These TS 9th Class Telugu Important Questions 9th Lesson కోరస్ will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 9th Lesson Important Questions కోరస్
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పాఠం ఆధారంగా సలంద్ర లక్ష్మీనారాయణ గురించి రాయండి.
జవాబు:
దళిత సాహిత్యోద్యమానికి పునాదివేసిన ‘దళిత మానిఫెస్టో’ కవితా రచయిత సలంద్ర లక్ష్మీనారాయణగారు రాసిన పాఠ్యాంశమే ‘కోరస్’. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ అంత తొందరగా అంగీకరించదనే విషయాన్ని గురించి సలంద్ర ఆవేదన పడుతున్నారు.
తనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించాలని, తన పాటకు సమాజం ‘కోరస్’ అవుతుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు. సంఘం తనతో గొంతు కలుపుతుందన్నాడు. దళితులూ, అగ్రవర్ణాలవారూ అందరూ సమానమని తన కవిత ద్వారా చెప్పాడు. ప్రగతిశీల భావాలతో సమాజం అభివృద్ధి వైపు నడవాలని కోరిన సలంద్ర మహాకవి, అభ్యుదయ కవి.
ప్రశ్న 2.
‘వాస్తవాలు కఠినంగా ఉంటాయి’- కోరస్ ఆధారంగా ఉదాహరణలు తెలుపండి.
జవాబు:
నిజం ఎప్పుడూ కఠినంగా ఉంటుంది. సంఘం కొత్త పోకడలను అంతవేగంగా అంగీకరించదు. పాఠంలో చెప్పినట్లు, అగ్రవర్ణాలవారు ఆకాశం వలె గొప్పవారమని, దళితులు భూమిలా అడుగునుండి పోవాలనే భావన తప్పని అంతా సమానమని కవి చెప్పేది వాస్తవం. కాని ఆచరణ కఠినం. సమాజం ఒక ప్రవాహం లాంటిది. పాతపోయి కొత్తదనం వస్తూ ఉంటుంది.
సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించకుండా పాతచింతకాయ పచ్చడి మనస్తత్వాన్ని విడవాలని కవి చెప్పేది వాస్తవం. మేధావి కూడా మూర్ఖుడిలాగానే ఇతరులు చెప్పింది వినడని కవి కఠినమైన వాస్తవం చెబుతున్నాడు. మనుషుల్లో సున్నిత తత్త్వాన్ని మేలుకొల్పాలని, కాఠిన్యాన్ని తొలిగించుకోవాలని కవి తెలియజేస్తున్నాడు.
PAPER – I : PART – B
భాషాంశాలు – పదజాలం :
1. సొంతవాక్యాలు:
అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. ససేమిరా : SSCప్రీఫైనల్ పరీక్షలు ఉండటంతో మామయ్య వాళ్ళింట్లో పెళ్ళికి ససేమిరా రానని మా అన్నయ్య పట్టుపట్టాడు.
2. అపార్థం : పెళ్ళికి వెళ్ళకపోతే మామయ్య అపార్థం చేసుకొంటాడని అమ్మ చెప్పింది.
3. ముక్కలు చెక్కలు : గంధం దుంగలను ముక్కలు చెక్కలు చేసినా దాని విలువ మారదు.
4. గొంతెత్తు : జాతీయగీతం గొంతెత్తి పాడితేనే అందం అంటాడు మా తాతయ్య.
5. ఆచరణ : రామరాజ్యం పేరు చెప్పే నాయకులేగాని ఆచరణలో పెట్టినవారు లేరు.
6. ప్రతిబింబం :
- సినిమాలో కొన్ని పాత్రల ప్రతిబింబాలు మాట్లాడటం గమ్మత్తుగా ఉంటుంది.
- సింహం నూతిలో తన ప్రతిబింబాన్ని చూసి వేరొక సింహం అనుకున్నది.
7. నిశ్చలత : తుళ్ళిపడే చేపలతో చెరువు నిశ్చలత కోల్పోతుంది.
8. కోరస్ : మేము చెప్పే కోరస్ సమాధానాలను చూసి మా తెలుగు సారు విసుక్కుంటాడు కాని వెంటనే నవ్వుతాడు.
II. అర్థాలు :
ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
ప్రశ్న 1.
“ఎట్టిపరిస్థితుల్లోను” అనే అర్థం వచ్చే పదం
A) నిరభ్యంతరం
B) ససేమిరా
C) గదరగండ
D) అన్ని విధాలు
జవాబు:
B) ససేమిరా
ప్రశ్న 2.
కాళిదాసుకు సామ్యం రాగల కవి ఎవరు? – గీత గీసిన పదానికి అర్థం
A) పోలిక
B) భేదము
C) పోటీ
D) రూపం
జవాబు:
A) పోలిక
ప్రశ్న 3.
మేధస్సుకు గణితంలో పదునుపెట్టవచ్చు – గీత గీసిన పదానికి అర్థం
A) తపస్సు
B) ఆలోచన
C) తెలివి
D) కోపం
జవాబు:
C) తెలివి
ప్రశ్న 4.
పిల్లలు కోరస్ గా జనగణమన పాడారు – గీత గీసిన పదానికి అర్థం
A) వరుసగా నిలబడి
B) విడివిడిగా
C) ఒకరి తరువాత ఒకరు
D) అందరూ గొంతు కలిపి
జవాబు:
D) అందరూ గొంతు కలిపి
ప్రశ్న 5.
చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పర్చుకున్నాడు – గీత గీసిన పదానికి అర్థం
A) కన్నులు
B) చూపు
C) కళ్ళు
D) నేత్రాలు
జవాబు:
B) చూపు
ప్రశ్న 6.
వాస్తవాలు కఠినంగా ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం
A) అబద్ధం
B) అసత్యం
C) నిజం
D) హింస
జవాబు:
C) నిజం
ప్రశ్న 7.
ప్రజల పక్షం నిలబడని వాళ్ళు నిజమైన మేధావులు కాదు – గీత గీసిన పదానికి అర్థం
A) వైపు
B) రెక్క
C) 15 రోజులు
D) స్వార్థం
జవాబు:
III. ప్రకృతి, వికృతులు:
ప్రశ్న 1.
“ఆకాశము” పదానికి వికృతి
A) ఆకారము
B) ఆకసము
C) అచశము
D) అతిశయం
జవాబు:
B) ఆకసము
ప్రశ్న 2.
మొరకు – అనే పదానికి వికృతి
A) మొండి
B) జగమొండి
C) మూర్ఖుడు
D) మొరియము
జవాబు:
C) మూర్ఖుడు
ప్రశ్న 3.
ఆదర్శము – అనే పదానికి ప్రకృతి
A) అద్దము
B) చూడతగినది
C) అధర్మము
D) అదర్శ
జవాబు:
A) అద్దము
ప్రశ్న 4.
సింహం ముఖము వెడల్పుగా ఉంటుంది – గీత గీసిన పదానికి వికృతి
A) ముగం
B) మొగము
C) ముకురం
D) మొకము
జవాబు:
B) మొగము
ప్రశ్న 5.
మూర్ఖున్ననీ చూపుడు వేళ్ళతో చంపేస్తారు – గీత గీసిన పదానికి అర్థం
A) మొఱకు
B) మూరుకు
C) మూర్కు
D) ముర్కు
జవాబు:
A) మొఱకు
ప్రశ్న 6.
మేధస్సుకీ – మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు – గీత గీసిన పదానికి వికృతి
A) బుద్ధి
B) మేధస్సు
C) ఆలోచన
D) మెదడు
జవాబు:
D) మెదడు
IV. పర్యాయపదాలు :
ప్రశ్న 1.
భూమి – అనే పదానికి పర్యాయపదాలు
A) మేదిని, పుడమి, పృథ్వి
B) నేల, నేలతల్లి, పొలము
C) వసుధ, సుధ, మట్టి
D) మహి, మహిమ, మన్ను
జవాబు:
A) మేదిని, పుడమి, పృథ్వి
ప్రశ్న 2.
ఆకాశంలో చుక్కలు రాత్రి మాత్రమే కనిపిస్తాయి. గీతగీసిన పదానికి పర్యాయపదాలు
A) నింగి, మిన్ను, అంబరం.
B) మేఘము, అంతరిక్షం
C) అంతరిక్షం, ఖగోళం
D) కాంతి, వినీలం
జవాబు:
A) నింగి, మిన్ను, అంబరం
ప్రశ్న 3.
గళము, కంఠము, కుత్తుక – పర్యాయపదాలుగా గల పదం
A) విరళము
B) ధ్వని
C) మెడ
D) గొంతు
జవాబు:
D) గొంతు
ప్రశ్న 4.
“ముఖము” పర్యాయపదాలు
A) ఆస్యము, ఆననము, వదనము
B) నోరు, నాలుక, మెకము
C) మొదట, ప్రతిబింబం
D) బిందువు, ద్వారము, ఇంటిముందు
జవాబు:
A) ఆస్యము, ఆననము, వదనము
ప్రశ్న 5.
గీతం, గేయం – అనే అర్థాలు ఇచ్చే పదం
A) భగవద్గీత
B) పాట
C) కీర్తన
D) గానం
జవాబు:
B) పాట
V. నానార్థాలు :
ప్రశ్న 1.
అద్దంలో నీ రూపం చూడు. గీత గీసిన పదానికి నానార్థాలు
A) ప్రతిబింబం, వస్తువు
B) ఆకారం, అందం
C) ఆకర్షణ, దేహం
D) ధనము, ధాన్యము
జవాబు:
B) ఆకారం, అందం
ప్రశ్న 2.
ప్రవాహానికీ, నిశ్చతలకీ రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు.
A) పారుదల, పదర
B) వరద, పరద
C) ధార, పరంపర
D) ఉత్తమాశ్వం, ప్రసవం
జవాబు:
C) ధార, పరంపర
VI. వ్యుత్పత్యర్థములు :
ప్రశ్న 1.
కావ్యకర్త
A) రచయిత
B) కర్త
C) కవి
D) కవయిత్రి
జవాబు:
C) కవి
PAPER – II : PART – A
అపరిచిత పద్యాలు
ప్రశ్న 1.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కమలములు నీటఁ బాసినఁ
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
ప్రశ్నలు – సమాధానాలు
1. కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి.
2. ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
జవాబు:
తమ తమ స్థానాలను విడిచిపెడితే మిత్రులు శత్రు లౌతారు.
3. తామరలకు మిత్రుడెవరు?
జవాబు:
తామరలకు మిత్రుడు సూర్యుడు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘స్థానబలం’.
5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది సుమతీ శతకంలోని పద్యం.
ప్రశ్న 2.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగినదానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్
ప్రశ్నలు – సమాధానాలు
1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి ?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.
2. ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.
3. దేనిని అనుష్ఠించాలి ?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిబోధ’.
5. గోష్ఠి అంటే ఏమిటి ?
జవాబు:
గోష్ఠి అంటే సభ.
ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినురవేమ!
ప్రశ్నలు – సమాధానాలు
1. పూజకంటె ముఖ్యమైనది ఏది ?
జవాబు:
పూజకంటె ముఖ్యమైనది బుద్ధి.
2. మాటకంటె దృఢమైనది ఏది?
జవాబు:
మాటకంటె దృఢమైనది మనస్సు.
3. కులముకంటె ప్రధానమైనది ఏది?
జవాబు:
కులముకంటె ప్రధానమైనది గుణం.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దేనికంటే ఏది ప్రధానం?’
5. ఇది ఏ శతకంలోని పద్యం.
జవాబు:
ఇది వేమన శతకంలోని పద్యం.
ప్రశ్న 4.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తను లోకము గొనియాడగ
విని యుబ్బడు సజ్జనుండు వెండియుఁ గడు మే
లొనరించుఁ గీడొకించుక.
యును దనదెసఁ దోఁపనీక యుడుపుచు వచ్చున్.
ప్రశ్నలు – సమాధానాలు
1. లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు ఎవరు ?
జవాబు:
లోకం తనను పొగిడితే పొంగిపోనివాడు సజ్జనుడు.
2. సజ్జనుడు లోకానికి ఏం చేస్తాడు?
జవాబు:
సజ్జనుడు లోకానికి మేలు చేస్తాడు.
3. తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు ఎవరు ?
జవాబు:
తనవల్ల ఏమాత్రం హాని కలుగకుండ చూసేవాడు. సజ్జనుడు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘సజ్జన స్వభావం’.
5. ‘మేలు’ అంటే ఏమిటి ?
జవాబు:
‘మేలు’ అంటే ఉపకారం.
ప్రశ్న 5.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సదోష్ఠి సిరియు నొసగును
సదోష్ఠియె కీర్తిఁబెంచు; సంతుష్టియు నా
సన్గోష్ఠియె యొనగూర్చును;
సదోష్ఠియె పాపములను చఱచు కుమారా!
ప్రశ్నలు – సమాధానాలు
1. సద్దోష్ఠి దేన్ని ఇస్తుంది?
జవాబు:
సద్దోష్ఠి సంపదను ఇస్తుంది.
2. కీర్తిని పెంచేది ఏది?
జవాబు:
కీర్తిని పెంచేది సద్దోష్ఠి.
3. పాపములను పోగొట్టేది ఏది?
జవాబు:
పాపములను పోగొట్టేది సదోష్ఠి.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘సదోష్ఠి ప్రయోజనం’.
5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది కుమార శతకంలోని పద్యం.
ప్రశ్న 6.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండుఁ బరికింపంగా
బాల చవిఁ జెరచుఁ గావున
బాలసుఁడగు వాని పొందు వలదుర సుమతీ!
ప్రశ్నలు – సమాధానాలు
1. పాలతో కలిసిన నీరు ఎలా ఉంటుంది?
జవాబు:
పాలతో కలిసిన నీరు పాలలాగానే ఉంటుంది.
2. పాల రుచిని చెడగొట్టేది ఏది?
జవాబు:
పాల రుచిని చెడగొట్టేది అందులో కలిసిన నీరు.
3. ఎవరితో స్నేహం చేయగూడదు?.
జవాబు:
చెడ్డవారితో స్నేహం చేయగూడదు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జన స్నేహం’.
5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది సుమతీ శతకంలోని పద్యం.
PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణం
కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
I. సంధులు:
ప్రశ్న 1.
“అప + అర్థం” – కలిపి రాయండి.
A) అపఅర్థం
B) అపరం
C) అపార్థం
D) ఆపదర్థం
జవాబు:
C) అపార్థం
ప్రశ్న 2.
గొంతెత్తి – ఏ సంధి ?
A) అత్వ సంధి
B) ఉత్వ సంధి
C) గుణసంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
B) ఉత్వ సంధి
ప్రశ్న 3.
“పగులన్ + కొట్టు – పగులఁగొట్టు” → సంధి నామము
A) గసడదవాదేశ సంధి
B) నుగాగమ సంధి
C) సరళాదేశ
D) అత్వ సంధి
జవాబు:
C) సరళాదేశ
II. సమాసములు :
ప్రశ్న 1.
ముక్కలు చెక్కలు – సమాసము పేరు
A) ద్వంద్వ సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) రూపక సమాసము
D) ద్విగు సమాసము
జవాబు:
A) ద్వంద్వ సమాసము
ప్రశ్న 2.
“గొంతునొక్కేయడం” – విగ్రహవాక్యం
A) గొంతులు నొక్కినవారు
B) గొంతును నొక్కేయడం
C) గొంతు వరకు నొక్కేయడం
D) గొంతును నొక్కగలవారు
జవాబు:
B) గొంతును నొక్కేయడం
ప్రశ్న 3.
నా యొక్క పాట → సమాస రూపము
A) నాదైన పాట
B) నా పాట
C) నాకు పాట
D) నేను పాట
జవాబు:
B) నా పాట
III. అలంకారములు :
ప్రశ్న 1.
“వాడి ముఖం చిరంజీవి ముఖంలాగ ఉంటుంది.” – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) ఉపమా
B) అంత్యానుప్రాస
C) యమకము
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) ఉపమా
ప్రశ్న 2.
“రాలనంటోంది చినుకు, రైతుకు రానంది కునుకు” – ఈ వాక్యాలలో ఉన్న అలంకారం
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) అంత్యానుప్రాస
D) యమకము
జవాబు:
C) అంత్యానుప్రాస