న ఏనుగు బంధించే కొత్త శక్తిని కనుగొన్నాను. అలాగే వట్టి చేతులతో ‘అహింస’నే ఆయుధంగా చేసుకుని శత్రువుపై దూకే శక్తిని తెలుసుకున్నాని ఇందలి భావం.
ప్రశ్న 3.
రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన ‘నాపేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అను ఖండకావ్యం లోనిది.
సందర్భము :
మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని వివరించిన సందర్భము
భావము :-
అందరం మానవులమే. ఒకరినొకరు ద్వేషించు కోవటం ఎందుకు. రాక్షస స్వభావం ఉన్న వారిని కూడా నేను ఆహ్వానిస్తాను అని ఇందలి భావం.
ప్రశ్న 4.
ఘర్షణలో ఏనాటికి హర్షం లభియింపబోదు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యము దాశరథి కృష్ణమాచార్యులచే రచించబడిన, ‘నా పేరు ప్రజాకోటి’ అన్న పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ‘పునర్నవం’ అన్న కవితా ఖండికలోనిది.
సందర్భము :-
మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని అసలు విషయాన్ని తెలుసుకోమని చెప్పిన సందర్భంలోనిది.
భావము :-
కత్తిపట్టి గెలిచిన వీరుడెవ్వరూ లేడు. కాని మెత్తని హృదయంతో లొంగనివారు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి అహింస మార్గాన్ని ఎంచుకోవాలి. హింస ద్వారా సంతోషం ఏనాటికి లభించదని ఇందలి భావం.
V. సంధులు
1. గతమంత
గతము + అంత = గతమంత సూత్రము – ఉత్వసంధి/ ఉకారసంథి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంథియగు
2. అణ్వస్త్రము:
అణు+అస్త్రము = అణ్వస్త్రము – యణాదేశ సంధి
సూత్రము :- ఇ.డి.ఋ అనువానికి అసవర్ణములైన అచ్చులు పరమైనచో క్రమముగా య,వ,ర,ల అనునవి ఆదేశముగా వచ్చును.
3. అణువంత
అణువు+అంత = అణువంత – ఉకార సంధి/ఉ. త్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు
4. చేతులెత్తి
చేతులు + ఎత్తి = చేతెలెత్తి – ఉకారసంధి/ఉత్వసంథి
సూత్రము :- ఉత్తన ‘కచ్చు పరంబగునపుడు సంథియగు.
5. రెండంచులు
రెండు + అంచులు = రెండంచులు – ఉకారసంథి/ఉత్వసంథి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు.
6. కానిదెవడు
కానిది + ఎవడు = కానిదెవడు – ఇత్వసంధి/ఇకారసంథి
సూత్రము :- ఏ మ్యాదులయిత్తనకు సంధి వైకల్పికముగానగు. ఏమ్యాదులనగా ఏమి, మరి,కి,షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి ఇత్తు అంటే హ్రస్వమైన ఇకారము.
VI. సమాసాలు
1. ఎర్రజెండా :
ఎర్రనైన జెండా – విశేషణ పూర్వపద కర్మధారయము.
2. గున్నయేనుగు :
గున్నదైన ఏనుగు – విశేషణ పూర్వపద కర్మధారయము
3. మహాశక్తి:
మహాతైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయము
4. మనోజ్ఞభావి :
మనోజ్ఞమైన భావి – విశేషణ పూర్వపద కర్మధారయము
5. శబ్దధాటి:
శబ్దము యొక్క ధాటి – విశేషణ పూర్వపద కర్మధారయము
6. అజ్ఞానం :
జ్ఞానము కానిది – నైత్పురుష సమాసము
7. భరతభూమి :
భరత అనుపేరుగు భూమి – సంభావనా పూర్వపద కర్మధారయము
8. ఇలాగోళము :
భూమి యొక్క గోళము – షష్ఠీతత్పురుష సమాసం
9. మైత్రే బంధము :
మైత్రి చేత బంధము – తృతీయా తత్పురుష సమాసం
మైత్రి వలన బంధము – పంచమీ తత్పురుష సమాసం
10. కంఠమాల :
కంఠమునందలి మాల – సప్తమీ తత్పురుష సమాసం
ప్రతిపదార్థ తాత్పర్యాలు
1వ పద్యం :
తెలంగాణలో కోటిధీరులు గళధ్వనినేగాక
ఇలా గోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను
నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి
అర్థాలు :
ధీరులు = ధైర్య వంతుల
గళధ్వని = కంఠధ్వని
ఇలాగోళము = భూగోళము
ఎల్లరి = అందరి
భావము :
కోట్ల ప్రజల తెలంగాణ వీరుల (గళాన్ని) గొంతుకను నేను అంతేకాదు ఈ భూమిపై ఉండే ప్రజలందరి ఊపిరిని నేను నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి అని కవి పేర్కొన్నాడని ఇందలి భావం.
2వ పద్యం :
అయినా అణువంతవాణ్ణి
అసలే కనరాని వాణ్ణి
కోట్ల కొలది జనుల మనసు
కొద్దో గొప్పో ఎరుగుదు
అర్థాలు :
అణువంత = అణువంత చిన్నరూపం
కనరాని = కన్పించనటువంటి
ఎరుగుదు = తెలుసుకున్నవాడిన
భావం:
కోట్లకొలది ప్రజలలో నేను అణువంతటివాడిని. అయినా వారందరి మనస్సులను కొద్దోగొప్పో తెలిసినవాడిని.
3వ పద్యం :
గతమే జీవితమనుకొని
వర్తమానమే వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కిలేదు.
అర్థాలు :
గతము = గడిచిన కాలం
వర్తమానము = ప్రస్తుతము
వలదని = వద్దని
నడచేవారిని = పయనించేవారిని
వెక్కిరించ = ఎగతాళి గేళి చేసే
కోర్కెలేదు = ఆలోచన కోరిక లేదు.
భావం :
గతించిన కాలమే అసలైన జీవితమనుకొని వర్తమానం వద్దని గతకాలాన్ని గుర్తుకుతెచ్చుకొని బ్రతికేవారిని ఎగతాళి చేసే కోరిక ఏ మాత్రం నాకులేదు.
4వ పద్యం :
గతమంతా బూదికుప్ప
కావాలి మనోజ్ఞభావి
తిరగబడండని అరచే
బిరుసువారి నిందింపను
అర్ధాలు :
గతమంతా = గడిచిన కాలమంతా
బూదికుప్ప = శూన్యం
మనోజ్ఞభావి = ఆనందాన్నిచ్చే భవిష్యత్తు
తిరగబడండి+అని = ఎదురు తిరగమని
అరచే = గొంతెత్తే
బిరుసువారి = తలపొగరు వారిని
నిందింపను = తిట్టను
భావం :
గడిచిన కాలమంతా పనికిరానిది సుందరమైన భవిష్యత్తు కావాలని తిరగబడండి అని అరచే తలబిరుసుగాళ్ళను నేనేమి అనగలను.
5వ పద్యం :
ఇవి రెండూ ఒక కత్తికి
అటూ ఇటూ రెండంచులు.
నే మాత్రం రెండంచులు
సాము చేయగలను లెండి!
అర్థాలు :
ఇవి రెండూ = పూర్వాపరాలు రెండూ
రెండంచులు = రెండువైపులా
నే మాత్రం = నేను మాత్రం
సాము = పరిశ్రమ
భావం :
భూత వర్తమాన కాలాలు రెండూ కత్తికున్న రెండంచులు. నేను మాత్రం రెండింటిని సమంగా చూస్తాను అని ఇందలి భావం.
6వ పద్యం :
గతాన్ని కాదనలేను
వర్తమానం వద్దనబోను
భవిష్యత్తు వదులుకోను
కాలం నా కంఠమాల
నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి
అర్ధాలు :
గతము = గడచిన కాలము
వర్తమానం = గడుస్తున్న కాలం
కంఠమాల = కంఠమందు ధరించేమాల
ప్రజాకోటి = ప్రజలయొక్క సమూహం
ప్రజావాటి = ప్రజల నివాసం
భావం:
గతించిన కాలాన్ని కాదనలేను. వర్తమానాన్ని వద్దనను కాలం నా కంఠమాల నాపేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి.
7వ పద్యం :
బాంబుల బలం వచ్చి.
పాములలో విషం చచ్చి
ప్రేమములో బలం హెచ్చి
స్నేహములో శక్తి హెచ్చి
చిన్నపాటి అంకుశమున
గున్నయేనుగును వంచే
కొత్తరకం పద్ధతికను
“గొన్నానండో రండో!
భరతభూమి నేర్చినదో.
ప్రజాకోటీ నేర్పినదో
నిజం ఏమిటోగాని
వట్టి చేతితో శత్రువు
పై దుమికే శక్తి ఉంది.
అర్ధాలు :
బాంబులు = మారణాయుధాలు
బలంచచ్చి = బలం నశించి
పాములలో = విషసర్పాలలో
విషం చచ్చి = విషంపోయి
ప్రేమములో = ప్రేమభావంలో
బలం హెచ్చి = బలము పెరిగి
స్నేహంలో = మిత్రత్వంలో
అంకుశము = త్రిశూలంవలె ఉండే ఆయుధం
భావము:
మారణాయుధాలలో బలం నశించి పాములలో విషం పోయి, ప్రేమ భావంలో బలం పెరిగి స్నేహానికున్న శక్తి పెరిగి చిన్న పాటి అంకుశముతో గున్న ఏనుగును దారికి తెచ్చుకునే కొత్త పద్ధతిని కనుగొన్నాను. నా భారతభూమి నేర్చినదో, ప్రజాసమూహాలు నేర్పాయో వట్టి చేతులతో అహింస భావనతో శత్రువుపై దూకే శక్తి నాకు లభించింది.
8వ పద్యం :
మాటలనే ఈటెలతో
పోటుపెట్టు బలంవుంది.
సైనికుడిని చూచివెరువ
బోని జగం నన్ను జూచి
భీతిజెంది భక్తి పొంది
చేతులెత్తి దండమిడును.
అర్ధాలు :
మాటలనే = మాటలు అనే
ఈటెలతో = ఆయుధాలతో
పోటు పెట్టు = గాయపరచు
వెరువు = భయం
భీతిజెంది = భయపడి
భావము :
మాటలనే ఈటెలతో ఎదుర్కొనే బలం ఉంది. సైనికుడిని చూసి భయపడని జగతి నన్ను చూసి భయాన్ని భక్తిని పొంది చేతులెత్తి నమస్కరిస్తున్నది. నేనెవరినో తెలుసా అహింసను ప్రేమను
9వ పద్యం :
వినుడీ నా శబ్దధాటి
నా పేరు ప్రజాకోటి
ఒక్క కోటి కాదండో
కోటికోట్ల ప్రాణులకు
మాట బలంతో ఆశా
పాటవమును కలిగిస్తా
అర్ధాలు :
శబ్ధదాటి = మాటల యొక్క శక్తి
ఆశాపాటవము = ఆశతో కూడిన నేర్పు
భావము :
నా శబ్దం యొక్క ప్రతాపాన్ని వినండి. నా పేరు ప్రజాకోటి. ఒక్క కోటి కాదండి. కోటానుకోట్ల ప్రాణులకు మాటలనే బలాన్నిచ్చి నైపుణ్యాన్ని కలిగిస్తాను.
10వ పద్యం :
అయితే గప్పాలకోరు.
అనుకోబోకండి మీరు
అర్ధాలు :
గప్పాకోరు = కోతలరాయుడు
భావము :
అలాగని నేను గొప్పలు చెప్పుకునే వాడిని కాదండి.
11వ పద్యం :
మీ గొప్పయే నా గొప్ప మీరు లేకనే చొప్ప
అర్ధాలు :
చొప్ప = నిరుపయోగం
భావము :
మీ గొప్పేనా గొప్పకూడా. మీరు లేకపోతే నేను శూన్యం. నేను లేనేలేను.
12వ పద్యం :
ఎర్రజెండా పట్టుకోని
ఎగసిపోవువాడితోటి
పచ్చజెండా పట్టుకోని
పరుగు తీయువాని తోటి
మైత్రి బంధం కూర్చే
మహాశక్తినాకున్నది
అర్థాలు:
ఎర్రజెండా = కమ్యూనిష్టులు
పచ్చజెండా = జనతావారు
మైత్రిబంధ = స్నేహసంబంధాన్ని
కూర్చే = కలిపే
భావము :
ఎర్రజెండా పట్టుకుని నినదించే కమ్యూనిష్టులను, పచ్చజెండా పట్టుకుని పరుగులు తీసే ప్రజాస్వామ్యవాదులను మైత్రీ బంధంతో ఒకచోటికి ఒక దారికి తెచ్చే శక్తి నాకున్నది. నేను ప్రేమను అహింసను అని ఇందలి భావం.
13వ పద్యం :
ఎవడైనా మానవుడే
ఎందుకు ద్వేషించడాలు?
రాక్షసి మైత్రికి
రాత్తును భయం లేదు
అర్థాలు:
ద్వేషించ = అయిష్టంగాచూచు
భావము :
ఈ భూమిమీద ఎక్కడ నివశించినా మానవుడే! అతనిని ద్వేషించటం ఎందుకు? రాక్షస స్వభావం ఉన్న వారినైనా స్నేహహస్తాన్ని అందిస్తాను. నాకు భయం లేదు.
14వ పద్యం :
దేవతనైనాతోడ్కొని
తెత్తును, భేదమ్మురాదు
నాపేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి
భావము :
అహింసతో ప్రేమతో దేవతలనైనా నాతోపాటు తీసుకుని వస్తాను. నా పేరు ప్రజాకోటి ఊరు ప్రజావాటి.
15వ పద్యం :
హృదయం వినా నా దగ్గర
ఏ వస్తువు లభింపదు
ఉదయం వినా నా కంటికి
ఏ వస్తువు రుచింపడు.
అర్థాలు :
ఉదయం = సూర్యోదయకాలం
వినా = తప్ప
భావము :
మంచి హృదయం తప్ప నా దగ్గర ఏ వస్తువూ లభించదు. ఉషోదయం తప్ప నా కంటికి ఏ వస్తువు ఆనందాన్ని కలుగచేయదు.
16వ పద్యం :
అందరికంటే ముందే
అణ్వస్త్రముగొనిపోయి
అభాతాన పడవేసితి
సుఖపడగా ప్రజాకోటి
అర్థాలు :
అణ్వస్త్రము = అణుబాంబు
కొనిపోయి = తీసికొనిపోయి
అతఖాన = భూమిలోపల
పడవేసితి = కప్పేశాను.
ప్రజాకోటి = ప్రజా సమూహాలు
సుఖపడగా = సుఖపడటం కోసం
భావము :
ప్రజలు సుఖపడాలన్న భావనతో అందరికంటే ముందుగా అణ్వస్త్రాన్ని అఘాతంలో
17వ పద్యం :
కత్తిపట్టి గెలిచినట్టి
ఘనుడగు వీరుండెవ్వడు?
మెత్తని హృదయం దాడికి
తుత్తునియలు కానిదెవరు?
అజ్ఞానపు అడుసు కడిగి
అసలు విషయమెరుంగుడీ
ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింపబోదు
అర్థాలు :
ఘనుడు + అడు = గొప్పవాడైన
మెత్తని హృదయం = మెత్తని మనసు
ధాటికి = దెబ్బకు
తుత్తునియలు = ముక్కలు ముక్కలు
అజ్ఞానపు = తెలివితక్కువ తనపు
అడుసు = మలినము
కడిగి = శుభ్రపరచి
ఘర్షణలో = పోరులో
హర్షం = ఆనందం
భావము :
కత్తి పట్టి విజయం సాధించినవాడు ఒక్కడు కూడా లేడు. మెత్తని ప్రేమ అహింసలను గల హృదయానికి లొంగనివాడు ఈ లోకంలో ఎవరూ ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదలి సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఘర్షణ వలన సంతోషం ఏనాటికీ లభించదని తెలుసుకోండి. నాపేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి.
నాపేరు ప్రజాకోటి Summary in Telugu
కవి పరిచయం
కవి : దాశరథి కృష్ణమాచార్యులు
పుట్టిన తేదీ : జూలై 22, 1925
పుట్టిన ఊరు : వరంగల్లు జిల్లా, మానుకోట తాలూకా చినగూడూరు గ్రామం
తల్లిదండ్రులు : వెంకటమ్మ, వెంకటాచార్యులు
విధ్యాభ్యాసం : ఖమ్మంలో హైస్కూలు చదువు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో బి.ఏ
రచనలు :
- అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవతాపుష్పకం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం మొదలగునవి.
- “మహాబోధి” కథాకావ్యం
- నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా గేయరచనలు
- గాలీబు గీతాలను ఊర్దూ నుండి తెలుగునకు అనువాదం
- “నవమి” నాటికలసంపుటి
- దాశరథి శతకం
- వందలకొలది సినిమాపాటలు
పురస్కారాలు, బిరుదులు :
- ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ కళా ప్రపూర్ణబిరుదులు
- శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్ను
- కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు.
మరణం : నవంబరు 5, 1987
“నా తెలంగాణ కోటిరతనాల వీణ” అని నినదించిన కవి దాశరథి. పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని “మైగ్”గా అమర్చిన కవి. జూలై 22, 1925న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా చినగూడూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేంకటమ్మ వేంకటాచార్యులు. తల్లిదండ్రులు ఇద్దరూ సాహిత్యాభి రుచి గలవారే! ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషా సాహిత్యాలను అధ్యయం చేశారు. ఖమ్మంలో హైస్కూలు విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆంగ్లం చదివారు.
అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం అమృతాభిషేకం, కవితాపుష్పం, ఆలోచనాలోచనలు, తిమిరంతో సమరం, వంటి పద్య వచన రచనలు చేశారు. “మహాబోధి” వీరి కథాకావ్యం నవమంజరి, దాశరథి బాలగేయాలు, ఖబడ్డార్ చైనా వంటి గేయాలు రచించారు. గాలీబు గీతాలను తెలుగులోనికి తీసుకువచ్చారు. నవమి నాటి కల సంపుటి, దాశరథి శతకం, వందలాది సినిమా పాటలు దాశరథి కలం నుండి జాలువారాయి.
దాశరథి తెలుగు సాహిత్యానికి చేసిన సేవను గుర్తించి ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం, “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీలు పురస్కారాలను అందించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశారు. నవంబరు 5, 1987న దాశరథికాలం చేశారు.
పాఠ్యాంశ సందర్భం
కవి అయినవాడు మొదట మానవతావాది కావాలి. కన్పించే మంచికి చెడుకు స్పందించే మనసుండాలి. అన్ని దృక్పథాలకు కేంద్ర బిందువు మానవుడే! మనిషిని ప్రేమించలేనివాడు దేనినీ ప్రేమించలేడు. గతం వర్తమానం నిశితంగా పరిశీలించి ముందుకు సాగాలి.
మన దేశం అనాది నుండి శాంతి, అహింసలను అసురించింది. విశ్వశ్రేయస్సును కోరుకుంది. తనలో అందరిని అందరిలో తనను కలుపుకోవటం భారతీయుల నైజం.
చెడునుండి మంచికి చేరుకుని జీవితాలను సార్థకం చేసుకోవాలన్నది ఈ కవిత ద్వారా దాశరథి ప్రబోధించాడు. హింసను ఆధారంగా చేసుకొని ప్రపంచంపై ఎవరూ విజయం సాధించలేరు. అహింస జీవితపరమావధి కావాలని దాశరథి భావించారు.
ప్రస్తుత పాఠ్యభాగం నాపేరు ప్రజాకోటి దాశరథి కవితా ఖండిక “పునర్నవం” నుండి గ్రహించబడింది.
పాఠ్యభాగ సారాంశం
భారతదేశం అనాది నుండి శాంతి అహింసలను ఉపాసించింది. విశ్వశ్రేయస్సును కోరుతూ అహింసే జీవిత పరమావధిగా భారతజాతి జీవనం సాగిస్తున్నది. హింసతో ప్రపంచంలో ఎవరూ విజయాన్ని సాధించలేరు. అహింస పరమావధికావాలని దాశరధి ఆకాంక్ష.
కోట్ల ప్రజల తెలంగాణ వీరుల గొంతుకనునేను. అంతేకాదు ఈ భూమిపై నివసించే కోటాను కోట్ల ప్రజల ఊపిరిని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాణి. వారందరిలో నేను అణువంతవాడిని. అయినా వారందరి మనసు కొద్దో గొప్పో తెలిసినవాడిని నేను.
గతించిన కాలమే మంచిదన్న భావన పనికి రాదని గతించిన కాలాన్ని, గుర్తుకు తెచ్చుకుని, ఆనందించే వారిని ఎగతాళిచేసే కోరిక కూడా ఏ మాత్రం వర్తమాన ప్రజలకు ఉండకూడదన్నాడు. గతాన్ని వర్తమానాన్ని నిశితంగా పరిశీలించి భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలని అన్నాడు”.
అనాది నుండి భారతదేశం శాంతి అహింసలను ఉపాసించిందని, విశ్వశ్రేయస్సును కోరుకున్నదని తనలో అందరిని కలుపుకోవటం అందరిలో తానై కలసిపోవటం భారతీయ తాత్వికతకు నిదర్శనంగా భావించాలన్నాడు.
ఎర్రజెండా పట్టుకుని ఎగసిపడుతున్నవారిని పచ్చజెండా పట్టుకుని పరుగులు తీస్తున్నవారిని ఏకం చేయగలసత్తా అహింసకు ప్రేమకు సొంతమన్నాడు.
ఈ ప్రపంచంలో జీవించేవారంతా మానవులే! వారిలో కొందరిని ప్రేమించటం ద్వేషించటం తగదు. రాక్షసస్వభావం గల వారితో కూడా స్నేహం చేయగలగాలి. ఉదయము హృదయము తప్పనాకు ఏదీ ఏదీ రుచింపదు. యుద్ధం వర్తమానానికి ఔట్ టెట్. శాంతి అహింస ప్రేమలు వర్తమాన భవిషత్తులకు ఆదర్శప్రాయాలు.
అణ్వస్త్రాలను అందరికంటే ముందుగా అగాధాన పడవేయాలి. అది ప్రజలకు సుఖ సంతోషాలనిస్తుంది. ఈ లోకంలో కత్తిపట్టి నిజమైన విజయాన్ని సాధించనవాడు ఒక్కడూ లేడు. మెత్తని హృదయంతో ప్రేమతో, అహింసతో శత్రువులోని అజ్ఞానాన్ని తొలగించి ఆదర్శభావాలను పెంపొందించాలి. ఘర్షణ వలన ఏనాటికీ ఆనందానుభూతులు లభించవు. ఇది నామాట కాదు ప్రజలమాట అని దాశరథి కృష్ణమాచార్యులు నా పేరు ప్రజాకోటిలో వివరించాడు.