Here students can locate TS Inter 1st Year Accountancy Notes Chapter 1 Book Keeping and Accounting to prepare for their exam.
TS Inter 1st Year Accountancy Notes Chapter 1 Book Keeping and Accounting
→ Accounting is called as the “language of business”. Accounting helps in communicating financial information to various parties interested in it.
→ Bookkeeping is the branch of knowledge that is concerned with the recording of business transactions.
→ An accounting cycle is a complete sequence of accounting processes that begins with the recording of business transactions and ends with the preparation of final statements.
→ Generally Accepted Accounting Principles (GAAP) may be defined as those rules of action which are derived from experience and practice.
→ The accounting principles are general accounting procedures practices that guide the accountant in the preparation of accounting records.
→ Accounting principles can be broadly classified into Accounting concepts and accounting conventions.
→ Some of accounting concepts are :
- Business entity concept
- Money measurement concept
- Cost concept
- Duel concept
- Going concern concept
- Matching concept etc.
→ Consistency, disclosure, conservation and materiality are Accounting conventions.
→ Accounting standard is a principle that guides and standardizes accounting practices.
→ “International Financial Reporting Standards (IFRS) are the standards issued by IFRS Foundation and International Accounting Standards Board (IASB).
TS Inter 1st Year Accountancy Notes Chapter 1 బుక్ కీపింగ్
1. వ్యాపార వ్యవహారములను క్రమ పద్ధతిలో, కాలానుక్రమముగా నమోదు చేసే ప్రక్రియను బుక్ కీపింగ్ అంటారు. అన్ని వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన శాశ్వతమైన రికార్డు రూపొందించడానికి బుక్ కీపింగ్ సహాయపడుతుంది.
2. పూర్తిగా గాని కొంతమేరకు ఆర్థిక సంబంధము గల వ్యవహారాలను శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరచి వాటి ఫలితాలను నివేదికల ద్వారా యజమానులకు వివరించే కళే గణకశాస్త్రము.
3. వ్యాపార వ్యవహారాలను రికార్డు చేయడం, వర్గీకరించడం, సంక్షిప్తపరచడము, విశ్లేషించడం వంటి దశలు అకౌంటింగ్లో ఉంటాయి.
4. అకౌంటింగ్ ప్రక్రియ వ్యాపార వ్యవహారాల నమోదుతో ప్రారంభమై, ముగింపు లెక్కల తయారీతో ముగుస్తుంది.
5. ఖాతా పుస్తకాల తయారీకి సహాయపడే సాధారణ అకౌంటింగ్ ప్రక్రియల పద్ధతులను గణకసూత్రాలు అంటారు. వీటిని స్థూలముగా అకౌంటింగ్ భావాలు, అకౌంటింగ్ సంప్రదాయాలుగా విభజిస్తారు.
6. గణక భావనలు అకౌంటింగ్కు మూల సూత్రాలు. ఆర్థిక నివేదికలపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు ఆర్థిక సమాచారము అందించడానికి ఖాతా పుస్తకాల తయారీకి ఈ భావనలు అభివృద్ధిపరచడం జరిగినది. ముఖ్యమైన అకౌంటింగ్ భావనలు వ్యాపార అస్తిత్వ భావన, ద్వంద రూప భావన, గతిశీల సంస్థ భావన, ద్రవ్య కొలమాన భావన, వ్యయ భావన, అకౌంటింగ్ కాల భావన, జతపరిచే భావన మొదలైనవి.
7. గణక సంప్రదాయాలు సంస్థల ఆర్థిక నివేదికలను తయారుచేసేటప్పుడు అకౌంటెంట్కు మార్గాన్ని చూపే ఆచారాలు లేదా కట్టుబాట్లు వెల్లడి చేసే సంప్రదాయం, ప్రాధాన్యత సంప్రదాయం, అనురూప సంప్రదాయం, మితవాద సంప్రదాయం మొదలైనవి ముఖ్యమైన గణక సంప్రదాయాలు.
8. అకౌంటింగ్ పద్ధతులను నిర్దేశించడానికి, ప్రమాణీకరించడానికి తోడ్పడే సూత్రాలను గణక ప్రమాణాలు అంటారు.
9. జంటపద్దు విధానాన్ని ఇటలీ దేశస్తుడు “లుకాస్ పాసియోలి” ప్రవేశపెట్టాడు. ప్రతి వ్యాపార వ్యవహారములో రెండు అంశాలు రెండు ఖాతాలను ప్రభావితం చేస్తాయి. వ్యాపార వ్యవహారములలో వచ్చే అంశాన్ని ఇచ్చే అంశాన్ని నమోదు చేసే విధానము జంటపద్దు విధానము.
10. ఈ విధానము డెబిట్, క్రెడిట్ అంశాలను రికార్డు చేస్తుంది. ప్రతి డెబిట్కు క్రెడిట్ ఉంటుంది. ప్రతి క్రెడిట్కు డెబిట్ ఉంటుంది. డెబిట్ మొత్తము క్రెడిట్ మొత్తముతో సమానముగా ఉండటమే జంటపద్దు విధానపు ముఖ్య లక్షణము.