Here students can locate TS Inter 1st Year Chemistry Notes 8th Lesson హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 8th Lesson హైడ్రోజన్ – దాని సమ్మేళనాలు
→ జగత్తులో అత్యధిక సమృద్ధిగా దొరికేది హైడ్రోజన్. దీనిని శక్తికి మూలస్థానంలో వాడుకోవచ్చు. దీనినే డై హైడ్రోజన్ అని కూడా అంటారు.
→ ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ యొక్క స్థానం చర్చనీయాంశం.
→ హైడ్రోజన్ IA గ్రూపులోని క్షార లోహలతోను, VII A గ్రూపులోని హాలోజన్లతోను పోలికలు కలిగి ఉంటుంది.
→ హైడ్రోజన్ కు మూడు సమస్థానీయాలున్నాయి. అవి ప్రోటియమ్, డ్యూటీరియమ్, ట్రైటియమ్.
→ ట్రెటియమ్ మాత్రమే రేడియోధార్మిక పదార్ధం. ఇది అల్పశక్తి కల B-కణాలను ఉద్గారం చేస్తుంది.
→ డై హైడ్రోజన్ను వివిధ పద్ధతులలో తయారుచేస్తారు.
→ హైడ్రోజన్ హాలోజన్లతో హాలైడ్లను, ఆక్సిజన్లో నీటిని, నైట్రోజన్తో అమ్మోనియాను, లోహలతో హైడ్రైడ్లను ఏర్పరుస్తుంది.
→ హైడ్రోజను అమ్మోనియా సంశ్లేషణలో, నూనెల హైడ్రోజనీకరణంలో, కర్బన రసాయనాల తయారీలో, వెల్డింగ్ మరియు కటింగ్ చేయటానికి, రాకెట్లలో ఇంధనంగా మరియు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయటంలో వాడతారు.
→ మిగిలిన మూలకాలతో హైడ్రోజన్ ఏర్పరచే ద్విగుణాత్మక సమ్మేళనాలను హైడ్రేడ్లు అంటారు. వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. అయానిక హైడ్రైడ్లు, కోవలెంట్ హైడ్రైడ్లు, నాన్-స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్లు.
→ అన్ని జీవరాశులలోను ఎక్కువ భాగం నీరు ఉంటుంది. ఇది రంగు, రుచిలేని ద్రవం. జలాణువుల మధ్య విస్తృతమైన హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. ఇది ద్విస్వభావ ప్రవృత్తిని కలిగి ఉంటుంది.
→ సబ్బుతో నురగను ఇవ్వని నీటిని కఠినజలం అంటారు. నీటిలో కరిగి ఉన్న Ca+2 మరియు Mg+2 లవణాలు నీటి కాఠిన్యానికి కారణాలు.
→ మరిగించటం ద్వారాగాని, క్లార్క్ పద్ధతి, కాల్గన్ పద్ధతి, అయాన్ వినిమయ పద్ధతి, సంశ్లేషిత రెజిన్ల పద్ధతి ద్వారా గాని నీటి కాఠిన్యాన్ని తొలగించవచ్చు.
→ D2O ను భారజలం అంటారు. న్యూక్లియర్ రియాక్టర్లలో మోడరేటు చర్యా విధానాల అధ్యయనంలో వినిమయ కారకంగా D2O ను ఉపయోగిస్తారు.
→ 50% H2SO ను విద్యుద్విశ్లేషణం చేయటం ద్వారా H2O2 తయారు చేస్తారు. H2O2, తెరిచిన పుస్తకాకృతిని కలిగి ఉంటుంది. 30% \(\left(\frac{w}{v}\right)\)H2O ను పెరై డ్రోల్ అంటారు.