TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సమాసాలు Questions and Answers.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

‘సమర్థంబులగు పదంబులేకపదంబగుట సమాసంబు’ అని చిన్నయసూరి బాల వ్యాకరణంలో సమాస లక్షణాన్ని వివరించాడు.

రెండు లేదా అంతకంటే ఎక్కువపదాలు కలసి ఒకే పదంగా ఏర్పడితే అది సమాసమవుతుంది.

సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తరపదం అని అంటారు. ఈ రెండు పదాల మధ్య వివిధ విభక్తి ప్రత్యయాలను అవసరానికి తగినట్లు చేరిస్తే అది విగ్రహవాక్యం అవుతుంది. ఇది సమాసాన్ని వివరించి, విడమర్చి చెబుతుంది.

ఉదా:
‘సూర్య కిరణాలు’ అనే సమాసపదంలో
పూర్వపదం – సూర్య
ఉత్తరపదం కిరణాలు
విగ్రహ వాక్యం – సూర్యుని యొక్క కిరణాలు.

అర్థపరంగా సమాసాన్ని నాలుగు విధాలుగా విభజిస్తారు. అవి

  1. తత్పురుష
  2. బహుజొహి
  3. ద్వంద్వం
  4. అవ్యయీ భావం

1. తత్పురుష సమాసం:
తత్పురుష సమాసం వ్యధికరణమని, సమానాధికరణమని రెండు విధాలు.

(ఎ) వ్యధికరణ తత్పురుష సమాసం:
‘ద్వితీయాదులకు మీది పదంబు తోడ సమాసంబు వ్యధికరణంబునాబడు’ అని బాలవ్యాకరణంలో చెప్పబడింది. వ్యధికరణం అంటే విభక్తుల ఆధారంగా తయారు చేసే సమాసం. పూర్వపదం ద్వితీయాది విభక్తుల్లో ఉండి, ఉత్తర పదం ప్రథమావిభక్తిలో ఉంటుంది. ఇది ద్వితీయా తత్పురుష నుండి సప్తమీ తత్పురుష వరకు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

  1. ద్వితీయా తత్పురుషం: పూర్వపదం ద్వితీయా విభక్తిలో ఉండాలి.
    ఉదా: వేషధారి = వేషమును ధరించినవాడు
  2. తృతీయా తత్పురుషం: పూర్వపదం తృతీయా విభక్తిలో ఉండాలి.
    ఉదా: విద్యాధికుడు = విద్యచేత అధికుడు
  3. చతుర్థీ తత్పురుషం: పూర్వపదం చతుర్థి విభక్తిలో ఉండాలి.
    ఉదా: యజ్ఞవేదిక = యజ్ఞం కొరకు వేదిక
  4. పంచమీ తత్పురుషం: పూర్వపదం పంచమీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: పాపభీతి = పాపము వలన భీతి
  5. షష్ఠీ తత్పురుషం: పూర్వపదం షష్ఠీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: మాటతీరు = మాట యొక్క తీరు
  6. సప్తమీ తత్పురుషం: పూర్వపదం సప్తమీ విభక్తిలో ఉండాలి.
    ఉదా: మనోవేదన మనసు నందలి వేదన
  7. నజ్ తత్పురుష: వ్యతిరేకార్థాన్ని బోధించేది.
    ఉదా: అనంతం = అంతం లేనిది

(బి) సమానాధికరణం:
‘విశేషణంబునకు విశేష్యంబు తోడ సమానంబు సమానాధికరణంబు నాబడు” అని బాలవ్యాకరణంలో చెప్పబడింది. తత్పురుషలోని సమానాధి కరణ సమాసానికే కర్మధారయ సమాసమని పేరు. సమానాధికరణంలో సమాసంలోని రెండు పదాలలో ఒకటి విశేషణం, మరొకటి విశేష్యం (నామవాచకం) అవుతుంది. మరికొన్ని సార్లు ఒకపదం ఉపమానం మరోపదం ఉపమేయం అవుతుంది. ఇలా రెండు పదాలు సమానమైన ఆధారంతో ఉండటం సమానాధికరణం.

(i) విశేషణ పూర్వపద కర్మాధారయం:
ఈ సమాసంలోని రెండు పదాలలో మొదటి పదం విశేషణం. రెండవ పదం విశేష్యంగా ఉంటుంది.
ఉదా:

  • మధురోక్తులు = మధురమైన ఉక్తులు
  • ఎర్రగులాబి = ఎర్రనైన గులాబి
  • దివ్యాత్మ = దివ్యమైన ఆత్మ

పై ఉదాహరణల్లో పూర్వపదం విశేషణం. అందుకే ఈ సమాసానికి విశేషణ పూర్వపద సమాసమని పేరు.

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(రిరి) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం:
విశేషణం ఉత్తరపదంలో ఉండి, విశేష్యం (నామవాచకం) పూర్వపదంలో ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది.
ఉదా:

  • పురుషోత్తముడు = ఉత్తముడైన పురుషుడు
  • కపోతవృద్ధము = వృద్ధమైన కపోతము
  • పండిత శ్రేష్ఠుడు = శ్రేష్ఠుడైన పండితుడు

ఈ సమాసంలో విశేషణం ఉత్తరపదంగా ఉన్నా, విగ్రహవాక్యంలో మాత్రం విశేషణం ముందు రాయాలి. విశేష్యం తరువాత రాయాలి.

(iii) విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం:
ఈ సమాసంలో పూర్వపదం, ఉత్తర పదం రెండూ విశేషణాలుగా ఉంటాయి.
ఉదా:

  • మృదుమధురం = మృదువైనది, మధురమైనది
  • ధీరోదాత్తుడు = ధీరుడును, ఉదాత్తుడును
  • శీతోష్ణములు = శీతమును, ఉష్ణమును

(iv) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
సమాసంలోని పూర్వపదం ఉపమానంగాను, ఉత్తర పదం ఉపమేయంగాను ఉంటుంది.
ఉదా:

  • తేనెపలుకులు = తేనె వంటి పలుకులు
  • బంగారుమాట = బంగారము వంటి మాట
  • హంసనడక = హంస వంటి నడక

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(v) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం:
సమాసంలోని ఉత్తరపదం ఉపమానం, పూర్వపదం ఉపమేయం అవుతుంది.
ఉదా:

  • పాదపద్మాలు = పద్మాల వంటి పాదాలు
  • ముఖారవిందము = అరవిందం వంటి ముఖము
  • ముఖచంద్రుము = చంద్రుని వంటి ముఖము

(vi) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం:
సంభావన అనగా సంజ్ఞ. సంజ్ఞా వాచకం పూర్వపదంగా గల కర్మధారయ సమాసాన్ని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమంటారు.
ఉదా:

  • ద్వారకానగరం = ద్వారక అనే పేరుగల నగరం
  • గంగానది = గంగ అనే పేరుగల నది
  • మామిడి చెట్టు = మామిడి అనే పేరుగల చెట్టు

(vii) అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం:
దీనికే రూపక సమాసం అని పేరు. ఇందులో ఉపమేయం పూర్వపదంగా, ఉపమానం ఉత్తరపదంగా ఉంటుంది. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పబడుతుంది.
ఉదా:

  • కవితాసుధ = కవిత అనెడి సుధ
  • ఆశాసౌధం = ఆశయనెడి సౌధం
  • కాలచక్రం = కాలమనెడి చక్రం

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

(viii) ద్విగు సమాసం:
సంఖ్యాపూర్వక కర్మధారయం ద్విగువు. సంఖ్యాపూర్వక విశేషణం ముందుగా వున్న సమాసం ద్విగు సమాసం.
ఉదా:

  • ముల్లోకములు = మూడైన లోకములు
  • అష్టదిగ్గజాలు = అష్ట సంఖ్య గల దిగ్గజాలు
  • పంచభూతాలు = పంచ సంఖ్య గల భూతాలు

2. బహువ్రీహి సమాసం:
‘అన్యపదార్థ ప్రధానో బహుబ్లి హిః’. ‘అన్యపదార్థం’ అంటే సమాసంలోని పూర్వపదం, ఉత్తరపదాల అర్థాలు కాకుండా ఈ రెండు పదాలు కలిసి ఇచ్చే మరో అర్థం. దానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉదా:

  • ముక్కంటి = మూడు కన్నులు కలవాడు
  • మధురవాణి = మధురమైన వాక్కు కలది
  • మహాత్ములు = గొప్ప ఆత్మ కలవారు

3. ద్వంద్వ సమాసం:
ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ద్వంద్వ సమాసం. అంటే సమాసం లోని పూర్వపదం, ఉత్తరపదం రెండు పదాల అర్థాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది.
ఉదా:

  • సీతారాములు = సీతయును, రాముడును
  • భయభక్తులు = భయమును, భక్తియును
  • తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును

TS Inter 1st Year Telugu Grammar సమాసాలు

4. అవ్యయీభావ సమాసం:
‘అవ్యయం’ అంటే లింగ, వచన, విభక్తుల వల్ల ఎటు వంటి మార్పుకు గురికాని పదం. అటువంటి పదాలు పూర్వపదంలో ఉంటే అది అవ్యయీభావ ‘సమాసం అవుతుంది.
ఉదా:

  • యథాశక్తి = శక్తి ననుసరించి
  • ప్రతి దినము = దినము దినము

Leave a Comment