TS Inter 1st Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 9th Lesson లౌకికవాదం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 9th Lesson లౌకికవాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదమంటే ఏమిటో నిర్వచించి, లౌకికవాద భావనలను వివరించండి.
జవాబు.
పరిచయం :
లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రభోదిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్యలాంటి సూత్రంపై ఆధారపడతాయనే దృక్పథమే లౌకికవాదం.

వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లౌకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.

అర్థం :
Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం :
1. జి. జె. హోల్యోక్ :
“లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్ :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్దాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికవాద భావనలు (Concepts of secularism) : లౌకికవాదం ప్రధానంగా నాలుగు భావనలను కలిగి ఉంది. అవి

  1. మానవతాపాదం, హేతువాద భావన
  2. రాజకీయ, సామాజిక దృక్కోణం
  3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం
  4. మతం పట్ల వ్యతిరేకత

ఈ నాలుగు భావనలను గురించి ఈ దిగువ పేర్కొన్న విధంగా వివరించవచ్చు.
1. మానవతావాదం, హేతువాద భావన (Humanistic and Atheistic philosophy) :
లౌకికవాదం అనేక వ్యక్తిగత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి ఉంటుంది. మానవుల శ్రేయస్సును కోరుకొనుట చేత అది మానవతా స్వభావాన్ని కలిగి ఉంటుంది.

మానవుడు అన్ని విషయాలకు కొలమానం అనే సామెతకు అది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇది మతాన్ని సమర్థించదు లేదా వ్యతిరేకించదు. వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొని, అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.

2. రాజకీయ, సామాజిక దృక్కోణం (Political and Social dimension) :
లౌకిక వాదానికి నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక దృక్కోణాలున్నాయి. అది సహజసిద్ధమైన, భౌతిక దృక్పథాలతోనూ, రాజకీయ, ఆర్థిక స్వావలంబనలతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా ఉంటుంది. కుటుంబానికి, సంస్థలకు మరియు సమాజానికి మత స్వాతంత్య్రానికి ఇది వీలు కల్పిస్తుంది.

3. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం (Liberty and Democracy) :
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ప్రయోజనకరమైనది. అలాగే ఉదార ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది. లౌకికవాదం అధికారిక మత నాయకత్వాన్ని మత సంస్థల ఉనికి, కొనసాగింపు, మనుగడలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజాసామ్యం, ప్రభుత్వాధికారాల వికేంద్రీకరణను సమర్థిస్తుంది.

4. మతం పట్ల వ్యతిరేకత (Opposition to Religion) :
లౌకికవాదం ప్రజా వ్యవహారాలను మతం సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మతాధికారుల ప్రాబల్యతలను ఖండిస్తుంది. మానవజీవనానికి సంబంధించిన అప్రధాన అంశాలలో మతం ఒకటిగా పేర్కొంటూ, మత ప్రాధాన్యాన్ని తగ్గిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు వారి మత విశ్వాసాలను, ఆచారాలను అనుసరించవచ్చని పేర్కొంటుంది.

ఇతర మతాలకు చెందిన వారికి ఏ విధమైన అపకారం, ద్వేషం, అసూయలు కలిగించకుండా వ్యక్తులు వారి మత కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని స్పష్టీకరించింది. రాజ్యాంగపు మహోన్నత ఆశయాలు, ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 2.
లౌకికవాద సుగుణాల గురించి రాయండి.
జవాబు.
అర్థం :
Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని ఇస్తుంది.

నిర్వచనం :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని ఎరిక్. ఎస్. వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

లౌకికవాదం – సుగుణాలు (Merits of Secularism) :

1. సమత (Equity) :
లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2. మత స్వాతంత్ర్యం (Religious Freedom) :
లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తాయి.

3. శాంతి భద్రతలు (Law and Order) :
వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు.

దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది. అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4. సమన్యాయ పాలన (Rule of Law) :
లౌకికవాదం సమన్యాయపాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

5. సహనం (Tolerance) :
లౌకికవాదం సహనం, దయార్ద్ర గుణాన్ని ప్రబోధిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, భగవంతుడి పితృత్వంల (Fatherhood) పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. దాతృత్వం, జాలి, ప్రేమ, ఔదార్యం, అహింస వంటి మహోన్నత గుణాలను ప్రబోధించి, ప్రచారం గావించి ఆచరణలో ఉంచుతుంది.

6. జాతీయ సమైక్యత . (National Integration) :
లౌకికవాదం, ప్రజలలో జాతీయ సమైక్యత, సమగ్రత భావాలను పెంపొందించే ఉత్తమ సాధనంగా దోహదపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ఉత్తమ కారకంగా భావించబడుతుంది. విభిన్న మతాలు, వాడుకలు అనుసరించే ప్రజల మధ్య ఐక్యతను సాధిస్తుంది.

7. మైనారిటీల రక్షణ (Protection to the Minorities) :
లౌకికవాద రాజ్యం అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. సమాజంలో మెజారిటీ వర్గం ఇతర వర్గాల మధ్య ఎటువంటి వివక్షతను చూపదు. అదే సమయంలో మతపరమైన మెజారిటీ వర్గం ఆధిపత్యాల నుంచి మైనారిటీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించి, వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. మైనారిటీ వర్గాల వారి పట్ల మతసహనాన్ని పాటించాల్సిందిగా ప్రజలకు బోధిస్తుంది.

8. అన్ని రంగాల ప్రగతి (Allround Progress) : లౌకికవాదంలోని అత్యంత గొప్ప సుగుణం ఏమిటంటే ప్రజలు అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు దోహదపడుతుంది. సమాన్యాయ పాలన, మత సహనం, ప్రభుత్వ తటస్థ వైఖరి వంటి అంశాలు లౌకికవాదంలో ఉండుట చేత ఆ రకమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రత్యేకంగా సంక్షేమం, సామాజిక న్యాయం, అసౌకర్యానికి గురైన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ వంటి విషయాలకు సంబంధించి అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రగతికి లౌకిక వాదం కృషి చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
భారతదేశంలో లౌకికవాదంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలను ప్రారంభించింది. శాస్త్రవిజ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలను నాటింది.

అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించింది. దాంతో భారత రాజకీయాలలో మతపరమైన ఘర్షణలు ఎడతెగని లక్షణంగా పరిణమించాయి. ఈ పరిస్థితి పట్ల చరిత్రకారులు కూడా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు.

ఈ సందర్భంలో వారు భిన్నమైన వివరణలను అందించారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో నెలకొన్న విచారకరమైన మత పరిస్థితులకు బ్రిటిష్ పాలకులను వారు నిందించారు. జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులు, మహమ్మదీయుల మధ్య ప్రాధాన్యత ఇవ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య ఆవేశాలను ప్రోవు చేశారు.

దాంతో భారతదేశంలో నివసించే విషయంలో మైనారిటీలలో అభద్రతా భావం నెలకొంది. కాలక్రమేణా మతఘర్షణలు, మతవిద్వేషాలు అనేవి భారతదేశంలో దైనందిన చర్యలుగా పరిణమించాయి.

ఈ రకమైన పరిస్థితి అంతిమంగా మహమ్మదాలీ జిన్నా వంటి నాయకులు ‘ద్విజాతి సిద్ధాంతం’ (Two Nations Theory) ప్రతిపాదించేందుకు దారితీసింది. మరొకవైపు హిందూ మహాసభ వంటివి మత ప్రయోజనాలకు ప్రతీకగా నిలిచాయి. ఈ సంస్థలు భారతదేశాన్ని హిందూ ఆధిక్య ప్రధానమైన దేశంగా పరిగణించాయి.

1947 ఆగస్టులో భారత యూనియన్ ఇండియా, పాకిస్థాన్లుగా విడిపోవుటకు రాజకీయ పరిస్థితుల తీవ్రతయే కారణంగా పేర్కొనవచ్చు. దేశ విభజన తరువాత కూడా మతపరమైన విబేధాలు కొనసాగడం మతతత్వానికి పరాకాష్టగా భావించవచ్చు. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మత ఘర్షణలు సంభవించడం లౌకిక వాదానికి సవాలుగా పరిణమించిందని చెప్పవచ్చు.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లౌకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారతరాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది.

భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు లౌకిక వాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి. చట్ట నిర్మాణం, దాని అమలు, రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలేవీ మతాన్ని అనుసరించరాదని భారత రాజ్యాంగం పేర్కొంది.

భారతీయులు తమకు ఇష్టమైన మతవిశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారం గావించేందుకు సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలు కల్పించింది. భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది, మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారతరాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి, వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గానీ, పాక్షికంగా గానీ నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేదించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధనలను నిషేధించడమైంది. కాబట్టి రాజ్యాంగ పరమైన అంశాల ప్రకారం లౌకిక వాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

భారత రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ అనే పదాన్ని (42వ సవరణ) చట్టం ద్వారా 1976 లో చేర్చడమైంది. పార్లమెంటులో భారత రాజ్యాంగం (42వ సవరణ) ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా భారతదేశ తృతీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కింది విధంగా ప్రకటించారు. “లౌకికవాదం అనేది మతానికి మతానికి మధ్య అభిమానాన్ని, వివక్షతను చూపడం కాదు.

అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని ప్రదర్శించడమే లౌకిక వాదం. కేవలం మతసహనాన్ని ప్రదర్శించడం ద్వారానే ఏ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రతి మత సముదాయానికి చెందిన వారు ఇతర మతాల సముదాయాలకు చెందిన వారి పట్ల సానుకూల గౌరవాన్ని చూపడమనేది అందరి కర్తవ్యం”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదం ఆవిర్భావం గురించి రాయండి.
జవాబు.
ప్రాచీన, మధ్యయుగాలలో మతపరమైన రాజ్యాలుండేవి. ఆ యుగాలలో రాజ్య వ్యవహారాలలో మతం ఎంతో ప్రాధాన్యమైన పాత్రను పోషించింది. పాలకులు, ప్రజల మతవిశ్వాసాలను గుర్తించి, గౌరవించి పరిపాలించేవారు. మతం సమాజంలో శాంతి భద్రత, స్థిరత్వాలను అందించి వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రించింది. దేశ పరిపాలన సాఫీగా కొనసాగేందుకు అవసరమైన రాజకీయ విధేయతను అందించేందుకు మతం దోహదకారి అయింది.

అయినప్పటికీ మతాచార్యులకు, సంస్కరణవాదులకు మధ్య ఘర్షణలు ఏర్పడి సమాజంలో అరాచకం ప్రబలింది. మతం పేరుతో ప్రజల మీద అత్యున్నతాధికారం చెలాయించేందుకు ఆధ్యాత్మికవాదులు, మత పెద్దలు ప్రయత్నిస్తే లౌకిక పాలకులు వారి వ్యూహాలను నిర్వీర్యపరచారు. రాజ్య వ్యవహారాల నుంచి మతాన్ని వేరు చేసారు. ప్రాచీన రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని గుర్తించేందుకు నిరాకరించారు.

మధ్యయుగంలో మార్టిన్ లూథర్, కాల్విన్ జ్వింగిల్ లాంటి సాంఘిక, మత సంస్కరణవాదులు మత పెద్దల ఆధ్యాత్మిక గుత్తాధిపత్యాన్ని సవాలు చేశారు. మత, ఆధ్యాత్మిక విషయాలన్ని కూడా పూర్తిగా వ్యక్తిగత, స్వీయ వ్యవహారాలుగా వీరు భావించారు. మతపరమైన విషయాలపై వారి ప్రసంగాలు విశేషమైన ప్రభావాన్ని చూపాయి. ఆధునిక కాలంలో మాకియవెల్లి, జీనో బోడిన్ వంటి రాజనీతి తత్వవేత్తలు రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయాలని గట్టిగా పేర్కొన్నారు.

జాన్లాక్ వంటి ఉదారవాద తత్వవేత్తలు మత సహనాన్ని ప్రజలు అనుసరించాలని సూచించారు. పైన పేర్కొన్న తాత్వికుల రచనలు కాలక్రమేణ ప్రజలపై ప్రభావాన్ని చూపటంతో, మతమనేది ఒక వైయుక్తిక, స్వీయ వ్యవహారంగా భావించటం మొదలైంది. అమెరికా దేశాధ్యక్షుడైన థామస్ జఫర్సన్ లౌకికవాదపు నిజమైన అర్థాన్ని వివరిస్తూ రాజ్యం, మతం మధ్య స్పష్టమైన హద్దులు ఉన్నాయని ప్రకటించారు.

కాబట్టి ఆధునిక కాలంలో లౌకికవాదాన్ని పైన పేర్కొన్న కారణాలు ప్రగాఢంగా ప్రభావితం చేసాయని పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 2.
లౌకికవాదం ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
నిర్వచనాలు :
1. జి. జె. హోల్యోక్ :
“లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.

‘2. ఎరిక్ ఎస్. వాటర్ హౌస్ :
“మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లక్షణాలు : లౌకిక రాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.

1. మతానికి తావు లేదు (No place for religion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status) :
లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

3. అధికారిక మతం లేకుండుట (No State reglion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

లౌకికరాజ్యం ప్రాముఖ్యత (Importance of Secular State) :
ఇటీవల కాలంలో లౌకిక రాజ్య భావన ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ప్రజాస్వామిక స్ఫూర్తి, శాస్త్ర సాంకేతికత, రవాణా సదుపాయాల అభివృద్ధి, హేతుబద్ధమైన చింతన, శ్రేయోవాదం వంటి అంశాల ప్రభావం చేత లౌకిక రాజ్య ప్రాముఖ్యత పెరిగింది. మొత్తం మీద లౌకిక రాజ్య ప్రాముఖ్యతను కింది అంశాల ద్వారా వివరించవచ్చు.

  1. లౌకిక రాజ్యం దేశంలోని వివిధ రంగాలలోని మతేతర శక్తులను బలపరుస్తుంది.
  2. ప్రజల హృదయాలలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను పారద్రోలుతుంది.
  3. మత పరమైన విద్వేషం, మతమౌఢ్యాలను పారద్రోలడం ద్వారా సామాజిక సంస్కరణలకు దోహదపడుతుంది.
  4. ప్రజలలో శాస్త్రీయ చింతనను పెంపొందించి, వారి మేధోపరమైన వికాసానికి తోడ్పడుతుంది.
  5. విశ్వాసంపై హేతువుకు, కాల్పనికతపై తర్కానికి, కట్టుకథలపై వాస్తవికతలకు ఆధిక్యతనిస్తుంది.
  6. మతపరమైన మైనారిటీ వర్గాలకు భద్రతను కల్పించి వారి రక్షణకు హామీనిస్తుంది.
  7. ప్రతి వ్యక్తి మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
లౌకికవాదంలోని నాలుగు సుగుణాలను వివరించండి.
జవాబు.
లౌకికవాదం – సుగుణాలు (Merits of Secularism) :

1. సమత (Equity) :
లౌకికవాదం సమసమాజానికి ప్రాతిపదిక. అన్ని మతాల వారిని సమానంగా పరిగణిస్తుంది. మానవులు సృష్టించిన అసమానతలను గుర్తించదు. అలాగే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భాషాపరమైన వివక్షతలకు తావు ఇవ్వదు. దాంతో ప్రజలు జాతిపట్ల ఎంతో దృఢమైన సానుకూలమైన భావాన్ని కలిగి ఉంటారు.

2. మత స్వాతంత్ర్యం (Religious Freedom) :
లౌకికవాదం, మత స్వాతంత్ర్యాన్ని ప్రజలు సంపూర్ణంగా అనుభవించుటకు దోహదపడుతుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, వ్యక్తులకు తమ ఇష్టం వచ్చిన’ మతాన్ని స్వీకరించుటకు, ప్రబోధించుటకు, ప్రచారం చేసుకొనేందుకు, సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాయి.

3. శాంతి భద్రతలు (Law and Order) :
వర్తమాన కాలంలో రాజ్యం, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఎంతో విచారకరమైన, దుఃఖదాయకమైన మతానుకూల ఉద్యమాలను ప్రోత్సహించడం లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో విభిన్న మతసముదాయాలకు చెందిన ప్రజల మధ్య సామరస్యం సాధించడం అనేది పెద్ద సవాలుగా పరిణమించింది.

అటువంటి సందర్భాలలో లౌకికవాదం మతపరమైన ఘర్షణలను, విద్వేషాలను నివారించగలుగుతుంది. అంతిమంగా, ప్రజల మధ్య మత సామరస్యాన్ని లౌకికవాదం పెంపొందించడం జరుగుతుంది.

4. సమన్యాయ పాలన (Rule of Law) :
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావనకు ప్రాధాన్యతనిస్తుంది. లౌకికవాదాన్ని అనుసరించే రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది.

చట్ట నిర్మాణ సమయంలో ప్రజలకు మత ఛాందస భావాలను పరిగణనలోనికి తీసుకోదు. అలాగే చట్ట నిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 4.
భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి ?.
“జవాబు. లౌకికవాదం అనే పదం ఉపయోగించడంలో భారతదేశ విధానం పాశ్చాత్య దేశాలలో ఉపయోగించిన దానికి భిన్నమైనది. భారతదేశంలో సాంస్కృతిక సహజీవనం కొత్త దృగ్విషయం కాదు. ఇది చాలా కాలం నుంచి భారతదేశంలో ఉంది. ఇది మధ్యయుగ ప్రారంభకాలంలో ముస్లింల దండయాత్రల నుంచి ప్రారంభమైంది. భారతదేశంలో బ్రిటిష్ పాలన క్రైస్తవ మతాన్ని పరిచయం చేసింది. అనేక క్రిష్టియన్ మిషనరీలు భారతదేశంలో పాఠశాలలు, ప్రార్థనాలయాలను ఏర్పాటు చేశాయి.

బ్రిటిష్ ప్రభుత్వపాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలు ప్రారంభానికి, శాస్త్ర విజ్ఞానానికి ప్రాముఖ్యతను కల్పించింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపరమైన విషబీజాలని నాటింది. అందులో భాగంగా చట్టసభలలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించి జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటిష్ పాలకులు హిందువులకు, మహమ్మదీయులకు ప్రాధాన్యతనివ్వటంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరవాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం లైకిక వాదాన్ని భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ప్రధాన ఆలంబనగా పేర్కొన్నది. దాని ప్రకారం భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లౌకికవాదాన్ని సిద్ధాంతపరమైన ఆచరణాత్మక భావనగా అనుసరించసాగాయి.

చట్ట నిర్మాణం, దాని అమలు రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో ఆ ప్రభుత్వాలు ఏ మతాన్నీ అనుసరించరాదని భారతరాజ్యాంగం పేర్కొంది. భారతీయులు తమకు ఇష్టమైన మత విశ్వాసాలను ప్రబోధించుకొనేందుకు, ప్రచారం గావించేందుకు, సంపూర్ణమైన మతస్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం వీలుకల్పించింది.

భారతదేశంలో రాజ్యం మతానుకూలమైనది కాదు. మత వ్యతిరేకమైనది కాదు. అందుకు బదులుగా అది రాజ్య వ్యవహారాలలో తటస్థ వైఖరిని అనుసరిస్తుంది. భారత రాజ్యాంగం మతం ఆధారంగా ప్రజలపై పన్నులు విధించి వసూలు చేసేందుకు వీలు కల్పించలేదు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నిధులతో సంపూర్ణంగా గాని, పాక్షికంగా గాని నిర్వహించబడే విద్యాసంస్థలలో మతం ఆధారంగా ప్రవేశాలను నిషేధించమని పేర్కొంది. అలాగే పైన పేర్కొన్న సంస్థలలో మత బోధలను నిషేధించింది. కాబట్టి రాజ్యాంగపరమైన అంశాల ప్రకారం లౌకికవాదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 5.
లౌకికరాజ్యం ముఖ్య లక్షణాలు ఏమిటి ?
జవాబు.
లౌకికరాజ్యం కింది లక్షణాలను కలిగి ఉంటుంది.
1. మతానికి తావు లేదు (No place for religion) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.

2. సమాన హోదా (Equal status) :
లౌకికరాజ్యం ప్రజలందరికీ సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం. తెగ, ప్రాంతం, భాషలవారీగా ఎటువంటి వివక్షతను చూపదు. దాంతో ప్రజలు సంతృప్తి చెంది, వివిధ విధానాలు, కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తారు. విభిన్న మత సముదాయాలకు చెందిన వారందరూ ఇరుగు పొరుగు వారితో సామరస్యంతో కలసిమెలసి నివసిస్తారు.

3. అధికారిక మతం లేకుండుట (No State region) :
లౌకిక రాజ్యం ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. మత వ్యవహారాలలో తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. ప్రజల మతపరమైన భావాలతో సంబంధం లేకుండా వివిధ చట్టాలను, సామాజిక సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వదు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ సంస్థల వంటి అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఏ ఒక్క మతంతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 6.
లౌకికవాదం, లౌకిక రాజ్యం గురించి వర్ణించండి.
జవాబు.
లౌకికవాదం :
లౌకికవాదమనేది ఒక ప్రధానమైన సామాజిక, రాజకీయ దృగ్విషయం. అనేక సమకాలీన ప్రపంచదేశాలు తమ ప్రభుత్వ వ్యవహారాలలో లౌకికతను అనుసరిస్తున్నాయి. లౌకికవాదం ప్రత్యేకంగా మతంతో సంబంధంలేని, స్వతంత్ర ఆదర్శాలను ప్రబోధిస్తుంది. ప్రభుత్వాలు మతంతో నిమిత్తం లేకుండా నైతికత, విద్య లాంటి సూత్రంపై ఆధారపడతాయనే ధృక్పధమే లౌకికవాదం.

వర్తమాన ప్రాపంచిక జీవనం దైవికమైనది కాకుండా కొన్ని నైతిక ప్రమాణాలు, పాలనా నియమాలు మానవ కార్యకలాపాలను నిర్ణయిస్తాయని లైకికవాదం పేర్కొంటుంది. లౌకికవాదానికి మతాన్ని దూషించే ఉద్దేశం లేదు. మతం, రాజ్యం అనేవి రెండు ప్రత్యేక విభాగాలని అది గట్టిగా ఉద్ఘాటించింది.

Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో అర్థం “ఇహలోకం” (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని సూచిస్తుంది. ఆధునిక కాలంలో ఆ పదాన్ని మొదటి సారిగా 1851 లో బ్రిటిష్ రచయిత జార్జి జాకబ్ హోల్యోక్ (George Jacob Holyoke) ఉపయోగించాడు. లౌకికవాదం అనే పదాన్ని అనేక మంది రచయితలు మరియు ప్రముఖులు వివిధ రకాలుగా నిర్వచించారు.

1. జి.జె. హోల్యోక్ : “లౌకికవాదం అంటే మత విశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా. మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన”గా నిర్వచించారు.
2. ఎరిక్.ఎస్. – వాటర్ హౌస్ : “మతంలో పేర్కొన్నదానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్దాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడ్డారు.

లౌకికరాజ్యం :
ఆధునిక రాజ్యాలు, లౌకిక రాజ్యాలు అని రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. రాజకీయ మేధావులు రజ్యంలో మతం, రాజకీయాలకు మధ్య ఉండే సంబంధం ఆధారంగా ఆరకమైన వర్గీకరణ చేశారు. గతంలో అనేక రాజ్యాలలో మతపరమైన ప్రభుత్వాలు వాడుకలో వున్నాయి. మతపరమైన రాజ్యాలు మతం ఆధారంగా పరిపాలనా వ్యవహారాలను నిర్వహిస్తుంటే, లౌకికరాజ్యం పరిపాలనలో మత సూత్రాలను ఏ మాత్రం పట్టించుకోదు.

డి.ఇ. స్మిత్ లౌకికరాజ్యాన్ని “వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యం” గా నిర్వచించాడు. అంతే కాకుండ లౌకిక రాజ్యమంటే, రాజ్యాంగరీత్యా ఏ ఒక్క ప్రత్యేక మతాన్ని పోషించటంగాని, పెంపొందించటంగాని జరగదు. అదే విధంగా మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. పైన పేర్కొన్న నిర్వచనాన్ని నిశితంగా పరిశీలించి లౌకిక రాజ్య స్వభావాన్ని తెలుసుకోవచ్చు.

లౌకిక రాజ్యం అనేది పూర్తిగా మత వ్యతిరేకం కాదు లేదా మత విరుద్ధమైనది కాదు. అలాగే అది పూర్తిగా మతానుకూలమైనది కాదూ ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించదు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఒకానొక ప్రత్యేక మతానికి అనుకూలతను లేదా ప్రతికూలతను ప్రదర్శిస్తూ చట్టాలను రూపొందించదు.
ఉదా : భారతదేశం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
లౌకికవాదాన్ని నిర్వచించండి.
జవాబు.

  1. “లౌకికవాదం అంటే మతవిశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధం లేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” అని జి.జె. హోల్యోక్ నిర్వచించాడు.
  2. “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని వాటర్ హౌస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
లౌకికవాదం అంటే ఏమిటి ?
జవాబు.
Secular అనే ఆంగ్ల పదంనకు లాటిన్ భాషలో అర్థం ఇహలోకం (This World) ఈ పదం మతానికి వ్యతిరేకమనే అర్థాన్ని సూచిస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని అనేక మంది రచయితలు వివిధ రకాలుగా నిర్వచించారు.

  1. జి.జె. హోల్యోక్ : “లౌకికవాదం అంటే మత విశ్వాసాలను విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా మతంతో సంబంధంలేని ఒకానొక సామాజిక వ్యవస్థను ప్రోత్సహించటమనే భావన” గా నిర్వచించారు.
  2. ఎరిక్.ఎస్.వాటర్ హౌస్ : “మతంలో పేర్కొన్న దానికంటే భిన్నమైన జీవనం, ప్రవర్తనలకు సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒకానొక ఆదర్శమే లౌకికవాదం” అని అభిప్రాయపడినారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 3.
మత రాజ్యం అంటే ఏమిటి ?
జవాబు.
మత రాజ్యంలో రాజకీయాలు మతంతో మిళితమై ఉంటాయి. మతం రాజకీయాలను శాసిస్తుంది. ఇలాంటి రాజ్యాలలో ఒకే మతం ప్రబలంగా ఉంటుంది.
ఉదా : ఏక మత రాజ్యం.

పురాతన మత్త రాజ్యాలలో మతాధికారులే పరిపాలకులుగా ఉండేవారు. ప్రాచీన ఈజిప్టులో ఫారోస్, బైజాంటెన్ సామ్రాజ్యంలో చర్చి అధిపతే రాజుగా చిలామణి అయ్యేవారు. మధ్యయుగంలో, ముఖ్యంగా ఇటలీ సరిహద్దుల్లో కాథలిక్ చర్చి అధిపతి పోప్ దీర్ఘకాలంగా పరిపాలించాడు.

మత రాజ్యంలో మానవుల చేత రూపొందించబడే చట్టాలు దైవిక న్యాయం ఆధారంగా ఉంటాయి. మతపరమైన చట్టాలే ఆ దేశపు పాలనా చట్టాలుగా చెలామణి అవుతాయి. అదే విధంగా దేవుని ప్రతినిధిగా భావించే వ్యక్తే ఆ దేశపు మతానికి, రాజ్యానికి అధిపతిగా పరిగణించబడుతాడు.

ప్రశ్న 4.
లౌకికవాదం ఏ విధంగా వ్యక్తుల మత స్వేచ్ఛ, స్వాతంత్య్రతలకు దోహదపడుతుంది ?
జవాబు.
లౌకిక వ్యవస్థ అమలులో ఉన్న రాజ్యాలలో వ్యక్తులంతా సంపూర్ణ మత, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి తన కర్మ ప్రబోధం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు లేదా మతరహితంగా, హేతువాదిగా ఉండిపోవచ్చు. తను నమ్మిన మత సిద్ధాంతాలను వ్యాప్తి చేసుకోవచ్చు. మతవ్యాప్తికై వెచ్చించే ధనంపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 5.
సమన్యాయపాలన లౌకికవాదాన్ని ఏ విధంగా పెంపొందిస్తుంది.
జవాబు.
లౌకికవాదం సమన్యాయ పాలన అనే భావానికి ప్రాధాన్యతనిస్తుంది. రాజ్యం ఏ ఒక్క మతానికి కాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించి అమలు చేస్తుంది. చట్ట నిర్మాణ సమయంలో ప్రజల మతఛాందస భావాలను పరిగణనలోకి తీసుకోదు. అందువలన లౌకిక రాజ్యాలలో ప్రజలు సంతృప్తిని, సంతోషాన్ని పొందుతారు.

ప్రశ్న 6.
లౌకిక రాజ్యాన్ని నిర్వచించండి.
జవాబు.
“వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యమే లౌకిక రాజ్యం” అని డి.ఇ. స్మిత్ పేర్కొన్నాడు.

ప్రశ్న 7.
లౌకిక రాజ్యం రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.

  1. మతానికి తావులేదు : లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపదికపై చట్టాలను రూపొందించదు, అమలు చేయదు.
  2. సమాన హోదా : లౌకిక రాజ్యం ప్రజలందరికి సమాన హోదాను కల్పిస్తుంది. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, మతం, తెగ, ప్రాంతం భాషల వారీగా ఎటువంటి వివక్షతను చూపదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 9 లౌకికవాదం

ప్రశ్న 8.
లౌకిక రాజ్యం అర్థాన్ని వివరించండి.
జవాబు.
డి.ఇ. స్మిత్ లౌకిక రాజ్యాన్ని “వ్యక్తులకు స్వీయ, సమిష్టి మత స్వాతంత్య్రాన్ని హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యం”గా నిర్వచించాడు.

అంతేకాకుండ లౌకిక రాజ్యమంటే, రాజ్యాంగరీత్యా ఏ ఒక్క ప్రత్యేక మతాన్ని పోషించటంగాని, పెంపొందించటం గాని జరగదు. అదే విధంగా మత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఒకానొక ప్రత్యేక మతానికి అనుకూలతను లేదా ప్రతికూలతను ప్రదర్శిస్తూ చట్టాలను రూపొందించదు.

Leave a Comment