Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 6th Lesson కంపెనీ స్థాపన Textbook Questions and Answers.
TS Inter 1st Year Commerce Study Material 6th Lesson కంపెనీ స్థాపన
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కంపెనీ వ్యాపార ప్రారంభ దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ స్థాపనలో నాలుగు దశలుంటాయి. అవి.
- వ్యవస్థాపన
- నమోదు లేదా రిజిస్ట్రేషన్
- మూలధన – సమీకరణ
- వ్యాపార ప్రారంభము.
1) వ్యవస్థాపన: కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాలను కనుగొని లాభార్జన కోసము ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్ధవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనలో నాలుగు గశలుంటాయి.
- వ్యాపార అవకాశాలను కనుగొనుట
- సమగ్రమైన పరిశోధన,
- వనరుల సమీకరణ,
- ఆర్థిక ప్రతిపాదన.
2) కంపెనీ నమోదు లేదా రిజిస్ట్రేషన్: ఏ కంపెనీ అయినా చట్టబద్ధ.. బాగా గుర్తింపు పొందవలెనంటే నమోదు అవసరము. నమోదు కొరకు కొన్ని ముఖ్యమైన పత్రాలను రిజిస్ట్రారు వద్ద దాఖలుచేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీ నమోదుకొరకు దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలు.
- పేరు అనుమతి కోసము దరఖాస్తు
- సంస్థాపనా పత్రము
- నియమావళి
- క్రింది అదనపు పత్రాలను కూడా రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయాలి.
i) మొదటి డైరెక్టర్ల సమ్మతి పత్రము
ii) పవర్ ఆఫ్ అటార్నీ
iii) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయం తెలిపే నోటీసు
iv) డైరెక్టర్లు, మేనేజరు, సెక్రటరీ వివరాలు - శాసనాత్మక ప్రకటన
- నమోదు రుసుం చెల్లింపు
- నమోదు పత్రము
పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందిన మీదట కంపెనీ నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. నమోదు పత్రము పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారమును ప్రారంభించవచ్చును. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపారమును ప్రారంభించుటకు వ్యాపార ప్రారంభ ధ్రువ పత్రాన్ని పొందవలెను.
3) మూలధన సేకరణ: కంపెనీ వాటాలను జారీచేసి మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైన వాటికి అవసరమయ్యే మొత్తాన్ని కనీసపు చందా అంటారు. కంపెనీ పరిచయ పత్రములో పేర్కొన్న కనీసపు చందా మొత్తాన్ని సేకరించకుండా వ్యాపారమును ప్రారంభించలేదు. కంపెనీ జారీ చేసిన మూలధనములో మొత్తాన్ని, 90% పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించకపోతే సెబీ సూచనల మేరకు 10 రోజులలోపు దరఖాస్తు దారులకు తిరిగి చెల్లించవలెను.
4) వ్యాపార ప్రారంభము: పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందుటకు ఈ క్రింది పత్రాలను రిజిస్ట్రారుకు సమర్పించాలి.
- పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రము.
- డైరెక్టర్ల అర్హత వాటాలు తీసుకొని చెల్లించినట్లు ధృవీకరణ పత్రము.
- కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరణ పత్రము.
- వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలు పాటించినట్లుగా కంపెనీ డైరెక్టరు లేదా సెక్రటరీ ప్రకటన.
పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తి చెందినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రము పొందడముతో కంపెనీ స్థాపన పూర్తి అవుతుంది.
ప్రశ్న 2.
కంపెనీ నమోదులోని దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ ఒక కల్పిత వ్యక్తి నమో కంపెనీగాని, పబ్లిక్ కంపెనీగా చేసి, రిజిస్ట్రేషన్ చేయవలెను. ద్వారా దీనికి అస్తిత్వము వస్తుంది. నమోదు అనేది చట్టపరమైన చర్య. ప్రైవేటు కంపెనీ రిజిస్ట్రారు కార్యాలయములో అవసరమైన ముఖ్యమైన పత్రాలు దాఖలు కంపెనీ నమోదు విధానము: కంపెనీ నమోదు కోసము దిగువ ముఖ్య పత్రాలను తయారు చేసి జతపరచాలి.
1) పేరు అనుమతి కోసం దరఖాస్తు: కంపెనీ నమోదుకోసం మొదట పేరు అనుమతి కోరుతూ ఆ రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేయాలి. పేర్ల చట్టం 1950 పరిధిలోపు ఏ పేరైనా కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ రిజిస్ట్రారు దరఖాస్తు అందిన 14 రోజులలోపు అనుమతిని ఇస్తారు. ఆ తేదీనుంచి 3 నెలల లోపు ఆ పేరును రిజిస్ట్రేషన్ చేయాలి.
2) సంస్థాపనా పత్రము: ఈ పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, బయటవారితో ఉన్న సంబంధాలను నిర్వచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పత్రము దీనిని జాగ్రత్తగా తయారు చేసి తగిన స్టాంపులు అతికించాలి. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు కొత్త చట్ట సవరణ ప్రకారం ఒకరు ఈ పత్రముపై సంతకాలు చేయాలి.
3) కంపెనీ నియమావళి: ఈ పత్రము కంపెనీ అంతర్గత పరిపాలనకు సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు దీని మీద సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీ నియమావళిని తప్పని సరిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పబ్లిక్ కంపెనీ నియమావళిని తయారుచేయకపోతే కంపెనీ చట్టంలోని షెడ్యూల్ -1, టేబుల్ A ని అనుసరించవచ్చును.
4) అదనపు పత్రాలు: కంపెనీ నమోదుకు మరికొన్ని అదనపు పత్రాలు తయారు చేసి రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
అవి:
ఎ) డైరెక్టర్ల సమ్మతి పత్రము: డైరెక్టర్లుగా వ్యవహరించడానికి వారి సమ్మతిని తెలియజేస్తూ ఫారం నెం.29 పత్రాన్ని రిజిస్ట్రారుకు దాఖలు చేయవలెను.
బి) పవర్ ఆఫ్ అటార్నీ: కంపెనీ నమోదుకు కావలసిన లాంఛనాలు పూర్తి చేసినట్లు ధృవీకరించడానికి, అవసరమయితే తగిన మార్పులు చేయడానికి ఒక న్యాయవాదిని వ్యవస్థాపకులు నియమించాలి. అతనిని అటార్నీ అంటారు. అతని నియామకపు పత్రాన్ని కూడా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
సి) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము: కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము ఎక్కడ ఏర్పాటు చేయవలెనో ముందు నిర్ణయము అయితే, నమోదైన 30 రోజులలోపు రిజిష్టర్డ్ కార్యాలయ వివరాలను రిజిస్ట్రారుకు తెలియజేయాలి.
డి) డైరెక్టర్ల వివరాలు: కంపెనీ డైరెక్టర్లు, మేనేజరు లేదా సెక్రటరీ మొదలైన వారి వివరాలను ఫారంలో పొందుపరిచి నమోదుకు 30 రోజులలోపు రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
5) శాసనాత్మక ప్రకటన: కంపెనీల చట్టం ప్రకారము నమోదుకు సంబంధించి అన్ని లాంఛనాలు సక్రమముగా నిర్వర్తించినట్లు కంపెనీ న్యాయవాది గాని, ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా సెక్రటరీగాని చట్టపూర్వకమైన ప్రకటన
చేయించాలి.
6) నమోదు రుసుం చెల్లింపు: కంపెనీ నమోదుకు చట్టప్రకారము నిర్దేశించిన రుసుము చెల్లించి రశీదును పొందాలి.
7) నమోదు పత్రం: పైన తెలిపిన పత్రాలన్నింటిని రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందితే నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రాన్ని పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కాని పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రము పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు.
ప్రశ్న 3.
వ్యవస్థాపన అంటే ఏమిటి ? వ్యవస్థాపనని నిర్వచించి దానిలోని దశలను వివరించండి.
జవాబు.
కంపెనీ తనంతట తాను ఉద్భవించదు. ఇది మానవ కృషి ఫలితముగా ఏర్పడుతుంది. ఎవరో ఒకరు పూనుకొని నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును సమీకరించాలి. కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని అంతటిని వ్యవస్థాపన అంటారు. అంటే వ్యాపార ఉద్దేశాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుక్కొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలు సమీకరించి సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనను గెస్టిన్ బర్గ్ ఇట్లా నిర్వచించినాడు. “వ్యాపార అవకాశాలు కనుక్కోవడం, ఆ తరువాత లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్ధ్యమును వ్యాపార సంస్థలో వెచ్చించడము”. కంపెనీ వ్యవస్థాపన వ్యయ ప్రయాసలతో కూడినది. వ్యవస్థాపనలోని దశలు:
1) వ్యాపార భావావతరణ: వ్యాపార విజయము సరైన వ్యాపార ఎన్నికపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపార అవకాశాలు తటస్థించినపుడు ఆ అవకాశాలను ఎంతవరకు అమలుపరచవచ్చును ? లాభదాయకమా ? కాదా? అనే అంశములు నిశితముగా పరిశీలించి, ఆచరణ యోగ్యము, లాభదాయకమని భావిస్తే వ్యాపార సంస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాడు. నిర్ణయించిన వ్యాపారంలో ఉండే సమస్యలు, లాభాలను సాంకేతిక నిపుణుల సహాయంతో విశ్లేషించి, లాభసాటి వ్యాపారాన్ని ఎంపిక చేసుకోవాలి. ‘
2) సమగ్ర పరిశోధన: ప్రారంభించవలసిన వ్యాపారాన్ని గురించి సమగ్రమైన పరిశోధన జరపాలి. పెట్టుబడిదారులు మనస్తత్వము, మార్కెట్ పరిస్థితులు, కంపెనీకి అవసరమయ్యే ఆర్థిక వనరులు, శ్రామికులు, ముడిపదార్థాలు, యంత్రాల లభ్యత వస్తువుకు ఉండే డిమాండ్ మొదలైన అంశాలను గురించి సమగ్ర పరిశోధన చేయాలి.
3) వనరుల సమీకరణ: వ్యవస్థాపకుడు తాను ఎంపిక చేసిన వ్యాపారము లాభసాటిగా, ఆమోద యోగ్యముగా ఉందని నిర్థారణ చేసుకున్న తరువాత వ్యాపార సంస్థకు అవసరమయ్యే ముడిపదార్థాలు, ఆస్తులు, యంత్రాలు, నిర్వాహకుల, సాంకేతిక నిపుణుల సేవలు మొదలైనవి సమకూరే లాగా ఒప్పందాలు చేసుకుంటాడు.-
4) ఆర్థిక ప్రతిపాదన: వ్యవస్థాపకుడు కంపెనీకి ఉండవలసిన మూలధన స్వరూపాన్ని నిర్ణయిస్తాడు.
ఏ రకమైన వాటాలు, డిబెంచర్లు జారీ చేయాలి ? ఎంత మొత్తము జారీచేయాలో నిర్ణయిస్తాడు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించవలసిన దీర్ఘకాలిక ఋణాలను కూడా నిర్ధారణ చేస్తాడు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యవస్థాపకుడి విధులు ఏమిటి ?
జవాబు.
వ్యవస్థాపకుని విధులు:
- వ్యవస్థాపకుడు వ్యాపార అవకాశాలను శోధిస్తాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యాపారము ప్రారంభించవలెననే విషయములపై పరిశోధనలను జరిపి ఒక నిర్ణయానికి వస్తాడు.
- వ్యాపార ఉద్దేశ్యము ఏర్పడగానే ఆ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టడానికి సవిస్తరమైన శోధనలు చేస్తాడు. ఉత్పత్తి వస్తువుల డిమాండు, ముడిపదార్థాల లభ్యత, రవాణా సౌకర్యాలు, అవసరమైన మూలధనము, లాభాలు మొదలైన అంశాల గురించి పరిశీలన చేసి, ఇవి అనుకూలముగా ఉంటే స్థాపనకు ముందంజ వేస్తాడు.
- ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలి. భవన నిర్మాణాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు సేకరించాలి. నిర్వహణా సామర్థ్యాన్ని సమీకరించుకోవాలి.
- వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి, అవసరమైన వ్యక్తులను (డైరెక్టర్లు, మేనేజర్లు) నియమిస్తాడు.
- కంపెనీ బ్యాంకర్లను, ఆడిటర్లను, సొలిసిటర్లను ఎన్నుకోవాలి.
- కంపెనీ నమోదుకు కావలసిన ముఖ్య పత్రాలను తయారు చేయాలి.
- కంపెనీకి కావలసిన ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలి.
- కంపెనీని నిర్వహించడానికి కావలసిన మూలధనాన్ని సేకరించాలి.
- పరిచయ పత్రాన్ని జారీచేసి, వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందవలెను.
ప్రశ్న 2.
వ్యవస్థాపకుల రకాలను తెలపండి.
జవాబు.
వ్యవస్థాపకుల రకాలు:
1. వృత్తిరీత్యా వ్యవస్థాపకులు: ఈ రకమైన వ్యవస్థాపకులు కంపెనీ స్థాపనకు ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వ్యవస్థాపన తమ పూర్తికాల వృత్తిగా నిర్వహిస్తారు.
2. యాదృచ్ఛిక వ్యవస్థాపకులు: కంపెనీ వ్యవస్థాపనలో ప్రత్యేక నైపుణ్యత లేకపోయినా, తమ సొంత సంస్థను ఏర్పాటు చేసుకోగల వ్యవస్థాపకులను యాదృచ్ఛిక వ్యవస్థాపకులు అంటారు.
3. ఆర్థిక వ్యవస్థాపకులు: సెక్యూరిటీల మార్కెట్లో అనుకూల పరిస్థితుల ఆధారంగా సంస్థలను స్థాపించే వ్యవస్థాపకు లను ఆర్థిక వ్యవస్థాపకులు అంటారు.
4. సాంకేతిక వ్యవస్థాపకులు: ఈ తరహా వ్యవస్థాపకులు తమకున్న ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ ద్వారా కొత్త కంపెనీలను స్థాపిస్తారు.
5. సంస్థాగత వ్యవస్థాపకులు: కంపెనీ స్థాపనకు కావలసిన సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక సహాయాలను అందించడానికి ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసే వారిని సంస్థాగత వ్యవస్థాపకులు అంటారు.
6. ఔత్సాహిక వ్యవస్థాపకులు: ఈ వ్యవస్థాపకులు కంపెనీ స్థాపన మరియు వ్యవస్థాపన కార్యకలాపాలను పూర్తి చేసి, ఆ తర్వాత కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతారు. వీరు వ్యాపార భావావతరణ నుండి వ్యాపార కార్యకలాపాల ప్రారంభం వరకు అన్ని రకాల వ్యవహారాలను చూసుకుంటారు. కాబట్టి వీరిని ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యవస్థాపన అంటే ఏమిటి ?
జవాబు.
- కంపెనీ స్థాపనలో వ్యవస్థాపన మొదటి దశ. వ్యవస్థాపన దశలో వ్యాపార అవకాశాలను గుర్తించడం, వాటి స్వరూప స్వభావాలను విశ్లేషణ చేయడం జరుగుతుంది. వ్యవస్థాపనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, వ్యాపార భావనకు రూపకల్పన చేస్తారు.
- వ్యవస్థాపన అంటే ఆవిష్కరించిన ఆలోచనను అమలుచేయడం లేదా సాధన చేయడం.
- “ఒక వ్యాపారసంస్థ విత్తం గురించి ఆలోచించి, వ్యవస్థీకరించి కంపెనీగా నిలబెట్టడమే వ్యవస్థాపన” అని హేనీ నిర్వచించారు.
ప్రశ్న 2.
వ్యవస్థాపకుడు ఎవరు ?
జవాబు.
- వ్యవస్థాపకుడు అనే వ్యక్తి కంపెనీ స్థాపనకు అవసరమైన ప్రాథమిక చర్యలను పూర్తి చేస్తాడు. కంపెనీ కార్యకలాపాలను మొట్టమొదటిగా నియంత్రించే వ్యక్తి వ్యవస్థాపకుడు.
- కంపెనీ స్థాపనకు పూనుకునే వ్యక్తిని వ్యవస్థాపకుడు అంటారు. వ్యవస్థాపకుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం “లేదా ఒక సంస్థ కావచ్చు.
- వ్యవస్థాపకుడు, ఒక సంస్థ స్థాపనకు కావలసిన డబ్బు, ముడిపదార్థాలు, శ్రామికులు, యంత్రాలను సమీకరించి దాని నిర్మాణానికి మార్గదర్శకుడవుతాడు.
ప్రశ్న 3.
వృత్తిరీత్యా వ్యవస్థాపకుడు అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీ వ్యవస్థాపనలో నైపుణ్యత కలిగిన వ్యవస్థాపకులను వృత్తిరీత్యా వ్యవస్థాపకులు అని అంటారు. కంపెనీల వ్యవస్థాపనయే వీరి వృత్తి.
ప్రశ్న 4.
ఔత్సాహిక వ్యవస్థాపకుడు అంటే ఏమిటి ?
జవాబు.
- ఈ వ్యవస్థాపకులు కంపెనీ స్థాపన మరియు వ్యవస్థాపన కార్యకలాపాలను పూర్తి చేసి, ఆ తర్వాత కాలంలో కంపెనీ నిర్వహణ బాధ్యతలను కూడా చేపడతారు.
- వీరు వ్యాపార భావావతరణ నుండి వ్యాపార కార్యకలాపాల ప్రారంభం వరకు అన్ని రకాల వ్యవహారాలను చూసుకుంటారు. కాబట్టి వీరిని ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు.
ప్రశ్న 5.
మూలధన సమీకరణ అంటే ఏమిటి ?
జవాబు.
1. పబ్లిక్ కంపెనీ పరిచయ పత్రంలో పేర్కొన్న కనీసపు చందాను సేకరించకుండా వ్యాపారాన్ని ప్రారంభించలేదు. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైనవాటికి అవసరమయ్యే కనీస మొత్తాన్ని “కనీసపు చందా” అంటారు.
2. పరిచయ పత్రంలో సూచించిన విధంగా ఒక పబ్లిక్ కంపెనీ కనీసపు చందా తప్పకుండా సేకరించాలి. కంపెనీ జారీ చేసిన మూలధనంలో 90% మొత్తాన్ని 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించని పక్షంలో దరఖాస్తు దారులకు వారి సొమ్మును, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) సూచనల మేరకు 10 రోజుల
లోపల తిరిగి చెల్లించాలి.