Telangana SCERT 10th Class Telugu Grammar Telangana అపరిచిత పద్యాలు Questions and Answers.
TS 10th Class Telugu Grammar అపరిచిత పద్యాలు
ప్రశ్న 1.
కింది పద్యమును చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచమైన నదియు ఁగొదువ గాదు
కొండ యద్దమందు గొంచమై యుండదా!
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు :
1. ఎక్కడ అధికులము అని అనగూడదు ?
జవాబు:
అనువుగానిచోట అధికులమని అనగూడదు.
2. ఇంకా ఎక్కడెక్కడ ఒదిగి ఉండాలి ?
జవాబు:
సంపద, విద్య, అధికారములయందు ఒదిగి ఉండాలి.
3. కొండ అద్దములో ఎలా ఉంటుంది ?
జవాబు:
కొండ అద్దంలో చిన్నదిగా ఉంటుంది.
4. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
పై పద్యాన్ని రాసిన కవి వేమన.
5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ వినురవేమ
ప్రశ్న 2.
కింది పద్యమును చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు తగు జవాబులివ్వండి.
సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు కలుషమడచు
కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి జేయు
సాధుసంగమంబు సకలార్థ సాధనంబు.
ప్రశ్నలు – జవాబులు :
1. జనులకు కలుషమును పోగొట్టేదేది ?
జవాబు:
సాధుసంగము
2. సూక్తి అంటే ఏమిటి ?
జవాబు:
మంచిమాట
3. సాధుసంగమనగానేమి
జవాబు:
మంచివారితో స్నేహము.
4. ఈ పద్యానికి శీర్షిక ప్రకటించుము.
జవాబు:
ఈ పద్యానికి ‘సజ్జన సాంగత్యం’ అనే శీర్షిక తగినది.
5. కీర్తి ఎప్పుడు కలుగుతుంది.
జవాబు:
కీర్తి సజ్జన సాంగత్యంతో కలుగుతుంది.
ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్వంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు
ప్రశ్నలు – జవాబులు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది ?
జవాబు:
నాగులేరు పల్నాటిసీమలో ప్రవహిస్తున్నది.
2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది ?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.
3. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.
4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.
5. ఈ పద్యంలోని చిల్లర దేవుళ్ళు ఎవరు ?
జవాబు:
చిన్న చిన్న రాళ్ళు ఈ పద్యంలోని చిల్లరదేవుళ్ళు.
ప్రశ్న 4.
క్రింది గేయ ఖండికను చదవండి. క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించి రాయండి.
“ఇది హైదరాబాదు ……………….. ఇది హైదరాబాదు
ఇది భిన్న సంస్కృతిలో ఎదిగిపూచిన పాదు
ఇట మల్కిభరాము ప్రచురితమ్మెనరించె
తెలుగు భారతి శింజినుల మంజుల స్వనము
ఇచట గోపన్న చేయించె తన బతుకు వెచ్చించి
సీతమ్మ కొక చింతాకు పతకమ్ము
ఇచట తెల్గుల వాణి ఇచట ఉర్దూ బాణి
కల్పిపోయినవి ముక్తాప్రవాళములట్లు
ప్రశ్నలు – జవాబులు :
1. ఈ గేయభాగం, ఎక్కడి సంస్కృతిని గూర్చి వర్ణిస్తున్నది ?
జవాబు:
ఈ గేయం హైదరాబాదు సంస్కృతిని గూర్చి వర్ణిస్తున్నది.
2. ముక్తా ప్రవాళాల్లా కలిసిపోయినవి ఏవి ?
జవాబు:
తెల్గులవాణి, ఉర్దూబాణి, ముక్తా ప్రవాళాల్లో కలిసి పోయాయి.
3. సీతమ్మకు చింతాకుపతకం చేయించినవారెవరు ?
జవాబు:
సీతమ్మకు గోపన్న చింతాకుపతకం చేయించాడు.
4. భిన్నసంస్కృతి అంటే ఏమిటి ?
జవాబు:
వేరు వేరు మతాల, జాతుల, భాషల, ఆచారాల సంస్కారం.
5. హైదరాబాదుకు గల మరొక పేరు ?
జవాబు:
హైదరాబాదుకు గల మరొక పేరు భాగ్యనగరం.
ప్రశ్న 5.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది ?
జవాబు:
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగము.
2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది ?
జవాబు:
తింటూ ఉంటే తీయనయ్యేది వేము.
3. సాధనతో సమకూరేవి ఏవి ?
జవాబు:
సాధనముతో పనులు సమకూరును.
4. ఈ పద్యానికి మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్య మకుటం “వేమ”.
5. ఈ పద్యాన్ని రాసింది ఎవరు ?
జవాబు:
ఈ పద్యాన్ని రాసింది వేమన.
ప్రశ్న 6.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
నీళ్ళలోని చేప నెరిమాంసమాశకు
గాలమందు చిక్కి కూలినట్లు
ఆశపుట్టి మనుజుడారీతి చెడిపోవు
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు :
1. చేప దేనికి ఆశపడును ?
జవాబు:
చేప మాంసమునకు ఆశపడును.
2. దేనికి చిక్కును ?
జవాబు:
గాలానికి చేప చిక్కును.
3. చేప ఏమగును ?
జవాబు:
చేప మరణించును.
4. చేపతో పోల్చబడినది ఎవరు ?
జవాబు:
ఆశగల మానవుడు చేపతో పోల్చబడినాడు.
5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ! వినుర వేమ!
ప్రశ్న 7.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
లయనకయుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
1. పాముకు విషము ఎక్కడుండును ?
జవాబు:
పాముకు తలయందు విషముండును.
2. తోకయందు విషము దేనికి ఉండును ?
జవాబు:
తోకయందు వృశ్చికమునకు విషము ఉండును.
3. నిలువెల్ల విషము గలవాడెవడు ?
జవాబు:
ఖలునకు నిలువెల్ల విషముండును.
4. ఈ పద్యము నందు చెప్పబడిన విషయమేది ?
జవాబు:
ఈ పద్యమునందు ఖలుని స్వభావము చెప్పబడినది.
5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలో మకుటం సుమతి.
ప్రశ్న 8.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు గురియు
అతడేల గలుగు యావత్ప్రపంచంబు
నీతడేల గలుగు ఇహము పరము
ప్రశ్నలు – జవాబులు :
1. రక్తాన్ని కురిపించునదేది ?
జవాబు:
రాజు చేతిలోని కత్తి రక్తాన్ని కురిపిస్తుంది.
2. అమృతాన్ని కురిపించునదేది ?
జవాబు:
కవి చేతిలోని కలము అమృతాన్ని కురిపిస్తుంది.
3. యావత్ప్రపంచాన్ని పాలించగలిగేదెవరు ?
జవాబు:
రాజుయావత్ప్రపంచాన్ని పాలించగలుగుతాడు.
4. ఇహమును, పరమును పాలించగలవాడెవడు ?
జవాబు:
కవి ఇహమును, పరమును పాలించగలడు.
5. ఈ పద్యంలో ఎవరి గొప్పతనం చెప్పబడింది ?
జవాబు:
ఈ పద్యంలో కవి గొప్పతనం చెప్పబడింది.
ప్రశ్న 9.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
1. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది
2. ఏది వినదగినది ?
జవాబు:
ఎవరు ఏవిషయమును గూర్చి చెప్పినను ముందు దానిని వినదగును.
3. వినిన తర్వాత ఏమి చేయవలెను ?
జవాబు:
వినిన తర్వాత తొందరపడకుండా ఆ విషయాన్ని గూర్చి ఆలోచించాలి.
4. నీతిపరుడెవ్వడు ?
జవాబు:
విన్నదానిలో సత్యమెంతో, అసత్యమెంతో తెలిసికొన గల్గిన వాడే నీతిపరుడు.
5. ఈ పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
ఈ పద్యంలో మకుటం సుమతి.
ప్రశ్న 10.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగా రాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములఁ
దరిఁప్రేమన్ మెలగవలయుఁ దరుణి కుమారీ !
ప్రశ్నలు – జవాబులు :
1) దేనిని మరచిపోవాలి ?
జవాబు:
కీడును మరచిపోవాలి.
2) దేనిని మరువరాదు ?
జవాబు:
మేలును మరువరాదు.
3) అందరి ఎడల ఎట్లా మెలగాలి ?
జవాబు:
అందరి యెడల మర్యాదలతోను, ప్రేమతోను మెలగాలి.
4) ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు:
ఈ పద్యం ‘కుమారీ శతకం’ లోనిది.
5) ‘మేలు’ పదానికి వ్యతిరేక పదం రాయండి.
జవాబు:
మేలు × కీడు
ప్రశ్న 11.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించండి.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువడేని
దయయుసత్యంబులోనుగా దలపడేని
కలుగనేటికి తల్లుల కడుపుచేటు
ప్రశ్నలు – జవాబులు :
1. ‘కడుపుచేటు’ అనే మాటకు అర్థం………… ( )
ఎ) చెడ్డకడుపు
బి) పుట్టుక దండగ
సి) తల్లులకు బాధ
డి) ప్రజలకు చేటు
జవాబు:
బి) పుట్టుక దండగ
2. శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి ? ( )
ఎ) ఆరు చేతులతో
బి) చేతులు నొప్పి పుట్టేటట్లు
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
డి) భక్తితో
జవాబు:
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
3. దయను, సత్యాన్ని మనిషి వేటిని తలచాలి.( )
ఎ) దయనుమాత్రమే
బి) సత్యాన్ని మాత్రమే
సి) దయను, సత్యాన్ని రెండింటిని
డి) ఈ రెండింటిని కాదు
జవాబు:
సి) దయను, సత్యాన్ని రెండింటిని
4. నోరారా హరి కీర్తిని …….. ( )
ఎ) పిలవాలి
బి) పలకాలి
సి) అరవాలి
డి) ఏమీ చెయ్యకూడదు
జవాబు:
బి) పలకాలి
5. ‘కీర్తి’ కి వికృతి పదం ఏది ? ( )
ఎ) కవిత
బి) కృతి
సి) కీరితి
డి) కైత
జవాబు:
సి) కీరితి
ప్రశ్న 12.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
పాలమీగడ మించిన పసిడి మనసు
తెలుగుభాషను మించిన తీపి పలుకు
పౌరుషంబుగ పులిపిల్ల తీరునలరు
తెలుగుబిడ్డను గాంచంగ వెలుగు జగము
ప్రశ్నలు – జవాబులు:
1. పసిడి అంటే అర్థం ఏమిటి?
ఎ) బంగారం
బి) సింగారం
సి) కంగారు
డి) వెండి
జవాబు:
ఎ) బంగారం
2. తెలుగుభాష కంటే తియ్యనిది ఏది?
జవాబు:
తెలుగు బిడ్డ పలుకు తెలుగుభాష కంటే తియ్యనిది.
3. పౌరుషం కలిగిన జంతువుగా దేనిని పేర్కొన్నారు ?
జవాబు:
పౌరుషం కలిగిన జంతువుగా పులిని పేర్కొన్నారు.
4. లోకానికి వెలుగునిచ్చేది ఎవరు ?
జవాబు:
లోకానికి వెలుగునిచ్చేది ‘తెలుగుబిడ్డ’.
5. ఈ పద్యంలో మకుటం ఏది ?
జవాబు:
తెలుగుబిడ్డను గాంచంగ వెలుగుజగము
ప్రశ్న 13.
క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి.
వాని రెక్కల కష్టంబు లేనివాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వాడికి భుక్తిలేదు.
ప్రశ్నలు – జవాబులు
1. ఎవరికి భుక్తి కరువు ? ( )
ఎ) సస్యరమకు
బి) ప్రపంచానికి
సి) కష్టజీవికి
డి) దయామయుడికి
జవాబు:
సి) కష్టజీవికి
2. ‘సస్యరమ’ అంటే ? ( )
ఎ) పంట అనే లక్ష్మి
బి) లక్ష్మి అందం
సి) అందమైన పచ్చదనం
డి) చిక్కటి చీకటి
జవాబు:
ఎ) పంట అనే లక్ష్మి
3. రైతురెక్కల కష్టంతో పులకించేది ఏది? ( )
ఎ) పంట
బి) భూమి
సి) చెట్టు
డి) పక్షి
జవాబు:
బి) భూమి
4. ప్రపంచానికి భోజనం పెట్టేది ఎవరు ? ( )
ఎ) రాజు
బి) రైతు
సి) ఉద్యోగి
డి) కార్మికుడు
జవాబు:
బి) రైతు
5. ఈ పద్యం ఎవరిగురించి చెప్పబడింది. ( )
ఎ) రైతు
బి) కవి
సి) కర్త
డి) ధర్మ
జవాబు:
ఎ) రైతు
ప్రశ్న 14.
గేయం చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
తూరుపు తెలవారుతుంది ప్రతిదినం
కాలంగతి మారుతుంది ప్రతిక్షణం
మంచి మార్పు లోకానికి మంగళదాయకం
అది వికటించిందా – అభ్యుదయ వినాశకం.
ప్రశ్నలు – జవాబులు :
1. గేయాన్ని అనుసరించి మారేది ఏది ?
జవాబు:
కాలంగతి
2. మంచి మార్పువల్ల లోకానికి ఏం ప్రయోజనం కల్గుతుంది ?
జవాబు:
మంచి మార్పు లోకానికి మంగళదాయకం.
3. ప్రతిదినం జరిగేది ఏది ?
జవాబు:
ప్రతిదినం తూరుపు తెలవారుతుంది.
4. అభ్యుదయానికి ఆటంకం ఎప్పుడు ఏర్పడుతుంది ?
జవాబు:
మంచి మార్పు జరగనప్పుడు అభ్యుదయానికి ఆటంకం ఏర్పడుతుంది.
5. అభ్యుదయం ఏ సంధి ?
జవాబు:
యణాదేశ సంధి.
ప్రశ్న 15.
గేయం చదివి జవాబును గుర్తించండి.
పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషి కన్న
శిలలే నయమనిపించును
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో
ప్రశ్నలు – జవాబులు :
1. ఈ గేయంలో కనిపిస్తున్న అలంకారం – ( )
A) యమకం
B) అంత్యానుప్రాస
C) రూపకం
D) వృత్త్యానుప్రాస
జవాబు:
B) అంత్యానుప్రాస
2. మనిషి కన్నా నయమనిపించేవి – ( )
A) రాళ్ళు
B) శిల్పాలు
C) గుండెలు
D) సంతువులు
జవాబు:
A) రాళ్ళు
3. బండలు మాటున ఏమున్నాయంటున్నాడు కవి ? ( )
A) వెన్న
B) గుండెలు
C) జీవం
D) జంతువులు
జవాబు:
B) గుండెలు
4. పైకి కఠినంగా కనిపించేది ( )
A) రాళ్ళు
B) మనిషి
C) నలుపు
D) ఇనుము
జవాబు:
A) రాళ్ళు
5. ఇందులో దేని గొప్పతనం ఉంది ? ( )
A) శిల
B) కవి
C) వల
D) శర
జవాబు:
A) శిల
ప్రశ్న 16.
ఈ పద్యంను చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కుక్కగోవు గాదు : కుందేలు పులి గాదు
దోమ గజము గాదు దొడ్డదైన
లోభి దాత గాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ! వినుర వేమ!
ప్రశ్నలు – జవాబులు :
1. ఎంత పెద్దదైనప్పటికీ దోమ దేనిగా మారదు ?
జవాబు:
ఎంత పెద్దదైనప్పటికీ దోమ గజంగా మారదు.
2. ఎన్ని సాధు లక్షణాలు ఉన్నా ఏది ఆవు కాజాలదు ?
జవాబు:
ఎన్ని సాధు లక్షణాలు ఉన్నా కుక్క ఆవు కాజాలదు.
3. లోకంలో దాతగా ఎవరు కాలేరు ?
జవాబు:
లోకంలో లోభి దాతగా కాలేడు.
4. పై పద్యం ఏ శతకంలోది ?
జవాబు:
పై పద్యం వేమన శతకంలోది.
5. పై పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
పై పద్యానికి శీర్షిక ‘గుణం మారదు’.
ప్రశ్న 17.
ఈ క్రింది కవితను చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆ బక్కపలుచని రూపం గుర్తొస్తే చాలు
ఒక్కసారిగా నా జాతి యావత్తూ
స్వేచ్ఛా విహంగమై విహరిస్తుంది.
ప్రపంచ విజేతలా తలెత్తుకు నిలుస్తుంది.
ప్రతి ఒక్క ఛాతీ ఆకాశమౌతుంది.
నరాలన్నీ ఒక్కొక్కటిగా
ఉక్కు తీగల్లా మారుతాయి.
ఉప్పొంగిన స్వరంతో
మీసం కుడిచేతి మునివేళ్ళ మధ్యకొస్తుంది !
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని
సరిహద్దు కావలకు తరిమి
నిరంకుశ వలసపాలనకు
పాతర వేసినవారు ఆయనే కదా!
ఎముకల గూడు కాదది
ఏనుగుల గుంపు!
ప్రశ్నలు – జవాబులు :
1. ఈ కవిత ఏ వ్యక్తి గురించి తెల్పుతున్నది ?
జవాబు:
ఈ కవిత జాతిపిత మహాత్మాగాంధీ గురించి తెలుపు తున్నది.
2. విహంగం అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
విహంగం అంటే పక్షి అని అర్థం.
3. కవి, నరాలను వేటితో పోల్చాడు ?
జవాబు:
కవి నరాలను ఉక్కు తీగలతో పోల్చాడు.
4. ‘ఏనుగుల గుంపు’ అనేది దేనికి సూచన ?
జవాబు:
‘ఏనుగుల గుంపు’ అనేది ఎముకల గూడుకు సూచన.
5. ఛాతి ఆకాశం కావడం – అంటే ?
జవాబు:
‘ఛాతి ఆకాశం కావడం’ అంటే ఆకాశంలా విస్తరించడం.
ప్రశ్న 18.
కింది పద్యం చదువండి. తప్పొప్పులను గుర్తించండి. (తప్పైతే ‘తప్పు’ అని, ఒప్పైతే ‘ఒప్పు’ అని రాయండి.)
కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!
ప్రశ్నలు – జవాబులు
1. కూరిమి అనగా స్నేహము.
జవాబు:
ఒప్పు
2. నేరము అనగా మిత్రుడు.
జవాబు:
తప్పు
3. ఈ పద్యం సుమతీ శతకం లోనిది.
జవాబు:
ఒప్పు
4. విరసం అంటే తప్పులని అర్థం.
జవాబు:
తప్పు
5. నిక్కము అనగా నిజము.
జవాబు:
ఒప్పు
ప్రశ్న 19.
క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. (March 2015)
వాక్కు వలన గలుగు పరమగు మోక్షంబు,
వాక్కు వలన గలుగు పఠలు ఘనత,
వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యంబు
విశ్వదాభిరామ వినురవేమ !
ఖాళీలు
1. ఈ పద్యంలో మకుటం ………………………
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ !
2. ఘనత ………………….. కలుగుతుంది.
జవాబు:
వాక్కు వల్ల
3. పద్యంలో సంపదను సూచించే పదం ………………….
జవాబు:
ఐశ్వర్య
4. విశ్వదాభిరామ పదాన్ని విడదీస్తే ……………………
జవాబు:
విశ్వదా+అభిరామ
5. ఈ పద్యాన్ని …………………. కవి రచించాడు.
జవాబు:
వేమన
ప్రశ్న 20.
క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. (June 2015)
తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
ఖాళీలు – జవాబులు :
1. పాముకు విషం ………………. లో ఉంటుంది.
జవాబు:
తల
2. వృశ్చికమనగా ………………….
జవాబు:
తేలు
3. శరీరమంత విషం ……………….. ఉంటుంది.
జవాబు:
ఖలునకు
4. పై పద్య మకుటం ………………………..
జవాబు:
సుమతీ
5. పై పద్యాన్ని రచించిన కవి ……………………
జవాబు:
బద్దెన
ప్రశ్న 21.
కింది పద్యాన్ని చదివి చేసుకోండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2016)
భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వు
ధనము నాదియన్న ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ.
ప్రశ్నలు – జవాబులు :
1. భూమి ఫక్కున ఎందుకు నవ్వుతుంది ?
జవాబు:
భూమి నాది అని అన్నందుకు.
2. ధనము నాది అంటే ధనము ఏం చేస్తుంది ?
జవాబు:
ధనము నవ్వుతుంది.
3. కదన భీతుడంటే మీకేమర్థమైంది ?
జవాబు:
యుద్ధమంటే భయపడువాడు.
4. పై పద్యంలోని మకుటం ఏది ?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ.
5. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
జవాబు:
వేమన
ప్రశ్న 22.
కింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (June 2016)
ఆకొన్న కూడె యమృతము
తాకొంచక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుడు
తేఁకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
1. నిజమైన దానశీలి ఎవరు ?
జవాబు:
తాకొంచక ఇచ్చువాడే దాత.
2. అన్నము ఎప్పుడు రుచిగా ఉంటుంది ?
జవాబు:
ఆకలి కలిగి ఉన్నప్పుడే అన్నం రుచిగా ఉంటుంది.
3. నిజమైన మనిషి అని ఎప్పుడు అంటారు ?
జవాబు:
సోకోర్చువాడే నిజమైన మనిషి అని అంటారు.
4. ఎవరు వంశానికి వన్నె తెస్తారు ?
జవాబు:
తేకువ గలవాడే వంశానికి వన్నె తెస్తాడు.
5. ఈ పద్యానికి మకుటము ఏది ?
జవాబు:
ఈ పద్యానికి మకుటము సుమతీ.
ప్రశ్న 23.
కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2017)
కం. కాకేమి తన్ను తిట్టెనె
కోకిల తననేమి ధనము కో కొమ్మనెనే,
లోకము పగయగు బరుసని
వాకున;జుట్టమగు మధురవాక్యమువలనన్
ప్రశ్నలు – జవాబులు :
1. ఎట్లా మాట్లాడితే లోకము చుట్టము అవుతుంది ?
జవాబు:
మధురముగా మాట్లాడితే లోకము చుట్టము అవుతుంది.
2. ఎట్లా మాట్లాడితే లోకము శత్రువౌతుంది ?
జవాబు:
కఠినముగా మాట్లాడితే లోకము శత్రువు అవుతుంది.
3. పై పద్యంలో పరుషముగా మాట్లాడేవారికి ఉదాహ రణగా దేనిని చూపాడు ?
జవాబు:
పై పద్యంలో పరుషముగా మాట్లాడేవారికి ఉదాహరణగా కాకిని చూపాడు.
4. పై పద్యంలో కోకిలను దేనికి ఉదాహరణగా చూపాడు ?
జవాబు:
కోకిలను మధురముగా మాట్లాడేదానికి ప్రతీకగా చూపాడు.
5. పై పద్యానికి శీర్షికను పెట్టండి.
జవాబు:
పై పద్యానికి ‘మధురవచనము’ అనే శీర్షిక తగినది.
ప్రశ్న 24.
కింది పద్యం చదువండి. తప్పొప్పులను గుర్తించండి. (June 2017)
కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!
ప్రశ్నలు – జవాబులు :
1. కూరిమి అనగా స్నేహము. ( )
జవాబు:
ఒప్పు (✓)
2. ‘నేరము’ అనగా మిత్రుడు. ( )
జవాబు:
తప్పు (✗)
3. ఈ పద్యం సుమతీ శతకం లోనిది. ( )
జవాబు:
ఒప్పు (✓)
4. ‘విరసం’ అంటే తప్పులని అర్థం. ( )
జవాబు:
తప్పు (✗)
5. నిక్కము అనగా నిజము. ( )
జవాబు:
ఒప్పు (✓)
ప్రశ్న 25.
కింది పద్యం చదివి ఆ తరువాత గల ప్రశ్నలకు జవాబులు రాయండి. (March 2018)
కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమునను మిగుల గోడు గలుగు
కోపమడచె నేని కోరిక లీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ!
ప్రశ్నలు – జవాబులు :
1. కోపం వలన తగ్గేది ఏది ?
జవాబు:
కోపం వలన తగ్గేది ఘనత.
2. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది ?
జవాబు:
దుఃఖం కోపం ఉన్నప్పుడు కలుగుతుంది.
3. కోపం అణచివేస్తే తీరేవి ఏవి ?
జవాబు:
కోపం అణచివేస్తే తీరేవి కోరికలు.
4. ‘కొంచెమైపోవును’ అంటే మీరేమి అర్థం చేసు కున్నారు ?
జవాబు:
తగ్గిపోతుంది
5. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కోపము’.
ప్రశ్న 26.
కింది పద్యం చదువండి. ఆ తర్వాత కింది వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లో సూచించండి. (June 2018)
పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు
పత్రికొక్కటున్న మిత్రకోటి
పత్రిక లేకున్న ప్రజకు రక్షలేదు
వాస్తవమ్ము నార్లవారి మాట.
ప్రశ్నలు – జవాబులు :
1. పది వేల సైన్యానికి పత్రిక ఒకటే ఉన్నది. ( )
జవాబు:
తప్పు (✗)
2. ఒక పత్రిక కోటి మిత్రులతో సమానం. ( )
జవాబు:
ఒప్పు (✓)
3. నార్లవారి మాట అవాస్తవం. ( )
జవాబు:
తప్పు (✗)
4. పత్రికల వలన కూడా ప్రజలకు రక్షణ లభిస్తుంది. ( )
జవాబు:
ఒప్పు (✓)
5. పై పద్యం పత్రికల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ( )
జవాబు:
ఒప్పు (✓)