TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 6th Lesson భాగ్యోదయం Textbook Questions and Answers.

TS 10th Class Telugu 6th Lesson Questions and Answers Telangana భాగ్యోదయం

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 56)

నవభారత రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు, జాతీయతావాది, తత్త్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు డా॥ బి.ఆర్. అంబేద్కర్. దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంత గానో కృషి చేశాడు. నిమ్న వర్గాలలో ‘అందరిలాగ మనమూ అన్నీ చేయగలం’ అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని లక్ష్యం. దేశప్రజలు అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరా ఎవరిని గురించి తెలుపుతున్నది?
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్ గురించి తెలుపుతున్నది.

ప్రశ్న 2.
ఆయన ఎవరి గురించి కృషి చేశాడు ? ఎందుకు ?
జవాబు:
నిమ్న వర్గాల గురించి కృషి చేశాడు. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పటానికి కృషిచేశాడు. వారు వెనుకబడి ఉన్నారు కాబట్టి.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
మన రాష్ట్రంలో దళితులు, నిమ్నజాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు ? వాళ్ళ గురించి చెప్పండి.
జవాబు:
కృష్ణస్వామి ముదిరాజ్ : తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషిచేశాడు. 1948లో ఉర్దూలో ‘హైదరాబాద్ – కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు.

భాగ్యరెడ్డి వర్మ : దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడటానికి కృషి చేశారు. అలాగే దళితులను ‘అది ఆంధ్రులు’ గా పిలుచుకోవాలని, దళిత బాలికలను దేవదాసీలుగా, జోగినులుగా చేయడాన్ని వ్యతిరేకించెను.

జ్యోతిబాపూలే : 1848 వ సం||లో ‘అంటరాని’ కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించి సావిత్రిబాయికి శిక్షణనిచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయినిగా చేశాడు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.59)

తన జాతి జనుల ………………..
అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు.

ప్రశ్న 1.
కుల వ్యవస్థ వలన, సమాజంలో ఏం జరుగుతున్నది ?
జవాబు:
కుల వ్యవస్థ వలన ఒక వర్గం వారు అంటరాని వారిగా చూడబడ్డారు. ఒక వర్గం తక్కువ, మరో వర్గం ఎక్కువ అనే భావం ప్రజల్లో ఉండేది. సామాజిక, ఆర్థిక అసమానతలు చోటుచేసుకున్నాయి. కొన్ని కులాల వారు అణగారిన వర్గాలుగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కులవ్యవస్థ వలన సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. ఒకరిపై ఒకరికి స్నేహభావం తగ్గుతోంది.

ప్రశ్న 2.
చిత్తశుద్ధి, నిజాయితీ అంటే మీకు ఏమి అర్థమయింది ?
జవాబు:
చిత్తము అంటే మనస్సు. కొంతమంది మనసులో ఇష్టం లేకపోయినా పది మంది మెప్పుకోసం మంచి పనులు చేస్తారు. పేదలకు సహాయం చేస్తారు. పూర్తిగా వారు బాగుపడాలంటే మనసులో ఆ భావాలు బలంగా ఉండాలి. మనసులో బలమైన సంకల్పం కలగాలి. ఆ విధంగా మనసులో బలమైన సంకల్పం కలగడమే చిత్తశుద్ధి అంటారు. అంటే మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకోవడమే చిత్తశుద్ధి అంటారు.

నిజాయితీ : నిజమును అనుసరించి ప్రవర్తించడం అంటే సత్యవర్తన కలిగి ఉండడం. చేసే పనిలో తన స్వార్థం చూసుకోకుండా ఉండడం, చేసే పనిని కచ్చితంగా చేయడం. ఎదురుగా ఒక విధంగా వెనుక ఒక విధంగా ప్రవర్తించకుండా ఉండడం. నిజాయితీగా చేసే ఏ పని అయినా సాధ్యమే.

ప్రశ్న 3.
అజ్ఞానం, ఉదాసీనత వలన నష్టాలేమిటి? చర్చించండి.
జవాబు:
జ్ఞానం అంటే తెలివి. ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం, ఏదైనా సమస్యను సులువుగా పరిష్కరించగల శక్తిని కూడా జ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే సరిపడ తెలివిలేకపోవడం. ఒక సమస్య యొక్క మూల స్వభావాన్ని తెలుసుకోలేక పోవడం కూడా అజ్ఞానమే. అసలు దానిని సమస్యగా గుర్తించలేకపోవడం కూడా అజ్ఞానమే.

ఉదాసీనత అంటే దేనినీ పట్టించుకోకపోవడం. తమకు ఉపకారం జరుగుతున్నా, అపకారం జరుగు తున్నా పట్టించుకోకపోవడం, మంచికానీ, చెడుకానీ పట్టించుకోకపోవడం కూడా ఉదాసీనతే. తెలిసినా తెలియనట్లు ఉండడం కూడా ఉదాసీనతే.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.59)

మనుషులంతా ……………… రాణిస్తారని నిరూపించాడు.

ప్రశ్న 1.
మూఢనమ్మకాలు అంటే మీకేం అర్థమయ్యింది ?
జవాబు:
శాస్త్రీయత లేకుండా గుడ్డిగా ఆచరించేవి అని అర్థం. అయితే పెరిగిన వాతావరణం, సంప్రదాయాలు, అజ్ఞానం వల్ల మూఢనమ్మకాలు మనిషిని పతనం (పడిపోయేటట్లు) చేస్తున్నాయి.
ఉదా : పిల్లి వస్తే వెనుకకు రావటం, విధవ (భర్త చనిపోయిన స్త్రీ) వస్తే వెనుకకు రావటం, తుమ్మితే ఆగిపోవటం మొదలగునవి.

ప్రశ్న 2.
వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు ?
జవాబు:
మనుష్యులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసు కునేటట్లు చేశాడు. నమ్మకాల అజ్ఞానాన్ని తొలగించాడు. అంటరాని వర్గాలు చదువుకునేటట్లు ప్రోత్సహించాడు. తన జాతి జనుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలు అడ్డుకున్నాడు. నిమ్న వర్గాల్లో తాగుడు అలవాటును మాన్పించాడు.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
మంచివక్త అని ఎవరిని అనవచ్చు ?
జవాబు:
ప్రతీ విషయాన్ని కూలంకషంగా (విస్తృతంగా, వివరంగా) చెప్పుట, తన అభిప్రాయాన్ని సశాస్త్రీయంగా నిరూపించుట, సమయం, సందర్భం పరిస్థితులనుబట్టి బాగా మాట్లాడేవాణ్ణి మంచి వక్త అని అనవచ్చును. అణగారిన వర్గాలలో చైతన్యాన్ని, సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగేటట్లు ప్రసంగించగలిగితే అతడిని మంచి వక్త అంటారు.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No.60)

ఆదిహిందువుల మేలుకోసం ……….. కాకుండా రక్షించగలిగాడు.

ప్రశ్న 1.
చదువుకోవడం వల్ల సమాజం ఏవిధంగా చైతన్యవంత మవుతుంది ?
జవాబు:
సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం. మంచీ చెడు, కష్టం – సుఖం, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది, జ్ఞానం – అజ్ఞానం తెలియాలంటే తప్పనిసరిగా చైతన్యవంతమైన, జ్ఞానాత్మకమైన చదువును చదువుకోవల్సిందే. ఇంతకంటే వేరొక మార్గమే లేదు.

ప్రశ్న 2.
నాయకత్వ పటిమను ఏవిధంగా అంచనా వేయ వచ్చు?
జవాబు:
ఒక నాయకుడు, ఒక వ్యక్తి తను చెప్పిన అంశాలు ప్రజామోదం పొందినప్పుడు, అందరినీ మెప్పించ, గలిగినప్పుడు, అతని పలుకులే (మాటలే) శిరోధార్య మవుతాయి. దానినే నాయకత్వ పటిమ అని అంటారు. పైన చెప్పిన ప్రకారం ప్రజలలో నాయకునికి ఉన్న ఆదరణ బట్టే నాయకత్వ పటిమను మనం అంచనా వేయవచ్చు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
నిమ్న వర్గాలలో భాగ్యరెడ్డి వర్మ తెచ్చిన మార్పులు చెప్పండి.
జవాబు:

  1. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
  2. అనేక బహిరంగ సభలు నిర్వహించాడు.
  3. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు.
  4. తనజాతి జనులను (నిమ్న వర్గాలను) ఏకతాటిపై నడిపాడు.
  5. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డు కున్నారు.
  6. ఆడ, మగ పిల్లలను దేవునికి వదలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు.
  7. కులవ్యవస్థ నిర్మూలన కొరకు శ్రమించాడు.
  8. మనుషులంతా పుట్టుకతో సమానం అనే భావం కలిగించాడు.
  9. చదువుపై శ్రద్ధ కల్గించాడు.
  10. సాంఘిక దురాచారాలను నిర్మూలించాడు.

ఈ పై పనుల వల్ల నిమ్న వర్గాలలో సామాజిక భాగస్వామ్యం, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, నిస్వార్థసేవ వంటి మంచి విషయాలలో మార్పులు తీసుకువచ్చారు.

ప్రశ్న 2.
భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్ ల మధ్య పోలికలను తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 1
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 2

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

ప్రశ్న 3.
క్రింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాఫూలె బహు జనుల అభివృద్ధికి విశేషకృషి చేశాడు. దొరల దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశాడు. సత్యశోధక సమాజం ఏర్పాటుచేశాడు. బి.యస్. వెంకటరావు హైదరాబాద్లోని ఘాసండిలో పుట్టాడు.

హైదరాబాదు అంబేద్కర్గా ప్రసిద్ధిచెందాడు. హైదరాబాదులో అంబేద్కరిజానికి పాదులు తీసి, దారులు వేశాడు. సమరోత్సాహంతో దళిత ఉద్యమా లను నడిపిన ధీశాలి. హైదరాబాద్లో దేవదాసీ దురాచార నిర్మూలనకు, దళితులలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు. 1926 లో ఆదిహిందూ మహాసభను స్థాపించాడు.

సరైన జవాబు గుర్తించి కుండలీకరణం (బ్రాకెట్)లో రాయండి.

అ) జ్యోతిబాఫూలె స్థాపించిన సమాజం పేరు ఏమిటి ?
అ) సత్యశోధక
ఆ) సమసమాజం
ఇ) నవసమాజం
జవాబు:
అ) సత్యశోధక

ఆ) పేదలందరికీ అందుబాటులోనికి రావలిసింది.
అ) డబ్బు
ఆ) చదువు
ఇ) న్యాయం
జవాబు:
ఆ) చదువు

ఇ) దేవదాసీ దురాచార నిర్మూలనకు కృషిచేసింది.
అ) జ్యోతిబాఫూలె
ఆ) అంబేద్కర్
ఇ) బి.ఎస్. వెంకటరావు
జవాబు:
ఇ) బి.ఎస్. వెంకటరావు

ఈ) ఆదిహిందూ మహాసభను స్థాపించిన సంవత్సరం
అ) 1936
ఆ) 1926
ఇ) 1916
జవాబు:
ఆ) 1926

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

ప్రశ్న 1.
క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
జవాబు:
విద్యలేనివాడు వింత పశువు అని పెద్దలు అంటారు. చదవటం, రాయడం లెక్కలు నేర్చుకోవడమే అక్షరాస్యత. చదువుకుంటే ఎవరిమీద ఆధారపడకుండా జీవితాన్ని సాగించవచ్చు.

  1. విద్య వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది.
  2. మంచి కీర్తిని తెచ్చిపెడుతుంది.
  3. భోగములను ఇస్తుంది.
  4. దొంగలు దొంగిలించలేని విద్య సొంతమైతే అజ్ఞానాన్ని పోగొడుతుంది.
  5. సక్రమ మార్గంలో నడిపిస్తుంది.
  6. ఆర్థిక భద్రత, సామాజిక భద్రత కల్పిస్తుంది.
  7. విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి.

ఆ) అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి ?
జవాబు:

  1. విద్యను నేర్చుకోవాలి / నేర్పాలి.
  2. నిమ్న వర్గాలు “అందరిలాగా మనము అన్నీ చేయగలం” అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
  3. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి.
  4. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు విలసిల్లాలి (వెల్లివిరియాలి).
  5. జాతీయ జీవన స్రవంతిలో అందరూ కలవాలి. కులతత్వం, మతతత్వం, అంటరానితనం రూపు మాసిపోవాలి.
  6. మూఢనమ్మకాలను పారద్రోలాలి.

ఇవన్నీ సాధించితే అసమానతలు తొలగి సమానత్వం ఏర్పడుతుంది.

ఇ) అంకితభావంతో పనిచేయడం అంటే ఏమిటి ?
జవాబు:
ఒక లక్ష్యం కోసం దీక్షతో పనిచేయడాన్ని అంకిత భావంతో పనిచేయడం అంటారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా లక్ష్యాన్ని విడిచి పెట్టకూడదు. లక్ష్య సాధన దిశగా మనపని మనం చేసుకుంటూ పోవాలి.

డా॥ బి.ఆర్. అంబేద్కర్. మహాత్మాగాంధీ లాంటి వారు అంకిత భావంతో కృషి చేయడం వల్లనే సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సమాజాభివృద్ధిని కృషి చేయాలనుకునే నాయకులను అంకితభావం, చిత్తశుద్ధి, నిజాయితీ అవసరం.

ఈ) వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
(లేదా)
దుర్వ్యసనాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ?
జవాబు:
వ్యసనం అంటే అలవాటు. అది మంచి అలవాటు అయితే సద్వ్యసనం అంటారు. చెడు అలవాటైతే దుర్వ్యసనం అంటారు. సాధారణంగా ‘వ్యసనం’ అనే మాట “చెడు అలవాటు” అనే అర్థంలోనే ఉపయోగి స్తాము.

  1. మనిషి జీవనం పతనమవుతుంది.
  2. చెదపురుగు వృక్షాన్ని నాశనం చేసినట్లు వ్యసనాలు మనిషిని సమూలంగా నాశనం చేస్తాయి.
  3. ధర్మరాజు వ్యసనం వల్లనే కదా రాజ్యాన్ని పోగొట్టుకుంది.
  4. వ్యసనాల వల్ల మనిషి తన ఉనికిని కోల్పోతాడు.
  5. త్రాగుడు (మద్యపానం), జూదం, వ్యభిచారం, లంచ గొండితనం మొదలైనవి సమాజంలో వ్యసనాలుగా చెప్పవచ్చును.
  6. వ్యక్తి నాశనమే కాక సమాజానికి హాని జరుగుతుంది.
  7. సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతాడు.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?
(లేదా)
మీ పరిసరాల్లో మీకు కన్పించే మూఢనమ్మకాల నిర్మూలనకు ఎలాంటి చర్యలను తీసుకుంటారు ?
జవాబు:
మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నాయి. వాటిని పారద్రోలడానికి నేను చేసే పనులను వివరిస్తాను.

  1. ముందుగా నిరక్షరాస్యులకు విద్య నేర్పుతాను.
  2. వయోజనులకు మంచిగా నచ్చచెపుతాను.
  3. స్వచ్ఛత, స్వేచ్ఛ, సమానత్వం గురించి వివరించి చెపుతాను. అప్పటికీ మార్పు రాకపోతే సామాజిక సేవా కార్యకర్తలు, సంస్కర్తలచే చెప్పిస్తాను.
  4. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను చిన్నచిన్న నాటికల ద్వారా మా వాడలో ప్రదర్శిస్తాను.
  5. మూఢనమ్మకాలను పారద్రోలటానికి, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తాను.
  6. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను, కరపత్రాల ద్వారా మౌఖికంగా వివరిస్తాను.
  7. వయోజనులతో సత్సంబంధాలను కల్గి, వారికి నచ్చచెప్పి మూఢనమ్మకాలపై వారికి అవగాహన కల్పిస్తాను.
  8. నా మిత్ర బృందంతో కల్సి వారి జీవితాలలో మార్పు కొరకు కృషిచేస్తాను.

(లేదా)

ఆ) భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి.
(లేదా)
ఆదిహిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని సొంత మాటల్లో వ్రాయండి.
జవాబు:
ఆదిహిందువుల మేలుకోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగొని వారు ఆదిహిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డివర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆదిహిందూ సమాజం జాగరూకమయ్యింది. ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమయిన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు.

కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. మానవులలలో ఎక్కువ, తక్కువలు లేవని ఆది హిందువులు తెలుసుకొనేలా చేశాడు.

3,348 ఉపన్యాసాలు ఇచ్చి ఆదిహిందువులను చైతన్య పరిచాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలె. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు, పేలికలు కాకుండా రక్షించగలిగాడు.

ప్రశ్న 3.
క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా ! ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా “అభినందన” వ్యాసం రాయండి.
జవాబు:
మలాలా యూసుఫ్ జాయ్
మలాలా యూసుఫయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్లోని స్వాత్ లోయ మింగోరా పట్టణంలో 12 జూలై, 1997లో జన్మించింది.

చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలాకు తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడి ప్రభుత్వంపై ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయ పడకుండా చదువుకుంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.

దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9, అక్టోబర్ 2012 న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలు కోవాలని కోరుకున్నారు.

ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మస్థైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day) గా ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాను ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్’ కు నామినీగా స్వీకరించింది.

ఈ విధంగా తన ప్రాణాలను లెక్కచేయకుండా మలాలా యూసఫ్ జాయ్ ఎదుర్కొంది. ఇది నాకు స్ఫూర్తినిచ్చిన అంశం.

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది పదాలకు పర్యాయపదాలను రాయండి.

అ) అండ = ఆసరా, తోడు, ఆలంబనం, ఆశ్రయం
ఆ) ఉన్నతి = వికాసం, అభివృద్ధి, ప్రగతి, ప్రవృద్ధి, ఘనత
ఇ) స్వేచ్ఛ = స్వతంత్రత, సొంతం, అలవోక, విచ్చలవిడి
ఈ) వికాసం = వికసనము, తెలివి, అభివృద్ధి, ప్రగతి

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

2. క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

అ) ఏకతాటిపై = ఒక మాటమీద నిలబెట్టడం
జవాబు:
గాంధీగారు స్వాతంత్య్ర పోరాటాన్ని ఏకతాటి పై నిలారు.

ఆ) మచ్చుతునక = ఉదాహరణ
జవాబు:
ఆమ్లవర్షాలు పడటం పర్యావరణం దెబ్బతినటానికి మచ్చుతునక.

ఇ) మహమ్మారి = వ్యాధి
జవాబు:
నేడు అవినీతి అనే మహమ్మారి ఎక్కువయింది.

ఈ) నిరంతరం = ఎల్లప్పుడు
జవాబు:
1) జీవన పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
2) విద్యార్థులు నిరంతరం అధ్యయనంపై దృష్టిపెట్టాలి.

3. కింది పదాలు / పదబంధాలను వివరించి రాయండి.

అ) అంకితం కావడం = సమర్పించడం / లీనం కావడం
జవాబు:
ఒక పనిని శ్రద్ధగా చేయడం, ఇచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా చేయడం అని అర్థం.
మహాత్మాగాంధీ జాతికి స్వాతంత్ర్యం కోసం అంకిత మయ్యారు.

ఆ) నైతిక మద్దతు = నీతికి ఓటు వేయడం, నీతిని సమర్థించడం
జవాబు:
ఒక మంచి పనికి నైతిక మద్దతు చాలా అవసరం. అది లేనిదే విజయం లభించదు.
మంచిచేసేవారికి / సంఘసంస్కర్తలకు నైతిక మద్దతు ఇవ్వాలి.

ఇ) చిత్తశుద్ధి = మనస్పూర్తిగా, మనస్సు దోషం లేకుండా
జవాబు:
“చిత్తశుద్ధి కల్గి చేసిన పుణ్యము వృథా కాదు” అని వేమన చెప్పాడు.
నేడు ఎక్కడచూసినా చిత్తశుద్ధి లేకుండా పనిని చేస్తున్నారు. తర్వాత బాధపడుతున్నారు. ఇది పనికిరాదు.

ఈ) సాంఘిక దురాచారాలు = సంఘమునందలి చెడ్డ ఆచారములు
జవాబు:
సాంఘిక దురాచారాలు ప్రగతికి ఆటంకం కల్గిస్తాయి. సమాజం అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలి.
సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి ఎందరో సంస్కర్తలు నడుంబిగించారు.

ఉ) సొంతకాళ్ళపై నిలబడడం అంటే స్వతంత్ర భావనతో జీవించడం అని అర్థం.
జవాబు:
ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడరాదని భావం. శ్రమ పడకుండా డబ్బు సంపాదించటం నేడు సరదాగా మారింది. పరుల సొమ్ము పాము వంటిది. కాబట్టి తన కాళ్ళపై తను నిలబడి స్వతంత్రంగా జీవించడం అని దీని అర్థం.

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

వ్యాకరణాంశాలు

క్రింది వాక్యాలను పరిశీలించండి.

ప్రత్యక్ష కథనం :
అ)“అక్కా! ఆ చెరువు జూడు”.
ఆ)”నేను రాన్రా తమ్ముడు”.
ఇ) “పిల్లలూ ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను”.
ఈ) “మేమూ వస్తాం సర్”.

పై వాక్యాలను పరిశీలించారు గదా !
పై వాక్యాలు నేను, మేము మొదలైనవారు చెబు తున్నట్లుగా ఉన్నాయి కదా !

ఇట్లా ఉత్తమపురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెపుతున్నట్లు ఉంటాయి. కాబట్టి ఇవి “ప్రత్యక్ష” కథనంలో ఉన్న వాక్యాలు. – ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు (“ ” ఉండాలి. కింది ఉదాహరణలను పరిశీలించండి.

అ)“మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నాడు. భాగ్యరెడ్డి వర్మ.
ఆ)రుద్రమదేవితో తల్లి నారాంబ “నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావిచక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి. కాని కన్నీళ్ళు ఉండకూడదు” అన్నది.

పై ఉదాహరణలను పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచు కోవాలని తెలుస్తున్నది.

  • ఒకరు చెప్పిన మాటలు / వాక్యాలను చెప్పింది చెప్పినట్లే రాయాలి.
  • ఆ మాటలకు / వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి.
  • ప్రథమపురుషలో ఉన్న పదాలు (అనగా తమను, తమ, తాను, తాము వంటి పదాలు) ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి.

పరోక్ష కథనం :

క్రింది వాక్యాలు చదువండి.

అ) హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు.
ఆ) ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు.
ఇ) తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. పైనున్న వాక్యాలు చదివారు కదా !

ఇవి సూటిగా వాళ్లే చెప్తునట్లుకాకుండా ! ఇంకొకళ్ళు చెప్తున్నట్లున్నాయి కదా !
ఇలాంటి వాక్యాలను “పరోక్ష కథనం” లో ఉన్న వాక్యాలు అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు.

క్రింది వాక్యాలను చదువండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.

అ)“నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను” అన్నాడు శ్రీనివాస్. (ప్రత్యక్ష కథనం)
ఆ) తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు.
(పరోక్ష కథనం)

మొదటి వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఉద్ధరణ చిహ్నాలు పెట్టారు.
రెండవ వాక్యంలో శ్రీనివాస్ మాటలను ఇంకొకరు చెప్పినట్లు రాశారు.
ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసేసి “అని” చేర్చి వాక్యం రాశారు.
మొదటిది ప్రత్యక్ష కథనం. రెండవది పరోక్ష కథనం.

పై ఉదాహరణల పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తున్నది.

పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి “అని” చేరుస్తారు.
ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలుగా తాను, తాము, తన, తమ లుగా మారుతాయి.

పాఠంలోని పరోక్ష కథన వాక్యాలను గుర్తించండి. వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి.

1. పరోక్ష కథనం : తన జాతి జనులను ఏకతాటి పై నడుప గలనని ఆయన అన్నారు.
ప్రత్యక్ష కథనం: “నా జాతి జనులను ఏకతాటిపై నడుప గలను” అని ఆయన అన్నారు.

2. పరోక్ష కథనం : ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.
ప్రత్యక్ష కథనం: “ఆది హిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గము” అని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.

ప్రాజెక్టు పని

బడుగు వర్గాల కోసం కృషిచేసిన జ్యోతిబాఫూలె, అంబేద్కర్, సావిత్రీబాయి ఫూలె జీవితాల్లోని ఏదైనా ముఖ్యమైన ఘట్టాన్ని మీ మాటల్లో రాయండి. నివేదిక రాసి తరగతిలో చదివి వినిపించండి.
జవాబు:
జ్యోతిబాఫూలె జీవితంలోని ముఖ్యమైన ఘటన :

ఒకరోజు రాత్రి ఇద్దరు మనుషులు జ్యోతిబాఫూలె చంపడానికి వచ్చారు. సావిత్రి బాఫూలె వాళ్ళకు, సేరీకి మధ్యలో నిలబడింది. ‘అన్నలారా – ఆగండి, దయచేసి వెళ్ళిపొండి’ అని వారిని భయంతో ప్రార్థించింది. వాళ్ళలో ఒకడు సావిత్రిపై గర్జించాడు. ‘మేం ఆగటానికి రాలేదు’. “అయితే మీరిక్కడకు ఎందుకొచ్చారు” అని అడిగాడు సేబీ నెమ్మదిగా. “కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు.

నువ్వు ఈ బడులు నడపటం, ఈ యవ్వారమంతా మానేస్తేగాని సంఘం బాగుపడదని వాళ్ళు చెప్పారు” అని వాళ్ళు అనగా తన చావు వాళ్ళకు లాభం అయితే చంపమని, బీదవాళ్ళకు సాయం చేయడమే తన జీవితాశయం అని సేరీ మెడవంచి చంపమని శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 3
ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు క్రింద పారేసి, సేరీ కాళ్ళమీద పడ్డారు. “మేం మిమ్మల్ని చంపం. మీరు మాకు తండ్రి లాంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపిన వాళ్ళని చంపివస్తాం” అని అనగానే సేరీ వాళ్ళను ఆపి వాళ్ళ ఆలోచన మారే దాకా వాళ్ళతో మాట్లాడాడు. ఆ ఇద్దరు హంతకుల పేర్లు దోండిరామ్, నామ్రేవ్ కుంబార్డే.

వాళ్ళు ఇద్దరూ రాత్రి బడిలో చేరారు. తర్వాత రోడే సేరీ బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ ‘వేదాచార్’ అనే పుస్తకం వ్రాసి ఫూలే దంపతులకు సహకరించాడు. చంపటానికి వచ్చిన వాళ్ళ హృదయం ఆ విధంగా పరివర్తన చెందిందంటే ఆ రోజుల్లో మనుషులు అలా ఆలోచించేవారని తెలుస్తోంది.

అంబేద్కర్ జీవితంలో ముఖ్యఘటన:

1931 రెండవ రౌండు టేబుల్ సమావేశం తర్వాత బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ద్వారా హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. కాని అంబేద్కర్ గాంధీజీ పూనా ఒడంబడి చేసుకొని ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా కాంగ్రెస్ అభ్యర్థులను నిలిపేటట్లుగా అంగీకరింపచేశాడు. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచటం సాధ్యం చేశారు.
అంబేద్కర్ సాంఘిక దురాచారాలకు లొంగక వాటిని ఎదిరిస్తూ జీవితమంతా ఏటికి ఎదురీదాడు.
TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం 4

విశేషాంశాలు

1. దేవదాసి : ఆలయాలలో నృత్యం చేస్తూ ఆలయ సేవకే అంకితమయిన వాళ్ళను దేవదాసీలుగా పిలిచేవాళ్ళు. ఈ దేవదాసి వ్యవస్థ చాళుక్యకాలంనుండే ఉన్నట్లు తెలుస్తున్నది. కాలక్రమంలో దేవదాసీలు చిన్న చూపుకు గురయినారు. అనేక ఉద్యమాలు నిరసనల కారణంగా ఈ వ్యవస్థ లేకుండపోయింది.

సూక్తి : మంచి సమాజం మనిషి శరీరం వంటిది. అందుకే శరీరమైనా, సమాజమైనా – అందులో ఏ ఒక్క భాగానికి బాధ కలిగినా, నివారణకు అందరూ నడుం బిగించాలి.
-వినోబాభావే

పదాలు – అర్థాలు

I

గమనం = ప్రయాణం
నిర్దేశించు = చూపు
అవస్థ = కాలకృతమైన స్థితి, సంకటం, దశ
గట్టెక్కడం = ఒడ్డుకు చేరడం (కష్టాలుతీరడం)
అంకితభావం = వేరే ఆలోచన లేకపోవడం
వికాసం = వికసించడం, ప్రకాశం
అణగారిన = అణచి వేయబడిన
చిత్తసుద్ది = చెప్పింది చేసే నిజాయితీ
నివసించు = తిరస్కరించు
ఏకతాటి పై = ఐక్యంగా
ఎరుక = తెలివి, జ్ఞానం
అవగతము = తెలియబడినది, పొందుట
కడగండ్లు = కష్టములు, విపత్తులు
ఉదాసీనత = నిర్లిప్తత
అండ = ఆసరా
మహమ్మారి = మశూచి, అమ్మతల్లి (ఓ పెద్ద అంటురోగం)

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

II

జీర్ణించుకుపోవడం = బాగా అర్థం కావడం
అజ్ఞానం = చీకటి
నిరంతరం = ఎల్లప్పుడు
మటుమాయం = కన్పించకుండా
ఏకతాటి = ఒకే మాటపై నిలబెట్టడం
స్వచ్ఛత = నిర్మలత్వం
దుర్భరం = భరింపరాని
మార్గదర్శి = మార్గమును చూపువాడు
ఆదిగా = మొదలుగా
కృషి = ప్రయత్నం

III

జాగరూకమయ్యింది = అప్రమత్తమయింది
నెలకొల్పుట = ఏర్పాటుచేయుట
పటిమ = నేర్పు, ఓపిక, బిగువు
మచ్చుతునక = ఉదాహరణ
మేలుకోసం = మంచికోసం
నమ్మకం = విశ్వాస

పాఠం ఉద్దేశం

స్వయంకృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్ధం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

భాగ్యరెడ్డివర్మ కుమారుడైన ఎం.బి. గౌతమ్ రచించిన ‘భాగ్యరెడ్డివర్మ జీవితచరిత్ర’ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం.

రచయిత పరిచయం

రచయిత : కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్
జననం : 25.8.1893
మరణం : 15.12.1967
వృత్తి / ఇతర

అంశాలు : స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, జర్నలిస్టు, విద్యాసంస్థల స్థాపకుడు, బహుజన సమాజ సంస్కర్త, విద్యావేత్త, హైదరాబాద్ మేయర్, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఇతర రచనలు / పనులు :

  1. 1957 లో హైదరాబాద్ మేయర్గా “మాస్టర్గాన్” ను తయారుచేసిన దార్శనికుడు.
  2. దక్కన్లోర్లో సంపాదకీయాలు, వ్యాసాలు రాసారు.
  3. హైదరాబాద్ నగరంపై “పిక్టో రియల్ హైదరాబాద్” అనే అద్భుత గ్రంథాన్ని రాశారు.
  4. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
  5. 1948 లో ఉర్దూలో “హైదరాబాద్ – కి – తీస్ సాలాసియాసి జదు జిహిద్” పేరుతో రాజకీయోద్య మాలపై గ్రంథాన్ని రాశాడు.
  6. “భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర” రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా పనిచేశారు.

ప్రవేశిక

ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి, తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరపురానిది దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకోవడం. ఆడ, మగ పిల్లలను దేవునికి వదిలి వేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడును మానిపించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా !

TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

ప్రక్రియ – జీవిత చరిత్ర

ఈ పాఠ్యాంశం ‘జీవిత చరిత్ర’ ప్రక్రియకు చెందినది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజంమీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే ‘జీవిత చరిత్ర’.

Leave a Comment