TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson బిచ్చగాడు? Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 2nd Lesson బిచ్చగాడు?

ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
‘బిచ్చగాడు కుటుంబానికి ఎదురైన కష్టాలను వివరించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీనే చ్చే రచించబడింది. అంపశయ్య నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది.

ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలన కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది. వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ బిచ్చగాడి కథ.. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం. ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది.

ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు.

చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది. ఆమె ఓ బిచ్చగత్తె. ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.

ట్రైన్ కదలింది. టికెట్ తెస్తానన్నవాడు ఆ డబ్బులతో అటే పోయాడు. టి.సి రానే వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య. ఒరేయ్ టికెట్ తీయరా! అన్నాడు టి.సి. “అయ్యా!

టికెట్ కోసమే పోయినయ్యా! ఇయ్యాళ కొత్తగూడెం టేషన్లో అంతా మందే…… టికెట్ తీసుకోమని మా అన్న కొడుకుని పంపిన. ఆడు చెయ్యి బెడ్తుండగనే బండి కదిలింది. నేను వాణ్ణి వదిలేసి బండెక్కిన” “నోర్ముయిరా దొంగ వెధవ. ఎక్కడివెళ్ళాలి” అన్నాడు. “నెక్కొండ” “బాంచెన్” అన్నాడువాడు. ఆ ఆడది నల్గురు పిల్లలు నీ వాళ్ళేనా”

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

“అయ్యా మా వాళ్ళే’ అయితే 56 రూపాయలు తియ్” అతడు వెంటనే టి.సి రెండు కాళ్ళు పట్టుకున్నాడు.

“లే గాడిద కొడకా! నా కాళ్ళెందుకుకురా పట్టుకుంటావ్” పైసలిస్తవా పోలీసోళ్ళకు పట్టించనా అన్నాడు టి.సి “నన్ను కోసినా నా దగ్గర పైసల్లేవు బాంచనా” ఈ భాగోతం అంతా బండిలో ఉన్న వారికి వినోదంగా మారింది” వరేయ్ బ్రహ్మయ్య! డబ్బు తియ్యరా” అన్నాడు టి.సి “అయ్యా! నన్ను కోసినా నా వద్దపైసాలేదయ్యా! అంటూ బ్రహ్మయ్య మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. “నన్నుంటుకున్నావంటే చంపేస్తా…

బద్మాష్ లుచ్చ నీ దగ్గర డబ్బులేదురా. ఆరుమాలు తీయ్ ” అన్నాడు టి.సి “ఈ రూమాల్నేముందు బాంచెన్…. మీ అసుంటి ఓ దొర దగ్గర అడుక్కున్నా నన్ను నమ్మండ్రి బాంచెన్ అని మళ్ళీ కాళ్ళు పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాటలో రుమాలు చిరిగి పోయింది. దాన్లో నుండి 30 రూ॥ బయట పడ్డాయి. ఆ ముప్పై ఇదేనా అన్నాడు టి.సి “ఛట్ దొంగ రాస్కెల్. ఇంకా మోసం చేద్దామని చూస్తావురా! తీయ్ మిగతా 26రూ॥ అన్నాడు. “మమ్ముల కొట్టుండి. సంపుండ్రి. ఈ బండ్లె నుంచి బయటకు ఇసిరి కొటుండ్రి మా వద్దిక పైసల్లేవ్ అంది బ్రహ్మయ్య భార్య.

“నోర్మూయ్యలే దొంగముండ. పైసల్ లేవంటే ఫైనెవ్వడు కడ్డడు. నీ నడుంకున్న ఆ సంచితియ్ అన్నాడు టి.సి. దాంట్లో ముంది నిన్న మొన్న అడుక్కున్న డబ్బులు. నిండు చూలాలు. నలుగురు పిల్లలలో ఉన్న ఆమెను చూస్తే ఎవరికి జాలి కలుగలేదు“ఈ పూటకు నూక మందమన్నా ఉంచుండ్రయ్యా! నిన్న మొన్న ఏమిటి నేను ఏమిటినేను.

నా పోరగాండ్లను సూడుండ్రి ఆకలితో నకనక లాడిపోతండ్రు అని ఎంత కాళ్ళు పట్టుకున్నా ప్రతమ్నాయం లేకపోయింది. ఆ సంచిలోని డబ్బంతా క్రిందపోసి 26 రూ॥ తీసుకుని ఒక రిసీట్ బుక్ తీసి ఏదో రాశాడు. నా దృష్టి ఆ కాగితం పై 22 రూ॥లు డోర్నక్ టు నెక్కొండ” అని పడింది. ఇంతకూ ఎవరు పెద్ద బిచ్చగాడో మీరే అర్ధం చేసుకోండి. అని కవికథలు ముగించాడు.

ప్రశ్న 2.
బిచ్చగాడు కథలోని ప్రయాణీకుల మనస్తత్వాన్ని విశ్లేషించండి?
జవాబు:
బిచ్చగాడు కథ అంపశయ్య నవీన్ చే రచించబడింది. ఈయన అసలు పేరు దొంగరి మల్లయ్య. ‘బిచ్చగాడు’ పాఠ్యభాగం నవీన్ రాసిన ‘ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి గ్రహించబడింది. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీనమనసత్వాలను చక్కగా వివరించాడు. సమాజంలోని మనుషుల స్పందనా రాహిత్యాన్ని అమానవీయతను నైతిక పతనాన్ని ఈ కథ వివరిస్తుంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహానికి వెళ్ళి తిరిగి వరంగల్కు ప్రయాణం చేసే సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కథ ఇది. ఆ రోజు స్టేషన్ చాల రద్దీగా ఉంది. టికెట్ దొరికే అవకాశం ఏ మాత్రం కన్పించలేదు. అంతలో ఒకప్పటి తన విద్యార్థి భాస్కర్ సి. ఐగా పని చేస్తాడు. అతని పుణ్యమా అని టికెట్ సంపాదించి ట్రైన్లోకి ప్రవేశించాడు. కూర్చోటానికి సీటు ఎక్కడా ఖాళీ లేదు. చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఒక సీటు మొత్తాన్ని ఒక స్త్రీ తన సామానులతో ఆక్రమించింది.

ఆ సామానంతా అటూ ఇటూ జరిపితే ఐదుగురు కూర్చోవచ్చు. ఆ స్త్రీ చాల పేదరాలుగా ఉంది. బిచ్చగత్తెలా ఉంది. నలుగురు సంతానంతో చినిగిపోయిన గుడ్డపీలికలు కట్టుకునుండి. మురికిగా అసహ్యంగా ఉన్నారు. ఎలాగోలా అక్కడ కూర్చోవాలని “ఇదిగో ఇటు చూడు…. ఆ సామానంతా క్రిందపెట్టేస్తే ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చుగా అన్నాడు. ఆ స్త్రీ “గదంతేం లేదు మేము సామాను తియ్యం. ఇంకో డబ్బాలోకి పోయి కూకో”చాలా మొరటుగా సమాధానం చెప్పింది.

ఇంతలో అక్కడ కూర్చున్న పెద్ద మనిషి. “అధునా భిచ్చముండవు. నీ పొగరుండీ మాకెంతుండాల్నే ఆ సారెంత మర్యాదగా అడిగిండు- ఈ రైలు మీ తాతదనుకున్నావా” అని గద్దించాడు. చివరికి అక్కడ కూర్చున్నారు కవిగారు.

ఇంతలో గార్డువిజిల్ విన్పించింది. ఆ బిచ్చగత్తె గొంతులో ఆందోళన. “మీ అయ్యేడిరా! ఎక్కడ సచ్చిండు? రైలు పోతాంది” అంది ఇంతలో టికెట్ కోసం వెళ్ళిన వాడు వచ్చాడు. “టికెట్ దొరకనేలేదు బండిపోతాంది. సామానునంతా కిందకి దించి మీరు దిగుండే” అన్నాడు.

“ఓరిపిచ్చిగాడిద కొడకా సామానునంతా దించే వరకు బండి ఆగుతుందా ఏమిటి? టి.సి. గారితోని చెప్పి బండిలో కూర్చో అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పటికే ఆ బిచ్చగాడు బండిదిగి టికెట్ తీయమని డబ్బులిచ్చిన వాడి దగ్గరకు పరిగెత్తాడు. ఆడురాక పోతే టి. సీకి కట్టడానికి నీ దగ్గర డబ్బులున్నాయా అన్నారొకరు.

“ఒక్కపైసాలేదు. లేదు బాంచెను “అందామె ఏడుస్తూ “నువ్వట్లనే అంటావు. ఇయ్యాళేపు బిచ్చగాళ్ళ దగ్గరున్నన్ని డబ్బులు మా అసంట్లోళ్ళ దగ్గర కూడా లేవు. మీకేందే పెట్టుబడి లేని వ్యాపారం” అన్నాడు ఎగతాళిగా. అక్కడ ఉన్నవారందరూ చులకనగా నవ్వారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

మీ పనే బాగుందిరా. ఎక్కడా బిచ్చమే… కానీ ఖర్చులేని బతక్కు అన్నాడకొడు. ఊళ్ళన్నీ వాళ్ళవే! దేశాలన్నీ వాళ్ళవే దొరికింది తింటారు. లేకుంటే పస్తులుంటారు. ఏ బాదరాబందీ లేదు. మనకంటే వాళ్ళేనయం అన్నాడో ప్రయాణీకుడు. టి.సి రావడం ఆ బిచ్చగాణ్ణి బెదిరించడం జరిగాయి. ఆ బిచ్చగాడి రుమాలులో డబ్బులు కిందపడ్డాయి. అక్కడి ప్రయాణీకులలో బిచ్చగాడిపట్ల అప్పటి వరకు ఉన్న సానుభూతి ఎరిగిపోయింది.

“దొంగముండా కొడుకులు. వీళ్ళను చచ్చినా నమ్మోద్దు. టి.టి గారికి వీళ్ళ సంగతి బాగా తెలుసు. మంచిపని చేసుండు” అన్నాడు ఆ ఖద్దరు బట్టల నాయకుడు. నిండుచూలాలు వీళ్ళకు ఇలా జరుగుతుంటే వారిపై ప్రయాణీకులెవరికి జాలికలుగలేదు. అదే విషయం సినిమాలో చూస్తే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తారు.

మేమంతా, టికెట్లు కొన్నాం. వీళ్ళు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. మనకు లేని ప్రివిలేజ్ వీళ్ళకెందుకు పొందాలి అన్న ఈర్ష్య వారిలో కన్పించింది. టీ.సి ఆ గర్భిణి నుండి ‘సంచిని లాక్కొని డబ్బంతా కింద బోర్లించాడు. ఫైనుతో టికెట్కు సరిపడా డబ్బులు తీసుకుని మిగిలినవి ఆమెకివ్వబోయాడు. “వాటిని కూడా వార్నేతీసుకోమనురి” అంది ఆమె.

“చెప్పుతీసుకుని తంతాను దొంగముండా” అని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఒక కాగితం ముక్క ఆ బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఆ చీటిలో 22 రూపాయలే రాసి ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు బిచ్చగాడో కవిగారికి అర్థం కాలేదు. భిన్నమనస్తత్వాలు గల వ్యక్తులు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని కవి బాధపడ్డాడు.

ప్రశ్న 3.
‘బిచ్చగాడు’ కథలోని రచయిత అభిప్రాయాలను పరిశీలించండి?
జవాబు:
‘బిచ్చగాడు’ అను పాఠ్యభాగం ‘అంపశయ్య నవీన్’ చే రచించబడింది. నవీన్ రచించిన ఎనిమిదో అడుగు’ కథా సంపుటి నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది. నవీన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి పదవీరమణ పొందారు.

ప్రపంచంలో అనేక రకాల దోపిడీలు మోసాలు జరుగుతున్నాయి. అందులోను శ్రామికులు కార్మికుల జీవితాలలో జరిగే దోపిడీలు అత్యంత భయంకరమైనవి. మానవతా విలువలను దిగజార్చేచవని నవీన్ గారి అభిప్రాయం. రోజువారి కూలీపనులు చేస్తూ సంచార జీవన చేసేవారిలో దారిద్ర్యం, దైన్యం కన్పిస్తుందని అటువంటి వారిని కూడా దోపిడీ చేసే మనస్తత్వం గలవారు మన సమాజంలో ఉన్నారని వారిలో మార్పురావాలన్నది నవీన్ భావన. రోజూ అడుక్కుంటూ పొట్టపోసుకునే వ్యక్తులు దోపిడీకి గురి అవటం శోచనీయం అంటారు. నవీన్. ఇలాంటి వారు గౌరవనీయమైన వృత్తులలో ఉన్నవారి చేతుల్లోనే దోపిడీకి గురి అవుతున్నారు. అందుకు ఈ కథ ఒక ఉదాహరణం.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

టికెట్ దొరకలేదని లబోదిబో మంటూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి బిచ్చగాడిని చూసి ఒక పెద్దమనిషి ఇష్టమెచ్చినట్లు తిట్టడం రచయిత తప్పుపడతాడు. బిచ్చగాడు టికెట్ దొరకక తన వారినందరిని బండి దిగిపోండన్నప్పుడు ఆ పెద్ద మనిషి అన్న మాటలు అరె వారి పిచ్చిగాడిద కొడకా, నీ బండెడు సామాను దించే వరకు బండి ఆగుతుందిరా! ఈ మాటలు మానవత్వానికి మచ్చ అని రచయిత అభిప్రాయం.

“పాపం వాళ్ళలా బిక్కచచ్చి యేడుస్తుంటే మీరు ఇలా నవ్వటం ఏమిటి? అని వాళ్ళందరిని రచయిత గద్దించాలనుకున్నాడు. నేనలా అంటే నన్ను పిచ్చివాడిలా భావిస్తారేమోనని రచయిత భయమేసి ఊరుకున్నాడు. టి.టి బిచ్చగాడిని గద్దించి డబ్బురాబట్టడానికి ప్రయత్నిస్తుంటే, రచయిత టీ.టీగారూ! అతడు చెప్తున్నది కొంచెం విన్పించుకోండి అని ఇంగ్లీషులో మాట్లాడేసరికి కొంచెం టి.టి. తగ్గాడు. ఇక్కడ సత్యానికి విలువలేదు. సభ్యతకు తావులేదు. డబ్బుకే విలువ అన్న అభిప్రాయాన్ని రచయిత తెలియచేస్తున్నారు.

నిండుచూలాలుగా ఉన్న ఆ నిర్భాగ్యురాలిని చూసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్నవారికి జాలి కలుగక పోగా ద్వేషపూరిత భావం కలగడం రచయితను బాధించింది. ఇలాంటి దృశ్యాన్నే సినిమాలో చూస్తే అందరూ కళ్ళంట నీళ్ళు కారుస్తారు. మనుషులలో ఈ భిన్న భావావేశాలకు కారణం ఏమిటి? అని రచయిత ఆలోచించాడు. ఎలాగైతేనేం బిచ్చగాడు.

బిచ్చగత్తె లిద్దరి వద్దా డబ్బురాబట్టుకున్నాటు టి.టి. వాళ్ళచేతిలో ఒక రిసీట్ పెట్టాడు. రచయిత ప్రక్కనే ఉండటంతో ఆ రిసీట్ మీద 22 రూ॥ మాత్రమే రాసుంది అన్న విషయం తెలిసింది. 56 రూపాయలు దండుకున్న టి.టి మోసాన్ని అందరికీ చెప్తామనుకున్నాడు రచయిత. కాని ఇవన్నీ మామూలే అని పెదవి విప్పలేకపోయాడు రచయిత. దోపిడీ చేసేవారికి ఉచ్చనీచాలు లేవని రచయిత అభిప్రాయంగా మనకు అర్థమౌతుంది.

బిచ్చగాడు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : అంపశయ్య నవీన్

పుట్టిన తేదీ : డిశంబర్ 24, 1941

పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ‘వావిలాల’ గ్రామం

తల్లిదండ్రులు : పిచ్చమ్మ, నారాయణలు

చదువులు : ఉస్మానియాలో ఎం. ఏ అర్థశాస్త్రం

ఉద్యోగం : నల్గొండలో డిగ్రీ కళాశాల లెక్చరర్, ప్రినిపల్ రిటైర్మెంట్

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 2 బిచ్చగాడు?

రచనలు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో

  1. 1965 – 69 మధ్యకాలంలో తన ఉపవాచకం అనుభవాలను ఇతివృత్తంగా వ్రాసిన నవల “అయ్య ప్పటికి 13 సార్లు ముద్రించబడింది.
  2. ముళ్ళపొదలు, అంతస్రవంతి నవలలు.
  3. ‘చీకటిరోజులు’ ఎమర్జెన్సీ కాలం నాటి స్థితిగతులపై వచ్చిన నవల
  4. ‘కాలరేఖలు’ నవల. ఇది 1944 నుండి 1947 వరకు జరిగిన సంఘటన సమ్మేళనం
    ఇవికాక నవీన్ అగాధాలు, దాగుడు మూతలు, ప్రత్యూష, ప్రయాణాల్లో ప్రమదలు, ఉమెన్స్ కాలేజీ, దృక్కోణాలు, చెదిరిన స్వప్నాలు, ఏ వెలుగులకీ ప్రస్థానం మొదలగు 31 నవలలను రాశాడు.

కథా సంపుటాలు : లైఫ్ ఇన్ ఏ కాలేజ్, ఎనిమిదో అడుగు, ఫ్రమ్ అనురాధ విత్లవ్, నిష్కృతి, బంధితులు, అస్మదీయులు తస్మదీయులు కథాసంపుటాలు.
సాహిత్య వ్యాసాలు, సాహిత్యకబుర్లు, తెలుగులో, ఆధునిక నవలలు సినిమా వీక్షణం – వీరి వ్యాస సంపుటాలు

Leave a Comment