TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 5th Lesson తెలంగాణ జాతీయాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 5th Lesson తెలంగాణ జాతీయాలు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
పాఠ్యాంశంలో ఏవేని ఐదు జాతీయాలను సోదాహరణంగా వివరించండి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళు రచించిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగంలో తెలంగాణ జాతీయాలు వివరించబడ్డాయి.

1. వరిగడ్డిపంట :
ఎండుగడ్డి అంటిందే తడువుగా కాలుతుంది. వాముగా ఉన్నప్పుడు కుమ్ముగా కాలుతుంది. ‘మంచివాళ్ళకు వచ్చే కోపాన్ని వరిగడ్డి మంటతో పోలుస్తారు. వారి కోపం . వరిగడ్డి మంటలాంటిదంటారు. వరిగడ్డిమంటలాంటి కోపం ఆకాసేపు భరించలేనిదిగా ఉ న్నా దానికి ప్రమాదం లేదు. అదే అర్థంలో “వరిగడ్డిమంట” అను జాతీయాన్ని వాడతారు.

2. కుక్కిన పేను : రాకాసిబల్లుల లాంటి మహామహా జంతుజాలం నాశనం అయింది. కాని పేను జాతి మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే ఉంది. పేనును కుక్కితే చిటుక్కుమన్న శబ్ధం వస్తుంది. కొన్ని ఈడ్డులాంటి పేలు చిటుక్కుమనవు గోరువత్తిడికి తలకు అంటుకుపోతాయి. చచ్చినట్లుపడి ఉంటాయి. అలా కుక్కితే చచ్చిపోకుండా చచ్చినట్లు పడిఉండే పేలు కుక్కిన పేలు. “ఒక్క మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కి పేనువలె పడున్నాడు” అనటానికి ఈ జాతీయాన్ని వాడతారు.

3. గద్ద తన్నుక పోయినట్లు ఏ కాస్త సందు దొరికినా, తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్నా, ఏ చింతచెట్టు చాటారు కొమ్మనుండి కనిపెడుతుందో గాని గద్ద కోడిపిల్లను ఎత్తుకుపోతుంది. అలాగే ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతాడు. ఇలా హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవటంతో పోలుస్తారు. “గంట క్రితం బజార్లకు ఆడుకొనపోయిన పిల్లలాడ్ని గద్ద తన్నుక పోయినట్లు బస్సుకిందపడి చచ్చిపోయే” అని జాతీయ ప్రయోగం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

4. చుక్కి టెగి పట్టట్లు :
ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఉల్కలు ఆకాశం నుండి వాతావరణంలోకి రాలిపడుతుంటాయి. ఇది దూరం నుండి చూసిన వారికి ఆకాశం నుండి చుక్కలు రాలిపడినట్లు భ్రాంతి కలుగుతుంది. దీనినే పల్లె భాషలో చుక్క తెగిపడినట్లు అని అంటుంటారు. మనం ఊహించని అతిథిగాని, వ్యక్తిగాని అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా వస్తే “చుక్క తెగిపడినట్లు వచ్చావేమిటిరా అని ప్రశ్నిస్తాం. చుక్క తెగిపడటంచాల అరుదుగా జరుగుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. అర్థరాత్రి అదరాబాదరా వచ్చిన పాలేరుతో “ఈ సమయంలో వచ్చావు చుక్క తెగిపడినట్లు” అని ఇల్లాలు ప్రశ్నిస్తుంది.

5. రామ చక్కని : చక్కదనం అంటే అందం. రాముని చక్కని అందగాడిగా తెలుగువారు భావిస్తారు. మంచి గుణానికి అందానికి నాణ్యతకు చాలా సందర్భాలలో రామచక్కని బంధం ఉపయోగించబడుతుంది. “రామ చక్కని అద్దం పగుల గొడితివి గదరా” “రంగయ్య రామచక్కని మనిషి”, “రామ చక్కని పిల్ల అది” అని ప్రయోగం మన సమాజంలో ఉన్నదే కదా!

ప్రశ్న 2.
పాఠ్యాంశంలోని జంతువులు పక్షుల ఆధారంగా రూపొందిన ఏ వేని ఐదు జాతీయాలను వివరించండి?
జవాబు:
“తెలంగాణ జాతీయాలు” అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచింంచబడిన ‘తెలంగాణ జాతీయాలు’ అన్న గ్రంథం నుండి గ్రహించబడింది. ఇందులో జంతువుల పక్షులు ఆధారంగా కొన్ని జాతీయాలున్నాయి.

1. కోతికి పుండు పుట్టినట్లు ఒక కోతికి పుండయ్యింది. విచిత్రంగా కన్పించింది. మరొక కోతి వచ్చి ఆపుండును గిల్లి చూసి వెళ్ళిపోయింది. అలాగే మరొక కోతి కూడా అలా చేసింది. ఆకోతి కూడా పుండు బాధ పడలేక గోక్కున్నది. పుండు మరింత నెత్తురుకారి పెద్దదయింది. ఏ కోతికి పుండు పెద్దది కావాలని ఉండదు. అయినా తెలియని తనం వలన ఈ కోతి పుండు మానదు “అత్తా! ఈ పోరగాని కాలుకు దెబ్బ తాకిందని పట్టేసి బడికితోలేస్తే మళ్ళీ దెబ్బతాకించుకున్నాడు. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది” అన్న కోడలి మాటల్లో ఈ జాతీయం పలుకబడింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

2. ఎద్దును చూసి మేతెయ్యాలి : ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కుదురుతుందా? విచక్షణతో దేనికేంత వేయాలో తెలుసుకోవాలి. ఎద్దుల్లో కొన్ని పెద్ద ఎద్దులుంటాయి. వాటికి తగ్గమేత వాటికి వేయాలి. కొన్ని బొండలుంటాయి. వాటి పుట్టుకే చిన్నది. కడుపు కూడా అంతకు తగ్గట్టుగానే ఉంటుంది. వాటికి మేత ఎక్కువ వేస్తే తొక్కి పాడుచేస్తాయి. ‘దసరా మామూళ్ళని అందరికి పదిరూపాలే ఇస్తిరి. ఎద్దును చూసి మేతెయ్యాలి. మే ఎల్లకాలం పనికచ్చేటోల్లం. మాది మా కుండాల” అని జాతీయం ప్రయోగించబడుతుంది.

3. ఊరుగొడ్డుపోలేదు : ఊరిలో ఎక్కడో ఒకచోట దొరకుండా పోదు అనుట ఒక కుటుంబంలో ఒక వస్తువు దొరకకుండా పోవచ్చు. ఊరిలో దొరకకుండా పోదు. గొడ్డు పోవుట అంటే వంధత్వం, అలభ్యం. ఒక కుటుంబంలో దొరకకపోతే వేరే కుటుంబంలో దొరుకుతుందని భావం” “అయ్యో! నీవు యియ్యకపోతే మాయె. ఊరుగొడ్డుపోయిందా? ఎక్కడో ఒకచోట ఎవరన్నా ఇస్తారు. అందరూ ఒకే తీరు ఉంటారా? అని ఈ జాతీయం ప్రయోగించబడుతుంది

4. కోడి మెదడు : అల్పత్వం మతిమాలిన తనం అని అర్థం. కోడి చిన్న ప్రాణి. దాని మెదడు కూడా చిన్నదే! చెపితే అర్థం చేసుకోకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకునే వాడిని కోడిమెడవాడు అంటారు. “వానిది కోడి మెదడు. వానికి తోచదు. ఒకరు చెప్తే వినడు” అంటారు.

5. బుడుబుంగ : నీటిలో తిరిగే పక్షి, బాతు జాతికి చెందింది. నల్లగా ఉంటుంది. ఒక చోట బుడుక్కున మునుగుతుంది. కూత పెట్టు దూరంలో తేలుతుంది. మళ్ళీ మళ్ళీ మునిగినా అలాగే తేలుతుంది. లోపల చేపలను వేటాడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో, వెంటనే మరో ఇంట్లో ఇలా కాలాగకుండా తిరిగే వాడిని బుడుబుంగ అని అంటారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు.

ప్రశ్న 1.
‘తాత జాగీరు’ జాతీయంలోని చారిత్రక విశేషాలను తెలపండి?
జవాబు:
కష్టార్జితం కాని సంపద, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, నైజాం ప్రభువులు తమ రాజరికాన్ని కాపాడు కోవటానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాటు చేశారు. పటీలు, మావిపటీలు, పట్వారీ, కొత్వాలి వంటివి అనువంశికంగా సంక్రమించేవి. ఈ పనికి జీతం లేకపోయినా ప్రజలను వీళ్ళు ఎంత దోచుకున్నా తమ సొమ్ము ముట్టచెపితే చాలు.

ఆ విధంగా జమీందారులు, జాగీరుదారులు, ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలుండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల భూములు ఉండేవి. ముక్తాదారులంటే ఆ గ్రామమంతా ఆయనదే! ప్రజల వద్ద ఎంత దోచుకున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కప్పం చెల్లిస్తే చాలు. తాత గారి జాగీరును మనమడు అనుభవిస్తున్నట్లు” ఇదేమన్నా నీ తాతగారి జాగీరనుకున్నావా” అన్న జాతీయాలు ప్రయోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఇంటింటికి మంటి పొయ్యి జాతీయంలోని సామాజిక న్యాయాన్ని వివరించండి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఏ ఇంటిలోనైనా మన్నుతో చేసిన పొయ్యి ఉండేది. నాకు ధనమున్నదికదా అని బంగారు పొయ్యి లాడరు కదా! సామాజిక న్యాయం అందరికి ఒక్కటే సమస్యలు లేని ఇల్లుండదు “మాకోడలు కొడుకు మొన్న నలుగురిలో నానామాటలన్నందుకు నల్ల మొఖం అనిపించింది.

బజారుకే రాబుద్ధికావడం లేదు” అంది పొరుగింటావిడ. “ఇంటింటికి మట్టి పొయ్యే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది. నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లమొఖం. ముందటమాకురావా” అని ఓదార్చింది పొరుగింటి ఆవిడ. ఇలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగించబడుతుంది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రశ్న 3.
బట్టకాల్చి మీద వేయడం అంటే ఏమిటి?
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన తెలంగాణ జాతీయాలు” అనుగ్రంథం నుండి గ్రహించబడింది.

బట్టకాల్చి మీద వేయటమంటే నిందలు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగ తనం చేశాడు. నేను నా సొంత బంగామని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను. బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఈ జాతీయం ప్రస్తావించబడుతుంది.

ప్రశ్న 4.
వరిగడ్డిమంట :
జవాబు:
తెలంగాణ జాతీయాలు అను పాఠ్యభాగం వేముల పెరుమాళ్ళుచే రచించబడిన “తెలంగాణ జాతీయాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.

వరిగడ్డి ఎండినదైతే అగ్ని అంటిందే తడవుగా మంటలంటుకుని కాలుతుంది. వాముగా ఉంటే మాత్రం కమ్ముకుని పొగలేచి కుమ్ముగా కాలుతుంది. వంట చెరుకు అంటుకోవటానికి, పొయ్యి రాజుకోవటానికి, చలిమంటలకు బగ్గున లేచే మంటల కోసం వరిగడ్డినే వాడతారు. ఏదైనా వరిగడ్డి బగ్గున మండి బుగ్గయిపోతుంది. మంచివాళ్ళకు వచ్చే కోపం వరిగడ్డి. మంటతో పోలుస్తారు. వారి కోపం వరిగడ్డి మంటాలాంటిది. కొద్దిసేపటిలో మాయపై పోతుంది. అలాంటప్పుడు వరిగడ్డిమంటతో పోలుస్తారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
వేముల పెరుమాళ్ళు విద్యాభాసం ఎక్కడ జరిగింది ?
జవాబు:
రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో జరిగింది.

ప్రశ్న 2.
వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి?
జవాబు:
వేముల పెరుమాళ్ళు వ్రాసిన త్రిశతి పేరు ‘గాంధీమార్గం’

ప్రశ్న 3.
వేముల పెరుమాళ్ళు ప్రసంగాల సంకలనం పేరేమిటి ?
జవాబు:
మానవతా పరిమళాలు

ప్రశ్న 4.
జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది?
జవాబు:
జాతీయాలలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది

ప్రశ్న 5.
జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది?
జవాబు:
గంగలో రాయివంటిది

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రశ్న 6.
“చుక్క తెగిపడ్డట్టు” అనే జాతీయంతో ఒక వాక్యం నిర్మించండి.
జవాబు:
చుక్కమ్మ చుక్క తెగిపడినట్లు చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చింది.

ప్రశ్న 7.
“రామచక్కని” అనే జాతీయాన్ని ఉపయోగించి ఒక వాక్యం తయారు చేయండి.
జవాబు:
శ్రీరాముడు రామచక్కనోడు

ప్రశ్న 8.
“లొల్లిలో లొల్లి” జాతీయం ఆధారంగా ఒక వాక్యం రాయండి?
జవాబు:
రాజకీయ పార్టీలు అవినీతిని గురించి ఇప్పుడు లొల్లిలో లొల్లి చేస్తున్నాయి.

తెలంగాణ జాతీయాలు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : వేముల పెరుమాళ్ళు

పుట్టిన తేదీ : ఆగష్టు 8, 1943

పుట్టిన ఊరు : కరీంనగర్ జిల్లా రాయికల్

తల్లిదండ్రులు : వేముల ఆండాళ్ళమ్మ – రాజయ్యలు

విద్యాభ్యాసం : రాయకల్, కోరుట్ల, జగిత్యాలలో

వృత్తి : గ్రామాభివృద్ధి అధికారి

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

రచనలు :

  1. శ్రీరాజ రాజేశ్వర శతకం
  2. ధర్మపురి నృకేసరి శతకం

బాలసాహిత్యంలో

  1. ‘కిట్టు’ బాలనీతి శతకం
  2. ‘నిమ్మ’ పర్యావరణ శతకం
  3. ‘గాంధీమార్గం’ త్రిశతి
  4. ‘లోగుట్టు’ రాజనీతి చతుశ్శతి

ఆకాశవాణి ప్రసంగాలు

  1. మానవతా పరిమళాలు

మరణం : సెప్టెంబరు 17, 2005

కవి పరిచయం

వేముల పెరుమాళ్ళు కరీంనగర్ జిల్లా రాయికల్ గ్రామంలో ఆగష్టు 5, 1943 జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాళ్ళమ్మ రాజయ్యలు. మాతా మహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు. వీరి విద్యాభ్యాసం రాయకల్ కోరుట్ల జగిత్యాలల్లో జరిగింది. గ్రామాభివృద్ధి అధికారిగా 18 సం॥లు పనిచేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి రాయికల్ మండల అధ్యక్షునిగా పనిచేశాడు. సహకార రంగంలో గీత, పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్, వినియోగ, గృహనిర్మాణ సంఘాలను స్థాపించాడు.

పెరుమాళ్ళు శ్రీరాజరాజేశ్వర, శ్రీధర్మపురి, నృకేసరి శతకాలను ప్రచురించారు. బాల సాహిత్యంలో వీరు బాలనీతి శతకం. ‘కిట్టూ’, పర్యావరణ శతకం ‘నిమ్ము’లు రాశారు. మహాత్ముని మహానీయ సూక్తులను “గాంధీమార్గం” త్రిశతిగా రచించాడు. రాజనీతి చతుశ్శతిగా వీరు “లోగుట్టు” రాశాడు.

1958 నుండి 1968 వరకు సమాజంలో జాతీయ పరిణామాలను పద్యాలుగా రాశాడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ఈయన “మానవతా పరిమళాలు” ప్రసంగాలుగా వెలువడ్డాయి. జీర్ణదేవాలయ పునరుద్ధరణ చేశారు. వీరు సెప్టెంబరు 17, 2005న కాలం చేశారు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

ప్రస్తుత పాఠ్యభాగం “తెలంగాణ జాతీయాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ సందర్భం

వేముల పెరుమాళ్ళు తన తల్లి నోటి నుండి వెలువడే జాతీయాలను విని ప్రేరణ పొంది తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి వాటిని సేకరించారు. జానపద సాహిత్యం గురించి చెపుతూ “జానపద సాహిత్యం కూరాడుకుండలాంటిది. దానిని మైలపరచ కుండా చేసే బాధ్యత మనందరిది. జానపదుడు ఋషి వంటివాడు. జానపదుల నోట వెలువడిన జాతీయం సామెత గంగలో రాయిలాంటిది. తెలంగాణ భాషయాస అర్థం చేసుకుని చదివితే ఆసక్తికరమైన అంశాలు లభిస్తాయి” అంటారు.

తెలంగాణ జాతీయాలను విద్యార్థులకు తెలియచేసే సందర్భంలో ఈపాఠ్యభాగం ఇవ్వబడింది.

పాఠ్యాభాగ సారాంశం

“వేముల పెరుమాళ్ళు జాతీయాలను వివరిస్తూ “జానపద సాహిత్యం” కూరాడు కుండలాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యత మనందరిది. జానపదుడు ఋషసోంటోడు. జానపదుల నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయివంటిది.

ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్ళలో నాని రగిడిల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిలో తరతరాల తెలంగాణా సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్లుంటుంది. తెలంగాణ భాష, యాస, అర్థం చేసుకుని కొంచెం ఓపికగా చదివేవాళ్ళకు ఇందులో ఎన్నో ఆసక్తి కరమైన అంశాలు లభిస్తాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 5 తెలంగాణ జాతీయాలు

జాతీయాలలో వరిగడ్డిమంట, లొల్లిలో లొల్లి, కోటిపండు పుట్టినట్లు, తాతజాగీరు, కుక్కిన పేను, ఏనుగెల్లింది తోకచిక్కింది, వెయ్యికాళ్ళజర్రి, గద్దతన్నుకు పోయినట్లు, పిల్లికి రొయ్యిల మొలతాడు, చుక్కతెగిపడినట్లు, ఎద్దును చూసిమేత వెయ్యాలి, ఊరుగొడ్డుపోలేదు. తూముకాడిపొలం, మొలదారం తెగ, పేర్నాల పెట్టుట మొదలగు ముఖ్యమైన నిత్య వాడుకలో ఉన్న వాటిని వివరించారు.

Leave a Comment