TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Lesson గొల్ల రామవ్వ Textbook Questions and Answers.

TS Inter 1st Year Non-Detailed 1st Lesson గొల్ల రామవ్వ

ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న 1.
‘గొల్లరామవ్య’ కథ ఇతివృత్తాన్ని పరిచయం చేయండి.
జవాబు:
‘గొల్లరామయ్య కథ’ దక్షిణ భారతదేశం నుండి తొలిసారి భారత ప్రధాని అయిన పాముల పర్తి వేంకటనరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘గొల్లరామవ్వ – మరికొన్ని రచనలు’ సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో చిత్రించబడిన అద్భుతఘట్టం గొల్లరామవ్య కథ. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాశ్రేయస్సు కోసం విజృంభించిన ఒక సాహస విప్లవ కారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వఘటం, ఇందులోని ఇతివృత్తం. తెలంగాణా పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె, గొల్ల రామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె వడిలో పదిహేనేండ్ల బాలిక. ఆ గ్రామంలో అప్పుడు అయిన పెద్ద శబ్దాలకు గ్రామంలోకి వారితోపాటు వీరిద్దరి మొహాల్లో భయం తాలూకా ప్రకంపనలు కన్పిస్తున్నాయి.

“అవ్వా! గిప్పుడిదేం చప్పుడే! అని ఆ బాలిక ప్రశ్నించింది” “నీకెందుకే మొద్దముండా… అన్నీ నీకే కావాలె” అని నోరు మూయిచింది గొల్లరామవ్వ. హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టినట్లుంది రజకార్లో, పోలీసులో అని భయపడింది గొల్లరామవ్వ. ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. అగంతకు డొకడు ఆ ఇంటి కిటికీ ద్వారా ఇంట్లోకి వచ్చాడు. సందేహం లేదు. రజాకార్లో, తురకోడో, పోలీసోడు అయి ఉండాడు. తనకు చావు తప్పదు. తను అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు అని తల్లడిల్లిపోయింది.

అంతలో ఆగంతకుడు నేను దొంగను కాను, రజాకారును కాను పోలీసునూ కాను నేను మీలానే ఒక తెలుగోడిని. ఇది రివల్వార్ మిమ్మల్ని చంపేవాళ్ళను చంపేందుకది. ఈ రాత్రి ఇద్దరు పోలీసుల్ని చంపాను. మొన్న మీ గ్రామంలో నలుగురు అమాయకులను చంపిన పోలీసు లే, లే, ‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ ‘ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతుంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

తెల్లవారుతుండగా పోలీసులు గ్రామంలోకి ప్రతి ఇల్లును సోదాచేస్తున్నారు. గొల్ల రామవ్వ ఇంటికి కూడా వచ్చారు. ఆమె భయపడిపోయింది. కాంగ్రెస్ వాలంటీర్ అయిన ఆ యువకుని ఎలాగైనా రక్షించాలనుకుంది. తన మనవరాలిని గొంగళితో ఆయువకుని కప్పి ఉంచమన్నది. వారిద్దరిని ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపించింది. అతనికి గొల్లవేషం వేయించింది. ఇంటిలోపలికి ప్రవేశించిన పోలీసులతో ఆ పిల్లలిద్దరూ నా మనవరాలు ఆమె పెనిమిటి అని బొంకింది. పోలీసోడు గొల్లరామవ్వను వాడు ఎవడన్నావ్. కాంగ్రెసోడా ఏం అని ప్రశ్నించిన రామవ్వ కంగారు పడలేదు.

పోలీసులు వెళ్ళిపోయారు. రామవ్వ మంచం మీద కూర్చొంది. ఒక వైపు యువకుడు, మరోవైపు ఆమె మనవరాలు వారిది అపూర్వ సమ్మేళనం అన్పించింది ఆ యువకునికి “అవ్వా! నీవు సామాన్యురాలివి కావు. ‘సాక్షాత్ భరతమాతవే’ అన్నాడు. ఇలా ఒక విప్లవ కారుని సామాన్య వృద్ధురాలు రక్షించిన కథే గొల్ల రామవ్వ కథ.

ప్రశ్న 2.
గొల్ల రామవ్వ ఉద్యమకారుని ఏ విధంగా రక్షించింది?
జవాబు:
‘గొల్ల రామవ్వ’ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకట నరసింహారావుచే రచించబడింది. శ్రీమతి సురభివాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో వెలువడిన “గొల్ల రామవ్వ మరి కొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తిపోరాటకాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. నిజాం పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్ ‘వాలంటీరును, విప్లవ కారుడిని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతివృత్తం గొల్లరామవ్వకథ. తెలంగాణపోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్

తెలంగాణలో అదో పల్లె. ఆ పల్లెలోకి ఉద్యమకారులు ప్రవేశించి రజాకార్లను, పోలీసులకు, నవాబులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నారని నిజాం ప్రభుత్వవాదన. ఆ రోజు ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు సమాచారం. అర్ధరాత్రి ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ బాంబులమోత.

గొల్లరామవ్వ తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది. ఆమె వడిలో భయం భయంగా పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

“అవ్వా గిప్పుడిదేం చప్పుడే” అని ప్రశ్నించింది మనమరాలు. “నీకెందుకే మొద్దుముండ, గదేంది గిదేంది – ఎప్పటికి అడుగుడే” అని కసిరింది. ఇంతలో ఇంటికిటికీ చప్పుడు ఆ కిటికీ గుండా ఓ అగంతకుడి ప్రవేశం. అతడు అవ్వ దగ్గరకు వచ్చి “చప్పుడు చేయకు” నేను దొంగను కాను, రజాకార్ను కాను, పోలీసును కాను, మిమ్మల్ని ఏమీ అనను. లొల్లి చేయకండి” అన్నాడు. నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీరును వారి నుండి మిమ్మల్ని రక్షించేవాడిని అన్నాడు. అతని శారీరక పరిస్థితిని తెలుసుకున్న అవ్వ మనఃస్థితిలో కాయకల్పమైంది. భావ పరివర్తన కలిగింది. “ఇదేం గతిరానీకు? గిట్లెందుకైనవు కొడకా? అని ప్రశ్నించింది.

“రాజోలిగెఉన్నవు కొడకా! నీ కెందుకు కొచ్చెరా ఈ కట్టం. పండు పండు గొంగల్ల పండు, బీరిపోతవేందిరా! పండు” అని అతన్ని ఓదార్చి సపర్యలు చేసింది. “కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లలు పిసుక్కచ్చిన గింత కడుపుల పడేసుకో” అంది. యువకుడు లేచాడు. అవ్వ ఇచ్చినది ప్రసాదంగా తీసుకున్నాడు.

పాలు పిండేవేళయింది. యువకుడు నిద్రపోతునే ఉన్నాడు. ఇంతలో “చస్తి సస్తి నీబాంచెన్… నాకెరుక లేదు, అయ్యో వావ్వో! వాయ్యో అన్న అరుపులు మిన్ను ముట్టే ఆక్రోశాలు” యువకుడు లేచాడు రివాల్వరు తోటాలతో నింపుకుని బయలుదేరాడు. వెనుక నుండి అతని భుజం మీద మరొక చేయబడ్డది”. యాడికి? అన్న ప్రశ్న. ముసల్వ మరేం మాట్లాడలేను. అతన్ని చెయ్యపట్టి వెనక్కి లాంగింది.

యువకునికి మనవరాలి చేత దుప్పటి కండువాను ఇప్పించింది. అతడిచే “గొల్లేశమేయిచింది. ఎవడన్నా మాట్లాడితే గొల్లునోలె మాట్లాడాలె” అన్నది. ఈ లోపు పోలీసులు అవ్వ ఇంటికి రానేవస్తిరి. ఇంకేముంది గొల్ల వేసమంతా వ్యర్థమైనట్లే అనుకున్నాడు యువకుడు. అవ్వ మనవరాలితో “మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడయ్యె! పిల్లగా ఆండ్ల పండుకో. ఈ పండుకో” అంది. “పొల్లా పోరని మంచానికి నాగడంచే అడ్డం పెట్టు” “మల్లీ మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊనడూ అంది”. “చెయ్యసి పండుకో పోండా దానిమీద! చూసెటోని కనువాదం రావద్దు” అంది.

అంతలోనే ఇట్లకొచ్చిన పోలీసోళ్ళు ఆ యువకుని చూసి “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడా యేం” అని అవ్వను గద్దించాడు వాడెవ్వడా! ఎవ్వడు పడితేవాడు మా పక్కలల్ల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నావా? నిన్నెవడన్నా గట్లనే అడుగుతే ఎట్లంటది అని బొంకింది. అవ్వ మంచంమీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరో వైపు మల్లి. అపూర్వ సమ్మేళనం. అవ్వా నీవు సామాన్యరాలువుకావు. సాక్షాత్తు భారతమాతవే” అన్నాడు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

ప్రశ్న 3.
గొల్ల రామవ్వ సంభాషల్లోని ఔన్నత్యాన్ని విశ్లేషించండి?
జవాబు:
గొల్లరామవ్వ అను పాఠ్యభాగం మాజీ భారతదేశ ప్రధాని కీ॥శే॥ పాములపర్తి వేంకటనరసింహారావుచే రచించబడినది. శ్రీమతి సురభి వాణీదేవి, చీకోలు సుందరయ్య సంపాదనకత్వంలో వెలువడిన. “గొల్ల రామవ్వ మరికొన్ని రచనలు” కథా సంపుటి నుండి గ్రహించబడింది.

నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది. పోలీసులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక స్టేట్ కాంగ్రెస్, ‘వాలంటీరును, విప్లవకారుని ఒక సామాన్య వృద్ధురాలు రక్షించిన అపూర్వ ఇతి వృత్తం. ‘గొల్ల రామవ్వకథ. తెలంగాణ పోరాట చరిత్రలో ఈ కథ ఒక సృజనాత్మక డాక్యుమెంట్.

అదో తెలంగాణ పల్లె. అందులో గొల్ల రామవ్వ తన పదియేనేండ్ల, మనవరాలితో కలిసి ఉంటుంది. ఆమె ప్రతి సంభాషణ ఉన్నత విలువలను గలినదే! అర్ధరాత్రి తనింటికి దొంగలా ప్రవేశించిన యువకుని రజోకారో పోలీసోడో అని భావించింది.

“నేను పోలీసోన్ని కాను రజోకార్నుకాను” అన్నమాటలో నమ్మలేక “అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు! ఔను ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు – అదే కదా క్రమం అయింది. ఆ వ్యక్తి రెండు కాళ్ళు పట్టుకుని “బాంచెన్! చెప్పులు మోత్తా నా తలకాయైనా తీసుకో, పోర్ని మాత్రం ముట్టకు, అది నీకు చెల్లెలనుకో, నీ కాల్లు మొక్కుత! అంటుంది.

యువకుడు విప్లవకారుడని తెలుసుకుని ఉపచారాలు చేస్తుంది. ఆమె మనస్థితి కాయకల్పమైంది. “ఇదేం గతిరానీకు! గిట్లెందుకైనవు కొడకా! అంది. వెళ్ళిపోతానన్న యువకుని “ఆ మాపోతా! మా పోతా… ఒక్కటే పోకడ! చక్కంగ స్వర్గమే పోతా! హు పోతడండ యాడికో” అని నిలువరించింది.

రాజోలిగే ఉన్నవు కొడకా! నీవెందుకొచ్చెరా ఈకట్టం? పండుపండు గొంగల్లపండు” అని అతనిపై గాఢనిద్రలోని వెళ్ళేట్లు ఓదార్చింది. మనవరాలిని పిలిచి దీపం వెలిగించి ఆ యువకుని శరీరంపై గుచ్చుకున్న ముళ్ళను తీసేయమని చెప్పింది. “మా చేత్తవులే సంసారం! ఇక కూకోవాని పక్క, ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ అయ్యో సిగ్గయితాందా వాని ముట్టుకుంటే, ఏం మానవతివి గదవే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గను కుంట! ఊ చెయ్యి చెప్పినపని. పాపం పీనుగోలె పడున్నడు గాదె! వాని జూత్తే జాలి పుడుతలేదె నీకు! ఆ! గట్ల! నొప్పించకు పాపం” అమ్మ సంభాషన తీరిది.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

యువకుని లేసి “ఇగ లే కొడకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన …. గింత కడుపుల పడేసుకో! ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరి బువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గల్కుంటే ఏమనుకున్నా? పోయేపానం మర్లుతది. చూడు మరి కులం జెడిపోతవని భయపడుతున్నావా? నువ్వు యేకులమోడవైనా సరే – మొదలు పానం దక్కిచ్చుకో…. తాగి పారెయ్యి గటగట” అంటుంది.

రాత్రి ఇద్దరు పోలీసోల్లను మట్టుపెట్టిన అని యువకుడు అనగానే అవ్వ “ఇద్దరా! కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడకా! సగంపనే చేసినవు” అంటుంది. పోలీసులు ఇంట్లోకి వచ్చి యువకుని వైపు చూపిస్తూ “వాడు యెవడన్నావ్ చెప్పు! కాంగ్రెసోడాయేం” అంటే “వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల పండుటానికి మేమేం బోగమోల్ల మనుకున్నవా? నిన్నెవడన్న గట్లనె అడుగితే ఎట్లుంటది! ఈ మాటల్తోటి మనం దీసుడెందుకు పానం తియ్యరా దుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నీనైతగింతచే ఇజ్జతి మాట యెవ్వల్ల నోట్నుంచి యినలే!. అంటుంది. రామవ్వ సంభాషచతురత అద్భుతమైంది అని ఈ సంభాషణ వలన తెలుస్తుంది.

గొల్ల రామవ్వ Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత పేరు : పాముల పర్తి వేంకట నరసింహరావు

పుట్టిన తేదీ : జూన్ 28, 1921

పుట్టిన ఊరు : వరంగల్ జిల్లా, ‘లక్నెపల్లి’

తల్లిదండ్రులు : రుక్మాబాయమ్మ, సీతారామరావు

దత్తుడిగా : కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం ‘వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావుకు దత్తుడిగా వెళ్ళాడు. అందుకే వంగర గ్రామవాసి అయ్యాడు.

చదువు : ఉస్మానియాలో బి.ఎస్.సి నాగపూర్లో న్యాయశాస్త్రంలో స్వర్ణపతకం

పదవులు : కేంద్రరాష్ట్ర స్థాయిలో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా పనిచేశాడు.

భాషాపాండిత్యం : తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, పార్సీ, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడం, మరాఠీ భాషలలో పండితుడు

పత్రికలు : ‘కాకతీయ’ పత్రికను నడిపారు.

TS Inter 1st Year Telugu Non-Detailed Chapter 1 గొల్ల రామవ్వ

రచనలు :

  1. ప్రేమ – ప్రణయం – ఖండకావ్యం
  2. గొల్లరామయ్య, మంగయ్య అదృష్టం కథా సంపుటాలు
  3. ‘ఇన్సైడర్’ ఆత్మకథ నవల ‘లోపలిమనిషి’ తెలుగులో అనువదింపబడింది.
  4. విశ్వనాథ వారి వేయిపడగలు ‘సవాస్రఫణ్’గా హిందీలోకి అనువదించారు.
  5. మరాఠీలో ‘ఆస్తీ’ నవలను ‘అబలాజీవితం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
  6. దేశవిభజన సమయంలో ‘బ్లూ సిల్క్ శారీ’ అనే ఆంగ్లకథను తెలుగులోకి అనువాదం చేశారు.
  7. హిందీ ఇంగ్లీషు తెలుగు భాషలలో విలువైన సాహిత్య వ్యాసాలను పీఠికలను అందించారు.

పురస్కారాలు : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కార కమిటీలో అధ్యక్షలుగా నియమించబడ్డారు.

Leave a Comment