TS Inter 1st Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 2nd Lesson రాజ్యం, సార్వభౌమాధికారం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 2nd Lesson రాజ్యం, సార్వభౌమాధికారం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాన్ని నిర్వచించి, దానికి గల మౌలిక లక్షణాలను చర్చించండి.
జవాబు.
పరిచయం :
రాజ్యం అనేది ఒక రాజకీయ సంస్థ. ఇది సార్వభౌమాధికారం గల అతిశక్తివంతమైన సంస్థ. అందువల్ల రాజ్యానికి రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్యం సమాజంలోని అన్ని సాంఘిక, రాజకీయ సంస్థలన్నింటికంటే ఉన్నతమైనది.

అర్థం :
రాజ్యం అనే పదం మొట్టమొదటిసారిగా 16వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. ఇటలీ రాజనీతి తత్వవేత్త నికోలో మాకియవెల్లి 1513లో తన గ్రంథమైన “ప్రిన్స్”లో “లా స్టాటో” అనే ఇటలీ పరిభాషను ‘స్టేట్’కు పర్యాయపదంగా వాడాడు. అతని ఉద్దేశంలో స్టేట్ అంటే రాజకీయ శక్తి అని అర్థం.

ఆ తరువాత ఆంగ్లపదం ‘స్టేట్’ విరివిగా వాడుకలోకి వచ్చి విస్తృతంగా చర్చించారు. 18వ శతాబ్దం నాటికి రాజ్యం ఒక మానవ నిర్మిత వ్యవస్థగా బహుళ ఆదరణ పొంది విశ్వజనీన సంస్థగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిర్వచనాలు :
రాజ్యం అత్యంత ఆవశ్యకమైన విశ్వజనీన సంస్థ. అందువల్ల రాజనీతిశాస్త్ర అధ్యయనంలో దాని ప్రాధాన్యత మరింత పెరిగింది. అయితే, అనేక మంది రాజనీతి శాస్త్రవేత్తల మధ్య నిర్వచనాలపై ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే గాణ్య స్వభావానికి సంబంధించి భిన్న అభిప్రాయాలుండడం వల్ల దాని నిర్వచనంపై ఏకాభిప్రాయంలేదు. ప్రతి రాజనీతి శాస్త్రవేత్త తనదైన దృక్కోణంలో నిర్వచించడానికి ప్రయత్నించారు.

గార్నర్ :
“ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిరనివాసులై, స్వతంత్రులుగా, వ్యవస్థాపూర్వక ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ప్రజా సముదాయమే రాజ్యం”గా ‘నిర్వచించారు.

బ్లంట్ షిల్లీ :
“నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం” అని వర్ణించారు.

ఉడ్రో విల్సన్ :
“నిర్ణీత భూభాగంలో శాసన బద్ధమైన జీవితానికి సంఘటితం కాబడిన ప్రజలే” రాజ్యమని నిర్వచించారు.

హెచ్.జె. లాస్కీ:
“ఒక నియమిత భౌగోళిక ప్రాంతంలో ప్రభుత్వంగా, పాలితులుగా విభజితమై ఇతర సంస్థలన్నింటి మీద ఆధిక్యం కలిగి ఉండే ప్రాదేశిక సంఘమే రాజ్యం” అని నిర్వచించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

రాజ్యం-మౌలిక లక్షణాలు :
పైన ఉదహరించిన నిర్వచనాలను నిశితంగా పరిశీలించినట్లయితే రాజ్యానికి నాలుగు ప్రధాన లక్షణాలున్నట్లు మనకు బోధపడుతుంది. అవి : 1. ప్రజలు, 2. ప్రదేశం, 3. ప్రభుత్వం, 4. సార్వభౌమాధికారం. ఈ నాలుగు లక్షణాలతోపాటు ఇటీవల కాలంలో రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అవసరమని భావించటం జరిగింది.

1. ప్రజలు :
రాజ్యం ఒక మానవ సంస్థ కాబట్టి ప్రజలులేనిదే రాజ్యంలేదు. ప్రజలు రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో మొట్టమొదటిది. ప్రజలులేని రాజ్యం మనుగడను కలిగి ఉండదు. అందువల్ల కొందరు పాలించడానికి మరికొందరు పరిపాలించబడటానికి రాజ్యంలో ఉండాలి.

మానవ సముదాయంలేని ఎడారి ప్రాంతాన్ని మనం రాజ్యంగా భావించలే. రాజ్యంలోని ప్రజలు పలురకాల వర్గాలకు, తెగలకు చెందినవారై భిన్న ఆచార సంప్రదాయాలను అలవాట్లను, అదే విధంగా, అనేక దృక్పథాలను, అభిప్రాయాలను కలిగి ఉంటారు.

రాజ్యంలో ఎంత జనాభా ఉండాలనే దానిపై రాజనీతి శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. గ్రీకు తత్త్వవేత్త ప్లేటో తన గ్రంథమైన “దిలాస్”లో 5040 మంది జనాభా కలిగి ఉన్న రాజ్యం ఆదర్శ రాజ్యమన్నాడు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యవాది, చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలు ఉండాలని భావించిన ఫ్రెంచి తత్త్వవేత్త రూసో, రాజ్యంలో పదివేల జనాభా ఉండవచ్చునన్నాడు.

స్వయం పోషకత్వానికి, సమర్థపాలనకు సరిపడా జనాభా మాత్రమే ఉండాలని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ, రాజ్యవనరులకు, విస్తీర్ణతకు మించిన జనాభా ఉండకూడదు అనేది అందరి అభిప్రాయం.

2. ప్రదేశం :
ప్రదేశం లేదా భూభాగం అనేది రాజ్యానికి గల రెండవ లక్షణం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రజలు నివసించనట్లయితే దాన్ని రాజ్యంగా పరిగణించలేం: నోమడ్స్, జిప్సీలు వంటి తెగలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి నిరంతరం వలస వెళుతున్నందున వారు ఒక రాజ్యపరిధిలో నివసించినట్లు భావించలేం. ప్రదేశం అనేది రాజ్యానికి సంబంధించిన ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది.

ఆ ప్రదేశం ప్రభుత్వ అధీనంలో ఉండి దానిపై సార్వభౌమాధికారంతో కూడిన నియంత్రణాధికారం ఉంటుంది. ప్రదేశం రాజ్యం నుంచి విడదీయలేనటువంటిది. -ప్రదేశం ప్రజల మధ్య సహోదర భావాన్ని సమైక్యతను ఏర్పర్చి రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని అందిస్తుంది.

ప్రదేశం ఒక నిర్దిష్ట భూభాగమే కాకుండా దాని పరిధిలో సారవంతమైన నేలను, పర్వతాలను, నదులను, సరస్సులను అనేక ఇతర వనరులను కలిగి ఉంటుంది.

అదే విధంగా, ఆకాశంలో కొంత భాగాన్ని ఆ రాజ్య ప్రాదేశిక వియత్తలంగాను, అట్లాగే ఆ రాజ్యానికి సముద్రతీరం ఉన్నట్లయితే కొంత దూరాన్ని ప్రాదేశిక జలాలుగాను భూభాగంతోపాటు రాజ్యానికి హద్దులుగా నిర్ణయిస్తారు. గతంలో ప్రాదేశిక జలాల దూరం 3 నాటికల్ మైళ్ళుగా ఉండేది నేడు అది 12 నాటికల్ మైళ్ళదూరంగా గుర్తించబడింది.

3. ప్రభుత్వం :
రాజ్యానికి ప్రభుత్వం మూడవ మౌలిక లక్షణం. ప్రభుత్వమనేది ఒక రాజకీయ సంస్థగా ప్రజల కార్యకలాపాలను నియంత్రిస్తూ మార్గనిర్దేశకం చేస్తూ వారి మధ్య ఉత్పన్నమయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది.

రాజ్యం తన విధివిధానాలను, అభిప్రాయాన్ని ప్రభుత్వం ద్వారా అమలుపరుస్తుంది. ప్రభుత్వం ద్వారా రాజ్యం తన ఉనికిని కొనసాగిస్తుంది. గార్నర్ అనే రాజనీతి పండితుడు “ప్రభుత్వం రాజ్యానికి ఒక సాధనంగా ప్రజలందరిని ఉద్దేశించి రూపొందించిన విధానాలను, పథకాలను అమలుపరుస్తూ ప్రజలందరి ప్రయోజనాలను కాపాడే వ్యవస్థ”గా అభివర్ణించాడు.

ప్రభుత్వం, ఒక సాధనంగా రాజ్య అభీష్టాన్ని అమలుపర్చే కార్యంలో నిమగ్నమౌతుంది. అందువల్ల ప్రభుత్వంలేని రాజ్యాన్ని ఊహించలేం. ప్రభుత్వంలేని రాజ్యంలో ప్రజలు అసంఘటితంగా, అశాంతి అభద్రతా భావంతో అరాచకస్థితిలో నివసిస్తారు.

సమష్టి ఆలోచనలుగాని, సమిష్టి నిర్ణయాలు గాని, సమష్టి ప్రయోజనాల సాధనకై ప్రయత్నాలుగాని చేయలేని పరిస్థితిలో శాంతి భద్రతలు లోపించి చట్టాలను అతిక్రమించటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాసంక్షేమం దృష్ట్యా నిర్దిష్ట ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ఆవశ్యకమైంది.

4. సార్వభౌమాధికారం :
సార్వభౌమాధికారం రాజ్యానికి గల నాలుగవ అతిముఖ్యమైన మౌలిక లక్షణం. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం ఉన్నా సార్వభౌమాధికారం లేనట్లయితే రాజ్యం ఏర్పడదు. రాజ్యానికి గల ఈ మౌలిక లక్షణమే ఇతర సంస్థలన్నింటికంటే రాజ్యానికి ఉన్నతమైనదిగా గుర్తింపును కలిగిస్తుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే ఉండే లక్షణం.

సార్వభౌమాధికారం రాజ్యానికి గల సర్వాధికారాలకు నిదర్శనం. రాజ్యానికి గల తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారం. ఇది ఒక్క రాజ్యానికి మాత్రమే గల అధికారం. ఈ అధికారం వల్లనే సర్వస్వతంత్రత కలిగిన వ్యవస్థగా రాజ్యం గుర్తించబడింది.

సార్వభౌఉకారం, రాజ్యంపై విదేశీపరమైన నియంత్రణలు లేని స్వతంత్ర వ్యవస్థగా, రాజ్యంలోని వ్యక్తులపై సంస్థలపై నళిక ప్రదేశంపై తిరుగులేని అధికారాన్ని చలాయించే శాసనాధికారాన్ని కల్పిస్తుంది. అంతేకాదు.

రాజ్యం అమలుపరచదలుచుకున్న అన్ని రకాల కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగేటట్లుగాని, ప్రజలు రాజ్యానికి విధేయులుగా ఉండేటట్లుగాని చేయడంలో సార్వభౌమాధికారానికి మించినదేదీలేదు. రాజ్యానికి మాత్రమే ఉన్న ఈ సార్వభౌమాధికారం రాజ్యాన్ని ఇతర సంస్థలన్నింటికంటే ఉన్నతమైన, విశిష్టమైనదిగా నిలబెడుతుంది.

మరోవిధంగా చెప్పాలంటే, సార్వభౌమాధికారం రెండు రకాల రూపాలను కలిగి ఉంటుంది. ఒకటి, రాజ్యపరిధిలోని వ్యక్తులపై, సంస్థలపై చలాయించే శాసనాధికారం అంతర్గత సార్వభౌమత్వం కాగా, విదేశీ విధానంలో రాజ్యం ప్రదర్శించే స్వతంత్రత బాహ్య సార్వభౌమత్వం రెండవది అవుతుంది.

అంతర్జాతీయ గుర్తింపు :
అంతర్జాతీయ గుర్తింపు అనేది ఇటీవల కాలంలో రాజ్య మౌలిక లక్షణాలలో ఒకటిగా గుర్తించబడింది. ఆధునిక కాలంలో అనేక జాతీయ రాజ్యాలు, అంతర్జాతీయ సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. అందువల్ల కొంతమంది రాజనీతి పండితులు అంతర్జాతీయ గుర్తింపు అత్యంత ఆవశ్యకమైనదిగా భావించాలన్నారు. ఎందుకంటే

ఏ రాజ్యమైనా ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. కాని అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడినప్పుడే దానికి గల అధికారాలు చెల్లుబాటు అవుతాయి. ఒక సార్వభౌమాధికార రాజ్యాన్ని మరో సార్వభౌమాధికార రాజ్యం గుర్తించిననాడే దాని మనుగడ కొనసాగుతుంది. అంతర్జాతీయ గుర్తింపు అనేది ప్రపంచ సంస్థయైన ఐక్యరాజ్యసమితి ద్వారా లభిస్తుంది.

ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా గుర్తింపు పొందడం ద్వారా ఆ రాజ్యానికి సంబంధించిన సార్వభౌమాధికారం ఇతర రాజ్యాల చేత ఆమోదం పొందుతుంది. ఈ విధంగానే నూతన రాజ్యాలు ఏర్పడతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 2.
ఏకత్వ సార్వభౌమాధికారాన్ని వివరించండి.
జవాబు.
జాన్ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం : 18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ట్రుడెన్స్” (1832)లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు.

తన కంటే ముందున్న థామస్ హాబ్స్, జెర్మి బెంథామ్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు. ఆస్టిన్ సిద్దాంతాన్ని “నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని” కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం – ముఖ్య లక్షణాలు :
1. ఇది నిశ్చయాధికారం :
ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికి లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం.

2. సార్వభౌమాధికారి ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు :
సమాజంలోని ప్రజలందరు తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడిగాని, ప్రలోభంగాని ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు.

3. సార్వభౌమత్వం అవిభాజ్యం:
సార్వభౌమాధికారం విభజించడానికి లులేనటువంటిది. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులుండవు. శాసనాలకు మూలాధారం సార్వభౌముడు.

4. సార్వభౌమాధికారం ఆవశ్యకమైంది :
రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అల్మ ‘అవసరమైంది. సార్వభౌమత్వం లేని సమాజం, రాజకీయంగాని స్వతంత్రతగాని లేని సమాజమౌతుంది.

5. చట్టమే తుది ఆజ్ఞ :
సార్వభౌముని ఆజ్ఞే చట్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే సార్వభౌమాధికారం ‘ నిరపేక్షమైంది, నిర్దిష్టమైంది, స్పష్టమైంది, అపరిమితమైంది కాబట్టి.

6. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు :
రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం విమర్శ:
ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ సార్వభౌమాధికారాన్ని ఎంతో మంది రాజనీతి పండితులు విమర్శించారు. ముఖ్యంగా ప్రజాస్వామికవాదులు, బహుతావాదులు విమర్శించారు.

వారిలో ప్రముఖంగా ఎ.వి.డైసీ, హెచ్.జె. లాస్కీ, జె.సి. గ్రే, హెన్రీమెయిన్, సివిక్ మొదలైన వారు ముఖ్యులు. కింది అంశాల ఆధారంగా వారు విమర్శించారు.

1. ఇది చారిత్రికమైంది కాదు :
హెన్రీమొయిన్ అభిప్రాయంలో ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికారానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.

2. ప్రజాస్వామ్య వ్యతిరేకం:
ఆస్టిన్ సిద్దాంతం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, జీవనానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.

3. నిరపేక్ష సార్వభౌమాధికారం హానికరం :
ఆధునిక ప్రజాస్వామ్యదేశాలలో నిరపేక్ష, అపరిమిత సార్వభౌమాధి కారమనేది ఏ రూపంలో ఉన్నా హానికరమైనటువంటిది. ఎందుకంటే, నిరపేక్ష సార్వభౌమాధికారి బాధ్యతారహితంగా పాలించే అవకాశముంది.

4. సార్వభౌమత్వ ఉనికిని గుర్తించడం కష్టం:
ఆస్టిన్ అభిప్రాయంలో సార్వభౌమాధికారం అవిభాజ్యం. ఈ అభిప్రాయాన్ని బహుతావాదులు అంగీకరించలేదు. అమెరికా, భారతదేశం వంటి సమాఖ్య రాజ్యాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాన్ని విభజించడం జరుగుతుంది. కాబట్టి సమాఖ్య రాజ్యాలలో సార్వభౌమాధికారం ఎక్కడుందో గుర్తించడం కష్టమని లాస్కీ వ్యాఖ్యానించాడు.

5. రాజ్యం సర్వోన్నతమైంది కాదు :
ఆస్టిన్ రాజ్యాన్ని సర్వోన్నతమైన సంస్థగా పరిగణించాడు. కానీ వాస్తవంగా సమాజంలో రాజ్యంతో పాటు వివిధ రకాల సంఘాలు కూడా ఎన్నో రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయని బహుతావాదుల వాదన. వీరి అభిప్రాయంలో వ్యక్తి వికాసానికి రాజ్యమెంత అవసరమో ఇతర సంఘాలు కూడా అంతే అవసరం.

6. ఆచార, సంప్రదాయాల ప్రాధాన్యతను విస్మరించడం :
ఆస్టిన్ సిద్ధాంతం ప్రకారం శాసనాలకు సార్వభౌముడి అధికారం మూలం. అయితే శాసన నిర్మాణంలో ప్రజల ఆచార, సంప్రదాయాలు ప్రాచీనకాలం నుంచి ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని ఆస్టిన్ విస్మరించాడు.

పైన వివరించిన విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతానికి రాజనీతిశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 3.
బహుత్వ సార్వభౌమాధికారాన్ని వివరించండి.
జవాబు.
బహుతావాద (బహుత్వవాద) సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, సమాఖ్య సిద్దాంత స్ఫూర్తి. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతావాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి.

వాన్ గిర్కే (1844 – 1925) : మొట్టమొదటిసారి బహుతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత మెట్లాంగ్, బార్కర్, జి.డి.హెచ్. కోల్, హెచ్.జె. లాస్కీ, లిండ్సే, మైకేవర్, ఫాలెట్ వంటి వారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. బహుతావాదుల అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థలలో రాజ్యం ఒకటని అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య అధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు.

బహుతావాద సార్వభౌమాధికారం – ప్రధాన అంశాలు :

  1. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం.
  2. రాజ్యం సమాజాన్నిగాని మరే ఇతర సంస్థను గాని నిర్మించలేదు. అదే విధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థలను రద్దు చేయజాలదు. రాజ్యానికి ఆ అధికారం కూడా లేదు.
  3. సమాజం సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది.
  4. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు. కాబట్టి మిగతా సంస్థలన్నింటి మీద దాని అధికారం ఉండదు.
  5.  సార్వభౌమాధికారం నిరపేక్షంకాదు. అది అపరిమితమైంది, ప్రశ్నించలేనిది కాదు. దానికి కొన్ని అంతర్గత – బాహ్య పరిమితులున్నాయి. అంతర్జాతీయ వేదికలు సార్వభౌమాధికారంపై కొన్ని పరిమితులు విధించవచ్చు.
  6. సార్వభౌమాధికారం ఏకపక్ష స్వభావం కలిగి ఉండదు. సమాజంలో రాజ్యాంగపరమైన, సంప్రదాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని సార్వభౌమాధికారం అమలుపర్చవలసి ఉంటుంది. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యం చేతిలోనే ఉండదు.
  7. సార్వభౌముడి ఆజ్ఞలే చట్టాలు, శాసనాలు అనుకోవడానికి వీలులేదు. సమాజంలోని అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని దాన్ని అమలుచేయాలి.
  8. ఆస్టిన్ రాజ్యానికి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టాడని బహుతావాదులు విమర్శించారు. దీని పర్యవసానంగా మానవ సమాజంలోని అనేక ఇతర సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
సార్వభౌమాధికారం అంటే ఏమిటి ? దాని ముఖ్య లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
ఆధునిక రాజ్యానికి గల అతి ముఖ్యమైన లక్షణం సార్వభౌమాధికారం. నేడు అన్ని ఆధునిక రాజ్యాలు జాతీయ రాజ్యాలే. సార్వభౌమాధికారం వాటి ప్రధాన లక్షణం. సార్వభౌమాధికార లక్షణం వల్లనే రాజ్యం ఇతర సంస్థల సంఘాల కంటే భిన్నమైనదిగా గుర్తించబడింది. సార్వభౌమాధికారం రాజ్యానికి ఉండటం వల్లనే అది అన్ని రకాల అధికారాలను నిర్వహించగలుగుతుంది.

ఆధునిక రచయితల్లో ముఖ్యమైన ఫ్రెంచితత్వవేత్త 16వ శతాబ్దానికి చెందిన జీనో బోడిన్ మొట్ట మొదటి సారి “సార్వభౌమాధికారం” అనే పదాన్ని వాడారు. ఈ భావనను తన గ్రంథమైన “Six Books on the Republic”లో -1576లో పేర్కొన్నాడు.

నిర్వచనాలు : సార్వభౌమాధికారం అనే భావనను అనేక మంది పలు విధాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలను కింది విధంగా తెలుసుకుందాము :
విల్లోభి : “రాజ్యం యొక్క అత్యున్నతా అభీష్టమే సార్వభౌమాధికారం” అన్నాడు.
బ్లాక్న్ : “ఎటువంటి పరిమితులు, నియంత్రణలేని నిరపేక్షమైన, శాసనబద్ధమైన అతి ఉన్నత అధికారమే సార్వభౌమాధికారం”.
జీన్ బోడిన్ : “పౌరులపై పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజ్యాధికారమే సార్వభౌమాధికారం”గా నిర్వచించాడు.
హ్యుగో గ్రోషియస్ : “ఎవరు అతిక్రమించలేని, విస్మరించలేని రాజ్యాధికారమే సార్వభౌమాధికారం” అన్నాడు. జెంక్స్ : “సమాజంలోని ప్రతి వ్యక్తి చర్యలను సంపూర్ణంగా నియంత్రించే అధికారమే సార్వభౌమాధికారం.”
ఉడ్రోవిల్సన్ : “శాసనాల తయారీ, అమలు దైనందిన శక్తి వ్యవహారం.”

సార్వభౌమాధికారం లక్షణాలు: సార్వభౌమాధికార లక్షణాలను కింది విధంగా వివరించవచ్చు.

  1. నిరపేక్షత (Absoluteness)
  2. సార్వజనీనత (Universality)
  3. శాశ్వతత్వం (Permanence)
  4. అనన్యసంక్రామకత్వం (Inalienability)
  5. అవిభాజ్యత (Indivisibility)

1. నిరపేక్షత :
రాజ్యానికి గల నిరపేక్షాధికారమే సార్వభౌమాధికారం. రాజ్యపరిధిలో సార్వభౌమాధికారాన్ని మించిన మరే అధికారం ఉండదు. సార్వభౌమాధికారాన్ని శాసించే అధికారం ఏ వ్యక్తికిగాని, సంస్థకుగాని ఉండదు. సార్వభౌమాధికారంపై ఎలాంటి ఆంక్షలను వ్యక్తులుగాని, సముదాయాలుగాని సాధించలేవు. అదేవిధంగా ఒక సార్వభౌ మాధికారం గల రాజ్యం సరిహద్దులలో మరో రాజ్యం జోక్యం చేసుకోవడం తగదు.

అయితే, మెట్లాండ్ వంటి రచయితలు సార్వభౌమాధికార నిరపేక్షతపై కొన్ని పరిమితులున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రజాస్వామ్య రాజ్యాలు, ప్రజల ఆచార సంప్రదాయాలలోగాని, వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వ్యతిరేకంగా తన అధికారాన్ని ఉపయోగించవు. అదే విధంగా, అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడిన తరువాత అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి మాత్రమే రాజ్యాలు ప్రవర్తిస్తున్నాయని చెప్పవచ్చు.

2. సార్వజనీనత :
సార్వభౌమాధికారం దాని స్వభావ రీత్యా సార్వజనీనమైంది. రాజ్య పరిధిలో గల ప్రజలందరి సంస్థలన్నింటికీ, సంఘాలన్నింటికీ సార్వభౌమాధికారం వర్తిస్తుంది. సార్వభౌమాధికారం ఏ వ్యక్తికి గాని, సంస్థకు గాని, సంఘానికి గాని ఎటువంటి మినహాయింపు ఇవ్వదు.

అయితే, విదేశీ రాయబారులు, రాయబార కార్యాలయ సిబ్బందికి మినహాయింపులుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారికి గల ప్రత్యేక అధికారాలను తొలగించవచ్చు. కాబట్టి వారు సైతం ప్రత్యేక సందర్భాలలో సార్వభౌమాధికారానికి లోబడి తమ వ్యవహారశైలిని మార్చుకోవలసి ఉంటుంది.

3. శాశ్వతత్వం :
సార్వభౌమాధికారం రాజ్యానికి గల శాశ్వత అధికారం. రాజ్యం తన మనుగడను కొనసాగించినంత కాలం సార్వభౌమాధికారం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితిలో మారుతుంది. కాని రాజ్యం మాత్రం మారదు. ఎందుకంటే రాజ్యం శాశ్వతమైంది. ప్రభుత్వం అశాశ్వతమైంది. గార్నర్ అభిప్రాయం ప్రకారం “మరణం లేదా తాత్కాలికంగా గుణములలో సంబంధించిన మార్పులవల్ల గాని, రాజ్యపునఃనిర్మాణం వల్లగాని సార్వభౌమాధికారం మారదు.”

4. అనన్యసంక్రామకత్వం :
రాజ్యానికి గల సార్వభౌమాధికారాన్ని మరొక రాజ్యానికి గాని, సంస్థకుగాని బదిలీ చేయడానికి వీలుపడదు. దాన్ని ఇతరులకు బదిలీ చేసినట్లయితే అది నాశనమౌతుంది. ఒకవేళ రాజ్యం తన భూభాగంలో కొంత భాగాన్ని స్వతహాగా వదులుకుంటే ఆ రాజ్యం సార్వభౌమాధికారాన్ని కోల్పోయినట్లు కాదు. కేవలం ఆ ప్రాంతంపై మాత్రమే తన అధికారం కోల్పోతుంది.

రాజ్యపాలకుణ్ణి ఆ రాజ్యంలోని తిరుగుబాటుదారులు అధికారం నుంచి తొలగించినట్లయితే అది కేవలం ప్రభుత్వంలో మార్పు సంభవించినట్లుగా భావించాలి గాని సార్వభౌమాధికారం మారినట్లు కాదు. సార్వభౌమాధికారం, రాజ్యం సమాంతరంగా కొనసాగుతాయి. ఎందుకంటే శరీరం నుంచి ఆత్మను ఏ విధంగా విడదీయడం సాధ్యం కాదో అదే మాదిరి రాజ్యం నుంచి సార్వభౌమాధికారాన్ని విడదీయలేం.

5. అవిభాజ్యత :
సార్వభౌమాధికారం విడదీయరానిది, దాన్ని విడదీయడం సాధ్యం కాదు. ఒకవేళ దాన్ని విభజించినట్లయితే అది మనుగడను కొనసాగించలేదు. ప్రతి రాజ్యం ఒకే ఒక అభీష్టాన్ని కలిగి ఉంటుంది. సార్వభౌమాధికారాన్ని విడదీయడమనేది సార్వభౌమాధికార సిద్ధాంతానికే వ్యతిరేకం.

బహుతావాదులు సార్వభౌమాధికారం అవిభాజ్యతను వ్యతిరేకించారు. వీరిలో ప్రముఖంగా లోవెల్, బ్రైస్ లాంటి వారు సార్వభౌమాధికార విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

వీరి ఉద్దేశంలో ఒక రాజ్యంలో రెండు స్థాయిలు గల సార్వభౌమాధికారం ఉంటుంది. దీనికి వీరిచ్చే ఉదాహరణ సమాఖ్య వ్యవస్థలో రాజ్యానికి గల అధికారాలు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించబడతాయి. అయితే, వీరి వాదనను వ్యతిరేకించే వారు కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల విభజన మాత్రమే జరుగుతుంది గాని సార్వభౌమాధికారం విభజించబడదని అభిప్రాయపడ్డారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏవైనా నాలుగు రకాల స్వాభౌమాధికారాలను పేర్కొనండి.
జవాబు.
1. నామమాత్రపు సార్వభౌమా కారం :
ఒక వ్యక్తి లేదా సంస్థ రాజ్యం అధికారాలన్నీ పేరుకు మాత్రమే కలిగి ఉండటాన్ని నామమాత్రపు సార్వభౌమాధికారమంటారు. సంప్రదాయానుసారం మాత్రమే సదరు వ్యక్తి లేదా సంస్థ అధికారాలను కలిగి ఉంటారు. వాస్తవానికి ఏ అధికారం ఉండదు.

బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి నామమాత్రపు సార్వభౌమాధికారానికి చక్కటి ఉదాహరణలు. ఈ రెండు దేశాలలో ఆచరణలో వారి పేరుతో అధికారాన్ని కేబినెట్ చెలాయిస్తుంది.

2. వాస్తవిక సార్వభౌమాధికారం:
సార్వభౌమాధికారాన్ని నామమాత్రపు అధిపతి పేరుతో వేరొక వ్యక్తి లేదా సంస్థ చెలాయించడాన్ని వాస్తవ సార్వభౌమాధికారం అంటారు. వాస్తవ సార్వభౌమాధికారి సహాయ సహకారాలతోనే నామమాత్రపు సార్వభౌమాధికారి ప్రభుత్వ అధికారాలను వినియోగిస్తాడు.

ఉదాహరణకు, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అమల్లో ఉన్న భారతదేశం వంటి రాజ్యాల్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సూచనల ప్రకారం నామమాత్రపు సార్వభౌమాధికారి అయిన రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగిస్తారు.

3. న్యాయబద్ధ సార్వభౌమాధికారం:
న్యాయబద్ధ సార్వభౌమాధికారంలో శాసనాలకు, చట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. న్యాయబద్ధ సార్వభౌమాధికారి మాత్రమే అన్ని రకాల ఆజ్ఞలను జారీ చేస్తారు. వీటిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలి. దైవిక న్యాయాన్ని లేదా సాధారణ న్యాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చే అధికారం కేవలం న్యాయబద్ధ సార్వభౌమాధికారికి మాత్రమే ఉంటుంది. ఇతను జారీ చేసిన కోర్ట్ ఆఫ్ లా కూడా అంగీకరిస్తుంది.

ఈ రకమైన సార్వభౌమాధికారానికి బ్రిటన్ రాజు, రాణి, జపాన్ రాజు, భారతదేశపు రాష్ట్రపతి చక్కటి ఉదాహరణలు. న్యాయబద్ధ సార్వభౌమాధికారం స్పష్టమైంది. వ్యవస్థీకృతమైంది. నిర్బంధమైంది. దాన్ని అతిక్రమించిన వారు శిక్షార్హులు.

4. రాజకీయ సార్వభౌమాధికారం :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో రాజకీయ సార్వభౌమాధికారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాజ్యంలోని అందరి చర్యలను రాజకీయ సార్వభౌమాధికారం ప్రభావితం చేస్తుంది. ఎ.వి.డైసీ అనే రాజకీయ పండితుడి దృష్టిలో అందరూ ఆమోదించి ఆచరణలో ఉండే ఒక ఉన్నతాధికారి చర్యయే రాజకీయ సార్వభౌమాధికారం.

అయితే, రాజకీయ సార్వభౌమాధికారం ఎవరెవరికి ఉంటుందో గుర్తించడం సాధ్యం కాదు. సమాజం, సంస్థలు, ప్రజలు, ప్రజాభిప్రాయం వంటి వివిధ రూపాలలో అది నెలకొని ఉంటుంది. ప్రజాభిప్రాయం సాధనాలవల్ల ప్రభావితమై వెల్లడౌతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 2.
రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాలను వివరించండి.
జవాబు.
రాజ్యానికి – ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యం ప్రభుత్వం
1. రాజ్యం చాలా విశాలమైనది. దీనిలో ప్రజలందరూ భాగస్వాములు. 1. ప్రభుత్వం చాలా పరిమితమైనది. ఇది కొద్దిమంది పౌరులకు చెందిన సంస్థ.
2. రాజ్యం శాశ్వతమైనది. 2. ప్రభుత్వం నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వం కాలపరిమితికి తగ్గట్టుగా ఏర్పడుతుంది. ఉదాహరణకు భారతదేశంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది.
3. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది. 3. ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండదు. అయితే, పేరు మీదుగా ప్రభుత్వం సార్వ భౌమాధికారాన్ని చెలాయిస్తుంది.
4. రాజ్యం అమూర్త రూపం 4. ప్రభుత్వం నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉంటుంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకతను కలిగి ఉండవచ్చు. కాని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండలేరు.
5. రాజ్యాలన్నీ విశ్వజనీనమైనవి, స్వభావరీత్యా లక్షణాల రీత్యా పోలికలను కలిగి ఉంటాయి. 5. ప్రభుత్వాలు మాత్రం ఆయా రాజ్యాలను బట్టి ఏర్పడతాయి. ఉదాహరణకు, పార్లమెంటరీ, అధ్యక్షతరహా ప్రభుత్వాలు.
6. రాజ్యానికి దాని పౌరులు తప్పనిసరిగా విధేయతను కలిగి ఉండాలి. 6. ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును కలిగి ఉంటారు.
7. రాజ్యం సర్వోన్నతమైనది. అది కొన్ని మౌలిక లక్షణాలను కలిగి ఉంటుంది. అవి ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమాధికారం. 7. ప్రభుత్వం రాజ్యానికి గల మౌలిక లక్షణాలలో ఒకటి మాత్రమే. ఈ విధంగా ప్రభుత్వం రాజ్యంలో అంతర్భాగమైనది.
8. రాజ్యానికి గల అధికారాలు వాస్తవమైనవి. 8. ప్రభుత్వం చాలా పరిమిత అధికారాలను కలిగి ఉంటుంది. అవి కూడా రాజ్యం ప్రసాదించినవే.
9. రాజ్యం యజమాని వంటిది. అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. 9. ప్రభుత్వ రాజ్యానికి సాధనం వంటిది. ఈ రెండు యజమాని – సేవకుడు సంబంధాలను కలిగి ఉంటాయి. ప్రభుత్వ మనుగడ రాజ్య అభీష్టం మీద ఆధారపడి ఉంటుంది.
10. రాజ్యానికి నిర్దిష్ట భౌగోళిక ప్రదేశం ఉంటుంది. ఇది లేకుండా రాజ్యం మనుగడను కొనసాగించలేదు. 10.  భౌగోళిక ప్రదేశం ప్రభుత్వానికి అవసరం లేదు. ఎందుకంటే, ఉదాహరణకు బ్రిటన్ ప్రభుత్వం భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించింది.
11. రాజ్యంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి. ఏ ఒక వ్యక్తి సభ్యత్వం నుంచి తప్పించుకోలేడు. 11. ప్రభుత్వంలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరికాదు. వ్యక్తి ఇష్టాయిష్టాల మీద సభ్యత్వం ఆధారపడి ఉంటుంది.
12. రాజ్యానికి గల అధికారం నిరపేక్షం, యథార్థం. 12. ప్రభుత్వ అధికారాలు పరిమితం, ఆపాదించబడినవి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 3.
రాజ్యానికి ఇతర సంస్థలకు గల తేడాలు ఏమిటి ?
జవాబు.
రాజ్యానికి – సంస్థలకు / సంఘాలకు మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యం సంస్థలు / సంఘాలు
1. రాజ్యం శాశ్వతమైంది. 1. సంస్థలు/సంఘాలు అశాశ్వతమైనవి.
2. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది. 2. సంస్థలు/సంఘాలకు సార్వభౌమాధికారం ఉండదు.
3. రాజ్యానికి నిర్దిష్ట సరిహద్దులు ఉంటాయి. ఏ రాజ్యం విశ్వవ్యాప్తం కాదు లేదా ప్రపంచ వ్యాప్తం కాదు. 3. ఇవి నిర్దిష్ట సరిహద్దులను కలిగి ఉండవు. అయితే కొన్ని సంస్థలు అంతర్జాతీయమైవి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ సొసైటీ, ది లైన్స్ క్లబ్ మొదలైనవి.
4. రాజ్యంలో పౌరులకు సభ్యత్వం తప్పనిసరి. ప్రతి పౌరుడు రాజ్యంలో సభ్యుడుగా ఉండాలి. 4. సంస్థల/సంఘాలలో సభ్యత్వం అనేది ఐచ్ఛికం. వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది.
5. ఒక వ్యక్తికి ఒక్క సభ్యత్వం మాత్రమే ఉంటుంది. 5. వీటిలో ఒక వ్యక్తి ఎన్నింటిలోనైనా సభ్యత్వం పొందవచ్చు.
6. రాజ్యం బహుళ విధులను నిర్వహిస్తుంది. 6. సంస్థల విధులు ఒక్కటిగానే ఉండి కేవలం సభ్యులకు మాత్రమే చెందుతాయి.
7. రాజ్యం చట్టాలను, శాసనాలను చేస్తుంది. వాటిని అతిక్రమించినవారికి శిక్ష విధిస్తుంది. 7. సంస్థలు/సంఘాలు శాసనాలను, చట్టాలను చేయవు. కాని వాటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలను ఏర్పర్చుకుంటాయి.
8. ప్రజల మీద రాజ్యం పన్నును విధిస్తుంది. 8. సంస్థలు/సంఘాలు ఎటువంటి పన్నులను విధించ లేవు. అయితే స్వచ్ఛందంగా సభ్యత్వ రుసుం చెల్లించుకోవచ్చు.
9. రాజ్యం లక్ష్యాలు విశాలమైనవి. 9. సంస్థలు/సంఘాల లక్ష్యాలు ఆశయాలు చాలా పరిమితమైనవి.
10. రాజ్యం తన నిర్ణయాలను ప్రజలపై రుద్దవచ్చు. వాటిని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. 10. సంస్థలు, సంఘాలు తమ నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దలేవు. పాటించనివారిపై చర్యలు తీసుకోలేవు.
11. సంస్థలన్నింటికంటే రాజ్యం శ్రేష్ఠమైనది. 11. సంస్థలన్నీ రాజ్యం పరిధిలో ఉండి రాజ్యం దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి కొనసాగుతూ ఉంటాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
జాన్ ఆస్టిన్ ఏకత్వసార్వభౌమాధికారం అంటే ఏమిటి ?
జవాబు.
18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్.ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ ప్రుడెన్స్” (1832)లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. తన కంటే ముందున్న థామస్ హాబ్స్, జెర్మి బెంథామ్ల సిద్ధాంతాలను తన సిద్ధాంతానికి ఆధారంగా తీసుకున్నాడు.

ఆస్టిన్ సిద్ధాంతాన్ని “నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని” కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ఆస్టిన్ సార్వభౌమాధికారం – ముఖ్య లక్షణాలు :
1. ఇది నిశ్చయాధికారం :
ప్రతి స్వతంత్ర రాజకీయ సమాజంలో ఒక నిర్ణీత మానవ అధికారి లేదా వ్యక్తుల సముదాయానికి సార్వభౌమాధికారం ఉంటుంది. వ్యక్తికీ లేదా వ్యక్తుల సముదాయానికి గల అధికారం నిశ్చయ సార్వభౌమాధికారం.

2. సార్వభౌమాధికారి ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు :
సమాజంలోని ప్రజలందరు తమ అలవాటు ప్రకారం సార్వభౌమాధికారికి విధేయులై ఉంటారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిడిగాని, ప్రలోభంగాని ఉండదు. ప్రజలు యథాలాపంగా సార్వభౌముడికి విధేయులై ఉంటారు.

3. సార్వభౌమత్వం అవిభాజ్యం:
సార్వభౌమాధికారం విభజించడానికి వీలులేనటువంటిది. ఎందుకంటే అది ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉంటుంది. సార్వభౌముడి అధికారానికి ఎటువంటి పరిమితులుండవు. శాసనాలకు మూలాధారం, సార్వభౌముడు.

4. సార్వభౌమాధికారం ఆవశ్యకమైంది :
రాజకీయ సమాజానికి సార్వభౌమాధికారం అత్యంత అవసరమైంది. సార్వభౌమత్వం లేని సమాజం, రాజకీయంగాని స్వతంత్రతగాని లేని సమాజమౌతుంది.

5. చట్టమే తుది ఆజ్ఞ :
సార్వభౌముని ఆజ్ఞే చట్టం. చట్టాన్ని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే సార్వభౌమాధికారం నిరపేక్షమైంది, నిర్దిష్టమైంది, స్పష్టమైంది, అపరిమితమైంది కాబట్టి.

6. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు :
రాజకీయ సమాజంలోని ప్రజలకు సార్వభౌముడు ప్రసాదించిన హక్కులు మినహా ఏ ఇతర హక్కులు ఉండవు. ప్రజలు రాజ్యాన్ని వ్యతిరేకించే హక్కులను కలిగి ఉండరు.

ప్రశ్న 5.
బహుతావాద సార్వభౌమాధికారం అంటే ఏమిటి ?
జవాబు.
బహుతావాద (బహుత్వవాద) సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, సమాఖ్య సిద్ధాంత స్ఫూర్తి. వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారాల విభజన వంటి అనేక అంశాలు బహుతావాద సార్వభౌమాధికారం బహుళ ప్రాచుర్యం పొందడానికి దోహదపడ్డాయి.

వాన్ గిర్కే (1844 – 1925) :
మొట్టమొదటిసారి బహుతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత మెట్లాంగ్, బార్కర్, జి.డి. హెచ్. కోల్, హెచ్.జె. లాస్కీ, లిండ్సే, మైకేవర్, ఫాలెట్ వంటి వారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

వీరందరూ ఏకత్వ సార్వభౌమాధికారం చాలా ప్రమాదకరమైందని ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు. బహుత్తావాదుల అభిప్రాయంలో రాజకీయ సమాజంలోని అనేక సంస్థలలో రాజ్యం ఒకటని అందువల్ల అధికారమంతా ఒక్క రాజ్య అధీనంలోనే ఉండదని వీరు పేర్కొన్నారు.

బహుతావాద సార్వభౌమాధికారం – ప్రధాన అంశాలు :

  1. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి. రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని వీరి అభిప్రాయం.
  2. రాజ్యం సమాజాన్ని గాని మరే ఇతర సంస్థను గాని నిర్మించలేదు. అదేవిధంగా సమాజంలోని సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, రాజకీయపరమైన సంస్థలను కూడా రాజ్యం సృష్టించలేదు. ఈ కారణం చేత రాజ్యం ఈ సంస్థలను చేయజాలదు. రాజ్యానికి ఆ అధికారం కూడా లేదు.
  3. .సమాజం సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రాజ్యం దాని అధికారాలను అన్ని సంస్థలకు పంపిణీ చేయవలసి ఉంటుంది.
  4. సార్వభౌమాధికారం ఒక్క రాజ్యానికి మాత్రమే చెందింది కాదు. కాబట్టి మిగతా సంస్థలన్నింటి మీద దాని అధికారం ఉండదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 6.
సమాజానికి, రాజ్యానికి గల తేడాలు ఏమిటి ?
జవాబు.
రాజ్యానికి – సమాజానికి మధ్యగల వ్యత్యాసాలు :

రాజ్యం సమాజం
1. రాజ్యం రాజకీయ సంస్థ. 1. సమాజం సాంఘిక సంస్థ.
2. రాజ్యానికి నిర్ణీత నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులుంటాయి. 2. సమాజానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులుండవు.
3. రాజ్యం శాసనబద్ధంగా నిర్మితమైన ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది. 3. సమాజం శాసనబద్ధంగా నిర్మితమైన సంస్థను కలిగి ఉండదు.
4. రాజ్యానికి అధికారం ఒక అలంకారంగా ఉంటుంది. రాజ్యాధికారాన్ని ధిక్కరించిన వారిని శిక్షించే శాసనం చట్టం చేతిలో ఉంటుంది. 4. సమాజం ఎటువంటి అధికారాన్ని కలిగి ఉండదు. సమాజంలోని వ్యక్తుల నిరసనను శిక్షించే భౌతిక అధికారం దీనికి ఉండదు.
5. రాజ్యానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని దానికి గల సాధనాల ద్వారా శాసనాలను చట్టాలను, పథకాలను అమలు పరుస్తూ ఉంటుంది. 5. సమాజానికి ఎటువంటి సార్వభౌమాధికారం ఉండదు. కాని ఆచారాలు, సంప్రదాయాలు, నైతిక విలువలు దీనికి అలంకార నియమాలుగా ఉంటాయి. అధికారంతో కూడిన శక్తి మాత్రం దీనికి ఉండదు.
6. రాజ్యం సహజ సంస్థ కాదు. మానవ ప్రయోజనాలకై నిర్మించిన సంస్థ. దీనిలో వ్యక్తులకు సభ్యత్వం తప్పనిసరి. 6. సమాజం సహజ స్వచ్ఛందమైన సంస్థ. దీనిలో సభ్యత్వం ఇష్టపూర్వకంగా లభిస్తుంది.
7. రాజ్యం సమాజంలో అతి ముఖ్యమైన సంస్థ. రాజకీయంగా వ్యవస్థీకృతమైన సమాజంలో రాజ్యం అంతర్భాగం. 7. సమాజం రాజ్యం కంటే విశాలమైనది. సమాజం అనేక గుంపుల సంఘాలకు నిలయం అయినందున దీనిలోని సంబంధాలు సైతం సంక్లిష్టంగా ఉంటాయి.
8. రాజ్యానికి బలం అది రూపొందించుకొనే శాసనం, చట్టం, రాజ్యాంగం. 8. సమాజానికి బలం, అది కలిగి ఉన్న ఆచారం, సంప్రదాయాలు విలువలు, కట్టుబాట్లు మొదలైనవి.
9. రాజ్యం, వ్యక్తుల బహిర్గత కార్యకలాపాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. దాని నిమిత్తం కొన్ని నియమ నిబంధనలను రూపొందిస్తుంది. 9. సమాజం వ్యక్తుల అంతర్గత బహిర్గత కార్యకలాపాలను నియంత్రిస్తుంది. సమాజం అన్ని రకాల సాంఘిక రూపాలను పర్యవేక్షిస్తుంది.
10. రాజ్యం ఒక అభివృద్ధి చేసిన సాంఘిక సంస్థ. ఇది సమాజం నుంచి ఆవిర్భవించింది. 10. సమాజం మొట్టమొదటిగా ఏర్పడిన సంస్థ, అతి విశాలమైనది. మానవులు స్వభావరీత్యా సంఘ జీవులు.
11. రాజ్యం శాశ్వతమైనది కాకపోవచ్చు. కాలక్రమంలో అది అంతరించిపోవచ్చు లేదా మరో బలవంతమైన రాజ్యం ద్వారా ఆక్రమణకు గురికావచ్చు. 11. సమాజం శాశ్వతమైనది. అది ఎల్లవేళలా కొనసాగేది.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం 

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
‘రాజ్యం’ అనే పదాన్ని అనేకమంది రాజనీతిశాస్త్ర పండితులు అనేక రకాలుగా నిర్వచించారు. వారిలో కొందరు ఇచ్చిన నిర్వచనాలను కింది విధంగా పేర్కొనడమైంది.

  1. అరిస్టాటిల్ : “మానవునికి సుఖప్రదమైన, గౌరవప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం”.
  2. బ్లంట్లీ : “ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజల సముదాయమే రాజ్యం”.

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే సాధనమే ప్రభుత్వం. ప్రభుత్వం మూడు అంగాలను కలిగి ఉంటుంది. అవి :

  1. శాసనశాఖ
  2. కార్యనిర్వాహక శాఖ
  3. న్యాయశాఖ.

ప్రశ్న 3.
సమాజం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజం ప్రాచీనమైనది. రాజ్యం కంటే ముందు ఏర్పడినది. మానవుడు సంఘజీవి. సమాజంలో మాత్రమే వ్యక్తి సంపూర్ణ వికాసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపగలడు. “సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే” సమాజము. సమాజంలో సభ్యత్వం లేని మానవుడిని ఊహించలేము.

వలలాగా అల్లబడిన వివిధ రకాల మానవ సంబంధాలను ‘సమాజం’ అని చెప్పవచ్చు. అయితే రాజ్యంలాగా సార్వభౌమాధికారము, దండనాధికారం ఉండదు. సాంఘిక ఆచార సంప్రదాయాల ఆధారముగా శిక్షలు ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 4.
ఏకత్వ సార్వభౌమాధికార సిద్దాంతం.
జవాబు.
18వ శతాబ్దంలో ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్. ఇతను తన గ్రంథమైన “లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ప్రుడెన్స్”లో ఈ సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. ఆస్టిన్ సిద్ధాంతాన్ని నిరపేక్ష లేదా న్యాయబద్ధ సార్వభౌమాధికార సిద్ధాంతమని కూడా పేర్కొంటారు. ఇతని అభిప్రాయంలో శాసనమనేది సార్వభౌముడు ప్రజలకిచ్చిన ఆజ్ఞగా పేర్కొన్నాడు.

ప్రశ్న 5.
బహుత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం.
జవాబు.
బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ ప్రతిపాదించిన ఏకత్వ నిరపేక్ష సార్వభౌమాధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చింది. వాన్ గిర్కే మెట్లా లాండ్, బార్కర్, జి.డి. హెచ్. కోల్, లస్కీ, మెకైవర్, ఫాలెట్ వంటివారు బహుతావాద సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సమాజంలోని అనేక సంస్థల్లో రాజ్యం ఒకటి.

రాజ్యం ఒక్కటే అధికారాన్ని కలిగివుండదు. సమాజంలోని వివిధ సంఘాలు కూడా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తాయి. అందువల్ల సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి, వివిధ సంఘాల మధ్య పంచడమే సమంజసమని బహుతావాదుల అభిప్రాయం.

ప్రశ్న 6.
అంతర్గత సార్వభౌమాధికారం.
జవాబు.
అంతర్గత సార్వభౌమాధికారం : దేశంలోని ఆంతరంగిక వ్యవహారాలతో ఆ రాజ్యానికున్న అత్యున్నత అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. ఒక రాజ్య ప్రాదేశిక పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలన్నింటికి సంబంధించిన విషయాలలో శాసనాలు రూపొందించి అమలు చేసే అధికారాన్ని అంతర్గత సార్వభౌమాధికారం అంటారు. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల స్వేచ్ఛలు హక్కులు రాజ్యానికి గల సార్వభౌమాధికారం ద్వారా మాత్రమే సంక్రమిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 7.
బహిర్గత సార్వభౌమాధికారం.
జవాబు.
బాహ్య సార్వభౌమాధికారం :
ఒక రాజ్యం తన జాతి ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ సమాజంలో ఇతర దేశాలలో చేసుకొనే ఒప్పందాలు, సంప్రదింపులు, దౌత్యనీతి, యుద్ధం వంటి అంశాలలో ఏ ఇతర రాజ్యాల ప్రభావానికి లోబడక సర్వస్వతంత్రంగా వ్యవహరించడాన్ని ఆ రాజ్యానికి ఉన్న బాహ్య సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఇటువంటి అధికారం గల రాజ్యంలో విదేశీ వ్యవహారాలలో ఇతర రాజ్యాల జోక్యానికి తావుండదు.

ప్రశ్న 8.
చట్టబద్ధ సార్వభౌమాధికారం.
జవాబు.
‘డి జ్యూర్’ అనేది ఫ్రెంచి పదం. డిజ్యూర్ అంటే చట్టబద్ధమైన అధికారం అని అర్థం. ఒక ప్రాదేశిక రాజ్యంలోని ప్రజలు, సంస్థలన్నింటికీ ఆజ్ఞలను జారీ చేసే చట్టబద్ధమైన అధికారం కలిగి ఉండటాన్ని డిజ్యూర్ సార్వభౌమాధికారమంటారు.

డిజ్యూర్ సార్వభౌమాధికారం రాజ్యాంగం, శాసనాల ద్వారా సంక్రమిస్తుంది. రాజ్యంలోని న్యాయస్థానాలు ఈ సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తాయి. బ్రిటన్ రాణి, భారత రాష్ట్రపతి ఇటువంటి సార్వభౌమాధికారానికి ఉదాహరణలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 2 రాజ్యం, సార్వభౌమాధికారం

ప్రశ్న 9.
యథార్థ సార్వభౌమాధికారం.
జవాబు.
‘డిఫాక్టో’ అనేది ఫ్రెంచిపదం. డిఫాక్టో అంటే ఫ్రెంచి భాషలో యథార్థమైందని అర్థం. రాజ్యంలో సార్వభౌమాధికారాన్ని ‘ఎవరైతే వాస్తవంగా చెలాయిస్తారో వారికి ‘డిఫాక్టో’ సార్వభౌమాధికారం ఉంటుంది. ఈ విధమైన సార్వభౌమాధికారం ఒత్తిడి, నిర్బంధం, బలప్రయోగం వంటి అంశాలపట్ల నియంత్రించబడుతుంది. అటువంటి అధికారాన్ని చట్టం గుర్తించదు. కాని యథార్థానికి వారి యథార్థానికి వారి మాటే చెల్లుతుంది. ఈ విధంగా అధికారంలోకి వచ్చినవారు సైనికాధికారులు కావచ్చు. నియంతలు కావచ్చు లేదా మతాధికారులు కావచ్చు.

Leave a Comment