TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 6th Poem नृसिंहाविर्भावः Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 6th Poem नृसिंहाविर्भावः

निबन्ध प्रश्नाः (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు) (Essay Questions)

1. नृसिंहस्य आविर्भावं वर्णयत ।
(నృసింహావిర్భావమును వర్ణించండి.)
2. नृसिंहेन कृतं दनुजवधं प्रपञ्चयत ।
(నృసింహుని చేత చేయబడిన రాక్షస వధను వివరించుము.)
జవాబు:
‘నృసింహావిర్భావః’ అనే పాఠ్యభాగాన్ని డా॥ కె. సుధాకరరావుగారు రచించారు. వీరు ఆధునిక సంస్కృత కవులలో ప్రసిద్ధులు – వీరు రచించిన ‘శ్రీ నృసింహనఖకౌముది’ అనే గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం స్వీకరింపబడింది. ఇందులో ప్రహ్లాదుని విష్ణుభక్తిని, నృసింహుని ఆవిర్భావాన్ని హిరణ్యకశిపుని వధను, దేవతల సంతోషాన్ని చక్కగా ఆవిష్కరించారు.

రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తీవ్రమైన కోపంలో తన కుమారుడైన ప్రహ్లాదునితో పెద్దగా నవ్వుతూ నాయనా ! నీవు శ్రీహరిని స్మరించడం మానుకో ! ప్రతిరోజు నన్నే ఆరాధించు నన్నే స్తుతించు. నేను నిన్ను రక్షిస్తాను. నా వలన నీకు భయం లేదు. సకల భోగాలను అనుభవించు” అని పలికాడు.

“सदा भोगसौख्येषु नूनं रमस्व”

తండ్రి మాటలను వినిన ప్రహ్లాదుడు చిరునవ్వుతో ఓ తండ్రీ ! సకల సృష్టికి కారణమైన శ్రీహరి పాదాలను ఎప్పుడూ నేను స్మరిస్తాను. సర్వపాపములను నశింప చేయగలడు. సకల రాక్షస వంశాన్ని నాశనం చేయగల సమర్థుడు. అందరిచేత పూజింప దగినవాడు. ఆయన మనసులో తలచుకున్నంత మాత్రాన ఈ జగత్తునంతా సృష్టించగలడు. అంతేగాదు తన శక్తితో సమస్తసృష్టిని నశింపచేయగలడు.” అని పలికాడు. ఈ మాటలు హిరణ్యకశిపునికి తీవ్రమైన ఆగ్రహాన్ని కల్గించాయి. తీవ్రమైన కోపంతో నీకు పూజనీయుడ నైన నాకంటే ఆ శ్రీహరే పూజనీయుడు అయ్యాడా ? నా మంచి మాటలను నీవు వినడంలేదు.

నా శత్రువైన విష్ణువును పూజిస్తానని పలుకుతున్నావు. ఓరీ మూర్ఖుడా ! నీవు పెద్ద తప్పు చేశావు. ఈ తప్పుకు తగిన శిక్ష అనుభవించకతప్పదు. నిన్ను ఈ గదతో సంహరిస్తాను. శ్రీహరి వచ్చి ఎలా రక్షిస్తాడో చూస్తాను. నీ శ్రీహరి అన్ని చోట్ల ఉంటాడని చెప్పావు. చూపించరా ! ఈ స్తంభంలో ఉన్నాడా ? ఈ భవనంలో ఉన్నాడా ? ఆ శ్రీహరి.

स्तंबेस्ति श्रीपतिः विष्णुः

తండ్రి మాటలు వినిన ప్రహ్లాదుడు ప్రశాంతమైన మనసుతో ఈ విధంగా పలికాడు. ఓ తండ్రీ ! శ్రీహరి అంతట ఉన్నాడు. అతడు ఇక్కడ ఉన్నాడని ఇక్కడలేడని చెప్పలేము. ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడు. సింహములలో, పక్షులలో, నీటిలో, నిప్పులో, గాలిలో, ఏనుగులలో, జింక శరీరాలలో ఉన్నాడు. ఆయన లేనిచోటు లేదు” అని పలికాడు.

ఈ మాటలు విని చాలాకోపంతో హిరణ్యకశిపుడు “ఓరీ ! నీవు విష్ణువును చూపించు రా ? ఆ పిరికివాడు ఎక్కడరా. ఈ స్తంభంలో ఉన్నాడా ? ఉంటే ఈ గదతో కొట్టి చంపేస్తాను. నీహరి ఎక్కడికి పారిపోయాడురా ? “అని పెద్దగా అంటాడు. అది విని ప్రహ్లాదుడు తండ్రీ ! శ్రీహరిని చంపడం నీ వల్ల కాదు. నీవు అన్నట్లుగా ఈ స్తంభంలోనే గాదు అంతటా ఉన్నాడు అని పలికాడు.

ప్రహ్లాదుని మాటలు విని హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోయాడు. కోపంతో “ఎక్కడరా నీ శ్రీహరి ? అని పలుకుతూ గదతో ఆ సభలోని స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. వెంటనే శంఖచక్రములు ధరించిన శ్రీమహావిష్ణువు సింహం తల, మనిషి రూపంలో పదునై ప్రకాశిస్తున్న గోళ్ళతో మహాబలుడైన నరసింహ రూపంతో ఆవిర్భవించాడు. వెంటనే నృసింహుడు హిరణ్యకశిపుడిని తన తోడలపై కూర్చోపెట్టుకొని గోళ్ళతో చీల్చి వేశాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు వెలుగుతున్న అగ్ని వలె, సూర్యునివలె ఉన్నాడు. భీకరంగా హిరణ్యకశిపుడిని చంపడాన్ని దేవతలు చూశారు. మహర్షులు, దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించి, భక్తితో స్తుతించారు. పూలతో పూజించారు.

Introduction : The lesson Nrisimhavirbhava is an extract from Nrisimhanakhakaumudi written by Dr. K. Sudhakara Rao. The lesson describes the appearance of Nrisimha from the pillar, and his subsequent killing of Hiranyakasipu, the father of Prahlada. Hiranyakasipu’s Challenge: Hiranyakasipu, the demon king asked his son Prahlada to stop worshipping Vishnu and start worshipping him instead and enjoy pleasures.

Prahlada replied that he worshipped the lotus feet of Hari, which would remove the sins and destroy the demons. The Universe was caused by the will of Vishnu. His power could end it in a moment.

Hiranyakasipu was enraged at the words of Prahlada. He said that by worshipping the enemy of his father, Prahlada committed a grave sin. He would go to hell for that. He said that he would break his head with the blow of the mace. He asked whether Hari would come to his rescue.

Prahlada’s reply: Prahlada calmly replied that Vishnu existed both in the animate and inanimate beings. He dwelled in men, lions, birds, water, fire and air. Hiranyaka who got angrier asked him whether Hari was in the pillar in the palace. If so, he would kill him. Prahlada replied with a smile that it was not possible to kill Hari. He was everywhere. He was in the pillar also. स्तंबेस्ति श्रीपतिः विष्णुः

The appearance of Nrisimha : Hiranyakasipu hit the pillar with the mace. Vishnu appeared in the form of Nrisimha holding conch and disk. He tore Hiranyaka with his sharp nails after dragging him on to his lap. The gods danced with joy and worshipped Vishnu. आराधयामासुरभीष्टदं तम् ।

सन्दर्भवाक्यानि (సందర్భ వాక్యాలు) (Annotations)

1. सदा भोगसौख्येषु नूनं रमस्व ।

परिचय : इदं वाक्यं नृसिंहाविर्भावः इति पाठ्यभागात् स्वीकृतम् । कविः डा. के. सुधाकररावः ।
सन्दर्भ : हिरण्यकशिपुः स्वपुत्रं प्रह्लादम् प्रति एवं अवदत् ।
भाव : हे पुत्र ! विष्णोः पूजं त्यक्त्वा सुखजीवितं यापय ।
विवरणम् : भवान् विष्णोः पूजांत्यज, सः अस्काकं वैरी, भवान् सुखजीवनं यापय ।

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः

2. स्तम्भेऽस्ति श्रीपतिर्विष्णुः ।

परिचय : इदं वाक्यं नृसिंहाविर्भावः इति पाठ्यभागात् स्वीकृतम् । कविः डा. के. सुधाकररावः ।
सन्दर्भ : हिरण्यकशिपुः स्वपुत्रं प्रह्लादम् प्रति एवं अवदत् ।
भाव : हे पुत्रः भवता पूजितः हरिः एतत् स्तंभे अस्ति वा ?
विवरणम् : कुमार ! श्रीहरि एतत् स्तंभे अस्ति वा ? अस्तिचेत् प्रदर्शयतु |

3. आराधयामासुः अभीष्टदं तम् ।

परिचय : इदं वाक्यं नृसिंहाविर्भावः इति पाठ्यभागात् स्वीकृतम् । कविः डा. के. सुधाकररावः ।
सन्दर्भ : श्री नृसिंहाविर्भावं दृष्ट्वा इन्द्रादि देवतानां स्पन्दनां एवं वदति । भाव : सर्वमभीष्टदं तं विष्णुं सर्वे देवताः आराधयामासुः ।
विवरणम् : स्तंभात् नृसिंहः आविर्ब भूव तदा सर्वे देवाः देवदेवं दृष्ट्वा आराधनामासुः ।

लघु समाधान प्रश्नाः (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

प्रश्न 1.
विष्णोः सङ्कल्पेन शक्त्या च किं किं भविष्यति ?
समादान:
विष्णोः सङ्कल्पेन शक्त्या च विश्वसृष्टिः विनाशः च भविष्यति ।

प्रश्न 2.
राक्षसः हिरण्यकशिपुः किमकरोत् ?
समादान:
राक्षसः हिरण्यकशिपुः स्तम्भोपरि गदाप्रहारं अकरोत् ।

प्रश्न 3.
दैत्यं निहत्य चतुर्भुजः कथं रराज ?
समादान:
दैत्यं निहत्य चतुर्भुजः सायंकालीनः सूर्य इव रराज |

एकपद समाधान प्रश्नाः (ఏక పద సమాధాన ప్రశ్నలు) (One Word Questions)

प्रश्न 1.
मुरारिः कीदृशः इतीरितम् ?
समादान:
मुरारिः सर्वगतः इतीरितम् ।

प्रश्न 2.
स्तम्भात् कः अजायत ?
समादान:
स्तम्भात् नृसिंहः अजायत ।

प्रश्न 3.
नृसिंहः हिरण्यकशिपुं कैः ददार ?
समादान:
नृसिंहः हिरण्यकशिपुं नखैः ददार ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలు – అర్ధాలు)

1. सर्वपापौघनाशं = सकलपापसमूहनाशकम्, సకల పాపముల సమూహాన్ని నశింపచేయు
2. क्रोधारुणाम्बक: = कोपेन रक्तनेत्रः, కోపంతో ఎరుపెక్కిన కన్నులు
3. हर्म्यगतः = प्रासादगतः, ఇంటికి వెళ్ళిన
4. रमाधवः = विष्णुः, విష్ణువు
5. विहङ्गमः = पक्षी, పక్షి
6. कुरङ्गगात्रम् = हरिणदेहः, వేడి దేహము
7. मूर्खावतंसः = मूर्खशिरोमणिः, మూర్ఖశిఖామణి
8. प्रखरैर्नखैः = तीक्ष्णैः नखैः, వాడియైన గూళ్ళు
9. दनुजः = राक्षसः, రాక్షసుడు
10. कीलालसिक्तदेहो = रक्तसिक्तशरीरः, రక్తంతో తడిసిన శరీరము
11. सहस्त्राक्षमुखाः = इन्द्रादयः, ఇంద్రాదులు
12. निलिम्पाः = देवाः, దేవతలు

व्याकरणांशाः (వ్యాకరణాంశాలు)

सन्धयः (సంధులు)

1. इत्यादिकं + च = इत्यादिकञ्च – परसवर्णः
2. दैत्यराजः + असौ = दैत्यराजोऽसौ – विसर्गसन्धिः
3. प्रह्लादः + अपि = प्रह्लादोऽपि – विसर्गसन्धिः
4. विश्वसृष्टिः + भविष्यति = विश्वसृष्टिर्भविष्यति. – विसर्गसन्धिः
5. क्रोधारुणाम्बकः + दैत्यः = क्रोधारुणाम्बको दैत्यः- विसर्गसन्धिः
6. शिरः + त्वदीयम् = शिरस्त्वदीयं – विसर्गसन्धिः
7. प्रभवेत् + धरण्याम् = प्रभवेद्धरण्याम् – जश्त्वसन्धिः
8. गतवान् + तव = गतवांस्तव – रुत्वसन्धिः
9. श्रीपतिः + विष्णुः = श्रीपतिर्विष्णुः – विसर्गसन्धिः
10. क्रोधमूर्तिः + महाबलः = क्रोधमूर्तिर्महाबलः – विसर्गसन्धिः
11. प्रखरैः + नखैः = प्रखरैर्नखैः – विसर्गसन्धिः

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः

समासाः (సమాసాలు)

1. कोपस्य अतिरेकः – कोपातिरेकः – तस्मात् रौद्रः तेन – कोपातिरेकरौद्रेण – पञ्चमीतत्पुरुषः
2. चरणः एव कमलं – चरणकमलं चरणकमलस्य युग्मं – चरणकमलयुग्मम् – षष्ठीतत्पुरुषः
3. दनुजानां कुलं – दनुजकुलं, तस्य विनाशः तं – दनुजकुलविनाशं – षष्ठीतत्पुरुषः
4. शान्तं चित्तं यस्य सः – शान्तचित्तः – बहुव्रीहिः
5. स्थावराश्च जङ्गमाश्च स्थावरजङ्गमाः तेषु – स्थावरजङ्गमेषु – द्वन्द्व
6. वायोः तरङ्गः – वायुतरङ्गः – तन्मध्ये वायुतरङ्गमध्ये – सप्तमीतत्पुरुषः
7. मूर्खेषु अवतंसः मूर्खावतंसः, तत्सम्बुद्धौ मूर्खावतंसः सप्तमीतत्पुरुषः
8. सर्वं व्याप्नोति इति सर्वव्यापी – उपपदतत्पुरुषः
9. महत् बलं यस्य सः महाबलः – बहुव्रीहिः
10. निशायां चरतीति निशाचरः – बहुव्रीहिः
11. गदायाः प्रहारः गदाप्रहारः, तेन भिन्नं गदाप्रहारभिन्नं, तस्मात् – गदप्रहारभिन्नात् – पञ्चमीतत्पुरुषः
12. शङ्खश्च चक्रञ्च शङ्खचक्रे, ते धरतीति शङ्खचक्रधरः – उपपदतत्पुरुषः
13. कीलालेन सिक्तः देहः यस्य सः कीलालसिक्तदेहः – बहुव्रीहिः
14. चत्वारो भुजाः यस्य सः चतुर्भुजः – बहुव्रीहिः

अर्थतात्पर्याणि (Meanings & Substances) (తాత్పర్యములు)

1. कोपातिरेकरौद्रेण दैत्यभूपतिना तदा |
प्रहस्य वचनं प्रोक्तं दृष्ट्वा प्रह्लादबालकम् ||
కోపాతిరేకరౌద్రేణ దైత్యభూపతినా తదా
ప్రహస్య వచనం ప్రోక్తం దృష్ట్వా ప్రహ్లాదబాలకమ్ ||

पदच्छेदः – कोपातिरेकरैद्रेण, दैत्यभूपतिना, तदा, प्रहस्य, वचनं, प्रोक्तं, दृष्ट्वा, प्रह्लादबालकम् ।

अन्वयक्रमः – तदा, कोपातिरेकरौद्रेण, दैत्यभूपतिना, प्रहस्य, प्रह्लांदबालकम्, दृष्ट्वा, वचनं, प्रोक्तम् |

अर्थाः
तदा = అప్పుడు;
कोपातिरेकरौद्रेण = మిక్కిలి కోపంతో కలిగిన రౌద్రంతోకూడిన;
दैत्यभूपतिना = హిరణ్యకశిపునిచేత;
प्रहस्य = నవ్వి,
प्रह्लांदबालकम् = బాలుడైన ప్రహ్లాద బాలకునిచే;
वचनं = చెప్పబోవు మాటలను;
प्रोक्तम्= పలుకబడినది.

भावः-
హిరణ్యకశిపుడు కోపంతో రౌద్రుడు అయ్యాడు. పిమ్మట పెద్దగా నవ్వి తన కుమారుడైన ప్రహ్లాదునితో ఈ విధంగా పలికాడు.

Then the Demon king, who was very much angry, laughed and said to the boy Prahlada.

2. हरेः पूजनं त्वं परित्यज्य नित्यं ममैवार्चनं स्तोत्रमित्यादिकञ्च ।
कुरुष्वान्तरङ्गे भयं नास्ति पुत्र सदा भोगसौख्येषु नूनं रमस्व ॥
హరేః పూజనం త్వం పరిత్యజ్య నిత్యం మమైవార్చనం స్తోత్రమిత్యాదికంచ |
కురుష్వంతరంగే భయంనాస్తి పుత్ర సదా భోగసౌఖ్యేషు నూనం రమస్వ ॥

पदच्छेदः – हरेः, पूजनं, त्वं परित्यज्य नित्यं ममैव, अर्चनम् स्तोत्रं, इति आदिकञ्च कुरुष्व, अन्तरङ्गे भयं नास्ति, पुत्र, सदा, भोगसौख्येषु नूनं, रमस्व ।

अन्वयक्रमः – पुत्र, हरेः, पूजनं, त्वं परित्यज्य, नित्यं, ममैव, अर्चनं, च, स्तोत्रं, इत्यादिकं, कुरुष्व अन्तरंगे, भयं नास्ति, सदा, भोगसौख्येषु, रमस्व नूनम् ।

अर्थाः
पुत्र = కుమారా!
हरेः = విష్ణువుయొక్క,
पूजनं = పూజను,
परित्यज्य = వదలిపెట్టి;
नित्यं = ఎల్లప్పుడు;
ममैव = నాకు సంబంధించిన;
अर्चनं = పూజను ;
स्तोत्रं = స్తోత్రాన్ని;
इत्यादिकंच = మొదలైనవాటిని;
कुरुष्व = చేయుము;
अन्तरंगे = మనసులో,
भयं = భయము;
नास्ति = లేదు;
सदा = ఎల్లప్పుడు;
भोगसौख्येषु = భోగసౌఖ్యాలయందు;
रमस्व = అనుభవించుము;
नूनम् = నిశ్చయము.

भावः-
ఓయీ ! కుమారా ! శ్రీ మహావిష్ణువును సేవించడం విడిచిపెట్టు. నిత్యం నన్నే అర్చించు. స్తోత్రముచేయుము. నీ మనసులో భయాన్ని వదలిపెట్టు. సకల సౌఖ్యాలను అనుభవించు.

“Abandon the worship of Hari. Start wor-shipping me reciting hymns etc. Have no fear inside. Always en¬joy pleasures and comforts.”

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः

3. इत्युक्त्वा दैत्यराजोऽसौ विरराम महाबलः ।
मन्दस्मिताननो बालः प्रह्लादोऽपि तमब्रवीत् ॥
ఇత్యుక్త్వా దైత్యరాజోసౌ విరరామ మహాబలః |
మందస్మితాననో బాలః ప్రహ్లాదోపి

पदच्छेदः इति, उक्त्वा, दैत्यराजः, असौ, विरराम महाबलः, मन्दस्मिताननः, बालः, प्रह्लादः, अपि तं अब्रवीत् ।

अन्वयक्रमः असौ महाबलः दैत्यराजः इति उक्त्वा, विरराम, मन्दस्मितानानः बालः, प्रह्लादः, अपि, तं, अब्रवीत् ।

अर्थाः-
असौ = ఈ,
महाबलः = గొప్ప బలవంతుడైన,
दैत्यराजः = రాక్షసరాజు;
इति + उक्त्वा = అనిపలికి;
विरराम = విశ్రమించాడు;
मन्दस्मितानानः = చిరునవ్వుతో కూడిన ముఖముగల;
बालः = బాలుడైన ;
प्रह्लादः + अपि = ప్రహ్లాదుడు కూడా;
तं = ఆ హిరణ్యకశిపుని గూర్చి;
अब्रवीत् = పలికాడు.

भावः-
రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఈ విధంగా మాట్లాడి ఊరకున్నాడు. పిమ్మట ప్రహ్లాదుడు చిరునవ్వుతో కూడిన ముఖముగలవాడై తండ్రితో ఈ విధంగా పలికాడు.

When the king of the Demons said thus, the boy Prahlada replied him with a smile.

4. जनक सकलसृष्टेर्मूलभूतस्य तस्य
चरणकमलयुग्मं भूपते संस्मरामि ।
विमलमखिलवेद्यं सर्वपापौघनाशं
दनुजकुलविनाशं मानवैः पूजनीयम् ॥

జనక సకల సృష్టేర్మూలభూతస్య తస్య
చరణకమలయుగ్మం భూపతేసంస్మరామి।
విమలమఖిలవేద్యం సర్పపాపౌఘనాశం
దనుజకులవినాశం మానవైః పూజనీయమ్ ||

पदच्छेदः – जनक, सकलसृष्टेः, मूलभूतस्य तस्य चरणकमलयुग्मं, भूपते, संस्मरामि, विमलमखिलवेद्यं सर्वपापौघनाशं, दनुजकुलविनाशं, मान पूजनीयम् ।

अन्वयक्रमः – जनक, सकलसृष्टेः मूलभूतस्य तस्य चरणकमलयुग्मं विमलं, अखिलवेद्यं, सर्व पापौघनाशं, दनुजकुलविनाशं, मानवैः, पूजनीयम्, संस्मरामि ।

अर्थाः-
जनक = తండ్రి,
सकलसृष्टेः = సకల సృష్టికి,
मूलभूतस्य = మూలాధారమైన;
विमलं = పరిశుభ్రమైన;
अखिलवेद्यं = సమస్తము తెలిసిన;
सर्वपापौघनाशं = సకల పాపములను తొలగించునట్టి;
दनुजकुलविनाशं = రాక్షస కుల వినాశమును కల్గించునట్టి;
मानवैः = మానవులచేత;
पूजनीयम् = పూజింపదగిన;
तस्य = ఆ శ్రీహరి యొక్క;
चरणकमलयुग्मं = పాదపద్మములను;
संस्मरामि = స్మరిస్తాను.

भावः-
ఓ తండ్రి ! సకల సృష్టికి మూలభూతమైన, పవిత్రమైన, అంతయు తెలిసిన, సర్వపాపాలను తొలగించునట్టి, రాక్షస వంశాన్ని నాశనం చేయునట్టి, మానవులచే పూజించునట్టి ఆ శ్రీహరి పాద పద్మాలను స్మరిస్తాను.

“Father, I meditate on the lotus feet of the one, who is the cause of this whole universe. Those feet are pious, knowable to all, destroyer of all sins, the annihilator of the Danava dynasty and honourabe to human beings.

5. तस्य सङ्कल्पमात्रेण विश्वसृष्टिर्भविष्यति ।
क्षणमात्रे विनाशोऽपि विष्णोः शक्त्या भविष्यति ॥
తస్య సంకల్పమాత్రేణ విశ్వసృష్టిర్భవిష్యతి |
క్షణమాత్రే వినాశోకాపి విష్ణోః శక్త్యా భవిష్యతి ||

पदच्छेदः – तस्य, संकल्पमात्रेण, विश्वसृष्टिः, भविष्यति, क्षणमात्रे, विनाशः, अपि विष्णोः शक्त्या, भविष्यति ।

अन्वयक्रमः – तस्य, संकल्पमात्रेण, विश्वसृष्टिः, भविष्यति, विष्णोः, शक्त्या, क्षणमात्रे, अपि, विनाशः भविष्यति ।

अर्थाः-
तस्य = ఆ శ్రీహరి యొక్క
विश्वसृष्टि: = సంకల్పమాత్రం చేత,
विश्वसृष्टिः = సమస్త సృష్టి;
भविष्यति = కలుగుతుంది;
विष्णोः = విష్ణువు యొక్క;
शक्त्या = శక్తితో;
विनाशः + भविष्यति = వినాశముకూడా;
क्षणमात्रे = క్షణకాలంలో;
भविष्यति= జరుగగలదు.

भावः-
తండ్రి ! ఆ శ్రీమహావిష్ణువు యొక్క సంకల్పబలంతోనే ఈ సృష్టి ఆవిర్భ వించుచున్నది. ఆ మహనీయుని శక్తి వల్లనే ఈ సృష్టి క్షణకాలంలో నాశనం కలుగుతుంది.

The whole creation happens just by his will. By the power of Vishnu it gets destructed in a moment.”

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः

6. एवमुक्त्वा स प्रह्लादो तूष्णी तस्थो महामतिः|
क्रोधारुणाम्बको दैत्यो जगाद वचनं कटु |
ఏవముక్త్వా సప్రహ్లాదో తూస్టీం తస్టౌ మహామతిః,
క్రోధారుణాంబకో దైత్యో జగాద వచనం కటు ॥

पदच्छेदः – एवं, उक्त्वा, सः, प्रह्लादः, तुष्णीं, तस्यौ, महीपतिः, क्रोधरुणाम्बकः, दैत्यः जगाद वचनं, कटु |

अन्वयक्रमः – सः, प्रह्लादः, एवं उक्त्वा, तूष्णीं, तस्यौ, क्रोधारुणांबकः, महीपतिः, दैत्यः, कटु, वचनं जगाद ।

अर्थाः-
सः प्रह्लादः = ఆ ప్రహ్లాదుడు,
एवं = ఈ విధముగా,
उक्त्वा = పలికి,
तूष्णीं = ఊరక,
तस्यौ = ఉండెను
क्रोधारुणांबकः = కోపంతో ఎర్రబడిన కన్నులుగల,
महीपतिः = రాజైన;
दैत्यः = రాక్షసుడై హిరణ్యకశిపుడు;
कटु = పరుషముతో కూడిన;
वचनं = మాటలను;
जगाद = పలికెను.

भावः-
ప్రహ్లాదుడు ఈ విధముగా మాట్లాడి ఊరకుండెను. పిమ్మట రాక్షసరాజైన హరణ్యకశిపుడు కోపగించాడు. దాంతో అతని కన్నులు బాగా ఎర్రబడినాయి. పరుష వచనములతో ప్రహ్లాదునితో ఈ విధంగా పలికాడు.

Having said so, the wise Prahlada re-mained silent. The Danava spoke harshly with eyes reddened with anger.

7. गुरुं तिरस्कृत्य तदीयशत्रुं
हरिं समाराधयता त्वया हि ।
कृतोऽपराधः सुमहान् खलेन
यमालयं गच्छसि मूढबुद्वै ॥

గురుం తిరస్కృత్య తదీయ శత్రుం
హరిం సమారాధాయతా త్వయా హి |
కృతోSపరాథః సుమహాన్ ఖలేన
యమాలయం గచ్ఛతి మూఢబుద్ధే ॥

पदच्छेदः – गुरुं, तिरस्कृत्य तदीयशत्रुं हरिं, समाराधयता, त्वया, हि, कृतः, अपुराधः, सुमहान्, खलेन, यमालयं गच्छति, मूढबुद्धे ।

अन्वयक्रमः – मूढबुद्धे, तदीयशत्रुं, हरि, समाराधयता, खलेन त्वया गुरुं, तिरस्कृत्य, सुमहान् अपराधः कृतः, यमालयं, गच्छति ।

अर्थाः-
मूढबुद्ध = ఓ మూఢబుద్ది కలవాడా,
तदीयशत्रुं = ఆ శత్రువైన,
हरिं = విష్ణువును;
समाराधयता = ఆరాధించుచున్న;
खलेन = నీచుడవైన;
त्वया = నీ చేత;
सुमहान् = పెద్దదైన ;
अपराधः = అపరాధము;
कृतः = చేయబడినది;
यमालयं = నరకానికి;
गच्छति = వెళ్తావు.

भावः-
ఓయీ ! దుర్భుద్ధికలవాడా ! మనకు శత్రువైన శ్రీహరిని ఆరాధిస్తున్నావు దీంతో నీవు పెద్ద తప్పుచేశావు. నీవు నరకానికి వెళ్తావు.

“Rejecting your father, you worship his enemy; thereby you have committed a grave mistake. O fool, you will go to the abode of Yama.

8. गदाप्रहारेण शिरस्त्वदीयं
करोमि भग्नं क्षणमात्रकाले ।
पश्याम्यहं कोऽपि हरिः समेत्य
त्वां रक्षितुं वै प्रभवेद्धरण्याम् ||
గదాప్రహారేణ శిరస్త్వదీయం
కరోమి భగ్నం క్షణమాత్రకాలే |
పశ్యామ్యహం కోలిపి హరిః సమేత్య
త్వాం రక్షితుం వై ప్రభవేద్ధరణ్యామ్

पदच्छेदः – गदाप्रहारेण, शिरः, त्वदीयं करोमि, भग्नं, क्षणमात्रकाले, पश्यामि, अहं, कः अपि, हरिः समेत्य त्वां, रक्षितुं, वै, प्रभवेत्, धरण्याम् ।

अन्वयक्रमः – गदप्रहारेण, त्वदीयं शिरः, क्षणमात्रकाले, भग्नं करोमि, धरण्याम्, कः, अपि, हरिः त्वां समेत्य, रक्षितुं प्रभवेत्, अहं पश्यामि |

अर्थाः-
गदप्रहारेण = గద దెబ్బతో;
त्वदीयं = ఒక్క క్షణ కాలంలో; భూమిపై;
भग्नंकरोमि = ఏ విష్ణువు ;
भग्नं करोमि = పగలగొడతాను;
धरण्याम् = భూమిపై,
कः हरिः = ఏ విష్ణువు,
त्वां = నిన్ను;
समेत्य = సమీపించి;
त्वां = నిన్ను;
समेत्य = సమీపించి;
रक्षितुं = రక్షించుటకు;
प्रभवेत् = సమర్థుడు కాగలడో;
अहं = నేను;
पश्यामि = చూస్తాను.

भावः-
ఓరీ ! ఈ గద యొక్క దెబ్బతో నీ తలను క్షణకాలంలో పగులగొడతాను. లోకంలో ఏ విష్ణువు నిన్ను చేరి రక్షిస్తాడో నేను చూస్తాను.

I will break your head in a moment with the blow of mace. Let me see if any Hari will come to your rescue in this world.

9. हरिश्च ते सर्वगतो मुरारिः
इतीरितं बालक दर्शयाद्य |
स्तम्भेऽस्ति वा हर्म्यगते स विष्णुः
क्व श्रीनिवासः क्व महेन्द्रनीलः ॥
హరిశ్చ తే సర్వగతో మురారిః
ఇతీరితం బాలక దర్శయాద్య ।
స్తంభేస్తి వా హర్మ్యగతే సవిష్ణుః
క్వ శ్రీనివాసః క్వ మహేంద్రనీలః

पदच्छेदः – हरिः, च, ते, सर्वगतः, मुरारिः, इति, ईरितं, बालक, दर्शय, अद्य, स्तम्ये, अस्ति, वा, हर्म्यगते, स, विष्णु क्कं श्रीनिवासः क्व महेन्द्रनीलः

अन्वयक्रमः – बालक, मुरारिः ते, हरिः, सर्वगतः, इति ईरितम्, अद्य, दर्शय, हर्म्यगते, स्तम्भे, सः, विष्णुः अस्ति का श्रीनिवासः, क्व महेन्द्रनीलः क्व |

अर्थाः-
बालक = ఓరీ బాలుడా!,
मुरारिः = మురారి అయిన;
ते = నీ యొక్క,
हरिः = విష్ణువు;
सर्वगतः = అంతట ఉన్నాడు;
इति = అన్ని;
ईरितम्, = పలుకబడినది ;
अध = ఇప్పుడు;
दर्शय = చూపించుము;
हर्म्यगते = ఇంటియందలి;
स्तम्भे = స్తంభమునందు;
सः विष्णुः = ఆ విష్ణువు;
अस्ति वा = ఉన్నాడా;
श्रीनिवासः = శ్రీనివాసుడు;
क्व = ఎక్కడ;
महेन्द्रनीलः = నీలదేహుడు;
क्व = ఎక్కడ.

भावः-
ఓయీ ! మురారి అయిన నీ విష్ణువు అంతట ఉన్నాడని నీవు చెప్పావు గదా ! ఇప్పుడు నాకు చూపించు. ఇంటిలోని ఈ స్తంభంలో ఉన్నాడా ? శ్రీనివాసుడు ఎక్కడ ? నీలదేహుడైన విష్ణువు ఎక్కడ ?

O boy, you say that Hari is everywhere. Show me now whether that Hari in this pillar in the palace. Where is Srinivasa ? Where is that Blue one”.

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः

10. तदा तद्वचनं श्रुत्वा राक्षसस्य महामतिः ।
प्रह्लादः शान्तचित्तः सन् अवोचद्वाक्यमुत्तमम् ||
తదా తద్వచనం శ్రుత్వా రాక్షసస్య మహాపతిః |
ప్రహ్లాదః శాంతచిత్తః సన్ అవోచద్వాక్యముత్తమమ్ ॥

पदच्छेदः – तदा, तद्वचनं श्रुत्वा, राक्षसस्य, महापतिः, प्रह्लादः, शान्तचित्तः, सन्, अवोचत्, वाक्यं, उत्तमम् ।

अन्वयक्रमः – तदा, राक्षसस्य, महीपतिः, तद्वचनं श्रुत्वा, प्रह्लादः, शान्तचित्तः, सन् उत्तमं वाक्यं, अवोचत्

अर्थाः-
तदा = అప్పుడు,
राक्षसस्य = రాక్షసులకు,
महीपतिः = రాజైన,
तद्वचनं = మాటలను;
श्रुत्वा = విని;
प्रह्लादः = ప్రహ్లాదుడు;
शान्तचित्तः सन् = శాంతచిత్తుడై ;
उत्तमं = ఉత్తమమైన;
वाक्यं = మాటను;
अवोचत् = పలికాడు.

भावः-
రాక్షసరాజైన హిరణ్యకశిపుని మాటలను ప్రహ్లాదుడు విన్నాడు. ప్రశాంత భావంతో ప్రహ్లాదుడు ఉత్తమమైన మాటలను రాజుతో ఈవిధంగా పలికాడు.

On hearing those words of the Rakshasa, Prahlada, whose mind was calm, replied thus.

11. रमाधवः स्थावरजङ्गमेषु नरेषु सिंहेषु विहङ्गमेषु ।
जलेऽनले वायुतरङ्गमध्ये विराजते हस्तिकुरङ्गगात्रे ॥
రమాధవః స్థావరజంగమేషు నరేషుసింహేషు విహంగమేషు |
జల్వేనలే వాయు తరంగ మధ్యే విరాజతే హస్తికురంగగాత్రే ॥

पदच्छेदः रमाधवः स्यावरजंगमेषु नरेषु, सिंहेषु, विहङ्गमेषु जले, अनले वायुतरंगमध्ये विराजते हस्तिकुरंग गात्रे |

अन्वयक्रमः – रमाधवः, स्थावरजंगमेषु नरेषु, सिंहेषु, विहङ्गमेषु, जले, अनले, वायुतरंगमध्ये, हस्ति – कुरंगगात्रे विराजते ।

अर्थाः-
रमाधवः = విష్ణువు
स्थावरजंगमेषु = కదలని
नरेषु = నరులయందు
सिंहेषु = సింహములయందు;
विहङ्गमेषु = పక్షులయందు;
जले = నీటియందు;
अनले = అగ్నియందు ;
वायुतरंगमध्ये = వాయుతరంగములయందు;
हस्ति = ఏనుగులందు;
कुरंगगात्रे = జింకల శరీరాలయందు;
विराजते = ప్రకాశిస్తున్నాడు.

भावः-
ఓయీ, తండ్రి ! శ్రీ మహావిష్ణువు స్థావర జంగమాదులయందు, నదుల యందు, సింహాలయందు, పక్షులయందు, నీటియందు, అగ్నియందు, వాయు తరంగాలయందు, ఏనుగులయందు, జింకల శరీరాలయందు ప్రకాశిస్తున్నాడు అనగా విష్ణువు ఉన్నాడని భావము.

“The consort of Rama dwells in ani¬mate and inanimate beings, in men, lions, birds, water, fire, wind, waves and in the bodies of elephants and deer.”

12. प्रह्लादवचनं दैत्यः समाकर्ण्य हिरण्यकः ।
क्रोधोन्मत्त उवाचेदं वचनं परुषाक्षरम् ॥
ప్రహ్లాదవచనం దైత్యః సమాకర్ణ్య హిరణ్యకః |
క్రోధోన్మత్త ఉవాచేదం వచనం పరుషాక్షరమ్ ॥

पदच्छेदः प्रह्लादवचनं दैत्यः समाकर्ण्य, हिरण्यकः, क्रोधोन्मत्तः उवाच, इदं वचनं, परुषाक्षरम् |

अन्वयक्रमः- दैत्यः, हिरण्यकः, प्रह्लादवचनं, समाकर्ण्य, क्रोधोन्मत्तः, परुषाक्षरं, इदं वचनं, उवाच ।

अर्थाः-
दैत्यः = రాక్షసుడైన;
हिरण्यकः = హిరణ్యక శివుడు,
प्रह्लादवचनं = ప్రహ్లాదుని మాటలను;
समाकर्ण्य = విని;
क्रोधोन्मत्तः = కోపముతో కూడినవాడై;
परुषाक्षरं = పరుషములైన మాటలతో,
इदं वचनं = ఈ మాటలను;
उवाच = పలికాడు.

भावः-
రాక్షసరాజైన హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని మాటలను విన్నాడు. మిక్కిలి కోపంతో కూడినవాడై పరుషంగా ఈ విధంగా పలికాడు.

Hiranyaka, having heard the words of Prahlada, becoming mad with anger, spoke these harsh words.

13. रे मूढ दर्शय हरिं क्व गतः स भीरुः
स्तम्भेऽस्ति वा मुररिपुः क्व गतो रमेशः ।
अद्यैव केशवमहं गदया हनिष्ये
मूर्खावतंस गतवांस्तव कुत्र विष्णुः ||

రే మూఢ దర్శయ హరిం క్వగతః స భీరుః
స్తంభేకాస్తి వా మురరిపుః క్వ గతో రమేశః,
అద్యైవ కేశవమహం గదయా హనిష్యే
మూర్ఖావతంస గతవాంస్తవ కుత్ర విష్ణుః

पदच्छेदः – रे, मूढ, दर्शय, हरि, क्व, गतः, सः, भीरुः, स्तंभे, अस्ति, वा, मुररिपुः, क्व, गतः, रमेशः अद्य, एव, केशवं, अहं, गदथा, हनिष्ये, मूर्खावतंस, गतवान् तव, कुत्र, विष्णुः |

अन्वयक्रमः – रे मूढ, मूर्खावतंस, हरिं दर्शय, भीरुः, सः क्व गतः, मुररिपुः, स्तंभे, अस्ति, वा, रमेशः क्व गतः, अद्यैव, अहं गदया, केशवं, हनिष्ये, तव, विष्णुः, कुत्र, गतवान् ।

अर्थाः-
रे मूढ = ఓ మూఢుడా,
मूर्खावतंस = ఓ ముర్ఖశిఖామణి;
हरिं = విష్ణువును;
दर्शय = చూపించు;
भीरुः = భయస్థుడైన;
सः = ఆ విష్ణువు;
स्तंभे = స్తంభమునందు;
अस्ति वा = ఉన్నాడా;
रमेशः = విష్ణువు;
क्व गतः = ఎక్కడికి వెళ్ళాడు;
अद्यैव = ఈ రోజే;
अहं = నేను;
केशवं = విష్ణువును;
गदथा = గదతో;
हनिष्ये = చంపగలను;
तव = నీ యొక్క;
विष्णुः = విష్ణువు;
कुत्र = ఎక్కడికి;
गतवान् = వెళ్ళాడు.

भावः-
ఓరీ మూఢుడా ! శ్రీ హరిని నాకు చూపించు. భయస్తుడైన ఆ విష్ణువు ఎక్కడికి వెళ్ళాడు ? ఈ స్తంభంలో ఉన్నాడా ? ఎక్కడికి వెళ్ళాడు. ఈ రోజే నా గదతో ఆ విష్ణువును చంపుతాను. నీ విష్ణువు ఎక్కడికి వెళ్ళాడు ?

“Oh fool, Show me Hari. Where has that coward gone? Is he in this pillar? Where has he run away, that Muraripu? I will kill Kesava with the mace now itself. O stupid fellow, where has your Vishnu gone?”

14. तच्छ्रुत्वा वचनं बालः प्रह्लादः स्मितपूर्वकम् ।
जगाद स रमेशस्तु सर्वव्यापी महाबलः ॥
తచ్ఛృత్వా వచనం బాలః ప్రహ్లాదః స్మితపూర్వకమ్ |
జగాద స రమేశస్తు సర్వవ్యాపీ మహాబలః ॥

पदच्छेदः – तत् श्रुत्वा वचनं, बालः, प्रह्लादः, स्मितपूर्वकं, जगाद, स, रमेशः, तु, सर्वव्यापी, महाबलः

अन्वयक्रमः – तत्, वचनं श्रुत्वा, बालः, प्रह्लादः, स्मितपूर्वकं, जगाद, महाबलः, सर्वव्यापी स:, रमेशः, सर्वव्यापी ।

अर्थाः-
तत् वचनं = ఆ రాక్షసేంద్రుని,
वचनं = మాటలను,
श्रुत्वा = విని ,
बालः = బాలుడైన;
प्रह्लादः = ప్రహ్లాదుడు;
स्मितपूर्वकं = చిరునవ్వుతో;
जगाद = పలికాడు;
महाबलः = మహాబలుడైన;
स: रमेशः = ఆ విష్ణువు;
सर्वव्यापी = సర్వ వ్యాపకుడు.

भावः-
బాలుడైన ప్రహ్లాదుడు తన తండ్రి పలికిన మాటలను విని చిరునవ్వుతో మహాబలుడైన ఆ శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకుడు.

On listening those words, Prahlada smil-ingly said that Hari is omnipresent.

15. तस्य संहरणं नैव शक्यं तेऽस्ति निशाचर ।
स्तम्भेऽस्ति श्रीपतिर्विष्णुः वर्तते सर्वगोचरः ||
తస్య సంహరణం నైవ శక్యం తేవ్రాస్తే నిశాచర
స్తంభేకాస్తి శ్రీపతిర్విష్ణుః వర్తతే సర్వగోచరః

पदच्छेदः तस्य, संहरणं, नैव, शक्यं, ते, अस्ति, निशाचर, स्तंभे, अस्ति, श्रीपतिः, विष्णुः वर्तते, सर्वगोचरः,

अन्वयक्रमः – निशाचर, तस्य, संहरणं, ते नैव, शक्यम्, सर्वगोचरः, श्रीपतिः, विष्णुः स्तंभे, वर्तते ।

अर्थाः-
निशाचर = ఓ రాక్షస రాజా!
तस्य = ఆ విష్ణువు యొక్క,
संहरणम् = సంహరణ;
नैव शक्यम् = సాధ్యంకాదు;
सर्वगोचरः = అంతట కన్పించేటువంటి;
श्रीपतिः = లక్ష్మీ దేవికి భర్త అయిన;
विष्णुः = విష్ణువు ;
स्तंभे = స్తంభమునందు;
वर्तते = ఉన్నాడు.

भावः-
తండ్రీ ! ఆ విష్ణువును సంహరించడం నీ వలన సాధ్యం కాదు. సర్వగోచరుడైన విష్ణువు ఈ స్తంభమునందు ఉన్నాడు.

It is impossible to kill him. Vishnu is in this pillar. He can be seen everywhere.

16. तदा हिरण्यकशिपुः क्व हरिस्ते इति ब्रुवन् ।
गदाप्रहारमकरोत् स्तम्भस्योरि राक्षसः ॥
తదా హిరణ్యకశిపుః క్వ హరిస్తే ఇతి బ్రువన్ |
గదాప్రహారమకరోత్ స్తంభస్యోరి రాక్షసః ॥

पदच्छेदः – तदा, हिरण्यकशिपुः क्व, हरिः, वे, इति, ब्रुवन्, गदाप्रहारम्, अकरोत्, स्तम्भस्य, उपरि, राक्षसः ।

अन्वयक्रमः तदा, राक्षसः, हिरण्यकशिपुः, ते हरिः, क्व, इति, ब्रुवन्, स्तम्भस्य, उपरि, गदाप्रहारे, अकरोत् ।

अर्थाः-
तदा = అప్పుడు,
राक्षसः = రాక్షసుడైన,
हिरण्यकशिपुः = హిరణ్యకశిపుడు;
ते = నీ యొక్క;
हरिः = విష్ణువు;
क्व = ఎక్కడ;
इति = అని;
ब्रुवन् = పలుకుతూ;
स्तम्भस्य = స్తంభముయొక్క ;
उपरि = పైన;
गदाप्रहारम् = గదతో కొట్టడాన్ని;
अकरोत् = చేశాడు.

भावः-
రాక్షసుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో “నీ హరి ఎక్కడున్నాడు ?” అని పలుకుతూ స్తంభంపైన గదతో కొట్టడం చేశాడు.

Then Hiranyakasipu hit the pillar with the mace shouting where your Hari is ?

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः

17. गदाप्रहारभिन्नाञ्च स्तम्भात्तस्मादजायत ।
नृसिंह भगवान् विष्णुः क्रोधमूर्तिर्महाबलः ॥
గదాప్రహారభిన్నాచ్చ స్తంభాతస్మాదయత।
నృసింహో భగవాన్ విష్ణుః క్రోధమూర్తిర్మహాబలః

पदच्छेदः – गदाप्रहारभिन्नात् च, स्तम्भात्, तस्मात्, अजायत, नृसिंहः, भगवान् विष्णुः क्रोधमूर्तिः, महाबलः ।

अन्वयक्रमः – गदाप्रहारभिन्नात् तस्मात् स्तम्भात्, क्रोधमूर्तिः, महाबलः, नृसिंहः, भगवान्, विष्णुः, अजायत ।

अर्थाः-
गदाप्रहारभिन्नात् = గదతో కొట్టబడి భిన్నమైన ,
तस्मात् स्तम्भात् = ఆ స్తంభం నుండి;
क्रोधमूर्तिः = కోపముతో కూడిన;
महाबलः = గొప్ప బలవంతుడైన;
नृसिंहः = నృసింహుడైన;
भगवान् = దైవస్వరూపుడైన;
विष्णुः = విష్ణువు;
अजायत: = ఆవిర్భవించాడు.

भावः-
హిరణ్యకశిపుడు గదతో స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం నుండి మిక్కిలి కోపంతో కూడిన, మహాబలవంతుడైన, నృసింహమూర్తిగా ఉన్న దైవమైన విష్ణువు ఆవిర్భవించాడు.

From the pillar broken by the blow of the mace appeared Vishnu in the angry form Nrisimha.

18. शङ्खचक्रधरो विष्णुः नृसिंहो प्रखरैर्नखैः ।
अङ्के संस्थाप्य दनुजं ददार पुरुषोत्तमः ॥
శంఖచక్రధరో విష్ణుః నృసింహో ప్రహరైర్నఖైః |
అంకే సంస్థాప్య దనుజం దదార పురుషోత్తమః ॥

पदच्छेदः – शंखचक्रधरः, विष्णुः, नृसिंहः, प्रहरैः, नखैः, अंके, शंस्थाप्य, दनुजं, ददार, पुरुषोत्तमः ।

अन्वयक्रमः – चक्रधरः, पुरुषोत्तमः, नृसिंहः, विष्णुः, दनुजम्, अंके, संस्थाप्य, प्रहरैः, नखैः, ददार ।

अर्थाः-
चक्रधरः = చక్రధరుడైన,
पुरुषोत्तमः = పురుషోత్తముడైన,
नृसिंहः = నృసింహుడైన;
विष्णुः, = విష్ణువు;
दनुजम् = రాక్షసుడైన;
तम् = ఆ హిరణ్యకశిపుడిని;
अंके = ఒడిలో;
संस्थाप्य = కూర్చుండబెట్టుకొని;
प्रहरैः = వాడియైన;
नखैः = గోళ్ళతో;
ददार = చీల్చాడు.

भावः-
చక్రధరుడు, పురుషోత్తముడు, నృసింహుడు అయిన విష్ణువు రాక్షసరాజైన హిరణ్యకశిపుడిని తన ఒడిలో ఉంచుకొని వాడియైన గోళ్ళతో చీల్చి సంహరించాడు.

Vishnu, holding conch and disk, in the form of Nrisimha tore apart with sharp nails the Demon, having dragged him on to his lap.

19. दैत्यं निहत्य कीलालसिक्तदेहो चतुर्भुजः ।
रराज सायंकालीनः यथा सूर्योऽरुणो महान् ॥
దైత్యం నిహత్య కీలాల సిక్తదేహో చతుర్భుజః ।
రరాజ సాయంకాలీనః యథా సూర్యోకుణో మహాన్ ||

पदच्छेदः – दैत्यं, निहत्य, कीलालसिक्तदेहः चतुर्भुजः, रराज, सायंकालीनः, यथा, सूर्यारुणो, महान् ।

अन्वयक्रमः – महान् चतुर्भुजः, दैत्यं निहत्य, कीलालसिक्तदेहः, सायंकालीनः सूर्यारुणः यथा, रराज ।

अर्थाः-
महान् = గొప్పవాడైన,
चतुर्भुजः = విష్ణువు,
दैत्यं = రాక్షసుడైన హిరణ్య కశిపుడిని;
निहत्य = చంపి;
कीलालसिक्तदेहः = రక్తముతో తడిసిన శరీరము గలవాడై;
सायंकालीनः = సాయంకాలమునకు చెందిన;
सूर्यारुणः यथा = సూర్యునివలె;
रराज = ప్రకాశించాడు.

भावः-
మహాత్ముడైన విష్ణువు రాక్షసేంద్రుడైన హిరణ్య కశిపుడిని సంహరించాడు. ఆ సమయంలో నరసింహుడు రక్తముతో తడిసిన శరీరముకలవాడై సాయంకాలపు సూర్యునివలె ప్రకాశించాడు.

Having killed the demon, with his body smeared with blood, Vishnu looked like the red Sun at the time of setting.

20.
दैत्यं नृसिंहेन हतं महोग्रं
ज्ञात्वा सहस्राक्षमुखा निलिम्पाः ।
आनन्दमग्ना ननृतुर्मुकुन्दम्
आराधयामासुरभीष्टदं तम् ॥
దైత్యం నృసింహేన హతం మహోగ్రం
జ్ఞాత్వా సహస్రాక్షముఖా నిలిష్తాః |
ఆనందమగ్నా ననృతుః ముకుందం
ఆరాధయామాసు రభీష్టదం తమ్ ||

पदच्छेदः – दैत्यं, नृसिंहेन, हतं, महोग्रं, ज्ञात्वा सहस्राक्ष मुखाः निलिप्ताः, आनन्दमग्नाः, ननृतुः, मुकुन्दम् आराधायामासुः, अभीष्टं, तम् ।

अन्वयक्रमः – नृसिंहेन, हतं, महोग्रं, दैत्यं, ज्ञात्वा, सहस्राक्षमुखाः, निलिप्ताः, आनन्दमग्नाः ननृतुः, अभीष्टदम्, तम्, मुकुंदम्, आराधयामासुः

अर्थाः-
नृसिंहेन = నరసింహస్వామిచేత,
हतं = చంపబడిన,
महोग्रं = భయంకరుడైన;
दैत्यं = హిరణ్యకశిపుని;
ज्ञात्वा = తెలుసుకొని;
सहस्राक्षमुखाः = దేవేంద్రాదులైన;
निलिप्ताः = దేవతలు ;
तम् मुकुंदम् = నాట్యం చేశాడు;
अभीष्टदम् = కోరికలను ఇచ్చునట్టి;
तम् मुकुंदम् = ఆ విష్ణువును;
अर्च यामासुः: = పూజించారు.

भावः-
నరసింహుడు భీకరుడైన హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ విషయం తెలుసుకొని ఇంద్రాది దేవతలు ఆనందించారు. సకల కోరికలను అనుగ్రహించునట్టి శ్రీమహా విష్ణువును భక్తితో పూజించారు.

Indra and other gods, on knowing that the demon was killed, danced with joy and worshipped Vishnu, who did favour to them.

नृसिंहाविर्भावः Summary in Sanskrit

कवि परिचयः 

पाठ्यांशोऽयं नृसिंहनखकौमुदी इत्याख्यमहाकाव्यात् गृहीतः । अस्य रचयिता डा. के. सुधाकररावः । संस्कृत-आंग्ल-तेलुगु- कन्नडेत्यादि भाषासु निष्णातः अयं कविपण्डितः आदोनि इत्याख्ये पट्टणे १९६० तमे वर्षे जातः । अस्य पितरौ श्रीअनसूया-तिम्माजिरावौ । बाल्ये श्रीदक्षिणामूर्तिविदुषः सकाशे शंस्कृतम् अभ्यस्तवानयम् । संस्कृते तेलुगुभाषायां च स्नातकोत्तरपरीक्षायाम् उत्तीर्णोऽयं विद्वान् द्विसप्ततिं ग्रन्थान् प्रणीतवान् । एतेषु तेलुगुभाषायां ६९, संस्कृते १५, कन्नडभाषायां १३, हिन्दीभाषायां च ५ ग्रन्थाः सन्ति । अयं २०१७ तमे वर्षे कर्णाटक विश्वविद्यालयात् विद्यावारिधिं अलभत । तन्त्रोपासनादक्षः श्री रावमहोदयः संस्कृते श्रीनृसिंहनखकौमुदी, श्रीलक्ष्मीहयग्रीवसुधा इति महाकाव्यद्वयम् अरचयत् । निरन्तरम् अध्ययने विविधशास्त्राणां परिशोधने च निमग्नोऽयं कविवरः Indian Information Service परीक्षायां १९८७ वर्षे उत्तीर्णतां प्राप्तवान् । इदानीं तेलंगाणाराज्यस्थभाग्यनगरे दूरदर्शनकेन्द्रे वार्ताविभागे निदेशकपदम् अलङ्करोति ।

कथा सारांश

नवसर्गात्मकस्य नृसिंहनखकौमुदी महाकाव्यस्य षष्ठसप्तमसर्गाभ्यां गृहीतोऽयं पाठ्यभागः । अत्र भगवतः नृसिंहस्य आविर्भावः वर्णितः । हिरण्यकशिपुः स्वसुतं प्रह्लादम् अध्ययनार्थम् आश्रमं प्रेषयति । किन्तु सुकृतवशात् प्रह्लादः सर्वदा भगवंतः श्रीहरेः स्मरणं करोति । हिरण्यकशिपुः प्रह्लादं श्रीहरिस्मरणात् निवर्तयितुं बहुधा प्रयतते । श्रीहरितः अहमेव श्रेष्ठः, अतः मामेव स्मरत्वमिति बहुधा वदि सः, तथापि पितृवाक्यम् अविगणय्य प्रह्लादः निरन्तरं श्रीहरिं सेवितुम् इच्छति तेन क्रुद्धः दनुजेन्द्रः प्रह्लादं क्लेशयति । अन्ते सः स्तम्भे श्रीहरिं दर्शयसि वेति पृच्छति, स्तम्भं गदया भिनत्ति च । तस्मात् आविर्भूतः भगवान् नृसिंहः हिरण्यकशि हन्ति ।

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः

नृसिंहाविर्भावः Summary in Telugu

కవి పరిచయం

ఈ పాఠ్యభాగం “నృసింహనఖకౌముది” అనే కావ్యం నుండి స్వీకరింపబడింది. ఈ పాఠ్యభాగాన్ని డా॥ కె. సుధాకరరావు సంస్కృతం, ఆంగ్లము, తెలుగు, కన్నడ మొదలైన భాషలయందు గొప్ప పండితుడు. ఈయన ఆదోని అనే పట్టణంలో 1970వ సంవత్సరంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు తిమ్మాజిరావు తల్లి పేరు శ్రీ అనసూయ. బాల్యంలో శ్రీదక్షిణా మూర్తి సమక్షంలో సంస్కృతాన్ని చదివాడు. సంస్కృత భాషల యందు ఉన్నత డిగ్రీలను పొందారు. వీరు 72 గ్రంథాలను రచించారు. వీటిలో తెలుగులో 39, సంస్కృతంలో 15, కన్నడంలో 13, హిందీ భాషలో 5 గ్రంథాలు రచించారు. వీరు 2017వ సంవత్సరంలో కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి విద్యావారధి డిగ్రీని పొందారు. సంస్కృతంలో శ్రీనృసింహనఖకౌముది, శ్రీలక్ష్మీహయగ్రీవసుధా అనే గ్రంథాలను రచించారు. వీరు నిరంతరం చదవడంలోను, పరిశోధన చేయడంలోను నిమగ్నమయ్యేవారు. వీరు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే పరీక్షలో 1987వ సంవత్సరంలో ఉత్తీర్ణుడయ్యారు. ప్రస్తుతం వీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోని దూరదర్శన్ కేంద్రంలో వార్తావిభాగంలో పని చేస్తున్నారు.

కథా సారాంశము

తొమ్మిది సర్గంతో కూడిన ‘నృసింహనఖకౌముది’ అనే గ్రంథంలోని షష్ఠ, సప్తమ సర్గల నుండి ఈ పాఠ్యభాగం స్వీకరింపబడింది. ఇక్కడ భగవంతుడైన నృసింహస్వామి అవతార ఆవిర్భావం గొప్పగా వర్ణింపబడింది. హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుడిని చదివించడంకోసం గురువుల వద్దకు పంపించాడు. దాని పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ప్రహ్లాదుడు భగవంతుడైన శ్రీమహావిష్ణువు యొక్క స్మరణ చేస్తుండేవాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని శ్రీహరి స్మరణ నుండి నివారింపజేయడానికి అనేక విధములుగా ప్రయత్నిం చాడు. శ్రీమహావిష్ణువు కంటే నేనే శ్రేష్ఠుడిని, అందువల్ల నన్నే స్మరించు అని అనేక విధాలుగా చెప్పాడు.

అయినా ప్రహ్లాదుడు తండ్రి మాటలను లెక్కచేయకుండా ఎల్లప్పుడు శ్రీమహావిష్ణువునే సేవించడానికి ఇష్టపడేవాడు. దీంతో కోపగించిన హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో కష్టాలకు గురిచేశాడు. చివరగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఈ స్తంభంలో విష్ణువును చూపిస్తావా ? అని అడిగాడు. స్తంభాన్ని గదతో గట్టిగా కొట్టాడు. ఆ స్తంభం నుండి శ్రీమహావిష్ణువు నృసింహ రూపంలో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించాడు.

ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. హిరణ్య – కశిపుడు విష్ణువైరి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని గురుకులంలో ఉంచాడు. సకలశాస్త్ర విద్యలను బోధింపజేశాడు. అయినా ప్రహ్లాదునిలో హరిపై భక్తి తగ్గలేదు. ఇది గమనించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో, “నాయనా ! మనకు విష్ణువు శత్రువు. అతడిని వదులు సర్వ సుఖాలను అనుభవించు.” అని బోధించాడు. అయినా ప్రహ్లాదునిలో మార్పురాలేదు.

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తీవ్రంగా మందలించాడు. అనేక కష్టాలను పెట్టాడు. చివరకు ప్రహ్లాదునితో విష్ణువు ఎక్కడుంటాడని, అతడిని నా ముందు చూపమని ఆదేశించాడు. ప్రహ్లాదుడు తండ్రీ ! హరి సర్వత్రా ఉంటాడు. ఎక్కడైనా చూడవచ్చు అని పలికాడు. అది విని హిరణ్యకశిపుడు “ఈ స్తంభంలో ఉన్నాడా ?” అని అడిగాడు. ప్రహ్లాదుని మాటలు విని కోపంతో తన గదతో స్తంభాన్ని కొట్టాడు. స్తంభం నుండి విష్ణువు నృసింహుని రూపంలో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంద్రాది దేవతలందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థించారు.

नृसिंहाविर्भावः Summary in English

Introduction of the Poet

The lesson is an extract from Nrisimhanakhakaumudi written by Dr. K. Sudhakara Rao. Dr. Rao authored many works in Sanskrit, Telugu, Kannada and Hindi. His Sanskrit works included Nrisimhanakhakaumudi and Lakshmihayagrivasudha. Dr. Rao, who belonged to Adoni, Andhra Pradesh was a post graduate in Sanskrit and Telugu. He took doctoral degree from Karnataka University. At present he is working as Director, News Division in Hyderabad Dooradarshan.

The lesson describes the appearance of Nrisimha from the pillar and his subsequent killing of Hiranyakasipu, the father of Prahlada.

Leave a Comment