TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 1 सोमदत्तचरितम्

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 1st Lesson सोमदत्तचरितम् Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 1st Lesson सोमदत्तचरितम्

निबन्धप्रश्नौ (Essay Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)

1. सोमदत्तस्य पराक्रमं वर्णयत ।
(సోమదత్తుని పరాక్రమం గురించి తెలుపండి.)
(Describe the valour of Somadatta)
2. सोमदत्तेन कृतं मत्तकालनिग्रहं विशदयत ।
(Narrate the killing of Mattakala by Somadatta.)
(సోమదత్తుడు మత్తకాలుని వధించిన విధానం రాయండి.)
జవాబు:
‘సోమదత్తచరితం’ అనే పాఠ్యభాగాన్ని మహాకవి దండి రచించాడు. దండి రచించిన ‘దశకుమారచరితం’ అనే గ్రంథం నుండి ఈ సోమదత్తచరితం అనే పాఠ్యభాగం స్వీకరింపబడినది. ఇందులో సోమదత్తుని చరిత్ర అద్భుతముగా వర్ణింపబడింది.

మహాకాలక్షేత్రంలో రాజవాహనుడిని సోమదత్తుడు కలిశాడు. తన వృత్తాంతాన్ని ఈ విధంగా వివరంగా చెప్పాడు. ఓ రాజా ! నేను తమను గురించి అడవిలో తిరుగు తుండగా దప్పికతో నీరు త్రాగడానికి ఒక చెరువును సమీపించాను. అక్కడ ఒక దివ్యరత్నాన్ని చూశాను. తీవ్రమైన ఎండ ఉండటం వల్ల ఒక పాతబడిన శివాలయం దగ్గరకు వెళ్ళాను. అక్కడ కొంతమంది బాలురతో ఉన్న ఒక వృద్ధుడిని చూశాను.

కుశల ప్రశ్నలు అడిగాను. తాను దరిద్రుడనని, భిక్షాటన చేస్తూ తల్లిలేని పిల్లలను రక్షిస్తున్నానని చెప్పాడు. నేను దయతలచి ఆ రత్నాన్ని ఆ వృద్ధునికి ఇచ్చాను. అది విని నేను అతనితో అయ్యా ! ఈ రాజ్యం ఎవరిది ? అతని పేరు ఏమిటి ? అని అడిగాను. దానికి సమాధానంగా ఆ వృద్ధుడు మహాత్మా ! ఈ ప్రాంతాన్ని వీరకేతువు పాలిస్తున్నాడు. అతని కుమార్తె వామలోచన, ఆమెను వివాహం చేసుకోవడానికి లాటదేశాధిపతి అయిన మత్తపాలుడు ఇష్టపడ్డాడు.

కాని అతని కోరికను వీరకేతువు అంగీకరించలేదు. దాంతో మత్తపాలుడు వీరకేతువుపై కోపగించాడు. యుద్ధానికి కూడా సన్నద్ధమయ్యాడు. అయితే భయపడిన వీరకేతువు కుమార్తెను మత్తపాలునికి అప్పగించారు.

‘ఆమెను తన దేశంలో వివాహం చేసుకోవాలని ఆమెతోపాటు బయలుదేరాడు. దారిలో వేటకోసం ప్రయాణం ఆపాడు. ఆ సమయంలో వీరకేతువు కుమార్తెకు రక్షణగా నియమింపబడిన మానపాలుడు అనేవాడు తమ రాజుకు అవమానం కల్గించిన మత్తకాలునిపై దాడిచేయాలనుకొని అదనుకోసం వేచియున్నాడు.

ఈ మాటలు విని నేను ఆ వృద్ధునికి రత్నం ఇచ్చాను. ప్రయాణ బడలికవల్ల నేను అక్కడే నిద్రించాను. ఏదో అలికిడికి నిద్రలేచిన నన్ను చూసి ఆ వృద్ధుడు “ఇతడే దొంగ” అని రాజభటులకు పట్టించాడు. దాంతో రాజభటులు నన్ను బంధించి కారాగృహంలో బంధించారు. “లోపల ఉన్న వాళ్ళు నీవాళ్ళే” అని చెప్పాడు.

यूयं मम वयस्याः इति निर्दिष्टमेतैः

ఆశ్చర్యపడిన నేను “మీరు ఎవరు ? ఇక్కడ ఎందుకున్నారు ?” అని అడిగాను. దానికి సమాధానంగా వారు “అయ్యా ! వీరకేతువు యొక్క మంత్రి మానపాలుని ఆదేశానుసారం మత్తకాలుడిని చంపడానికి సొరంగ మార్గంలో అతని కోటలో ప్రవేశించాము. అక్కడున్న బంగారం, రత్నాలను దొంగిలించి అడవిలోకి వెళ్ళాము. మరుసటిరోజు భటులు. మమ్ములను గమనించి, బంగారాన్ని, రత్నాలను తీసుకున్నారు. దానిలో ఒక రత్నం దొరకలేదని భావించి మమ్ములను ఈ కారాగృహంలో బంధించారు.” అని చెప్పాడు. అది విని నేను నాకు దొరికిన రత్నం ముసలివానికి ఇచ్చినదే అని భావించాను.

నేను వారి గురించి వెతుకుతున్న విషయం చెప్పి, ఏదో మాట్లాడుతూ వారితో స్నేహం చేసి అర్థరాత్రి వారి సంకెళ్ళు తెంపి, నా సంకెళ్ళు తెంపుకొని కారాగృహం నుంచి బయటపడినాను. తరువాత ఎదుట నిద్రపోతున్న కాపలాదారుల ఆయుధాలను తీసుకొని, నగర రక్షకుల నుండి తప్పించుకొని మానపాలుని శరీరంలో ప్రవేశించాము. మానపాలుడు తన సేవకుల ద్వారా నా గురించి తెలుసుకొని నన్ను గౌరవించాడు.

మరుసటి రోజు మత్తకాలునిచే పంపించబడిన సైనికులు మానపాలునిచేరి “ఓ మంత్రీ, రాజమందిరంలోకి సొరంగ మార్గం ద్వారా దొంగచాటుగా ప్రవేశించి, ధనాన్ని అపహరించిన దొంగలు మీ రాజ్యంలో ప్రవేశించారు. వారిని అప్పగించు లేదా నీకు చాలా ప్రమాదం కలుగుతుంది, అని కఠినంగా పలికారు. అది విని కోపంతో మానపాలుడు లాటపతి ఎవరు ? అతనితో స్నేహం ఏమిటి ? ఆ నీచుని వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ? అని సైనికులను భయపెట్టాడు.

ललाटपतिः कः ? तेन मैत्री का ?

దానివల్ల కోపగించిన మత్తపాలుడు కొంతమంది సైనికులతో మానపాలునితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. యుద్ధసన్నద్ధుడైన మానపాలుడు మత్తికాలునితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. నేను కూడా కవచాన్ని ధరించి అతడిచ్చిన ఆయుధాలతో మంచి సారధితో కూడిన రధంపై ఎక్కి యుద్ధానికి ప్రయాణమయ్యాను. శత్రుసమీపానికి వెళ్ళాను. మత్తకాలుని రధంపై దూకి అతడి కంఠాన్ని ఖండించాను.

శత్రుసంహారంవల్ల సంతోషించిన మంత్రి నన్ను అనేక విధాలుగా సన్మానించాడు. ఈ విషయం విని అనందించిన వీరకేతువు నన్ను బాగా అభినందించాడు. ఒక శుభముహూర్తంలో ఆయన కుమార్తెను నాకు ఇచ్చి వివాహం జరిపించాడు. తరువాత యువరాజుగా బాధ్యతలను తీసుకున్నాను. నేను రాజ్యపాలనలో అతనికి సహకరిస్తూ నా భార్యతో సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నాను.

ఎన్ని సుఖములున్నా తమను విడచి ఉండవలసి ఉన్నందుకు మనసులో దుఃఖ పడుతున్న సమయంలో ఒక సిద్ధపురుషుడు నన్ను చూచి “త్వరలో నీవు నీ మిత్రుడిని కలుసుకొని ఆనందించగలవు, అనే మాట విని మహాకాళక్షేత్ర నివాసుడైన పరమశివుని ఆరాధించుటకు నా భార్యతో కలిసి ఇక్కడికి వచ్చి, మహా శివుని అనుగ్రహంతో మిమ్ములను దర్శించుకున్నాను.” అని సోమదత్తుడు తన వృత్తాంతాన్ని రాజవాహనునికి తెలియజేశాడు.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 1 सोमदत्तचरितम्

Introduction: The lesson Somadatta Charitam is an extract from Dasakumaracharita written by Dandin. Dandin’s use of graceful words is praised as दण्डिनः पदलालित्यम् । Somadatta, who was separated from his friend Rajavahana tells him his story after meeting him a year later.

Meeting the Old Brahmin: Somadatta told Rajavahana that while searching for his friend, he found in a forest a valuable ruby. He took it and went to the temple of Siva that was nearby to take rest. There he met an old Brahmin, who took care of his many children by begging alms. He told Somadatta about the army camp of Mattakala.

The Story of Mattakala: Mattakala, the king of Lata wanted to marry Vamalochana, the daughter of Viraketu, the ruler of that region. When Viraketu rejected, he attacked him. The frightened Viraketu offered his daughter to Mattakala. Mattakala decided to many Vamalochana at his place, and camped there on the way for hunting. Manapala, the minister of Viraketu, who was appointed as an escort of the princess, also camped nearby, waiting for a chance to kill Mattakala.

The Prisoner: Taking pity on the Brahmin, Somadatta gave the ruby to him. After sometime the Brahmin returned followed by some soldiers and accused Somadatta as a thief. असौ दस्यः The soldiers put Somadatta in a prison. There he learned the other prisoners were followers of Manapala. निर्दिष्ट मेतैः भटैः | They entered the tent of Mattakala at night through the way of a tunnel to kill him. But as he was not there, they had stolen the money that was there. The soldiers caught them the next day, and found a precious ruby missing. During the night, Somadatta freed himself, and escaped along with them and reached the camp of Manapala.

Killing of Mattakala: The next day Mattakala’s men came to Manapala and ordered him to hand over the robbers. Manapala abused Mattakala saying that he did not want Mattakala’s friendship. लाटपतिः कः ? तेन मैत्री का ? The angry Mattakala attacked Manapala. Somadatta also took part in the fight, and driving his chariot to the place where Mattakala was, jumped into his chariot, and killed him with his sword.

Viraketu became happy and married his daughter to him. Following the advice of an ascetic Somadatta, accompanied by his wife came to worship Mahakala Siva, and met Rajavahana.

सन्दर्भ वाक्यानि (సందర్భవాక్యాలు)(Annotations)

1. असौदस्युः

परिचय : इदं वाक्यं सोमदत्तचरितम् इति पाठ्यभागत् स्वीकृतम् कविः दण्डः ग्रन्थः दशकुमारचरितम् ।
सन्दर्भ : सोमदत्त स्वकथां राजवाहनाय एवं अवदत् ।
भाव : सोमदत्तं दर्शचित्वावृद्धः स एव चोर इति अवदत्त ।
विवरणम् : मित्र ! राजभटा तं परित्यज्य मां रज्जुथिः गांढ निशम्य कारागारे न्यक्षिपत्, सः वृद्धः कैश्चनभटैः सह अनुयातः तत्रागत्य मां ” अस दस्युः” इति आदर्शयत् ।

2. यूयं मम वचस्या इति निर्दिष्टमेतैः भटैः

परिचय : इदं वाक्यं सोमदत्तचरितम् इति पाठ्यभागत् स्वीकृतम् कविः दण्डिः ग्रन्थः दशकुमारचरितम् ।
सन्दर्भ : सोमदत्त कारागारस्य भटानां संभाषणे सोमदत्तः अवदत् ।
भाव : हे भटाः ! यूयं मम मित्राणि इतिमया श्रुतं किमिदं सत्यं ? इति अवदत् ।
विवरणम् : ननु पुरुषाः वीरपुरुषाः निमित्तेन केन निर्विशय कारावासदुःखं दुस्तरम् ।

3. ललाटपतिः कः ? तेन मैत्री का ?
परिचय : इदं वाक्यं सोमदत्तचरितम् इति पाठ्यभागत् स्वीकृतम् कविः
दण्डिः ग्रन्थः दशकुमारचरितम् ।
सन्दर्भ : सोमदत्तः भटान् प्रति एवं अवदत् ।
भाव : ललाटपतिः दुर्मार्गः, तस्य सेवया अस्माकं किं प्रयोजनम् ।
विवरणम् : भटाः मानपालं उपेत्य “मत्रिन् ! अस्मदीय राजमन्दिरे सुरंगया बहुधनं अपहृत्य चोरवीराः भवतां कटकं प्राविशन्, ललाटपतिः अत्यन्त नीचः । तस्य सेवया अस्माकं प्रयोजनं नास्ति ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలకు అర్ధాలు)

1. अम्बरमणिः = सूर्य:, సూర్యుడు
2. देवतायतनम् = देवालयः, దేవాలయము
3. दस्युः = चोरः, దొంగ
4. अध्वश्रमः = मार्गायासः, మార్గశ్రమ
5. किङ्कराः = सेवकाः, సేవకులు
6. विषण्णाः = दुःखिताः, దుఃఖితులు
7. तुमुलसङ्गरकरं = सङ्कुलं युद्धं कुर्वाणम्, భీకర యుద్ధాన్ని చేయుచున్నవాడి
8. अरातिः. = शत्रु, శత్రువు

व्याकरणांशाः (వ్యాకరణం)

सन्धयः (సంధులు)

1. किञ्चित् + दूरम् = किञ्चिद्दूरम् – जश्त्वसन्धिः
2. अनेकैः + उपायैः = अनेकैरुपायैः – विसर्गसन्धिः
3. तत् + न = तन्न – अनुनासिकसन्धिः
4. तनयैः + सह = तनयैस्सह – विसर्गसन्धिः
5. सुहृत् + जनः = सुहृज्जनः – श्श्रुत्वसन्धिः
6. तत् + श्रुत्वा = तच्छ्रुत्वा – जश्त्वम्सन्धिः
श्श्रुत्वम् – चर्त्वम् – छत्वम्

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 1 सोमदत्तचरितम्

समासाः సమాసాలు

1. दीनम् आननं यस्य सः तं दीनाननम् बहुव्रीहिः
2. बहवश्च ते तनयाश्च, बहुतनयाः तैः समेतः तं, बहुतनयसमेतं – तृतीयातत्पुरुषः
3. अध्वनः श्रमः, तेन खिन्नः, अध्वश्रमखिन्नः – तृतीयातत्पुरुषः
4. कशायाः घातः, तेन चिह्नितं शरीरं यस्य सः, कशाघातचिह्नितशरीरः – बहुव्रीहिः
5. समस्तञ्च तत् वस्तु च तस्य शोधनं, तस्य वेला, तस्यां, समस्तवस्तु शोधनवेलायाम् – षष्ठीतत्पुरुषः
6. न विद्यते अर्घः अस्य इति अनर्घम् । अनर्घञ्च तत् रत्नञ्च, अनर्घरत्नं, तस्य अनर्घरत्नस्य विशेषणपूर्वपदकर्मधारयः
7. रोषेण अरुणिते नेत्रे यस्य सः, रोषारुणितनेत्रः – बहुव्रीहिः
8. रणस्य निश्चयः, रणनिश्चयः सः कृतः येन सः कृतरणनिश्चयः – बहुव्रीहिः
9. सन्नद्धाः यधाः येन सः, सन्नद्धयोधः – बहुव्रीहिः
10. चतुरश्च असौ सारथिश्च चतुरसारथिः तेन युक्तः तं चतुरसारथियुक्तम् – तृतीयातत्पुरुषः
11. परमश्च असौ आनन्दश्च परमानन्दः तेन सम्भृतः परमानन्दसम्भृतः – तृतीयतत्पुरुषः
12. राज्यस्य सुखं राज्यसुखं, नैकविधञ्चं तत् राज्यसुखं, नैकविधराज्यसुखम् – विशेषणपूर्वपदकर्मधारयः
13. भवतः विरहः भवद्विरहः, तस्य वेदना, तया विकलः हृदयः यस्य सः – तं भवद्विरहवेदनाविकलहृदयं – बहुव्रीहिः

सोमदत्तचरितम् Summary in Sanskrit

कविपरिचयः

‘सोमदत्तचरितम्’ नाम पाठ्यांशोऽयं दण्डिमहाकविना विरचितात् दशकुमारचरितात् गृहीतः । ” त्रयो दण्डिप्रबन्धाश्च त्रिषु लोकेषु विश्रुताः” इति राजशेखरकविना उक्तप्रकारेण दण्डिमहाकविः “अवन्तिसुन्दरी कथा, दशकुमारचरितम्, काव्यादर्शः ” इति त्रीन् ग्रन्थान् अरचयत् इति ज्ञायते । अवन्तिसुन्दरीकथायाः प्रस्तावनायाम् उक्तानुसारं दण्डी गौरीवीरदत्तयोः पुत्र इति भारबिमहाकवेः प्रपौत्रः इति च अवगम्यते । अपि चायं कविः प्रायः सप्तम शताब्दौ आसीदिति साहित्येतिहासग्रन्थकर्तारः अभिप्रयन्ति । दशकुमारचरिते दण्डिनः गद्यशैली सरसा सरला सुबोधा च । दशकुमारचरितस्य गद्यं न श्लोषाद्यलङ्कारैः संकीर्णम् । न वा दीर्घसमासैः विषमीकृतम् । अर्थस्य स्पष्टता, सुमधुरभावाभिव्यक्तिः ललितपदप्रयोगश्च सर्वत्र दृश्यन्ते । अत एव “दण्डिनः पदलालित्यम्’ इति प्रशंसन्ति पण्डिताः ।

सारांश

दशकुमारचरितं पूर्वपीठिका उत्तरपीठिका चेति भागद्वयात्मकं प्रथते । पूर्वपीठिकायां पञ्च उच्छ्वासाः उत्तरपीठिकायां च अष्टौ उच्छ्वासाः विद्यन्ते । प्रस्तुतपाठ्यभागः सोमदत्तचरितं तृतीयोच्छासे वर्णितम् अस्ति । मगधराज्यस्य राजा राजहंसः आसीत् । तस्य पुत्रः राजवाहनः । राजवाहनस्य अपि च तस्य मित्राणां चरितम् अस्मिन् ग्रन्थे चित्रितमस्तीति कृत्वा अस्य दशकुमारचरितम् इति नाम निश्चितम् ।

सोमदत्तः विन्ध्यारण्ये राजवाहनम् अन्विष्यन् कदाचित् पिपासाकुलो भूत्वा जलं पातुं नदीं प्रति याति । तत्र उज्ज्वलाकारं रन्नमेकं पश्यति । तन्नीत्वा सूर्यस्य तापकारणात् देवतायतनं गत्वा तत्र स्थिताय वृद्धाय तद्रन्नं ददाति । किन्तु स वृद्धः राजभटैः बद्धो भूत्वा तान् तत्रानीय सोमदत्तं दर्शयन् असौ दस्युः इति कथयति । तत्पूर्वमेव ‘“मत्तकालो नाम लाटदेशराजः अस्मद्राज्ञः वीरकेतोः तनयां वामलोचनां परिणेतुम् इच्छति । वीरकेतुः तन्नाङ्गीकरोति ।

क्रुद्धों मत्तकालः वीरकेतुं युद्धे विजित्य वामलोचनां नीत्वा स्वदेशम्प्रति गच्छन् अस्मिन् वने विश्राम्यति’ इत्यादिं कथां विवृणोति स वृद्धः । एतत् श्रुत्वा सोमदत्तः वीरकेतोः सचिवस्य मानपालस्य साहाय्येन मत्तकालं हन्ति । वीरकेतुरपि सोमदत्तस्य शौर्यं विदित्वा स्वीयां तनयां वामलोचनां तस्मै ददाति विवाहादिकं च निर्वहति । ततश्च सोमदत्तः भार्यया सह महाकालक्षेत्रं गत्वा तत्र राजवाहनेन मिलति ।

सोमदत्तचरितम् Summary in English

Introduction

Introduction: The Lesson Somadattacharitam is an extract from Dasakumaracharita written by Dandin. Rajasekhara praised Dandin saying that his three works wére well known in the three worlds. Those works are — Avantisundarikatha, Dasakumaracharita and Kavyadarsa. According to the introduction in Avantisundarikatha, Dandin was the great grandson of Bharavi. Dandin belonged to the seventh century AD. He was praised for the use of graceful words. दण्डिनः पदलालित्यम् इति ।

सोमदत्तचरितम् Summary in Telugu

కవి పరిచయం

‘సోమదత్తచరితం’ అనే పాఠ్యభాగాన్ని మహాకవి దండి రచించాడు. ఆ మహాకవి రచించిన ‘దశకుమారచరితం’ నుండి ఈ పాఠం స్వీకరింపబడింది. “దండి యొక్క మూడు ప్రబంధాలు లోకంలో విశేష కీర్తిని పొందాయి’. అని అనే రాజశేఖరుని మాటలను అనుసరించి ఈ దండి మహాకవి అవంతిరాజసుందరీకథాః, దశకుమారచరితం, కావ్యాదర్శః అనే మూడు గ్రంథాలను రచించాడని తెలుస్తున్నది. అవంతీసుందరీ కథ యొక్క ప్రస్తావనలో చెప్పిన దానిని అనుసరించి దండి గౌరీ, వీరదత్తుల కుమారుడని, భారవికి ముని మనుమడని తెలుస్తున్నది. మరియు ఈ దండి కవి క్రీ.శ. 7వ శతాబ్దంలో ఉన్నట్లుగా సాహిత్యకారుల అభిప్రాయము.

దశకుమారచరితంలో దండి మహాకవి శైలి సరశంగాను, సుబోధకంగాను ఉంటుంది. ఈ దశకుమారచరితంలోని గద్యశైలి శ్లేషాది అలంకారాలతో కూడి ఉంటుంది. మరీ అంత పెద్ద సమాసభూయిష్ట వాక్యాలు ఉండవు. అర్ధస్పష్టత, సుమధుర భావాభివ్యక్తీకరణ, లలితపదప్రయోగం అన్నింట కన్పిస్తుంది. అందువల్లనే ‘దండినః పదలాలిత్యం’ అనే ప్రశంస ఏర్పడింది.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 1 सोमदत्तचरितम्

సారాంశము

‘దశకుమారచరితం’ అనే గ్రంథంలో పూర్వపీఠిక, ఉత్తరపీఠికా అనే రెండు భాగాలు ఉన్నాయి. వాటిలో పూర్వపీఠికయందు ఐదు ఉచ్ఛ్వాసాలు ఉన్నాయి. ఉత్తర పీఠిక యందు ఎనిమిది ఉచ్ఛ్వాసాలు ఉన్నాయి. ప్రస్తుత పాఠ్యభాగమైన సోమదత్తచరితం పూర్వపీఠికలోని తృతీయోచ్ఛ్వాసము నుండి స్వీకరింపబడినది.

మగధ దేశానికి రాజు రాజహంసుడు. అతని పుత్రుడు రాజవాహనుడు రాజ వాహనుని యొక్క మిత్రుల చరిత్ర కూడా ఈ గ్రంథంలో వర్ణింపబడింది. అందుకే ఈ గ్రంథానికి ‘దశకుమారచరితం’ అనే పేరు వచ్చింది.

సోమదత్తుడు వింధ్యారణ్యంలో రాజవాహనుడిని వెతుకుతూ ఒకచోట దప్పికకల్గి నీటిని త్రాగడానికి ఒక నది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ బాగా ప్రకాశిస్తున్న ఒక రత్నాన్ని చూచాడు. దానిని తీసికొని ఎండవేడిమిని తప్పించుకోవడానికి ఒక శివాలయం చేరాడు. అక్కడున్న ఒక వృద్ధునికి ఆ రత్నాన్ని ఇచ్చాడు. అయితే ఆ వృద్ధుడు రాజభటులతో బంధింపబడినవాడై తిరిగి సోమదత్తుడిని సమీపించి “ఇతడే దొంగ” అని పలికాడు.

దానికి ముందే మత్తకాలుడు అనే పేరుగల లాటదేశాధిపతి మారాజైన వీర కేతువు యొక్క కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని వీరకేతువు దానికి అంగీకరించలేదు. కోపగించిన మత్తకాలుడు వీరకేతువుపై యుద్ధం ప్రకటించాడు. భయపడిన వీరకేతువు కుమార్తెను అతనికి అర్పించాడు. దాంతో మత్తకాలుడు వామ లోచనను తీసుకొని వెళ్తూ ఈ అరణ్యంలో విశ్రమించాడు, అనే కథను వృద్ధుడు వివరించాడు.

ఇదంతా విని సోమదత్తుడు వీరకేతువు తండ్రియైన మానపాలుని సహాయంతో మత్తకాలుడిని చంపాడు. వీరకేతువు కూడా సోమదత్తుని పరాక్రమాన్ని గూర్చి తెలుసుకొని ఆనందించాడు. తన కుమార్తెను వామలోచనను సోమదత్తునికి ఇచ్చి వివాహం చేశాడు. ‘ పిమ్మట సోమదత్తుడు భార్యతో కలిసి మహాకాళక్షేత్రానికి వెళ్ళి అక్కడ రాజవాహనుడిని
కలిశారు.

మగధ రాజ్యానికి రాజు రాజహంసుడు. అతని కుమారుడు రాజవాహనుడు. సోమదత్తుడు విధ్యారణ్యంలో రాజవాహనుడిని వెతుకుతు ఒకసారి దప్పికతో కూడి ఒక నదిని గూర్చి వెళ్తాడు. అక్కడ బాగా ప్రకాశిస్తున్న ఒక రత్నాన్ని చూచాడు. దానిని తీసుకొని ఎండ వేడిమిని తగ్గించుకోవడానికి ఒక దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నట్టి ఒక వృద్ధునికి ఆ రత్నాన్ని ఇచ్చాడు. అయితే ఆ వృద్ధుడిని రాజభటులు పట్టుకొని బంధించి తిరిగి సోమదత్తుని వద్దకు తీసుకొని వచ్చారు. సోమదత్తుడిని చూపిస్తూ “ఇతడే దొంగ” అని చెప్పాడు.

వానికి ముందే మత్తకాలుడు అనే పేరు గల లాటదేశరాజు మారాజైన వీరకేతువు యొక్క కుమార్తె అయిన వామలోచనను వివాహం చేసికొనుటకు ఇష్టపడతాడు. వీరకేతువు అంగీకరించలేదు. కోపగించిన మత్తకాలుడుకి వీరకేతువు భయపడి కుమార్తెను అతనికి అప్పగించాడు. అతడు వామలోచనను తీసుకొని తన దేశానికి వెళ్తూ ఈ వనంలో విశ్రమించియున్నాడు, అనే ఆ కథను ఆ వృద్ధుడు విన్నాడు.

ఇదంతా విని సోమదత్తుడు వీర కేతువు మంత్రి అయిన మానపాలుని సహాయంతో మత్తకాలుడిని చంపుతారు. వీరకేతువు కూడా సోమదత్తుని పరాక్రమాన్ని తెలుసుకొని స్వయంగా తన కుమార్తె అయిన వామలోచనను అతనికిచ్చి వివాహం చేస్తాడు. పిమ్మట సోమదత్తుడు భార్యతో కలిసి మహాకాళక్షేత్రమునకు వెళ్ళి అక్కడ రాజవాహనుడిని కలిశాడు.

अनुवादः (అనువాదములు) (Translations)

कस्मिंश्चित् ग्रामान्ते स्वप्रभुणा राजवाहनेन समागतः सोमदत्तः तस्मै स्ववृत्तान्तम् एवमकथयत् – “देव, भवच्चरणकमलसेवाभिलाषी अहं भ्रमन्नेकस्मिन् वने पिपासाकुलः लतापरिवृतं शीतलं नदसलिलं पिबन् तत्र उज्ज्वलाकारं रत्नमेकम् अपश्यम् । तद्गृहीत्वा किञ्चिद्दूरं गत्वा अम्बरमणेः अत्युष्णतया गन्तुमक्षमः तस्मिन्नेव वने स्थितं देवतायतनं प्रविष्टवान् । तत्र दीनाननं बहुतनयसमेतं कञ्चन वृद्धम् अवलोक्य कुशलम् अपृच्छम् |

ఒకానొక గ్రామంలో తన ప్రభువైన రాజవాహనునితో కలసిన సోమదత్తుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు – దేవా ! నీ పాదపద్మ సేవను కోరు నేను ఒకానొక అరణ్య ప్రదేశమున సంచరించుచు దప్పికగొని లతలచే కప్పబడిన చల్లని నదీ జలమును త్రాగుచు, అచట ప్రకాశించు ఆకారముగల ఒక రత్నమును కనుగొంటిని దానిని తీసుకొని బయలుదేరి కొంతమార్గమును నడచి, సూర్యుని వేడి ఎక్కువగుటచే నడవడానికి శక్తిలేనివాడనై ఒక వనమందలి దేవాలయములో ప్రవేశించి, దీనవదనుడు, బహుపుత్ర సమేతుడు అగు ఒక వృద్ధ బ్రాహ్మణుని చూచి, దయపుట్టి కుశలప్రశ్నలను అడిగాను.

Somadatta, who met Rajavahana near a village, told his story thus:

My lord, desirous of serving your feet, while wandering every where, one day, when overcome by thirst as I was drinking from a stream surrounded by creepers in a forest, I found a bright gem. I took it. ‘Unable to walk further in the scorching heat of the sun, I went into a small temple to rest, and saw there a poor brahman with a number of children. I asked about his welfare.

चिन्ताकुलः स वृद्धः मामेवम् अवोचत् – “महाभाग, मातृहीनान् सुतानेतान् अनेकैरुपायैः रक्षन्निदानीम् अस्मिन् कुदेशे भैक्ष्यं सम्पाद्य तेनैव एतान् पोषयन् शिवालयेऽस्मिन् निवसामि इति । “भूदेव, एतत्कटकाधिपती राजा कस्य देशस्य ? किं नामधेयः ? अस्य अत्रागमनकारणं किम् ?” इति पृष्टः एवम् अभाषत सः-

“सौम्य, मत्तकालो नाम लाटेश्वरः देशस्यास्य पालयितुः वीरकेतोः तनयां वामलोचनानाम्नीं परिणेतुम् ऐच्छत् । किन्तु वीरकेतुः तन्नाङ्गीचकार । तेन क्रुद्धः मत्तकालः अस्योपरि युद्धं प्रकटीचकार । दुष्टेन तेन भीतः वीरकेतुः महदुपायनमिव स्वतनयां मत्तकालायादात् । हृष्टः सः निजपुरे एवैनां परिणेष्यामि इति निश्चित्य स्वदेशं गच्छन् सम्प्रति मृगयादरेणात्र सैन्यवासमकारयत् । कन्यानुसरणे नियुक्तः मानपालो नाम वीरकेतुमन्त्री निजनायावमानखिन्नः स्वसैन्येन सह अन्यत्र शिबिरं विरच्य मत्तकालं प्रतिरोद्धुम् अनुकूलमवसरं निरीक्षमाणः तिष्ठति” इति ।

విచారగ్రస్తుడైన ఆ వృద్ధుడు నాతో ఈవిధంగా పలికాడు. ఓ మహానుభావా ! మాతృహీనులైన ఈ కుమారులను అనేక ఉపాయములతో రక్షిస్తూ ఈ పాడు దేశమునందు భిక్షను సంపాదించి వీరికి పెట్టుచు ఈ శివాలయమునందు నివసించుచున్నాను.” అని పలికెను. ఓ బ్రాహ్మణుడా ! ఈ శిబిరమునకు అధిపతి ఏ దేశమునకు రాజు ? అతని పేరు ఏమి ? ఇచ్చటకు అతని రాకకు గల కారణం ఏమిటి ? అని అడుగబడినవాడై ఇట్లు పలికెను.

ఓ సౌమ్యుడా ! మత్తకాలుడు అనే పేరు గల లాటదేశపు రాజు ఈ దేశపాలకుడగు వీరకేతుని కుమార్తెయగు వామలోచనను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని దానికి వీరకేతువు అంగీకరించలేదు. దాంతో కోపగించిన మత్తకాలుడు వీరకేతునిపై యుద్ధం ప్రకటించాడు. వీరకేతువు భయపడినవాడై తన కూతురును గొప్ప కానుకగా మత్తకాలునికి అప్పగించాడు. యువతి లభించడంతో సంతోషించిన చిత్తముగల లాటదేశాధిపతి తన పురమునందే పెళ్ళి చేసుకోవాలి అని నిశ్చయించుకొని, స్వదేశమును గూర్చి వెళ్ళుచూ వేటయందలి ఆదరముతో ఈ అరణ్యమునందు సైన్య శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. కన్యయే సర్వస్వమైన వీరకేతునిచే నియోగింపబడిన మానధనుడైన మానపాలుడును వీరకేతు మంత్రి చతురంగ బలములతో కూడినవాడై మరొకచోట శిబిరాన్ని ఏర్పాటుచేసి, ‘మత్తకాలుడిని ఎదిరించడానికి అనుకూలమైన సమయంకోసం నిరీక్షిస్తూ ఉన్నాడు.

Overcome by grief, the Brahmin said, “O great one, I have been somehow taking care of these motherless children by begging alms in this poor place, and staying in this temple of Siva”. I asked him “The ruler of which kingdom has camped nearby ? What is his name ? Why has he come here ?” He answered thus.

“The Lord of Lata, Mattakala by name, hearing again and again of the great beauty of Vamalochana, daughter of Viraketu, ruler of this country, wanted to marry her. But Viraketu rejected. The enraged Mattakala attacked him. Viraketu became afraid and offered his daughter to him as a gift. Mattakala, who was happy, decided to marry her after returning to his own country. He camped here for the pleasure of hunting. Manapala, the minister of Viraketu, who was appointed as the escort of the damsel, became indignant at the insult meted out to his king, and was waiting for an opportune moment to overpower Mattakala, and he camped elsewhere.”

ततः निर्धनाय तस्मै विप्राय तं रत्नमदाम्, सोऽपि तत् गृहीत्वा कुत्रचित् तनयैस्सह अगच्छत् । अध्वश्रमखिन्नोऽहं तत्रैव किञ्चिन्निद्रासुखं प्राप्तवान् । तदनु कशाघातचिह्नितशरीरः स वृद्धः कैश्चन भटैस्सह अनुयातः तत्रागत्य माम् ‘असौ दस्युः’ इत्यदर्शयत् । तदा राजभटाः तं परित्यज्य मां रज्जुभिः गाढं नियम्य कारागारे न्यक्षिपन् | कारागारे स्थितान् अन्यान् पुरुषान् दृष्ट्वा एकम् अपृच्छम् – ननु पुरुषाः वीरपुरुषाः, निमित्तेन केन निर्विशथ कारावासदुःखं दुस्तरम् ? यूयं मम वयस्या इति निर्दिष्टमेतैः भटैः, किमिदम् ? इति ।

పిమ్మట నిర్ధనుడైన ఆ బ్రాహ్మణునికి ఆ రత్నాన్ని ఇచ్చాను. అతడు కూడా ఆ రత్నాన్ని తీసుకొని కుమారునితో కలిసి ఎక్కడికో వెళ్ళాడు. మార్గశ్రమతో బడలికను పొందిన నేను అక్కడే కొద్దిగా నిద్రను పొందాను. పిమ్మట వెనుకకు మరల్చి కట్టబడిన బాహుయుగళము కల్గి, కొరడా దెబ్బల గుర్తులు గల, ఆ బ్రాహ్మణుడు అనేకమంది ఖడ్గదారులచే అనుసరించబడి నన్ను చేరి ఇతడే దొంగ అని చూపించెను. పిమ్మట రాజభటులు అతడిని వదలి, నన్ను తాళ్ళతో గట్టిగా బంధించి కారాగారంలో పడవేశారు. కారాగారంలో ఉన్నట్టి ఇతర పురుషులను చూచి ఒకడిని ప్రశ్నించాను. “ఓయీ ! వీర పురుషులారా ! ఏ కారణముచేత దుస్తరమైన కారాగారవాస దుఃఖమును అనుభవించు చున్నారు .? మీరు స్నేహితులని వీరిచే నిర్దేశింపబడినది ఇది ఏమి ? అని.

Then I offered the jewel to the poor Brahmin. He took it and went away along with his children. I slept there, as I was tired. Later, the brahman came with marks of whip lashes on his body, followed by some soldiers. On seeing me, he called out, “He is the thief.” Thereupon the soldiers let him go, and, seizing me, and having put fetters on my feet, thrust me into a dungeon. I asked one of the fellow prisoners there, “O warriors, for what reason do you experience the suffering of prison stay? Why do they say that you are my friends?”

तदा तैरेवमुक्तम् – “महाभाग, वीरकेतुमन्त्रिणो मानपालस्य किङ्करा वयम् । तदाज्ञया लाटेश्वरमारणाय रात्रौ सुरङ्गद्वारेण तदागारं प्रविश्य तत्र राजाभावेन विषण्णा भूत्वा तत्रस्थं धनमपहृत्य महाटवीं प्राविशाम । अपरेद्युः मत्तकालस्य भटाः अस्मान् अभ्येत्य, दृढं बद्ध्वा निकटमानीय समस्तवस्तुशोधन वेलायाम् एकस्य अनर्घरत्नस्याभावात् अस्मान् हन्तुं कारागारेऽस्मिन् शृङ्खलाभिः बद्ध्वा न्यक्षिपन्” ।

తరువాత వారిచే పలుకబడినది ఓ మహాభాగ ? మేము వీరకేతు మంత్రియగు మానపాలుని సేవకులము. ‘అతని అనుమతితో లలాటపతిని చంపుటకై రాత్రియందు సురంగమార్గమును అతని నిలయమును ప్రవేశించి, అచ్చట రాజు కనబడకపోవుటచే దుఃఖితులమై, గొప్ప ధనమును దొంగిలించి, మహారణ్యంలో ప్రవేశించాము. మరుసటిరోజు మత్తకాలుని సేవకులు మమ్ములను సమీపించి దొంగిలించిన ధనముతోనున్న మమ్ములను చుట్టుముట్టి మిక్కిలి దృఢముగా బంధించి కటకమునకు తీసుకొనివచ్చి, సమస్త వస్తువులను పరిశీలించు సమయంలో ఒక అమూల్య రత్నము కనిపించకపోవుటతో మమ్ములను చంపుటకు ఈ కారాగారంలో గొలుసులతో బంధించి పడవేశారు.

Then they said, “We are the followers of Manapala, the minister of Viraketu. On his order in order to assassinate the king of Lata, we entered his tent through the way of a tunnel. But we became dejected at not finding him there, and having stolen all the money there entered in to the dense forest. The next morning the soldiers of Mattakala caught us and having bound us brought to the camp, and while checking all the items, found that one valuable jewel was missing. They chained us and jailed us to kill us.”

तदा “इदं तदेव माणिक्यं यदहं तस्मै वृद्धाय दत्तवान्” इति निश्चित्य, आत्मनो जन्म नामधेयं युष्मदन्वेषणपर्यटनप्रकारं च तान् प्रत्याभाष्य, समयोचितं संलापं कुर्वन् तैस्सह मैत्रीम् अकार्षम् । ततः अर्धरात्रे तेषां मम च शृङ्खलाबन्धनं निर्भिद्य, बहिरागत्य, कारागारस्य द्वारे निद्रावस्थायां स्थितानां भटानाम् आयुधजालानि आदाय, अभिमुखे आगतान् पुररक्षान् अभिद्राव्य, मानपालस्य शिबिरं प्राविशम् | मानपालः स्वकिङ्करेभ्यः मम वृत्तान्तं तत्कालीनं मम पराक्रमं च निशम्य माम् आर्चयत् ।

అప్పుడు “ఇదే ఆ మాణిక్యము, దీనినే ఆ వృద్ధునికి ఇచ్చాను” అని నిశ్చయించుకొని తన యొక్క జన్మను, పేరును మిమ్ము అన్వేషించుచు తిరిగిన విధమును సమయోచిత సంభాషణములతో స్నేహమును చేశాను. పిమ్మట అర్ధ రాత్రమున వారి యొక్క, నాయొక్క సంకెళ్ళ బంధమును ఛేదించి, వారితో అనుసరింపబడి, నిద్రించిన ద్వారపాలక సమూహపు ఆయుధగణము తీసుకొని, ఎదురై తాకిన నగర రక్షకులను గొప్ప పరాక్రమ లీలచే పార ద్రోలి మానపాలుని శిబిరమును ప్రవేశించాను. మానపాలుడును తన భృత్యుల వలన నా కులాభిమాన వృత్తాంతమును తాత్కాలిక పరాక్రమమును విని నిన్ను అర్పించెను.

I understood that it was the same ruby, which I gave to the Brahmin, and told them about myself, and searching for you, and made friendship with them speaking to them according to the occasion. At midnight, I broke my fetters and theirs, came out, took the weapons of the guards sleeping at the jail gate, and overpowering the camp guards, reached the camp of Manapala. Having heard from his men my story and the valour I showed at that time, Manapala honoured me.

परेद्युः मत्तकालेन प्रेषिताः केचन भटाः मानपालमुपेत्य “मन्त्रिन्, अस्मदीयराजमन्दिरे सुरङ्गया बहुधनम् अपहृत्य चोरवीराः भवतां कटकं प्राविशन् । तानर्पय, नोचेत् महाननर्थः सम्भविष्यति” इति क्रूरतरं वाक्यम् अब्रुवन् । तन्निशम्य रोषारुणितनेत्रः मानपालः “लाटपतिः कः ? तेन मैत्री का ? पुनः अस्य वराकस्य सेवया किं लभ्यम् ?” इति तान् निरभर्त्सयत् ।

तेन कुपितः मत्तकालः कैश्चन भटैस्सहितः मानपालेन योद्धुम् अभ्यागात् । पूर्वमेव कृतरणनिश्चयः मानी मानपालः सन्नद्धयोधः तेन योद्धुं निरगात् । अहमपि तेन दत्तानि रणसमुचितानि आयुधानि दृढतरं कवचं च गृहीत्वा चतुरसारथियुक्तं स्थम् अधिरुह्य योद्धुं निर्गतः । ततः तुमुलसङ्गरकरम् उभयसैन्यम् अतिक्रम्य वेगेन मद्रथं तन्निकटं नीत्वा शीघ्रं रथस्योपरि समुल्लङ्घ्य अरातेः शिरः कर्तनम् अकरबम् । शत्रोः हननेन परमानन्दसम्भृतः मन्त्री मम अनेकविधां सम्भावनाम् अकार्षीत् ।

మరుసటిరోజు మత్తకాలునిచే పంపించబడిన కొంతమంది భటులు మానపాలుడిని సమీపించి “మంత్రీ, మా రాజమందిరంలో సురంగ మార్గంలో చాలా ధనాన్ని దొంగిలించి మా కటకంలో ప్రవేశించారు. వారిని మాకు అప్పగించండి. లేకపోతే గొప్ప అనర్ధం కలుగుతుంది” అని కఠినంగా పలికాడు. దానిని విని కోపంతో ఎర్రబడిన కన్నులుగల మానపాలుడు ఎవడు లలాటరాజు ? అతనితో మైత్రి ఏమి ? ఆ నీచుని సేవచే ఏమి లభ్యమగును ? అని వారిని బెదిరించాడు”.

దాంతో కోపగించిన మత్తకాలుడు కొంతమంది సైనికులతో కలసి మానపాలునితో యుద్ధం చేయడానికి వచ్చాడు. గతంలోవలె యుద్ధానికి సిద్ధపడిన అభిమానవంతుడైన మానపాలుడును సంసిద్ధులైన యోధులు గలవాడై, యుద్ధకాముడై నిశ్శంకముగా బయలుదేరాడు. నేను కూడా అతని చేత ఇవ్వబడిన ఆయుధాలను గట్టి కవచాన్ని కూడా తీసుకొని నైపుణ్యంగల సారధితో కూడిన రధాన్ని ఎక్కి యుద్ధం చేయడానికి వెళ్ళాను. పరస్పర మాత్సర్యముతో సంకుల సమరము సాగించు ఉభయసైన్యములను అతిక్రమించి ప్రకాశించు భుజబలగర్వముతో బాణవర్షమును వారి అవయవాల పై కురిపించుచు శత్రువులను సంహరించాను. త్వరితలంఘనముచేత అతని రధాన్ని ఉంచుకొని నేను శత్రువు శిరస్సును ఖండించితిని. శత్రువు మరణించడం వలన మిక్కిలి ఆనందాన్ని పొందిన మంత్రి నాకు బహువిధమైన గౌరవాన్ని ఇచ్చాడు.

The next day, some men sent by Mattakala came to Manapala, and said “Some robbers, who entered our camp through a tunnel way, make good their escape after stealing a lot of money, and have entered your place. Give them up immediately, or it will be the worse for you.” On hearing that, Manapala, his eyes red with anger, abused them saying, “Who is the King of Lata, what is friendship with him? What will be gained by serving that one?”

Enraged by this Mattakala, followed but by few men, came to fight Manapala. However, Manapala, who decided beforehand to fight with him, came out to attack him. I received from him weapons useful for battle, and a strong armour and having got in to a chariot guided by a skillful charioteer went forth to fight. Having found my way through the tumultuously fighting army, I brought my chariot close to his, and jumping into it, cut off his head. Becoming overjoyed at the death of the enemy, the minister honoured me in many ways.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 1 सोमदत्तचरितम्

ततः मानपालप्रेषितात् अनुचरात् एतत्सर्वम् आकर्ण्य सन्तुष्टमनाः राजा वीरकेतुः मां बहुधा अभिनन्द्य कस्मिंश्चन शुभदिने समहोत्सवं स्वतनयां वामलोचनां मह्यम् अदात् । तदनन्तरं यौवराज्याभिषिक्तोऽहं राज्यपालने तं सहकुर्वन् वामलोचनया सह नैकविधराज्युखम् अनुभवन्नासम् ।

एकस्मिन् दिवसे भवद्विरहवेदनाविकलहृदयं मां वीक्ष्य कश्चन सिद्धपुरुषः सुहृज्जनविलोकनफलम् अवाप्स्यसि शीघ्रमेवेति अवोचत् । तच्छ्रुत्वा महाकालक्षेत्र निवासिनः परमेश्वरस्य आराधनाय पत्नीसमेतः अत्र समागतोऽस्मि, अपि च भक्तवत्सलस्य गौरीपतेः कारुण्येन त्वत्पादारविन्दसन्दर्शनानन्दं प्राप्तवान् इति सोमदत्तः राजवाहनम्प्रति स्वेतिवृत्तम् अकथयत् ।

పిమ్మట మానపాలునిచే పంపబడిన అనుచరుని వలన ఈ సమస్త వృత్తాంతమును విని సంతుష్ఠ మనస్కుడైన మహారాజు ఎదురుగా వచ్చి, నా పరాక్రమమునకు విస్మయము చెందినవాడై నన్ను బాగా అభినందించి, ఒకానొక మంచిరోజు తన కుమార్తెయగు వామలోచనను నాకు ఇచ్చాడు. పిమ్మట యువరాజ పట్టాభిషిక్తుడనైన నేను రాజ్య పాలనలో అతనికి సహకరిస్తూ వామలోచనతో కలిసి అనేక విధములైన రాజ్యసుఖాలను అనుభవిస్తూ ఉన్నాను.

ఒకరోజు మా ఎడబాటు వలన కలిగిన బాధ అనెడి శల్యముచే వికలత చెందిన హృదయము గలవాడనై ఒక సిద్ధుని ఆనతి ప్రకారం మహాకాల నివాసియగు పరమేశ్వరుని ఆరాధించుట కొరకు ధర్మపత్నీ సమేతముగా మిత్రదర్శనము ఫలముగా గల ఈ ప్రదేశమునకు వచ్చితిని. భక్తులయందు వాత్సల్యము గల పార్వతీపతి దయతో మీ పాదపద్మములను దర్శించుట వలన కలిగిన ఆనందాతిశయము నాకు లభించింది.” అని సోమదత్తుడు .రాజవాహనునికి తన వృత్తాంతాన్ని చెప్పాడు.

Having received an account of this from the messenger sent by Manapala, king Viraketu, who became happy, congratulated me and on an auspicious day gave his daughter in marriage to me amidst celebrations. Later, I was made the crown prince, and helping the king in administration, enjoyed royal pleasures with Vama- lochana.

One day an ascetic told me, who was agitated because of not seeing you that I would get the fruit of meeting my friend shortly. Having heard that I came here accompanied by my wife to worship Lord Siva. By the grace of Siva, I got the pleasure of seeing your feet again.” Thus, Somadatta told his story to Rajavahana.

Leave a Comment