Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Poem మిత్రధర్మం Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 2nd Poem మిత్రధర్మం
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు సమాధానములు
ప్రశ్న 1.
శ్రీకృష్ణుడు కుచేలుడిని ఎలా గౌరవించాడో వివరించండి.
జవాబు:
కుచేలుడును, శ్రీకృష్ణుడును బాల్య స్నేహితులు. నిరంతర దరిద్ర పీడితుడైన కుచేలుడు భార్య ఆప్తమైన ఉపదేశముచే శ్రీకృష్ణుని దర్శించుటకై ద్వారకానగరమునకు బయలుదేరెను. కక్ష్యాంతరములు దాటి మణిమయ సౌధములో – అంతఃపురములో హంసతూలికా తల్పముపై కూర్చుండి ప్రియురాలితో కలసి వినోద క్రీడలలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచి బ్రహ్మాయనందమును పొందెను.
శ్యామల కోమలాకారుడును, ఇంద్రాది దేవతలచే స్తుతింపబడు వాడును, కౌస్తుభముడిన అలంకారముగా ధరించినవాడును, సమస్తలోకములచే ఆరాధింపబడు వాడును, పాల సముద్రము నందు విహరించువాడును ఐన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని చూచెను. అట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు నిరంతర దారిద్య్రము చేత పీడింపబడువాడు, బక్క చిక్కిన శరీరముతో, చినిగిపోయిన వస్త్రములతో పరిహాసమునకు స్థానమైన ఆ పేద విప్రుని గాంచి గబగబ తన పాన్పు మీది నుండి క్రిందికి దిగి, ఆదరముతో ఎదురుగా వచ్చి బాల్యమిత్రుడైన ఆ కుచేలుని కౌగిలించుకొనెను. తీసుకొని వచ్చి, తన పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. ప్రేమతో బంగారు కలశము నందలి నీటితో వాని కాళ్ళు కడిగెను. కాళ్ళు కడిగిన ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనెను.
తరువాత కుచేలుని శరీరమునకు మంచి గంధము నలదెను. ప్రయాణ ప్రయాస పోవుటకై వింజామరలతో వీచెను. సువాసనా భరితమైన ధూపముల నొసగెను. మణిమయం దీపములతో ఆరతి పట్టెను. సిగలో పూలమాలలు అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోవును దానముగా సమర్పించెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు చేసిన సేవలను గాంచి, కుచేలుని శరీరము పులకించిపోయెను.
గగుర్పాటుతో ఆయన వెంట్రుకలు నిక్కపొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములను స్రవించెను. అంతేకాదు
– శ్రీకృష్ణుని భార్యామణియగు రుక్మిణీ దేవి స్వయముగా చామరములు వీచుచుండెను. ఈ విధముగా రుక్మిణీ కృష్ణులు చేయు సపర్యలను అందుకొనుచున్న ఆ కుచేలుని భాగ్యమునకు ఆశ్చర్యపోయి అంతఃపుర కాంతలు ఇట్లు ప్రశంసించిరి.
ఈ బ్రాహ్మణుడు పూర్వ జన్మమునందు ఎటువంటి తపస్సు చేసెనో గదా ! యోగులచే ఉపాసింపబడు జగత్ప్రభువు, లక్ష్మీదేవి ప్రియుడైన శ్రీకృష్ణుని తల్పముపై కూర్చుండినాడు ఎటువంటి మునీశ్వరులైనను ఈ మహనీయమూర్తికి సాటియగునా ?
“తన భార్యమణియైన రుక్మిణీదేవి ఏమనుకొనునోయని కూడ భావింపక, యదువంశేఖరుడైన శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి, ఆలింగనము కావించుకొని, వివిధములైన సేవలచే ఆయనను సంతృప్తుని కావించినాడు. ఈ బ్రాహ్మణోత్తముడెంత అదృష్టశాలియో గదా !” ఆ అంతఃపురకాంతలు కుచేలుని భాగ్యమున కచ్చెరువందినారు.
ఇట్లు కుచేలుడు కృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహమునకు పాత్రుడై, సాక్షాత్తు భగవంతుని చేతనే సేవలు చేయించుకొనినాడు. మధురమైన స్నేహమునకు కుచేలోపాఖ్యానము ఉజ్జ్వలమైన ఉదాహరణము.
ప్రశ్న 2.
‘మిత్రధర్మం’ పాఠ్యభాగ సారాంశం వివరించండి.
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్య్ర బాధ అనుభవించాడు. కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్య్ర బాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి – భర్తను, శ్రీకృష్ణుని ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.
భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడిగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యానం నిదర్శనంగా నిలుస్తుంది.
మహాపతివ్రతయు, క్రుంగికృశించి పోయినది. యునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని. తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణేశ్వరా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.
మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయా సాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.
భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “ నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే- ఆ చక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా ? – యని అడుగగా ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొంగునకు కొన్ని అటుకులు ముడి వేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.
“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి ? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమానమిచ్చుటకు -” అనుకొనుచు కుచేలుడు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యాంతములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న శ్రీకృష్ణుని బ్రహ్మానందమును అనుభవించెను.
అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. మంచి గంధమును శరీరమునకు అలదెను.
వింజామరలతో గాలి విసరి మార్గాయాసమును పోగెట్టేను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి కాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.
శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.
కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని తాము గురుకులంలో చదివిన రోజులలోని సంఘటనలు గుర్తుచేసాడు. కుచేలుని భార్యా పిల్లల కుశలమడిగాడు. ధర్మనిష్ఠతో, కర్తవ్య నిష్ఠతో జీవించే ఉత్తములను భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. మనం గురు నివాసంలో ఉంటు ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాం గుర్తుంది కదా ! దారి తెన్నూ కనపడకుండా పడిన ఆ కష్ట సమయంలో ఒకరికొకరు ఆసరాగా ఆ అడవిలో చలికి వణుకుతూ గడిపాము. ఇంతలో తెల్లవారడంతోనే మనకోసం గురువుగారు వెతుకుతూ వచ్చి మనలను దీవించారు.
కృష్ణుని మాటలకు పొంగిపోయిన కుచేలుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని శ్లాఘించాడు. నా కోసం ఏమి తెచ్చావు అని అడుగగా సిగ్గుతో తలదించుకుని కూర్చున్న కుచేలుని ఉత్తరీయం ముడిలో ఉన్న అటుకులను ప్రేమతో తిని అతనికి సకల సంపదలను అనుగ్రహించాడు. తిరిగి ఇంటికి వెళ్ళిన సుధామునికి (కుచేలుడు) ఇదంతా కృష్ణలీల అని గ్రహించి ఆనందించాడు. స్నేహంలో ఆస్తుల తారతమ్యం, ధనిక బీద తేడాలుండకూడదని శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా లోకానికి చాటి చెప్పాడు.
II. సంగ్రహరూప ప్రశ్నలు
ప్రశ్న 1.
పోతన గురించి తెలుపండి.
జవాబు:
భక్తకవిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన 15వ శతాబ్దపు కవి. కేసన, లక్కమాంబ తల్లిదండ్రులు. వ్యాస భాగవతాన్ని రసరమ్యంగా తెలుగువారికి అందించాడు. పోతనకు సహజపండితుడు అనే బిరుదు ఉంది. పోతన వీరభద్ర విజయం, భోగినీ దండకం కూడా రచించాడు.
ప్రశ్న 2.
కుచేలుడి దారిద్ర్యాన్ని వర్ణించండి.
జవాబు:
కుచేలుడు అతని భార్యాపిల్లలు ఆకలి బాధతో కృశించిపోయారు. కుచేలుడు పేదరికంలో చిక్కి శల్యమైన శరీర అవయవములు కలిగి ఉన్నాడు. చినిగిన బట్టలు ధరించాడు. మనసులో శ్రీకృష్ణుడు సహాయం చేస్తాడనే గొప్ప ఆశతో ఉండి, చూడగానే నవ్వు పుట్టించే వాడుగా ఉన్నాడు. చినిగిన వస్త్రాన్ని ధరించి తన మిత్రుడైన శ్రీకృష్ణుని చూసి తొట్రుపాటుతో దూరంగా నిలబడ్డాడు అని కుచేలుని దారిద్ర్య స్థితిని వర్ణించాడు.
ప్రశ్న 3.
శ్రీకృష్ణుడిని దర్శించేందుకు కుచేలుడు భార్యకు చెప్పిన కారణమేమిటి ? –
జవాబు:
శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను. నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ?
దివ్వ దీప్తితో ప్రకాశించు అంతఃపురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వడవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టినచో – వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడును. అయినను ఆయన దయ – నా భాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాలమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.
ప్రశ్న 4.
శ్రీకృష్ణుడు, కుచేలుడిని ఏవిధంగా ఆదరించాడు ?
జవాబు:
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాదరములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు.
ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు. కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గందమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను. మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను.
ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను. ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి అప్పుడు పుట్టిన చేతుల గాజులు ఘుల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను. చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లనుకొనసాగిరి.
III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సంస్కృత భాగవతాన్ని ఎవరు రచించారు ?
జవాబు:
వేదవ్యాసుడు.
ప్రశ్న 2.
భక్తితో సమర్పిస్తే శ్రీకృష్ణుడు ఏం స్వీకరిస్తాడు ?
జవాబు:
ప్రీతితో దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అన్నాడు.
ప్రశ్న 3.
కుచేలుడికి మరోపేరు ఏమిటి ?
జవాబు:
సుధాముడు.
ప్రశ్న 4.
శ్రీకృష్ణ – కుచేలులు ఎవరి వద్ద విద్యాభ్యాసం చేసారు ?
జవాబు:
సాందీపని
ప్రశ్న 5.
కుచేలుడు శ్రీకృష్ణుని ఇచ్చేందుకు ఏమి తీసుకొని వెళ్ళాడు ?
జవాబు:
అటుకులు.
ప్రశ్న 6.
శ్రీకృష్ణుడు కుచేలుడికి ఏమి ప్రసాదించాడు.
జవాబు:
ఇంద్రాది దేవతలకు సాధ్యంకాని అనేక సంపదలిచ్చాడు.
ప్రశ్న 7.
కుచేలుడు ఇంటికి వెళ్ళగానే భార్య ఎలా కనిపించింది ?
జవాబు:
మానవ రూపం దాల్చిన లక్ష్మీదేవి వలె కనిపించింది.
ప్రశ్న 8.
‘మిత్ర ధర్మం’ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది ?
జవాబు:
శ్రీమదాంధ్ర మహాభాగవతం దశమ స్కంధం నుండి గ్రహించబడింది.
IV. సందర్భ సహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
గోవింద దర్శనోత్సాహియగుచు.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. పోతనకు “సహజపాండిత్యుడని” బిరుదు.
సందర్భము :
తన భార్య పలికిన ధర్మ వాక్యములకు సంతరించి కుచేలుడు శ్రీకృష్ణుని దర్శనము ఇహపర సాధనమని భావించి, శ్రీకృష్ణ దర్శనార్థమై కుచేలుడు బయలుదేరు సందర్భములోనిదీ వాక్యము.
వివరణ :
“నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను దర్శించుట శుభకర మైనది-వానికి సమర్పించుటకు కానుక ఏమైనా కలదా ?” – యని కుచేలుడు అడుగగా సరేని కొన్ని అటుకులను కుచేలుని చినిగిపోయిన వస్త్రము కొంగున ముడివేసెను. అంత కుచేలుడు గోవిందుని సందర్శన ఉత్సాహముతో ద్వారకకకు బయలుదేరు సన్నివేశమును పోతన మహాకవి వర్ణించు సందర్భములోనిదీ పద్యపాదము.
విశేషము :
భగవంతుని దర్శించుటకై వెళ్ళు సందర్భము నందు భక్తుని భావోద్వేగమును ఈ పద్యపాదము సూచించును. ఇది “తేటగీతి” పద్యపాదము.
ప్రశ్న 2.
సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.
సందర్భము :
తన భార్య కోరికపై కుచేలుడు శ్రీకృష్ణ సందర్శనార్థమై ద్వారకా నగరము చేరుకొని-అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోదములలో మునిగియున్న శ్రీకృష్ణుని గాంచెను. వచ్చిన తన బాల్యమిత్రుడైన కుచేలుని చూచి, శ్రీకృష్ణుడు హంసతూలికా తల్పము నుండి దిగి, ప్రేమతో ఎదురేగి స్వాగతము పల్కు సందర్భములోనిదీ పద్యపాదము.
వివరణ :
ఎడతెగని దారిద్య్రముచేత పీడింపబడువాడును, చిక్కిపోయిన అవయవ ములు కలవాడును, చినిగిపోయిన వస్త్రములను ధరించినవాడును, హాస్యమునకు నిలయమైన వాడునగు ఆ పేద విప్రుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ తన పాన్పుపై నుంది క్రిందికి దిగెనని పోతన వర్ణించినాడు.
ప్రశ్న 3.
చరితములని కొన్ని నుడివి చతురత మఱియున్.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.
సందర్భము :
తనను దర్శించడానికి వచ్చిన కుచేలుని చూసి అతిధి సత్కారాలు చేసి కుచేలునితో చిన్ననాటి సంఘటనలు గుర్తుచేసుకున్న సందర్భంలోనిది.
వివరణ :
కుచేలుని అదృష్టానికి అంతఃపుర కాంతలు ఆశ్చర్యపోతున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకుని ఇద్దరూ కలిసి గురుకులవాసం చేసిన రోజులలోని విశేషాలను కొన్నింటిని శ్రీకృష్ణుడు గుర్తుచేసుకున్నాడు అని భావం.
ప్రశ్న 4.
రుచిరాన్నముగనే యేను భుజింతున్.
జవాబు:
కవి పరిచయం :
భక్త కవి పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం నుండి గ్రహింపబడిన మిత్రధర్మం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.
సందర్భము :
నాకోసం ఏమి తెచ్చివు అని కుచేలుని కృష్ణుడు అడుగుతూ ప్రేమ, భక్తి యొక్క గొప్పదనాన్ని చెబుతున్న సందర్భంలోనిది.
భావం :
పత్రమైనా, పుష్పమైనా, జలమైనా, ఫలమైనా సరే నిశ్చల భక్తితో నాకు సమర్పిస్తే దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు.
V. సంధులు
1. పేదరికమిట్లు : పేదరికము + ఇట్లు = ఉకార సంధి
సూత్రం : ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు
2 జీవితాశ : జీవిత + ఆశ = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.
3. పదాఙ్ఞాతంబు : పద + అఙ్ఞాతంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.
4. దారిద్ర్యాంధకార : దారిద్య్ర + అంధకార = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం. : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.
5. వాలుఁగన్నులు : వాలున్ + కన్నులు = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములుగు.
6. సేసెనొకొ : సేసెను + ఒకొ = ఉత్వ సంధి
సూత్రం : ఉ
7. దర్శనోత్సాహి దర్శన + ఉత్సాహి = గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ వర్ణములు పరమైనచో క్రమముగా ఏ, ఓ, అర్ – లు ఏకాదేశమగును
8. అప్పద్మనేత్రం : ఆ + పద్మనేత్రు = త్రిక సంధి
సూత్రం :
- ఆ, ఈ, ఏ – అను సర్వనామములు త్రికమనబడును.
- త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
- ద్విరుక్తంబగు హల్లు స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమగును.
9. దివ్యాంబర : దివ్య + అంబర = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అకార, ఇకార, ఉకార, ఋకారములకు సవర్ణములు పరమైనచో వాని దీర్ఘమేకాదేశమగును.
VI. సమాసాలు
1. శిథిలవస్త్రంబు : శిధిలమైన వస్త్రము – విశేష పూర్వపద కర్మధారయ సమాసము
2. చక్రపాణి : చక్రము పాణియందుకలవాడు – బహువ్రీహి కర్మధారయ సమాసము
3. గరుగృహం : గురువుయొక్క గృహం – షష్ఠీతత్పురుష సమాసము
4. దయాపయోనిధి : దయా పయోధి – షష్ఠీ తత్పురుష సమాసము
5. దయార్ద్ర దృష్టి : దయార్ద్రమైన దృష్టి – విశేష పూర్వపద కర్మధారయ సమాసము
6. మురసంహరుడు : ముర అనే రాక్షసుని సంహరించినవాడు – బహువ్రీహి సమాసము
7. రాజీవనేత్రుడు : రాజీవము వంటి నేత్రములు కలవాడు – బహువ్రీహి సమాసము
8. కరకంకణ రవంబు : కరకంకణముల యొక్క రవంబులు – షష్ఠీ తత్పురుష సమాసము
9. ద్వారకానగరంబు : ద్వారక అను పేరుగల నగరము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
అర్థ తాత్పర్యములు
“పరీక్షిన్మహారాజా ! శ్రీకృష్ణుని బాల్య సఖుడు కుచేలుడు. ఆ బ్రాహ్మణోత్తముడు అభిమానధనుడు – విజ్ఞాని. రాగద్వేషాలు లేనివాడు. పరమ శాంతమూర్తి. ధర్మ తత్పరుడు జితేంద్రియుడు. తన గృహములో దారిద్ర్యము తాండవించుచున్నను ఎవ్వరిని దీనము యాచించి యెరుగడు. తనకు ప్రాప్తించిన కాసును కూడ పదివేలుగా భావించి ఏదో ఒక విధముగా భార్యాపుత్రులను పోషించుచుండెను.
1వ పద్యం :
తే. బాలసఖుండైనయప్పద్మపత్ర నేత్రుం
గాన నేఁగి దారిద్య్రంధకార మగ్ను
లైన మనుమునుద్ధరింపుమున; హరికృపా క
“టాక్ష రవిదీప్తి వదసి మహాత్మ ! నీవు,
అర్థాలు :
మహా + ఆత్మ = మహానుభావా !
నీవు = నీవు (కుచేలుడు)
బాలసఖుడైన = చిననాటి స్నేహితుడైనట్టి
ఆ + పద్మపుత్ర నేత్రున్ = తామరరేకుల వంటి కన్నులు గల ఆ శ్రీకృష్ణుని
కానన్ = చూచుటకు
ఏగి = వెళ్ళి
దరిద్ర + అంధకార = బీదఱికమనెడి చీకటిలో
మగ్నులయిన =
మమున్ = మమ్ములను
హరి కృపాకటాక్ష = శ్రీకృష్ణుని దయతో కూడిన కడకంటి చూపు అనెడి
రవిదీప్తిన్ = సూర్యకాంతిని
పడసి = పొంది
ఉద్దరింపుము = రక్షింపుము, ఆపద నుండి తొలగింపుము
భావం:
“మహాత్మా ! నీ చిననాటి స్నేహితుడైన, వాడును, తామరరేకుల వంటి కన్నులు కలవాడును అగు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఆ హరి యొక్క కడకంటి చూపు అనెడి సూర్యకాంతి చేత దారిద్ర్యమనెడి చీకటిలో మునిగియున్న మమ్ములను కాపాడుము” భార్య తన భర్తను కోరెనని భావము.
2వ పద్యం :
చ. వరదుఁడు సాధుభక్తజన వత్సలుఁ దార్తశరణ్యం ఉందిరా
వరుఁడు దయాపయోనిధి భగవంతుఁడు కృష్ణుఁడు దాం గుతస్థలీ
పురమున యాదవ ప్రకరముల్ భజియింపఁగ నున్నవాఁదు; నీ
వరిగిన నిన్నుఁ జూచి విభుఁడప్పుడు యిచ్చు ననూస సంపదల్.
అర్థాలు :
విభుడు = విశ్వ ప్రభువైన ఆ కృష్ణుడు
వరదుడు = వరములనిచ్చువాడు
సాధు భక్తజనవత్సలుడు = సత్పురుషులను భక్తుల యందు దయ గలవాడు
ఆర్త శరణ్యుడు = దీనులను రక్షించువాడు
దయాపయోధి = దయకు సముద్రుని వంటివాడు
భగవంతుడు = సకల సంపదలు కలవాడునగు
కృష్ణుడు = శ్రీకృష్ణ పరమాత్ముడు
తాన్ = తాను
కుశస్థలీ పురమునన్ = ద్వారకా నగరమందు
యాదవ ప్రకరముల్ = యాదవుల సమూహములు
భుజియింపగన్ = సేవింపగా
ఉన్నవాడు = నివసించుచున్నాడు
నీవు + అరిగినన్ = నీవు వెళ్ళినచో
నినున్ + చూచి = నిన్ను గాంచి
అప్పుడ = అప్పుడే – అనగా వెంటనే
అనూన సంపదల్ = అపారమైన సంపదలను
ఇచ్చు = ప్రసాదించును
భావం :
“వరములను ప్రసాదించువాడును, భక్తుల యందు దయగలవాడును, దీన జనులను రక్షించువాడును, దయకు సముద్రుని వంటివాడును, సకల సంపదలు కలవాడును అగు శ్రీకృష్ణ పరమాత్మడు యాదవుల సేవలందుకొనుచు ద్వారకాపురములో నున్నాడు. నీవు వెళ్ళినచో నిన్ను చూచి, మరుక్షణమే ఆ విశ్వవిభుడు అపారమైన సంపదలనిచ్చును”. అని కుచేలుని భార్య తన భర్తతో పలికెను. భక్తుల పట్ల శ్రీకృష్ణ పరమాత్మునికి గల కృపా విశేషమును పోతన ఈ పద్యములో వర్ణించినాడు.
3వ పద్యం :
మ. కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు
ర్బలుఁ దావత్సమయంబునన్ నిజపదాఙ్ఞాతంబు లుల్లంబులో
దలఁప న్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నెన నిచ్చున్, సుని
శ్చలభక్తిని భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్ (శ్రీకృష్ణుడు – కర్త)
అర్థాలు :
తను = తనను (శ్రీకృష్ణుని)
కలనైనన్ = స్వప్నము నందైనను
మున్ను = పూర్వమ
ఎరుంగని = తెలియని, స్మరింపని
మహా కష్టాత్ముడు + ఐనట్టి = మిక్కిలి చెడ్డ మనస్సు కలవాడగు
దుర్భలుడు = హీనుడు
ఆపత్ + సమయమ్మునన్ = కష్ట కాలమునందు
నిజ = తనయొక్క
పద + అఙ్ఞాతంబములు = పద్మముల వంటి పాదములను
ఉల్లంబులోన్ = మనస్సులో
తలపన్ = స్మరింపగా
అంతనే = వెంటనే
మెచ్చి= మెచ్చుకొని
ఆర్తిహరుడై = బాధను పోగొట్టినవాడై
తన్నైనన్ + ఇచ్చును = తన్ను తానే సమర్పించుకొనును
సునిశ్చల భక్తిన్ = ఏ మాత్రము చలిపంని భక్తితో
భజియించు వారికిన్ = సేవించువారికి
సంపత్ + విశేష + ఉన్నతుల్ = అపారమైన సంపదలను
ఇడడే = ఈయడా!
భావం :
ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కలలో కూడ తన్ను స్మరింపని నీచాత్ముడు కష్ట సమయంలో తన పాద పద్మములను మనస్సులో తలచినంత మాత్రముననే మెచ్చుకొని వాని ఆపదను బట్టి తన్ను తాను సమర్పించుకొనును. అట్టి కరుణామయుడు తనను నిశ్చలమైన భక్తితో సేవించు వారికి అపారమైన సంపదలను ఈయడా ? (ఇచ్చునని భావము) – అని కుచేలుని భార్య తన భర్తతో పలికెను.
ఈ పద్యమునుందు భగవంతుని భక్తజన వాత్సల్యమును పోతన మహాకవి వర్ణించినాడు.
3వ పద్యం :
క. అని చెప్పిన న మ్మానిని
సునయోక్తుల కలరి భూమిసురుఁ దా కృష్ణుం
గున నేయుట యిహపద సా
“ధన మగు నని మదిఁ దలంచి తన పతితోడన్
అర్ధాలు :
అని పలికినన్ = అని పలుకగా
ఆ + మానిని = ఆ అభిమానవతి యొక్క
సునయ + ఉక్తులకున్ = మంచి మాటలకు
అలరి = సంతసించి
భూమిసురుడు = ఆ బ్రాహ్మణుడగు కుచేలుడు
ఆ కృష్ణున్ + కనన్ + ఏగుట = ఆ కృష్ణుని చూచుటకై వెళ్లుట
ఇహ పర = ఇహలోక, పరలోక సుఖములకు
సాధనము + అగును + అని = ఉపకరణమగునని
మదిన్ = మనసునందు
తలంచి = భావించి
తన సతితోడన్ = తన భార్యతో (తరువాత పద్యముతో అన్వయము)
భావం :
భార్య మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుని చూచుట ఇహలోక, పరలోక సుఖములకు సాధనమగునని భావించి, తన భార్యతో ఇట్లు పలికినాడని (తరువాతి పద్యముతో అన్వయము)
5వ పద్యం :
చు. నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగం జనుట.
పరమశోభన మా చక్రపాణి కిపుడు
గానమైన గొంపోవఁ గలదె మనకు ?
అర్థాలు :
నీవు చెప్పిన + అట్ల = నీవు పలికిన విధముగనే
రాజీవనేత్రం = పద్మముల వంటి కన్నులు గలగిన శ్రీకృష్ణుని యొక్క
‘పాద పద్మమలు = పద్మముల వంటి పాదములు
ఆశ్రయింపగన్ = చేరుటకు
చనుట = వెళ్లుట
పరమ శోభనము = మిక్కిలి శుభము
ఇపుడు = ఈ సమయమున
ఆ చక్రపాణి = చక్రము పాణియందు కలిగిన ఆ శ్రీకృష్ణునకు
కానుక + ఏమైన = ఏదైన కానుక
కొంపోవన్ = తీసుకొని వెళ్లుటకు
మనకున్ = మనకడ
కలదె = ఉన్నదా !
భావం :
“నీవన్నట్లు శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుట మిక్కిలి శుభదాయకమే. కాని ఆయనకు తీసుకొని వెళ్లుటకై మన దగ్గర ఏదైన కానుక ఉన్నదా ?” అని కుచేలుడు భార్యనడిగెను.
6వ పద్యం :
తే. అనిననయ్యింతి యౌఁగాక యనుచు విభుని,
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.
అర్థాలు :
అనినన = అని పలుకగా
ఆ + ఇంతి = ఆ స్త్రీ (కుచేలుని భార్య)
ఔన్ + కాక = సరే
అనుచు = అనుచు
విభుని = భర్త యొక్క
శిథిల = చినిగిన
వస్త్రంబు + కొంగునన్ = వస్త్రము యొక్క కొంగున
పృథుకతండులములన్ = అటుకులను
ఒకకొన్ని = కొన్నింటిని
ముడిచి = కట్టి
నెయ్యమునన్ = ప్రేమతో
అనుపన్ = పంపగా
గోవింద = శ్రీకృష్ణుని యొక్క
దర్శన = చూచుటయందు
ఉత్సాహి + అగుచు = ఉల్లాసము కలవాడై
చనియెన్ = వెళ్ళెను
భావం :
అప్పుడు కుచేలుని భార్య ‘సరే’ యని కొన్ని అటుకులను భర్త యొక్క చినిగిన వస్త్రము చివర ముడివేసి ప్రయాణమునకు సిద్ధము చేసినది – శ్రీకృష్ణ సందర్శనోత్సాహంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరెను.
అర్థాలు :
చనుచు = వెళ్ళుచు
తనమనంబునన్ = తన మనస్సులో ఇట్లు భావించెనని
7వ పద్యం :
వ. అట్లు సనుచుం దన మనంబున.
8వ పద్యం :
సీ. ద్వారకానగరంబు నే రీతిఁ జొత్తును ?
భాసురాంతఃపురవాసి యైన
య పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగిఁ
దర్శింపఁ గలనా ? తద్వారపాలు
రెక్కడి విప్రుఁడ ? విందేల వచ్చెద ?
పని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనం బంచాన మిచ్చి చొచ్చెద నన్ను
సూహింప సర్దశూన్యుండ నేను ;
తే. నయిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయంగా నొండు గలదె ? యాతం.
డేల నన్ను ముపేక్షించు 2 వేటమాట ?
లనుచు నా ద్వారకాపుర మతండు సొచ్చి.
అర్థాలు :
ద్వారకానగరంబున్ = ద్వారకా పట్టణమును
ఏ రీతిన్ = ఏవిధముగ
చొత్తును = ప్రవేశింతును ?
భాసుర = దివ్వ దీప్తితో ప్రకాశించు
అంతఃపురవాసి + ఐన = అంతఃపురములో నుండునట్టి
ఆ + పుండరీక + అక్షున్ = పద్మముల వంటి కన్నులు కలిగిన వాడగు ఆ కృష్ణుని
అఖిల + ఈశున్ = సర్వేశ్వరుని
ఏ + భంగిన్ = ఏ రీతి
దర్శింపగలను = చూడగలను ?
తత్ + ద్వార పాలకులు = ఆయన యొక్క అంతఃపుర ద్వార పాలకులు
ఎక్కడి విప్రుండవు = ఎక్కడి నుండి వచ్చిన బ్రాహ్మణుడవు
ఇందున్ + ఏల + వచ్చెదవు = అవి = ఇక్కడికెందులకు వచ్చితివని
అడ్డు పెట్టిరేని = నన్ను నిరోధించినచో
పరిదానము + ఇచ్చి = బహుమానమిచ్చి
చొచ్చెదన్ + అన్న = ప్రవేశించెదమన్నచో
ఊహింపన్ = ఆలోచింపగా
అర్థ శూన్యుండను = డబ్బు లేని వాడను
నా భాగ్యము = నా అదృష్టము
అతని = ఆ కృష్ణుని యొక్క
దయా దృష్టి = దయతో తడిసిన చూపు (కటాక్ష వీక్షణము)
కాక = అంతేగాని
ఒండగలదె = ఇతర మేమున్నది ?
అతడు = ఆ కృష్ణుడు
నన్నున్ + ఏల + ఉపేక్షించును = నన్నెందులకు అశ్రద్ధ చేయును ?
ఏటి మాటలు = ఇన్ని మాటలెందులకు ?
చొచ్చి = ప్రవేశించి
భావం :
నేనెట్లు ద్వారకా నగరమును చేరగలను ? దివ్వ దీప్తితో ప్రకాశించు అంతః పురము నేనెట్టు ప్రవేశింపగలను ? సర్వేశ్వరుడైన ఆ కృష్ణుని ఎట్లు దర్శింపగలను ? నీవెవ్వ డవు ? ఎక్కడినుండి, ఎందులకు వచ్చితివి ? అని ప్రశ్నించి ద్వారపాలకులు అడ్డు పెట్టిన చో-వారికేమైన బహుమానమిచ్చి వెళ్ళవచ్చునన్నచో, నేను డబ్బు లేనివాడను. అయిననుఆయన దయ-నాభాగ్యము. ఆలోచింపగా మరేమి యున్నది ? ఐనను బాల్యమిత్రుడైన ఆ కృష్ణుడు నన్నేల అశ్రద్ధ చేయును ?” అని తలచుచు కుచేలుడు ద్వారకా నగరములో ప్రవేశించెను.
9వ పద్యం :
ఎ. ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జని చని కక్ష్యాంతరంబులు గడచి చనిముందట.
అర్థాలు :
కక్ష్యాంతరంబులు = లోగిళ్ళ వాకిళ్ళు
కడచి = దాటి
చని = వెళ్లి
ముందటన్ = ఎదుట
భావం :
ఇట్లు కుచేలుడు ద్వారకలో ప్రవేశించి, కొన్ని లోగిళ్ళ వాకిళ్ళు దాటి, ముందుకు వెళ్ళి – (తరువాతి పద్యముతో అన్వయము)
10వ పద్యం :
మ. కని దాయం జనునంతఁ గృష్ణుండు దళత్కకంజాక్షుఁ డ ప్పేద వి
పుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్
ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖందోత్తరీయం గుణే
లుని నల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగెం డల్పమున్
అరాలు :
కని = కుచేలుడు కృష్ణుని చూచి
డాయన్ + చనునంతన్ = సమీపించగానే
దళత్ + కంజ + అక్షుడు = విరిదామరల వంటి కన్నులు కలవారునగు కృష్ణుడు
ఆ + పేద విప్రునిన్ = ఆ బీద బ్రాహ్మణుని
అశ్రాంత = ఎడతెగని
దరిద్ర పీడితున్ = పేదరికము చేత బాధపడు వాడను
కృశీభూత + అంగున్ = చిక్కి శల్యమైన శరీర అవయవములు కలవాడును
జీర్ణ + అంబరున్ = చినిగిన బట్టలు కలవాడను
ఘన + ఆతుర + చిత్తున్ = గొప్ప ఆశతో కూడిన మనస్సు కలవాడును (ఆశాపూరిత చిత్తుడును)
హాస్య నిలయమున్ = పరిహాసమునకు స్ధానమైన వాడును
ఖండ + ఉత్తరీయున్ = ముక్కలైన ఉత్తరీయము కలవాడును (అయిన)
కుచేలునిన్ = తన మిత్రుడైన కుచేలుని
అల్లంతన చూచి = కొంచెము దూరము నందు చూచి
సంభ్రమ విలోలుండై = తొట్రుపాటు కలవాడై
తల్పమున్ = హంస తూలికా తల్పమును (శయ్యను)
దిగెన్ = దిగెను
భావం :
కుచేలుడు శ్రీకృష్ణుని సమీపించాడు శ్రీకృష్ణుడు నిరంతరము బీదఱికము చేత బాధపడు పేద బ్రాహ్మణుడును, చిక్కి శల్యమైన శరీరము కలవాడును, చినిగిన వస్త్రములను ధరించినవాడును, ఆశాపూరిత చిత్తుడును, హాస్యమునకు స్థానమైన వాడును, అయిన బాల్యమిత్రుడైన కుచేలుని అల్లంత దూరములో చూచి, గబగబ తన పాన్పుపై నుండి క్రిందికి దిగెను.
మహాకవి పోతన ఈ పద్యమునుందు కుచేలుని స్వరూపమును, స్వభావమును అద్భుతముగా వర్ణించినాడు. మాసినట్టిగాని, చినిగి నట్టిగాని వస్త్రములు కట్టువాడు కుచేలుడు. (చేలమనగా వస్త్రము).
11వ పద్యం :
మ. కరమర్థి నెదురుగాఁ జని
పరిరంభణ మాచరించి, బంధు స్నేహ
స్ఫురణం దోచ్చి, సమా
ధడమునఁ గేర్చుందఁ బెట్టెఁదన్ తల్పమునన్,
అర్థాలు :
కరమున్ + అర్ధిన్ = మిక్కిలి ఆసక్తితో
ఎదురుగా + చని = ఎదురుగావెళ్ళి
పరిరంభణము + ఆచరించి = ప్రేమతో కౌగిలించుకొని
బంధు స్నేహ స్ఫురణన్ = చుట్టరికము,మైత్రీభావములు వెల్లడి యగునట్లు
తోడైచ్చి = తీసుకొని వచ్చి
సమాదరమునన్ = మిక్కిలి ఆదరముతో
తన తల్పమునన్ = తన పాన్పుపై
కూర్చుండన్ + పెట్టెన్ = కూర్చుండబెట్టెను
భావం :
శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరముతో ఎదురుగా వెళ్లి కుచేలుని ప్రేమతో కౌగిలించు కొనినాడు. బంధుత్వము, మిత్రత్వము వెల్లడియగునట్లుగా తీసుకొని వచ్చి, ప్రేమాధారములతో తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు.
12వ పద్యం :
తే. అట్లు గూర్చుండఁబెట్టి నెయ్యమునఁ గనక
కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భకిం
దుజ్జలంబులు దనడు మస్తమునఁ దాల్చి,
లలిత మృగమద ఘనసార మిళిత మైన
అర్థాలు :
నెయ్యమునన్ = స్నేహముతో
కనక కలశ సలిలంబుచే = బంగారు చెంబు నందలి నీటితో
కాళ్లు కడిగి = కుచేలుని పాదములు కడిగి
తత్ + జలంబున్ = ఆ నీటిని
తనదు మస్తకమునన్ = తన శిరస్సుపై
తాల్చి = ధరించి
లలిత = మనోహరమైన
మృగమద = కస్తూరి
ఘనసార = పచ్చ కర్పూరములతో
మిళితము = అయిన = కలిపినట్టి
భావం :
కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టినాడు. ప్రేమతో బంగారు చెంబులోని నీటితో ఆయన పాదములు కడిగినాడు. ఆ కాళ్లు కడిగిన నీటిని భక్తితో తన శిరస్సు మీద చల్లుకొనినాడు.
13వ పద్యం :
తే. మలయజము మేన తొబ్బిల్ల నలంది యంత,
శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి
బంధురామోదకలిత ధూపంబు లొసఁగి,
మించు మణిదీపముల నివాళించు మఱియు.
అర్థాలు :
మలయజము = మంచి గంధము
మేనన్ = శరీరమున
జొబ్బిల్లన్ + అలది = దట్టముగా పూసి
అంతన్ = పిమ్మట
శ్రమము + పాయంగన్ = అలసట పోవునట్లుగా
తాళ వృంతమునన్ = విసనకర్రతో
బంధుర = అధికమైన
ఆమోద = సువాసనతో
కలిత = కూడిన
ధూపంబులు + ఒసగి = సుగంధపు పొగవేసి
మించు = అతిశయించిన
మణి దీపములన్ = మణిమయ దీపములతో
నివాళించి = ఆరతి యిచ్చి
మఱియు = మఱియు (తరువాతి పద్యముతో అన్వయము)
భావం :
కస్తూరి పచ్చకర్పూరము కలిపిన మంచి గంధమును కుచేలుని శరీరమునకు పూసెను. అగరుధూపము వేసి, అలసట పోవునట్లుగా మిత్రునకు విసనకర్రతో విసరెను. మణిమయ దీపాలతో హారతి పట్టెను.
14వ పద్యం :
వ. సురభికుసుమ మాలికలు సిగ్గముడం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు విడి.
ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పుడవ్వివుండు మేనం
బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందు సందోహుందయ్యెం, నట్టియెడు
బద్మలోచనుందు మన్నించు సంగనామణి యగు రుక్మిణి కరకంకణ రవంబు లొలయం
జామరలు వీవం దజ్ఞాత వాతంబున ఘర్మ సలిలంబు నివారించుచుండఁ జూచి
శుద్ధాంత కాంతా నివహంబులు దమ మనంబుల సద్భుతం బండి యిట్లనిరి.
అర్థాలు :
సురభి = సువాసనగల
కుసుమ మాలికలు = పూల దండలు
సిగమున్ = జుట్టు ముడిలో
తుఱిమి = ముడిచి
కర్పూర మిళిత = పచ్చ కర్పూరము కలిపిన
తాంబూలంబులు + ఇడి = తాంబూలములు ఇచ్చి
ధేనువున్ + ఒసంగి = గోదానము చేసి
సాదరంబు గాన్ = ఆదరముతో
స్వాగతంబు + అడిగినన్ = దయ చేయుడని కోరగా
ఆ + విప్రుండు = ఆ కుచేలుడు
మేనన్ = శరీరమున
పులక + అంకురంబులు = గగుర్పాటులు
అంకురింపన్ = కలుగగా
ఆనంద బాష్ప జల బిందు సందోహుండు + అయ్యెన్ = ఆనందముతో కూడిన కన్నీటి బిందువులు కలవాడయ్యెను
అట్టి + ఎడన్ = ఆ సమయము నందు
పద్మలోచనుండు = పద్మముల వంటి కన్నులు కలబాడగు శ్రీకృష్ణుడు
మన్నించ = గౌరవించు
అంగనామణి + అగు = స్త్రీ రత్నము
రుక్మిణీ = రుక్మిణీ దేవి యొక్క
కరకంకణంబులు = చేతి గాజులు
మెఱయన్ = ప్రకాశించుచుండ,
చామరలు వీనన్ = వీననలు విసరగా
తత్ + జాత వాతంబు = పుట్టిన గాలుల చేత
ఘర్మ సలిలంబు = చెమట పట్టిన
నివారింపుచుండన్ = పోగొట్టగా
శుద్ధాంత కాంతా జనంబులు = అంతఃపురము నందలి స్త్రీలు
మనంబునన్ = మనస్సు నందు
అద్భుతంబు + అంది = ఆశ్చర్యపడి
ఇట్లు + అరి = ఇట్లు పలికిరి
భావం :
మంచి సువాసనలు గల పూలదండలు కుచేలుని జుట్టుముడిలో అలంకరించెను. కర్పూర తాంబూలము నొసంగెను. గోదానమిచ్చెను. ఇట్లు కృష్ణుడు తనకు సాదరముగా స్వాగతము పలుకగా, కుచేలుని శరీరమున గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొడుచుకొనెను. ఆయన కన్నుల నుండి ఆనంద బాష్పములు స్రవించెను.
ఆ సమయమున సాక్షాత్తు శ్రీకృష్ణుని సతీమణియైన రుక్మిణీదేవి చేతుల గాజులు ముల్లుఘల్లు మనుచుండగా వింజామరలు విసరెను – అప్పుడు పుట్టిన చల్లని గాలులు మార్గాయాసముచేత పుట్టిన కుచేలుని శరీరము నందలి చెమట బిందువులను పోగొట్టెను. ఈ ఘట్టమును చూచి, అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయి, తమలో తామిట్లను కొనసాగిరి.
15వ పద్యం :
వ. ఏమి తపంబు సేసినాకా ! యీ ధరణీదివిజోత్తముందు తొల్
బామున ! యోగివిస్పర మపాస్యకుఁడై తనరారు నీ జిగ
త్స్వామి రమాధినాథ నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ;
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్ ?
అర్థాలు :
ఈ ధరణీ దివిజ + ఉత్తముండు = ఈ జగత్ స్వామిన్
తొల్ బామునన్ = పూర్వ జన్మమునందు
ఏమి తపంబు = ఎంత గొప్ప తపస్సును
చేసెనొకొ = చేసి యుండెనో కదా !
యోగి = యోగుల చేత
విస్ఫురత్ + ఉపాస్యకుడై = చక్కగా ఉపాసింపబడువాడునై
తనరారు = ఒప్పునట్టి
ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు = ఈ లోకేశుని
రమా + అధినాథున్ =లక్ష్మీదేవి భర్తయగు విష్ణుమూర్తి యొక్క
నిజ తల్పమునన్ = సొంత పడకమీద
వసియించి + ఉన్నవాడు = కూర్చుండియున్నాడు
మునిపుంగవులు = ముని శ్రేష్టులు
ఎంతవారలున్ = ఎంత గొప్పవారయినను
ఈ మహనీయ మూర్తికిన్ = గొప్ప తేజస్సు గల ఈ బ్రాహ్మణునికి
ఎనయే = సాటియగునా ! (కారని భావము)
భావం :
ఈ బ్రాహ్మణోత్తమునకు పూర్వ జన్మమునందు ఎట్టి గొప్ప తపస్సు చేసినాడో కదా ! మహర్షుల చేత ఉపాసింపబడునట్టి ఈ జగత్ప్రభువు, లక్ష్మీదేవి భర్తయగు శ్రీకృష్ణుని పాన్పుపై కూర్చుండినాడు. మునీశ్వరులు ఎంత గొప్పవారైనను అఖండ తేజస్సుతో ఒప్పునట్టి ఈ కుచేలునితో సాటిరారు గదా !” అని అంతఃపుర కాంతామణులు ఆశ్చర్యపోయిరని భావము. శ్రీకృష్ణుని అపారమైన ప్రేమకు పాత్రుడైన కుచేలుని అదృష్టమును పోతన ఈ పద్యము వర్ణించినాడు.
16వ పద్యం :
అర్థం :
అదియునుగాక = అంతేగాక
17వ పద్యం :
చ. తన మృదుతల్పమందు పనితామణి యైన రమాలలాను సాం
దును నెదఁగాఁ దలంపక యడుప్రవరుం డెదురేఁగి మోచముం
దనుకంగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున
వినయమునన్ భజించె; ధరణీసురుఁ దెంతటి భాగ్యవంతుదో ?
అర్థాలు :
యదువరుండు = యదు వంశంలో శ్రేష్ఠుడు
తన మృదు తల్పమందున్ = తన యొక్క మెత్తని పాన్పునందు
వనితామణి + ఐన = స్త్రీ రత్నమగు
రమాలలాసు = లక్ష్మీదేవి యొక్క
పొందును = సామీప్యమును
ఎవగాన్ + తలంపక = అడ్డుగా భావింపక
ఎదురేగి = ఎదురుగా వెళ్ళి
మోదమున్ + తనుకగన్ = సంతోషముప్పొంగగా
కౌగిలించి = కౌగిలించుకొని
ఉచితక్రియలన్ = సముచితమైన పనుల చేత
పరితుష్టన్ + చేయుచున్ = సంతృప్తుని కావించుచు
వినయమునన్ = వినమ్రతతో
భజించెన్ = సేవించెను
ధరణీసురుడు = బ్రాహ్మణుడైన ఈ కుచేలుడు
ఎంతటి భాగ్యవంతుడో = ఎంత గొప్ప అదృష్టవంతుడో కదా !
భావం :
“ఆహా !. యాదవవంశ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు తన సతీమణియగు సాక్షాత్తు లక్ష్మీదేవియైన రుక్మిణి ఏమనుకుంటుందో అని కూడ భావింపక, తాను ఎదురుగా వెళ్ళి సంతోషముతో మిత్రుడైన కుచేలుని కౌటిలించుకున్నాడు. సముచితమైన సేవలతో ఆయనను సంతృప్తిని కావించాడు. ఈ బ్రాహ్మణుడెంతగి అదృష్టవంతుడో కదా !” అని అంతఃపుర కాంతలు ఆశ్చర్యముతో భావించిరి.
ఈ పద్యము నందు శ్రీకృష్ణుని అపారమై, అనుగ్రహమునకు పాత్రుడైన బాల్యమిత్రుడైన కుచేలుని అదృష్టమును పోతన మహాకవి అద్భుతముగా అభివర్ణించినాడు.
సూచన : గుర్తు గలవి పాఠ్య గ్రంథములోని “అధ్యయన వేదిక” లో యిచ్చినవిగా గుర్తింపగలరు.
18వ పద్యం :
మ అను వ య్యవసరంబుగ
అర్థాలు :
అయ్యవసరంబుగ = ఆ సమయంలో
అను = అనుకుంటుండగా
19వ పద్యం :
క. మురసంహరుడు కుచేలుని
కరము గరంబునం దెమల్ని కథంకన్ మన ‘మా
గురుగృహమున వర్తించిన.
చరితములని కొన్ని మడిని చతురత మరియున్,
అర్ధాలు :
మురసంహరుడు = ముర అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు.
కుచేలుని = సుదాముని
కరము = చేతిని
కరంబున = తన చేతిలో
తెమల్చి = ఒడిసి పట్టుకొని
కడకన్ = పూని
మనమా = మనము
ఆ = ఆ యొక్క
గురుగృహమున = గురువుగారి ఇంటిలో
వర్తించిన. = నడచిన (ప్రవర్తించిన
చింతములని = గడచిన సంఘటనలని
కొన్ని = కొన్నింటిని
నుడివి = చెప్పి
చతురత = నేర్పరితనంతో
మఱియున్ = ఇంకను
భావం :
అంతఃపుర కాంతలు అలా అనుకున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తాము గురుకుల వనం చేసిన దినాలలో జరిగిన విశేషాలను కొన్నింటిని ప్రస్తావించి ఇలా అన్నాడు.
20వ పద్యం :
సీ బ్రాహ్మణోత్తమ! వేదపారనబడ
క్షత గల చారువంశంబు వలనం
బరిణయం బైనట్టి భార్య సుశీలప
ర్తనములఁ దగ భవత్సదృశ యగునె ?
తలఁప గృహ క్షేత్రధనదారపుత్రాడు.
లందు నీ చిత్తంబు సెందకుంట
తోఁచుచున్నది; యేను దుది లోకసంగ్రహా
ర్థంబు కర్మాచరణంబు సేయు
తే. గతి, మనంబులఁ గామమోహితులు గాక
యర్థిపై యుక్త కర్మంబు లాచరించి
ప్రకృతి సంబందములు వాసి భవ్యనిష్ఠ
దవిలి యుందురు కొంద ఱుత్తములు భువిని.
అర్థాలు :
బ్రాహ్మణ + ఉత్తమ = బ్రాహ్మణులలో ఉత్తముడా
వేద = వేదములను
పాఠన = చదువుచుండుటచే
లబ్ది = లభించిన
దక్షత = సామర్థ్యము
కల = కలిగినట్టి
చారువంశంబున్ = చక్కని వంశస్థురాలు
వలన = తోట
పరిణయంబైనట్టి = వివాహము అయినట్టి
భార్య = భార్య
సుశీల = మంచి స్వభావం చేత
వర్తనములన్ = నడవడిక చేత
తగన్ = చక్కగా
భవత్యదృశ = నీకు సరిపడునామె
అగునె = అయి ఉన్నదా ?
తలపన్ = విచారించినచో (ఆలోచిస్తే)
గృహ = ಇಲ್ಲು
క్షేత్ర = పొలములు
ధన = సంపదలు
దార = భార్య
పుత్ర = పిల్లలు
ఆదులు = మొదలైనవి
అందున్ = ఎడల
నీ = నీ యొక్క
చిత్తంబు = మనస్సు
సెందకుంట = తగుల్కొనకుండుట
తోచుచున్నది = తోచుచున్నది (కనబడుతున్నది)
ఏనుతుదిన్ = నేను చివరకు
లోక = లోకాచరమును
సంగ్రహార్థంబు = స్వీకరించుటకు
కర్మాచరణంబు = కర్మములు ఆచరించుట
సేయు = చేసెడి
గతి = విధముగా
మనంబునన్ = మనస్సు
కావు = కోరికలందు
మోహితులు = భ్రమ చెందినవారు.
కాకన్ = కాకుండగా
అర్థమై = ప్రీతితో
యుక్త కర్మలు = తగినట్టి కర్మలు
ఆచరించి = చేసి
ప్రకృతి సంబంధములు = మాయా సంబంధములు
వసి = దూరమై
భవ్యనిష్ఠన్ = గొప్ప నియములతో
తనివి = పూని
ఉందురు = ఉంటారు
కొందరు+ఉత్తములు = కొందరు గొప్పవారు
భువిన్ = = భూలోకమందు
భావం :
భూగురోత్తమా! వేదాధ్యయనంలో దక్షులైన వారి యింట పుట్టిన నభార్య సద్గుణాలతో నీకు తగినట్లు ప్రవర్తిస్తున్నదా? ఇంతకూ నీ మనస్సు గృహక్షేత్రాల మీద పతనము మీద లగ్నమై ఉన్నట్లు కనిపించడం లేదు. లోక కళ్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు కొందరు ఉత్తములు కామ మోహాలకు వశం కాకుండా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాంటివారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్యనిష్ఠతో, జీవిస్తారు.
21వ పద్యం :
వ ఆదియునుగాక సకల భూతాత్మకుండవైన యేసు దపో వ్రత యజ్ఞ దాన శము దమాదులచేత
సంతసింపను, గురుజనంబులం బరమభక్తి సేవించు వారలం బరిణమించునని
మఱియు మనము గురుమందిరమున నున్న యెడ నొక్క నాఁడు గుపల్నీ నియుక్తులమై
బంధనార్థం బడవికిం జనిన నయ్యవసరంబును
అర్థాలు :
ఆదియునుంగాన్ = అంతేకాకుండా
సకల = సర్వ
భూతాత్మకుండనైన = ప్రాణులందు ఉండేవాడైన
ఏను = నేను
తపః = తపస్సులచే
వ్రత = వ్రత ములచే
యజ్ఞ = యజ్ఞములచే
దాన = దానములచే
శవు = బహిరింద్రియనిగ్రహములచేత
దమదులచేత = అంతరింద్రియ నిగ్రహములు
సంతసింపను = సంతషింపను
గురు = గురువులైన
జనంబులన్ = వారిని
పరిణమించున్ = హర్షింతును
అని =అని
చెప్పి = చెప్పి
మరియు = ఇంకను
మనము = మనము
గురుమందిరమున = గురువు యొక్క గృహంలో
ఉన్న = ఉన్నట్టి
ఎడన్ = సమయంలో
ఒక్క = ఒకానొక
నడు = దినమున
గురు = గురువు యొక్క
పత్నీనియుక్తులమై = భార్యచేత పంపబడినవారమై
ఇంధన = కట్టెల
అర్థంబు = కొరకు
అడవికిన్ = అడవికి
చవినన్ = వెళ్ళగా
ఆ+అనవసరంబునన్ = ఆ సమయంనందు
భావం :
అంతేగాక సకల భూతాలలో ఆత్మగా ఉన్న నేన తపోదాన యజ్ఞాదులవల్ల సంతోషించవు. భక్తితో గురువును సేవించే వారిని ప్రేమిస్తాను. ఈ విధంగా పలికె కృష్ణుడు కుచేలునితో ఇలా అన్నాడు. మనం గురుగృహంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము గుర్తుంది కదూ!’
22వ పద్యం :
తే. బయలు గొందియుఁ బెను మిఱ్ఱుపల్లములును,
రహిత సహితస్థలంబు తీర్చఱుపరాక
యున్న యచ్చటి మనము నొండొరుల చేతు
లూతఁగాఁ గొని నదచుచు నుండునంత.
అర్ధాలు:
బయలు = బహిప్రదేశము
గొందియున్ = సందు
పెను = పెద్ద
మిఱ్ఱు = ఎత్తున్న ప్రదేశము
పల్లములును = కిందున్న ప్రదేశము
రహిత = లేనివి
సహిత = ఉన్నవి ఐన
స్థలంబుల = ప్రదేశములు
ఏర్పఅయి పరాక = తేడా తెలియకుండ
యున్న = ఉన్న
ఆ+తఱిన్ = ఆ సమయంలో
మనము = మనము
ఒండొరులు = పరస్పరము
చేతులను = చేతులున్
ఊతగాన్ = ఆసరాగా
కొని = తీసుకొని
నడుచుచున్ = నడుస్తూ
ఉండున్ = ఉండగా
అంతట = అంతటి
భావం :
తోవలు, డొంకలూ, ఎత్తు పల్లాలు కనపడకుండా వాన నీరు ఉన్నసమయంలో మనం ఒకరి చేతిని ఇంకొక ఆసరాగా తీసుకొని ఆ అడవిలో నడిచాము.
23వ పద్యం :
క. బిసబిన నెప్పుడు నుడుగక,
విసరెడ్డి వలిచేత వడఁకు విడువక మనముం
బస చెడి మార్గముఁ గానక,
మసలితి మంతటను సంశుమంతుఁడు పొడిచెస్.
అరాలు :
బిసబిస = బిసబిస అను
ఎప్పడున్ = ఎప్పుడు
ఉడుగక = ఆగకుండ
విసరెడి = వస్తున్నట్టు
వలి = చల్లనిగాలి
చేత = వలన
వడకు = వణుకు
విడువక = వదలకుండ
మనమున్ = మనము
వలిచేడి = శక్తిపోయి
మార్గమున్ = దారి
కానక = కనబడక
మసలితిమి = అక్కడే తిరిగాము
అంతటను = పిమ్మట
అంశుమంతుడు = సూర్యుడు (కిరణములుగలవాడు)
పొడిచెన్ = ఉదయించెన్
భావం :
బిసబిసమని తీవ్రంగా వీచే చలిగాలులకు మన శరీరాలు కనిపించాయి. మనం శక్తి కోల్పోయి దిక్కూ తెన్నూ తెలియన్ వనమంతా తిరిగాము. ఎట్టకేలకు సూర్యోదయమైంది.
24వ పద్యం :
క. తెలతెలవాజెడి వేళం
గలగల మని పంకం బక్షిగణ మెలెడున
మిలమిలని ప్రొద్దుపొడుపున,
దళ ధళ మను మెఱుగు దిగ్వికాసము నిండెన్.
అరాలు :
తెల = తెల్లగా
తెలవాఱెడి = ఉదయించెడి
వేళన్ = సమయంలో
కలకలమని = కలకల అని
పక్షి = పక్షుల
గణము = సమూహములు
ಎಲ್ಲ = అన్ని
ఎడలన్ = చోట్ల
పలికెన్ = కూసేను
మిలమిల = మిలమిల మెరుస్తూ అని వేళ
ప్రొద్దుపొడుపునన్ = సూర్యోదయవేళ
ధళధళయను = తళతళలాడునట్టు
మెఱుగు = వెలుగులు
దిక్ = దిక్కులు
విలూను =సమూహములు
నిండెన్ = నిండిపోయెను
భావం :
తెల్లవారింది. పక్షుల కలకలారావాలు అతిశయించాయి. మిలమిల మెరిసే సూర్యోదయ కాంతుల తళతళ వెలుగులు నలు దిక్కులా నిండిపోయింది.
25వ పద్యం :
క. అప్పుడు సాందీపని మన,
చొ ప్పరయుచు వచ్చి వాససాంకునను వలిం
……………………….
బుసృతిం బలికె నకట ! యో ! పటులారా !
అర్థాలు :
అప్పుడు = ఆ సమయంలో
సాందీపని = గురువు సాందీపనుడు
మన = మన యొక్క
చొప్పు = జాడ
అరయుచు = వెతుకుతు
వచ్చి = వచ్చి
వాన = వర్షముకు తడిసి
సోకునన్ = తగులుటచే
వలిన్ = చలికి
తెప్పఱిలుటన్ = తెరుకొనుచుండుట
కని = చూసి
భేదురున్ = దుఃఖము
ఉప్పతిలన్ = పొంగిపొర్లగా
అకట = అయ్యో
ఓ = ఓయి
వటులార = పిల్లలూ
పలికెన్ = అనెను
భావం :
అప్పుడు మన గురువుగారైన సాందీపని మనలను వెదుక్కుంటూ వచ్చారు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనలని చూచి బాధతో అయ్యో ఓ పిల్లలూ అనెను.
26వ పద్యం :
చ. కటకట ! యిట్లు మా కొడకుఁగాఁ జనుదెంచి మహానిని సము
త్కటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు ! మీ ఋణంబు నం
గట కిది కారణంబు సమకూరెడిన బో యిట మీద మీకు ఎ
స్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతులె.
అర్ధాలు :
కటకట = అయ్యో
ఇట్ల = ఇలా
మా కొఱకున్ = మా కోసము
కాన్ = అయి
చనుదెంచి = వచ్చి
మహా + అటవిన్ = గొప్ప అడవిలో
సమ+ఉత్కలు = మిక్కిలి ఎక్కువైన
పరిపీడన్ = మిక్కిలి ఎక్కువైన
ఒందితిరి = పొందారు
కావునన్ = లావుంది కాబట్టి
శిష్యులు = శిష్యులుగా
మీ = మీ యొక్క
ఋణంబున్ = ఋణమును (చేసిన మేలుకు తీర్చని ప్రతిఫలం)
ఈగుట = తీర్చుకొనుటకు
ఇది = దని
కారణంబు = నిమిత్తమున్
సమకూరెడిచో = తప్పక కలుగునుగాక
ఇటు = ఇక
మీదన్ = మీదట
మీకున్ = మీకు
విస్ఫుట = విస్తారమైన
ధన = సంపదలు
బంధు = బంధువులు
దార = భార్య
బహు = పెక్కుమంది
పుత్ర = కొడుకులు అనే
విభోంది = వైభవములు
జయ = జయములు
ఆయుస్ = జీవితకాలము
ఉన్నాతల్ = గౌరవములు
భావం :
అయ్యో ఇలా మాకోసం వచ్చి ఘోర అడవిలో చాలా బాధలు పడ్డారు. శిష్యులుగా మీరు మీ ఋణం తీర్చుకున్నారు. మీకు విస్తారమైన సంపదలు, బంధువులు, భార్యలు, అనేక మంది కుమారులు, దీర్ఘాయువు, ఉన్నతులు, విజయశ్రీలు చేకూరగలవు.
27వ పద్యం :
క. కని గౌరవించి యాయన
మనలం దోడ్కొనుచు నాత్యమందిరమునకుం
జనుదెంచుట లెల్లను నీ
“మనమునఁ దలఁతే యటంచు మఱియుం బలికెన్,
అర్ధాలు :
కని = చూసి
గౌరవించి = గారాబములు చూపి
ఆయన = ఆ సాందీపని గురువు
మనలన్ = మనలను
తోడ్కొనుచున్ = కూడా తీసుకొని వెళుతూ
ఆత్మ = తన
మందిరమునమున్ = ఇంటికి
చనదెంచుట = వచ్చుట
ఎల్లను = అంత
నీ = నీ యొక్క
మనమునన్ = మనసునందు
తలతే = గుర్తు చేసుకుంటావా
అటంచు = అది అంటూ
మఱియున్ = ఇంకను
పలికెన్ = చెప్పెను
భావం :
అలా దీవించిన సాందీపని వాత్సల్యంలో మనలను తన మందిరానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీకు గుర్తున్నాయా? ఎప్పుడైనా అనుకుంటూ ఉంటావా ? అని కృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు.
28వ పద్యం :
వ. ‘అనఘ ! మన సుద్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం
జేయు కృత్యంబులు ముఱవవు గదా !” యని యని యెల్లం దలంచి యాడు.
మాధవు మధురాలాపంబులు ఏవి యతనిం గనుంగొని కుచేలుం డిట్లననియె:
అర్ధాలు :
అనఘ = పుణ్యుడా
మనము = మనము
అధ్యయనంబు = చదువుకొనుట
చేయుచున్ = చేస్తూ
అన్యోన్య = పరప్సర
స్నేహ = చెలిమితో
వాత్సల్యంబులన్ = ప్రీతికత
చేయి = చేయునట్టి
కృత్యంబులున్ = పనులు
మఱువవుకదా = మరవలేదుకదా
అవి = అవి
అది = వాటిని
ఎల్లన్ = అన్నింటినీ
తలచి = జ్ఞాపకం చేసుకొని
ఆడు = పలికెడు
మాధవు = కృష్ణుని
మధుర = తీయని
ఆలాపంబులు = మాటలు
విని = విని
అతనికి = అతనిది
కనుంగొని = చూసి
కుచేలుండు = కుచేలుడు
ఇట్ల = ఈ విధంగా
అనియె = పలికాడు
భావం :
పుణ్యాత్మా! మనం చదువుకున్న దినాలలో అన్యోన్య స్నేహ వాత్సల్యాలతో చేసిన పనులన్నీ నీవు మరువవు కదా! ఈ విధంగా కృష్ణుడు తాము చిన్ననాటి ముచ్చటలను పేర్కొని పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోయాడు. అతడు కృష్ణునితో ఇలా అన్నాడు.
29వ పద్యం :
గురుమతిఁ దలఁపఁగల ద్రిజగ
దురంద వనం దగిన నీమ గురుఁ దనఁగా నౌ
దొరుఁ దెవ్వ ? ఉంతయును నీ
కరయంగ విదంబనంబ యగుఁ గాదె హరీ !”
అర్ధాలు :
గురు = గొప్ప
మతిన్ = ಬುದ್ಧಿ
తలపగన్ = విచారించగా
త్రిజగత్ = ముల్లోకములను
అనన్ = చెప్పు
తగిన = తగినట్టి
నీకు = నీకు
గురుడు = గురువు
అనగన = అనుటకు
ఒండొరుండ = ఇంకొకడు
ఎవ్వడు = ఎవరు
ఇంతయున్ = ఇదంతా
నీకు = నీవు
అరయంగన్ = తరచిచూసినచో
విడంబునంబు = లోకమర్యాదకై
అగున్గాదె = అవునుకదా
హరీ = కృష్ణా
భావం :
గొప్పబుద్ధిలో ఆలోచించిచూస్తే నీవు ముల్లోకాలకు గురుడవు. నీకు గురుడయీ మరొక్కటున్నదా? ఇదంతా నీవు లోక మర్యాదకై ఆడిన లీలే కాని మరేమీ కాదు కృష్ణా!
30వ పద్యం :
వ. అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజుండైన పుండరీకాక్షుండు
మందస్మిత వదనారవిందుండగుచు నతనిం జూచి ‘నీ విచ్చటికి వచ్చునప్పుడు
నాయందుల భక్తింజేసి నాకు సుపాయంబుగ నేమి పదార్థంబు దెచ్చితి ? వప్పదార్థంబు
లేశమాత్రంబైనఁ బదివేలుగా సంగీకరించు, నట్లు గాక నీచవర్తనుండై మద్భక్తిం
దగులని దుష్టాత్ముందు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు
సమ్మతంబు గాదు; కావున,
అర్థాలు :
అది = అని
సాభిప్రాయంబుగాన్ = సాభిప్రాయముగా
పలికిన = చెప్పిన
పలుకులు = మాటలు
విని = విని
సమస్త = ఎల్లవారి
భావ = అభిప్రాయములు
అభిజ్ఞుడు = తెలిసినవాడు
ఐన = అయిన
పుండరీకాక్షుడు = కృష్ణుడు
మందస్మిత = చిరునవ్వుగల
వదన = మోము అనె
అరవిందుడు = పద్మములు కలవాడు
అగుచున్ = అవుతూ
అతనినే =అతనిని (కుచేలుడు)
చూచి = చూసి
నీవిచ్చటికి = నీవు ఇక్కడికి
మార్చునప్పుడు = వచ్చేటపుడు
నాయందుల = నాఎడల
భక్తింజేసి = ప్రేమతో (భక్తితో)
నాకున్ = నాకు
ఉపాయనంబు = కానుక
కన్ = అగునట్లు
ఏమి = ఏ
పదార్ధంబున్ = పదార్ధమును
తెచ్చితి = తీసుకొచ్చావు
అదార్థంబు = ఆ పదార్ధాన్ని
లేశమాత్రంబు = రవ్వంత
ఐనను = అయినను
పదివేలు = పదివేలు
కాన్ = అయినట్లుగా
అంగీకరింతున్ = గ్రహించెదను
అట్లుగాక = అలాకాకుండా
నీచవర్తనుండై = అల్పబుద్ధికల నడవడిక కలవాడు
మత్ = నాయొక్క
భక్తిన్ = భక్తియందు
తగులని = ఆసక్తిలేని
దుష్టాత్ముండు = దుష్టుడు
హేమ + అచల = బంగారపు కొండ
తుల్యంబు = అంత
ఐనన్ = అయినట్లు
పదార్థంబునన్ = పదార్థమును
ఒసంగినన్ = ఇచ్చినవు
అది = అది
నమనంబునకు = నామనస్సునకు
సమ్మతంబుగాదు = అంగీకారముకాదు
కావునన్ = కాబట్టి
భావం :
కుచేలుడు సాభిప్రాయంగా పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని కృష్ణుడు గ్రహించాడు. శ్రీకృష్ణుడు మందస్మిత వదనార విందుడై కుచేలునితో నీవిక్కడికి వస్తూ భక్తితో నాకేమి బహుమానం తెచ్చావు? ఆ పదార్థం లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తిలేని నచుడు పర్వతమంత బంగారం ఇచ్చినా అది నాకంగీకారం కాదు.
31వ పద్యం :
క. దళ……………………….
ఫలమైనను సలిలమైనం బాయని భక్తం
గొలిచిన జనులర్పించిన,
నెలమిన్ రుచివాన్నముగణ యేసు ………………
అర్థాలు :
దళము = అకులరెమ్మ
పుష్పము = పువ్వు
ఐనను = అయినను
ఫలము = పండు
సలిలము = నీళ్ళు
ఐనను = అయినను
పాయని = పాడవని
భక్తిన్ = భక్తితో
కొలిచినన్ = సేవించినచో
జనులు = మానవులు
సమర్పించిన = ఇచ్చినచో
ఎలమిన్ = ప్రీతితో
రుచిర = పరిశుద్ధమైన
అన్నము = అన్నము
కనె = అయినట్లే
ఏను = నేను
భుజింతున్ = ఆరగించెదను
భావం :
పత్రమైనా, పుష్పమైనా, జలమైనా, ఫలమైనా సరే నిశ్చల భక్తితో నాకు సమర్పిస్తే దాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తాను అని కృష్ణుడన్నాడు.
32వ పద్యం :
క. అని పద్మోదరుఁ వాడిన,
వినియోక్తుల కాత్మ నలరి విప్రందు దాఁ దె
చ్చిన యదుకులు దగ్గ నర్పిం
పను నేరక మోము వాంచి పలుకక యున్నస్.
అర్థాలు :
అని = అని
పద్మ+ఉదరుడు = కృష్ణుడు
ఆడిన = = పలికిన
వినయోక్తులకు = వినయపు మాటలకు
ఆత్మన్ = మనసులో
అలరి = సంతోషించు
విప్రుడు = బ్రాహ్మణుడు
తాన్ = తాను
తెచ్చిన = తీసుకొచ్చినట్లు
అటుకులన్ = అటుకులను
తగన్ = తగినట్లు
సమర్పింపన్ రక = ఇవ్వలేక
మోము = ముఖమును
వాంచి = వంచి
పలుకకన్ = ఏమీ మాట్లాడకుండా
ఉన్నానన్ = ఉండగా
భావం :
కృష్ణుని వినయపూరిత మాటలకు కుచేలుడు మనసులో సంతోషించాడు. తాను తెచ్చిన అటుకులను ఇవ్వలేక తలదించుకుని మౌనంగా ఉన్నాడు.
33వ పద్యం :
వ. అవ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుఁడు దన దివ్యచిత్తంబున నెఱింగి ‘యితండు
పూర్వభవంబున నైశ్వర్యముండై నన్ను సేవింపండైన నిక్కుచేలుండు నిజకాంతా
ముఖోల్లాసంబు కొఱకు నా యొద్దకుఁ జనుదెంచినవాఁ డితనికి నిద్రాదులకుం
బడయరాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీ క్షణంబ యెడఁ గూర్పవలయు’
నని తలంచి యతండు జీర్ణ వస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన యదుకుల ముడియం
గని ‘యిది యేమి’ యని యొయ్యన నమ్ముడియఁ దన కరకమలంబుల విడిచి
యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని ‘యివియ సకల లోకంబులను సన్నును ఇరితృపిం
బొందిందఁజాలు’ నని యప్పుడు.
అర్ధాలు :
ఆ + విప్రుడు = ఆ బ్రాహ్మణుడు
చనుదెంచిన = వచ్చిన
కార్యంబున్ = పనిని
కృష్ణుండు = కృష్ణుడు
తన = తన
దివ్య = దివ్యమైన
చిత్తంబునన్ = మనసులో
ఎఱింగి = తెలుసుకొని
పూర్వ = ముందటి
భావంబునన్ = జన్మమునందు
ఐశ్వర్య కాముడై = సంపదకోరినవాడు అయ్యి
నన్నున్ = నన్ను
సేవింపండు = సేవించినవాడుకాదు
ఐన = అయినట్టి
ఈ కుచేలుండు = కుచేలుడు
నిజ = తన
కాంత = భార్య యొక్క
ముఖ = ముఖమున
ఉల్లాసంబు = సంతోషం
కొఱకున్ = కోసం
నాయొద్దకు = నాదగ్గరకు
చనుదెంచినవాడు = వచ్చాడు
ఇతనికిన్ = ఇతనికి
ఇంద్రాదులకుం = ఇంద్రుడు మున్నగువారికి
పడయరాని = పొందలేని
బహువిధములైన = పెక్కువిధములు అయిన
సంపద = సంపదలు
శ్రీవిశేషంబులున్ = అధికములు కలుగుట
ఈక్షణంబు = ఈక్షణంలోనే
ఒడిగూర్చవలయం = కలుగజేయవలెను
అని = అని
తలంచి = భావించి
అతడు = ఆ కృష్ణుడు
జీర్ణవస్త్రరంబు = చినిగిపోయిన బట్ట యొక్క
కొంగున్ = మూలన
ముడిచి = ముడివేసి
తెచ్చిన = తీసుకొచ్చినట్టు
అటుకులున్ = అటుకులను
ముడియన్ = మూటను
కని = చూసి
ఇదియేని = ఇది ఏమిటి ?
అని = అని
ఒయ్యనన్ = మెల్లిగా
ఆముడియన్ = ఆ ముడిన
తన = తన యొక్క
కర = చేతులు అనే
కమలంబులన్ = కమలములతో
విడిచి = విప్పి
ఆ అటుకులున్ = ఆ అటుకులు
కొన్ని = కొన్నింటిని
పుచ్చుకుని = తీసుకుని
ఇదియ = ఇవే
సకల = ఎల్ల
లోకంబులను = లోకములను
నన్నున్ = నన్ను
పరితృప్తిం = సంతృప్తి
పొందింపన్ = పొందించుటకు
చాలున్ = సరిపడును
అని = అని
అప్పుడు = అప్పుడు
భావం :
కుచేలుడు వచ్చిన కారణాన్ని కృష్ణుడు గ్రహించాడు. పూర్వ జన్మలో ఇతడైశ్వర్యాన్ని కోరి నన్ను సేవింపలేదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా వద్దకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని బహువిధాలైన సంపదల్ని ఈ క్షణమే అతనికి ఇవ్వాలని భగవంతుడు (శ్రీకృష్ణుడు) నిశ్చయించుకున్నాడు.
కుచేలుడు చినిగిన ఉత్తరీయలో ముడివేసి తెచ్చిన అటుకుల ముడిని చూచి కృష్ణుడు ఇదేమిటి? అని అడుగుతూ ముడిని విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు. నాకూ సమస్త లోకాలకూ సంతృప్తినివ్వడానికి ఇవి చాలునంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు.
34వ పద్యం :
క. మురహరుఁడు పిడికెర వడుకులు,
గర మొప్పఁగ నారగించి కౌతూహలియై
మఱియుడు విడికెడు గౌనం ద
త్కర మప్పుడు పళ్లెం గమల కరకమలములని,
అర్థాలు :
మురహరుడు = శ్రీకృష్ణుడు
పిడికెడు = గుప్పెడు
అటుకులు = అటుకులు
కరమొప్పగన్ = మిక్కిలి యుక్తంగా
ఆరగించి = తిని
కౌతూహలియై = కుతూహలము కలవాడై
మఱియును = మరికొంచెం
పిడికెడు = గుప్పెడు
కోనన్ = తీసుకొనగా
తత్ = అతని
కరముని = చేతిని
అప్పుడు = అప్పుడు
పట్టెన్ = పట్టుకొనెను
కమల = రుక్మిణీదేవి
కర = చేతులు అనే
కమలములన్ = పద్మములతో
భావం :
శ్రీకృష్ణుడు పిడికెడు అటుకుల్ని తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక్క పిడికెడు తీసుకున్నాడు. అప్పుడు రుక్మిణీదేవి భర్త చేతిని తన చేతులతో వారిస్తూ ఇలా అన్నది.
35వ పద్యం :
క. సాంసారంగ నతనికి బహు,
సంపద అందింప నివియ చాలును నింక
క్షింపఁగ వలవదు త్రిజగ
తృపత్కర ! దేవ దేవ ! సర్వాత్మ ! హరి !
అర్ధాలు :
సొంపారన్ = సమృద్ధిగా కలవు
ఇతనికిన్ = ఇతనికి
బహు = పెక్కు
సంపదలన్ = సంపదలను
అందింపన్ = ఇచ్చుటకు
ఇవియున్ = ఇవే
చాలునున్ = సంపదను
ఇక = మరికొంచము
భక్షింపగన్ = తినుట
వలవదు = వద్దు
త్రిజగత్సపత్కర = ముల్లోకాలను సంపదనిచ్చేవాడు
వేదదేవ = కృష్ణ
సర్వాత్మ = జగత్తంతా నిండినవాడు
హరీ = కృష్ణా
భావం:
స్వామీ ఇతనికి సకల సంపదలను అందించడానికి ఇందాక మీరు తిన్న అటుకులే చాలు. ఇక భక్షించకండి అని భర్తను వారించింది.
36వ పద్యం :
సి. పరికింపఁ గృపణస్వభావుండ నై నట్టి
యే నేడు ? నిఖిలావనీశ్వరి యగు
నిందిరాదేవికి నెనయంగ నిత్య ని
డై యొప్పు నవ్వాసుదేవుల
డేడ ? సన్నధ్ధమైఁ దోడఁబుట్టిన వాని
కైవడిఁ గౌఁగిటఁ గదియఁ జేర్చి
దైవంబుగా నన్ను భావించి నిజతల్ప
మున నుంచి సత్రియల్ పూని నడపి
తే. చారు నిజవధూ కరసరోజాత కలిత,
చామరానిలమున గతశ్రమునిఁజేసి
శ్రీకుచాలిస్త చందనాంచితకరాబ్జ,
తలములను సద్గు లొతై వత్సలత మెఱసి.
అరాలు :
పరికింపన్ = తరచి చూసినచో
కృపణ = లోభపూరితమైన
స్వభావుండ = లక్షణములు కలవాడను
ఐన = అయినట్టి
యేనే = నేను ఎక్కడ
నిఖిల = సమస్తమైన
అవనీ = లోకములకు
ఈశ్వరి = సర్వనియామకురాలు
అగు = ఐన
ఇందిందేనికి = లక్ష్మీదేవికి
ఎనయంగన్ = పొందికగా
నిత్యనివాసుడు = శాశ్వతనివాసస్థానమైనవాడు
ఐ = అయ్యి
ఒప్పు = ఉండెడి
ఆవాసుడేవుడు = కృష్ణుడు
ఏడన్ = ఎక్కడ
అర్థమైన్ = ప్రీతితో
తోడబుట్టిన = సహోదరుడైన
వారి = అతని
కైవడిన్ = వలె
కౌగిటన్ = కౌగిట్లో
కదియున్ = దగ్గరకు
చేర్చి = తీసుకుని
దైవంబు = దేవుని
కాన్ = ఐనట్లు
నన్నున్ = నన్ను
భావించి = అనుకుని
నిజతల్పమున = తన పాన్పుపైకి
ఉంచి = కూర్చోబెట్టి
సత్రియల్ = మర్యాదలు
పూని = పట్టుగా
నడపి = జరిపించి
చారు = మనోజ్ఞమైన
నిజవధూ = తన భార్య యొక్క
కరసరోజాత = చేయి అనే పద్మమువంటి
కలిత = ఉన్నట్టి
చామర = విసనకర్ర
అనిలమనన్ = గాలివలన
గతశ్రమునిఁజేసి = తొలగిన శ్రమకలవాడుచేసి
శ్రీకుచాలిస్త = రుక్మిణీదేవి స్తనముపై పూయబడిన
చందన = మంచిగంధముల చేత
అంచిత = అలంకరించబడిన
కర = చేతులను
బ్దములను = కమలయుచేత
అడ్డలు = కాళ్ళు
ఒత్తెన్ = పిసికెన్
వత్సలతన్ =ప్రేమతో
భావం:
కుచేలుడు ఇలా భావించాడు. గర్భదరిద్రుడనైన నేనెక్కడ ? లక్ష్మీ నివాస స్థానమైన వాసుదేవుడెక్కడ ? అచ్చుతుడు అనురాగంతో తన తోడబుట్టిన వానిగా తలంచి కౌగిట చేర్చాడు. దైవసమానంగా భావించి తన పాన్పుమీద కూర్చుండబెట్టు కున్నాడు. నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి నాకు వింజామర వీచి నా శ్రమను పోగొట్టింది. శ్రీకృష్ణుడే సాక్షాత్తు లక్ష్మీదేవిని లాలించే తన చేతులతో ఆప్యాయంగా నా పాదాలొత్తాడు.
37వ పద్యం :
వ. అని తన మనంబున విత్కరించుచు నిజపురంబునకుఁ జని చని ముందట.
సీ. న చంద్ర ప్రభా భాసమాన స్వర్ణ
చంద్రకాంతోపల సౌధములును
గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ
మానిత కూజితోద్యానములును
పుల్లసితాంభోజ హల్లక కహ్లార
కైరవోల్లసిత కాసారములను
మణిమయం కనక కంకణ ముఖాభరణ వి
భ్రాజిత దాసదాసీజనములుఁ
అర్థాలు :
అని = అని
తన = తనయొక్క
మనంబున = మనస్సులో
వితర్కించుచు = ఆలోచిస్తూ
నిజ = తన
పురంబునకు = ఊరికి
చని చని = వెళ్ళిపోయి
ముందటన్ = ఎదుట
భావం :
అని ఈ రీతిగా ఆలోచిస్తూ కుచేలుడు తన నగరాన్ని చేరుకున్నాడు.
38వ పద్యం :
తే. గలిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ
యమును బొందుచు నెట్టి పుణ్యాత్ముఁ డుందు
నిలయ మొక్కొ ! యపూర్వమై నెగడె మహిత
వైభవోన్నత లక్ష్మీనివాస మగుచు
వ. ఇట్లు సనుదేర నతని భర్యయైన సతీలలామంబు తన మనంబున నానంద రసమన్న యగుచు
అర్థాలు :
భాను = సూర్యుని వంటి
చంద్ర = చంద్రుని వంటి
ప్రభా = కాంతులచే
భాసమాన = ప్రవేశించుచున్న
స్వర్ణ = బంగార
చంద్రకాంత = చలువరాళ్ళు
ఉపల = మొర్ర రాతి
సౌధములను = మేడలు
కలకంఠ = పావురములు
శుక = చిలుకలు
నీలకంఠ = నెమళ్ళు
సమ + ఉత్కంఠ = మిక్కిలి తహతహతో
మానిత = గౌరవింపబడిన
కుజత = కూతలు గల
ఉద్యానవనములు = తోటలు
ఫుల్ల = వికసించిన
సీత = తెల్లని
అంభోజ = తామరల చేత
హల్లన్ = ఎర్రకలువలు చేత
కహ్లార = కలువపూల చేత
కైరవ = తెల్లకలువల చేత
ఉల్లసిత = ప్రవేశించునట్టి
కాసారము = చెరువులును
మణిమయ = రత్నాలు పొదిగిన
కనక = బంగారం
కంకణ = చేతిగాజులు
ముఖాభరణ = మున్నగు ఆభరణాలచే
విభ్రాజిత = మిక్కిలి మెరుస్తున్న
దాస = సేవకులు
దాసీ = సేవకురాళ్ళు
కలిగి = ఉండి
చెలువొందు = అందగించుచున్న
సదనంబున్ = భవనమును
కాంచి = చూసి
విస్మయమును = ఆశ్చర్యమును
పొందుచున్ = పొందుతూ
ఎట్టి = ఎంతటి గొప్ప
పుణ్యాత్ముడు = పుణ్యపురుషుడు
ఉండు = ఉండెడి
నిలయమొక్క = నివాసమో కదా
అపూర్వము = అద్భుతమైనది
ఐ = అయ్యి
నెగడెన్ = అతిశయించింది
మహిత = గప్ప
వైభవ = వైభవములు
ఉన్నత = మేలైన
లక్ష్మీ = సంపదను
నివాసము = నిలయము
అగచున్ = అయినది
భావం :
కుచేలుడు తనయొక్క సూర్యచంద్రుల కాంతితో ప్రవేశించే పాలరాతి కట్టడాలు, శుక; పిక వలయాంత నిండిన చక్కని ఉద్యానవనాలు, వికసించిన పలువన్నెల తామరలతో కలువలతో కనుల పండువు చేస్తున్న సరోవరాలు, మణికంకణాలు బహువిధాలైన భూషణలు ధరించిన దాసదాస జనమా కలిగి వెలుగొందే మహోన్నత మందిరానన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇది ఏ పుణ్యాత్ముని భవనమో ! సిరిసంపదలకు నిలయమై అపూర్వమై ప్రకావిస్తున్నదని కుచేలుడు భావించాడు.
39వ పద్యం :
సీ. తన విధురాకు ముందటఁ గని మనమన
హర్షించి వైభవం బలర మనుజ
కామినీరూపంబు గైకొన్న యిందిరాస
పనిత చందంబునఁ దనరుచున్న
కలకంఠి తన వాలుఁగన్నులు క్రేవల
నానందబాష్పంబు లంకురింప
నతని పాదంబుల కాత్మలో మ్రొక్క భా
నవంబున నాలింగనంబు సేసె
అర్థాలు :
ఇట్లు = ఈ విధముగా
చనుదేర = రాగా
అతని = కుచేలుని యొక్క
భార్య = ఇల్లాలు
ఐన = అయినటువంటి
సతీలలామంబు = స్త్రీలలో ఉత్తమురాలు
తన = తనయొక్క
మనంబునన్ = మనస్సునందు
ఆనందరస = ఆనందరసమున
మగ్న = మునిగినామె
అగుచున్ = అవుతూ
భావం :
అలా వచ్చిన కుచేలుని చూసి అతని భార్య ఆనందంతో తేలియాడింది.
40వ పద్యం :
తే. నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ
రణ విభూషితులై రతిరాజు సాయ
కముల గరి నొప్పు పరిచారికలు భజింప,
లలిత సౌభాగ్య యగు నిజ లలనఁ జూచి.
అర్థాలు :
తన = తనయొక్క
విభురాక = బర్త వచ్చుటకు
ముందటన్ = ఎదురుగా
కని = చూసి
మనముననె = మనస్సునందు
హర్చించు = ఆనందించి
వైభవంబులు = వైభవములు
అలరన్ = వికసించగా
మనుజ = మానవ
కామినీ = స్త్రీ
రూపంబున్ = రూపమును
కైకన్నా = వహించినట్టి
ఇందిరా = లక్ష్మి
వనిత = దేవి
చందంబునన్ = వలె
తనరుచున్న = ఒప్పుచున్న
కలకంఠి = స్త్రీ
తన = తనయొక్క
వాలుగన్నులక్రేవల = కంటికొనల చివరన
ఆనంద = సంతోషము వలన
భాష్పంబులున్ = కన్నీరు
అంకురింపన్ = ఊరుతుండగ
అతనిన్ = అతని
పాదంబులకున్ = కాళ్ళకు
ఆత్మలోన్ = మనస్సులోనే
మ్రొక్కి = నమస్కరించి
భావంబునన్ = మనస్సునందు
ఆలింగనంబు = కౌగిలించుకొనుట
చేసెన్ = చేసెను
ఆ ధరాధేవుడు = ఆ బ్రాహ్మణుడు
అతుల = సాటిలేని
దివ్య = దివ్యమైన
అంబర = బట్టలు
ఆభరణ = అలంకారములతో
విభూషితలై = అలంకరింపబడిన వారై
రతిరాజు = మన్మధుని
సాయకము = బాణముల
గతిన్ = వలె
ఒప్పు = చక్కగా ఉన్న
పరిచారకులు = సేవకురాండ్రు
భజింపన్ = సేవిస్తుండగా
లలిత = మనోజ్ఞమైన
సౌభాగ్య = సౌభాగ్యవతి
అగు = అయిన
నిజ = తన
లలనన్ = భార్యను
చూచి = చూసి
భావం :
ఆ ఇల్లాలు తన భర్త వస్తున్నాడని తెలుసుకొని ఎంతో ఆనందంతో ఎదురు వచ్చింది. మానవరూపం ధరించిన మహాలక్ష్మిలాగా ఉన్న ఆమో కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతుండగా భర్త పాదాలకు నమస్కరించి మనస్సులో కౌగిలించుకొంది. దివ్యాంబరాలు, ఆభరణాలు ధరించి మన్మధుని బాణలలాగా ఉన్న పరిచారికల సేవలందుకొంటూ ఐశ్యర్యంతో తులదూగే తన భార్యను కుచేలుడు చూచాడు.
41వ పద్యం :
ఆ. ఎన్నం క్రొత్తులైన యిట్టి సంపదలు నా
కబ్బుటెల్ల హరిదయావలోక
నమునఁ జేసి కాదె ! నళినాక్షుసన్నిధి
కర్ది నగుచు నేను నరుగుటయును.
అర్థాలు :
ఎన్నన్ = ఎంచిచూసినచో
క్రొత్తలు = నేతనములు
ఐన = అయిన
సంపదలు = కలుములు
నాకున్ = నాకు
అబ్బుట = కలుగుట
ఎల్లన్ = అంతా
హరి = శ్రీకృష్ణుని
దయా = కృపతో కూడిన
అవలోకమునన్ = చూపు
చేసి = వలన
కాదె = కదా
నళినాక్షు = కృష్ణుని
సన్నిధికిన్ = వద్దకు
అర్దిన్ = కోరువాడ
అగుచున్ = అగుచూ
నేను = నేను
అదుగుటయున్ = వెళ్ళుట
భావం :
ఆలోచించి చూస్తే ఈ నూతన సమస్త సంపదలూ శ్రీహరి కృపాకటాక్షం వలనే నాకు ప్రాప్తించాయి. సంపద కోరుతూ కృష్ణుని వద్దకు నేనే వెళ్ళుట.
42వ పద్యం :
క. నను నా వృత్తాంతంబును
ధనమనమనఁ గనియు నేమి దడవక ననుఁ బొ
కమ్మని యీ సంపద లెల్లను,,
నొనరఁగ వొడఁగూర్చి నన్ను నొడయినఁ జేసెన్.
అర్థం :
ననున్ = నన్ను
నా = నా యొక్క
వృత్తాంతంబును = విషయము
తన = తనయొక్క
మనమునన్ = మనస్సునందు
కనియున్ = తెలుసుకొనినావు
ననున్ = నన్ను
పొమ్ము = వెళ్ళు
అని = అని
ఈ = ఈ
సంపదలు = సంపదలు
ఎల్లనున్ = సమస్తమును
ఒనరన్ = చక్కగా
ఒడగూర్చి = కలుగజేసి
నన్నున్ = నన్ను
ఒడయునిన్ = ప్రభువునకు
చేసెను = చేసెను
భావం:
ధనం కోసం నేను శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాను. ఆ మహానుభావుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపి తరువాత ఈ సకల సంపదలూ అనుగ్రహించాడు, నన్ను ప్రభువును చేసాడు.
మిత్రధర్మం Summary in Telugu
కవి పరిచయం
- మిత్ర ధర్మం ‘ఆంధ్రమహాభాగవతం’ లోనిది.
- భాగవత భాగములకు స్కంధములని పేరు.
- భాగవతములో పండ్రెండు (12) స్కంధములు కలవు.
- మధురస్నేహము దశమ స్కంధము నుండి గ్రహించబడినది.
- సంస్కృతములో వేదవ్యాసుడు భాగవతమును రచించెను.
- “మిత్ర ధర్మం” అను పాఠ్యభాగమును రచించినది మహాకవి పోతన.
- పోతన ఇంటి పేరు, ఊరు పేరును “బమ్మెర” యే.
- బమ్మెర గ్రామము వరంగల్ జిల్లాలో ఉన్నది.
- పోతన తల్లి లక్కమాంబ – తండ్రి కేసన.
- పోతన బిరుదు “సహజపాండిత్యుడు”.
- పోతన కృతులు : భోగినీ దండకము, వీరభద్ర విజయము నారాయణ శతకం, ఆంధ్రమహాభాగవతం.
- పోతన కీర్తి సౌధానికి మూలస్తంభం భాగవతం.
- నవ విధ భక్తులలో కుచేలుని భక్తి “సఖ్య భక్తి”.
- పోతన కవితా లక్షణములు : నిశ్చలమైన భక్తి – అద్భుత కథా కథన శిల్పం – లోకోత్తరమైన భావుకత – సజీవ పాత్ర చిత్రణ.
- పోతన కాలం : 15వ శతాబ్దము.
- మాధుర్యాన్నీ, ప్రేమతత్త్వాన్నీ స్నేహం పటిష్ఠం చేస్తుందని నిరూపించేది ఈ పాఠ్యభాగం.
పాఠ్యభాగ సందర్భం
పరీక్షిత్తు శుకమహర్షిని – “మునీంద్రా ! శ్రీకృష్ణుని అనంత గుణసంపదలను గురించి ఎన్ని మారులు విన్నా తనివి తీరదు. ఆ హరిని పూజించే చేతులే చేతులు. ఆయనకు నమస్కరించే శిరస్సే శిరస్సు. ఆ పరమాత్ముని చూచే కన్నులే కన్నులు. ఆ స్వామిని పొగడే నోరే నోరు, ఆయన కథలను వినే చెవులే చెవులు. ఆ పరమాత్ముని తెలుసుకునే మార్గమును వివరింపు” మని కోరాడు. అప్పుడు అభిమన్యుని కుమారుడైన ఆ పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి కుచేలుడు దారిద్య్ర బాధను అనుభవిస్తూ, తన బాల సఖుడైన శ్రీకృష్ణుని దర్శించి, ఆయన అనుగ్రహంతో ఎలా అపారమైన సంపదలు పొందాడో వర్ణించే సందర్భములోనిదీ పాఠ్యాంశం.
పాఠ్యభాగ సారాంశం
కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులు – వారిరువురు సాందీపుని సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాధిపతియైనాడు. కుచేలుడు దుర్భరమైన దారిద్య్ర బాధ అనుభవించాడు. కుచేలుని భార్య మహాపతివ్రత, అభిమనవతి. ఆ ఇల్లాలు దారిద్య్ర బాధతో పిల్లలు మలమలమాడిపోబడం చూచి భర్తను, శ్రీకృష్ణుని దర్శించి ఆయన అనుగ్రహంతో తమను కాపాడుమని ప్రార్థించు సన్నివేశంతో కథ ప్రారంభమగుచున్నది.
భర్తకు కర్తవ్యోపదేశము చేసిన అర్ధాంగిగా కుచేలుని భార్య – ఎంతటి దుర్భరమైన దారిద్ర్యము అనుభవించినను నోరు తెరచి సహాయమును అర్థింపని అభిమనధనుడుగా కుచేలుడు – అవధులు ఆదరాభిమానాలతో బాల్య మిత్రునికి సర్వ సంపదలను అనుగ్రహించిన ఆర్తజన రక్షకుడుగా శ్రీకృష్ణుడు మనకు ఈ పాఠ్యభాగములో సాక్షాత్కరిస్తారు. కుచేల శ్రీకృష్ణుల మధురమైన స్నేహానికి, శ్రీకృష్ణుని భక్తజన వాత్సల్యమునకు కుచేలోపాఖ్యానం నిదర్శనంగా నిలుస్తుంది.
మహాపతివ్రతయు, అభిమనవతియునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే క్రుంగికృశించి పోయినది. ఆకలిమంటచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణనాథా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి.
మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయాసాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.
భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “ నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే ఆచక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా ? యని అడుగగా – ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొగునకు కొన్ని అటుకులు ముడివేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.
“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి ? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమానమిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము -” అనుకొనుచు కుచేలుడు ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యంతరములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న గాంచి – శ్రీకృష్ణుని బ్రహ్మానందమును అనుభవించెను.
అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. మంచి గంధమును శరీరమునకు అలదెను.
వింజామరలతో గాలి విసరి మార్గాయాసమును పోగెట్టెను. కర్పూర తాంబూలము నొసంగెను. ఆదరముతో గోవును దానము చేసెను. మణిమయ దీపములతో ఆరతి పట్టెను, సాక్షాత్తు రుక్మిణీదేవి కుచేలునికి వింజామరలు వీచెను. ఇట్లు శ్రీకృష్ణునిచే సేవులు చేయించుకొనుచున్న కుచేలుని గాంచి – అంతఃపురకాంతలు ఆశ్చర్యపడుచు, కుచేలుని అదృష్టమును అనేక విధములుగా ప్రశంసించిరి.
శ్రీమహావిష్ణువు అవతారమగు శ్రీకృష్ణుని చేతను, లక్ష్మీదేవి స్వరూపిణియగు రుక్మిణి చేతను సేవలు పొందిన మహనీయ మూర్తిగా కుచేలుడు ఈ పాఠ్యభాగమందు గోచరించును శ్రీకృష్ణ, కుచేలుల నిర్మలమైన స్నేహమును ఈ పాఠ్యభాగము నిరూపించును.