Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 1st Lesson వ్యాపార భావన – పరిచయం Textbook Questions and Answers.
TS Inter 1st Year Commerce Study Material 1st Lesson వ్యాపార భావన – పరిచయం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యాపారాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
అర్ధము:
- వ్యాపారాన్ని ఆంగ్లంలో ‘బిజినెస్’ అంటారు. దీని అర్థం ‘బిజీ’గా ఉండటం. అంటే ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉండటం.
- లాభార్జనే ప్రధాన ధ్యేయంగా వస్తు – సేవల ఉత్పత్తి, వినిమయం, పంపిణీ మరియు అమ్మకాన్ని వ్యాపారం
అంటారు.
నిర్వచనాలు:
1. ఎల్.హెచ్.హనీ ప్రకారం: “వస్తువుల కొనుగోలు, అమ్మకం ద్వారా సంపద సృష్టించడం లేదా సేకరించడంలో నిమగ్నమయ్యే మానవ కార్యకలాపాలే వ్యాపారం”.
2. స్టీఫెన్సన్ ప్రకారం:
“మానవుల కోరికలను సంతృప్తిపరచడం కోసం లాభార్జన లక్ష్యంగా, సంపద సృష్టించడానికి, నిర్ణీత ధరకు క్రమబద్ధంగా వస్తు సేవల వినిమయంలో ఉండే ఆర్థిక చర్యలనే “వ్యాపారం” అంటారు”.
3. కీత్ మరియు కార్లో ప్రకారం వ్యాపారం అనగా:
“వ్యక్తిగత లాభాల కోసం వస్తు సేవల ఉత్పత్తి, పంపిణీలలో ఇమిడి ఉండే అన్ని పనుల సముదాయం”. వ్యాపారం యొక్క ముఖ్య లక్షణాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు:
1) ఆర్థిక కార్యకలాపము: వ్యాపారం అనేది ఆర్థిక కార్యకలాపము. దీనిని ‘డబ్బు లేదా లాభాన్ని’ సంపాదించాలనే ప్రధాన ధ్యేయంతో చేపట్టడం జరుగుతుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం; మతపరమైన బాధ్యతలతో చేపట్టే కార్యకలాపాలు దీని పరిధిలోకి రావు.
2) వస్తు – సేవలతో వ్యవహరిస్తుంది: ప్రతి వ్యాపార సంస్థ తిరిగి అమ్మి లాభాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో వస్తుసేవలను కొనుగోలు చేయడమో, ఉత్పత్తి చేయడమో చేస్తుంది. వ్యాపార పరిధిలో వచ్చే ఈ వస్తువులు మూలధన లేదా పారిశ్రామిక వస్తువులైనా కావచ్చు, వినియోగ వస్తువులైనా కావచ్చు.
తుది వినియోగదారులచే ప్రత్యక్షంగా ఉపయోగింపబడే వస్తువును వినియోగ వస్తువులు అంటారు. బట్టలు, నోటుస్తకాలు, రొట్టె, టీ, బూట్లు మొదలైనవి వీటికి ఉదాహరణలు. వినియోగదారులచే నేరుగా వినియోగింప బడకుండా, వాటిని ఇతర వస్తువుల ఉత్పత్తికి ఉపయోగించినట్లయితే వాటిని మూలధన లేదా పారిశ్రామిక వస్తువులు అంటారు. వీటికి ఉత్పత్తిదార్ల వస్తువులు అని కూడా పేరు. పరికరాలు, ముడిపదార్థాలు, యంత్రాలు మొదలైనవి వీటికి ఉదాహరణలు. రవాణా, గిడ్డంగులు, బీమా, బ్యాంకింగ్ లాంటి వర్తక సదుపాయాలు కంటికి కనిపించని వస్తువులు. వీటిని సేవలుగా పిలవడం జరుగుతుంది.
3) ప్రయోజనాల సృష్టి: వ్యాపారం, వస్తువులను మానవుల కోరికలను తీర్చే ఉపయోగకరమైన అంశాలుగా మలుస్తుంది. కాల, స్థల, రూప, విభిన్న ఇతర ప్రయోజనాలను వస్తువులకు సృష్టిస్తుంది. ఇది వస్తువులను తయారైన ప్రాంతాల నుండి వినియోగించబడే ప్రాంతాలకు తరలిస్తూ స్థల ప్రయోజనాన్ని ఉత్పత్తి అయిన కాలం నుండి వినియోగించబడే కాలం వరకు నిల్వ ఉంచడం ద్వారా కాల ప్రయోజనాన్ని కల్పిస్తుంది.
4) పునరావృతమయ్యే వ్యవహారాలు: వ్యాపారంలో కొనుగోలు, అమ్మకం ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఏ ఒక్కసారో కొని అమ్మితే అది వ్యాపారం కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన పాత స్కూటర్నో, కారునో కొంత లాభానికే అమ్మి మరో స్కూటర్నో, కారునో కొంటే అది వ్యాపారం కాదు. స్కూటర్లను, కార్లను నిరంతరం కొంటూ, అమ్ముతూ లాభాన్ని గడిస్తే అది వ్యాపారం అవుతుంది. కాబట్టి నిరంతర, శాశ్వత వ్యవహారాల కొనసాగింపు వ్యాపారం యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి.
5) అమ్మకం, బదిలీ లేదా వినిమయం: వ్యాపారంలోని ప్రతి వ్యవహారానికి ధర ఉంటుంది. ఆ ధర ప్రతిఫలాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రతిఫలం ద్రవ్య రూపంలోనో, వస్తు రూపంలోనో ఉండవచ్చును. వ్యక్తులు తన సొంత అవసరాల కోసం వస్తుసేవలను కొనుగోలు చేస్తే అది వ్యాపారం కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి కుటుంబం కోసం భోజనం వడ్డిస్తే అది వ్యాపారం కాదు. కాని ఇతరులకు డబ్బులు తీసుకొని వడ్డిస్తే అది వ్యాపారం అవుతుంది. కాబట్టి అమ్మకం చేయుట కోసం గాని, విలువపై బదిలీ చేయడం కోసం గాని, వ్యక్తుల / సంస్థల మధ్య వినిమయం చేయడం కోసం గాని వస్తు సేవలను కొనుగోలు చేయడం, ఉత్పత్తి చేయడం నిరంతరం జరిగితే అది వ్యాపారం
అవుతుంది.
6) లాభాపేక్ష: వ్యాపారం యొక్క ప్రాథమిక మరియు ప్రధాన ఉద్దేశ్యం ‘లాభార్జన’. వ్యాపారం మనుగడకు, కొనసాగింపుకు మరియు విజయానికి ‘లాభం’ అత్యంత ఆవశ్యకం. దీపం వెలగడానికి నూనె అనే ఇంధనం ఎంత ఆవశ్యకమో, వ్యాపారం నడపడానికి లాభార్జన అనేది అంతే ఆవశ్యకం. అయితే ఈ లాభార్జన చట్టబద్ధమైన, సమంజసమైన పద్ధతిలో ఉండాలి. సమాజాన్ని మోసం చేస్తూ, వ్యక్తులకు కీడు చేస్తూ సంపాదించరాదు.
7) నష్టభయం, అనిశ్చితి: నష్టభయం, అనిశ్చితి అనేది వ్యాపారం యొక్క మరో ప్రధాన లక్షణం. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశాన్ని ‘రిస్క్’ లేదా ‘నష్టభయం” అంటారు. అలాగే వ్యాపారంలో జరిగే వ్యవహారాలను గాని, పరిస్థితులను గాని, లాభం సంపాదించే అవకాశాలను గాని ఖచ్చితంగా చెప్పలేని స్థితిని ‘అనిశ్చితి’ అంటారు. డిమాండు, ధర, పోటీ, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, వాతావరణ పరిస్థితులు మార్కెట్ల పరిస్థితులు ఇలా అనేక అంశాలు వ్యాపారాన్ని ప్రభావితపరుస్తాయి. ఇవి ఏవి ఖచ్చితంగా వ్యాపారస్తుని అదుపులో ఉండవు. కాబట్టి వ్యాపారంలో ఎప్పుడూ నష్టభయం, అనిశ్చితి ఉంటుంది.
8) వ్యాపారం ఒక సాంఘిక వ్యవస్థ: వ్యాపారం అనేది ఒక సాంఘిక వ్యవస్థ. ఎందుకంటే ఇది సమాజంలోని వ్యక్తులు కొరతగా ఉండే వనరులను సమర్థవంతంగా అభిలషణీయంగా వినియోగించుకుంటూ తమ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుకోవడానికి దోహదపడుతుంది.
9) ఇది కళ మరియు శాస్త్రం: వ్యాపార నిర్వహణ అనేది ఒక కళ మరియు శాస్త్రం. వ్యక్తిగతమైన ప్రతిభా మరియు అనుభవం మీద ఆధారపడి వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. కాబట్టి అది ఒక కళ. ఇది కొన్ని సూత్రాలపై నియమ- నిబంధనలపై మరియు ఋజువు చేయబడిన పద్ధతులపై ఆధారపడి నిర్వహించవచ్చును. కాబట్టి వ్యాపార నిర్వహణ ఒక శాస్త్రం.
పైన వివరించిన లక్షణాలు, వ్యాపార సంస్థల యొక్క స్వభావం, పరిమాణం, యాజమాన్య రీతులతో సంబంధం లేకుండా అన్ని రకాల వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి.
ప్రశ్న 2.
వ్యాపారం యొక్క వివిధ ధ్యేయాలను వివరించండి.
జవాబు.
వ్యాపార ధ్యేయాలు: ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొనటం కోసం ఏర్పాటు చేసుకునే గమ్యాలను, ఉద్దేశ్యాలను ధ్యేయాలు అంటారు. కాబట్టి ప్రతి వ్యాపార సంస్థ కూడా కొన్ని నిర్దిష్టమైన ధ్యేయాలను కలిగి ఉంటుంది. ఈ ధ్యేయాలను స్థూలంగా క్రింద పేర్కొన్న నాలుగు రకాలుగా చెప్పవచ్చు.
- ఆర్థిక ధ్యేయాలు
- సామాజిక ధ్యేయాలు
- మానవ సంబంధిత ధ్యేయాలు
- జాతీయ ధ్యేయాలు
1) ఆర్థిక ధ్యేయాలు: వ్యాపారమనేది సాధారణంగా ఆర్థిక కార్యకలాపాల సమూహం. అందువల్ల వీటి యొక్క ప్రాథమిక ధ్యేయాలు ఆర్థిక స్వభావాన్నే కల్గి ఉంటాయి. కాబట్టి వ్యాపారం యొక్క ఈ ఆర్థిక ధ్యేయాలను తిరిగి క్రింది విధంగా గుర్తించవచ్చు.
I. లాభాల సంపాదన: ఏ వ్యాపార సంస్థ అయిన లాభార్జనే ప్రధాన ధ్యేయంగా స్థాపించబడుతుంది. ఇది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన ప్రేరణ, ప్రోత్సాహకం. అలా లాభార్జన అనేది వ్యాపార మనుగడకు అత్యంత ఆవశ్యకం. మనిషి ఊపిరితో బ్రతకడానికి భోజనం ఎంత అవసరమో, దీపం వెలగడానికి నూనె ఎలా అవసరమో, వ్యాపారం కొనసాగడానికి లాభం కూడా అంతే ప్రముఖమైంది. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కూడా ఈ లాభాలు ఎంతగానో దోహదపడతాయి.
II. ఖాతాదారుల సృష్టి: ఖాతాదారుల యొక్క అవసరాలను, కోరికలను తీర్చడానికి గాను వ్యాపారస్తుడు పెట్టిన శ్రమకు ప్రతిఫలమే లాభాల సృష్టి. పీటర్. ఎఫ్. డ్రక్కర్ మాటలలో చెప్పాలంటే “వ్యాపారం అంతిమ లక్ష్యం ఖాతాదారులను తయారు చేయడమే”. కాబట్టి తన వస్తు – సేవలను కొనుగోలు చేసి, నగదు చెల్లించేందుకు చాలినంత మంది వినియోగదారులుంటేనే వ్యాపార సంస్థ లాభాలు సంపాదిస్తుంది. ఖాతాదారులను సంతృప్తి పరచకుండా ఏ వ్యాపార సంస్థ విజయం సాధించదు. అందువల్ల వినియోగదారులను తయారు చేయడం, సంతృప్తిపరచడం ప్రతి వ్యాపారానికి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం.
III. నవకల్పన: కొత్త పద్ధతులను, విధానాలను, పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే నవకల్పన. నవకల్పన అంటే కొత్త వస్తువులను ఆవిష్కరించడం మాత్రమే కాదు, పాత వస్తువును మెరుగుపరచడం, వ్యయాలను తగ్గించడం కూడా నవకల్పనే. నవకల్పన రేటుపైనే వ్యాపార విజయాల రేటు కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఆధునిక వ్యాపార సంస్థలు పరిశోధన, అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
IV. వనరుల అభిలషణీయ వినియోగం: ముడి పదార్థాలు, యంత్రాలు, ద్రవ్యం మరియు మానవ వనరులను చక్కగా ఉపయోగించుకోవడాన్ని వనరుల అభిలషణీయ వినియోగం అంటారు. దుబారా నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం, పునర్ ప్రక్రియ యంత్రాంగాన్ని వాడడం, పనివారికి సరైన శిక్షణ ఇవ్వడం మరియు ద్రవ్యాన్ని సమర్థవంతంగా ఖర్చు చేయడం మొదలైనవి వనరుల అభిలషణీయ వినియోగం అనే ధ్యేయం సాధించడానికి సహాయపడును.
2) సామాజిక ధ్యేయాలు: వ్యాపారం అనేది శూన్యంలో ఉండదు. ఇది సమాజంలో ఒక భాగం. సమాజం యొక్క తోడ్పాటు, మద్దతు లేనిదే ఏ వ్యాపారం విజయవంతం కాదు. అందువల్ల ప్రతి వ్యాపార సంస్థ సమాజం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని గుర్తించడం జరిగింది.
I. నాణ్యమైన వస్తువులు మరియు సేవలను సమంజసమైన ధరలకు సమకూర్చడం నాణ్యమైన వస్తువులను మరియు సేవలను సమంజసమైన ధరలకు వినియోగదారులకు అందజేయడం వ్యాపార సంస్థ యొక్క ప్రధాన బాధ్యత. అంతేకాకుండా కల్తీ లేకుండా చూడడం, స్మగ్లింగ్, నల్లబజారు వ్యవహారాలు, తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలు లేకుండా చూడడం కూడా వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత.
II. ఉద్యోగులకు సముచిత ప్రతిఫలం: తాము చేసిన పనికి ఉద్యోగులకు చెల్లించే ప్రతిఫలం సముచితమైనదిగా, ఆకర్షణీయమైనదిగా ఉండాలి. అలాగే ఆ ప్రతిఫలంను సకాలంలో చెల్లించాలి. ఉద్యోగులకు జీతాలు, వేతనాలు లాంటి చెల్లింపులతో పాటు లాభాలలో సమంజసమైన భాగాన్ని కూడా చెల్లించాలి. తద్వారా ఉద్యోగుల యొక్క సామర్థ్యం, ప్రేరణ పెరుగుతాయి.
III. ఉద్యోగాల కల్పన: సమాజంలోని యువతరానికి అవసరమైన మేరకు ఉద్యోగాలను కల్పించటం కూడా వ్యాపారం యొక్క సామాజిక ధ్యేయం. నిరుద్యోగం బాగా ఉన్న భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ఉద్యోగాల కల్పన గొప్ప సేవ అవుతుంది.
IV. సాంఘీక సంక్షేమం: సమాజంలో సాంఘీక సంక్షేమాన్ని కల్పించడంలో భాగంగా వ్యాపారం, సాంఘీక, సాంస్కృతిక మరియు మతపరమైన ధార్మిక సంస్థలకు మద్దతు ఇవ్వాలి. అందులో భాగంగా పాఠశాలలను, కళాశాలలను, గ్రంథాలయాలను, ధర్మశాలలను, వైద్యాలయాలను, క్రీడా సంస్థలను, పరిశోధనా సంస్థలను నిర్మించవచ్చు మరియు వివిధ సహాయ సహకారాల ద్వారా ప్రోత్సహించవచ్చు.
V. ప్రభుత్వానికి బకాయిల మరియు పన్నుల చెల్లింపు: ప్రతి వ్యాపార సంస్థ నిజాయితీగా, ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులను మరియు బకాయిలను సకాలంలో చెల్లించాలి. సామాజిక లక్ష్యాలను, నియమాలను, విలువలను దృష్టిలో ఉంచుకొని తమ యొక్క వ్యాపార విధానాలను రూపొందించుకోవాలి.
3) మానవ సంబంధిత ధ్యేయాలు: వ్యాపారం యొక్క మానవ సంబంధిత ధ్యేయాలను కింది విధంగా చెప్పవచ్చు.
I. కార్మిక సిబ్బంది సంక్షేమం: ఏ వ్యాపార సంస్థకైనా అందులో పనిచేసే కార్మికులు చాలా ఉపయోగకరమైన మానవ వనరులు. కాబట్టి శ్రామిక శక్తిలోని ప్రత్యేకతలను వ్యాపార సంస్థలు గుర్తించాలి.
II. మానవ వనరుల అభివృద్ధి: వ్యాపార సంస్థలో పనిచేసే వివిధ స్థాయిలలోని మానవ వనరుల యొక్క నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు ఆ సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి కొత్త నైపుణ్యాలను, ధోరణులను అలవరచుకోవడానికి ఉద్యోగులకు చాలినన్ని అవకాశాలను వ్యాపార సంస్థలు కల్పించాలి. వారికి వివిధ పని సంబంధిత అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా, వర్క్షాప్లు నిర్వహించడం ద్వారా వారి సామర్థ్యాల పెరుగుదలకు దోహదపడాలి.
III. సిబ్బంది పాల్గొనే నిర్వహణ: వ్యాపార నిర్వహణలో వివిధ స్థాయిల్లో పనిచేసే సిబ్బందిని భాగస్వాములను చేయడాన్ని ‘సిబ్బంది పాల్గొనే నిర్వహణ’ అంటారు. సిబ్బందిని వ్యాపార సంస్థ విధానాల రూపకల్పనలో మరియు నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో భాగస్తులను చేయాలి.
IV. శ్రామికుల, యజమానుల సహకారం: సంస్థలో పనిచేసే శ్రామికుల మరియు యజమానుల మధ్య సత్సంబంధాలు నెలకొని ఉండాలి. కాబట్టి అలాంటి సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక శాంతి, ప్రగతిని నెలకొల్పడానికి వ్యాపార సంస్థలు ఎప్పుడు కృషి చేయాలి.
4) జాతీయ ధ్యేయాలు: వ్యాపారం యొక్క జాతీయ ధ్యేయాలను క్రింది విధంగా వివరించవచ్చును.
I. వనరుల గరిష్ఠ వినియోగం: వ్యాపార సంస్థ జాతీయ వనరులను సమంజసమైన పద్ధతిలో వినియోగించు కోవాలి. అరుదైన వనరులను గరిష్టంగా న్యాయబద్ధమైన క్రమంలో ఉపయోగించకపోతే సత్వర అభివృద్ధి గాని, ప్రాంతీయ అసమానతలు లేని అభివృద్ధి కాని సాధ్యం కాదు.
II. జాతీయ స్వాభిమానం: ఎగుమతులను పెంపొందించి, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవడం ద్వారా వ్యాపార సంస్థ ప్రభుత్వానికి సహాయపడాలి. ఆర్థిక స్వావలంబన సాధించుటకు ఇది దోహదపడుతుంది.
III. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి: చిన్నతరహా పరిశ్రమలు ఉద్యోగాల కల్పనలో ముందు ఉంటాయి. అందువల్ల పెద్ద వ్యాపార సంస్థలు చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడాలి. పెద్దతరహా పరిశ్రమల అనుబంధంగా చిన్నతరహా సంస్థలను అభివృద్ధి చేయాలి.
IV. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి: దేశంలో వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణకు వ్యాపార సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే ప్రాంతీయ, సమానాభివృద్ధి అత్యవసరం. వెనుకబడిన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ఇది దోహదపడుతుంది. వెనుకబడిన ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నెలకొల్పినందుకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు.
ప్రశ్న 3.
వ్యాపారం యొక్క సామాజిక బాధ్యతను చర్చించండి.
జవాబు.
సామాజిక బాధ్యత భావన:
1) వ్యాపార సంస్థలు ప్రజల ఆసక్తిని సంరక్షించి, వాటికి అనుగుణంగా నిర్వర్తించే బాధ్యతనే వ్యాపారపు సామాజిక -బాధ్యత అంటారు. సమాజంలో ఎవరితో అయితే వ్యాపారం సన్నిహితంగా ఉంటుందో వాళ్ళకు అవసరమైన విధంగా బాధ్యతలను నేరవేర్చడాన్ని సామాజిక బాధ్యత అంటారు.
2) ప్రతి వ్యాపార సంస్థ సమాజములో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సమాజము యొక్క వనరులను ఉపయోగించి సమాజముపైన ఆధారపడుతుంది. దీని వలన సమాజము యొక్క సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత వ్యాపారము మీదనే ఉంటుంది.
3) ఏ సమాజములో అయితే ఒక వ్యాపారము తన కార్యకలాపాలను నిర్వహిస్తుందో ఆ సమాజ శ్రేయస్సును కాపాడటానికి వ్యాపారానికి ఉండే బాధ్యతను సామాజిక బాధ్యతగా చెప్పుకోవచ్చు.
4) వ్యక్తులు లాభాన్ని ఆర్జించటానికి వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వ్యాపారము యొక్క ధ్యేయము కేవలము లాభాలను ఆర్జించటమే కాదు. వ్యాపార సంస్థ కూడా సమాజంలో భాగమే కాబట్టి అనేక సాంఘిక విధులను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది.
5) వ్యాపారస్తుడు సమాజానికి చెడు చేసే కార్యకలాపాలను చేపట్టకూడదు. అందువలన సామాజిక బాధ్యత భావన ఒక వ్యాపారస్తుడిని లాభాలను ఆర్జించటానికి వస్తువులకు కృత్రిమ కొరత కల్పించడము, దొంగ వ్యాపారము, కల్తీచేయుట, పన్నులు ఎగగొట్టుట మొదలైన వాటిని నిరుత్సాహపరుస్తుంది.
6) లాభాలను ఆర్జించటానికి సక్రమమైన రీతిలో వ్యాపారాన్ని నిర్వహించుట, ఉద్యోగస్తులు పనిచేయడానికి మంచి వాతావరణాన్ని ఏర్పరచుట, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించుట, వాతావరణ కాలుష్యాన్ని నివారించుట, జాతీయ వనరులను కాపాడుట మొదలైన వాటికి తోడ్పడేటట్లు చేస్తుంది.
వివిధ ఆసక్తి గల వర్గాలకు గల బాధ్యత: వ్యాపారము యజమానులు, ఉద్యోగస్తులు, సరఫరాదారులు, వినియోగదారులు, ప్రభుత్వము మరియు సమాజముతో వ్యవహరిస్తుంది. వ్యాపారము చేపట్టి ప్రతి కార్యకలాపము పై వర్గాలకు ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా ప్రభావము ఉంటుంది. కాబట్టి వారిని ఆసక్తి గల వర్గాలుగా వర్ణించినారు.
వివిధ వర్గాలకు సామాజిక బాధ్యతలు:
1) యజమానుల విషయంలో బాధ్యతలు: వ్యాపారము యొక్క యజమానులు వ్యాపారమునకు అవసరమయ్యే మూలధనాన్ని సమకూర్చి నష్టభయాన్ని స్వీకరిస్తారు. యజమానుల విషయంలో వ్యాపార బాధ్యతలు ఈ క్రింద రాయబడినవి.
- వ్యాపారాన్ని సమర్ధవంతముగా నిర్వహించుట.
- మూలధనాన్ని ఇతర వనరులను సరిగా ఉపయోగించుకోవడం.
- మూలధన వృద్ధి పెంపుదల.
- పెట్టుబడులపై న్యాయమైన ఆర్జనలను డివిడెండ్ల రూపములో పంచడం.
2) ఉద్యోగుల విషయంలో బాధ్యతలు: వ్యాపార సంస్థ భవిష్యత్తు, అందులో పనిచేసే ఉద్యోగస్తుల శక్తి, సామర్థ్యాలపై అధారపడి ఉంటుంది. సంస్థలోని ఉద్యోగులపట్ల వ్యాపారానికి వారి ఆసక్తులను పరిరక్షించవలసిన సామాజిక బాధ్యత ఉన్నది.
ఉద్యోగులపట్ల వ్యాపారానికి గల బాధ్యతలు ఈ క్రింద ఉన్నవి:
- సకాలంలో సక్రమంగా వేతనాలు, జీతాలను చెల్లించడం.
- పని చేయడానికి మంచి వాతావరణాన్ని కల్పించి, వారి శ్రేయస్సుకు సంక్షేమ సదుపాయాలు.
- తగిన శిక్షణ ద్వారా వారి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుట.
- ఉద్యోగ భద్రత, సామాజిక బాధ్యత పథకాలు పెన్షన్, పదవీ విరమణ సౌకర్యాలు, గ్రూపు భీమాలు కల్పించుట.
3) సరఫరాదారుల గురించి బాధ్యత: సంస్థ ఉత్పత్తికి అవసరమయ్యే ముడిపదార్థాలను, ఇతర మెటీరియల్స్ను వీరు సప్లయి చేస్తారు. వీరిని పంపిణీదారులు అని కూడా పిలుస్తారు.
సప్లదారులపై వ్యాపార సంస్థ బాధ్యతలు:
- నాణ్యమైన వస్తువులను సమంజసమైన ధరలకు పొందడం.
- సకాలములో బకాయిలను చెల్లించడము.
- న్యాయమైన షరతులు ఏర్పాటు చేయుట.
- సమంజసమైన అరువు కాలాన్ని వినియోగించుకొనుట.
4) ఖాతాదారుల విషయంలో బాధ్యతలు: వ్యాపార సంస్థ మనుగడను సాగించవలెనంటే వారికి ఈ క్రింది వసతులు సమకూర్చవలెను.
వినియోగదారుని పట్ల వ్యాపారానికి గల బాధ్యతలు:
- మంచి నాణ్యతగల వస్తుసేవలను అందించవలెను.
- వస్తువులను సకాలములో డెలివరీ చేయవలెను.
- తక్కువ ధరలకు వస్తువులను అమ్మవలెను.
- అమ్మకానంతరము సేవలు అందించుట.
- వినియోగదారుల ఫిర్యాదులు ఏవైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించడం.
- తక్కువ తూకము, వస్తువులలో కల్తీ మొదలైన అనుచిత చర్యలకు పాల్పడరాదు.
5) ప్రభుత్వ విషయంలో బాధ్యత: వ్యాపారము ప్రభుత్వము రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణముగా నిర్వహించ వలెను.
ప్రభుత్వ విషయంలో వ్యాపారానికి బాధ్యతలు:
- పన్నులు, డ్యూటీలు సక్రమంగా, నిజాయితీగా సకాలములో చెల్లించుట.
- ప్రభుత్వ నిబంధనలకు అనుగుణముగా సంస్థలను స్థాపించుట.
- ప్రభుత్వం రూపొందించిన కాలుష్య నివారణ నియమాలను పాటించడం.
- లంచగొండితనం లాంటి అవినీతి పద్ధతులకు దూరంగా ఉండటం.
6) సమాజం విషయంలో బాధ్యత: వ్యాపారము సమాజములో ఒక భాగము అయినందున సమాజములోని ఇతర సభ్యులతో సంబంధాలను ఏర్పరచుకొనవలెను.
వ్యాపారానికి సమాజముపట్ల బాధ్యతలు:
- సమాజములోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం.
- ఉద్యోగ అవకాశాలను కల్పించడం.
- పర్యావరణ పరిరక్షణ.
- ప్రకృతి వనరులను, జీవజాలాన్ని సక్రమముగా వినియోగించుట.
- క్రీడలు, సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడం.
ప్రశ్న 4.
వివిధ ఆర్థిక కార్యకలాపాల వర్గీకరణను వివరించండి.
జవాబు.
మానవులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఏదో ఒక వ్యాపకములో నిమగ్నమై ఉంటారు. కోర్కెల స్వభావాన్నిబట్టి మానవ కార్యకలాపాలను ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలుగా విభజించవచ్చు. ద్రవ్యార్జన కోసము కాని, జీవనోపాధిని సంపాదించడానికి కాని మానవుడు చేయు పనులను ఆర్థిక సంబంధమైన కార్యకలాపాలు అంటారు. ఇవి వస్తుసేవల ఉత్పత్తి, వినిమయము మరియు పంపిణీతో సంబంధము కలిగి ఉంటాయి. ప్రేమాభిమానాలతోగాని, సాంఘిక బాధ్యతతో గాని, దేశభక్తితో మానవుడు చేసే పనులను ఆర్థికేతర కార్యకలాపాలు అనవచ్చు. ఈ కార్యకలాపాల ఉద్దేశ్యము సేవలను అందించి తృప్తి పొందడమేకాని లాభార్జన కాదు.
ఆర్థిక కార్యకలాపాల వర్గీకరణ: ఆర్థిక కార్యకలాపాలను మరల మూడు రకాలుగా విభజించవచ్చును. అవి:
- వ్యాపారము
- వృత్తి
- ఉద్యోగము
1) వ్యాపారము: వ్యాపారము ఆర్థిక సంబంధమైన వ్యాపకము. ద్రవ్యార్జన మరియు సంపాదన కూడబెట్టుట అనే ఉద్దేశాలతో వస్తుసేవలను ఉత్పత్తిచేసి పంపిణీ చేసే ప్రక్రియ వ్యాపారము. వ్యాపారము చేయుటలో ప్రధాన ఉద్దేశ్యము లాభాన్ని సంపాదించడమే. వ్యాపారము అనే పదానికి అర్థము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండుట.
2) వృత్తి: (పత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణలు ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అంద వ్యాపకాన్ని వృత్తి అంటారు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మొదలైనవారు అందజేయు కిందకు వస్తాయి. సాధారణముగా ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క సంఘము ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది అకౌంటెంట్లకు సంబంధించిన వృత్తిపరమైన సంఘము. ఒక వృత్తిని చేపట్టుటకు వ్యక్తికి ఉండవలసిన విద్యార్హతలు ఏమిటి, అతనికి ఎటువంటి శిక్షణ ఉండాలి, ఆ వృత్తిలో పాటించవలసిన నియమాలు మొదలైన విషయాలను వృత్తి సంఘాలు నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఒక వృత్తిని చేపట్టే వ్యక్తి దానికి సంబంధించిన సంఘములో సభ్యుడై ఉండాలి. దాని నియమ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలి. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును.
3) ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారముగాని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, ఎవరికయితే పని అప్పగించబడినదో ఆ వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని యొక్క ఆదేశాల ప్రకారము పనిని చేస్తాడు. తన సేవలను అందించినందుకు ఉద్యోగి, యజమాని నుంచి కొంత ప్రతిఫలాన్ని పొందుతాడు. ఆ ప్రతిఫలాన్ని వేతనము లేదా జీతము అంటారు. కొన్ని సమయాలలో వృత్తిని చేపట్టినవారు కూడ ఉద్యోగ కాంట్రాక్టు కింద పనిచేయవచ్చును. చార్టర్డ్ అకౌంటెంట్లను కంపెనీ నియమించవచ్చును. ప్రభుత్వ విభాగములోగాని, ప్రయివేటు వ్యవస్థలోగాని సేవలను అందించవచ్చును.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యాపార ధ్యేయాలను తెలపండి.
జవాబు.
వ్యాపార ధ్యేయాలను ఆర్థిక, సాంఘిక, మానవత మరియు జాతీయ ధ్యేయాలుగా విభజించవచ్చును.
1) ఆర్థిక ధ్యేయాలు:
- లాభార్జన.
- ఖాతాదారుల సృష్టి.
- నవకల్పన
- వనరుల అభిలషణీయ వినియోగం
2) సాంఘిక ధ్యేయాలు:
- నాణ్యమైన వస్తువులను, సేవలను సమంజసమైన ధరలకు సమకూర్చడం.
- ఉద్యోగులకు న్యాయమైన ప్రతిఫలము.
- ఉద్యోగ అవకాశాల కల్పన.
- ప్రభుత్వానికి సహకారము (బకాయిలు మరియు పన్నుల చెల్లింపు)
- సాంఘిక సంక్షేమము.
3) మానవత ధ్యేయాలు:
- యాజమాన్యానికి, శ్రామికుల మధ్య సహకారము.
- కార్మిక, సిబ్బంది సంక్షేమం.
- మానవ వనరుల అభివృద్ధి.
- సిబ్బంది పాల్గొనే నిర్వహణ.
4) జాతీయ ధ్యేయాలు:
- జాతీయ అవసరాలకు అనుగుణముగా వస్తువుల ఉత్పత్తి. (జాతీయ స్వాభిమానం)
- సహజ వనరుల గరిష్ఠ వినియోగం.
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి.
- చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి.
ప్రశ్న 2.
ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏమిటి ?
జవాబు.
వ్యాపార ఆర్థిక కార్యకలాపాలను వ్యాపారము, వృత్తి, ఉద్యోగము అని మూడు రకాలుగా విభజించవచ్చును. వ్యాపారము: సాహిత్యపరముగా వ్యాపారము అంటే నిరంతరము శ్రమిస్తూ ఉండే స్థితి. ప్రతి వ్యక్తి ఏదో ఒక పనిచేస్తూ నిమగ్నమై ఉంటాడు. లాభార్జన ధ్యేయంతో చేపట్టే వ్యాపకమే వ్యాపారము. వ్యాపార కార్యకలాపాలు వస్తు సేవల ఉత్పత్తి లేదా వినిమయం లాభార్జన లేదా జీవనోపాధి కోసము జరుగుతాయి.
వృత్తి: ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును.
ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంట్లకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును.
ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారము ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి కొంత ప్రతిఫలాన్ని జీతము రూపములో పొందుతాడు.
ప్రశ్న 3.
సామాజిక ధ్యేయాలు గూర్చి రాయండి.
జవాబు.
సామాజిక ధ్యేయాలు: వ్యాపారం అనేది శూన్యంలో ఉండదు. ఇది సమాజంలో ఒక భాగం. సమాజం యొక్క తోడ్పాటు, మద్దతు లేనిదే ఏ వ్యాపారం విజయవంతం కాదు. అందువల్ల ప్రతి వ్యాపార సంస్థ సమాజం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని గుర్తించడం జరిగింది.
I. నాణ్యమైన వస్తువులు మరియు సేవలను సమంజసమైన ధరలకు సమకూర్చడం: నాణ్యమైన వస్తువులను మరియు సేవలను సమంజసమైన ధరలకు వినియోగదారులకు అందజేయడం వ్యాపార సంస్థ యొక్క ప్రధాన బాధ్యత. అంతేకాకుండా కల్తీ లేకుండా చూడడం, స్మగ్లింగ్, నల్లబజారు వ్యవహారాలు, తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలు లేకుండా చూడడం కూడా వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత.
II. ఉద్యోగులకు సముచిత ప్రతిఫలం: తాము చేసిన పనికి ఉద్యోగులకు చెల్లించే ప్రతిఫలం సముచితమైనదిగా, ఆకర్షణీయమైనదిగా ఉండాలి. అలాగే ఆ ప్రతిఫలంను సకాలంలో చెల్లించాలి. ఉద్యోగులకు జీతాలు, వేతనాలు లాంటి చెల్లింపులతో పాటు లాభాలలో సమంజసమైన భాగాన్ని కూడా చెల్లించాలి. తద్వారా ఉద్యోగుల యొక్క సామర్థ్యం, ప్రేరణ పెరుగుతాయి.
III. ఉద్యోగాల కల్పన: సమాజంలోని యువతరానికి అవసరమైన మేరకు ఉద్యోగాలను కల్పించటం కూడా వ్యాపారం యొక్క సామాజిక ధ్యేయం. నిరుద్యోగం బాగా ఉన్న భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ఉద్యోగాల కల్పన గొప్ప సేవ అవుతుంది.
IV. సాంఘీక సంక్షేమం: సమాజంలో సాంఘీక సంక్షేమాన్ని కల్పించడంలో భాగంగా వ్యాపారం, సాంఘిక, సాంస్కృతిక మరియు మతపరమైన ధార్మిక సంస్థలకు మద్దతు ఇవ్వాలి. అందులో భాగంగా పాఠశాలలను, కళాశాలలను, గ్రంథాలయాలను, ధర్మశాలలను, వైద్యాలయాలను, క్రీడా సంస్థలను, పరిశోధనా సంస్థలను నిర్మించవచ్చు మరియు వివిధ సహాయ సహకారాల ద్వారా ప్రోత్సహించవచ్చు.
V. ప్రభుత్వానికి బకాయిలు మరియు పన్నుల చెల్లింపు: ప్రతి వ్యాపార సంస్థ నిజాయితీగా, ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులను మరియు బకాయిలను సకాలంలో చెల్లించాలి. సామాజిక లక్ష్యాలను, నియమాలను, విలువలను దృష్టిలో ఉంచుకొని తమ యొక్క వ్యాపార విధానాలను రూపొందించుకోవాలి.
ప్రశ్న 4.
జాతీయ ధ్యేయాల గూర్చి రాయండి.
జవాబు.
జాతీయ ధ్యేయాలు: వ్యాపారం యొక్క జాతీయ ధ్యేయాలను క్రింది విధంగా వివరించవచ్చును.
I. వనరుల గరిష్ఠ వినియోగం: వ్యాపార సంస్థ జాతీయ వనరులను సమంజసమైన పద్ధతిలో వినియోగించు కోవాలి. అరుదైన వనరులను గరిష్టంగా న్యాయబద్ధమైన క్రమంలో ఉపయోగించకపోతే సత్వర అభివృద్ధి గాని, ప్రాంతీయ అసమానతలు లేని అభివృద్ధి కాని సాధ్యం కాదు.
II. జాతీయ స్వాభిమానం: ఎగుమతులను పెంపొందించి, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవడం ద్వారా వ్యాపార సంస్థ ప్రభుత్వానికి సహాయపడాలి. ఆర్థిక స్వావలంబన సాధించుటకు ఇది దోహదపడుతుంది.
III. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి చిన్నతరహా పరిశ్రమలు ఉద్యోగాల కల్పనలో ముందు ఉంటాయి. అందువల్ల పెద్ద వ్యాపార సంస్థలు చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడాలి. పెద్దతరహా పరిశ్రమల అనుబంధంగా చిన్నతరహా సంస్థలను అభివృద్ధి చేయాలి.
IV. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దేశంలో వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణకు వ్యాపార సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే ప్రాంతీయ, సమానాభివృద్ధి అత్యవసరం. వెనుకబడిన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ఇది దోహదపడుతుంది. వెనుకబడిన ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నెలకొల్పినందుకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు.
V. ప్రభుత్వానికి బకాయిల మరియు పన్నుల చెల్లింపు: ప్రతి వ్యాపార సంస్థ నిజాయితీగా, ప్రభుత్వానికి చెల్లించవలసిన వివిధ రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులను మరియు బకాయిలను సకాలంలో చెల్లించాలి. సామాజిక లక్ష్యాలను, నియమాలను, విలువలను దృష్టిలో ఉంచుకొని తమ యొక్క వ్యాపార విధానాలను రూపొందించుకోవాలి.
ప్రశ్న 5.
వ్యాపారంలో ‘లాభం’ పాత్రను వివరించండి.
జవాబు.
వ్యాపారం యొక్క ప్రాథమిక మరియు ప్రధాన ఉద్దేశ్యం “లాభార్జన”. ఏ వ్యాపార సంస్థ అయినా లాభార్జనే ప్రధాన ధ్యేయంగా స్థాపించబడుతుంది. మనిషికి ఊపిరి బ్రతకడానికి భోజనం ఎంత అవసరమో, దీపం వెలగడానికి నూనె ఎలా అవసరమో, వ్యాపారం కొనసాగడానికి లాభం కూడా అంటే ప్రముఖమైంది.
వ్యాపారంలో లాభం యొక్క పాత్ర:
- వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన ప్రేరణ, ప్రోత్సాహకం లాభం. లాభాన్ని పొందాలి అనే కోరికతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
- వ్యాపారాన్ని విస్తరించడానికి లాభాలు దోహదపడతాయి.
- వ్యాపార అభివృద్ధికి లాభాలు అవసరం.
- సంపద సృష్టికి లాభాలు తోడ్పడతాయి.
- వ్యాపారాల ఆధునీకరణకు లాభాలు ఉపయోగపడతాయి.
- నిరంతర మూలధన ప్రవాహానికి లాభాలు సహకరిస్తాయి.
వ్యాపార సంస్థ స్థిరత్వానికి, సామర్థ్యానికీ, ప్రగతికీ లాభాలు గీటురాయిలా ఉపయోగపడతాయి. అయితే లాభార్జన చట్టబద్దమైన, సమంజసమైన పద్దతిలో ఉండాలి. సమాజాన్ని మోసం చేస్తూ, వ్యక్తులకు కీడు చేస్తూ సంపాదించరాదు.
ప్రశ్న 4.
జాతీయ ధ్యేయాల గూర్చి రాయండి.
జవాబు.
జాతీయ ధ్యేయాలు: వ్యాపారం యొక్క జాతీయ ధ్యేయాలను క్రింది విధంగా వివరించవచ్చును.
I. వనరుల గరిష్ఠ వినియోగం: వ్యాపార సంస్థ జాతీయ వనరులను సమంజసమైన పద్ధతిలో వినియోగించు కోవాలి. అరుదైన వనరులను గరిష్టంగా న్యాయబద్ధమైన క్రమంలో ఉపయోగించకపోతే సత్వర అభివృద్ధి గాని, ప్రాంతీయ అసమానతలు లేని అభివృద్ధి కాని సాధ్యం కాదు.
II. జాతీయ స్వాభిమానం: ఎగుమతులను పెంపొందించి, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవడం ద్వారా వ్యాపార సంస్థ ప్రభుత్వానికి సహాయపడాలి. ఆర్థిక స్వావలంబన సాధించుటకు ఇది దోహదపడుతుంది.
III. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి: చిన్నతరహా పరిశ్రమలు ఉద్యోగాల కల్పనలో ముందు ఉంటాయి. అందువల్ల పెద్ద వ్యాపార సంస్థలు చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడాలి. పెద్దతరహా పరిశ్రమల అనుబంధంగా చిన్నతరహా సంస్థలను అభివృద్ధి చేయాలి.
IV. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి: దేశంలో వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణకు వ్యాపార సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే ప్రాంతీయ, సమానాభివృద్ధి అత్యవసరం. వెనుకబడిన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ఇది దోహదపడుతుంది. వెనుకబడిన ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నెలకొల్పినందుకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు.
ప్రశ్న 5.
వ్యాపారంలో ‘లాభం’ పాత్రను వివరించండి.
జవాబు.
వ్యాపారం యొక్క ప్రాథమిక మరియు ప్రధాన ఉద్దేశ్యం “లాభార్జన”. ఏ వ్యాపార సంస్థ అయినా లాభార్జనే ప్రధాన ధ్యేయంగా స్థాపించబడుతుంది. మనిషికి ఊపిరి బ్రతకడానికి భోజనం ఎంత అవసరమో, దీపం వెలగడానికి నూనె ఎలా అవసరమో, వ్యాపారం కొనసాగడానికి లాభం కూడా అంటే ప్రముఖమైంది.
వ్యాపారంలో లాభం యొక్క పాత్ర:
- వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన ప్రేరణ, ప్రోత్సాహకం లాభం. లాభాన్ని పొందాలి అనే కోరికతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
- వ్యాపారాన్ని విస్తరించడానికి లాభాలు దోహదపడతాయి.
- వ్యాపార అభివృద్ధికి లాభాలు అవసరం.
- సంపద సృష్టికి లాభాలు తోడ్పడతాయి.
- వ్యాపారాల ఆధునీకరణకు లాభాలు ఉపయోగపడతాయి.
- నిరంతర మూలధన ప్రవాహానికి లాభాలు సహకరిస్తాయి.
వ్యాపార సంస్థ స్థిరత్వానికి, సామర్థ్యానికీ, ప్రగతికీ లాభాలు గీటురాయిలా ఉపయోగపడతాయి. అయితే లాభార్జన చట్టబద్దమైన, సమంజసమైన పద్ధతిలో ఉండాలి. సమాజాన్ని మోసం చేస్తూ, వ్యక్తులకు కీడు చేస్తూ సంపాదించరాదు.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యాపారం.
జవాబు.
అర్థము:
- వ్యాపారాన్ని ఆంగ్లంలో ‘బిజినెస్’ అంటారు. దీని అర్థం ‘బిజీ’గా ఉండటం. అంటే ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉండటం.
- లాభార్జనే ప్రధాన ధ్యేయంగా వస్తుసేవల ఉత్పత్తి, వినిమయం, పంపిణీ మరియు అమ్మకాన్ని వ్యాపారం అంటారు.
నిర్వచనాలు:
1) ఎల్.హెచ్.హనీ ప్రకారం:
“వస్తువుల కొనుగోలు, అమ్మకం ద్వారా సంపద సృష్టించడం లేదా సేకరించడంలో నిమగ్నమయ్యే మానవ కార్యకలాపాలే వ్యాపారం”.
2) స్టిఫెన్ సన్ ప్రకారం:
“మానవుల కోరికలను సంతృప్తిపరచడం కోసం లాభార్జన లక్ష్యంగా, సంపద సృష్టించడానికి, నిర్ణీత ధరకు క్రమబద్ధంగా వస్తు సేవల వినిమయంలో ఉండే ఆర్థిక చర్యలనే “వ్యాపారం” అంటారు”.
3) కీత్ మరియు కార్లో ప్రకారం:
“వ్యక్తిగత లాభాల కోసం వస్తుసేవల ఉత్పత్తి, పంపిణీలలో ఇమిడి ఉండే అన్ని పనులు సముదాయం”.
ప్రశ్న 2.
మానవ కార్యకలాపాలు.
జవాబు.
- మానవులు తమ నిత్య జీవితంలో నిర్వర్తించే వివిధ కార్యకలాపాల సమూహాన్ని మానవ కార్యకలాపాలు అంటారు. వారు తమ యొక్క అవసరాలను, కోరికలను మరియు సౌకర్యాలను తీర్చుకోవడం కొరకు ఆ మానవ కార్యకలాపాలను నిర్వర్తిస్తారు.
- మానవ కార్యకలాపాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
ప్రశ్న 3.
వృత్తి.
a) ఆర్థిక కార్యకలాపాలు
b) ఆర్థికేతర కార్యకలాపాలు.
జవాబు.
- ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును.
- ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంటుకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును.
ప్రశ్న 4.
ఉద్యోగం.
జవాబు.
- ఒక ఒప్పందము ప్రకారము గాని లేదా సేవా నియమాల ప్రకారము గాని ఒక వ్యక్తి, మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది.
- పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి ప్రతిఫలాన్ని జీతము రూపములో పొందుతాడు.
ప్రశ్న 5.
రిస్క్, అనిశ్చితత్వం.
జవాబు.
1) వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశాన్ని ‘రిస్క్ ‘ లేదా ‘నష్టభయం’ అంటారు. అలాగే వ్యాపారంలో జరిగే వ్యవహారాలను గాని, పరిస్థితులను గాని, లాభం సంపాదించే అవకాశాలను గాని ఖచ్చితంగా చెప్పలేని స్థితిని ‘అనిశ్చితి’ అంటారు. 2) డిమాండు, ధర, పోటీ, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ల పరిస్థితులు ఇలా అనేక అంశాలు వ్యాపారాన్ని ప్రభావితపరుస్తాయి. ఇవి ఏవీ ఖచ్చితంగా వ్యాపారస్తుని అదుపులో ఉంచవు. కాబట్టి వ్యాపారంలో ఎప్పుడు నష్టభయం, అనిశ్చితి ఉంటుంది.
అదనపు ప్రశ్నలు
ప్రశ్న 1.
భారతదేశంలో వాణిజ్యం యొక్క అభివృద్ధి దశలను వివరించండి.
జవాబు.
నేటి ఆధునిక వాణిజ్యం బాగా అభివృద్ధి చెందినటువంటి వినిమయ వ్యవస్థ. మానవ చరిత్ర పరిమాణంలో వినిమయ వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి వాణిజ్యం యొక్క పుట్టుక, అభివృద్ధి క్రమాన్ని క్రింది వివిధ దశలలో గమనించవచ్చు.
1) గృహ వ్యవస్థ: ఆర్థికాభివృద్ధిలో గృహ వ్యవస్థ మొదటి దశ. ఈ దశలో ‘శ్రమ విభజన’ అనే అంశం ఒక కుటుంబం లేదా ఒక ఇంటికే పరిమితమై ఉండేది. కుటుంబాల మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధమేమీ ఉండేది కాదు. కాబట్టి ఈ దశలో వాణిజ్యం లేదా వ్యవస్థ యొక్క ప్రధాన సూత్రం కుటుంబం యొక్క స్వయం సమృద్ధి మాత్రమే. ఈ దశలో కుటుంబంలోని మగవారు వేటాడటం, చేపలు పట్టడం, వేటకు కావలసిన ఆయుధాలను తయారు చేసే ఉద్యోగాలను చేపట్టేవారు. కాగా మహిళలు పండ్లను సేకరించడం, భూములను సేద్యం చేయడం లాంటి పనులు చేసేవారు. కాబట్టి ఆనాటి సమాజంలో జనానికి వాణిజ్యం అనే అంశం తెలియదు.
2) పురాతన బార్టర్ ఆర్థిక వ్యవస్థ: వాణిజ్యం అభివృద్ధిలో ఇది రెండవ దశ. క్రమక్రమంగా కుటుంబాల యొక్క అవసరాలు పెరగడం ప్రారంభమైనవి. కుటుంబాలు వివిధ వృత్తులతో ప్రత్యేకతను సంపాదించసాగాయి. తద్వారా మెల్లగా కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య, అలాగే ప్రాంతాల మధ్య ‘మార్పిడి’ అవసరం ఏర్పడింది. అందుకే వ్యక్తులు ‘వస్తువులకు బదులు వస్తువులను’ మార్పిడి చేసుకోవడం ఆరంభించారు. ఈ విధానాన్ని వస్తు మార్పిడి విధానం అని లేదా ‘బార్టర్ విధానం’ అని పిలిచారు. ఇలా వస్తువులకు బదులు వస్తువులను మార్పిడి చేసుకునే ప్రక్రియ ద్వారా ‘వాణిజ్యం’ అనే భావన ఉత్పన్నమైంది.
3) వర్తకంలో పెరుగుదల: తొలినాళ్ళలో కొన్ని నిర్ణయింపబడిన ప్రాంతాలలో మాత్రమే పరిమితమైన వస్తువులను మార్పిడి చేసుకొనేవారు. ఈ క్రమంలోనే వర్తకం ప్రారంభమైంది. అభివృద్ధి చెంది ప్రాముఖ్యతను సంతరించుకుంది. తద్వారా వస్తుసేవల వినిమయానికి ‘ఒకే సాధనం’ ఉంటే బాగుంటుందనే భావన పుట్టి, అది ప్రాముఖ్యతను పొందటం జరిగింది. ఈ క్రమంలో వినిమయ సాధనంగా ‘ద్రవ్యం’ గుర్తింపబడింది. ఆ తరువాత వస్తు సేవలకు విలువ కట్టడం మొదలైంది.
4) పట్టణ వ్యవస్థ: వాణిజ్యం యొక్క విస్తరణలో ఈ దశ కీలకమైంది. ఈ దశలో కార్యకలాపాలు స్థానిక మార్కెట్ల యొక్క అవసరాలను తీర్చడానికి జరిగేవి. క్రమేపీ ఈ మార్కెట్లు పెద్ద పెద్ద పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. అలాగే ఈ వర్తకులను టోకు వర్తకులు, చిల్లర వర్తకులుగా వర్గీకరించడం జరిగింది. ‘శ్రమ విభజన’ అనే భావన ప్రాముఖ్యతను పొందింది. క్రమక్రమంగా వస్తువులకు ధరను నిర్ణయించడం అనే పద్ధతి ఆచరణలోకి వచ్చింది.
5) అంతర్జాతీయ వర్తకం: ఈ దశలో వస్తువులను స్థానిక మార్కెట్లలోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా విక్రయించే ఉద్దేశ్యంతో ఉత్పత్తి చేయడం మొదలైంది. దీనికి ప్రధాన కారణం పారిశ్రామిక విప్లవం. ఈ విప్లవం ద్వారా ఉత్పత్తి కూడా పెద్ద మొత్తంలో జరగడం ప్రారంభమైంది. ప్రత్యేక వాణిజ్య సంస్థలుగా వాణిజ్య బ్యాంకులు, బీమా కంపెనీలు, రవాణా సంస్థలు, గిడ్డంగి సంస్థలు మొదలైనవి స్థాపించబడినవి. ఇలా స్థాపించబడ్డ నూతన సంస్థలు, మధ్యవర్తులు దేశీయ వర్తకంలోనే కాకుండా విదేశీ వర్తకంలోనూ ప్రముఖ పాత్ర పోషించాయి.
6) ఈ – కామర్స్: నూతన ఆర్థిక విధానంలో ఈ – కామర్స్ అనే విధానం, ఒక సృజనాత్మకమైన ఆలోచన. ఈ కామర్స్ అంటే ‘ఎలక్ట్రానిక్ కామర్స్’. ఎలక్ట్రానిక్ సాధనం ద్వారా సరుకులు, సేవలను కొనుగోలు మరియు అమ్మకం చేసే ప్రక్రియనే ఈ – కామర్స్ అంటారు. 1990 దశకంలో వ్యాపార రంగంలో ప్రవేశించిన అత్యాధునిక – వర్తక విధానం ఈ – కామర్స్. ఇది చాలా వేగంగా ప్రపంచమంతటా విస్తరించి, ఆన్లైన్ ద్వారా, ఇంటర్నెట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తూ వస్తు – సేవల కొనుగోలు, అమ్మకాలను చాలా వేగంగా, సమర్థవంతంగా, నాణ్యంగా చేయడం జరుగుతుంది.
ప్రశ్న 2.
ఆర్థిక ధ్యేయాలను వివరించండి.
జవాబు.
ఆర్థిక ధ్యేయాలు: వ్యాపారమనేది సాధారణంగా ఆర్థిక కార్యకలాపాల సమూహం. అందువల్ల వీటి యొక్క ప్రాథమిక ధ్యేయాలు ఆర్థిక స్వభావాన్నే కల్గి ఉంటాయి. కాబట్టి వ్యాపారం యొక్క ఈ ఆర్థిక ధ్యేయాలను తిరిగి క్రింది విధంగా గుర్తించవచ్చు.
I. లాభాల సంపాదన: ఏ వ్యాపార సంస్థ అయిన లాభార్జనే ప్రధాన ధ్యేయంగా స్థాపించబడుతుంది. ఇది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన ప్రేరణ, ప్రోత్సాహకం. అలా లాభార్జన అనేది వ్యాపార మనుగడకు అత్యంత ఆవశ్యకం. మనిషి ఊపిరితో బ్రతకడానికి భోజనం ఎంత అవసరమో, దీపం వెలగడానికి నూనె ఎలా అవసరమో, వ్యాపారం కొనసాగడానికి లాభం కూడా అంతే ప్రముఖమైంది. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కూడా ఈ లాభాలు ఎంతగానో దోహదపడతాయి.
II. ఖాతాదారుల సృష్టి: ఖాతాదారుల యొక్క అవసరాలను, కోరికలను తీర్చడానికి గాను వ్యాపారస్తుడు పెట్టిన శ్రమకు ప్రతిఫలమే లాభాల సృష్టి. పీటర్. ఎఫ్. డ్రక్కర్ మాటలలో చెప్పాలంటే “వ్యాపారం అంతిమ లక్ష్యం ఖాతాదారులను తయారు చేయడమే”. కాబట్టి తన వస్తు – సేవలను కొనుగోలు చేసి, నగదు చెల్లించేందుకు చాలినంత మంది వినియోగదారులుంటేనే వ్యాపార సంస్థ లాభాలు సంపాదిస్తుంది. ఖాతాదారులను సంతృప్తిపరచకుండా ఏ వ్యాపార సంస్థ విజయం సాధించదు. అందువల్ల వినియోగదారులను తయారు చేయడం, సంతృప్తిపరచడం ప్రతి వ్యాపారానికి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం.
III. నవకల్పన: కొత్త పద్ధతులను, విధానాలను, పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే . నవకల్పన. నవకల్పన అంటే కొత్త వస్తువులను ఆవిష్కరించడం మాత్రమే కాదు, పాత వస్తువును మెరుగుపరచడం, వ్యయాలను తగ్గించడం కూడా నవకల్పనే. నవకల్పన రేటుపైనే వ్యాపార విజయాల రేటు కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్లనే ఆధునిక వ్యాపార సంస్థలు పరిశోధన, అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
IV. వనరుల అభిలషణీయ వినియోగం: ముడి పదార్థాలు, యంత్రాలు, ద్రవ్యం మరియు మానవ వనరులను చక్కగా ఉపయోగించుకోవడాన్ని వనరుల అభిలషణీయ వినియోగం అంటారు. దుబారా నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం, పునర్ ప్రక్రియ యంత్రాంగాన్ని వాడడం, పనివారికి సరైన శిక్షణ ఇవ్వడం మరియు ద్రవ్యాన్ని సమర్థవంతంగా ఖర్చు చేయడం మొదలైనవి వనరుల అభిలషణీయ వినియోగం అనే ధ్యేయం సాధించడానికి సహాయపడును.
ప్రశ్న 3.
వృత్తి అంటే ఏమిటి? దాని లక్షణాలు మరియు ధ్యేయాలను రాయండి.
జవాబు.
ప్రత్యేకమైన చదువు నైపుణ్యం కలిగిన వ్యక్తిగతమైన సేవలను అందించడంలో నిమగ్నమయ్యే పనులను వృత్తులు అంటారు. వృత్తి అనేది విద్యార్థుల మీద, వ్యక్తిగత జ్ఞానం మీద మరియు నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు న్యాయాన్ని అందించడం కోసం న్యాయస్థానంలో న్యాయవాది వాద ప్రతివాదనలు చేయటం, వ్యాధి చికిత్స నిమిత్తం వైద్యుడు శ్రమించడం. వీటిని నిర్వహించే వారందరూ తగిన రుసుం తీసుకొని తమ తమ బాధ్యతలను నెరవేరుస్తారు. కొన్ని వృత్తులకు చెందినవారు ఆచరణ నిమిత్తం సంబంధిత వృత్తి సంఘంలో చేరడం తప్పనిసరి. ఉదాహరణకు ఒక చార్టెడ్ అకౌంటెంట్, భారతదేశపు చార్టర్డ్ అకౌంటెంట్ల సంఘం (ICAI) లో సభ్యుడు కావడం, వైద్యుడు భారతీయ వైద్య పరిషత్లో (IMA) సభ్యుడు కావడం.
వృత్తి యొక్క లక్షణాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు:
- ఏ వృత్తిలో చేరేవారైన ఆ ప్రత్యేక వృత్తిలో కావాల్సిన విద్యార్హతలను, పరిజ్ఞానాన్ని, శిక్షణను కలిగి ఉండాలి.
- ప్రత్యేకమైన వృత్తిలో చేరేవారు, దానికి సంబంధించిన వృత్తి సంఘంలో తప్పనిసరిగా సభ్యుడై ఉండాలి.
- వృత్తిని ఎన్నుకునేవారు, ఆయా వృత్తుల యొక్క నియమ నిబంధనలను, నైతిక విలువలను మరియు ఆ వృత్తి సంఘాలు రూపొందించిన మార్గదర్శకాలను విధిగా పాటించాలి.
- వృత్తి ద్వారా సేవలను అందించినందుకు గాను, ప్రతిఫలంగా ‘రుసుము’ను వసూలు చేయడం జరుగుతుంది.
- న్యాయబద్ధంగా సేవలను అందించడం అనేది ఏ వృత్తిలోనైనా ప్రధానమైన అంశం.
- వృత్తిదారులు న్యాయ విరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం గానీ, వారి నైపుణ్యాలను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం కానీ చేయరాదు.
- ‘సేవా దృక్పథం’ అనేది ఏ వృత్తిలోనైనా అంతర్భాగమై ఉండాలి.
- కొంతమంది వృత్తి నిపుణులు, స్వతంత్రంగా, స్వతహాగా పనిచేయడానికి బదులు ఇతరుల దగ్గర ఉద్యోగులుగా, కన్సల్టెంట్లుగా కూడా పనిచేస్తారు.
వృత్తి యొక్క ప్రధాన ధ్యేయాలు:
- సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించడం.
- అవసరమైన వ్యక్తులకు తమ యొక్క నైపుణ్యాలను, జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని పంచడం.
- వారివారి వృత్తులలో ప్రత్యేకీకరణ సాధించడం, కెరియర్ను నిర్మించుకోవడం.
- సేవలను అందించడం.
- చాలా తక్కువ రిస్క్ తో ‘పని స్వతంత్రతను’ ఆస్వాదించడం.
ప్రశ్న 4.
ఉద్యోగం అంటే ఏమిటి ? దాని లక్షణాలు మరియు ధ్యేయాలను రాయండి.
జవాబు.
ఒక ఒప్పందాన్ని అనుసరించి లేదా సేవా నియమాల ప్రకారం యజమాని చేయమని ఆదేశించిన పనులను నిర్వర్తించడమే ఉద్యోగం. ఉద్యోగం ఇచ్చే వ్యక్తిని ‘యజమాని’ అనీ, ఉద్యోగాన్ని నిర్వహించే వ్యక్తిని ‘ఉద్యోగి’ అనీ అంటారు. యజమాని ఉద్యోగి మధ్య ఉండే సంబంధం యజమాని సేవకుడు సంబంధాన్ని పోలి ఉంటుంది. ఉద్యోగ నిర్వహణ చేసినందుకు గాను ఉద్యోగికి వేతనాలు లేదా జీతాలు, అలవెన్సులు లభిస్తాయి.
ఉద్యోగం యొక్క ముఖ్యమైన లక్షణాలను క్రింది విధంగా పేర్కొనవచ్చు:
- అగ్రిమెంట్ మీద సంతకం చేసి సంస్థలో చేరగానే ‘ఉద్యోగ ఒప్పందం’ అమలులోకి వస్తుంది.
- కాలానుగుణంగా అంటే నెలవారీగా, రోజువారీగా, పక్షంవారీగా జీతం లేదా వేతనం రూపంలో చెల్లించే ప్రతిఫలంనకు గాను ఉద్యోగం రూపంలో సేవలను అందిస్తారు.
- ఉద్యోగం అనేది యజమాని – ఉద్యోగి మధ్య ఉండే ఒప్పందం.
- ఇతర ఆర్థిక కార్యకలాపాలతో పోలిస్తే ఉద్యోగంలో నష్టభయం, అనిశ్చితత్వం చాలా తక్కువ.
- ఉద్యోగం, ఉద్యోగికి నిరంతరంగా, స్థిరమైన ఆదాయంను అందిస్తుంది.
- ఉద్యోగి ఎలాంటి మూలధనాన్ని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.
- యజమాని రూపొందించిన నియమ నిబంధనలు మరియు ఉద్యోగ మార్గదర్శకాలను, ఉద్యోగి తప్పకుండా పాటించాలి.
- కొన్ని ఉద్యోగాలు వాటికి సంబంధించిన ప్రత్యేక అర్హతలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆ ఉద్యోగాన్ని చేయాలనుకొనే వ్యక్తి విధిగా ఆ అర్హతలను కలిగి ఉండాలి.
- ఉద్యోగాలకు సంబంధించి పనిగంటలు, పనివేళలు, సెలవుల సౌకర్యం, జీతభత్యాలు, పనిచేసే స్థలం లాంటి కొన్ని నియమ నిబంధనలు, సూత్రాలు, మార్గదర్శకాలు ఉంటాయి. వీటన్నింటినీ యజమాని – ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలి.
ఉద్యోగం యొక్క ధ్యేయాలను క్రింది విధంగా గుర్తించవచ్చును:
- ఉద్యోగం యొక్క ప్రధాన ధ్యేయం జీవనోపాధి, కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటం.
- తప్పనిసరైన, రక్షణతో కూడిన జీతాన్ని లేదా వేతనాన్ని పొందడం.
- నష్టభయం మరియు అనిశ్చితి లేకుండా ఉండటం.
- వివాదాలు, తగాదాలు, నష్టాలు, సంఘర్షణలకు దూరంగా ఉండటం.
- ప్రాంతీయ అసమానతలను మరియు ఆర్థిక అసమానతలను సాధ్యమైనంత తగ్గించడం వీలైతే రూపుమాపడం.
- ఉద్యోగార్థుల నైపుణ్యాలు అభివృద్ధిపరచడం.
- సామాజిక రక్షణ, శ్రేయస్సును అందించడం ద్వారా జాతీయ ఆసక్తిని కాపాడడం.
ప్రశ్న 5.
ఆర్థికేతర కార్యకలాపాల గూర్చి రాయండి.
జవాబు.
- మానవులు స్వచ్ఛందంగా ప్రేమ, కరుణ, దయ, ఆప్యాయత, రక్త సంబంధం, మతపరమైన బాధ్యతగా మరియు దేశభక్తితో చేపట్టే కార్యకలాపాలను ‘ఆర్థికేతర కార్యకలాపాలు’ అంటారు.
- ఇందులో నగదు లావాదేవీలు ఉండవు. ప్రధానంగా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో కాకుండా, సేవ చేసే ఉద్దేశంతో ఈ కార్యకలాపాల నిర్వహణ జరుగుతుంది.
- ఉదాహరణకు ఒక తల్లి కుటుంబం కోసం భోజనం తయారు చేయటం, ఒక గృహిణి కుటుంబానికి సేవ చేయడం, రోగులకు సేవ చేయడం మొదలైనవి ఆర్థికేతర కార్యకలాపాలు.