Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Lesson ఇన్సానియత్ Textbook Questions and Answers.
TS Inter 1st Year Non-Detailed 4th Lesson ఇన్సానియత్
ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న 1.
ఇన్సానియత్ కథలోని సందేశాన్ని చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ కథ డా. దిలావర్ చే రచించిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రిస్తుంది. కులమత బేధం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు పరస్పర సహకారాలు సహజీవన సంస్కృతిని తెలియచేస్తుంది.
కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం శ్రీ వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతంలోకి వ్యాపించ టం ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్న ఉన్నత మానవీయ సంబంధాలను ఈ కథ తెలియచేస్తుంది. వర్తమాన సమాజంలో లుప్త మౌతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ కథ సూచిస్తుంది.
రాంరెడ్డి సుబానీలు పేకాడుతున్నారు. సుబాని చేతిలో రాంరెడ్డి ఓడిపోతున్నాడు, అతడు పేకాటలో ఓడిపోతున్నట్టు లేదు. తన దర్జా దర్పం ఒక్కొక్క మెట్టు దిగ జారిపోతున్నట్టుగా ఉంది. అంతవరకు పేకాటలో రాంరెడ్డిని ఓడించినవాడు లేడని ప్రతీతి పొందాడు. సుబాని ఈనాడు రాంరెడ్డిని బట్టలూడదీసి నడిబజార్లో నిలబెట్టినట్టుంది. తట్టుకోలేక ఎన్నెన్నో అన్నాడు దానికి ఎంకన్న వంతు పాడాడు.
“ఒక్క పేకాటే కాదు మల్ల ఇంకే ఆటైనా గంతే. కిర్కెట్లో పాకిస్తాన్ అగరబాగెలిస్తే పండగచేస్కుంటారు”
“నువ్వెన్ని జెప్పు… వీళ్ళంతా గంతే…. తినేది ఇండియా సొమ్ము… పాడేది పాకిస్తాన్పట” కసిగా అన్నాడు రాంరెడ్డి. సుబానీకి “కండ్లపొంటి నీల్లు గిర్రున తిర్గుతాంటి. సుబాని దిగులుగా ఇంటికి చేరిండు. తల్లి అతని దిగులు గమనించి ఏమయిందని అడిగింది. రాంరెడ్డి అన్న మాటలన్నీ చెప్పిండు సుబాని. ఆ తరువాత సంఘటనలో సుబానీకి యాక్సిడెంట్ అయింది. రాంరెడ్డి కొడుక్కి కిడ్నీఫెయిలయింది. రాంరెడ్డి అడగలేక అడగలేక సుబానీ తల్లిని తన కుమారునికి ప్రాణభిక్ష పెట్టమని కోరాడు.
సుబానీ తల్లి రాంరెడ్డిని “మర్ది కడుపుకోత ఎట్ల అగులు గుబులుగా ఉంటుందో అనుభవిస్తున్న. నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుక్కొవాలె. నా కొడుకును మట్టెల గల్పుకుంటున్న, గా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కానికి మోక ఉంటే ఎందుకడ్డంబడాలె” అన్నది.
అపుడు రాంరెడ్డి! “సుబానీ! నీ తోని నేనొక్క పేకాటల్నే వోడిపోయిన అనుకున్న. గనినీ సావుసుత నన్ను ఓడిచ్చింది. మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గని కులాలు మతాలూ కావని సుత సాటి చెప్పినవ్” అన్నాడు. మానవత ముందు ఏదైనా తలవంచాల్సిందేని ఇన్సానియత్ కథ చెప్తుంది.
ప్రశ్న 2.
పాతిమా గొప్ప మనసును వివరించండి ?
జవాబు:
ఇన్సానియత్ కథ ‘డా. దిలావర్’ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్ని ఆత్మీయ మానవ సంబంధాలను చిత్రించింది. వాటికి ‘ఫాతిమా’ గొప్ప మనసు ఒక, నిధర్శంగా నిలుస్తుంది.
ఫాతిమా సుబానీ తల్లీ, సుబాని, రాంరెడ్డి, కాపోల్ల ఎంకన్నలు పేకాడుకుంటారు. సుబాని చేతిలో వారు ప్రతి ఆట ఓడిపోయారు. రాంరెడ్డి ఇజ్ఞత దెబ్బతింది. సుబానీని నానా మాటలూ అన్నాడు. ఆ దిగులుతో ఇంఇకి వచ్చిన సుబానీని తల్లి ఫాతిమా ఏం జరిగిందని అడిగింది. రాంరెడ్డి అన్నమాటలన్నీ సుబాని తల్లికి చెప్పాడు. రోజులు మారిపోయాయి అనుకుంది ఫాతిమా!
పల్లెకు రజాకార్లోత్తే ఊరోల్ల స్థానానికి తన పానం అడ్డమేసుండు మీ బాపు. ఊరోల్ల మీ బాబును పానానికిపానంగా చూసుకునేటోల్లు. ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎడం పెరుగుతుంది. మనమే మనకు పరాయిల్లెక్క కండ్ల బడన్నమ్” గీ దుష్మనీ, కచ్చలు, నరుక్కోటం సంపుకోటం, మత పిచ్చిగాల్లు రామ్ .రహీమ్ల నడ్మ చిచ్చుపెట్టడం· గియన్ని ఎన్నటి జమానలమేం ఎరగంబిడ్డా! ఒకలకు ఆసకొత్తే ఒకల్లు ఆదుకునే టోల్లు.
సుబానీకు యాక్సిడెంటైనా సమయాన తన కొడుకు ఎలానూ బ్రతకడు. ‘రాంరెడ్డి కొడుకన్నా బతికితే అంతేచాలు అని అనున్నది పాతిమా!
“మర్దీ సీమకు సుత అపకారం చెయ్యాలి. నా కొడుకుని చూసి ఓర్వలేక తీస్కపోతన్నడు” అని తన బాధను రాంరెడ్డి వద్ద వెళ్ళపోసుకుంది.
అప్పుడు రాంరెడ్డి ఫాతిమా!” గిసుంటి ఆపతిల తల్లి మనసు ఎంత తండ్లాడ్తదో నాకెర్క లేదు కాదు. జర అటు ఇటు నేను సుత నీవోల్లెనె ఉన్న. ఎంకెట్రెడ్డి సావు బతుకుల్ల ఉన్నాడు. గాని పానాలు గిప్పుడు మీ చేతుల్లవున్నయ్” నా కొడుకు కిడ్నీలు పూరాగా పాడైపోయినయ్. పన్నెండు గంటల్లో ఏరే కిడ్నీలు దొరక్కుంటే నా ఒక్కగానొక్క కొడుకు నాకు దక్కడు. ఫాతిమా! నీకు చేతులెత్తి మొక్కుత! సుబాని కిడ్నీలు…. అని రాంరెడ్డి గొంతుక పూడిపోయి మాట రాలేదు.
ఫాతిమా ఒక్కసారి షాక్ అయింది. సుడిగాలికి ఎండు టాకులా వణికింది.
“మర్షీ! కడుపుకోత ఎట్లు అగులు బుగులుగ ఉంటుందో అనుబగిత్తన్నా! నా కడుపు కాలినట్లు ఇంకొకల్లకు ఎందుకు కావాలె? నా కొడుకును మట్టిలో గల్పుకుంటన్నగా మట్టిల్నుంచి ఒక చిన్న మొక్క పానం బోస్కోనికి మోక వుంటే ఎందుకడ్డబడాలె! నాకొడుకు పానం అసుమంటిదే నీ కొడుకు పానం. నా కొడుకు హయత్సుత బోస్కోని నీ కొడుకు నిండు నూరేండ్లు బత్కొలె! గందుకునన్నే జెయ్యమంటే గజేస్త…. అన్నది ఫాతిమా!
ఫాతిమా మనసు…. మనిషికి కావలసింది. ఇన్సానియత్ గాని కులాల మతాలు కావని” చెప్పకనే చెప్పింది. ఇంతటి గొప్ప మనసు ఫాతిమావంటి తల్లులకు ఎప్పుడూ ఉంటుంది.
ప్రశ్న 3.
ఈ కథ ఆధారంగా హిందూ ముస్లిం మతస్థుల మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధాలను చర్చించండి?
జవాబు:
‘ఇన్సానియత్’ అను పాఠ్యభాగం డా. దిలావర్ చే రచించబడిన “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఈ కథ గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఆత్మీయ మానవ సంబంధాలను తెలియ చేస్తుంది. కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలందరి మధ్య నెలకొన్న స్నేహాలు, వరుసలు, పరస్పర సహకారాలు, సహజీవన సంస్కృతిని తెలియపరస్తుంది.
కాలక్రమేణ నగరాల్లోని స్వార్థం, కులాభిమానం, మతోన్మాదం వికృతరూపం దాల్చి గ్రామీణ ప్రాంతాలలోకి వ్యాపించడం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న ఉన్నతమైన మానవీయ అనుబంధాలను ఈ కథ వివరిస్తుంది. వర్తమాన సమాజంలో లుప్తమవుతున్న ఆదర్శాలను విలువలను తెలుపుతూ కులమత దురభిమానాలపై ఆత్మవిమర్శ చేసుకోమని తెలియచేస్తుంది.
పూర్వం గ్రామాలలోని ప్రజలంతా కుల మత భేదం లేకుండా అందరూ అందర్నీ అత్తా, అక్కడ, బావా, అత్తా,మద్దీ, మామ అని పిలుచుకునేవారు. వారి మధ్య ప్రేమాభిమానాలకు కుల మతాలు అడ్డు వచ్చేవికావు. ఎంతపెద్ద కులంలో పుట్టినా వారిలో కూడా మిగిలిన వారి పట్ల ఆత్మీయానురాగాలు ఉండేవి. ఒకరినొకరు చక్కగా గౌరవించుకునేవారు. దీనికి నిదర్శనం, ఈ కథలోని రాధమ్మత్త, సోందుబాబుల మధ్య జరిగిన సంభాషణలే!
ముస్లిం అయిన సోందుబాబు హిందువైన రాధమ్మను అత్తమ్మా అని పిలవడం ఉదాహరణ..
“ఏం! రాధత్తమ్మా! అంత మంచేనా!” అని సోందుబాబు అంటే
“బానే ఉన్న పోరగా! మీరంతా మంచేనా” అని రాధమ్మ అనటంలో వారి మధ్య ఉన్న ఆప్యాయత అను రాగాలు మనకు అర్థమౌతాయి.
అలాగే పాతిమా రాంరెడ్డిని “మర్దీ! సీమకు సుత అపకారం చెయ్యని నా కొడుకుని చూసి ఓర్వలేక అల్లా తీస్కపోతన్నడు” అనడం ముస్లిం హిందూ కుటుంబాల మధ్య ఉన్న. ఆత్మీయతా, అనుబంధాలకు ఒక నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది”.
“మర్షీ! కడుపుకోత ఎట్ల అగులు బుగులుగ ఉంటదో అనుబగిత్తన్నా! నా కొడుకును మట్టిల గల్పుకుంటున్నా. నా కొడుకు పానం వంటిదే నీ కొడుకుపానం” నా కొడుకు హయత్ సుత బోస్కొని నీ కొడుకు నిండు నూరేళ్ళు బత్కాలే” అనటం “మనిషికి కావల్సింది. ఇన్సానియత్ గాని కులము మతము కాదన్న మానవతను, ఆత్మీయ అనుబంధాలను తెలియచెప్తుంది.
ఇన్సానియత్ Summary in Telugu
రచయిత పరిచయం
రచయిత పేరు : డా॥ దిలావర్
పుట్టిన తేదీ : జూన్ 5, 1942
పుట్టిన ఊర : ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం కమలాపురం
తల్లిదండ్రుల : మహబూబీ, మహమ్మద్ నిజాముద్దీన్ –
చదువు : ఎం.ఏ., బి, పిహెచ్.డి.
పరిశోధన : దాశరథి కవితావ్యక్తిత్వం పరిశీలన, – తెలుగు విశ్వవిద్యాలయం నుండి
రచనలు :
- వెలుగుపూలు, వెన్నెల కుప్పలు, జీవన తీరాలు, కర్బలా, కవిత సంపుటాలను రాశారు.
- ‘ప్రణయాంజలి’ పద్యకావ్యం
- ‘రేష్మా ఓ రేష్మా’ పేరుతో వచన కావ్యం
- ‘గ్రౌండ్ జీరో’ సామ్రాజ్యవాద వ్యతిరేక దీర్ఘకవిత.
- సమిధలు, ముగింపు నవలలు
- ‘దూరాల చేరువులో’ వ్యాస సంపుటి
- మచ్చుబొమ్మ, చంద్రుడుగీయని చిత్రాలు కథా సంపుటాలు
ప్రస్తుత పాఠ్యభాగం : “మచ్చుబొమ్మ” కథా సంపుటి నుండి గ్రహించబడింది.