Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material Grammar సంధులు Questions and Answers.
TS Inter 1st Year Telugu Grammar సంధులు
సంధి అనే పదానికి కూడిక, కలయిక, చేరిక అనే అర్థాలున్నాయి. వ్యాకరణ శాస్త్ర వ్యవహారాల్లో సంధి అనగా, ఉచ్చారణ సౌకర్యం కొరకు జరిగిన వర్ణసంయోగమని చెప్పవచ్చును.
‘పూర్వపరస్వరంబులకు పరస్వరం బేకాదేశంబగుట సంధి యనంబడు’ అని చిన్నయ సూరి సంధిని నిర్వచించాడు.
సంధిలో రెండు పదాలుంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటారు. పూర్వపదం చివరి అచ్చును పూర్వస్వరమని, పరపదం మొదటి అచ్చును పరస్వరమని అంటారు.
రెండు పదాలు కలిసినపుడు పూర్వపదం చివరి అచ్చునకు పరపదం తొలి అచ్చునకు మారుగా పరస్వరమే నిలుచుట సంధి అనబడుతుంది.
సంధులు రెండు రకాలు.
- సంస్కృత సంధులు
- తెలుగు సంధులు.
సంస్కృత పదాలకు చేసే సంధి విధానాన్ని సంస్కృత సంధులుగా, తెలుగు పదాలకు సంధి చేసే విధానాన్ని తెలుగు సంధులుగా పేర్కొంటారు
1. సంస్కృత సంధులు:
(ఎ) సవర్ణదీర్ఘ సంధి:
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సమానంగా ఉచ్చరించబడే వర్ణాలు సవర్ణాలు. అంటే ఒకే ఉచ్చారణ స్థానం నుండి పలుకబడే వర్ణాలను ‘సవర్ణాలు’ అంటారు. అఆ, ఇఈ, ఊ, ఋబూ…. మొదలైనవి సవర్ణాలు
ఉదా:
- విద్య + అర్థులు = విద్యార్థులు (అ + అ = ఆ)
- ధరణి + ఈశ = ధరణీశ (ఇ + ఈ = ఈ)
- గురు + ఉపదేశం = గురూపదేశం (ఉ + ఉ = ఊ)
- పితౄ + ఋణం = పితౄణం (ఋ + ఋ = బూ)
(బ) గుణసంధి:
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమగును. సంస్కృతంలో ఏ, ఓ, అర్ అనువాటికి ‘గుణాలు’ అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి ‘గుణసంధి’ అని పేరు.
ఉదా:
- దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ)
- పర + ఉపకారము = పరోపకారము (అ + ఉ = ఓ)
- దేవ + ఋషి = దేవర్షి (అ + ఋ= అర్)
(సి) వృద్ధి సంధి:
అకారమునకు ఏ, ఐ లు పరమైనపుడు ‘ఐ’కారం; ఓ, ఔలు పరమైనపుడు ‘ఔ’కారం ఏకాదేశమగును.
సంస్కృతంలో ఐ, ఔ లకు ‘వృద్ధులు’ అని పేరు. ఇవి ఏకాదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి ‘వృద్ధి సంధి’ అని పేరు.
ఉదా:
- లోక + ఏక = లోకైక ఆ (అ + ఏ = ఐ)
- దేశ + ఐక్యత వ దేశైక్యత (అ + ఐ = ఐ)
- మహా + ఓఘం = మహౌఘం (ఆ + ఓ= ఔ)
- దివ్య + ఔషధం దివ్యౌషధం (అ + ఔ + ఔ)
(డి) యణాదేశ సంధి:
ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమంగా య, వ, ర లు ఏకాదేశమగును.
య, వ, ర లకు సంస్కృతంలో ‘యణు &ణలులు’ అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి యణాదేశ సంధి అని పేరు.
ఉదా:
- ఆది + అక్షరం = ఆద్యక్షరం (ఇ + అ = య)
- గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ (ఉ + ఆ = వ)
- పితృ + ఆర్జితం = పిత్రార్జితం (బు + ఆ = ర)
2. తెలుగు సంధులు :
(ఎ) అత్వసంధి :
అత్తునకు సంధి బహుళముగానగు.
హ్రస్వమైన అకారాన్ని ‘అత్తు’ అంటారు. బహుళమనగా సంధి నాలుగు రూపాల్లో ఉండటం.
- నిత్యం
- నిషేధం
- వైకల్పికం
- అన్యవిధం.
ఉదా:
- రామ + అయ్య = రామయ్య
- అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను
- పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు, పుట్టినయిల్లు
- ఒక + ఒక = ఒకానొక
(బి) ఇత్వసంధి: (i) ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఏమి, మణి, కి(షష్ఠి), అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవి ఏమ్యాదులు. ఇత్తు అనగా హ్రస్వమైన ఇకారము. వికల్పమనగా సంధి రెండు రూపాల్లో ఉండటం.
- సంధి జరిగిన రూపం
- సంధి జరగని రూపం.
ఉదా:
- ఏమి + అంటివి = ఏమంటివి, ఏమియంటివి
- మఱి + ఏమి = మతేమి, మఱియేమి
(ii) క్రియా పదంబులందిత్తునకు సంధి వైకల్పికముగానగు.
క్రియా పదంలోని హ్రస్వ ఇకారానికి అచ్చు పరమైనపుడు సంధి వైకల్పికమని సూత్రార్థం.
ఉదా:
- వచ్చిరి + అప్పుడు = వచ్చినప్పుడు, వచ్చిరియప్పుడు
- వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు
(సి) ఉకార సంధి:
ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
ఉదా: సోముడు + ఇతడు = సోముడితడు
(డి) యడాగమ సంధి: సంధి లేనిచోట స్వరంబుకంటెఁ బరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా:
- మా + అమ్మ = మా + య్ + అమ్మ = మాయమ్మ
- మీ + ఇల్లు = మీ + య్ + ఇల్లు = మీయిల్లు
(ఇ) గసడదవాదేశ సంధి:
ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు.
ఉదా:
- వాడు + కొట్టె = వాడుగొట్టె, వాడుకొట్టే
- అప్పుడు + చనియె = అప్పుడుసనియె, అప్పుడుచనియె
- నీవు + టక్కరివి = నీవుడక్కరివి, నీవుటక్కరివి
- నీవు తప్ప = నీవుదప్ప, నీవు తప్ప
- వారు + పోరు = వారు వారు, వారు పోరు
కళలైన క్రియాపదముల మీద సహితం పరుషములకు గసడదవలు వస్తాయి.
- రారు + కదా = రారుగదా, రారుకదా
- వత్తురు + పోదురు = వత్తురు వోదురు, వత్తురుపోదురు.
(ఎఫ్) ద్రుత ప్రకృతిక సంధి (సరళాదేశ సంధి):
(i) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ద్రుతమనగా ‘న’కారము. ద్రుత ప్రకృతికము అనగా ‘న’కారము చివరన కలది. మొదటి పదం చివర ద్రుతం ఉండి, రెండో పదం మొదట పరుషం ఉంటే, పరుషం స్థానంలో సరళం ఆదేశమవుతుంది.
ఉదా:
- పూచెను + కలువలు = పూచెను గలువలు
- తోచెను + చుక్కలు = తోచెనుజుక్కలు
- చేసెను + టక్కులు = చేసెనుడక్కులు
- పాలను + తాగెను = పాలను దాగెను
- మొగిడెను + పద్మము = మొగిడెనుబద్మము.
(ii) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు.
ఆదేశ సరళమనగా మొదటి సూత్రం ప్రకారం పరుషముల స్థానంలో వచ్చిన సరళం. కొన్నిసార్లు ద్రుతముగా మొదటి పదం చివరనున్న ‘ను’ అనుదానికి నిండుసున్న (0), అరసున్న (c) లేదా సంశ్లేషరూపం (ద్రుతం పక్క హల్లుతో కలసిన రూపం) వస్తుంది. సంధి జరిగి ఈ కింది రూపాలు ఏర్పడతాయి.
ఉదా:
పూచెను + కలువలు
= పూచెను గలువలు (మొదటి సూత్రం ప్రకారం)
= పూచెంగలువలు (పూర్ణ బిందువు)
= పూచెంగలువలు (అర్ధ బిందువు)
= పూచెన్గలువలు (సంశ్లేషము)