Telangana TSBIE TS Inter 1st Year Commerce Study Material 5th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ Textbook Questions and Answers.
TS Inter 1st Year Commerce Study Material 5th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ నిర్వచించండి. జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాలను వివరించండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీ – అర్థం: కంపెనీ లేదా జాయింట్ స్టాక్ కంపెనీ అంటే భారీతరహా వాణిజ్య లేదా వ్యాపార కార్యకలాపాలను చేపట్టి, నిర్దిష్ట ధ్యేయాలను సాధించడానికి, కొంతమంది వ్యక్తులచే స్వచ్ఛందంగా ఏర్పడిన సంస్థ. ఇది న్యాయశాస్త్రం ద్వారా సృష్టించబడి, న్యాయస్థానం ద్వారానే రద్దు చేయబడుతుంది. కంపెనీకి ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల కంపెనీ వేరు కంపెనీలోని సభ్యులు వేరు సభ్యుల జీవితాలతో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు, ఈ సభ్యులు సమిష్టి ప్రయోజనం కోసం తమవంతు ధనాన్ని మూలధనంగా సమకూర్చుతారు. ఈ మూలధనం చిన్న చిన్న భాగాలుగా (యూనిట్లు) విభజింపబడి ఉంటుంది. ఈ చిన్న చిన్న భాగాలను లేదా యూనిట్లను ‘వాటాలు’ అంటారు. కంపెనీ సభ్యులు ఈ వాటాలను కొనడం ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల వీరిని ‘వాటాదారులు’ అంటారు. కంపెనీ మూలధనాన్ని ‘వాటా మూలధనం’ అంటారు.,
నిర్వచనాలు:
1) ఎల్. హెచ్. హేని ప్రకారం
“బదిలీ చేయుచున్న వారితో ప్రారంభించబడిన మూలధనం కలిగి, లాభార్జన ధ్యేయంగా ఏర్పడ్డ వ్యక్తుల స్వచ్ఛంద సంస్థయే కంపెనీ. ఇందులో సభ్యులైన వారు దానికి యజమానులు అవుతారు”.
2) లార్డ్ జస్టిస్ లిండ్ ప్రకారం – “సమిష్టి ప్రయోజనం కోసం ధనాన్ని లేదా ధనంతో సమానమైన దానిని సమకూర్చే అనేకమంది వ్యక్తుల కలయిక కంపెనీ”.
3) కంపెనీల చట్టం, 2013 ప్రకారం – “ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం క్రింద నమోదు చేయబడిన దానిని కంపెనీ అని అంటారు”.
జాయింట్ స్టాక్ కంపెనీ – లక్షణాలు:
కంపెనీ యొక్క విలక్షణమైన లక్షణాలను క్రింది విధంగా గుర్తించవచ్చు.
1) చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తి: కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన కృత్రిమ వ్యక్తి. న్యాయశాస్త్రమే ప్రాణంగా మనుగడను కొనసాగిస్తుంది. ఇది ఒక అదృశ్యమైన, కంటికి కనిపించని శరీరం, ఆత్మ లేని వ్యక్తి.
2) ప్రత్యేక న్యాయసత్వం: కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తి. కంపెనీ నమోదు చేయగానే దానికి ప్రత్యేక మైన వ్యక్తిత్వం లభిస్తుంది. అంటే కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. కంపెనీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకొనవచ్చు. సాధారణ వ్యక్తులలాగా ఆస్తులను కొనడం, అమ్మడం చేయవచ్చు. ఉద్యోగస్తులను -నియంత్రించవచ్చు. స్వతంత్రంగా న్యాయసమ్మతమైన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.
3) స్థాపన: జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపనకు ముందు పలు ముఖ్యమైన పత్రాలను తయారు చేయడంతో పాటు అనేక చట్టపరమైన నిబంధనలను, షరతులను పూర్తి చేయవలసి ఉంటుంది. భారత కంపెనీల చట్టం, 2013 కింద తప్పనిసరిగా నమోదు చేయించినప్పుడు మాత్రమే కంపెనీ మనుగడలోకి వస్తుంది.
4) అధికార ముద్ర: కంపెనీకి భౌతికమైన ఆకారం లేదు. అందువల్ల సహజమైన వ్యక్తిలాగా డైరెక్టర్ల బోర్డు ద్వారా వ్యవహరిస్తుంది. కంపెనీ ఒప్పందాలను కుదుర్చుకొన్నప్పుడు లావాదేవీలు జరిగినప్పుడు సంతకాలు చేయడానికి బదులు, తన అధికారముద్రను ఉపయోగిస్తుంది. ఈ అధికార ముద్ర కంపెనీ సంతకంలాగా చలామణి అవుతుంది.. కంపెనీ సంతకానికి బదులు కంపెనీ అధికారముద్రను ముద్రించి, ఇద్దరు డైరెక్టర్లు సాక్షి సంతకాలు చేసినప్పుడు మాత్రమే ఆ పత్రాలలో ఉన్న విషయాల వల్ల కంపెనీకి బాధ్యత ఏర్పడుతుంది. ఈ అధికార ముద్రను తగు జాగ్రత్త మధ్య కంపెనీ కార్యదర్శి వద్ద భద్రపరచవలసి ఉంటుంది.
5) పారంపర్యాధికారం: కంపెనీ వ్యాపార సంస్థకు శాశ్వతమైన మనుగడ ఉంది. అందువల్ల కంపెనీ చిరకాలం
కొనసాగుతుంది. కంపెనీ సభ్యులలో ఎవరైనా మరణించినా, వారి వాటాలను అమ్మివేసినా, ఎవరికైనా మతి భ్రమించినా, ఎవరైనా దివాలా తీసినా, కంపెనీ మాత్రం నిరాటంకంగా కొనసాగే అధికారాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడినందువల్ల దానిని మూసివేయడం చట్టం ద్వారానే సాధ్యమవుతుంది.
6) సభ్యుల రుణబాధ్యత పరిమితం: కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. అందువల్ల కంపెనీ తాను చేసిన అప్పులకు తానే బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంగా వాటాదారుల రుణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువలకు పరిమితమై ఉంటుంది. ఉదాహరణకు శ్రీను అనే వాటాదారుడు 10లు విలువలు కలిగిన వాటాను కొని వాటాకు ఔ 8లు చెల్లిస్తే అతని రుణబాధ్యత వాటాకు 2లకు పరిమితమై ఉంటుంది. దీనికి మించి అతడు కంపెనీకి సంబంధించిన ఎలాంటి రుణాల లేదా నష్టాల చెల్లింపుకు బాధ్యతను కలిగి ఉండదు.
7) వాటాల బదిలీ: పబ్లిక్ కంపెనీలో వాటాదారులు తమ వాటాలను యధేచ్చగా ఇతరులకు తమకు ఇష్టం వచ్చినప్పుడు బదిలీ చేసుకొనవచ్చు. ఈ మేరకు ఇతర వాటాదారుల అంగీకారం అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీల విషయంలో వాటాల బదిలీకి సంబంధించి కొన్ని నిబంధనలను విధించడమైంది.
8) సభ్యత్వం: జాయింట్ స్టాక్ కంపెనీ వ్యవస్థలో ప్రధానంగా ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలుగా పేర్కొనవచ్చు. ప్రైవేట్ కంపెనీల విషయంలో కనిష్ఠ సభ్యుల సంఖ్య 2, గరిష్ఠ సభ్యుల సంఖ్య 50 గాను పబ్లిక్ కంపెనీల విషయంలో కనిష్ఠ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సభ్యుల సంఖ్య అపరిమితంగాను ఉంటుంది.
9) ప్రజాస్వామ్య నిర్వహణ: వివిధ వర్గాలకు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఒక కంపెనీకి మూలధనాన్ని సమకూర్చుతారు. అందువల్ల వీరందరూ కంపెనీ రోజు వారి నిర్వహణలో పాల్గొనలేరు. అందువల్ల కంపెనీ పరిపాలన, నిర్వహణను చూడడానికి వాటాదారులు, డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉంది.
10) మహిళ డైరెక్టర్: కంపెనీ చట్టం, 2013 ప్రకారం కొన్ని నిర్దిష్ట పబ్లిక్ కంపెనీలలో కనీసం ఒక మహిళ డైరెక్టర్గా వ్యవహరించాలి.
ప్రశ్న 2.
కంపెనీల వర్గీకరణను వివరించండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీలు వివిధ అంశాల ప్రాతిపదికపై వర్గీకరించడమైంది.
1. వ్యవస్థాపన ఆధారంగా (నమోదు ఆధారంగా):
ఎ) చార్టెర్డ్ కంపెనీలు: రాజు ఆజ్ఞతో గాని లేదా రాజశాసనం ద్వారా గాని కంపెనీల ఆవిర్భావం జరిగినప్పుడు వాటిని చార్టెర్డ్ కంపెనీలు అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీలు ఉనికిలో లేవు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (1894), ఈస్ట్ ఇండియా కంపెనీ (1600) మొదలైనవి.
బి) శాసనాత్మక కంపెనీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రత్యేక చట్టం ద్వారా నమోదు చేయబడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలని అంటారు. సాధారణంగా శాసనాత్మక కంపెనీలు ప్రజా శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేయబడతాయి. ఉదాహరణకు రైల్వే, కరెంటు ఉత్పత్తి, నీటి పనులు, భారత రిజర్వు బ్యాంకు మొదలగునవి.
సి) రిజిస్టర్డ్ కంపెనీలు: కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని అంటారు. కంపెనీల చట్టానికి లోబడి నమోదు పత్రం రిజిస్ట్రార్ వద్ద నుండి పొందిన తర్వాత కంపెనీ అస్తిత్వంలోకి వస్తుంది.
2. ప్రజాశక్తి ఆధారంగా:
ఎ) ప్రైవేట్ కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన ప్రైవేట్ కంపెనీ, కంపెనీల నియమావళి ప్రకారం వాటాల బదిలీ మరియు ప్రజల నుండి చందా పొందడానికి నిషేధించబడ్డాయి”.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను క్రింది విధంగా గమనించవచ్చు:
- కనీసపు చెల్లించిన మూలధనం 1,00,000 రూపాయలు.
- కనీస సభ్యుల సంఖ్య 2.
- గరిష్ట సభ్యుల సంఖ్య 50.
- ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు.
- వాటాలను బదిలీ చేయరాదు.
పైన పేర్కొన్న నిబంధనలన్నింటిని ప్రైవేట్ కంపెనీలు తప్పక పాటించవలసి ఉంటుంది. అంతేకాక కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక పేర్కొనవలసి ఉంటుంది.
కంపెనీల చట్టం, 2013 ప్రకారం ప్రయివేట్ కంపెనీలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు.
i) చిన్న కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్-2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.
- కంపెనీ వాటా మూలధనం కౌ 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
- కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.
ii) ఏక వ్యక్తి కంపెనీ: కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు. నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.
బి) పబ్లిక్ కంపెనీ: భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.
- కనీసపు చెల్లించిన మూలధనం 35,00,000.
- కనీస సభ్యుల సంఖ్య 7.
- గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.
ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.
3) యాజమాన్యం ఆధారంగా:
ఎ) ప్రభుత్వ కంపెనీలు: కంపెనీ యొక్క మొత్తం చెల్లించిన వాటా మూలధనంలో 51% వాటాలను కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు కాని, లేక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సమకూర్చినట్లయితే అట్టి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ఉదాహరణకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
బి) ప్రభుత్వేతర కంపెనీలు ప్రభుత్వ కంపెనీల లక్షణాలను కల్గిలేని కంపెనీలన్నీ ప్రభుత్వేతర కంపెనీలుగా గుర్తింపబడతాయి.
4) రుణబాధ్యత ఆధారంగా:
ఎ) వాటా పరిమిత కంపెనీలు: ఏ కంపెనీలో అయితే వాటాదారుల రుణబాధ్యత, వారు తీసుకున్న వాటాల ముఖ విలువలకు పరిమితమై ఉంటుందో ఆ కంపెనీని వాటా పరిమిత కంపెనీ అంటారు.
బి) పూచీ పరిమిత కంపెనీలు: కంపెనీ పరిసమాప్త సమయంలో సభ్యులు సంస్థాపన పత్రంలో సూచించిన విధంగా తమ రుణబాధ్యతను కొంత మొత్తానికే పరిమితమై ఆస్తులను సమకూరుస్తారు. అట్టి పూచీ ఇచ్చిన మొత్తాన్ని పరిసమాప్త దశలో మాత్రమే చెల్లిస్తారు.
సి) అపరిమిత కంపెనీలు: కంపెనీ పరిసమాప్త సమయంలో అపరిమిత కంపెనీ సభ్యులు రుణాలు చెల్లించడానికి తమ సొంత ఆస్తులను కూడా జత చేయవలసి వస్తుంది. ఈ రకమైన కంపెనీలలో కోర్టు అనుమతి లేకుండానే ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా సులభంగా మూలధన మార్పులు చేసుకోవచ్చు.
5) అధికారం ఆధారంగా:
ఎ) హోల్డింగ్ కంపెనీలు: ఒక కంపెనీ వేరొక కంపెనీలో సగానికంటే ఎక్కువ వాటా మూలధనంను కల్గి ఉండి, ఆ కంపెనీ యొక్క నిర్వహణను నియంత్రించే విధంగా ఉన్నప్పుడు దానిని ‘హోల్డింగ్ కంపెనీ’ అంటారు. ఉదాహరణకు కంపెనీ A కంపెనీ B చెల్లించిన మూలధనంలో 51% మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే A కంపెనీని ‘హోల్డింగ్ కంపెనీ’ అని అంటారు.
బి) అనుబంధ కంపెనీ: ఒక కంపెనీ వేరొక కంపెనీ నిర్వాహణ, నియంత్రణలో ఉన్నప్పుడు ఆ కంపెనీని అనుబంధ కంపెనీ అంటారు. ఉదాహరణకు A అనే కంపెనీ B కంపెనీ వాటా మూలధనంలో 51% కన్నా ఎక్కువ లేదా 51% వాటా కలిగి ఉన్నప్పుడు B కంపెనీ A కంపెనీకి అనుబంధ కంపెనీ అగును.
6. జాతీయత ఆధారంగా:
- స్వదేశీ కంపెనీ: ఒక కంపెనీ మన దేశంలోని కంపెనీల చట్టం ప్రకారం నమోదై వ్యాపార కార్యకలాపాలను జరిపినప్పుడు దానిని స్వదేశీ కంపెనీ అని అంటారు.
- విదేశీ కంపెనీ: విదేశాలలో నమోదై, భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినప్పుడు దానిని విదేశీ కంపెనీ అంటారు.
7. ప్రాంతం ఆధారంగా:
- జాతీయ కంపెనీ: కంపెనీ తమ వ్యాపార కార్యకలాపాలను ఒక దేశపు ఎల్లలను దాటకుండా చేపట్టినప్పుడు
దానిని జాతీయ కంపెనీ అంటారు. - బహుళ జాతి కంపెనీ: నమోదైన దేశంలో కాక దేశపు సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తించే కంపెనీని బహుళజాతి కంపెనీ అంటారు.
8. వ్యాపారాన్ని ప్రారంభించడం ఆధారంగా:
ఎ) డార్మెంట్ కంపెనీ (నిద్రాణమైన కంపెనీ): ఒక కంపెనీ రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఏలాంటి అకౌంటింగ్ లావాదేవీలను చేయనపుడు దానిని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీ అంటారు. ఒక కంపెనీ, తమ కంపెనీని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీగా గుర్తించమని కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును. బి) డీఫంక్ట్ కంపెనీ: కంపెనీ నమోదు చేసుకున్న సంవత్సరం లోపు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంలో విఫలమై ఎలాంటి ఆస్తులు, అప్పులు లేకుండా ఉన్నప్పుడు దానిని డీఫంక్ట్ కంపెనీగా పిలుస్తారు. ఇలాంటి కంపెనీ బహిరంగంగా లేదా ప్రయివేట్ వ్యాపార కార్యకలాపాలను భవిష్యత్తులో కొనసాగించకుండా నిషేదించబడును. 3. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్యగల వ్యత్యాసాలను తెలపండి.
జవాబు.
ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ మధ్య గల వ్యత్యాసాలు
ప్రశ్న 4.
జాయింట్ స్టాక్ కంపెనీ ప్రయోజనాలను సవివరంగా వివరించండి.
జవాబు.
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. పరిమిత ఋణబాధ్యత: వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.
2. భారీ ఆర్థిక వనరులు: ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు.. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.
3. శాశ్వత మనుగడ: కంపెనీల చట్టం ప్రకారము, కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.
4. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు: అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.
5. ద్రవ్వత్వ లక్షణం: పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరులు అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.
6. సమర్థవంతమైన నిర్వహణ: కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.
7. పరిశోధన మరియు అభివృద్ధి: ఒక కంపెనీ ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడానికి, నూతన వస్తువుల రూపకల్పనకు, కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఈ విస్తరణ కంపెనీలలోనే సాధ్యము.
8. పన్ను ఆదాలు: కంపెనీలు ఆదాయపు పన్ను ఎక్కువ కట్టవలసి వచ్చినప్పటికి, ఎన్నో పన్ను మినహాయింపులు ఇవ్వడం వలన వీటికి పన్ను చెల్లించే బాధ్యత మొత్తంమీద తగ్గుతుంది.
9. ఉద్యోగ అవకాశాలు: ఒక కంపెనీ పెద్ద మొత్తంలో ఉద్యోగాలను సృష్టిస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి మరియు దేశం మొత్తం జీవన ప్రమాణం మెరుగుపడుతుంది.
10. సమతుల్య ప్రాంతీయాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో కంపెనీల యొక్క విస్తరణ మరియు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, రాయితీల వల్ల ఒక ఔత్సాహిక వ్యవస్థాపకుడు వెనుకబడిన ప్రాంతాలలో మరియు అభివృద్ధి చెందవలసిన ప్రాంతాలలో కంపెనీని స్థాపించడానికి సిద్ధమవుతాడు. ఇలాంటి కంపెనీలు అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందని ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగిస్తుంది.
ప్రశ్న 5.
జాయింట్ స్టాక్ కంపెనీ నష్టాలను విశ్లేషించండి.
జవాబు.
1) ఆంక్షలు, నిబంధనలు ఎక్కువ: కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి, ముగించేవరకు (రద్దు చేయడం) కంపెనీ మీద ప్రభుత్వం ప్రతి దశలోను, ఎన్నో ఆంక్షలను, నిబంధనలను విధించింది. అంతేకాకుండా కంపెనీ పాటించవలసిన లాంఛనాలు ఎక్కువే. తయారుచేసి సమర్పించవలసిన పత్రాల సంఖ్య కూడా ఎక్కువ. వీటన్నిటిని పూర్తి చేయడం వ్యయప్రయాసలతో కూడుకొంది. వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడానికి ఈ ఆంక్షలు, లాంఛనాలు ప్రతి బంధకాలవుతాయి.
2) ఆసక్తి లోపించడం: వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అందువల్ల కంపెనీ నిర్వహణలో పాల్గొనలేరు. దీనికోసం వీరు డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా నిర్వహణ, యాజమాన్యం రెండూ వేర్వేరుగా ఉండటం వల్ల శ్రమకు, ఫలితానికి అంతరం ఏర్పడి వ్యక్తిగత శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటాదారులకు ఖాతాదారులతో, ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కూడా మరొక లోపంగా చెప్పవచ్చు. అందువల్ల ఆశించిన ప్రగతిని సాధించకపోవచ్చు.
3) నిర్ణయాలలో జాప్యం: కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఎంతో ఉంది. వాటాదార్లు తమ అధికారాన్ని డైరెక్టర్లకు అప్పగిస్తే, డైరెక్టర్ల బోర్డు దానిని తమ ముఖ్య కార్యదర్శికి, అతడు ఈ అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ చేయడం ద్వారా నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడానికి వీలుండదు. వివిధ కారణాల వల్ల కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడం సాధ్యం కాదు.
4) కొద్దిమంది ద్వారా పరిపాలన సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికారులు చేజిక్కించుకున్న కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.
5) అవినీతికరమైన నిర్వహణ: కంపెనీ నిర్వహణ నిజాయితీ లేని స్వార్థపరుల చేతిలో ఉంటే కంపెనీ ఆస్తులు దుర్వినియోగమవుతాయి. కొన్ని నకిలీ కంపెనీలు పెట్టుబడిదారులు కష్టార్జితాన్ని దోచుకోవడం కోసమే ఏర్పడవచ్చు. మరికొంతమంది నీతి, నిజాయితీ లేని వ్యక్తులు కంపెనీ వార్షిక ఖాతాలను కృత్రిమ లాభాలను లేదా నష్టాలను చూపడం కోసం తప్పుడు సమాచారాన్ని చూపిస్తారు.
6) అనుచితమైన స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.
7) మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ: కంపెనీ నిర్వహణలో అనేక నిబంధనలు పాటించాలి. వార్షిక నివేదికలు, తనఖీ చేసిన లెక్కలను విధిగా రిజిస్ట్రారుకు సమర్పించాలి. డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వ అనుమతి పొందాలి. కంపెనీ ధ్యేయాలు మార్పు చేయడానికి అనేక చట్టబద్ధమైన లాంఛనాలు పాటించాలి.
8) వ్యాపార రహస్యాల వెల్లడి: వ్యాపార నిర్వహణ వాటాదారులు, డైరెక్టర్లు, ఉద్యోగుల చేతులలో ఉంటుంది. కాబట్టి కంపెనీ రహస్యాలను కాపాడటానికి వీలులేదు.
9) ఆసక్తుల సంఘర్షణ: ఈ తరహా వ్యాపారములో ఆసక్తులకు సంబంధించి నిరంతరము సంఘర్షణ జరుగుతుంది. సాధారణముగా వాటాదారులు, డైరెక్టర్ల మధ్య లేదా వాటాదారులు, ఋణదాతల మధ్య లేదా మేనేజ్మెంట్, సిబ్బందికి మధ్య ఎప్పుడూ కలహాలు కొనసాగుతూనే ఉంటాయి.
10) గుత్తాధిపత్యము: కంపెనీలు గుత్తాధిపత్య ధోరణులను ప్రోత్సహిస్తుంది. వీరు వినియోగదారులను, శ్రామికులను దోచుకోవడం జరుగును.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఏవైనా ఐదు (5) ప్రయోజనాలను వివరించండి.
జవాబు.
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. పరిమిత ఋణబాధ్యత: వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తేనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.
2. భారీ ఆర్థిక వనరులు: ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.
3. శాశ్వత మనుగడ: కంపెనీల చట్టం ప్రకారము, కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.
4. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు: అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.
5. ద్రవ్యత్వ లక్షణం: పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరుల అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. -కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.
6. సమర్థవంతమైన నిర్వహణ కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.
ప్రశ్న 2.
జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఏవైనా ఐదు (5) పరిమితులను వివరించండి.
జవాబు.
1) ఆంక్షలు, నిబంధనలు ఎక్కువ: కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి, ముగించేవరకు (రద్దు చేయడం) కంపెనీ మీద ప్రభుత్వం ప్రతి దశలోను, ఎన్నో ఆంక్షలను, నిబంధనలను విధించింది. అంతేకాకుండా కంపెనీ పాటించవలసిన లాంఛనాలు ఎక్కువే. తయారుచేసి సమర్పించవలసిన పత్రాల సంఖ్య కూడా ఎక్కువ. వీటన్నిటిని పూర్తి చేయడం వ్యయప్రయాసలతో కూడుకొంది. వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడానికి ఈ ఆంక్షలు, లాంఛనాలు ప్రతి బంధకాలవుతాయి.
2) ఆసక్తి లోపించడం: వాటాదారులు కంపెనీకి యజమానులు. వీరు దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటారు. అందువల్ల కంపెనీ నిర్వహణలో పాల్గొనలేరు. దీనికోసం వీరు డైరెక్టర్లను తమ ప్రతినిధులుగా ఎన్నుకొంటారు. ఆ విధంగా నిర్వహణ, యాజమాన్యం రెండూ వేర్వేరుగా ఉండటం వల్ల శ్రమకు, ఫలితానికి అంతరం ఏర్పడి వ్యక్తిగత శ్రద్ధ, ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటాదారులకు ఖాతాదారులతో, ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కూడా మరొక లోపంగా చెప్పవచ్చు. అందువల్ల ఆశించిన ప్రగతిని సాధించకపోవచ్చు.
3) నిర్ణయాలలో జాప్యం: కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఎంతో ఉంది. వాటాదార్లు తమ అధికారాన్ని డైరెక్టర్లకు అప్పగిస్తే, డైరెక్టర్ల బోర్డు దానిని తమ ముఖ్య కార్యదర్శికి, అతడు ఈ అధికారాన్ని కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ చేయడం ద్వారా నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడానికి వీలుండదు. వివిధ కారణాల వల్ల కంపెనీ వ్యవస్థలో నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోవడం సాధ్యం కాదు.
4) కొద్దిమంది ద్వారా పరిపాలన: సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికారులు చేజిక్కించుకున్న కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.
5) అవినీతికరమైన నిర్వహణ: కంపెనీ నిర్వహణ నిజాయితీ లేని స్వార్థపరుల చేతిలో ఉంటే కంపెనీ ఆస్తులు దుర్వినియోగమవుతాయి. కొన్ని నకిలీ కంపెనీలు పెట్టుబడిదారుల కష్టార్జితాన్ని దోచుకోవడం కోసమే ఏర్పడవచ్చు. మరికొంతమంది నీతి, నిజాయితీ లేని వ్యక్తులు కంపెనీ వార్షిక ఖాతాలను కృత్రిమ లాభాలను లేదా నష్టాలను చూపడం కోసం తప్పుడు సమాచారాన్ని చూపిస్తారు.
6) వాటాలలో అనుచిత స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.
ప్రశ్న 3.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను తెలపండి.
జవాబు.
జాయింట్ స్టాక్ కంపెనీ లక్షణాలు:
కంపెనీ యొక్క విలక్షణమైన లక్షణాలను క్రింది విధంగా గుర్తించవచ్చు.
1) చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తి: కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన కృత్రిమ వ్యక్తి. న్యాయశాస్త్రమే – ప్రాణంగా మనుగడను కొనసాగిస్తుంది. ఇది ఒక అదృశ్యమైన, కంటికి కనిపించని శరీరం, ఆత్మ లేని వ్యక్తి.
2) ప్రత్యేక న్యాయసత్వం: కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడిన కల్పిత వ్యక్తి. కంపెనీ నమోదు చేయగానే దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లభిస్తుంది. అంటే కంపెనీ వేరు, కంపెనీలోని సభ్యులు వేరు. కంపెనీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకొనవచ్చు. సాధారణ వ్యక్తులలాగా ఆస్తులను కొనడం, అమ్మడం చేయవచ్చు. ఉద్యోగస్తులను నియంత్రించవచ్చు. స్వతంత్రంగా న్యాయసమ్మతమైన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.
3) స్థాసన: జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపనకు ముందు పలు ముఖ్యమైన పత్రాలను తయారు చేయడంతో పాటు అనేక చట్టపరమైన నిబంధనలను, షరతులను పూర్తి చేయవలసి ఉంటుంది. భారత కంపెనీల చట్టం, 2013 కింద తప్పనిసరిగా నమోదు చేయించినప్పుడు మాత్రమే కంపెనీ మనుగడలోకి వస్తుంది.
4) అధికార ముద్ర: కంపెనీకి భౌతికమైన ఆకారం లేదు. అందువల్ల సహజమైన వ్యక్తిలాగా డైరెక్టర్ల బోర్డు ద్వారా వ్యవహరిస్తుంది. కంపెనీ ఒప్పందాలను కుదుర్చుకొన్నప్పుడు లావాదేవాలు జరిగినప్పుడు సంతకాలు చేయడానికి బదులు, తన అధికారముద్రను ఉపయోగిస్తుంది. ఈ అధికార ముద్ర కంపెనీ సంతకంలాగా చలామణి అవుతుంది. కంపెనీ సంతకానికి బదులు కంపెనీ అధికారముద్రను ముద్రించి, ఇద్దరు డైరెక్టర్లు సాక్షి సంతకాలు చేసినప్పుడు మాత్రమే ఆ పత్రాలలో ఉన్న విషయాల వల్ల కంపెనీకి బాధ్యత ఏర్పడుతుంది. ఈ అధికార ముద్రను తగు జాగ్రత్త మధ్య కంపెనీ కార్యదర్శి వద్ద భద్రపరచవలసి ఉంటుంది.
5) పారంపర్యాధికారం: కంపెనీ వ్యాపార సంస్థకు శాశ్వతమైన మనుగడ ఉంది. అందువల్ల కంపెనీ చిరకాలం కొన సాగుతుంది. కంపెనీ సభ్యులలో ఎవరైనా మరణించినా, వారి వాటాలను అమ్మివేసినా, ఎవరికైనా మతిభ్రమించినా, ఎవరైనా దివాలా తీసినా, కంపెనీ మాత్రం నిరాటంకంగా కొనసాగే అధికారాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడినందువల్ల దానిని మూసివేయడం చట్టం ద్వారానే సాధ్యమవుతుంది.
6) సభ్యుల రుణబాధ్యత పరిమితం: కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. అందువల్ల కంపెనీ తాను చేసిన అప్పులకు తానే బాధ్యత వహిస్తుంది. ఈ సందర్భంగా వాటాదారులు రుణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువలకు పరిమితమైన ఉంటుంది. ఉదాహరణకు శ్రీను అనే వాటాదారుడు కౌ 10లు విలువలు కలిగిన వాటాను కొని వాటాకు ? 8లు చెల్లిస్తే అతని రుణబాధ్యత వాటాకు గౌ2లకు పరిమితమై ఉంటుంది. దీనికి మించి అతడు కంపెనీకి సంబంధించిన ఎలాంటి రుణాల లేదా నష్టాల చెల్లింపుకు బాధ్యతను కలిగి ఉండదు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కంపెనీ చట్టం, 2013 ప్రకారం కంపెనీని నిర్వచించండి.
జవాబు.
1) కంపెనీల చట్టం, 2013 ప్రకారం – “ఏదైనా ఒక సంస్థ కంపెనీ చట్టం 2013 లేదా అంతకు పూర్వం ఇతర ఏ కంపెనీ చట్టం క్రింద నమోదు చేయబడిన దానిని కంపెనీ అని అంటారు”.
2) లార్డ్ జస్టిస్ లిండ్ ప్రకారం – “సమిష్టి ప్రయోజనం కోసం ధనాన్ని లేదా ధనంతో సమానమైన దానిని సమకూర్చే అనేకమంది వ్యక్తుల కలయిక కంపెనీ”.
ప్రశ్న 2.
శాశ్వత మనుగడ అంటే ఏమిటి ?
జవాబు.
- కంపెనీల చట్టం ప్రకారం కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వం ఉంటుంది. అందువల్ల కంపెనీ నిరాటంకంగా కొనసాగుతోంది. దీనినే శాశ్వత మనుగడ అంటారు.
- కంపెనీ సభ్యుల జీవితాలకు, కంపెనీ జీవితానికి సంబంధం లేదు. వాటాదారుని మరణంగాని, దివాలాగాని, మతిస్థిమితాన్ని కోల్పోవడం గానీ కంపెనీ భవిష్యత్తును మార్చలేవు. అందువల్ల సుదీర్ఘమైన, నిరాటంకమైన వ్యాపారానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న 3.
చిన్న కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీల చట్టం, 2013 సెక్షన్ – 2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.
- కంపెనీ వాటా మూలధనం ? 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
- కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.
ప్రశ్న 4.
ఏక వ్యక్తి కంపెనీ అంటే ఏమిటి ?
1. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి.
2. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్యులుగా వ్యవహరిస్తారు. నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా వ్యవహరిస్తాడు.
ప్రశ్న 5.
ప్రభుత్వ కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.
కంపెనీ యొక్క మొత్తం చెల్లించిన వాటా మూలధనంలో 51% వాటాలను కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు కాని, లేక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సమకూర్చినట్లయితే అట్టి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ఉదాహరణకు స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైనవి.
ప్రశ్న 6.
హోల్డింగ్ కంపెనీ అంటే ఏమిటీ ?
జవాబు.
- ఒక కంపెనీ వేరొక కంపెనీలో సగానికంటే ఎక్కువ వాటా మూలధనంను కల్గి ఉండి, ఆ కంపెనీ యొక్క నిర్వహణను నియంత్రించే విధంగా ఉన్నప్పుడు దానిని ‘హోల్డింగ్ కంపెనీ’ అంటారు.
- ఉదాహరణకు కంపెనీ A కంపెనీ B చెల్లించిన మూలధనంలో 51% మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే A కంపెనీని ‘హోల్డింగ్ కంపెనీ’ అని అంటారు.
ప్రశ్న 7.
డార్మెంట్ కంపెనీ అంటే ఏమిటి ?
జవాబు.
- ఒక కంపెనీ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఏలాంటి అకౌంటింగ్ లావాదేవీలను చేయనపుడు దానిని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీ అంటారు.
- ఒక కంపెనీ, తమ కంపెనీని డార్మెంట్ లేదా నిద్రాణమైన కంపెనీగా గుర్తించమని కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును
అదనపు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఏవైనా ఓ కంపెనీలను వివరించండి.
జవాబు.
1) చార్టెర్డ్ కంపెనీలు: రాజు ఆజ్ఞతో గాని లేదా రాజశాసనం ద్వారా గాని కంపెనీల ఆవిర్భావం జరిగినప్పుడు వాటిని చార్టెర్డ్ కంపెనీలు అంటారు. భారతదేశంలో ప్రస్తుతం ఈ కంపెనీలు ఉనికిలో లేవు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (1894), ఈస్ట్ ఇండియా కంపెనీ (1600) మొదలైనవి.
2) శాసనాత్మక కంపెనీలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ప్రత్యేక చట్టం ద్వారా నమోదు చేయబడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలని అంటారు. సాధారణంగా శాసనాత్మక కంపెనీలు ప్రజా శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేయబడతాయి. ఉదాహరణకు రైల్వే, కరెంటు ఉత్పత్తి, నీటి పనులు, భారత రిజర్వు బ్యాంకు మొదలగునవి.
3) రిజిస్టర్డ్ కంపెనీలు: కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని అంటారు. కంపెనీల చట్టానికి లోబడి నమోదు పత్రం రిజిస్ట్రార్ వద్ద నుండి పొందిన తర్వాత కంపెనీ అస్తిత్వంలోకి వస్తుంది.
4) ప్రైవేట్ కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ 2(68) కింద నమోదైన ప్రైవేట్ కంపెనీ, కంపెనీల నియమావళి ప్రకారం వాటాల బదిలీ మరియు ప్రజల నుండి చందా పొందడానికి నిషేదించబడ్డాయి”.
ప్రైవేట్ కంపెనీ లక్షణాలను క్రింది విధంగా గమనించవచ్చు:
- కనీసపు చెల్లించిన మూలధనం 1,00,000 రూపాయలు.
- కనీస సభ్యుల సంఖ్య 2.
- గరిష్ట సభ్యుల సంఖ్య 50.
- ప్రజలకు పరిచయపత్రం ద్వారా వాటాలను జారీ చేయరాదు.
- వాటాలను బదిలీ చేయరాదు.
పైన పేర్కొన్న నిబంధనలన్నింటిని ప్రైవేట్ కంపెనీలు తప్పక పాటించవలసి ఉంటుంది. అంతేకాక కంపెనీ పేరు చివర “ప్రైవేట్ లిమిటెడ్” అని తప్పక పేర్కొనవలసి ఉంటుంది.
ఎ) చిన్న కంపెనీ: కంపెనీల చట్టం, 2013 సెక్షన్ – 2(85) ప్రకారం, “పబ్లిక్ కంపెనీ కానీ కంపెనీలను చిన్న కంపెనీలుగా పేర్కొనవచ్చు. చిన్న కంపెనీకి క్రింది లక్షణాలు ఉండును.
- కంపెనీ వాటా మూలధనం 50 లక్షలకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే (సూచించిన యెడల) 5 కోట్లు మించరాదు.
- కంపెనీ టర్నోవర్ 7 2 కోట్లకు మించరాదు. ఒకవేళ పెద్ద మొత్తం అయితే (సూచించిన యెడల) 50 కోట్లు, 20 కోట్లకు మించరాదు.
బి) ఏక వ్యక్తి కంపెనీ:
1. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, “ఒకే ఒక వ్యక్తి సభ్యుడిగా కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీని ఏక వ్యక్తి కంపెనీగా వ్యవహరిస్తారు. వాస్తవానికి ఈ కంపెనీలలో మొత్తం వాటా మూలధనం ఒక్కరే సమకూరుస్తారు. ఇతని వద్దే మొత్తం వాటాలు ఉంటాయి.
2. నామమాత్రంగా ఒక్కరు లేక ఇద్దరు వ్యక్తులు కుటుంబం నుంచి లేక స్నేహితుల నుంచి కాని సభ్య నామమాత్రపు సభ్యుడు పరిమిత రుణబాధ్యతతో ప్రధాన వాటాదారుడికి వారసత్వంగా గా వ్యవహరిస్తారు.
5) పబ్లిక్ కంపెనీ: భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకల వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.
- కనీసపు చెల్లించిన మూలధనం 5,00,000.
- కనీస సభ్యుల సంఖ్య 7.
- గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.
ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.
ప్రశ్న 2.
పబ్లిక్ కంపెనీ.
జవాబు.
భారీ మొత్తంలో మూలధనాన్ని వెచ్చించి పెద్దతరహా వ్యాపార కార్యకలాపాలను చేపట్టదలచిన వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ కంపెనీ ఎంతో అనుకూలమైంది. కంపెనీల (సవరణ) చట్టం, 2000 ప్రకారం పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.
- కనీసపు చెల్లించిన మూలధనం 35,00,000.
- కనీస సభ్యుల సంఖ్య 7.
- గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం.
ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని గాని లేదా క్లుప్తంగా లిమిటెడ్ అనే పదాన్ని గాని ఉపయోగించాలి. ఉదాహరణ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైనవి.