Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 4th Poem అచలం Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 4th Poem అచలం
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు
ప్రశ్న 1.
దున్న ఇద్దాసు జీవితం- తాత్వికతను సమగ్రంగా వివరించడి?
జవాబు:
“అచలం” అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఇది దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం లోనిది.
దున్న ఇద్దాసు తెలంగాణలో ప్రసిద్ధ తత్వకవి. ఈయన 1811 1919 సం||ల మధ్య కాలంలో జీవించాడు. నల్గొండ జిల్లా ‘చింతపల్లి గ్రామానికి చెందినవాడు. తల్లిదండ్రులు రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తాత్వికునిగా మారాక ‘ఇద్దాసు’గా ప్రసిద్ధివహించాడు. డా. బిరుదురాజు రామరాజు’ ఇద్దాసు’ను మాదిగ మహాయోగిగా కీర్తించాడు.
ఇద్దాను బాల్యంలో మోతుబరి రైతు వద్ద పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాడు. భావిదగ్గర ‘మోట’ కొడుతూ గీతాలను అశువుగా పాడుకునేవాడు. ఈతని మధుర గీతాలను విన్న వరసిద్ధి జంగమ దేవర’ పూదోట బసవయ్య’ ఈతనికి ‘పంచాక్షరీ’ మంత్రాన్ని ఉపదేశించాడు. మెడలో లింగధారణ చేశాడు. ఇద్దాసు అడవులలో సంచారం చేస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంగా సాధన చేశాడు. అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్త్విక కవులైన శివరామ దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మం, ఈశ్వరాంబల ప్రభావం ఇతనిపై ఉంది.
ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా, వీరశైవ తత్త్వజ్ఞానిలా కన్పిస్తాడు. పటేల, పట్వారీలతోపాటు ప్రజలు ఈతని శిష్యులయ్యారు. సంచారం చేస్తూ నల్గొండ నుండి మహబూబ్ నగర్ జిల్లా వరకు ఆధ్యాత్మిక పర్యటనలు చేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లె, పోలేపల్లి, ఆవులోనిపల్లి, కాంసానిపల్లి, కల్వకుర్తి తాలూకాలోని గుడిగానిపల్లి దేవరకొండ తాలూకాలోని జీడికట్ల వంటి గ్రామాలలో ఈశ్వరమ్మ పీఠాలను నెలకొల్పాడు. వీరశైవ భక్తితో ఈయన 30కిపైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు.
ప్రశ్న 2.
‘అచలం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసుగారి తత్వాలు” నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో ‘ఇద్దాసు’ కలికితురాయి.
ఇద్దాసు తత్వాలు ఆత్మపరంగ, తత్వపరంగ తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తత్వాక అంశాలను పరిచయం చేయటం ఈ తత్వాల ఉద్దేశ్యం.
ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధనధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోక తప్పదు.
ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. దాని అంతు తెలియక అల్లరిపాలు అవతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలు కోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.
ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరసుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగి శక్తిని పొందితే, ఆ రహస్యం అంతుచిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞాచక్రంమును పొందండి, తరించండి.
ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం గమనించాలి. మన దేహంలో షటం చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంత చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.
ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.
II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు.
ప్రశ్న 1.
మనుషులు ఎందుకు భ్రమల్లో మునుగుతున్నారు?
జవాబు:
‘అచలం’ అనుపాఠ్యభాగముదున్న ‘ఇద్దాసు’ చేరచించబడింది. ప్రస్తుత పాఠ్య భాగం దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
ఈయన రాసిన తత్వాలు, ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. ఈ దేహము మనదికాదు, మోహాన్ని విడచి ప్రయత్నం చేసి గురువును చేరుకోవాలన్నాడు. ఆలు, బిడ్డలు ధనము నాది అనుభ్రమల్లో మానవులు బతుకుతున్నారు. భార్యా బిడ్డలు ధన, ధాన్యాలు ఏవీ శాశ్వతంకావు. ఆ భ్రమల్లో బ్రతుకుతూ సత్యాన్ని తెలుసుకునే లోపే జీవితం పూర్తయిపోతున్నది. కీలు విడచిన బొమ్మలాగా నేలలో కలిసిపోతున్నారు. కావున ఆ భ్రమలు వీడి నిజాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి అని ఇద్దాసు వివరించాడు.
ప్రశ్న 2.
ఆగం కాకుండా జీవించాలంటే ఏమీ చేయాలి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగము ‘దున్న ఇద్దాసు’ చేరచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” గ్రంథం నుండి గ్రహించబడింది.
‘ఓనామః శ్రీవాయుః’ అన్న అక్షరాలు రాస్తున్నాం. నేర్చుకుంటున్నాం, మన జీవిత ఆనవాళ్ళను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితం యొక్క ఆనవాళ్ళను తెలుసుకోలేకపోవటం వలననే అల్లరిపాలు అవుతున్నాం. మంచి చెడులను, పూర్వాపరాలను, మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేక పోవటం వలననే మనం ఆగమవుతున్నామని ఇద్దాసు ‘అచలం’ అను తత్వాల ద్వారా మనకు తెలియచేశాడు.
ప్రశ్న 3.
గురువు తత్వం వివరించండి?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’ చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదనకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్వాలు” అను గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.
ఈ లోకంలో గురువే బ్రహ్మం గురువే విష్ణువు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం అనాహతం, మణిపూరకం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు, వీటిలో చివరిది సహస్రారం, అది విచ్చుకునే శక్తిని ప్రసాదించేవాడు గురువు. అపుడే మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక ఆ రహస్యాన్ని తెలుసుకుని మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మోక్షాన్ని పొందమని ఇద్దాసు వివరిస్తున్నాడు.
ప్రశ్న 4.
దేహ తత్త్వాన్ని గురించి ఇద్దాసు ఏమి చెప్తున్నాడు?
జవాబు:
‘అచలం’ అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించబడింది. ‘దున్న విశ్వనాథం’ సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
ఏడ చూసినా ఏమీ లేదు. అంతామిథ్య. ఎక్కడ వెదకినా ఏమీ కన్పించదు. అంతాశూన్యం. అజ్ఞానంలో ఉన్నంత కాలం చీకటే కన్పిస్తుంది. అజ్ఞానాన్ని వదలి గురుని నమ్మి ఆయనను అనుసరిస్తే ఫలితం ఉంటుంది. మానవులు జీడికంటి వంటి నేత్రాలను తెరచుకోవాలి. ఆ జ్ఞాన నేత్రాలు, ఆ అగ్నినేత్రాలు మన దేహం తత్వాన్ని తెలియచేస్తాయి. అపుడు గురుని ద్వారా ముక్తి మూలాలను తెలుసుకోగలమని దున్న ఇద్దాసు వివరించాడు.
III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
దున్న ఇద్దాసు తల్లిదండ్రుల పేర్లు తెలపండి?.
జవాబు:
దున్న రామయ్య – ఎల్లమ్మలు
ప్రశ్న 2.
ఇద్దాసుకు పంచాక్షరిని ఎవరు ప్రబోధించారు?
జవాబు:
వరసిద్ధి జంగమ దేవర పూదోట బసవయ్య ప్రబోధించాడు.
ప్రశ్న 3.
తెలంగాణలో గొప్ప ‘అచల’ గురువు.
జవాబు:
దున్న ఇద్దాసు
ప్రశ్న 4.
ఇద్దాసు ఎవరి సమాధిని దర్శించాడు?
జవాబు:
కందిమల్లయ్యపల్లెలో ఉన్న ఈశ్వరాంబ సమాధిని దర్శించాడు.
ప్రశ్న 5.
దున్న ఇద్దాసు ఏఏ కోణాల్లో కన్పిస్తాడు?
జవాబు:
తత్త్వవేత్తగా, అచలునిగా, వీరశైవతత్త్వజ్ఞానిగా పలుకోణాల్లో కన్పిస్తాడు.
ప్రశ్న 6.
‘మాదిగ మహాయోగి’ అని ఇద్దాసును ఎవరు పేర్కొన్నారు?
జవాబు:
డా. బిరుదురాజు రామరాజుగారు
ప్రశ్న 7.
సాహసంతో గురుని చేరాక లభించేది ఏది?
జవాబు:
సోహము లభిస్తుంది.
ప్రశ్న 8.
కనురెప్పపాటులో పోయేది ఏమిటి?
జవాబు:
ప్రాణం, శరీరతత్త్వం.
IV. సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
సోహమే తన సొమ్మయా!
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి” తత్వాలు అనుగ్రంథం నుండి గ్రహించబడింది.
సందర్భము :-
ఈ దేహం మనదికాదు మోహాన్ని విడువమని చెప్పిన సందర్భంలోనిది.
భావము :-
ఈ దేహం మనదికాదు. దానిమీద మోహాన్ని వదలిపెట్టండి. ప్రయత్నించి గురుసేవ చేసుకుంటే ఆత్మ పరమాత్మను చేరాక తప్పుతుందా! అని ఇందలి భావం.
ప్రశ్న 2.
ఆనవాలు అంతు తెలియక ఆగమై పోతారయా!
జవాబు:
పరిచయము :-
ఈ వాక్యం ‘దున్న ఇద్దాసు’చే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
సందర్భము :-
మానవులు జీవం యొక్క మూల తత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నారని తెలియచేసిన సందర్భంలోనిది.
భావము :-
ఓ నమః శివాయః అని రాస్తున్నాము గాని మన జీవిత అసలు ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాము. అలా తెలిసికోలేక పోవటం వలన ఆగమైపోతున్నామని ఇందలి భావం.
ప్రశ్న 3.
మూల మెరిగిన గురునిచేత ముక్తి దొరకును మనకయా!
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము ‘దున్న ఇద్దాసు’ చే రచించబడినది. దున్న విశ్వనాథం “సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసు తత్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
సందర్భము :-
మానవులు మంచి గురువును ఆశ్రయిస్తే ముక్తి దొరకుతుందని వివరించిన సందర్భంలోనిది.
భావము :-
ఎక్కడ వెదికినా ఏమీ కన్పించదు శూన్యం తప్ప. జ్ఞాననేత్రాన్ని తెరచి, దాని మూలాన్ని గ్రహించిన గురువును ఆశ్రయించిన మానవులకు మోక్షం లభిస్తుందని ఇద్దాసు చెప్పాడని ఇందలి భావం.
ప్రశ్న 4.
కీలువదలిన బొమ్మవలెను నేలబడి పోతున్నది.
జవాబు:
పరిచయం :-
ఈ వాక్యము దున్న ఇద్దాసుచే రచించబడినది. దున్న విశ్వనాథం సంపాదకీయంలో వెలువడిన “శ్రీదున్న ఇద్దాసుగారి తత్త్వాలు అను గ్రంథం నుండి గ్రహించబడినది.
భావము :-
భార్యా, బిడ్డలు, ధనధాన్యాలు నావి నావారున భ్రమలో మానవులు ఉంటున్నారు. ఆ భ్రమ సత్యంకాదు. ఆ భ్రమలో ఉండగనే కీలువదలిన బొమ్మలాగా రాలిపోతున్నామని ఇందలి భావం.
V. సంధులు
1. మూలమెరిగిన
మూలము+ఎరిగిన = ఉ. కార సంధి. ఉత్వసంధి
సూత్రము :- ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధియగు
2. రాసేరుగాని
రాసేరు + కాని = గసడదవాదేశ సంధి
సూత్రము :- ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ప్రథమావిభక్తి ప్రత్యయములనగా డు ము వు లు పరుషము లనగా క, చ, ట, త, ప, లు
డు ము వు ల కు, క చ ట త ప లు వస్తే అవి గ స డ ద వ లు గా మారతాయని భావం.
3. భ్రమజెందేరయా
భ్రమజెందేరు + అయా = ఉత్వసంధి / ఉ. కారసంధి
సూత్రము :- ఉత్తునకు అచ్చుపరం బగునపుడు సంధియగు
4. ఆగమైపోతారయా
ఆగము+అయిపోతారు+అయా = ఉత్వసంధి/ఉకారసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు
5. పోతుందయా
పోతుంది + అయ = ఇత్వసంధి
సూత్రము :- ఏమ్యాదుల యిత్తునకు సంధివైకల్పికముగానను ఏమ్యాదులు అనగా ఏమి, మది,కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి ఏది ఏవి మొదలగునవి.
6. నా దని
నాది + అని = ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల యిత్తునకు సంధిపై కల్పికముగానను.
ఏమ్యాదులు అనగా ఏమి, మరి, కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలగునవి.
7. ఎల్లి యెల్లక
ఎల్లి + ఎల్లక = యడాగమసంధి
సూత్రము :- సంధిలేని చోట స్వరంబుకంటెన్ పరంబైన స్వరంబునకుయట్, ఆగమముగానగు.
8. నేల బ్రడి
నేలన్+పడి = ద్రత సంధి (సరళాదేశ సంధి)
సూత్రము :- ద్రుత ప్రవృతికము మీద పరుషములకు సరళములగు. ద్రుతసంధి/సరళాదేశ సంధి
9. ఏడజ్రూచిన
ఏడన్ + చూచిన = ద్రత సంధి / సరళాదేశ సంధి
సూత్రము :- ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు.
10. సొమ్మయా
సొమ్ము + అయా = ఉత్వసంధి
సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
VI. సమాసాలు
1. ఆలు పిల్లలు = ఆలియును పిల్లలును – ద్వంద్వసమాసం
2. గురునిపాదము = గురునియొక్క పాదము – షష్ఠితత్పురుష సమాసం
3. బసవగురుడు = బసవ అనుపేరుగల గురుడు – సంభావనాపూర్వపద కర్మధారయము
4. కనురెప్ప = కనుయొక్కరెప్ప – షష్ఠీతత్పురుష సమాసం
అర్థతాత్పర్యములు
1వ పద్యం :
పల్లవి: దేహమైతే మనదిగాడు.
మోహములు విడువందయా
సాహసం బున గురుని జేరితే.
‘సోహమే తన సొమ్ముయా ||
అర్థాలు :
దేహము = శరీరము
మోహము = ప్రేమ, ఆకాంక్ష
సాహసంబున = ప్రయత్నపూర్వకంగా
గురుడు = శివ గురువు బసవన
సోహము = ఆత్మపరమాత్మ అన్న భావన
సొమ్మయా = సంపద
తాత్పర్యము :
ఈ దేహము శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహాన్ని విడచిపెట్టాలి. మంచి శివ గురువును ఆశ్రయించి జీవన రాహిత్యాన్ని పొందాలి. అపుడేమోక్షం లభిస్తుంది. ఆత్మపరమాత్మలో లీనమౌతుంది అని ఇద్దాసు బోధించాడు.
2వ పద్యం :
ఆలు పిల్లలు ధనము నాదని
“ఏల భ్రమ జెందేరయా
కీలు వదలిన బొమ్మవలెను
నేలబడిపోతున్నది.
అర్థాలు :
ఆలు = భార్య
పిల్లలు = సంతానం
ధనము = డబ్బు
భ్రమ = మాయ
కీలు = మూలము
తాత్పర్యము :
భార్యాబిడ్డలు ధన ధాన్యముల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలాగా ఈ దేహం పడిపోక తప్పదు. కనురెప్పపాటున ఇదంతా జరిగిపోతుందని ఇందలి భావం.
3వ పద్యం :
ఏప్పటికిని ముప్పులేదని
మెకృగసు మురిసేరయా!
చెప్పకు కనురెప్పపాటున
చెదరిపోతున్నాదయా!
అర్థాలు :
ఎప్పటికిని = ఏనాటికి
ముప్పు = ప్రమాదము
మొప్పుగా = గొప్పగా
మురిసేరయా = ఆనందిస్తారు
చెప్పకు = చెప్పకుండానే
కనురెప్పపాటున = కనురెప్పతెరచిమూసేలోపే
చెదరిపోతున్నది = చెల్లాచెదురవుతుంది.
తాత్పర్యము :
సంతోషంగా ఉన్నంతకాలం ఏ బాధలు బందీలు లేనంతకాలం మనకేం ప్రమాదం లేదని భావిస్తున్నాం. ఒకసారిగా కనురెప్పపాటున ఈ దేహాన్ని వదలివేయవలసి వస్తుందని ఇందలి భావం.
4వ పద్యం :
ఓనమాలు రాసేరుగాని
ఆనవాలు రాయండయా!
ఆనవాలు అంతుతెలియక
ఆగమైపోతారయా!
అర్థాలు :
ఓనమాలు = ఓనామః శివాయః సిద్ధం నమః
రాసేరుగాని =రాస్తున్నారని
ఆనవాలు = జీవిత ఆనవాళ్ళన
తెలియక = తెలుసుకోలేక
ఆగమైపోతారయా = స్థిరత్వం లేకుండా పోతున్నారు.
తాత్పర్యం :
ఓనామః శివాయః సిద్ధం నమః అని వ్రాస్తున్నాము గాని మన జీవిత ఆనవాళ్ళను తెలుసుకోలేకపోతున్నాం. తీరా తెలుసుకునేసరికి అల్లరిపాలౌతున్నాం. మంచి చెడులను తెలుసుకొని మసలుకోవాలని ఇందలి భావం.
5వ పద్యం :
గురుడె బ్రహ్మం గురుడే విష్ణువు
గుర్తు తెలుసుకోండయా!
మేడమీద గురుని పాదము
కీలు తెలుసుకోండయా!
అర్థాలు :
గురుడె = గురువు
బ్రహ్మ = బ్రహ్మము
గురుడె = గురువు
విష్ణువు = విష్ణువు
మేడమీద గురుని పాదము = సహస్రార చక్రమునందున్న
కీలు = రహస్యము (పరబ్రహ్మ రహస్యము)
తెలుసుకోండయా = తెలుసుకొనుటకు ప్రయత్నించండి.
తాత్పర్యం :
ఈ లోకంలో గురువే బ్రహ్మం. గురవే విష్ణువు. మన దేహంలో షట్ చక్రాలు న్నాయి. మూలాధారం, స్వాధిస్థానం, అనాహతం, మణిపూరకం, విశుద్ధ, అజ్ఞా, సహస్రారం. వీటిలో చివరిది సహస్రారం. దానిని విచ్చుకునేలా చేయగలిగితే ఆ రహస్యాన్ని చేధించగలిగితే మోక్షాన్ని పొందగలం. దానిని తెలుసుకొని తరించండని ఇందలి భావం.
6వ పద్యం :
ఏడజూచిన ఏమిలేదు.
జీడి కంటికి పొందయా
మూల మెరిగిన గురుని చేత
ముక్తి దొరకును మనకయా!
అర్థాలు :
చిన = ఎక్కడ వెతికినా
ఏమీలేదు = ఏమీ కన్పించదు
జీడికన్ను= అగ్నినేత్రం, జ్ఞాననేత్రం, ఆజ్ఞాచక్రం
మూలమెరిగిన = మూలాన్ని అంటే అధ్యాత్మిక మూలాన్ని
ఎరిగిన = తెలుసుకున్నా
ముక్తి = మోక్షము
దొరకును = లభిస్తుంది.
తాత్పర్యం :
ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. అగ్ని నేత్రం, అజ్ఞాచక్రం, మూలాన్ని అంటే ఆథ్యాత్మిక మూలన్ని తెలుసుకున్న వానికి మోక్షము లభిస్తుంది.
7వ పద్యం :
వాసిగను ఇద్దాను చెప్పిన
మాట నిజమిది కనరయా!
భాసురంబుగా బసవగురుని
భావము మీరు గనరయా!
అర్థాలు:
వాసిగను = నాణ్యమైన
ఇ + దాసు = ఈ దాసుడు
చెప్పిన = పలికిన
మాట = పలుకు
నిజమిది = సత్యము
కనరయా = తెలుసుకోండయా
భాసురంబుగా = విశేషముగా
బసవగురుని = బసవగురుని యొక్క
భావము = ఆలోచనను
కనరయా = ఆచరించండి.
తాత్పర్యం :
ఇద్దాసు చెప్పిన మాటలు నిత్యసత్యాలు. తప్పకుండా అనుసరింపతగినవి. వీరశైవ మతాచార్యుడైన బసవని ఆలోచనలను ఆచరించండి. తరించండి అని ఇందలి భావం.
అచలం Summary in Telugu
కవి పరిచయం
కవిపేరు : దున్న ఇద్దాసు అసలు పేరు ఈదయ్య
కాలం : 1811-1919 మధ్యకాలం
పుట్టిన ఊరు : నల్గొండజిల్లా చింతపల్లి గ్రామం
తల్లిదండ్రుల : దున్నరామయ్య, ఎల్లమ్మలు
రచనలు : తత్వాలు, మేలుకొలుపులు, మంగళహారతులు మాత్రమే కొన్ని లభిస్తున్నాయి. మొత్తం రచనలు 30 వరకు ఉన్నాయి.
దున్న ఇద్దాసు గొప్ప తత్త్వకవి, ప్రముఖ వాగ్గేయకారుడు ఈయన నల్గొంజిల్లా చింతపల్లి గ్రామంలో క్రీ॥శ 1811-1919 మధ్య కాలంలో జీవించారు. తల్లిదండ్రులు దున్న రామయ్య, ఎల్లమ్మలు. ఇతని అసలు పేరు ఈదయ్య. తత్వకారుడయ్యాక ఇద్దాసు అయ్యాడు. ప్రముఖ పరిశోధనకుడు డా. బిరుదు రాజు రామరాజు ఇద్దాసును “మాదిగ మహాయోగి” గా అభివర్ణించాడు.
ఇద్దాసు చింతపల్లి గ్రామంలో మోతుబరి ఇంటి పశువుల కాపరి. రోజూ బావి దగ్గర “మోటకొడుతూ” ఆనువుగా గీతాలను ఆలపించేవాడు. ఆ గీతాలను విన్న వరసిద్ధ జంగమదేవర “పూదోట బసవయ్య” ఇద్దాసు పంచాక్షరీ మంత్రోపదేశం చేశారు. లింగధారణ చేయించి శైవునిగా మార్చాడు.
అడవులలో సందరిస్తూ “రాజయోగాన్ని” ఏకాంతంలో సాధన చేశాడు. దానితో ఆయన అష్టసిద్ధులను పొందాడు. పూర్వతాత్విక కవులైన శివరామదీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరాంబల ప్రభావం ఇద్దాసుపై ఉంది. ఈయన ఈశ్వరాంబ సంప్రదాయాన్ని అనుసరించాడు. ఆమె సమాధి సందర్శనకు ఇద్దాసు కందిమల్లయ్యపల్లెను దర్శించాడు.
ఇద్దాసు వేమనలా తత్త్వవేత్తగా, అచలుడిగా వీరశైవ తత్త్వ జ్ఞానిగా కన్పిస్తాడు. పఠేల్, పట్వారీలు ఇద్దాసుకు శిష్యులయ్యారు. సంచార యోగిగా నల్గొండ నుండి మహబూబ్ నగర్ వరకు తిరుగుతూ అధ్యాత్మికతను ప్రచారంచేశాడు. అచ్చంపేట తాలూకాలోని అయ్యవారిపల్లి, పోలేపల్లి, ఆవులోని బాయి మొదలగు చోట్ల ఈశ్వరమ్మ పీఠాలను స్థాపించాడు.
ఇద్దాసు 30కి పైగా తత్వాలను మేలుకొలుపులను, మంగళహారతులను రచించాడు. ప్రస్తుత పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వచ్చిన “శ్రీ దున్న ఇద్దాసు తత్త్వాలు” అను గ్రంథం నుండి గ్రహించబడింది.
పాఠ్యాంశ సందర్భం.
దున్నఇద్దాసు తత్త్వాలు ఆత్మపరంగా, తత్త్వపరంగా తెలంగాణ మట్టి నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంతశాస్త్రాల జ్ఞానాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకువెళ్ళి ఆథ్యాత్మిక సుగంధాలను ఇద్దాసు లోకంలో వెదజల్లాడు. తెలంగాణ పద సంకీర్తనా కవులలో కలికి తురాయి ఇద్దాసు. వేదాంత తాత్వికాంశాలను విద్యార్థులకు పరిచయం చేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
పాఠ్యభాగ సారాంశం
అచలం అను పాఠ్యభాగం ‘దున్న ఇద్దాసు’చే రచించినబడినది. ఈ పాఠ్యభాగం దున్న విశ్వనాథం సంపాదకత్వంలో వెలువడిన శ్రీ దున్న ఇద్దాసు గారి తత్వాలు నుండి గ్రహించబడింది. తెలంగాణ పద సంకీర్తన కవులలో “ఇద్దాసు” కలికి తురాయి.
ఇద్దరు తలు ఆత్మపరంగ, తత్వపరంగ, తెలంగాణ నుండి పుట్టిన మాణిక్యాలు. వేదాంత శాస్త్రజ్ఞాన సారాంశాన్ని సామాన్య ప్రజలకు ఈయన అందించాడు. వేదాంత తాత్విక అంశాలను పరిచయం చేయడం ఈ తత్వాల ఉద్దేశ్యం.
ఈ దేహం శాశ్వతం కాదు. కనుక ఈ దేహంపై మోహం విడచిపెట్టాలి. మంచి గురువును ఆశ్రయించి జీవనరాహిత్యాన్ని పొందటానికి ప్రయత్నించాలి. అపుడే మోక్షాన్ని పొందగలుగుతాము. భార్యాబిడ్డలు, ధన ధాన్యాల పట్ల మోహాన్ని వదలిపెట్టాలి. ఏదో ఒకనాటికి కీలు వదలిన బొమ్మలా ఈ దేహం రాలిపోకతప్పదు”.
ఓ నామః అని అక్షరాలు రాస్తున్నాం నేర్చుకుంటున్నాం కాని, మన జీవిత ఆనవాళ్ళనుతెలుసుకోలేకపోతున్నాం. దాని అంతం తెలియక అల్లరి పాలు అవుతున్నాం. మంచి చెడులను తెలుసుకుని మసలుకోవాలని ఇద్దాసు పలుకుతున్నారు.
ఈ లోకంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు. దీనిని మనం గమనించాలి. మన దేహంలో షట్ చక్రాలుంటాయి. సహస్రారం శిరస్సుపై ఉంటుంది. అదే చివరి చక్రం. దానిని తెరుచుకోగలిగే శక్తిని పొందితే, ఆ రహస్యం అంతం చిక్కితే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంమును పొందండి తరించండి.
ఈ లోకం అంతా శూన్యం. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా ఏమీ కన్పించదు. మనం జీడికంటి వంటి జ్ఞాన నేత్రాన్ని తెరచి చూసుకోవాలి. అపుడే ముక్తిమూలాలు అర్థమౌతాయి.
ఈ దాసు చెప్పిన మాటలు సత్యములు. అందరూ అనుసరింపదగినవి. వీరశైవ మత మత గురువైన బసవని యొక్క భావాలను అర్థం చేసుకుని ప్రవర్తించండి. అపుడే జీవన సాఫల్యం జరుగుతుంది.