Here students can locate TS Inter 1st Year Chemistry Notes 6th Lesson ఉష్ణగతిక శాస్త్రం to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 6th Lesson ఉష్ణగతిక శాస్త్రం
→ ఉష్ణగతికశాస్త్ర అధ్యయనంలో మనం విశ్వం అంతటినీ ఊహాత్మకంగా రెండు ఖండాలుగా విభజిస్తాం. దాన్ని వ్యవస్థ అంటారు. మిగిలిన ఖండాన్ని అనియతంగా భావించి, పరిసరాలు అంటారు.
→ వ్యవస్థలను మూడు రకాలుగా వివృత (తెరిచిన) సంవృత (మూసి వుంచిన) వివక్త వ్యవస్థలు అంటాం.
→ వ్యవస్థ ధర్మాలను సౌలభ్యం కోసం గహన (ద్రవ్యం పరిమాణం మీద ఆధారపడినవి) విస్తార (ద్రవ్యం పరిమాణంపై ఆధారపడనివి)లను ఉష్ణగతిక శాస్త్రం ధర్మాలు అని వర్గీకరిస్తాం.
→ ఉష్ణగతికశాస్త్ర ధర్మాలు అంతరిక శక్తి (E), ఎంథాల్పి (H), గిబ్స్ శక్తి (G), ఎంట్రోపి (S), పని (w) మొ॥
→ శూన్య నియమం, రెండు వస్తువుల మధ్య ఉష్ణ సమతాస్థితికి సంబంధించింది. మొదటి నియమం శక్తి నిత్యత్వానికి సంబంధించింది. రెండవ నియమం ప్రక్రియ అయత్నీకృత స్వభావానికి సంబంధించింది. మూడవ నియమం పరమ శూన్య ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ మార్పుకు సంబంధించింది.
→ రసాయన చర్యలకు ఉష్ణగతికశాస్త్ర మొదటి నియమ అనువర్తనమే ఉష్ణరసాయనశాస్త్రం,
→ ఈ విభాగంలో భిన్న చరరాశుల పరంగా ఉష్ణశక్తి మార్పులను పరిమాణాత్మకంగా పరిశీలిస్తాం.
→ ఇవి సంశ్లేషణ, బంధ వియోజన, దహనం, తటస్థీకరణ, పరమాణీకరణ ఉత్పతన, ప్రావస్థ మార్పు అయనీకరణ విలీన ఉష్ణాలు.
→ ఉష్ణం మార్పులను కాలరీ మీటర్ల ద్వారా నిర్ణయిస్తారు.
→ ΔG = ΔH – TDS అయత్నీకృత చర్యలను ΔG ఋణ విలువలో వుంటుంది. అయత్నీకృత చర్యలకు ఇదే ధనవిలువలో వుంటుంది. సమతాస్థితి చర్యలకు ఇది సున్నగా వుంటుంది.
→ ఎంట్రోపి (S) ఉష్ణగతికశాస్త్ర ధర్మాన్ని, ఒక వ్యవస్థ క్రమ రాహిత్యాన్ని తెలపడానికి ప్రవేశపెట్టారు.