These TS 9th Class Telugu Important Questions 12th Lesson తీయని పలకరింపు will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 12th Lesson Important Questions తీయని పలకరింపు
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
అ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
నేటి సమాజంలో కొందరు ముసలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు అప్పగిస్తున్నారు. ఎందుకు ? కారణాలను వివరించండి.
జవాబు:
మానవుడు సంఘజీవి. పదిమందితో కలిసి జీవించాలనుకుంటాడు. దేశ విదేశాలతో సంబంధాలు నెలకొల్పుకుంటాడు. కాని తన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా, ఇంటికి పెద్దదిక్కుగా ఉండే వృద్ధులను గౌరవంగా చూస్తున్నాడా ? ఈ ప్రశ్న ఎక్కువమందికి ప్రశ్నార్థకమే.
“యౌవ్వనంలో మనమే కష్టాల్లోకి దూకుతాం. వృద్ధాప్యంలో కష్టాలే మనవైపుకు దూసుకువస్తాయి”. నిన్నటిదాకా ఎవరి సాయంతో అడుగులు వేయడం నేర్చామో, నేడు వారికి ఆసరాగా నడవాలి. మన తప్పులు సరిచేసి మనుషులుగా తీర్చిన వారికి నేడు మాట, చూపు సరిగా లేకపోవడంతో తోడుగా ఉండాలి. చిన్నప్పుడు లేచి నిలబడాలంటే భయపడిన మనకు ధైర్యం చెప్పిన పెద్దలు, ఇవాళ వృద్ధులు అయ్యి, నిలబడలేని స్థితిలో ఉంటే ఊతంగా వెన్నంటి ఉండాలి.
ఏమి చేతగాని స్థితి నుండి అన్నీ చేయగలను అనే స్థితికి కారకులైన పెద్దలు, ప్రస్తుతం ఏమీ చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మనమే తల్లీ, తండ్రీ కావాలి. పైన చెప్పినవన్నీ చేయాలంటే మనకు ముందు మనసుండాలి. చిరకాలం జీవించాలని అందరూ కోరుకుంటారు. ఎందుకో కాని ముసలివాళ్ళం అవ్వాలని మాత్రం ఎవరూ కోరుకోరు. ఎంత విచిత్రం’!. వృద్ధాప్యం గురించి షేక్స్పియర్ ఇలా అంటాడు – “అందరికీ చివరి అంకం. అద్భుతమైన చరిత్రకు చరమాంకం. మరోసారి వచ్చే బాల్యం, పళ్ళు, కళ్ళు, రుచి వంటివేమీ తెలియని స్థితి వృద్ధాప్యం” అని.
నేటి కాలంలో ముసలివారిని పట్టించుకొనే బిడ్డలు తక్కువ. ఆస్తిలో భాగానికి ముందుకొచ్చినవారే వృద్ధులైన తల్లిదండ్రులను సాకటానికి వెనుకంజ వేస్తున్నారు. మనుమలు, మనుమరాండ్రు సైతం చులకనభావంతో చూడడం మిక్కిలి బాధ కలిగించే విషయం. దూరప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసేవారు ఇంటివద్ద ఉండి వృద్ధులను చూసుకొనే మనసు లేక వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. వైద్య విషయంలో కూడా సరైన మందు, తిండి పెట్టడానికి తీరికలేని పిల్లలను కన్న ముసలివాళ్ళు వృద్ధాశ్రమాల్లో చేర్చబడటంలో తప్పేముంది. వాళ్ళని కనడం తప్ప.
ప్రశ్న 2.
“తీయని పలకరింపు” పాఠం ద్వారా ప్రస్తుతం సమాజంలో వృద్ధులు మన నుండి ఏం కోరుకుంటున్నారో తెల్పండి.
జవాబు:
ఆధునిక జీవితంలో కుటుంబ విలువలు, మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. ముసలివారిని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. వృద్ధుల అవసరాలు తీర్చడాన్ని, వారికి ఆత్మీయతను పంచడాన్ని పిల్లలు మరచిపోతున్నారు. వృద్ధులు తాము పెంచిన పిల్లలు తమపట్ల చూపుతున్న నిరాదరణనూ, తమ ఆవేదననూ ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఆప్యాయంగా పిలిచి మాట్లాడేవారు, నిజంగా మనిషికి కావాలి. ‘తీయటి పలకరింపు’ మనిషికి కావాలి.
తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో ప్రేమతో తమ గుండెలపై పెట్టుకొని పెంచుతారు. కడుపు కట్టుకొని పిల్లలకు తల్లిదండ్రులు కావలసినవి సమకూరుస్తారు. తమ వృద్ధాప్యంలో పిల్లలు తమను ఆదుకుంటారనే ఉద్దేశ్యంతో తమ సర్వస్వాన్ని. బిడ్డల కోసం వినియోగిస్తారు. అటువంటి ప్రేమజీవులను నిర్లక్ష్యం చేయడం, ముసలితనంలో పట్టించుకోకపోవడం వారికి తీవ్ర మనస్తాపాన్ని కల్గిస్తున్నాయి.
చివరి దశలో వారికి తిండి, బట్ట, గూడుతో పాటు బిడ్డల ప్రేమ పూర్వకమైన ఆదరణ, తీయని పలకరింపు కావాలి. కుటుంబ సభ్యులతో కలసిమెలిసి హాయిగా నవ్వుతూ సాగించే జీవనం కావాలి. “గతకాలమే బాగున్నదనిపించడం వృద్ధాప్యపు చిహ్నం”. కానీ ఉన్నంతకాలం వృద్ధులను బాగా చూసుకోవడం బిడ్డల కర్తవ్యం.
ప్రశ్న 3.
వృద్ధాప్యంలో మనుషులకు ఏం కావాలి ? కుటుంబ సభ్యులు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి ?
జవాబు:
వృద్ధాప్యంలో మనుష్యులకు ఉండడానికి ఇల్లు, కట్టుకోడానికి బట్ట, తినడానికి తిండి కావాలి. వయస్సులో ఉన్నప్పుడే మనుషులు వృద్ధాప్యానికి కావలసిన ఏర్పాటు చేసికోవాలి. వృద్ధాప్యంలో సామాన్యంగా మంచి ఆరోగ్యం ఉండదు. అందువల్ల మంచి వైద్య సదుపాయం కావాలి.
పైన చెప్పిన వాటన్నింటితో పాటు బిడ్డల ప్రేమ పూర్వకమైన ఆదరణ, తీయని పలకరింపు కావాలి. వేళకు తగిన మితాహారం కావాలి. కుటుంబసభ్యులతో కలిసిమెలసి హాయిగా నవ్వుతూ సాగించే జీవనం కావాలి. ఆధ్యాత్మికమైన జీవనం కావాలి. వారు చదువుకోడానికి దైవ సంబంధమైన సాహిత్యం కావాలి.
భారత, భాగవత, రామాయణ గ్రంథాలు కావాలి. నేటి కాలానికి అవసరమైన టీ.వీ., రేడియో, ఫోను వంటి సౌకర్యాలు వారికి కావాలి. కుటుంబ సభ్యులు, వృద్ధులను ప్రేమగా, ఆప్యాయతతో పలుకరిస్తూ వారి అవసరాలను అడిగి తెలుసుకోవాలి. మధ్యమధ్య వారిని డాక్టర్ల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలి. వారికి ముఖ్యావసరమయిన మందులను అందివ్వాలి. వృద్ధులను వృద్ధాశ్రమాలలో చేర్చక, తమతోపాటే కలో గంజో వారు త్రాగే ఏర్పాట్లు చేయాలి. వృద్ధులకు ముఖ్యంగా కావలసిన ప్రేమాదరాలను కుటుంబ సభ్యులు వారికి పంచి ఇవ్వాలి.
ప్రశ్న 4.
వృద్ధులైన నాయనమ్మ, తాతయ్యల అవసరాలు తీర్చడానికి నీవు ఏయే పనులు చేస్తావో సొంతమాటల్లో రాయుము.
జవాబు:
“నీవు వృద్ధుడిగా ఎదగవు, ఎదగటం మానివేసినప్పుడు వృద్ధుడవు అవుతావు” అన్నాడొక పెద్దాయన. వయసుతో పాటు మానసిక పరిణతి సాధిస్తే వృద్ధాప్యం శాపం కాదు. మనం గమనిస్తే లోకంలో కొందరు పుట్టుకతోనే వృద్ధుల్లా, మరికొందరు వృద్ధాప్యం వచ్చినా యువకుల్లా జీవిస్తారు. దీనినిబట్టి సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నంతకాలం అందరూ యువకులే అన్న సంగతి మరచిపోకూడదు.
వృద్ధులైన తాతయ్య, నాయనమ్మలు కోరుకునేది మన నుండి కాస్త ప్రేమాభిమానాలే. బాల్యంలో మన తల్లిదండ్రులు, తాతమామ్మలు మనకు ఎలా సేవలు చేసారో అవి మరచిపోకూడదు. తాత మామ్మలు ముసలితనం వల్ల వారి పనులు వారు చేసుకోలేరు. కనుక అవి గమనించి సమయానికి తగినట్లు వారికి కావల్సినవి సమకూరుస్తాను. అల్పాహారం, భోజనం, మందులు ఇలా కావల్సినవి అందిస్తాను.
మానసిక ప్రశాంతత కోసం రామాయణ, భారత, గీత వంటి పుస్తకాలు ఇచ్చి వారికి సంతోషం కలిగిస్తాను. వారికి ఏమీ తోచనపుడు అలా బయటకు తీసుకువెళ్ళి, వారి చిన్ననాటి సంగతులను గుర్తుకు వచ్చేట్లు చేస్తాను. బడికి వెళ్ళేముందు, వచ్చిన తర్వాత ఖాళీ సమయాన్ని వారికే కేటాయిస్తాను. చిన్నవయసులో వారు నాకు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ వారిపట్ల గౌరవభావంతో ఉంటాను. ముసలితనం వారికి శాపంలాగా కాక సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను.
PAPER – I : PART – B
భాషాంశాలు – పదజాలం :
I. సొంతవాక్యాలు:.
అ) ఈ కింది పదాలకు సొంతవాక్యాలు రాయండి.
1. ఆత్మీయత : రామునిపట్ల భరతుని ఆత్మీయతకు లక్ష్మణుడు ఆశ్చర్యపడ్డాడు.
2. నిర్లక్ష్యం : అహింస పేరుతో దుర్మార్గుల పట్ల నిర్లక్ష్యం చేస్తే శాంతిభద్రతలు దెబ్బతింటాయి.
3. ఆదరాభిమానాలు : కళల పట్ల ఆదరాభిమానాలు రాజులు చూపించేవారు.
4. భయభక్తులు : విద్యపట్ల భయభక్తులు కలిగి విద్య నభ్యసించాలి నిర్లక్ష్యం వద్దు.
5. న్యాయాన్యాయాలు : దోషం చేసిన వారిపట్ల ఆత్మీయత చూపిస్తే న్యాయాన్యాయాలు సరిగా నిర్ణయించలేరు.
6. కష్టసుఖాలు : తెలంగాణ ఉద్యమంలో K.C.R. కి తాము పొందిన కష్టసుఖాలకంటే ప్రజల ఆదరాభిమానాలు సంతృప్తి నిచ్చాయి.
7. సంప్రదింపులు : ఒక ప్రాజెక్టు కట్టాలంటే వివిధ శాఖలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి.
8. పీడవదలు : ఆంగ్లేయుల పీడవదలిందను కొంటే, నల్లధనం పీడ భారత్ను పట్టుకుంది.
II. ఆరాలు:
ప్రశ్న 1.
“మననం చేసుకొను” అంటే అర్థం
A) గుర్తుకు తెచ్చుకొను
B) స్వంతం చేసుకొను
C) మనసుకు తెచ్చు
D) మరల వచ్చు
జవాబు:
A) గుర్తుకు తెచ్చుకొను
ప్రశ్న 2.
విచారపడు – అనే అర్థం గల పదం
A) ముందుకు వచ్చు
B) వాపోవు
C) వావిరిపోవు
D) వదరుపోవు
జవాబు:
B) వాపోవు
ప్రశ్న 3.
అర్జునుని విషాదము శ్రీకృష్ణుడు పోగొట్టెను – గీత గీసిన పదానికి అర్థం
A) విప్లవము
B) ఆలోచన
C) దుఃఖము
D) విషయము
జవాబు:
C) దుఃఖము
ప్రశ్న 4.
“స్వజనము” అంటే అర్థం
A) స్వరాజ్యము
B) తనవారు
C) సొంతప్రజలు
D) మనస్సులో మాట
జవాబు:
B) తనవారు
ప్రశ్న 5.
పెన్నుపారేసి వాళ్ళమ్మకు తెలియకుండా గోప్యంగా ఉంచాడు – గీత గీసిన పదానికి అర్థం
A) గోపికగా
B) తక్కువగా
C) రహస్యంగా
D) చెప్పకుండా
జవాబు:
C) రహస్యంగా
ప్రశ్న 6.
పరిశ్రమలు నెలకొల్పు చోట నీరుండాలి – గీత గీసిన పదానికి అర్థం
A) స్థాపించు
B) ప్రారంభించు
C) ఉన్నచోట
D) నెలవారిగా
జవాబు:
A) స్థాపించు
ప్రశ్న 7.
సర్వీసులో ఉండగా చాలా జోరుగా ఉండేది – గీత గీసిన పదానికి అర్థం
A) జోజో
B) హుషారు
C) హాయి
D) నిరుత్సాహం
జవాబు:
B) హుషారు
ప్రశ్న 8.
ఆనాటి ఆదరాభిమానాలు ఇప్పుడు కనబడవని వాపోతారు – గీత గీసిన పదానికి అర్థం
A) సంతోషిస్తారు
B) నవ్వుతారు
C) విచారిస్తారు
D) ఏడుస్తారు
జవాబు:
C) విచారిస్తారు
ప్రశ్న 9.
తన తల్లిదండ్రుల స్మృత్యర్థం ఈ నిలయాన్ని నెలకొల్పారు – గీత గీసిన పదానికి అర్థం
A) జ్ఞాపకంగా
B) కలగా
C) దైవంగా
D) ఇష్టంగా
జవాబు:
A) జ్ఞాపకంగా
ప్రశ్న 10.
ఇంక స్వంతిల్లేమిటి ? స్వజనమేమిటి? గీత గీసిన పదానికి అర్థం
A) అందరివారు
B) ఎవరికి వారు
C) పరాయివారు
D) తనవారు
జవాబు:
D) తనవారు
III. ప్రకృతి, వికృతులు:
ప్రశ్న 1.
ఆశ్చర్యము – అనే పదానికి వికృతి
A) అశచర్యము
B) అచ్చెరువు
C) ఆచ్ఛరం
D) ఆసుచర్య
జవాబు:
B) అచ్చెరువు
ప్రశ్న 2.
“సాయం” అనే పదానికి ప్రకృతి
A) సహాయం
B) సాయంకాలం
C) సరియగు
D) శయనం
జవాబు:
A) సహాయం
ప్రశ్న 3.
“మౌనం” అంటే పండుగ గుర్తుకు వస్తోంది – గీతగీసిన పదానికి ప్రకృతి
A) భోషాణం
B) భోగి
C) భోజనము
D) భోగం
జవాబు:
B) భోగి
ప్రశ్న 4.
కింది వానిలో సరియైన ప్రకృతి-వికృతి కానిది.
A) హంస-అంచ
B) న్యాయం-నెయ్యం
C) సంతోషం సంతసం
D) సన్యాసి – సన్నాసి
జవాబు:
B) న్యాయం-నెయ్యం
ప్రశ్న 5.
బంధం – అనే పదానికి వికృతి
A) బందువు
B) బందుగు
C) బందం
D) బందు
జవాబు:
C) బందం
ప్రశ్న 6.
ఈ కింది వానిలో సరియైన ప్రకృతి-వికృతి కానిది
A) ప్రకృతి – పగిది
B) అనాథ – అనది
C) మతి – మది
D) వీధి – ఈది
జవాబు:
D) వీధి- ఈది
ప్రశ్న 7.
మతి స్థిరం లేదు – గీత గీసిన పదానికి ప్రకృతి
A) యతి
B) మది
C) బుద్ధి
D) మనస్సు
జవాబు:
B) మది
ప్రశ్న 8.
వృద్ధులూ, అనాథలూ, పేదవారూ స్థిరవాసం భజన్లాల్ నిలయం – గీత గీసిన పదానికి వికృతి
A) అనాద
B) అనిద
C) అనది
D) అనాది
జవాబు:
C) అనది
ప్రశ్న 9.
తన గది తలుపు వీథి వరండాలోకే ఉంది – గీత గీసిన పదానికి వికృతి
A) వీది
B) బజారు
C) వాడ
D) వసారా
జవాబు:
A) వీది
ప్రశ్న 10.
ప్రకృతి వన్నెచిన్నెలు వర్ణించటానికి ఎవరి తరం – గీత గీసిన పదానికి వికృతి
A) ప్రకతి
B) పగద
C) పకిత
D) పగిది
జవాబు:
IV. పర్యాయపదాలు :
ప్రశ్న 1.
పెళ్ళి – అనే పదానికి పర్యాయపదాలు
A) పరిణయము, వివాహము
B) పాణిగ్రహణం, తలంబ్రాలు
C) గాంధర్వము, పాదపీడనం
D) కల్యాణ కంకణం, కరచాలనం
జవాబు:
A) పరిణయము, వివాహము
ప్రశ్న 2.
రాముని భార్య సీత – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అర్ధాంగి, పార్వతి
B) ఆలు, ఇల్లాలు, పత్ని
C) వివాహిత, ఉత్తమురాలు
D) సంస్కృతి, సంస్కారి
జవాబు:
B) ఆలు, ఇల్లాలు, పత్ని
ప్రశ్న 3.
హరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యం విడిచిపెట్టాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సత్యం, సత్యవతి
B) న్యాయం, ధర్మం
C) నిజము, ఋతము, నిక్కం
D) దానము, దయ
జవాబు:
C) నిజము, ఋతము, నిక్కం
ప్రశ్న 4.
తరువు, మహీజం – అనే పర్యాయపదాలుగా గల పదం
A) సూర్యుడు
B) కాండం
C) కొమ్మ
D) వృక్షం.
జవాబు:
D) వృక్షం
ప్రశ్న 5.
జలం, సలిలం అనే పర్యాయపదాలుగా గల పదం
A) కప్పం
B) అప్పనం
C) నీరు
D) సూర్యుడు
జవాబు:
C) నీరు
ప్రశ్న 6.
రజని, నిశ, నిశీధి, రేయి – అనే పర్యాయపదాలు గల పదం
A) నీరు
B) రాత్రి
C) నిప్పు
D) సూర్యుడు
జవాబు:
B) రాత్రి
ప్రశ్న 7.
“ఆవాసం” అనే పదానికి పర్యాయపదాలు
A) స్థానం, నెలవు, ఉండుచోటు
B) ఉనికి, మనికి
C) ప్రవాసం, నివాసం
D) ఇల్లు, ప్రాంగణం
జవాబు:
A) స్థానం, నెలవు, ఉండుచోటు
ప్రశ్న 8.
నా సంతోషం అంబరం అంటింది గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ఆకాశం, గగనం, మిన్ను
B) ఖం, మేఘం, ఓఘం
C) విహయసం, స్వర్గం
D) వినువీధి, నడివీధి
జవాబు:
A) ఆకాశం, గగనం, మిన్ను
ప్రశ్న 9.
కాలం – అనే పదానికి సరియైన పర్యాయపదం
A) సాహసం
B) సమయం
C) నిర్ణయం
D) క్రమం
జవాబు:
B) సమయం
ప్రశ్న 10.
బంధువులు, బందుగులు, చుట్టలు – పర్యాయపదాలుగా గల పదం
A) స్వజనం
B) చుట్టాలు
C) మిత్రులు
D) పరివారము.
జవాబు:
B) చుట్టాలు
ప్రశ్న 11.
నీ మాటలోనూ నిజం లేకపోలేదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ధర్మం, న్యాయం
B) సత్యం, నిక్కం
C) ఋతం, వృత్తం
D) నిప్పు, ఉప్పు
జవాబు:
B) సత్యం, నిక్కం
ప్రశ్న 12.
దేహి అన్నవాళ్ళకు లేదనకుండా శక్తి కొద్దీ చేసాను – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సత్తువ, బలం
B) సత్తు, బలగం
C) భారం, బలుపు
D) బరువు, బలహీనం
జవాబు:
A) సత్తువ, బలం
V. నానార్థాలు :
ప్రశ్న 1.
ఒక పర్వం పేరు, ప్రయత్నము, కొలువు – అనే నానార్థాలు గల పదం
A) ఉద్యమం
B) ఉద్యోగం
C) యుద్ధము
D) అరణ్యము
జవాబు:
B) ఉద్యోగం
ప్రశ్న 2.
మైత్రి, నూనె (తైలం) – అనే నానార్థాలు గల పదం
A) స్నేహం
B) కారణం
C) చైతన్యం
D) సౌజన్యం
జవాబు:
A) స్నేహం
ప్రశ్న 3.
భాగవతంలో హరి భక్తుల కథలు ఉంటాయి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) విష్ణువు, సింహం, కోతి
B) శివుడు, బ్రహ్మ
C) గుఱ్ఱము, దొంగ
D) హరిదాసు, హరికథ
జవాబు:
A) విష్ణువు, సింహం, కోతి
ప్రశ్న 4.
ఉద్యోగులు ఎల్లకాలం పదవిలో ఉండలేరు కదా ! – గీత గీసిన పదానికి నానార్థాలు
A) తాడి, కొబ్బరి
B) సమయం, నలుపు
C) చావు, పుట్టుక
D) నాలిక, నలుపు
జవాబు:
B) సమయం, నలుపు
ప్రశ్న 5.
సభలకు పెద్ద ఉద్యోగి భార్యగా అధ్యక్షత వహిస్తుంది – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఇల్లు, ఇల్లాలు
B) పరిషత్తు, దుకాణం
C) పరిషత్, ఇల్లు
D) జూదం, మందు
జవాబు:
C) పరిషత్, ఇల్లు
VI. వ్యుత్పత్యర్థములు :
ప్రశ్న 1.
“పున్నామ నరకం నుండి రక్షించువాడు” అనే వ్యుత్పత్తి గల పదం
A) విష్ణువు
B) పుత్రుడు
C) హనుమంతుడు
D) పాము
జవాబు:
B) పుత్రుడు
ప్రశ్న 2.
“జానువుల (మోకాళ్ళ) వరకు పొడవైన చేతులు కలవాడు” అనే వ్యుత్పత్తి గల పదం
A) దీర్ఘదేహుడు
B) ఆజానుబాహుడు
C) స్ఫురద్రూపి
D) అందగాడు
జవాబు:
B) ఆజానుబాహుడు
ప్రశ్న 3.
“గంగాధరుడు” – అనే పదానికి వ్యుత్పత్తి
A) గంగ ధరించినది (శివుడు)
B) గంగను శిరస్సుపై ధరించినవాడు (శివుడు)
C) గంగకు ధరుడు (శివుడు)
D) గంగ శిరసు నుండి జారినవాడు (శివుడు)
జవాబు:
B) గంగను శిరస్సుపై ధరించినవాడు (శివుడు)
ప్రశ్న 4.
చెలిమి కలవాడు – అనే వ్యుత్పత్తి గల పదం
A) స్నేహితుడు
B) ఆత్మీయుడు
C) హితుడు
D) సన్నిహితుడు
జవాబు:
A) స్నేహితుడు
ప్రశ్న 5.
జగము దీనియందు లయము పొందును – అనే వ్యుత్పత్తి గల పదం
A) తుపాను
B) వరద
C) ప్రళయం
D) సునామి
జవాబు:
B) వరద
PAPER – II : PART – A
అపరిచిత గద్యాలు
ప్రశ్న 1.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
‘బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే, మనకు ముందు స్ఫురించేది బ్రౌను నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌను ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి రచించిన కాశీయాత్ర గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.
జవాబు:
ప్రశ్నలు :
- తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం ?
- బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు ?
- పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి ?
- నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది ?
- కాశీయాత్రను గురించి పుస్తకము రచించినదెవరు ?
ప్రశ్న 2.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
విజ్ఞానశాస్త్రం ఎంతో పెరిగింది. దానివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది. దాని ఫలితంగా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నీ సాహిత్య ప్రక్రియల్లో కనపడుతూ ఉంటాయి. సామాన్య మనుషుల జీవితం, వాళ్ళ జీవితంలో సమస్యలు చిత్రించి, పరిష్కారం సూచించడమే సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని అనే భావం ఏర్పడింది. అందువల్ల సాహిత్యం ఇదివరకటిలాగా పండితులకు, జమీందారులకు పరిమితం కాదు.
సాహిత్యం కేవలం చదివి ఆనందించడానికే అన్న అభిప్రాయాలు మారిపోయాయి. సామాన్యులలోకి సాహిత్యం వచ్చేసింది. అందుకు అనువైన ప్రక్రియలే కథానిక, నాటిక, ప్రహసనం, నవల మొదలైనవి. అందుకే వీటిలోని భాష వినగానే అర్థమయ్యేటంతగా సరళంగా ఉండటం ప్రధాన లక్షణమైంది. అంతేకాక రోజువారీ జీవితంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాషే ‘వ్యావహారికం’ అనే పేరున ఒక స్పష్టమైన రూపంతో పత్రికల వల్ల బాగా ప్రచారం అయింది.
ముఖ్యంగా నాటకాల్లో, నాటికల్లో కథ అంతా పాత్రల సంభాషణ ద్వారానే జరుగుతుంది కనుక, ఆయా పాత్రలకు ఉచితమైన భాష ఆయా పాత్రల చేత పలికించడం అనేది ముఖ్యమైన లక్షణమైంది. ఉదాహరణకి, ఒక నాటికలో ఏమీ చదువుకోని ఒక పల్లెటూరి మనిషి గ్రాంథికభాషలో సంభాషణ జరిపినట్లు రచయిత రాస్తే ఆ నాటిక లక్ష్యమే దెబ్బతిని హాస్యాస్పదం అవుతుంది.
జవాబు:
ప్రశ్నలు :
- దేనివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది ?
- సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని ఏమిటి ?
- భాషకు ప్రధాన లక్షణం ఏమిటి ?
- వ్యావహారికం అంటే ఏమిటి ?
- నాటకాల్లో, నాటికల్లో వాడే భాషకు ముఖ్యమైన లక్షణమేది ?
ప్రశ్న 3.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష, విషయం కోసం భాష, భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటినీ అధ్యయనం చెయ్యడం రెండో రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది.
ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రమాణ భాష, సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికీ ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచనా, అలవాట్లూ ఆ కాలంనాటి భాషలోనే సాగుతుంటాయి కనుక. ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.
జవాబు:
ప్రశ్నలు :
- భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము ?
- భాష ఎన్ని రకాలుగా తయారయింది ?
- ప్రాచీన భాష ఎందుకు ఉపయోగిస్తుంది ?
- ఆధునిక భాష ఉపయోగం ఏమిటి ?
- ఏ భాష ప్రయోజనం పరిమితం ?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
‘వృద్ధులను నిర్లక్ష్యం చేయరాదు’ దీనిపై మీ అభిప్రాయం తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి. (లేదా) వృద్ధాప్యంలో ఉన్నవారి పట్ల ఆదరణ చూపవలసిన అవసరాన్ని తెలియపరుస్తూ నీ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:
లేఖ
పాల్వంచ,
X X X X.
ప్రియమిత్రుడు నరసింహమూర్తి,
నేను క్షేమం, నీవు క్షేమమని తలుస్తాను. ఇటీవల పత్రికల్లో ఎక్కువగా ఇంటినుండి వెళ్ళగొట్టబడిన తల్లిదండ్రుల కథనాలు వస్తున్నాయి. ఆ విషయం నీతో పంచుకుందామని ఈ ఉత్తరం రాస్తున్నాను.
‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ .” అని అంటారు కదా ! కని, పెంచి, తనంత వారిని చేసిన తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ప్రవర్తించాల్సింది ఇలానేనా ? అవసరాలు తీరే దాకా ఆప్యాయతలు, ఆ తర్వాత ? సిగ్గుపడాల్సిన స్థితి, వయసులో ఉన్నప్పుడు తమకోసం కన్నా బిడ్డల కోసమే బ్రతికిన పెద్దలు, వాళ్ళ కొరకు ఆ బిడ్డలు ఏమీ చేయలేరా ? వీళ్ళకు అంత అడ్డమై పోయారా ? వృద్ధాశ్రమాల్లో చేర్చడానికి. వృద్ధాప్యం అంటే మళ్ళీ బాల్యమే. బాల్యంలో మనకు వారు చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కృతజ్ఞతతో వారిపట్ల ప్రవర్తించాలన్న కనీస బాధ్యత లేనప్పుడు మనిషికి, రాయికి తేడా ఏముంది. ఉపన్యాసాలు, గొప్పలు చెప్పేవాళ్ళే కాని కూడు పెట్టేవాళ్లు నూటికో కోటికో ఒక్కరు. అల్పాహారం, భోజనం, అవసరమైతే మందుబిళ్ళలు ఇవన్నీ ఆప్యాయంగా అందిస్తే నీ సొమ్మేమైనా పోతుందా ? ఈ మాత్రం ప్రజలు ఆలోచించలేరా ? వీళ్ళకు వృద్ధాప్యం రాదా ? వీళ్ళ పిల్లలు వీరిని కూడా ఆ విధంగానే చూసినపుడు ఆ బాధ తెలుస్తుందేమో. ఈ ఊహ కూడ కలుగదేమో ? ఏది ఏమైనా దైవ స్వరూపులైన అమ్మానాన్నల పట్ల ఎవరూ ఇలా ప్రవర్తించకూడదు. నీవేమంటావు. నా మాటలు నీకు నచ్చాయా. ఉంటాను.
ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. ఫణిరామ్.
చిరునామా :
యస్. నరసింహమూర్తి,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
మంచిర్యాల.
ప్రశ్న 2.
తల్లిదండ్రులు దైవంతో సమానమనే భావంతో కవిత రాయండి.
జవాబు:
అమృతం పంచే దేవతలు,
కంచిభొట్ల ఫణిరామ్
బిడ్డ ప్రాణ దీపానికి చమురు పోసేది తల్లి.
వేలు పట్టి లోకాన్ని చూపెట్టేది తండ్రి.
తప్పటడుగు వేసినా, తప్పులు చేసినా
చిరునవ్వుతో దిద్దే అమ్మానాన్నలు
అమృతం పంచే దేవతలు.
PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణం
కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
I. సంధులు:
ప్రశ్న 1.
లక్షలార్జించు – సంధి విడదీసి రాయగా
A) లక్ష + లార్జించు
B) లక్ష + ఆర్జించు
C) లక్షలు + ఆర్జించు
D) లక్షలా + ర్జించు
జవాబు:
C) లక్షలు + ఆర్జించు
ప్రశ్న 2.
ఊళ్ళు + ఏలిన కలిపి రాయగా
A) ఊళ్ళేలిన
B) ఊళ్ళు ఏలిన
C) ఊళ్ళుయేలిన
D) ఊరు వెళ్ళిన
జవాబు:
A) ఊళ్ళేలిన
ప్రశ్న 3.
వీలు + ఐతే – జరిగిన సంధికార్యము
A) అత్వసంధి
B) ఇత్వసంధి
C) ఉత్వసంధి
D) గుణసంధి
జవాబు:
D) గుణసంధి
ప్రశ్న 4.
లేదనక + ఉండ – లేదనకుండ – సంధినామం
A) అత్వసంధి
B) ఉత్వసంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) ఇత్వసంధి
జవాబు:
A) అత్వసంధి
ప్రశ్న 5.
అధ్యక్షత = అధి + అక్షత – ఇది ఏ సంధి ?
A) గుణసంధి
B) యణాదేశ సంధి
C) యడాగమ సంధి
D) ఇత్వసంధి
జవాబు:
B) యణాదేశ సంధి
ప్రశ్న 6.
ఈ కింది వానిలో సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ కానిది.
A) ఆదర + అభిమానాలు
B) నమస్ + తే
C) న్యాయ + అన్యాయాలు
D) ధన + ఆకాంక్ష ఉదాహరణ ?
జవాబు:
B) నమస్ + తే
ప్రశ్న 7.
కూర + కాయలు, తల్లి + తండ్రులు – ఇవి ఏ సంధికి
A) సరళాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గసడదవాదేశ సంధి
D) నుగాగమ సంధి
జవాబు:
C) గసడదవాదేశ సంధి
II. సమాసాలు:
ప్రశ్న 1.
ఈ కింది వానిలో ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ కానిది.
A) ఆదరాభిమానాలు
B) తల్లిదండ్రులు
C) అన్యాయము
D) న్యాయాన్యాయాలు
జవాబు:
C) అన్యాయము
ప్రశ్న 2.
ద్విగు సమాసమునకు ఉదాహరణ
A) ఆజానుబాహువు
B) ఆరుగంటలు
C) నిమ్మచెట్టు
D) భయభక్తులు
జవాబు:
B) ఆరుగంటలు
ప్రశ్న 3.
“నిమ్మచెట్టు” – సమాసము పేరు
A) సంభావనా పూర్వపద కర్మధారయము
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
C) విశేషణ పూర్వపద కర్మధారయము
D) రూపక సమాసము
జవాబు:
A) సంభావనా పూర్వపద కర్మధారయము
ప్రశ్న 4.
“జానువుల వరకు వ్యాపించిన బాహువులు కలవాడు” – విగ్రహవాక్యమునకు సమాస రూపము
A) జానూబాహూ
B) ఆజానుబాహుడు.
C) జానువులు బాహువులు
D) జానుబాహుబలి
జవాబు:
B) ఆజానుబాహుడు.
ప్రశ్న 5.
న్యాయము కానిది – అన్యాయము – సమాసము పేరు
A) కాని సమాసము
B) ప్రథమా తత్పురుష
C) షష్ఠీ తత్పురుష
D) నఞ తత్పురుష
జవాబు:
D) నఞ తత్పురుష
ప్రశ్న 6.
ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ
A) అరవై ఏళ్ళు
B) ఒంటరి మనిషి
C) భయభక్తులు
D) జీవిత భాగస్వామి
జవాబు:
C) భయభక్తులు
ప్రశ్న 7.
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ
A) నిమ్మచెట్టు
B) ఆజానుబాహుడు
C) పదవీ విరమణ
D) పుత్రరత్నము
జవాబు:
B) ఆజానుబాహుడు
ప్రశ్న 8.
‘అధికారం చేత దర్పం’ – విగ్రహవాక్యాన్ని సమాసం’ చేయగా
A) అధిక దర్పం .
B) అధికారిక దర్పం
C) అధికార దర్పం
D) అధికమైన దర్పం
జవాబు:
C) అధికార దర్పం
III. అలంకారాలు :
ప్రశ్న 1.
తల్లివంటి ఇల్లు మనస్సు నొచ్చుకుంటుంది – ఇందులో అలంకారం
A) ఉపమా
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) అతిశయోక్తి
జవాబు:
A) ఉపమా
ప్రశ్న 2.
“గణగణ గంటలు గలగల గజ్జలు మ్రోగినవి” – ఈ వాక్యంలో గల అలంకారం
A) అంత్యానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) యమకము
D) ఉపమా
జవాబు:
B) వృత్త్యనుప్రాస
IV. ఛందస్సు :
ప్రశ్న 1.
చంపకమాలలో వచ్చు గణములు
A) మసజసతతగ
B) నజభజజజర
C) సభరనమయవ
D) నభరసజజగ
జవాబు:
B) నజభజజజర
ప్రశ్న 2.
ఉత్పలమాల పద్యానికి యతి ఎన్నవ అక్షరం ?
A) 14వ
B) 13వ
C) 12వ
D) 10వ
జవాబు:
D) 10వ
ప్రశ్న 3.
ప్రతిపాదంలో రెండవ అక్షరం
A) ప్రాస
B) యతి
C) ప్రాసయతి
D) లఘువు
జవాబు:
A) ప్రాస
V. వాక్యాలు :
ప్రశ్న 1.
“రచయిత్రుల చేత ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి.” – ఈ వాక్యాన్ని కర్తరి వాక్యంలోకి మార్చి రాయగా
A) రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి.
B) ఎన్నో వివరాలు రచయిత్రులు సేకరించారు.
C) వివరాలు అన్ని రచయిత్రులచేత సేకరించారు.
D) వివరము సేకరించబడిన రచయిత్రులు
జవాబు:
B) ఎన్నో వివరాలు రచయిత్రులు సేకరించారు.
ప్రశ్న 2.
గోడల మీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి – ఇది ఏ వాక్యం ?
A) సామాన్య వాక్యం
B) కర్మణి వాక్యం
C) కర్తరి వాక్యం
D) ఆశ్చర్యార్థక వాక్యం
జవాబు:
B) కర్మణి వాక్యం
ప్రశ్న 3.
దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం – ఇది ఏ వాక్యం ?
A) కర్తరి వాక్యం
B) కర్మణి వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
A) కర్తరి వాక్యం
ప్రశ్న 4.
శరత్ ఇంటికి వచ్చి, కాళ్ళు చేతులు కడుక్కొని, అన్నం తిన్నాడు – ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) సంశ్లేష వాక్యం
C) కర్మణి వాక్యం
D) సంక్లిష్ట వాక్యం
జవాబు:
D) సంక్లిష్ట వాక్యం
ప్రశ్న 5.
భారతి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. భారతి చాలా ప్రదర్శనలు ఇచ్చింది – సంక్లిష్ట వాక్యంలోకి మార్చగా
A) భారతి కూచిపూడి నాట్యం నేర్చుకుంది కాని చాలా ప్రదర్శనలు ఇచ్చింది.
B) భారతి కూచిపూడి నాట్యంతో చాలా ప్రదర్శనలు ఇచ్చేది.
C) భారతి కూచిపూడి నాట్యం నేర్చుకొని చాలా ప్రదర్శనలు ఇచ్చింది.
D) భారతి కూచిపూడి నాట్యం నేర్చుకుంది మరియు ప్రదర్శనలు ఇచ్చింది.
జవాబు:
C) భారతి కూచిపూడి నాట్యం నేర్చుకొని చాలా ప్రదర్శనలు ఇచ్చింది.