TS Inter 1st Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 1st Lesson అర్థశాస్త్ర పరిచయం Textbook Questions and Answers.

TS Inter 1st Year Economics Study Material 1st Lesson అర్థశాస్త్ర పరిచయం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అర్థశాస్త్ర సంపద, శ్రేయస్సు నిర్వచనాలను పరిశీలించండి.
జవాబు.
అర్థశాస్త్రానికి సంపద నిర్వచనాన్ని ఆడమస్మిత్ అనే ఆర్థికవేత్త తెలియజేసారు. ఆడమ్స్మత్ను అర్థశాస్త్ర పితామహుడుగా చెప్పవచ్చు.

ఇతని ఉద్దేశ్యంలో అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రం. ఆడమస్మిత్ తన ప్రఖ్యాతి పొందిన “రాజ్యాల సంపద” అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని “రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన” అని నిర్వచించాడు. ఆడమస్మిత్ ఉద్దేశ్యంలో మానవుని ప్రధాన కార్యకలాపము సంపదను ఆర్జించడం. అతని అనుచరులయిన జె.బి. సే, జె. యస్. మిల్. మొదలగువారు సంపద నిర్వచనాన్ని సమర్థించారు.

సంపద నిర్వచనములోని ప్రధానాంశాలు :
ఆడమస్మిత్ సంపద నిర్వచనంలోని ప్రధానాంశాలు క్రింది విధంగా పేర్కొన్నారు.

  1. మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్యోద్దేశం సంపదను ఆర్జించడం.
  2. సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు.
  3. మానవుని స్వార్థపరమైన ఆలోచన సంపదను ఎక్కువగా ఆర్జించడం.

విమర్శ :
అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రమనే సంకుచిత భావన వల్ల ఈ నిర్వచనం విమర్శలకు గురయింది.

  1. కార్లైల్, రస్కిన్ అర్థశాస్త్రం నిర్వచనాన్ని విమర్శించారు. వారి ఉద్దేశ్యంలో ఈ నిర్వచనం సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలిగాని, ఆర్థిక మానవుని గురించికాదు అని విమర్శించారు. దానివల్ల వారు దీనిని “దయనీయమైన” శాస్త్రంగా వర్ణించారు.
  2. ఆడమ్ స్మిత్ తన నిర్వచనంలో సంపదకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినాడు. కాని సంపద అనేది కేవలం మానవుని కోరికను తీర్చే ఒక సాధనం మాత్రమేనని మార్షల్ విమర్శించాడు.
  3. కేవలం భౌతిక వస్తువులను మాత్రమే ఆడమస్మిత్ సంపదగా పరిగణించారు. అభౌతిక కార్యకలాపాలైన ఉపాధ్యాయుల, వైద్యుల సేవలను పరిగణనలోనికి తీసుకోలేదు. అందువల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమై పోతుంది.
  4. సంపద నిర్వచనం కేవలం ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తోంది. పంపిణీని నిర్లక్ష్యం చేస్తుంది.
  5. స్వార్థాన్ని పెంచును : సంపద నిర్వచనంలో సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మానవుడు స్వార్థపరుడు, కనుక స్వప్రయోజనం కోసం పనిచేస్తాడు. స్మిత్ దృష్టిలో స్వప్రయోజనానికి, సామాజిక ప్రయోజనానికి తేడా లేదు. ఈ నిర్వచనం వల్ల ఆర్థిక వ్యక్తి ఏర్పడతాడు. ఈ ఆర్థిక వ్యక్తి పూర్తిగా స్వార్థపూరితమైనవాడు.
  6. ధన దేవత ఉద్భోద (Gosfel of Mammon) : ఈ నిర్వచనం సంపద సృష్టికి ప్రాధాన్యతనిస్తుంది. అందువల్ల దీనిని థామస్, కార్లైల్ “ధన దేవత”గా పేర్కొన్నారు.
  7. లోపభూయిష్టమైనది : వాల్రాస్ కూడా సంపద నిర్వచనాన్ని పరిశీలించి అది లోపభూయిష్టమైనదని, అశాస్త్రీయమైనదని, అసంపూర్ణమైనదని పేర్కొనెను.
  8. సంకుచితమైనది : ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు ప్రాధాన్యత ఇచ్చాడు. కాని సంపద మానవుని కోర్కెలను సంతృప్తిపరచటానికి ఒక సాధనంగా ఉండాలి. అనగా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి కాని, సంపదకు కాదు. ఈ విషయంలో సంపద నిర్వచనం అర్థశాస్త్రాన్ని సంకుచిత దృష్టిలో వివరించింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ఇన్ని లోపాలున్న కారణంగానే ఎక్కువమంది ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని తిరస్కరించారు.

సంక్షేమం నిర్వచనం :
మార్షల్ అర్థశాస్త్రాన్ని “మానవుడు అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రంగా” నిర్వచించారు. ఆయన నిర్వచనంలో మానవుడికి ప్రథమ స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చారు. మార్షల్ ఉద్దేశ్యం ప్రకారం “దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం.

శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ, మరొకవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.” మార్షల్ అనుచరులైన ఏ.సి. పిగూ, ఎడ్విన్ కానన్ వంటి వారు మార్షల్ నిర్వచనాన్ని సమర్థించారు.

ముఖ్య లక్షణాలు :

  1. సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యకలాపాలను గురించి మాత్రమే మార్షల్ నిర్వచనం పరిగణిస్తోంది.
  2. మానవునికి, మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు.
  3. ఇది కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుంది. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన విషయాలతో దీనికి సంబంధం లేదు.
  4. మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి, సమాజం ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.

విమర్శ :
మార్షల్ నిర్వచనం కూడా అనేక విమర్శలకు గురైంది. ముఖ్యంగా రాబిన్స్, మార్షల్ యొక్క “శ్రేయస్సు” అనే భావనను విమర్శించాడు.

  1. అర్థశాస్త్రం సామాజిక శాస్త్రంగాని, మానవశాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలిక సూత్రాలు మానవులందరికి వర్తిస్తాయి. అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు.
  2. మార్షల్ వస్తువులను భౌతిక మరియు అభౌతికమైనవిగా విభజించడం జరిగింది. కాని, తన నిర్వచనంలో అభౌతిక వస్తువులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
  3. శ్రేయస్సును కొలవవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించారు. శ్రేయస్సు అనేది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది.
  4. మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలను మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషంలాంటివి కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విస్మరించాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 2.
అర్థశాస్త్ర కొరత నిర్వచనాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి.
జవాబు.
కొరత నిర్వచనం :
మార్షల్ నిర్వచనాన్ని విమర్శించి రాబిన్స్ అర్థశాస్త్రానికి విశ్లేషణాత్మక నిర్వచనాన్ని ఇచ్చారు. 1932 సంవత్సరంలో ‘యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్’ అనే గ్రంథంలో రాబిన్స్ తన నిర్వచనాన్ని తెలియజేసెను.

మానవుని అపరిమితమైన కోరికలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం” అని నిర్వచించెను. ఈ నిర్వచనంలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని నిత్య సత్యాలు ఉన్నాయి.

1. అపరిమిత కోరికలు :
మానవుని కోరికలు అపరిమితం. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఉద్భవిస్తుంది. వాటిని తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం కృషి జరపటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి.

2. వనరులు పరిమితం :
మానవుని కోర్కెలు సంతృప్తిపరిచే సాధనాలు లేదా వనరులు పరిమితమైనవి. సాధనాలు పరిమితంగా ఉండటం వల్ల కొరత మరియు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

3. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు :
వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. అనగా ఒక సాధనానికి అనేక ఉపయోగాలు ఉంటాయి.

4. ఎంపిక :
సాధనాల కొరత, అపరిమితమైన కోరికల వల్ల ఎంపిక అంశం అతి ముఖ్యమైనదిగా ఉంటుంది. సాధనాల కేటాయింపులోను, కోరికల ప్రాధాన్యతను అనుసరించి సంతృప్తిపరిచే విషయంలోను ఎంపిక సమస్య ఉత్పన్నమవుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే శాస్త్రీయమైనది :

1. కార్యకలాపాలను విభజించలేదు :
మార్షల్ అర్థశాస్త్రంలో భౌతిక అంశాలను గూర్చి మాత్రమే వివరించాడు. కాని రాబిన్స్ భౌతిక, అభౌతిక అంశాలను రెండింటిని గూర్చి అర్థశాస్త్రంలో చర్చించాడు.

2. శ్రేయస్సును విమర్శించుట:
మార్షల్ శ్రేయస్సు అనే పదానికి, అర్థశాస్త్రానికి ముడిపెట్టాడు. కాని రాబిన్స్ ప్రకారం, అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదు. కారణం అర్థశాస్త్రంలో శ్రేయస్సుకు దోహదపడని వస్తువులు ఉదాహరణకి మత్తు పానీయాలు, సిగరెట్లు, విషం మొదలగు వాటిని గూర్చి కూడా చర్చిస్తాం.

3. లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండుట :
రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయాలను చేయదు. అందువల్ల ఇది వాస్తవిక శాస్త్రం.

4. శాస్త్రీయమైనది :
రాబిన్స్ నిర్వచనం వల్ల ఆర్థిక సమస్య ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి వీలైనది. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని శాస్త్రీయ స్థాయికి చేర్చి, ఎంపిక శాస్త్రంగా మలిచాడు.

5. పరిధిని విస్తృతపరిచింది :
ఈ నిర్వచనం అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది. “వనరుల కొరత” అనేది ఒక సార్వత్రిక సమస్య. కనుక ఈ నిర్వచనం వల్ల అర్థశాస్త్ర పరిధి కూడా విస్తరించింది.

రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే మెరుగైనప్పటికి కొన్ని విమర్శలకు గురైనది.
విమర్శ :

  1. ఈ నిర్వచనం కొరతగా ఉన్న వనరులను ఉపయోగించి గరిష్ట స్థాయిలో కోరికలను ఏ విధంగా సంతృప్తి పరుచుకోవాలో అనే విషయం మీద దృష్టి సారించలేదు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్వచనంలో శ్రేయస్సు అనే భావన అంతర్గతంగా ఇమిడి ఉంది.
  2. రాబిన్స్ నిర్వచనానికి మరొక విమర్శ, ఇది మారుతున్న సమాజానికి వర్తించదు. కాలం మారుతున్న కొద్ది అనేక మార్పులు వస్తాయి. కాబట్టి వనరుల కొరత అనే సమస్యను అధిగమించవచ్చు.
  3. ఆధునిక అర్థశాస్త్రంలో చాలా ముఖ్యమైన జాతీయ ఆదాయం, ఉద్యోగిత వంటి స్థూల ఆర్థిక విశ్లేషణను రాబిన్స్ నిర్వచనం విస్మరించింది.
  4. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి ఆధునిక అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యాంశాలను కొరత నిర్వచనంలో చర్చించలేదు.
  5. శ్రీమతి జాన్ రాబిన్సన్ ఈ నిర్వచనాన్ని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించని వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్య సమస్య వనరుల కొరత మాత్రమే కాదని, ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించు కోవాలనేదే ముఖ్యమని ఆమె అభిప్రాయము.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 3.
అర్థశాస్త్రం స్వభావం మరియు పరిధిని వివరించుము.
జవాబు.
అర్థశాస్త్రమనేది విస్తృతమైన, విశాలమైన విషయం, అర్థశాస్త్ర పరిధి, స్వభావం, విషయ సంబంధిత అంశాలను తెలుసుకోవాలంటే సంప్రదాయవాదుల నుంచి ఆధునిక అర్థశాస్త్రవేత్తల వరకు వారి అభిప్రాయాలను గమనించాలి.

టర్గాట్ (Turgot) క్వజెన్ (Quesnay) అనే సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ‘ఆర్థిక కార్యకలాపాలన్నీ మానవుని కోర్కెలను సంతృప్తి పరచడానికే వారి ఉద్దేశంలో ఆర్థిక కార్యకలాపాల ప్రాథమిక సూత్రం ఏమంటే పరిమిత సాధనాలతో గరిష్ట ప్రయోజనాన్ని పొందడమేనని భావించారు. దీనిని వారు మానవుని కోర్కెలను తృప్తి పరచడమే ఆర్థిక లక్ష్యంగా పేర్కొన్నారు.

సమాజాన్ని మనం గమనించినట్లయితే ఆర్థిక కార్యకలాపాలలో ద్రవ్యం ప్రాధాన్యత ఎంతో ఉంది. మానవుని కార్యకలాపాల అర్థశాస్త్ర అధ్యయనంలో ద్రవ్యం ఒక భాగమైంది. అయినప్పటికీ అర్థశాస్త్రమనేది వర్తక కార్యకలాపాలకే పరిమితమా ? లేక ద్రవ్య సంబంధమైనదా ? అనే దానికి స్పష్టత లేదు.

అర్థశాస్త్ర పితామహుడయిన ఆడమ్ స్మిత్ రచనలలోని ప్రఖ్యాతిగాంచిన జాతుల సంపద అనే ఆంగ్ల పుస్తకంలో అర్థశాస్త్ర స్వభానికి ఒక రూపమొచ్చింది. ఆ తరువాత చాలా మంది ఆర్థిక వేత్తలు అర్థశాస్త్రాన్ని వివిధ నిర్వచనాలతో వేరు వేరు మార్గాలలో విషయ పరిధిని
వివరించారు.

శాస్త్రానికి దేనితో అయితే సంబంధం ఉంటుందో అది వివరించేదే ఆ శాస్త్ర పరిధి. సంప్రదాయ ఆర్థిక సిద్ధాంతం | ప్రకారం అర్థశాస్త్రాన్ని వివిధ విభాగాలుగా పేర్కొన్నారు. అవి : వినియోగం, ఉత్పత్తి, వినిమయం, పంపిణీ, ఆదాయం, ఉద్యోగిత, ప్రణాళిక, ఆర్థికాభివృద్ధి అదే ఆధునిక ఆర్థిక సిద్ధాంతం ప్రకారం అర్థశాస్త్రాన్ని రెండు విభాగాలుగా పేర్కొనవచ్చు. అవి: సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం.

సూక్ష్మ అర్థశాస్త్రం :
సూక్ష్మ అర్థశాస్త్రం వ్యక్తుల, చిన్న సంస్థల, వైయక్తిక యూనిట్ల ప్రవర్తనను, ఆర్థిక చర్యలను తెలుపుతుంది. సూక్ష్మ అర్థశాస్త్రం, ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య సమర్థవంతంగా కేటాయించబడినవా లేదా అనే అంశాలను సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది.

ఈ అంశం సంక్షేమ అర్థశాస్త్రానికి సంబంధించింది. సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి, ఉత్పత్తుల ధరలు, ఉత్పత్తి కారకాల ధరలు, సంక్షేమ అర్థశాస్త్రానికి సంబంధించింది.

స్థూల అర్థశాస్త్రం :
స్థూల అర్థశాస్త్రం సాధారణ ధరల స్థాయిని, అందులోని హెచ్చు తగ్గులను పరిశీలిస్తుందే కాని వస్తుసేవల పాపేక్ష ధరలను గురించి కాదు. స్థూల అర్థశాస్త్రం సమిష్టి జాతీయ ఆదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపులు, ఉద్యోగితల గురించి అధ్యయనం చేస్తుంది.

ఆర్థిక వృద్ధి సిద్ధాంతం స్థూల అర్థశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. ఆధునిక అర్థశాస్త్రం చాలామటుకు ఆర్థిక వృద్ధికి సంబంధించినది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధాన లక్ష్యం ఏమంటే అధికస్థాయి ఆర్థిక వృద్ధిని సాధించడం. స్థూల అర్థశాస్త్ర పరిధి ఆదాయ సిద్ధాంతం, ఉద్యోగిత, సాధారణ ధరల స్థాయి, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, స్థూల పంపిణీ సిద్ధాంతానికి సంబంధించిందిగా చెప్పవచ్చు.

ఆర్థిక శాస్త్రం దానికి సంబంధిత అంశాల స్వరూపాన్ని వివరించడమేకాక, అవి ఏ విధంగా ఉండాలో అనే విషయాన్ని విశదీకరిస్తుంది. ఉదా : ఆర్థిక వ్యవస్థలో అమలులో నున్న వేతనాల స్థాయి, ధరలు, పన్ను రేట్ల గురించి అర్థశాస్త్రం చర్చించి అవి ఎలా ఉండాలో సూచిస్తుంది. కాబట్టి అర్థశాస్త్రాన్ని నిశ్చయాత్మక మరియు నిర్ణయాత్మక శాస్త్రంగా చెప్పవచ్చు.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

సంప్రదాయ అర్థశాస్త్రం ప్రాథమికంగా వినియోగం, ఉత్పత్తి, వినిమయం, పంపిణీ, ఆదాయం, ఉద్యోగిత, ప్రణాళిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించింది.

1. వినియోగం (Consumption) :
సేవల నుంచి ప్రయోజనాన్ని పొందడంగా నిర్వచించవచ్చు. వినియోగమనేది ప్రస్తుత కోరికలను సంతృప్తిపరచడం కోసం అంతిమ వస్తుసేవలను ఉపయోగించడం వినియోగం అవుతుంది. వినియోగం అనేది ఉత్పత్తి. వినిమయం, పంపిణీకి ఆధారంగా పేర్కొనవచ్చు.

2. ఉత్పత్తి (Production) :
అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే ముడి సరుకులకు, రూప, స్థాన, కాల ప్రయోజనాన్ని కల్పించి అంతిమ వస్తువులగా మార్చే ప్రక్రియను ఉత్పత్తిగా చెప్పొచ్చు. ఉత్పత్తిలో పాల్గొనే కారకాలను ఉత్పత్తి కారకాలుగా పేర్కొంటాం. అవి : భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన.

3. వినియోగం (Exchange) :
ఇది వస్తువుల వినిమయానికి సంబంధించింది. ఒక వస్తువుకు బదులుగా వేరొక వస్తువును లేదా ద్రవ్యానికి మారకం చేయడం. ద్రవ్యం అమలులో లేనప్పుడు వస్తువు మార్పిడి పద్ధతిలో వస్తువుకు బదులుగా వేరొక వస్తువును మార్పిడి చేయడం జరిగేది.

వస్తువు మార్పిడి పద్ధతిలో చాలా ఇబ్బందులున్నాయి. ద్రవ్యం అమలులోకి వచ్చిన పిదప ప్రతి వస్తువు విలువను ద్రవ్య రూపంలో (ధరలో) చెప్పడం, వస్తువులను ద్రవ్యానికి మార్పిడి చేయడం వల్ల వినిమయం సులభం అయింది.

4. పంపిణీ (Distribution) :
అర్థశాస్త్రంలో పంపిణీ మరొక ముఖ్యమైన అంశం. ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి కారకాల మధ్య వస్తువులు, సేవలు ఏ విధంగా పంపిణీ చేయబడతాయో తెలుపుతుంది. ఉత్పత్తి కారకాల ధరలను నిర్ణయించడానికి వివిధ రకాల సిద్ధాంతాలు అమలులో ఉన్నాయి.

5. ఆదాయం (Income) :
వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల వ్యక్తులు ఆదాయాలను పొందుతారు. ఈ ఆర్థిక కార్యకలాపాలు వస్తువుల, సేవల ఉత్పత్తికి సంబంధించింది. ఆదాయం ఒక ప్రవాహం. జాతీయాదాయ వివిధ భావనలు, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులను స్థూల అర్థశాస్త్రంలో చర్చించడమైంది. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి విశ్లేషణలో పై అంశాలు స్థూల అర్థశాస్త్రంలో భాగమవుతాయి.

6. ఉద్యోగిత (Employment) :
ఆర్థిక వ్యవస్థలో వినియోగ వస్తువుల, పెట్టుబడి వస్తువుల డిమాండ్ మీద ఉద్యోగితా స్థాయి ఆధారపడుతుంది. సంపూర్ణోద్యోగిత అంటే అమలులో ఉన్న వేతన స్థాయి వద్ద ఎవరయితే అర్హత కలిగి ఉండి, పని చేయడానికి ఇష్టపడతారో వారందరికి పని కల్పించడం సంపూర్ణోద్యోగిత అవుతుంది.

7. ప్రణాళిక (Planning), ఆర్థికాభివృద్ధి (Economic Development) :
అందుబాటులో ఉన్న వనరుల సరైన, సమర్థవంతమైన ఉపయోగం కోసం ఆర్థిక ప్రణాళికలు అత్యంత అవశ్యకం. ఆర్థిక ప్రణాళిక ద్వారా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముందు నిర్ణయించుకొన్న వివిధ లక్ష్యాలను క్రమపద్ధతిలో సాధించవచ్చు. ప్రజల సంక్షేమాన్ని పెంపొందించడం, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల మధ్య కొరతగా ఉన్న వనరుల పంపిణీని అభిలషణీయంగా చేపట్టడానికి ఆర్థిక ప్రణాళిక తోడ్పడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 4.
సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాల భావనలను, పరిధిని వివరించండి. వాటి మధ్య గల తేడాలను తెలపండి.
జవాబు.
ఆర్థిక సమస్యల విశ్లేషణకు ఆధునిక ఆర్థికవేత్తలు రెండు మార్గాలను అవలంబించారు. అవి :

  • సూక్ష్మ అర్థశాస్త్రం
  • స్థూల అర్థశాస్త్రంరాగ్నాష్ మొదటిసారిగా 1933లో సూక్ష్మ, స్థూల అనే పదాలను అర్థశాస్త్రములో ప్రవేశపెట్టారు.

1) సూక్ష్మ అర్థశాస్త్రం :
సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఇవి జాతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న భాగాలు లేదా వైయుక్తిక యూనిట్లు మాత్రమే.

ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో, ఒక సంస్థ గరిష్ట లాభాలను ఏ విధంగా పొందుతుందో సూక్ష్మ అర్థశాస్త్రము మనకు తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రము పరిశీలిస్తుంది. అందువలననే దీనిని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తారు.

దీనిని క్రింది చార్టు ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 1st Lesson అర్థశాస్త్ర పరిచయం 1

2) స్థూల అర్థశాస్త్రం :
స్థూల అర్థశాస్త్రం అనేది ‘Macros’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ‘Macros’ అంటే పెద్ద అని అర్థం. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. జాతీయాదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది.

J.M. కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆర్థికమాంద్యం కాలంలో ఆయన రాసిన పుస్తకం ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం ప్రచురణ తరువాత స్థూల ఆర్థిక సిద్ధాంతానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది.

స్థూల అర్థశాస్త్రాన్ని “ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం” అని కూడా అంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకొని వివరిస్తుంది.

TS Inter 1st Year Economics Study Material 1st Lesson అర్థశాస్త్ర పరిచయం 2

సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాల మధ్య తేడాలు :

సూక్ష్మ అర్థశాస్త్రం స్థూల అర్థశాస్త్రం
1. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది Micros అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. Micro అనగా చిన్న అని అర్థం. 1. స్థూల అర్థశాస్త్రం అనేది Macros అనే గ్రీకు పదం నుంచి జనించింది. Macro అనగా పెద్ద అని అర్థం.
2. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత భాగాలను గురించి అధ్యయనం చేస్తుంది. 2. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది.
3. దీనిని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు. 3. దీనిని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.
4. వస్తు, కారకాల మార్కెట్ లో ధర నిర్ణయం గురించి వివరిస్తుంది. 4. జాతీయాదాయం, సమిష్టి ఉద్యోగిత, సమిష్టి పొదుపు, పెట్టుబడి, సాధారణ ధరలస్థాయి, ఆర్థికాభివృద్ధి మొదలైన అంశాలను చర్చిస్తుంది.
5. డిమాండ్, సప్లయ్ పై ఆధారపడి ధరల యంత్రాంగం ఉంటుంది. 5. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ ప్రాతిపదికగా ఉంటుంది.

 

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 5.
నిగమన, ఆగమన పద్ధతులను విశ్లేషించండి.
జవాబు.
ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాలు రూపొందించడంలో ఒక నిర్థిష్టమైన పద్ధతి అవలంబించబడుతుంది. పీటర్సన్ అభిప్రాయంలో “ఆర్థిక సూత్రాలను నిర్మించడంలో, పరిశీలించడంలో ఉపయోగించే పద్ధతులు, మౌలికాల ప్రక్రియను పద్ధతి (Method) అని అంటారు. ఆర్థిక సంబంధమైన విచారణ చేయడానికి ఆర్థికవేత్తలు సాధారణంగా రెండు రకాలైన పద్దతులను అవలంబిస్తారు.

  • నిగమన పద్ధతి
  • ఆగమన పద్ధతి

1. నిగమన పద్ధతి :
సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారు. దీనిని ‘పరికల్పన’ (Hypothetical) లేదా అనిర్థిష్టక (Abstract) పద్ధతి అని కూడా అంటారు. ఇది వాస్తవాలపై కాకుండా ఒక మానసిక అభ్యాసం, తర్కం మీద ఆధారపడి ఉంటుంది.

ఒక తరం నుంచి మరొక తరానికి కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు అంగీకరించబడ్డ సూత్రాలు లేదా వాస్తవాల నుంచి తర్కం ద్వారా ఆర్థిక సిద్ధాంతాలను రూపొందించడం జరుగుతుంది. ఇందులో సాధారణ విషయాల నుంచి ఒక నిర్ధిష్ట విషయాన్ని రాబట్టడం జరుగుతుంది.

ఉదా : హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి సాధారణంగా తక్కువ ధర గల వస్తువుని కొంటాడు. ఎక్కువ ధరగల వస్తువును విక్రయిస్తాడు. అయితే మార్కెట్ను గురించి సరైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. నిగమన పద్ధతిలో నిర్ణయాలు చేసేటప్పుడు నాలుగు దశలు ఉంటాయి. అవి :

  1. ఒక సమస్యను ఎన్నుకోవడం
  2. ప్రమేయాలను రూపొందించడం
  3. ఒక పరికల్పనను రూపొందించడం (Hypothesis)
  4. పరికల్పన ప్రతిపాదనను పరిశీలించడం
    క్షీణోపాంత ప్రయోజన సూత్రం నిగమన పద్ధతికి ఒక ఉదాహరణ.

2. ఆగమన పద్ధతి :
దీనిని చారిత్రక లేదా గుణాత్మక లేదా అనుభవిక, వాస్తవ, నిర్థిష్ట పద్ధతి అని పిలుస్తారు. జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి పరిచారు. ఇది ఒక నిర్థిష్ట లేదా ప్రత్యేక అంశం నుంచి విశ్వజనీనతకు పయనిస్తుంది. ఇందులో వాస్తవాల వివరాల సేకరణ చేసి సమకూర్చి సాధారణ నిర్ణయాలు చేయబడతాయి.
ఉదా : మాల్టస్ సిద్ధాంతం. ఈ పద్ధతిలో నాలుగు దశలు ఉంటాయి.

  1. సమస్యను ఎన్నుకోవడం
  2. దత్తాంశాన్ని సేకరించడం
  3. పరిశీలించడం
  4. సాధారణీకరించటం విషయాలను ఉన్నవి ఉన్నట్టుగానే వివరించడం వల్ల ఈ పద్ధతి వాస్తవమైనదిగా భావించబడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 6.
వివిధ రకాల వస్తువులను వివరించండి.
జవాబు.
వస్తువు : మానవుని కోరికలను తీర్చగలిగే సాధనాలను లేదా సేవలను అర్థశాస్త్రంలో వస్తువులు అంటారు. స్పృశించదగిన మానవుని కోరికలను తీర్చగలిగే వాటిని వస్తువులు అంటారు.
ఉదా : నీరు, పుస్తకాలు, పెన్నులు, సెల్ఫోన్లు మొదలైనవి. వస్తువులను రెండు రకాలుగా విభజించవచ్చు.
అవి : ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు.

ఉచిత వస్తువులు :
మానవ కోరికలను సంతృప్తి, పరిచే ఏ పదార్థాన్నయినా వస్తువు అంటారు. ప్రకృతిలో ఏ విధమైన ధర లేకుండా లభించే వస్తువులను ఉచిత వస్తువులు అంటారు. వీటి సప్లయ్ డిమాండ్ కంటే ఎక్కువ. అందువలన వీటికే ధర ఉండదు. ఉచిత వస్తువులకు ఉపయోగిత విలువ ఉంటుంది. వినిమయపు విలువ ఉండదు.
ఉదా : గాలి, నీరు, సూర్యరశ్మి.

ఆర్థిక వస్తువులు :
డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులంటారు.
ఉదా : ఆహారం, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. అవకాశం ఉంటే వీటిని వ్యక్తులు ఎక్కువగా కావాలనుకుంటారు. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువ ఉంటాయి. ఇది మానవ నిర్మితాలు. కనుక వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.

వినియోగవస్తువులు :
మానవ కోరికలను సంతృప్తి పరిచే ఏ పదార్థాన్నయినా వస్తువు అంటారు. అంతిమ వినియోగం కోసం కుటుంబాలు కొనే ఆర్థిక వస్తువులను వినియోగవస్తువులు అంటారు. అంటే మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలిగేవి.
ఉదా : పాలు, పండ్లు, పెన్నులు, వస్త్రాలు మొదలగునవి. వినియోగ వస్తువులను నశ్వరవస్తువులు, | అనశ్వర వస్తువులు అని రెండు రకాలుగా విభజించవచ్చు.

ఉత్పాదక వస్తువులు :
ఉత్పాదక వస్తువులనే మూలధన వస్తువులు అని కూడా అంటారు. ఇవి ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో అటువంటి వస్తువులను ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరచును. వీటిని ద్వితీయ శ్రేణి వస్తువులంటారు.

వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది. ఇవి ఒకసారి ఉపయోగంలో నశించేవి, కొంతకాలంపాటు వినియోగంలో ఉండేవి అవి రెండు రకములు. ఉదా : యంత్ర పరికరాలు, కర్మాగార భవనాలు మొదలైనవి.

మాధ్యమిక వస్తువులు :
పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువుల ముడిసరుకులను, అంతిమ వినియోగ వస్తువులకు మధ్యలో వివిధ దశలలో ఉన్న వస్తువులను మధ్యంతర వస్తువులు అంటారు. అంతిమ వినియోగానికి కాకుండా ఇతర వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో, ఎక్కడో ఒకచోట ఉపయోగించే వస్తువులు మాధ్యమిక వస్తువులు. ఉదా : సిమెంటు, ఇటుకలు, స్టీలు మొదలైనవి నిర్మాణ రంగంలో మాధ్యమిక వస్తువులు.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అర్థశాస్త్ర శ్రేయస్సు నిర్వచనాన్ని పరిశీలించండి.
జవాబు.
మార్షల్ అర్థశాస్త్రాన్ని “మానవుడు అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రంగా” నిర్వచించారు. ఆయన నిర్వచనంలో మానవుడికి ప్రథమ స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చారు. మార్షల్ ఉద్దేశ్యం ప్రకారం “దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం.

శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ, మరొకవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.” మార్షల్ అనుచరులైన ఏ.సి. పిగూ, ఎడ్విన్ కానన్ వంటి వారు మార్షల్ నిర్వచనాన్ని సమర్థించారు.

ముఖ్య లక్షణాలు :

  1. సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యకలాపాలను గురించి మాత్రమే మార్షల్ నిర్వచనం పరిగణిస్తోంది.
  2. మానవునికి, మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు.
  3. ఇది కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుంది. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన విషయాలతో దీనికి సంబంధం లేదు.
  4. మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి, సమాజం ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.

విమర్శ :
మార్షల్ నిర్వచనం కూడా అనేక విమర్శలకు గురైంది. ముఖ్యంగా రాబిన్స్, మార్షల్ యొక్క “శ్రేయస్సు” ‘అనే భావనను విమర్శించాడు.

  1. అర్థశాస్త్రం సామాజిక శాస్త్రంగాని, మానవశాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలిక సూత్రాలు మానవులందరికి వర్తిస్తాయి. అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు.
  2. మార్షల్ వస్తువులను భౌతిక మరియు అభౌతికమైనవిగా విభజించడం జరిగింది. కాని, తన నిర్వచనంలో అభౌతిక వస్తువులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
  3. శ్రేయస్సును కొలవవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించారు. శ్రేయస్సు అనేది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది.
  4. మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలను మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషంలాంటివి కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విస్మరించాడు.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 2.
అర్థశాస్త్ర కొరత నిర్వచనాన్ని గురించి వివరించండి.
జవాబు.
కొరత నిర్వచనం :
మార్షల్ నిర్వచనాన్ని విమర్శించి రాబిన్స్ అర్థశాస్త్రానికి విశ్లేషణాత్మక నిర్వచనాన్ని ఇచ్చారు. ‘యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్’ అనే గ్రంథంలో రాబిన్స్ తన నిర్వచనాన్ని తెలియజేసెను.

మానవుని అపరిమితమైన కోరికలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం” అని నిర్వచించెను. ఈ నిర్వచనంలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని నిత్య సత్యాలు ఉన్నాయి.

1. అపరిమిత కోరికలు :
మానవుని కోరికలు అపరిమితం. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఉద్భవిస్తుంది. వాటిని తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం కృషి జరపటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి.

2. వనరులు పరిమితం :
మానవుని కోర్కెలు సంతృప్తిపరిచే సాధనాలు లేదా వనరులు పరిమితమైనవి. సాధనాలు పరిమితంగా ఉండటం వల్ల కొరత మరియు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

3. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు :
వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. అనగా ఒక సాధనానికి అనేక ఉపయోగాలు ఉంటాయి.

4. ఎంపిక :
సాధనాల కొరత, అపరిమితమైన కోరికల వల్ల ఎంపిక అంశం అతి ముఖ్యమైనదిగా ఉంటుంది. సాధనాల కేటాయింపులోను, కోరికల ప్రాధాన్యతను అనుసరించి సంతృప్తిపరిచే విషయంలోను ఎంపిక సమస్య ఉత్పన్నమవుతుంది.

రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే శాస్త్రీయమైనది :

1. కార్యకలాపాలను విభజించలేదు :
మార్షల్ అర్థశాస్త్రంలో భౌతిక అంశాలను గూర్చి మాత్రమే వివరించాడు. కాని రాబిన్స్ భౌతిక, అభౌతిక అంశాలను రెండింటిని గూర్చి అర్థశాస్త్రంలో చర్చించాడు.

2. శ్రేయస్సును విమర్శించుట :
మార్షల్ శ్రేయస్సు అనే పదానికి, అర్థశాస్త్రానికి ముడిపెట్టాడు. కాని రాబిన్స్ ప్రకారం, అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదు. కారణం అర్థశాస్త్రంలో శ్రేయస్సుకు దోహదపడని వస్తువులు ఉదాహరణకి మత్తు పానీయాలు, సిగరెట్లు, విషం మొదలగు వాటిని గూర్చి కూడా చర్చిస్తాం.

3. లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండుట :
రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయాలను చేయదు. అందువల్ల ఇది వాస్తవిక శాస్త్రం.

4. శాస్త్రీయమైనది :
రాబిన్స్ నిర్వచనం వల్ల ఆర్థిక సమస్య ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి వీలైనది. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని శాస్త్రీయ స్థాయికి చేర్చి, ఎంపిక శాస్త్రంగా మలిచాడు.

5. పరిధిని విస్తృతపరిచింది :
ఈ నిర్వచనం అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది. “వనరుల కొరత” అనేది ఒక సార్వత్రిక సమస్య. కనుక ఈ నిర్వచనం వల్ల అర్థశాస్త్ర పరిధి కూడా విస్తరించింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే మెరుగైనప్పటికి కొన్ని విమర్శలకు గురైనది.

విమర్శ:

  1. ఈ నిర్వచనం కొరతగా ఉన్న వనరులను ఉపయోగించి గరిష్ట స్థాయిలో కోరికలను ఏ విధంగా సంతృప్తి పరుచుకోవాలో అనే విషయం మీద దృష్టి సారించలేదు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్వచనంలో శ్రేయస్సు అనే భావన అంతర్గతంగా ఇమిడి ఉంది.
  2. రాబిన్స్ నిర్వచనానికి మరొక విమర్శ, ఇది మారుతున్న సమాజానికి వర్తించదు. కాలం మారుతున్న కొద్ది అనేక మార్పులు వస్తాయి. కాబట్టి వనరుల కొరత అనే సమస్యను అధిగమించవచ్చు.
  3. ఆధునిక అర్ధశాస్త్రంలో చాలా ముఖ్యమైన జాతీయ ఆదాయం, ఉద్యోగిత వంటి స్థూల ఆర్థిక విశ్లేషణను రాబిన్స్ నిర్వచనం విస్మరించింది.
  4. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి ఆధునిక అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యాంశాలను కొరత నిర్వచనంలో చర్చించలేదు.
  5. శ్రీమతి జాన్ రాబిన్సన్ ఈ నిర్వచనాన్ని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించని వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్య సమస్య వనరుల కొరత మాత్రమే కాదని, ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదే ముఖ్యమని ఆమె అభిప్రాయము.

ప్రశ్న 3.
అర్థశాస్త్ర వృద్ధి నిర్వచనాన్ని వివరించండి.
జవాబు.
కాలం అనే మూలకం, చలన గుణం ఇమిడి ఉన్నాయి. అందుకే ఇది వృద్ధి సంబంధిత అర్థశాస్త్ర నిర్వచనంగా సిలువబడుతుంది.

సామూల్సన్ నిర్వచనం ప్రకారం “వర్తమాన, భవిష్యత్ వినియోగానికిగాను ప్రత్యామ్నాయ ప్రయోజాలున్న పరిమిత ఉత్పాదక వనరులతో ద్రవ్యాన్ని ఉపయోగించిగాని, ఉపయోగించకుండాగాని వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి నీటిని వివిధ వ్యక్తులకు, సమూహాలకు పంపిణీ చేయడంలో ప్రజలు, సమాజం ఏ విధంగా ఎంపిక చేస్తారో అధ్యయనం చేసేది అర్థశాస్త్రం. మెరుగైన వనరుల కెటాయింపు పద్ధతుల వల్ల ఉండే లాభాలను ఇది విశ్లేషిస్తుంది”.

ముఖ్యాంశాలు :

  1. రాబిన్స్ నిర్వచనంలాగా, ఈ నిర్వచనం కూడా వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వివిధ రకాల ఉపయోగాలు కలిగి ఉంటాయని తెల్పుతుంది.
  2. వర్తమాన, భవిష్యత్ వినియోగం, ఉత్పత్తి, పంపిణీలను గురించి వివరిస్తుంది. అందువల్ల ఇది చలన స్వభావం కలిగింది.
  3. చలన వ్యవస్థలో ఎంపిక సమస్యను గురించి ఈ నిర్వచనం చర్చిస్తుంది. ఈ నిర్వచనం అర్థశాస్త్ర పరిధిని విస్తృతపరిచింది.
  4. రాబిన్స్ నిర్వచనం కంటే సామూల్సన్ నిర్వచనం మెరుగైంది. ఎందుకంటే వనరుల కొరత అనే అంశం నుంచి ఆదాయం. ఉత్పత్తి, ఉద్యోగిత ఈ తరువాత ఆర్థిక వృద్ధి సమస్యల చర్చకు దారితీసింది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 4.
ఆర్థిక వ్యవస్థలోని మౌళిక సమస్యలను వివరించాలి.
జవాబు.
ఏ రకమైన ఆర్థిక వ్యవస్థలోనైనా కొన్ని మౌళిక సమస్యలు ఉంటాయి. వీటిని అర్థశాస్త్రవేత్తలు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రధానమైన మౌళిక సమస్యలను కింద చర్చించడం జరిగింది. ఇవి పరస్పర సంబంధాన్ని కలిగి ఉండి పరస్పరం ఆధారపడి ఉంటాయి.

  1. ఏ రకమైన వస్తువులను, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ?
  2. ఈ వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ?
  3. ఈ వస్తు సేవలను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ?
  4. ఉత్పాదక వనరులను ఎంత సమర్థవంతంగా ఉపయోగించుతున్నాం ? అందుబాటులో ఉన్న వనరులన్నీ పూర్తిగా ఉపయోగించబడుతున్నాయా ?
  5. ఒక కాల వ్యవధిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందా లేదా స్థిరంగా ఉందా ?

1. వస్తువుల ఎంపిక, పరిమాణాలు :
వస్తువులు చాల రకాలు, అవసర వస్తువులు, సౌకర్యాలు, విలాస వస్తువులుగా అలాగే వినియోగ వస్తువులు, మూలధన వస్తువులుగా వస్తువులను వర్గీకరించవచ్చు. ఒక నిర్ణీత కాలంలో అన్ని వస్తువులను ఉత్పత్తి చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి వనరులు సరిపోవు.

అందుకే ఏ రకమైన వస్తువులను ఉత్పత్తి చేయాలనేదే సమస్య. ఏ రకం వస్తువులను ఉత్పత్తి చేయాలో నిర్ణయించిన తరువాత, వీటిని ఏ పరిమాణంలో ఉత్పత్తి చేయాలో నిర్ణయించాలి. అదే విధంగా ఒకవేళ మనం డిమాండ్ కంటే అధికంగా వస్తువులను ఉత్పత్తి చేస్తే ధరలు తగ్గుతాయి.

అదే డిమాండ్ కంటే తక్కువ పరిమాణంలో వస్తూత్పత్తి జరిగితే ధరలు పెరుగుతాయి. ఉత్పత్తి పరిమాణాన్ని నిర్ణయించడంలో డిమాండ్, సప్లయ్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. సమాజంలో ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఏ వస్తువులను; ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలో నిర్ణయించాలి.

2. ఉత్పత్తి పద్ధతుల ఎంపిక :
వస్తువలును ఉత్పత్తి చేయడానికి వివిధ పద్ధతులున్నాయి. అవి : శ్రమ సాంద్రత పద్ధతి మరియు మూలధన సాంద్రత పద్ధతి. శ్రామిక మిగులు కలిగిన ఆర్థిక వ్యవస్థలో మూలధన సాంద్రత పద్ధతి సరైనది కాదు. ఎందుకంటే ఇది శ్రామిక నిరుద్యోగ సమస్యను ఏర్పరుస్తుంది.

మూలధనం కొరతగా ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వనరుల ఆధారంగా ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసి ఉపయోగించాలి. శ్రమ సమృద్ధిగా ఉంటే శ్రమసాంద్రత పద్ధతిని, మూలధనం సమృద్ధిగా ఉంటే మూలధన సాంద్రత పద్ధతిని ఉపయోగిస్తారు.

3. వస్తువుల పంపిణీ :
ఏ దేశంలోనైనా ప్రజల సంక్షేమమే ముఖ్యం, వారు ధనికులు కాని పేదవారు కాని కావచ్చు. వస్తూత్పత్తి చేపట్టినప్పుడు అవి పేదవారికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కాని ధనికుల కోసం కారాదు. కాబట్టి పంపిణీ కోణంలో వస్తూత్పత్తి జరగాలి.

4. అభిలషణీయరీతిలో వనరుల ఉపయోగం :
వనరుల కొరత ప్రధాన సమస్య అయినప్పటికీ సమర్థవంతమైన వనరుల ఉపయోగం అవసరం. అదే కాకుండా కొరతగా ఉన్న వనరుల అల్ప వినియోగం (under utilization) కూడా ఒక సమస్య. అందుకే వనరుల అల్ప వినియోగంలను అధిగమించాలి.

కొరత వనరుల అభిలషణీయమైన ఉపయోగం అవసరమెంతైనా ఉంది. ఒక ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉన్న వనరులను పూర్తిగా ఉపయోగించడం అంటే సాంకేతిక సామర్థ్యాన్ని లేదా సంపూర్ణ ఉద్యోగితను సాధించినట్లుగా భావిస్తాం.

5. ఆర్థిక వ్యవస్థలో నిరంతర మార్పులు :
ఒక కాల వ్యవధిలో ఆర్థిక వ్యవస్థలో నిశ్చల, నిలకడ స్థితిగతులు లేకుండా నిరంతర మార్పులుండాలి. ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధికి చలనత్వం తోడ్పడుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 5.
సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి ? దాని ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు.
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రమని, స్థూల అర్థశాస్త్రమని 1933 సం॥లో రాగ్నార్ ఫ్రిష్ ప్రతిపాదించెను. సూక్ష్మ అర్థశాస్త్రం అమె: ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం.

సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయక్త యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని చిన్నచిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది.

ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో ? ఒక సంస్థ గరిష్ట లాభాలు ఏ విధంగా పొందుతుందో ? సూక్ష్మ అర్థశాస్త్రం తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అందువలనే దీనిని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.

పరిధి :
వైయక్తిక యూనిట్ల పరిశీలనయే సూక్ష్మ అర్థశాస్త్రం. “సంపూర్ణ ఉద్యోగిత” అనే ప్రమేయముపై సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ జరుగుతుంది. ఇది వినియోగదారులను, ఉత్పత్తిదారులను విడివిడిగా వారి ప్రవర్తనను విశ్లేషించును.

సూక్ష్మ అర్థశాస్త్రం ముఖ్యంగా ఏమిటి ? ఎలా ? ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. వస్తువుల మార్కెట్లలో ధర నిర్ణయం, కారకాల మార్కెట్లో ధర నిర్ణయం అధ్యయనం చేస్తుంది. ఈ క్రింది చార్టు సూక్ష్మ | అర్థశాస్త్ర పరిధిని వివరిస్తుంది.

సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి :

TS Inter 1st Year Economics Study Material 1st Lesson అర్థశాస్త్ర పరిచయం 3

ప్రాధాన్యత :

  1. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత సంఖ్యలో ఉన్న వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య వనరులు అభిలషణీయంగా ఏ విధంగా కేటాయింపులు జరుగుతాయో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది.
  2. ఇది వ్యక్తుల, సంస్థల సమతౌల్యాన్ని వివరిస్తుంది.
  3. ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనలో ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఏకస్వామ్యాల నియంత్రణ, పరిశ్రమల సబ్సిడీ మొదలైనవి.
  4. ఆర్థిక మంత్రికి పన్ను భారంను ఏ విధంగా వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు, అమ్మకందారులకు పంపిణీ చేయాలో వివరిస్తుంది.
  5. ఉత్పత్తి వ్యయాలు, డిమాండ్ను అంచనా వేయడం వంటి వ్యాపార సంబంధ విషయాలను అధ్యయనం చేస్తుంది.
  6. పరిమిత సాధనాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి సహకరిస్తుంది.
  7. ఇది స్థూల అర్థశాస్త్రానికి ప్రాతిపదిక.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 6.
స్థూల అర్థశాస్త్రం భావనను, దాని ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రమని రెండు విధాలుగా రాగ్నార్ ఫ్రిష్ 1933 సం||లో విభజించారు. అప్పటి నుండి ఈ విభజన ప్రచారంలోకి వచ్చింది.

స్థూల అర్థశాస్త్రం వైయక్తిక యూనిట్లను కాకుండా మొత్తం లేదా సమిష్టి యూనిట్లను మొత్తంగా పరిశీలిస్తుంది. యూనిట్ల మొత్తాన్ని స్పష్టంగా, నిర్వచించి వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను పరిశీలించడం ఈ విశ్లేషణ ముఖ్యోద్దేశము.

గార్డెనర్ ఆక్లే ప్రకారం స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తం ఉత్పత్తి వనరుల నియామకం, జాతీయాదాయ పరిమాణం, సాధారణ ధరల స్థాయి మొదలైన వాటిని పరిశీలిస్తుంది. స్థూల అర్థశాస్త్రాన్ని “ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతము” అని కూడా అంటారు. స్థూల అర్థశాస్త్రాన్ని జె.ఎం. కీన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

స్థూల అర్థశాస్త్ర పరిధి :

TS Inter 1st Year Economics Study Material 1st Lesson అర్థశాస్త్ర పరిచయం 4

స్థూల అర్థశాస్త్రం – ప్రాధాన్యత :

  1. ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పరిశీలనకు తోడ్పడుతుంది. ఆర్థిక సమస్యలకు మూలకారణాలను కనుగొని, వాటి పరిష్కారానికి మార్గాలను సూచిస్తుంది.
  2. జాతీయోత్పత్తి స్థాయి, దాని కూర్పులను గురించి తెలుపుతుంది. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు మొదలైన వాటిని విశ్లేషిస్తుంది.
  3. ఆర్థికవ్యవస్థ వృద్ధి, స్థిరత్వాల చర్చలకు తోడ్పడుతుంది. వ్యాపార చక్రాల విశ్లేషణకు సహకరిస్తుంది.
  4. పేదరికం, నిరుద్యోగితలకు కారణాలను కనుగొని వాటి పరిష్కారానికి తోడ్పడే ఆర్థికాభివృద్ధి విధానాల రూపకల్పనలో సహాయపడుతుంది.
  5. ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.
  6. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణాలను స్పష్ట పరచటానికి సహాయపడుతుంది. అంతర్జాతీయ, జాతీయ సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది.
  7. ఆర్థిక విధానాల కల్పనకు, ఆచరణకు ఉపయోగపడుతుంది.

ప్రశ్న 7.
సూక్ష్మ – స్థూల అర్థశాస్త్రాలను విభేదించండి.
జవాబు.
ఆర్థిక సమస్యల విశ్లేషణకు ఆధునిక ఆర్థికవేత్తలు రెండు మార్గాలను అవలంబించారు. అవి :

  • 1) సూక్ష్మ అర్థశాస్త్రం
  • 2) స్థూల అర్థశాస్త్రం

రాగ్నార్ష్ మొదటిసారిగా 1933లో సూక్ష్మ, స్థూల అనే పదాలను అర్థశాస్త్రములో ప్రవేశపెట్టారు.

1. సూక్ష్మ అర్థశాస్త్రం :
సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది.

ఇవి జాతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న భాగాలు లేదా వైయుక్తిక యూనిట్లు మాత్రమే. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో, ఒక సంస్థ గరిష్ట లాభాలను ఏ విధంగా పొందుతుందో సూక్ష్మ అర్థశాస్త్రము మనకు తెలుపుతుంది.

వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రము పరిశీలిస్తుంది. అందువలననే దీనిని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తారు.
దీనిని క్రింది చార్టు ద్వారా వివరించవచ్చు.

TS Inter 1st Year Economics Study Material 1st Lesson అర్థశాస్త్ర పరిచయం 5

2. స్థూల అర్థశాస్త్రం :
స్థూల అర్థశాస్త్రం అనేది ‘Macros’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ‘Macros’ అంటే పెద్ద అని అర్థం. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. జాతీయాదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది.

J.M. కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆర్థికమాంద్యం కాలంలో ఆయన రాసిన పుస్తకం ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం ప్రచురణ తరువాత స్థూల ఆర్థిక సిద్ధాంతానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది.

స్థూల అర్థశాస్త్రాన్ని “ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం” అని కూడా అంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఆధాయం, ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకొని వివరిస్తుంది.

స్థూల అర్థశాస్త్ర పరిధి :

TS Inter 1st Year Economics Study Material 1st Lesson అర్థశాస్త్ర పరిచయం 6

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 8.
ఉచిత వస్తువుల, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు వ్రాయండి.
జవాబు.
వస్తువులు మానవుని కోరికలకు తీర్చగలిగే సాధనాలను లేదా సేవలను అర్థశాస్త్రంలో వస్తువులు అంటారు. స్పృశించదగిన మానవుని కోరికలను తీర్చగలిగే వాటిని వస్తువులు అంటారు. ఉదా ॥ నీరు, పుస్తకాలు, పెన్నులు, సెల్ఫోన్లు మొదలైన వస్తువులను రెండు రకాలుగా విభజించవచ్చు.

అవి : ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు.
ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు : మానవుని కోర్కెలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు. వస్తువులు ప్రాథమికంగా రెండు రకములు. అవి : 1) ఉచిత వస్తువులు
2) ఆర్థిక వస్తువులు

1. ఉచిత వస్తువులు :
డిమాండ్ కంటే సప్లై శాశ్వతంగా ఎక్కువగా ఉండి, ధరలేని వస్తువులను ఉచిత వస్తువులంటారు. ఇవి మానవ నిర్మితాలు కాదు, ప్రకృతి ప్రసాదించినవి. వీటికి ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది.
ఉదా : గాలి, నీరు.

2. ఆర్థిక వస్తువులు :
డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులు అంటారు. ఇవి మానవ నిర్మితాలు. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువలు ఉంటాయి.
ఉదా : ఆహారము, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. ఇవి ఉచితంగా అనుభవించడానికి వీలుండదు.

ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులు
1. ఇవి ప్రకృతి బహుకరించినవి. 1. ఇవి మానవుడిచే తయారుచేయబడినవి.
2. వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది. 2. డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది.
3. వీటికి ధర ఉండదు. 3. వీటికి ధర ఉంటుంది.
4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు. 4. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.
5. ఉపయోగిత విలువ ఉంటుంది. 5. ఉపయోగిత విలువ, వినిమయ విలువ రెండూ ఉంటాయి.
6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడవు. 6. ఇవి జాతీయాదాయంలో చేర్చబడతాయి.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 9.
ప్రయోజనం అంటే ఏమిటి ? అవి ఎన్ని రకాలు ?
జవాబు.
మానవుల కోరికలను సంతృప్తిపరచగలిగే వస్తుసేవల శక్తిని ప్రయోజనం అంటారు. అర్థశాస్త్రంలో ప్రయోజనం అనే భావనకు చాలా ప్రాధాన్యత ఉంది.

ప్రయోజనం – రకాలు :
1. రూప ప్రయోజనం :
ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవి మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దానిని రూప ప్రయోజనం అంటారు.

2. స్థల ప్రయోజనం :
స్థలాన్ని మార్చడం ద్వారా కొన్ని వస్తువులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మార్చడం వల్ల ఆ వస్తువుకు స్థల ప్రయోజనం చేకూరుతుంది. ఉదా : సముద్రతీరంలో ఇసుకకు ప్రయోజనం ఉండదు. దీనిని బయటకు తీసి మార్కెట్లకు రవాణా చేయడం వల్ల స్థల ప్రయోజనం చేకూరుతుంది.

3. కాల ప్రయోజనం :
కాలాన్ని బట్టి కూడా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఉదా : పంట చేతికి వచ్చిన కాలంలో ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులు వీటిని నిలువచేసి, కొంతకాలం తరువాత ఈ వస్తువులను మార్కెట్లలో అమ్ముతారు. ఈ విధంగా వస్తువులను నిలవ చేయడం ద్వారా వ్యాపారస్తులు పొందే అదనపు ప్రయోజనాన్నే కాల ప్రయోజనంగా చెప్పవచ్చు.

4. సేవల ప్రయోజనం :
సేవకు కూడా మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఉంటుంది.
ఉదా : టీచర్లు, లాయర్లు, డాక్టర్లు సేవలు మొదలైన సేవలు కూడా మానవులు కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలుగుతారు. అందువల్ల వీటిని సేవల ప్రయోజనాలుగా చెప్పవచ్చు.

ప్రశ్న10.
కోరికల లక్షణాలను విశ్లేషించండి.
జవాబు.
మానివుని కోరికలు ఆర్థిక కార్యకలాపాల పురోగతికి దోహదం చేస్తాయి. కోరికలు లేనిదే వినియోగం ఉండదు. ఉత్పత్తి ఉండదు. పంపిణీ ఉండదు, వినిమయం ఉండదు.

కోరికలు లక్షణాలు :
1. కోరికలు అనంతాలు :
మా గవుల కోరికలకు ఒక పరిమితి అంటూ ఉండదు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇవి వ్యక్తులను బట్టి, కాలాన్నిబట్టి, నివసించే ప్రదేశాన్నిబట్టి మారుతూ ఉంటాయి.

2. ఒక కోరికను పూర్తిగా తృప్తిపరచగలగటం :
మానవుడు తన కోరికలన్నింటిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యం కానప్పటికీ, ఒక కోరికను పూర్తిగా తృప్తి పరచటం సాధ్యమవుతుంది.
ఉదా : ఆకలిగా ఉన్న వ్యక్తి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆకలిని పూర్తిగా తీర్చుకోవచ్చు. అదే విధంగా ఒక కారును కొనుగోలు చేయడం ద్వారా, కారు కావాలనే కోరికను సంతృప్తిపరచవచ్చు.

3. కోరికలు పరస్పరం పోటీపడడం :
కోరికలు అపరిమితంగా ఉంటాయి. కాని వాటిని తీర్చుకొనే సాధనాలు మాత్రం పరిమితంగా ఉంటాయి. అందువల్ల కోరికలను సంతృప్తిపరచుకునే ప్రాధాన్యత క్రియవలె అది పరస్పరం పోటీపడతాయి.

4. కోరికలు పూరకాలు :
ఒక కోరికను సంతృప్తిపరచుకోవడానికి అనేక వస్తువులు అవసరమవుతాయి. ఉదా : ఏదైనా మనం రాయాలి అనుకున్నప్పుడు పెన్ను, కాగితం, ఇంకు ఉన్నప్పుడే ఆ కోరిక తీరుతుంది.

5. ప్రత్యామ్నాయాలైన కోరికలు :
ఒక కోరికను అనేక రకాలుగా తృప్తిపరచుకోవచ్చు.
ఉదా : ఆకలిగా ఉన్నప్పుడు భోజనం లేదా బ్రెడ్ లేదా పాలు, పండ్లు తీసుకోవడం ద్వారా ఆ కోరికను తృప్తిపరచుకోవచ్చు.

6. పునరావృత్తం :
అనేక కోరికలు, ఒక సమయంలో వాటిని తృప్తిపరచినప్పుడు మళ్ళీ, మళ్ళీ పుట్టుకొస్తాయి. సాధారణంగా ఇవి కనీస అవసరాలైన ఆహారం, నిద్ర మొదలైన కోరికల విషయంలో గమనించవచ్చు.

7. కోరికలు అలవాటుగా మారడం :
ఒక కోరికను క్రమం తప్పకుండా సంతృప్తిపరచినప్పుడు అది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటును మార్చుకోవడం తొందరగా సాధ్యం కాదు.

8. కోరికల ప్రాముఖ్యంలో తేడా :
అన్ని కోరికల తీవ్రత ఒకే విధంగా ఉండదు. కొన్ని కోరికలను వాటి ప్రాముఖ్యతను బట్టి వెంటనే తీర్చుకోవాలని ఉంటుంది. మరికొన్నింటిని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
“సంపద” నిర్వచనాన్ని నిర్వచించండి.
జవాబు.
ఏదో ఒక రూపంలో ఆదాయాన్ని ఆర్జించకలిగి, వ్యక్తుల లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వలను “సంపద” అంటారు. సంపద వివిధ రూపాలలో కలిగి వుంటుంది. వీటిలో ద్రవ్యం, షేర్లు, భూముల మొదలగునవి.

ప్రశ్న 2.
సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు.
సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోకి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం గురించి వివరిస్తుంది. కాబట్టి దీనిని ధరల సిద్ధాంతం అంటారు.

ప్రశ్న 3.
స్థూల అర్థశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు.
స్థూల అర్థశాస్త్రం అనేది మాక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలను అంటే మొత్తం ఉద్యోగిత, మొత్తం ఆదాయం మొదలగు వాటిని గూర్చి అధ్యయనం చేస్తుంది. అందుచే స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 4.
నిశ్చయాత్మక అర్థశాస్త్రం, నిర్ణయాత్మక అర్థశాస్త్రం.
జవాబు.
ఆచరణలో ఉన్న విషయాలను గురించి ఒక క్రమబద్ధమైన అధ్యయనం చేయడాన్ని నిశ్చయాత్మక అర్థశాస్త్రం అంటారు. సాంప్రదాయక ఆర్థిక వేత్తల అభిప్రాయంలో అర్థశాస్త్రం కేవలం ఒక నిశ్చయాత్మక అర్థశాస్త్రం, ఆర్థిక సూత్రాలు తప్పు అని గాని, ఒప్పు అని గాని, నిశ్చయాత్మక అర్థశాస్త్రం చెప్పదు. ఈ శాస్త్రం ప్రకారం ఆర్థికవేత్తలు ఏ విషయంలోను ఒక అంతిమ తీర్పును ఇవ్వరు.

ప్రశ్న 5.
నిర్ణయాత్మక ఆర్థిక వ్యవస్థ.
జవాబు.
ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులు ఎలా ఉండాలి. అనే విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసే శాస్త్రాన్ని నిర్ణయాత్మక అర్థశాస్త్రం అని అంటారు. ఈ శాస్త్రం వాస్తవికతకు, ఆదర్శనీయతకు మధ్య తేడాను తెలియచేస్తుంది. జర్మనీకి చెందిన చారిత్రక శాస్త్రవేత్తలు ఈ భావనకు ప్రాధాన్యతను ఇచ్చినారు.

ప్రశ్న 6.
ఉచిత వస్తువులు.
జవాబు.
ఉచిత వస్తువులు (Free Goods) : ప్రకృతిలో, ఎలాంటి ధర లేకుండా లభించే వాటిని ఉచిత వస్తువులు అంటారు. వీటి సప్లయ్ పరిమాణం డిమాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటికి ధర ఉండదు. ఉచిత వస్తువులకు కేవలం ఉపయోగితా విలువ ఉంటుంది కాని వినిమయ విలువ ఉండదు.
ఉదా : గాలి, నీరు, సూర్యరశ్మి ఈ రోజుల్లో ఉచిత వస్తువులు కొన్ని ఆర్థిక వస్తువులుగా మారిపోవడంవల్ల వాటికి ధర చెల్లించవలసి ఉంటుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 7.
ఆర్థిక వస్తువులు.
జవాబు.
ఆర్థిక వస్తువులు (Economic Goods) :
మార్కెట్లో ధర కలిగి భౌతికమైన, సహజ సిద్ధమైన లేదా మానవ నిర్మితమైన వస్తువును లేదా సేవను ఆర్థిక వస్తువులు అంటారు. వీటి డిమాండ్ కంటే సప్లయ్ ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. ఆర్థిక వస్తువులకు ఉపయోగితా విలువతోపాటు వినిమయ విలువ కూడా ఉంటుంది.

ఉదా : పెన్నులు, పుస్తకాలు, కంప్యూటర్లు మొదలైనవి. ఆర్థిక వస్తువులకు మూడు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. అవి : ప్రయోజనం, కొరత, బదిలీ, ఆర్థిక వస్తువులను మరొక విధంగా కూడా వర్గీకరించవచ్చు. అవి : వినియోగ వస్తువులు, ఉత్పాదక | వస్తువులు, మాధ్యమిక వస్తువులు.

ప్రశ్న 8.
వినియోగ వస్తువులను వివరించండి.
జవాబు.
అంతిమ వినియోగం కోసం కుటుంబాలు కొనే ఆర్థిక వస్తువులను వినియోగ వస్తువులు అంటారు. అంటే ‘మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలిగేవి.
ఉదా : పండ్లు, పాలు, పెన్నులు, వస్త్రాలు మొదలైనవి. వినియోగ వస్తువులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  • నశ్వర వస్తువులు
  • అనశ్వర వస్తువులు / మన్నికగల వస్తువులు.

ప్రశ్న 9.
మూలధన వస్తువులను వివరించండి.
జవాబు.
ఇతర వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే వాటిని పెట్టుబడి వస్తువులు అంటారు. ఇవి మానవుని కోరికలను పరోక్షంగా తీరుస్తాయి.
ఉదా : యంత్రాలు, భవనాలు మొదలైనవి.

ఒకే వస్తువు ఉపయోగాన్ని బట్టి దానిని వినియోగ వస్తువు అని లేదా పెట్టుబడి వస్తువు అని వర్గీకరించవచ్చు.
ఉదా : వరి ధాన్యాన్ని ఆహారంగా ఉపయోగిస్తే అది వినియోగ వస్తువు అవుతుంది. దీనిని విత్తనంగా వ్యవసాయంలో వాడితే అది పెట్టుబడి వస్తువు అవుతుంది.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 10.
‘సంపద’ భావన అంటే ఏమిటి ?
జవాబు.
ఒక రూపంలో ఆదాయాన్ని ఆర్జించగలిగి, వ్యక్తుల లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిల్వలను సంపద అంటారు. సంపదను వివిధ రూపాలలో కలిగి ఉండవచ్చు. వీటిలో ద్రవ్యం, షేర్లు, భూములు మొదలైనవి. సంపద లక్షణాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ప్రయోజనం
  2. కొరత
  3. వినిమయ విలువ
  4. బదిలీ సౌలభ్యం.

భౌతిక రూపంలో ఉన్న సంపద స్పృశించదగింది. వజ్రాలు, ఫ్యాక్టరీలు, ఇండ్లు మొదలైనవి భౌతిక ఆస్తులు. మానవ వనరు అనేది స్పృశించలేని సంపద సంపదను వ్యక్తిగత సంపద, సామాజిక సంపద, సహజ సంపద, అంతర్జాతీయ సంపద అని వర్గీకరించవచ్చు.

ప్రశ్న 11.
‘ఆదాయ భావన’ అంటే ఏమిటి ?
జవాబు.
ఆదాయం సంపద నుంచి వచ్చే ప్రవాహం. సంపద ఒక నిల్వ. ప్రతి ఆర్థిక వ్యవస్థలో కుటుంబాల నుంచి ఆదాయం సంస్థలకు, సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుంది. ఆ విధంగా కారకం మార్కెట్, వస్తువు మార్కెట్ సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయి. చక్రీయ ఆదాయ ప్రవాహ ప్రక్రియల ఆధారంగా ఆదాయం కుటుంబాల నుంచి సంస్థలకు, సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుందని అర్థమవుతుంది.

ప్రశ్న 12.
ఉపయోగితా విలువ.
జవాబు.
ఉపయోగితా విలువ (Value in Use): మానవుని కోరికలను తీర్చగలిగే శక్తిని ఉపయోగితా విలువ అంటారు. ఉచిత వస్తువులకు ఉపయోగితా విలువ ఉంటుంది. కానీ వినిమయ విలువ ఉండదు.
ఉదా : నీటికి ఉపయోగితా మూల్యం ఉంటుంది. కాని వినిమయ విలువ లేదు.

TS Board Inter First Year Economics Study Material Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

ప్రశ్న 13.
వినిమయ విలువ.
వినిమయ విలువ (Value in Exchange) : ఒక వస్తువు వేరొక వస్తువును ఎంత పరిమాణంలో పొందగలుగుతుందో తెలియజేస్తుంది. అన్ని ఆర్థిక వస్తువులకు వినిమయ విలువ ఉంటుంది.
ఉదా : పెన్నుతో ఒక పుస్తకాన్ని మార్పిడి చేయవచ్చు.

ప్రశ్న 14.
ధర అంటే ఏమిటి ?
జవాబు.
రూపంలో వ్యక్తపరచబడిన విలువను ధర అంటారు. ఒక వస్తువు ఏ రేటులో మార్పిడి చేయబడుతుందో యజేస్తుంది. ఉదా : ఒక పెన్ను పది రూపాలయకు మార్పిడి చేయబడితే పెన్ను ధర పది రూపాయలు అవుతుంది.

Leave a Comment