These TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 1st Lesson Important Questions ధర్మార్జునులు
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘ధర్మార్జునులు’ పాఠం ఆధారంగా రాజుకు ఉండవలసిన ఐదు లక్షణాలు తెల్పండి.’
జవాబు:
“యథా రాజా తథా ప్రజాః” – రాజు ఎట్లా ఉంటే, ప్రజలు. అట్లే ఉంటారు. ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ, ప్రజారంజకమైన విధానాలతో ధర్మపరిపాలన అందించాడు. ప్రస్తుత పాఠం ఆధారంగా రాజుకు ఉండవలసిన
లక్షణాలు – అవి :
- ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి.
- దానగుణం కల్గి, పూర్తిస్థాయిలో చెయ్యాలి.
- ముఖప్రీతి మాటలుకాక మనస్ఫూర్తిగా మాట్లాడాలి.
- ప్రజల సంపదను చూసి అసూయపడకూడదు.
- రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేయాలి.
- కోపం కొంచెం కూడా ఉండకూడదు.
- మంచి చెడులను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
- ఆడంబరాలు లేని స్థిరస్వభావం ఉండాలి.
ప్రశ్న 2.
ఒక కుటుంబంలోని అన్నదమ్ములు ఎలా ఉండాలి ?
జవాబు:
అరమరికలు లేని అన్నదమ్ములు ఆణిముత్యాలు. సోదర ప్రేమకు నిలువుటద్దం రామాయణభారతాలు. శ్రీరాముడు సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల పట్ల భ్రాతృప్రేమను చాటాడు. అలాగే రాముని పట్ల మిగిలినవారు అంతటి సోదరభావాన్ని ప్రదర్శించారు. అట్లాగే భారతంలోని పాండవులు స్నేహము, భక్తి, సహనం కలిగి, చిన్నా పెద్దా అనే తేడాలు చూసుకుంటూ, ఒకరిమాట ఒకరు పాటిస్తూ అందరూ ఒకే మనస్సుతో పనులు చేస్తూ, అన్యోన్య ప్రేమతో ప్రవర్తించేవారు.
కుటుంబంలోని అన్నదమ్ములు శ్రీరాముని సోదరులను, పాండవులను ఆదర్శంగా తీసుకోవాలి. ఒద్దిక కలవారై ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మెలగాలి.
ప్రశ్న 3.
చేమకూర వేంకట కవి కవితా శైలిని గూర్చి రాయండి.
జవాబు:
చేమకూర వేంకట కవి భారత కథలో అవసరమైన చక్కని మార్పులు చేసి, “ప్రతిపద్య చమత్కారం”తో స్వతంత్ర కావ్యంగా “విజయ విలాసము” తీర్చిదిద్దాడు. ఈ ప్రబంధం రఘునాథ నాయకునికి అంకితమివ్వబడింది. ఈ కావ్యంలో శబ్దాలంకారాలు సొగసులతో, తెలుగు నుడికారాలతో, అందమైన శైలి, ప్రసన్న గంభీరమైన పద్యం నడక కనబడుతుంది.
విజయ విలాసంలో, చమత్కారం లేని ఒక్క పద్యం కూడా లేదని పేరుపొందాడు. ‘పిల్ల వసుచరిత్ర’ అనే ప్రశంసను పొందిన ఈ కావ్యం, తెలుగులోని పంచమహాకావ్యాలతో సరితూగగలదని విజ్ఞులు తలుస్తారు.
ప్రశ్న 4.
‘అతని నుతింపశక్యమె’ అని అర్జునుడిని గురించి వేంకటకవి అన్నాడు. అర్జునుడి గొప్పతనాన్ని వివరించండి.
జవాబు:
అర్జునుడు అన్నల విషయంలోనూ, తమ్ముళ్ళ విషయంలోనూ సమానంగా ప్రవర్తించే వాడనే పేరు పొందిన ఘనుడు. రాజులందరిలోనూ ఎక్కడా ఎదురులేనివాడని ప్రసిద్ధినీ, గొప్పతనాన్నీ పొందిన పరాక్రమశాలి. అర్జునుడు సాత్త్వికులు ప్రశంసించే, ధర్మప్రవర్తన కలవాడు.
అర్జునుడు అందంలో ఇంద్రుని కుమారుడు జయంతుని అంతటివాడు. దయా స్వభావంలో కృష్ణుడికి ప్రాణమిత్రుడు. యుద్ధ విజయాలలో శివుడితో పోటీపడే వీరుడు. ఈ భూమండలంలో అర్జునుడికి అర్జునుడే సాటియైనవాడు.
అర్జునుడు తేరిపార చూస్తే, శత్రుసైన్యం పారిపోడానికి సిద్ధం అవుతుంది. అర్జునుడు విల్లుఎత్తి పట్టుకోడానికి వంగితే శత్రువులు వీర స్వర్గం దారిపడతారు. అర్జునుడితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు ఈ లోకంలో శ్రీరాముడు తప్ప మరొకరు లేడు.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ధర్మరాజు పాలనతో, నేటి నాయకుల పాలనను పోల్చి రాయండి.
జవాబు:
ధర్మము తెలిసినవాడు ధర్మరాజు. ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, తాను సహితం ఆచరించేవాడు. శాంతము, దయ, సత్యము అనే సద్గుణాలు కలవాడు. మంచివారిని ఆదరించేవాడు. దానము చేయడంలో ఆసక్తి కలవాడు. ముఖప్రీతి కోసం మాట్లాడేవాడు కాడు. కోపం లేనివాడు. లోకువ చేసేవాడు కాడు.
అసూయ లేనివాడు. మెచ్చుకున్నప్పుడు తృప్తిగా ఇచ్చేవాడు. ఇలా కృతయుగ (సత్యకాలం) లక్షణాలతో విరాజిల్లే ధర్మరాజుతో నేటి నాయకుల పాలనను పోల్చడానికి మనసు రావడం లేదు, పెన్ను కదలడం లేదు.
ఆకలితో అలమటించేవారికి రూపాయి ఖర్చుపెట్టడానికి ఆలోచించే నేటి నాయకులు ఎన్నికలలో డబ్బును ఎన్ని రూపాల్లో పంచవచ్చో అలా పంచేస్తున్నారు. ఓటుకు నోటు ఇచ్చినవాడు తిరిగి మాట మీద నిలబడి మనకు మేలు చేస్తాడని నమ్మడం, ఓటు అమ్ముకోవడం మనం చేస్తున్న దోషాలు. నాణ్యత లేమి ప్రతి పనిలో కనబడుతుంది. ముందుచూపు లేని నాయకుల పాలనలో ప్రజలు ప్రకృతి బీభత్సాలకు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆవేశం కలిగిన నాయకులు ప్రజలకు అనర్థాలే కలిగిస్తున్నారు.
పెద్దల సభలలో వారి ప్రవర్తన జుగుప్స కల్గిస్తుంది. ముఖప్రీతి మాటలే చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చేటప్పుడు పత్రికల ముందు గొప్ప కోసం తప్ప తృప్తిగా ఇచ్చేది లేదు. ప్రభుత్వ పథకాలు అర్హులు అయిన వారికన్నా అనర్హులకే పొడుగు చేతుల పందేరం అవుతోంది. శాంతి, దయ, సత్యం, మత సహనం అనే లక్షణాలు నామమాత్రంగానే ఉన్నాయి.
గాంధీ వంటి మహాత్ముల పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నాయకులంతా దేశభక్తిని విడిచి భుక్తి మార్గం వెతుకుతున్నారు. తెల్లరంగు ఛాయలో తమ మలిన హృదయాలను దాచుకుంటున్నారు. త్యాగమూర్తుల ప్రబోధాలకు నీళ్ళొదులుతున్నారు. ఇది కచ్చితంగా కలికాలం. కష్టాల కాలమే.
PART – I : PART – B
భాషాంశాలు – పదజాలం :
1. సొంతవాక్యాలు :
1. సోయగం : చెరువు గట్టున ఉన్న మాయింటి సోయగం చూపులకే కాదు, మనస్సుకు హాయినిస్తుంది.
2. ఏవురు : స్నేహితులు నల్వురు ఏవురు వున్నా, మంచివారై ఉండాలని అమ్మ చెప్పింది.
3. కొంగుపసిడి : మా తాతయ్య మాయింటికే కాదు ఊరికే కొంగుపసిడి అని అంతా అంటారు.
4. సరాగము : మా ఉమ్మడి కుటుంబంలో సరాగము పండుగ రోజుల్లో కనబడుతుంది.
5. ప్రతిజోదు : మా తెలివితేటలకు ప్రతిజోదు మా మావయ్య అడిగే క్విజ్ ప్రశ్నలు.
6. అసూయపడు : ఎదుటివారి సంపదలకు అసూయపడితే నిద్ర రాదు, ఫలితం ఉండదు.
7. సౌజన్యం : ఆపదలు ఎదురైనప్పుడు మనిషిలో సౌజన్యం బయటపడుతుంది.
8. వన్నె, వాసిగాంచు : వన్నె, వాసిగాంచిన మహాపురుషుల గురించి, చిన్నప్పటి నుండి తెలుసుకొంటే మనకు లక్ష్యం ఏర్పడుతుంది.
9. శాంతి : ఎప్పుడూ బాధ లేకుండా ఉండటం ఎల్లప్పుడు మనము శాంతినే కోరుకోవాలి.
10. అసూయపడుట : ఈర్ష్యపడుట – పాండవుల ఐశ్వర్యానికి దుర్యోధనుడు అసూయపడ్డాడు.
11. వెలసిరి : అవతరించటం – విష్ణువు భక్త సంరక్షణార్థమై కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలసెను.
12. పుణ్యభూమి : గొప్పభూమి – ధర్మ పరిపాలనా తత్పరులు పాలించిన పుణ్యభూమి మనదేశం.
II. అర్థాలు:
అ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
ప్రశ్న 1.
శ్రీరాముడు దశరథుని తనూజుడు – గీత గీసిన పదానికి అర్థం
A) తండ్రి
B) కుమారుడు
C) వారసుడు
D) వంశకర్త
జవాబు:
B) కుమారుడు
ప్రశ్న 2.
“క్షితి” అంటే అర్థం
A) చితి
B) ఒక పక్షి
C) భూమి
D) రాజు
జవాబు:
ప్రశ్న 3.
“ఎడాటము” అనే పదానికి సరియైన అర్థం
A) పెంపకము
B) తడబాటు
C) విషయము
D) శ్రద్ధ
జవాబు:
C) విషయము
ప్రశ్న 4.
“ధర్మరాజు” అనే అర్థం వచ్చే పదం
A) అజయుడు
B) ధర్మ తనూజుడు
C) ఉద్ధతుడు
D) కోవిదుడు
జవాబు:
B) ధర్మ తనూజుడు
ప్రశ్న 5.
మనకు కొదవ లేనివి ప్రకృతి వనరులు గీత గీసిన పదానికి అర్థం
A) కొఱత
B) ధనము
C) మర్యాద
D) ఎక్కువ
జవాబు:
A) కొఱత
ప్రశ్న 6.
కలిమి గలనాడె దేవుని పూజింపుము – గీత గీసిన పదానికి అర్థం
A) బలము
B) ధాన్యము
C) భక్తి
D) సంపద
జవాబు:
D) సంపద
ప్రశ్న 7.
“జలధి” అనే పదానికి సరియైన అర్థం
A) వారధి
B) వారిధి
C) వారిజాతము
D) పారిజాతము
జవాబు:
B) వారిధి
ప్రశ్న 8.
“భూమి” అనే అర్థం వచ్చే సరియైన పదం
A) మిన్ను
B) చక్రము
C) వసుమతి
D) దానవుడు
జవాబు:
C) వసుమతి
ప్రశ్న 9.
సోదరులు – అనే అర్థం గల పదము
A) అనుజన్ములు
B) కుమార్తెలు
C) తనూజులు
D) తండ్రి, బాబాయి
జవాబు:
A) అనుజన్ములు
ప్రశ్న 10.
సత్త్వగుణం కలవారు – అనే అర్థం వచ్చే సరియైన పదం
A) సరసులు
B) సంపన్నులు
C) ధర్మరాజు
D) సాత్త్వికులు
జవాబు:
D) సాత్త్వికులు
ప్రశ్న 11.
ధర్మరాజు శాంతి, దయలనే ఆభరణాలుగా ధరించాడు – గీత గీసిన పదానికి అర్థం
A) గుణాలు
B) గుడ్డలు
C) నగలు
D) సుగంధాలు
జవాబు:
C) నగలు
ప్రశ్న 12.
పాండురాజు జ్యేష్ఠ కుమారుడు ధర్మరాజు – గీత గీసిన పదానికి అర్థం
A) చివరి
B) మధ్య
C) పెద్ద
D) ఆరంభం
జవాబు:
C) పెద్ద
ప్రశ్న 13.
ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టి – గీత గీసిన పదానికి అర్థం
A) చూపు
B) చాప
C) కోరిక
D) దిష్టి
జవాబు:
A) చూపు
ప్రశ్న 14.
మనుష్యులలో వ్యత్యాసం తెలిసినవాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ఎక్కువ
B) తేడా
C) తక్కువ
D) సమానం
జవాబు:
B) తేడా
ప్రశ్న 15.
యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు – గీత గీసిన పదానికి అర్థం
A) యాత్రికులు
B) అనాథలు
C) దానం కోరువారు
D) వీధిబాలలు
జవాబు:
C) దానం కోరువారు
ప్రశ్న 16.
లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే సుమా – గీత
A) అధికారం
B) పెత్తనం
C) అయిష్టం
D) అనుకూలం.
జవాబు:
D) అనుకూలం.
ప్రశ్న 17.
శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది – గీత గీసిన
A) ఇంటిదారి
B) వీరమరణం
C) సుఖం
D) నరకం
జవాబు:
B) వీరమరణం
ప్రశ్న 18.
యథా రాజా తథా ప్రజాః – గీత గీసిన పదానికి అర్థం
A) అట్లు
B) వలన
C) ఎట్లు
D) ఇట్లు
జవాబు:
A) అట్లు
III. పర్యాయపదాలు :
ప్రశ్న 1.
దేవతలు, దివిజులు, సురలు – అనే పర్యాయపదాలు గల పదము
A) దైత్యుతులు
B) అమరులు
C) భాసురులు
D) శ్రమణకులు
జవాబు:
B) అమరులు
ప్రశ్న 2.
ఎప్పుడూ పసిడి ధర ఎక్కువే – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) వెండి, బంగారం
B) నగలు, ప్లాటినం
C) పుత్తడి, పైడి, స్వర్ణము
D) సొమ్ములు, నగలు, ఆభరణాలు
జవాబు:
C) పుత్తడి, పైడి, స్వర్ణము
ప్రశ్న 3.
తనూజుడు పుట్టినప్పుడు కాక కుమారుడు ప్రయోజకుడైతే, ఆ సుతుని చూచి తండ్రి ఆనందపడతాడు. పై వాక్యంలో పర్యాయపదాలు ఉన్న పదం.
A) జనకుడు
B) ఆనందము
C) ప్రయోజనము
D) పుత్రుడు
జవాబు:
D) పుత్రుడు
ప్రశ్న 4.
పురము – అనే పదానికి పర్యాయపదాలు
A) పురము, పురహరుడు
B) పట్టణము, జనపదం
C) ప్రోలు, పట్టణము, నగరం
D) జనపదం, భాగ్యనగరం
జవాబు:
C) ప్రోలు, పట్టణము, నగరం
ప్రశ్న 5.
క్షితి – అనే పదానికి పర్యాయపదం కానిది.
A) భూమి
B) ధరణి
C) వసుమతి
D) పక్షి
జవాబు:
D) పక్షి
ప్రశ్న 6.
నరుడు, మానవుడు – అనే పర్యాయపదాలుగా గల పదం
A) మానిసి
B) ఉత్తముడు
C) దనుజుడు
D) కృష్ణుడు
జవాబు:
A) మానిసి
ప్రశ్న 7.
రాజు అనే పదానికి పర్యాయపదాలు
A) ఏలిక, ప్రభువు
B) ధనికుడు, రాజు
C) చంద్రుడు, రాజు
D) రాజనాలు, ప్రభువు
జవాబు:
A) ఏలిక, ప్రభువు
ప్రశ్న 8.
ఇల, మహి, వసుమతి – అనే పర్యాయపదాలు గల పదం
A) క్షితి
B) స్త్రీ
C) ధర్మము
D) అర్జునుడు
జవాబు:
A) క్షితి
ప్రశ్న 9.
మన మాటలో నిజం ఎదుటివాడికి వినబడాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నిజాయితీ, నైజం
B) ఋతము, సత్య
C) అనృతం, అమృతం
D) సత్తువ, సాపత్తి
జవాబు:
B) ఋతము, సత్య
ప్రశ్న 10.
“శత్రువు” అనే పదానికి పర్యాయపదాలు
A) వైరి, అరి, రిపుడు
B) విరోధం, పగ, విజితులు
C) మిత్రుడు, స్నేహితుడు, దోస్తు
D) వెన్నుజూపు, పాఱజూచు
జవాబు:
A) వైరి, అరి, రిపుడు
ప్రశ్న 11.
నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని తెలిసినవాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అబద్ధం, అసత్యం
B) సత్యం, ఋతం
C) ఋతం, ఋతం
D) నాసికం, కర్ణం
జవాబు:
B) సత్యం, ఋతం
ప్రశ్న 12.
అతని ముఖము పై చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) చెవులు, కాళ్ళు
B) ముక్కు చేతులు
C) ఆననం, ఆస్యం
D) నాసికం, కర్ణం
జవాబు:
C) ఆననం, ఆస్యం
ప్రశ్న 13.
సముద్రం ఈ భూమండలాన్ని ఆవరించియున్నది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సాగరం, రత్నాకరం
B) ఘోష, రొద
C) నదీనదం, వారిధి
D) సంగ్రామం, సంగరం
జవాబు:
A) సాగరం, రత్నాకరం
ప్రశ్న 14.
అయిదు దేవతా వృక్షాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ఋక్షం, చెట్టు
B) మహీరుహం, భూజం
C) భూగృహం, రంధ్రము, కాలము
D) మొక్క ఆకు
జవాబు:
B) మహీరుహం, భూజం
ప్రశ్న 15.
కృష్ణునికి ప్రాణమిత్రుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) రాముడు, భీముడు
B) విష్ణువు, ధనువు
C) కన్నయ్య, కన్నమ్మ
D) విష్ణువు, కిట్టయ్య
జవాబు:
D) విష్ణువు, కిట్టయ్య
ప్రశ్న 16.
శివునివలె యుద్ధ విజయాలలో పోటీపడే వీరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) శంకరుడు, విష్ణువు
B) కృష్ణుడు, రుద్రుడు
C) భవుడు, రుద్రుడు
D) బ్రహ్మ, ఈశ్వరుడు
జవాబు:
C) భవుడు, రుద్రుడు
ప్రశ్న 17.
తేరిపార చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోతుంది – గీసిన పదానికి పర్యాయపదాలు
A) దండు, సేన
B) దండ, సాన
C) సైనికులు, రైతులు
D) కార్మికులు, జాలరులు
జవాబు:
A) దండు, సేన
IV. నానార్థాలు:
ప్రశ్న 1.
ఆస్యమును ప్రతి ఉదయము, రాత్రి శుభ్రపరచుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నోరు, నాలుక
B) ముఖము, నోరు
C) చేతులు, ముఖము
D) వాకిలి, ఇల్లు
జవాబు:
B) ముఖము, నోరు
ప్రశ్న 2.
భాషను కాపాడతానని బాస చేస్తున్నాను- గీత గీసిన పదానికి నానార్థాలు
A) భాష, ప్రతిజ్ఞ
B) ఆజ్ఞ, వాణి
C) అధికారి, భాష
D) ఆధారము, అనుమతి
జవాబు:
B) ఆజ్ఞ, వాణి
ప్రశ్న 3.
దిశ, ఆశ్రయం (ఆధారం) – అనే నానార్థాలు గల పదం
A) వైపు
B) అరణము
C) దిక్కు
D) పర్ణశాల
జవాబు:
C) దిక్కు
ప్రశ్న 4.
మామిడి పళ్ళు ప్రియము – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఇష్టము, ప్రేమ
B) ప్రియమైనది, అధిక ధర
C) పులుపు, తీపి
D) పండు, కాయ
జవాబు:
B) ప్రియమైనది, అధిక ధర
ప్రశ్న 5.
ఇతడే మా ఏలిక, ఆకాశానికి చంద్రుడు ఇతడు – ఈ వాక్యంలో నానార్థాలు గల పదం
A) నక్షత్రము
B) శివుడు
C) దాత
D) రాజు
జవాబు:
D) రాజు
ప్రశ్న 6.
మరణం లేనివారు, దేవతలు – అను నానార్థాలు గల పదం
A) అమరులు
B) సురపానం
C) పుణ్యాత్ములు
D) పాండవులు
జవాబు:
A) అమరులు
ప్రశ్న 7.
“చౌక” అను పదానికి నానార్థాలు
A) వెల తక్కువ, చులకన
B) నాలుగు దారులు, చదరము
C) చవుక, ఆకాశము
D) చమత్కారము, చదరము
జవాబు:
A) వెల తక్కువ, చులకన
ప్రశ్న 8.
“ధర్మరాజు” అను పదానికి నానార్థాలు
A) ధర్మరాజు, అర్జునుడు
B) ధర్మరాజు, ధార్మికుడు
C) ధర్మరాజు, యముడు
D) ధర్మడు, అధర్ముడు
జవాబు:
C) ధర్మరాజు, యముడు
ప్రశ్న 9.
“మునుపు” అనే పదానికి సరియైన నానార్థాలు
A) నునుపు, పంపుట
B) మునులు, తపస్వినులు
C) ముందు, పూర్వము
D) ఎదురు, తిట్టు
జవాబు:
C) ముందు, పూర్వము
ప్రశ్న 10.
సాధుజనుల పట్ల ఆదరణ కల్గి ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సాధువులు, సన్యాసులు
B) మంచివారు, సాధువులు
C) నిదానం, నెమ్మది
D) మంచి, ధర్మం
జవాబు:
B) మంచివారు, సాధువులు
ప్రశ్న 11.
ధర్మరాజు ఆజ్ఞా పరిపాలన వ్రతుడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఉత్తరువు, ఉత్తరం
B) దండన, బెత్తం
C) ఉత్తరువు, దండన
D) ఉత్తరం, బెత్తం
జవాబు:
C) ఉత్తరువు, దండన
V. ప్రకృతి, వికృతులు :
ప్రశ్న 1.
ఆజ్ఞను కొందరు ఆనతి అంటారు – గీత గీసిన పదానికి వికృతి
A) అధికారం
B) ఆన
C) గుర్తు
D) ప్రతిన
జవాబు:
B) ఆన
ప్రశ్న 2.
“పురము”నకు సరియైన వికృతి పదము
A) వూరు
B) కాపురము
C) ప్రోలు
D) పూరణ
జవాబు:
C) ప్రోలు
ప్రశ్న 3.
మనస్సుకు భాష వస్తే కవిత్వం వస్తుంది గీత గీసిన పదానికి వికృతి పదం
A) భాస
B) బాస
C) బాష
D) బాసులు
జవాబు:
B) బాస
ప్రశ్న 4.
“దిష్టి” అనే పదానికి సరియైన వికృతి పదం
A) దూరము
B) అదృష్టం
C) దుష్టుడు
D) దృష్టి
జవాబు:
D) దృష్టి
ప్రశ్న 5.
ఈ కింది వానిలో ప్రకృతి – వికృతి సరిగా లేనిది
A) రాజు – తేడు
B) కీర్తి – కీరితి
C) వర్ణము – పర్ణము
D) కన్య – కన్నె
జవాబు:
C) వర్ణము – పర్ణము
ప్రశ్న 6.
“ధర్మము (ప్ర) – ధమ్మము (వి)” వీటిలో వికృతి పదం సరిగా లేదు. సరైన వికృతి
A) ధరమము
B) దమ్మము
C) దమము
D) ధరమ
జవాబు:
B) దమ్మము
ప్రశ్న 7.
“యోధుడు” – ప్రకృతి పదమునకు వికృతి
A) జోదు
B) యోద్ధ
C) యెద
D) ఎదిరి
జవాబు:
A) జోదు
ప్రశ్న 8.
అద్దములో మన రూపము చూడవచ్చు – గీత గీసిన పదానికి వికృతి
A) రూప్యము
B) రూపాయి
C) రూపు
D) రూపాలు
జవాబు:
C) రూపు
ప్రశ్న 9.
“కుమారుడు” అనే పదానికి వికృతి పదము
A) కొడుకు
B) కొమరుడు
C) కన్నయ్య
D) కుమారిత
జవాబు:
B) కొమరుడు
ప్రశ్న 10.
ఈ వస్త్రము వర్ణము బాగుంది – గీత గీసిన పదానికి వికృతి
A) పర్ణము
B) వర్ణి
C) తారు
D) వన్నె
జవాబు:
D) వన్నె
ప్రశ్న 11.
యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు – గీత గీసిన పదానికి వికృతి
A) పుత్రుడు.
B) సుతుడు
C) బొట్టె
D) కొమరుడు
జవాబు:
D) కొమరుడు
ప్రశ్న 12.
తన కీర్తి కాంతులను ప్రసరింపచేస్తూ ధర్మరాజు పాలించేవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) పేరు
B) ప్రతిష్ఠ
C) కీరితి
D) కొరతి
జవాబు:
C) కీరితి
ప్రశ్న 13.
సత్యమును రూపముగా కలవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) బలం
B) సత్తు
C) సత్వం
D) నిజం
జవాబు:
B) సత్తు
ప్రశ్న 14.
ధర్మమును అనుసరించువాడు ధర్మరాజు – గీత గీసిన పదానికి వికృతి
A) దమ్మం
B) దరమం
C) ధరమం
D) దమ్ము
జవాబు:
A) దమ్మం
ప్రశ్న 15.
విష్ణువు ఆయుధాలలో శార్జ్గవము ఒకటి – గీత గీసిన పదానికి వికృతి
A) విల్లు
B) కత్తి
C) సింగిణీ
D) సారగవము
జవాబు:
C) సింగిణీ
VI. వ్యుత్పత్త్యర్ధములు :
ప్రశ్న 1.
తన దేహము నుండి పుట్టినవాడు – వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) కొడుకు
B) తనూజుడు
C) దేహి
D) దేవత
జవాబు:
B) తనూజుడు
ప్రశ్న 2.
ధర్మనందనుడు – అను పదానికి సరియైన వ్యుత్పత్తి
A) ధర్మము మరియు నందనుడు
B) ధర్ముని కొరకు నందనుడు
C) యమధర్మరాజు యొక్క కొడుకు
D) నందనుడైన ధర్ముడు.
జవాబు:
C) యమధర్మరాజు యొక్క కొడుకు
ప్రశ్న 3.
“జలమునకు నిధి” అను వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) జలధి
B) జలజము
C) జలజాకరము
D) బావి
జవాబు:
A) జలధి
ప్రశ్న 4.
పాండవులు – అను పదానికి సరియైన వ్యుత్పత్తి
A) ధర్మభీమార్జునులు
B) పాండురాజు యొక్క కుమారులు
C) పాండవులు వేయిమంది
D) కౌరవులు కానివారు.
జవాబు:
B) పాండురాజు యొక్క కుమారులు
ప్రశ్న 5.
“నరులను పాలించువాడు” అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) నరనారాయణుడు’
B) చక్రవర్తి
C) నృపాలుడు
D) రాజు
జవాబు:
C) నృపాలుడు
ప్రశ్న 6.
అమరులు-అను పదానికి సరియైన వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) మరులు కొన్నవారు
B) స్వర్గములో ఉండువారు
C) మరణము లేనివారు
D) చెట్లు గల వారు వ్యుత్పత్తి అర్థము గల పదము
జవాబు:
C) మరణము లేనివారు
ప్రశ్న 7.
సంతోష పెట్టువాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) స్నేహితుడు
B) నందనుడు
C) సోదరుడు
D) భగవంతుడు
జవాబు:
B) నందనుడు
ప్రశ్న 8.
సత్యప్రధానమైన యుగము – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) కలియుగం
B) ద్వాపరయుగం
C) కృతయుగం
D) త్రేతాయుగం
జవాబు:
C) కృతయుగం
PAPER – II : PART – A
అపరిచిత పద్యాలు
1. క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి.
తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
ఖాళీలు
1) పాముకు విషం ………… లో ఉంటుంది.
జవాబు:
తల
2) వృశ్చికమనగా ………….
జవాబు:
తేలు
3) శరీరమంత విషం ……….. ఉంటుంది.
జవాబు:
ఖలునకు
4) పై పద్య మకుటం ………….
జవాబు:
సుమతీ
5) పై పద్యాన్ని రచించిన కవి ……..
జవాబు:
బద్దెన
2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.
ప్రశ్న 2.
పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.
ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.
ప్రశ్న 4.
ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.
ప్రశ్న 5.
ఈ పద్యం వల్ల ఏమి తెలుస్తోంది ?
జవాబు:
ఈ పద్యం వల్ల పల్నాటి సీమ పల్లెటూళ్ళ గురించి తెలుస్తోంది.
3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు.
ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
మానవులకు ఏం కావాలి ?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.
ప్రశ్న 2.
అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.
ప్రశ్న 3.
అక్షరము దేనిని రక్షిస్తుంది ?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షరాలు నేర్చుకో.’
ప్రశ్న 5.
ఈ పద్యంలో దేన్ని గురించి తెలియజేయబడింది?
జవాబు:
ఈ పద్యంలో ‘చదువు’ గురించి తెలియజేయబడింది.
4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
సుజనుడు ఎట్లా ఉంటాడు ?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.
ప్రశ్న 2.
మందుడు ఎలా ఉంటాడు ?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.
ప్రశ్న 3.
సుజనుని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.
ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారమేమి ?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.
ప్రశ్న 5.
ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిపద్యం’.
5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కలహపడునింట నిలువదు.
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !
ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
కలహపడే ఇంట్లో ఏం నిలువదు ?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.
ప్రశ్న 2.
కలకాలం ఎలా మెలగాలి ?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.
ప్రశ్న 3.
ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
జవాబు:
ఈ పద్యం కుమారీని సంబోధిస్తూ అంటే ఆడపిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.
ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం వద్దు’.
ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం కుమారీ శతకం లోనిది.
PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణం
కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
1. సంధులు:
ప్రశ్న 1.
భీమార్జునులు – సంధి విడదీస్తే
A) భీముడు + అర్జునుడు
B) భీ + మార్జునులు
C) భీమ + అర్జునుడు
D) భీముని + అర్జునుడు
జవాబు:
C) భీమ + అర్జునుడు
ప్రశ్న 2.
“జయ + పెట్టు” – గసడదవాదేశ సంధి చేయగా
A) జయము + వెట్టు
B) జయవెట్టు
C) జయము పెట్టు
D) జోతపెట్టు
జవాబు:
B) జయవెట్టు
ప్రశ్న 3.
పాండవాగ్రేసరుడు – సంధి విడదీయగా
A) పాండ + వాగ్రేసరుడు
B) పాండవాగ్ర + ఇసరుడు
C) పాండవాగ్రే + సరుడు
D) పాండవ + అగ్రేసరుడు
జవాబు:
D) పాండవ + అగ్రేసరుడు
ప్రశ్న 4.
“కన్యకాధిపతి”లో వచ్చు సంధి
A) యణాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యడాగమ సంధి
D) గుణసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 5.
“అర్ధికి + ఇచ్చు” – ఏ సంధి
A) ఇత్వ సంధి
B) అత్వ సంధి
C) యడాగమ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) ఇత్వ సంధి
ప్రశ్న 6.
వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు – గీత గీసిన పదానికి సంధి విడదీసి రాయండి.
A) అన్న + దమ్ములు
B) అన్నయు + తమ్ముడు
C) అన్న + తమ్ములు
D) అన్నా + దమ్ములు
జవాబు:
C) అన్న + తమ్ములు
ప్రశ్న 7.
“పంచ + ఆస్యము” అని విడదీయగా పూర్వ పరస్వరములు
A) చ + ఆ
B) అ + ఆ
C) పంచ + ఆస్యము
D) ఆ మరియు అ
జవాబు:
B) అ + ఆ
ప్రశ్న 8.
“సవర్ణదీర్ఘ సంధి”కి సరియైన ఉదాహరణ
A) అతనికి + ఇచ్చు
B) యడాగమ సంధి
C) పంచ + అమరతరులు
D) వాడు + ఉండెను
జవాబు:
C) పంచ + అమరతరులు
ప్రశ్న 9.
ఇచ్చకము + మెచ్చు – సంధి చేయగా వచ్చు సంధి
A) పుంప్వాదేశ సంధి
B) మేన + అత్త
C) ఉత్వ సంధి
D) లులనల సంధి
జవాబు:
A) పుంప్వాదేశ సంధి
ప్రశ్న 10.
య, వ, ర లు ఆదేశము వచ్చు సంధి పేరు
A) యడాగమ సంధి
B) యణాదేశ సంధి
C) గసడదవాదేశ సంధి
D) గుణసంధి
జవాబు:
B) యణాదేశ సంధి
ప్రశ్న 11.
త్రికములు అనగా
A) ఏ, ఓ, అర్
B) ఇ, ఉ, ఋ
C) ఆ, ఈ, ఏ
D) ఏ, ఐ, ఓ, ఔ
జవాబు:
C) ఆ, ఈ, ఏ
ప్రశ్న 12.
ఏ, ఓ, అర్ లను ఏమంటారు ?
A) త్రికములు
B) గుణములు
C) సరళములు
D) వృద్ధులు
జవాబు:
B) గుణములు
II. సమాసములు :
ప్రశ్న 1.
ధర్మార్జునులు – అను దానికి సరియైన విగ్రహవాక్యము
A) ధర్మము మరియు అర్జునుడు
B) ధర్మరాజు మరియు అర్జునుడు
C) ధర్మరాజు తమ్ముడైన అర్జునుడు
D) ధర్మర్జునులు మొదలైనవారు
జవాబు:
B) ధర్మరాజు మరియు అర్జునుడు
ప్రశ్న 2.
“ద్వంద్వ సమాసము”నకు ఉదాహరణ
A) రేపగలు
B) దయాభరణుడు
C) ధర్మనందనుడు
D) దోఃఖర్జులు
జవాబు:
A) రేపగలు
ప్రశ్న 3.
పంచాయుధములు, పంచాస్యములు – ఏ సమాసమునకు ఉదాహరణ ?
A) ద్వంద్వ సమాసము
B) విశేషణ పూర్వపద కర్మధారయము
C) ద్విగు సమాసము
D) రూపక సమాసము
జవాబు:
C) ద్విగు సమాసము
ప్రశ్న 4.
పాండు కుమారులు – అను పదమునకు విగ్రహవాక్యము రాయగా
A) పాండురాజు వలన కుమారులు
B) కుమారులగు పాండవులు
C) పాండవులును, కుమారులును
D) పాండురాజు యొక్క కుమారులు
జవాబు:
D) పాండురాజు యొక్క కుమారులు
ప్రశ్న 5.
కృప అనెడు రసము – అనే విగ్రహవాక్యాన్ని సమాసము చేయగా
A) కృపకు రసము
B) కృపతో రసము
C) కృపాభావము
D) కృపారసము
జవాబు:
D) కృపారసము
ప్రశ్న 6.
ధర్మరాజుకు నలుగురు తమ్ముకుర్రలు కలరు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) కుర్రలైన తమ్ములు
B) తమ్ములైన కుర్రలు
C) తమ్ములును, కుర్రలును
D) తమ్ముల వంటి కుర్రలు
జవాబు:
A) కుర్రలైన తమ్ములు
ప్రశ్న 7.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ
A) కార్మిక వృద్ధులు
B) పాదపద్మం
C) తొల్లిటిరాజులు
D) పాండునందనులు
జవాబు:
C) తొల్లిటిరాజులు
ప్రశ్న 8.
చతురబ్ధులు – ఇది ఏ సమాసమునకు ఉదాహరణగా గుర్తించవచ్చు.
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) విశేషణ పూర్వపదం
D) బహువ్రీహి
జవాబు:
B) ద్విగు సమాసము
ప్రశ్న 9.
“విశేషణం ఉత్తరపదం”గా ఉన్న సమాసము
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
C) విశేషణ ఉత్తరపద కర్మధారయము
D) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
జవాబు:
C) విశేషణ ఉత్తరపద కర్మధారయము
ప్రశ్న 10.
కన్యక (పార్వతి)కు అధిపతి – సమాసము పేరు
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థీ తత్పురుష
C) బహువ్రీహి
D) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
A) షష్ఠీ తత్పురుష
III. ఛందస్సు :
ప్రశ్న 1.
అతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్ – ఏ పద్యపాదం ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) కందం
D) సీసం
జవాబు:
B) చంపకమాల
ప్రశ్న 2.
మ, స, జ, స, త, త, గ – అను గణములు వరుసగా వచ్చు పద్యం.
A) శార్దూలము
B) మత్తేభము
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
A) శార్దూలము
ప్రశ్న 3.
“నీవేనా” అను పదమును గణ విభజన చేయగా
A) U IU
B) UUU
C) UUI
D) IUI
జవాబు:
B) UUU
ప్రశ్న 4.
IIU – ఇది ఏ గణం ?
A) భ గణం
B) జ గణం
C) స గణం
D) ర గణం
జవాబు:
C) స గణం
ప్రశ్న 5.
సూర్య గణములు
A) న, హ(గల)
B) భ, ర, త
C) గగ, నల
D) లగ, గల
జవాబు:
A) న, హ(గల)
IV. అలంకారములు :
ప్రశ్న 1.
ఒక వస్తువునకు మరొక వస్తువుతో రమణీయమైన పోలిక చెప్తే
A) రూపకం
B) ఉపమా
C) ఉత్ప్రేక్ష
D) యమకం
జవాబు:
B) ఉపమా
ప్రశ్న 2.
తెలుగువీర లేవరా !
దీక్షబూని సాగరా !
అదరవద్దు బెదరవద్దు !
నింగి నీకు హద్దురా !
పై గీతంలో ఉన్న అలంకారం
A) యమకం
B) వృత్త్యనుప్రాస
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
C) అంత్యానుప్రాస
ప్రశ్న 3.
ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయితే,
A) అంత్యానుప్రాస.
B) ఛేకానుప్రాస
C) యమకము
D) వృత్త్యనుప్రాస
జవాబు:
D) వృత్త్యనుప్రాస
ప్రశ్న 4.
“భూమి బంతి వలె గోళంగా ఉన్నది.” – ఈ వాక్యంలో గల అలంకారం
A) ఉత్ప్రేక్ష
B) ఉపమా
C) రూపకము
D) వృత్త్యనుప్రాస
జవాబు:
B) ఉపమా
V. వాక్యాలు:
ప్రశ్న 1.
ఈ కింది వాక్యాలలో కర్తరి వాక్యము
A) ఆమె డాక్టరు.
B) ఈ రోజు ఇంటికి వెళ్ళండి.
C) రాము సైకిల్ను తొక్కుతున్నాడు.
D) రాము బజారుకు వెళుతున్నాడు.
జవాబు:
C) రాము సైకిల్ను తొక్కుతున్నాడు.
ప్రశ్న 2.
“రాము తోటపనిని చేస్తున్నాడు.” – ఈ వాక్యమును కర్మణి వాక్యములోనికి మార్చగా
A) తోటపనిని రాము చేస్తున్నాడు.
B) తోటపని రాము చేత చేయబడుచున్నది.
C) చేస్తున్నాడు, రాము తోటపనిని.
D) రాము చేస్తున్న పని, తోటపని.
జవాబు:
B) తోటపని రాము చేత చేయబడుచున్నది.
ప్రశ్న 3.
“వారిచే సినిమా నిర్మించబడినది.” – ఇది ఏ వాక్యం ?
A) కర్మణి వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంయుక్త వాక్యం
D) ప్రారంభ వాక్యం
జవాబు:
A) కర్మణి వాక్యం
ప్రశ్న 4.
“ధర్మరాజు తమ్ములను ఆదరించాడు.” ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంశ్లేష వాక్యం
D) అప్రధాన వాక్యం
జవాబు:
B) కర్తరి వాక్యం