Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Poem The Dinner Party Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 1st Poem విద్యాలక్ష్యం
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు
ప్రశ్న 1.
ద్రోణార్జునుల గురుశిష్య సంబంధాన్ని చర్చించండి?
జవాబు:
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్ర విద్యా నిపుణుడు. కౌరవులకు, పాండవులకు విలువద్య నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని రాజగురువు గా నియమించాడు. దివ్యాస్త్రాలతో సహా అన్నిరకాల అస్త్ర, శస్త్ర యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు ద్రోణుడు. అర్జునుడు అతని ప్రియ విద్యార్ధి. ద్రోణుడికి అర్జునుని కన్నా ప్రియమైనవారు ఎవరన్నా ఉంటే అది అతని కుమారుడు అశ్వత్థామ మాత్రమే.
మహాభారత ఇతిహాసంలో ఉత్తమ గురువుగా ద్రోణాచార్యుడు, మరియు ఉత్తమ విద్యార్ధిగా అర్జునుడు గురుశిష్య బంధానికి తార్కాణంగా నిలిచి పోయారు. రాజకుమారులందరికీ గురువుగా ఉన్న ద్రోణుడు అర్జునుడు ఒక అసాధారణ విద్యార్ధి అని గమనించాడు. విద్యార్ధులందరికీ పెట్టిన తొలి పరీక్షలోనే అర్జునుడిలోని అపారమైన సంకల్పం మరియు ఏకాగ్రతను గమనించాడు ద్రోణుడు. ఒక రోజు గొప్ప యోధుడవుతాడని గ్రహించాడు. ద్రోణాచార్యుడు పెట్టిన అన్ని పరీక్షలలోను అర్జునుడు అందరినీ మించిపోయాడు.
అర్జునుడు అపారమైన “గురుభక్తితో ద్రోణుడిని సేవించాడు. భీష్మునిచే ఆచార్యునిగా నియమింపబడగానే రాకుమారులందరినీ చూసి నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చి నా కోరికమీలో ఎవ్వడు తీర్చగలడు? అని అడుగగా కౌరవులందరూ పెడమొగం పెట్టగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. అలా ముందుకు వచ్చిన అర్జునుని అపారప్రేమతో కౌగలించుకున్నాడు. అలాగే ద్రోణుని సరస్సులో మొసలి పట్టుకున్న సమయంలో అర్జునుడే ద్రోణుని మొసలి నుంచి విడిపించి తన ప్రతిభను చాటుకున్నాడు.
చీకటిలో బాణాలు వేయడం అభ్యసిస్తున్నా అర్జునుని చూసి, అస్త్రవిద్యలోని అతని పట్టుదలకి శ్రద్ధకు సంతోషించి నీకంటే విలువిద్యలో అధికులు లేనట్లుగా నేర్పిస్తానన్నాడు ద్రోణుడు అన్నట్లుగానే సకల విద్యాయుద్ధకౌశలాన్ని, అస్త్ర, శస్త్రాలను, దివ్యాస్త్రాలను యుద్ధవ్యూహాలను సంపూర్ణంగా బోధించి ఒకనాటి పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడు అనేట్లుగా, అర్జునుని తీర్చిదిద్దాడు.
అర్జునునికన్నా విద్యపట్ల శ్రద్ధ, ఆసక్తి, గురుభక్తి, వినయ కారణంగా ద్రోణుడి ప్రియ శిష్యుడయ్యాడు. బ్రహ్మాస్త్రాన్ని అర్జునునికి ఇచ్చి సాధారణ యోధులకి వ్యతిరేకంగా వాడవద్దని, చెప్పాడు. విలువిద్య కళను నేర్చుకోవటంతో ఉన్న అంకిత భావం అచంచల ఏకాగ్రత కారణంగా గురువు హృదయంలో స్థానం సంపాదించాడు. ద్రోణుడు కూడా తనకున్న విద్యాజ్ఞానాన్నంతటినీ శిష్యులకు ధారపోసాడు. గురుద్రోణాచార్య, శిష్యుడు అర్జునుడు పంచుకున్న బంధం భారత ఇతిహాసంలో ప్రత్యేకంగా నిలిచి పోయింది.
ప్రశ్న 2.
‘విద్యాలక్ష్యం’ పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి?
జవాబు:
ద్రోణుడు అగ్నివేశుడనే మహాముని వద్ద ధనుర్విద్యా పాఠంగతుడయ్యాడు. అనేక దివ్యాస్త్రాలు పొందాడు. తండ్రి ఆజ్ఞతో కృపాచార్యుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. అశ్వత్థామ అనే కుమారుడిని పొందాడు. ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి వినయంతో తన్న తాను పరిచయం చేసుకుని ధనాన్ని ఆశించి మీ వద్దకు వచ్చాను అని అనగా పరశురాముడు తన వద్దనున్న ధనాన్నంతటినీ వేదజ్ఞానంగల బ్రాహ్మణులకు ఇచ్చివేసానని, తన దగ్గర శరీరం, శస్త్రాస్త్రాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు కాబట్టి వాటిని ప్రసాదించ మనగా పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను బోధించాడు.
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి యుద్ధవిద్యలు అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి మిత్రుడయిన ద్రుపదుని వద్దకు వెళ్ళగా ద్రుపదుడు ధన, అధికార గర్వంతో పేదవాడైన ద్రోణుని తీవ్రంగా అవమానపరచాడు. అవమాన భారంతో, కలత చెందిన మనసు కలవాడై, తన భార్య, కుమారుడు, అగ్రిహోత్రం, శిష్యసమేతంగా హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ పట్టణం బయట కౌరవ, పాండవులు చెండాట ఆడుతుండగా వాళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది.
ఆకాశంలోని నక్షత్రంలా మెరుస్తున్న ఆ బంతిని బయటకు తీయలేక రాకురులం అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో అటువచ్చిన ద్రోణుడు ఆ బంతిని తన బాణము లతో తాడులాగా చేసి బంతిని బయటకు లాగి ఇచ్చాడు. అది చూసిన రాజకుమారు లందరూ ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకుని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పారు. భీష్ముడు ద్రోణుడి వివరములడుగగా ద్రోణుడు తన వివరాలన్నీ తెలిపి ద్రుపదుని వలన కలిగిన అవమానం, కుమారుని ఆకలి బాధలు అన్నీ తెలిపాడు.
అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి ద్రోణుని గౌరవించి, ధనదానాలిచ్చి సంతోషపరచాడు. అంతేకాక తన మనమళ్ళ నందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి వీరులుగా తీర్చిదిద్దుమని కోరాడు ద్రోణుడు వారందరినీ శిష్యులుగా స్వీకరించాడు.
అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరచాడు. అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకి సంతోషించి అతనికంటే విలువిద్యలే అధికులు లేరు అన్నట్లుగా విద్య నేర్పిస్తానని వాగ్దానం చేసాడు. ద్రోణుడు కూడా అర్జునునికి అన్ని రకాల యుద్ధవ్యూహాలు, అస్త్ర, శస్త్రాలు సర్వము బోధించాడు. ఒకనాటి పరశురాముడు కూడా ఇంటివాడు కాదు అన్నట్లుగా అర్జునునికి విద్య నేర్పించాడు.
ద్రోణుని వలన శస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో రాజకుమారులు అంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు. రాజకుమారుల నైపుణ్యం తెలుసుకోవటం కోసం చెట్టు చివరన పక్షిబొమ్మను ఉంచి విద్యార్ధుల ఏకాగ్రతను ద్రోణుడు పరీక్షించగా అందరూ విఫలమవ్వగా అర్జునుడు తన ఏకాగ్రతతో లక్ష్యాన్ని భేదించాడు.
తరువాత మరొకసారి ద్రోణుడు సరస్సులో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణుని కాలును పట్టుకోగా తాను సమర్థుడై ఉండి కూడా శిష్యుల నైపుణ్యం పరీక్షించదలచి రాకుమారులను కాపాడమని కోరాడు. వారంతా విడిపించలేక దిక్కుతోచని స్థితిలో ఉండగా మహాపరాక్రమంతో ఐదు బాణాలతో ఆ మొసలిని సంహరించి గురువును కాపాడుకున్నాడు. అర్జునుడు. సంతోషించిన ద్రోణుడు అర్జునునికి అనేక దివ్యాస్త్రాలు ప్రసాదించాడు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.
II. సంగ్రహరూప ప్రశ్నలు
ప్రశ్న 1.
నన్నయభట్టు గురించి తెలపండి?
జవాబు:
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనా శోభితుడు. ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలిగినవాడు. రాజరాజు కోరికపై వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. రెండున్నర పర్వముల వరకే నన్నయ్య భారతరచన సాగింది. ఆంధ్రశబ్ధ చింతామణి, ఇంద్రవిజయం, లక్షణసార వంటి ఇతర గ్రంథాలు రచించాడు.
ప్రశ్న 2.
ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు?
జవాబు:
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు.
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.
ప్రశ్న 3.
ఎవరెవరి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు?
జవాబు:
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు. సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)
ప్రశ్న 4.
కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురుకుమారుల ప్రతిభను తెలుండి?
జవాబు:
ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగ కొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.
ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణ్యాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.
అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు. పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జునుని అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.
గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.
III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు.
జవాబు:
నారాయణభట్టు
ప్రశ్న 2.
నన్నయ ఎవరి ఆస్థానకవి?
జవాబు:
రాజరాజ నరేంద్రుడు
ప్రశ్న 3.
ద్రోణుడి మిత్రుడి పేరేమిటి?
జవాబు:
ద్రుపదుడు
ప్రశ్న 4.
అశ్వత్థామ ఎవరి కుమారుడు?
జవాబు:
ద్రోణుడు-
ప్రశ్న 5.
ద్రోణాచార్యుడికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు?
జవాబు:
అగ్నివేశుడు, పరశురాముడు
ప్రశ్న 6.
‘పక్షికున్ను’ లక్ష్యంగా ఎవరు బాణం వేశారు.
జవాబు:
అర్జునుడు
ప్రశ్న 7.
పరశురాముడు తన ధనాన్ని ఎవరికి ఇచ్చాడు?
జవాబు:
విప్రులకు దానం చేసాడు.
ప్రశ్న 8.
ద్రోణుడిని ధనుర్విద్యాచార్యుడిగా ఎవరు నియమించారు?
జవాబు:
భీష్ముడు
IV. సందర్భసహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
సఖ్యము దానొడఁ గూడ నేర్చునే !
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టుచే రచింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం :
స్నేహపూర్వకంగా తనతో మాట్లాడిన ద్రోణుడిని అవమానిస్తూ ద్రుపదుడు పలికి సందర్భంలోనిది.
భావం :
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.
ప్రశ్న 2.
అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
భావం :
జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి. శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.
ప్రశ్న 3.
నారాజ్యభోగంబులు నీవు ననుభవింపనర్హుండ
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం :
ఎక్కడ నుంచి వస్తున్నారు అని భీష్ముడు అడిగినప్పుడు ద్రోణుడు తన వఋత్తాంతాన్ని తెలియచేసిన సందర్భంలోనిది
భావం :
నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా,
ప్రశ్న 4.
దారిద్య్రంబున కంటెఁగష్టంబొందెద్దియులేదు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం నన్నయభట్టు చే రచింపబడిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆదిపర్వం, పంచమాస్వాశం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది.
సందర్భం :
తనకుమారుని ఆకలి బాధను ద్రోణుడు భీష్మునికి చెప్పిన సందర్భంలోనిది.
భావం :
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు. దానిని చూచి దారిద్య్రం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.
V. సంధులు
1. వేదాధ్యయనంబు = వేద + అధ్యయనంబు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం:
2. నిఖిలోర్వి = నిఖిల + ఉర్వి = గుణసంధి
సూత్రం:
3. విద్యోపదేశం = విద్య + ఉపదేశ = గుణసంధి
సూత్రం:
4. నాటనేసి = నాటన్ + ఏసి = ద్రుతప్రకృతిక సంధి
సూత్రం: ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతికంబులకు సంధిలేదు
5. పాలికిఁబోవ = పాలికిన్ + పోవన్ = సరళాదేశ సంధి
సూత్రం : ద్రుతము మీది పరుషములకు సరళములాదేశమును ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషం విభాషనగు
6. తెగనేసిన = తెగన్ = ఏసిన = ద్రుఁత ప్రకృతిక సంధి
సూత్రం : ఇకాదులకు దక్క ద్రుత ప్రకృతిందికంబులకు సంధిలేదు
7. అవ్విహగము = ఆ+ విహగము = త్రిక సంధి
సూత్రం:
8. మహోగ్ర = మహా+ఉగ్ర = గుణసంధి
9. శాఖాగ్ర = శాఖ + అగ్ర = సవర్ణదీర్ఘసంధి
VI. సమాసాలు
1. అస్త్రశస్త్రాలు – అస్త్రములు మరియు శస్త్రములు = ద్వంద్వసమాసం
2. దివ్యబాణం – దివ్యమైన బాణం – విశేషణపూర్వపదకర్మధారయం
3. గుణసంపద – గుణములనెడి సంపద – రూపక సమాసం
4. విపులతేజుడు – విపులమైన తేజం కలవాడు – బహువ్రీహిసమాసం
5. గురువచనం – గురువు యొక్క వచనం – షష్ఠీ తత్పురుష సమాసం
6. తపోవృత్తి – తపస్సు అనెడి వృత్తి – రూపక సమాసం
7. పుత్రలాభం – – పుత్రుని వలన లాభం – పంచమీ తత్పురుష సమాసం
8. ధనుర్విద్యాకౌశలం – ధనుర్విద్యయందుకౌశలం-సప్తమీ తత్పురుష సమాసం
9. ధనపతి – ధనమునకు మతి – షష్ఠీతత్పురుష సమాసం
10. ఇష్టసఖుడు – ఇష్టమైన సఖుడు – విశేషణ పూర్వపద కర్మధాయసమాసం
ప్రతిపదార్థ, తాత్పర్యములు.
1వ పద్యం :
ద్రోణుండును, నగ్నివేశ్యుంటను మహామునివలన్న
నాగ్నేయాస్త్రంచారిగానే కనిప్యబాంబులు వల్లా, భరదాంతో వియోగంబునం
బుత్రలాభారంబు కృష్ణుని చెలియలిం గృమమేదాని వివాహంభయి
దావియందశ తాఘయను కొడుతుంటదని.
అర్ధాలు :
పారగుండు + ఐ = విలువిద్య అంతాన్ని ముట్టినవాడై (విద్యను సంపూర్ణంగా నేర్చుకొనుట)
తద + ప్రసాదంబున = అగ్నివేశ్యుని దయచేత
ఆగ్నేయ + అస్త్రంబు = ఆగ్నేయాస్త్రము (దివ్యాస్త్రములలో ఒకటి)
ఆదిగా = మొదటగా
దివ్యబాణంబులు = దేవతా సంబంధమైన అస్త్రములు
పడసి = పొందు
భరద్వాజనియోగంబునన్ = భరధ్వాజుని ఆజ్ఞచే
పుత్రలాభార్థంబు = కుమారుని పొందుటకు
కృపుని చెలియలి = కృపాచార్యుని చెల్లెలైన
కృపి అనుదానిన్ = కృపి అనుపేరుగల స్త్రీతో
వివాహంబు + అయి = పెండ్లికాగా
దానియందు = ఆమెయందు
అశ్వత్థామ = అశ్వత్థామ
అనుకొడుకును = అనబడే కుమారుడిని
పడసి = పొందెను
భావము :
ద్రోణుడు అగ్నివేశ్యుడనే మహాముని వద్ద ధనుర్విద్యాపారంగతుడై, అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం మొదటగా, అనేక దివ్యాస్త్రాలు పొంది, భరద్వాజుని ఆజ్ఞచేత పుత్రులను పొందటానికి కృపుని చెల్లెలైన ‘కృపి’ని వివాహమాడాడు. ఆమె వలన అశ్వత్థామ అనే కొడుకును కన్నాడు.
2వ పద్యం :
అరిగి మహేంద్రాచలనం సద్వినయముపస్
బీరమ తపోవృత్తి నున్న భారవు లోకా
త్తరు భూరి కర్మ నిర్మల
చరకుని ద్రోణుండు గాంచి
ప్రతిపదార్థం :
అరిగి = వెళ్ళి
మహేంద్ర + అచలమున్ = మహేంద్ర పర్వతం వద్ద
పరమ = గొప్ప
తపోవృత్తి = తపస్సు అనే పనిలో
ఉన్న = నిమగ్నుడైన
భూరి = గొప్ప
కర్మ = పనులలే
నిర్మల చరితుడు = పరిశుద్ధుడైన చరిత్రగల
భార్గవు = భృగువంశపువాడైన పరశురాముడిని
ద్రోణుండు = ద్రోణుడు
కాంచి = చూచి
సత్ + వినయంబున = మంచి వినయంతో
భావం :
మహేంద్ర పర్వతం వద్దకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తున్నవాడు, లోకంలో శ్రేష్ఠుడూ, గొప్పపనులు చేయడంతో పరిశుద్ధుడైన నడవడిక గలవాడు భృగువంశ పరశురాముని ద్రోణుని చూచి మంచి వినయంతో
3వ పద్యం :
వ. ‘ఏను భారద్వాజుండ, ద్రోణుండనువాఁడ సర్ధార్థి నై నీ కడకు వచ్చితి ననినఁ బరశు
రాముం డిట్లనియె.
ప్రతిపదార్థం :
ఏను = నేను
భరధ్వాజుండు = భరద్వాజుని కుమారుడును
ద్రోణుండు + అనువాడన్ = ్రోణుడు అనేవాడిని
అర్థ + అర్థిని + ఐ = ధనాన్ని కోరినవాడై
నీ కడకు = నీ దగ్గరకు
వచ్చితి = వచ్చాను.
అనినం = అనగా
పరశురాముడు = పరశురాముడు
ఇట్లనియె = ఈ విధంగా బదులు పలికాడు
భావం:
నేను భరధ్వాజుని కుమారుడనైన ద్రోణుడిని. ధనాన్ని ఆశించి మీ దగ్గరకు వచ్చాను అని అనగా పరశురాముడు ఈ విధంగా బదులు పలికాడు.
4వ పద్యం :
చ. కల ధన మెల్ల ముందఱ జగన్నుత! విప్రుల కిచ్చి, వారిమే
ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డన్ముని కిచ్చితిన్, శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి; వీనిలోన నీ
వలసిన వస్తువుల్ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్.
ప్రతిపదార్థం :
జగత్ + నుత = లోకంచే కీర్తించబడేవాడా !
కలధనము + ఎల్లన్ = ఉన్న ధనాన్నంతటినీ
ముందర = ముందుగానే
విప్రులకిచ్చి = వేదజ్ఞానం గల బ్రహ్మణులకిచ్చి
వార్థి = సముద్రం అనే
మేఖల = ఒడ్డాణం గల
విభాల + ఉర్వి = సమస్త భూమండలాన్ని
కశ్యపుడు = కశ్యపుడు
అన్ + మునికిన్ = అనే మునికి
ఇచ్చితిన్ = ఇచ్చాను.
శరంబులు = బాణాలు
శరీరం = శరీరం
శస్త్రములు = దివ్యాస్త్రములు
పొట్టిగన్ =ఒప్పగా (చాలా)
ఉన్నని = ఉన్నా
వినిలోన = వీటిలో
నీవలసిన = నీకు కావలసిన
వస్తువుల్ = శస్త్రాస్త్రములు
కొను = తీసుకో
నీకున్ = నీకు
ధ్రువంబుగ = తప్పకుండా
ఇచ్చెదన్ = ఇస్తాను
నావుడును = అని పరశురాముడు అనగా
భావం :
లోకం చేత పొగడ్తలందుకున్న ఓ ద్రోణా! నీకు ఉన్నా ధనం అంతా ముందే వేదజ్ఞానం గల బ్రాహ్మణులకు ఇచ్చివేసాను. సముద్రం ఒడ్డాణంగా చుట్టిన భూమినందటినీ కశ్యపమహర్షికి ఇచ్చివేశాను. ఇక శస్త్రాస్త్రాలు, శరీరం మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసింది తీసుకోవలసింది, నీకు తప్పక ఇస్తాను అని పరశురాముడు అనగా,
5వ పద్యం :
ధనములలో సత్యుత్తమ
ధనములు శస్త్రాస్త్రములు, ముదంబున వీనిం
గౌని కృతకృత్యుఁడ నగుదును
జవనుత! నా కొసఁగు మప్రశస్త్రచయంబుల్,
ప్రతిపదార్థం :
జననుత = జనుల చేత స్తుతింపబడేవాడా! ఓ పరశురామా!
ధనములలో = సంపదలలో
అత్యుత్తమ = మిక్కిలి శ్రేష్ఠమైన
ధనము = ధనాలు
శస్త్ర + అస్త్రములు = శస్త్రాలు, ఆయుధాలు
ముదంబున = సంతోషంతో
వీనిన్ = వీటిని
కొని = తీసుకొని
కృతకృత్యుఁడను = వచ్చినపని పూర్తిచేసుకున్నవాడిని
అగుదును = అవుతాను
నాకున్ = నాకు
అస్త్ర, శస్త్రచయంబుల్ = అస్త్ర, శాస్త్ర సమూహాల
ఒసగుము = ఇవ్వవలసింది
తాత్పర్యం :
జనులచేత ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి శ్రేష్ఠమైనవి శస్త్రాస్త్రములు. కాబట్టి సంతోషంతో వాటిని తీసుకుని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇవ్వవలసింది అని ద్రోణుడన్నాడు.
6వ పద్యం :
అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడంబడపి,
ధనుర్విద్యాయునభ్యసించి, ధనార్ధియయి తనబాలసఖుండైన ద్రుపదు పాలికింజని ‘యేసు
ద్రోణుంద, నీ బాలసబుండి, సహాధ్యాయుంద నన్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగా
బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపడుండలిగి యిట్లనియె.
ప్రతిపదార్థం :
అని = ఆ విధంగా
పరశురాముచేత = పరశురాముని వలన
దివ్య + అస్త్రంబులు = దేవతా సంబంధ అస్త్రాలు
ప్రయోగ = ప్రయోగించడం
రహస్య = దాని యొక్క రహస్యం (మర్మం)
మంత్రంబులతోడన్ = దివ్యమంత్రాలతో సహా
ధనుర్విద్యయు = విలువిద్యనుకూడా
అభ్యసించి = నేర్చుకుని
ధనార్థియయి = ధనాన్ని కోరినవాడై
తన = తన
బాలసుడైన = బాల్యస్నేహితుడైన
ద్రుపదు = ద్రుపదుము
పాలకిన్ + చని = దగ్గరకు వెళ్ళి
యోను = నేను
ద్రోణుండు = ద్రోణుడవు
నీ బాలసఖుండు = నీ బాల్య స్నేహితుడుని
సహ + అధ్యాయుడన్ = నీతో కలిసి చదివిన వాడిని
నన్ను + ఎఱుంగదే = నన్ను గుర్తుపట్టావు కదా!
అని = అని పలికి
ప్రణయపూర్వకంగా = స్నేహభావం ఉట్టి పడగా
పలికినన్ = మాట్లాడగా
ఆ పలుకులు = ఆ మాటలు
వినసహింపక = వినటానికి ఇష్టపడక
ద్రుపదుడు = ద్రుపద మహారాజు
అలిగి = కోపంతో
ఇట్లనియె = ఇలా అన్నాడు.
భావం :
ఆ విధంగా పరశురాముని వద్ద నుండి దివ్యాస్త్రాలను మంత్ర, ప్రయోగ రహస్యాలతో సహాపొంది, విలువిద్యను అభ్యసించి, ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్న వాడిని, తెలుసుకదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడా మాటలను సహించలేక కోపంతో ఇలా అన్నాడు.
7వ పద్యం :
చ. ధనపతితో దరిద్రునకుఁ, దత్త్వవిదుండగు వానితోడ మూ
ర్జునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణశూరుతోడ భీ
రునకు, వరూథితోడ నవరూఢికి, సజ్జనుతోడఁ గష్టదు
ర్ధనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁ గూడ నేర్చునే
ప్రతిపదార్థం :
ధనపతితో = ధనానికి ప్రభువైనవానితో (ధనవంతునితో)
దరిద్రునకు = పేదవానికి
తత్త్వవిదుండు = తత్వపడతడు
అగువనితోడ = అయినవాడితో
మూర్ఖునకుఁ = తెలివితక్కువ వాడికి
ప్రశాంతుతోడున్ = మిక్కిలి శాంతం కలిగినవానితో
కడున్ + క్రూరునకున్ = మిక్కిలి క్రూరుడైనవానికి
రణశూరుతోడన్ = యుద్ధంతో పరాక్రమవంతుడైన వానితో
భీరునకు = పిరికివానికి
వరూధితోడన్ = కవచం కలిగినవానితో
అవరూధికిన్ = కవచం లేనివానికి
సజ్జనుతోడన్ = సన్మార్గునితో
కష్టదుర్జవునకు = పాపి అయిన దుర్మార్గునితో
సఖ్యము = స్నేహం
ఏ + విధంబునన్ = ఏ విధంబుగా
ఒడగూడన్ + నేర్చున్ = కలుగుతుంది ? (కలుగదు అని భావం)
విశేషం :
నన్నయ నానారుచిరార్థ సూక్తినిధికి ఈ పద్యం ఒక తార్కాణం
భావం :
ధనవంతునితో పేదవానికి, తత్వజ్ఞానికి మూర్ఖునితో, శాంతమూర్తికి క్రూరునితో, యుద్ధరంగంలో వీరునికి, పిరికితనంతో పారిపోయే, పిరికివాడికి కవచం కలిగిన వీరునికి, కవచం లేని వానితో, సజ్జనునికి దుర్మార్గునితో స్నేహం ఏ విధంగా కలుగుతుంది. కలగదు అని తనని తాను ప్రశంసించుకుంటూ, అకారణంగా ద్రుపదుని నిందించాడు.
8వ పద్యం :
సమశీలశ్రుతయుతులకు
సమధనవంతులకు సమసుచారిత్రులకుం
దమలో సఖ్యమును వివా
హము నగుఁ గా, కగునె రెండు నసమానులకున్?
అర్ధాలు :
సమ = సమానమైన
శీలం = స్వభావం
శ్రుత = విద్య
యుతులకు = కూడినవారికి
సమధనవంతులకు = సమానమైన ధనవంతులకు
సమచారిత్రులకున్ =సమానమైన మంచి నడవడిక కలిగిన వారికి
తమలో = వారికి వారిలో
సఖ్యము = స్నేహము
వివాహము = వివాహ బంధం
అగ్రిన కాక = ఏర్పడతాయిగాని
రెండు = స్నేహం, వివాహం అనే రెండు
అసమానులకున్ = సమానులు లేని వాళ్ళకి
అగునె = ఔతాయా? (లేవు అని భావం)
భావం :
సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవికలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడవని భావం)
9వ పద్యం :
‘ మణి యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునంజేసి మిత్రామిత్ర సంబంధంబులు
సంభవించుం గావున మా యట్టి రాజులకు మీ యట్టి పేద పాబువారలతోఁ గార్య
కారణం బైన సఖ్యం బెన్నందును గానేర’ దని ద్రుపదుండైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన
విని, ద్రోణుం ధవమానజనిత మన్యుమూర్ణమాన మానసుండయి యెద్దియుం జేయునది
నేరక పుత్రకళత్రాగ్నిహోత్ర శిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చే నంత నప్పుర
బహిరంగణంబున దృతరాష్ట్ర పాండునందనులందఱుఁ గందుక క్రీడాపరులయి వేడుకతో
శ్రీ నాడుచున్నంత కాంచనకందుకం బొక్కనూతం బడిన
ప్రతిపదార్థం :
మఱి = ఇంకా
అట్లు కాక = ఆ విధంగా కాకుండా
రాజులకు = రాజులకు
కార్యవశంబునంజేసి = అవసరం చేత
మిత్ర + అమిత్ర = స్నేహం, వైరం
సంబంధంబులు = సంబంధాలు
సంభవించు = కలుగుతాయి
కావున = కాబట్టి
మీయట్టి = మీవంట
పేదపావిఱురలతో = పేదబ్రాహ్మణులతో
కార్యకారణంబు + ఐన = ప్రయోజనకరమైన (ఉపయోగకరమైన)
సఖ్యంబు = మైత్రి
ఎన్నండును = ఎన్నటికీ
కానేరదు = కలుగదు
అని = ఆ విధంగా
ద్రుపదుడు = ద్రుపద మహారాజు
ఐశ్వర్యగర్వంబునన్ = సంపద వలన కలిగిన పొగరులో
మెచ్చక = నిర్లక్ష్యంగా
పలికినవిని = మాట్లాడగా విని
ద్రోణుండు = ద్రోణుడు
అవమానజనిత = అవమానం వలన పుట్టిన
మన్యుఘార్ణమాన = కోపంతో తిరుగుడు బడుతున్న
మానసండయి = మనసు కలవాడై
ఎద్దియున్ = ఏమి
చేయునది నేరక = చేయాలో తెలియక
పుత్ర = కుమారుడు
కళత్ర = భార్య
అగ్నిహోత్ర = నిత్యాగ్నిహోత్రంతో
శిష్యగణంబులతో = శిష్యసమూహంతో
హస్తిపురంబునకున్ = హస్తినాపురానికి
వచ్చె = వచ్చెను
అంతన్ = అప్పుడు
ఆ + పుర = ఆ నగరం
బహిరంగణంబున్ = వెలుపల
ధృతరాష్ట్ర, పాండునందనులు = కౌరవులు, పాండవులు
అందఱన్ = అంతా
కందుక క్రీడాపరులు+అయి = చెండాట ఆడటంలో ఆసక్తి కలవారై
వేడుకతోనే = సంతోషంతో
ఆడుచు+ఉన్నంత = ఆడుతుండగా
కందుకంబు = ఆ బంగారు బంతి
నూతన్ = పడగా
భావం :
అంతేకాదు, రాజులకు అవసరాన్ని బట్టి మిత్రత్వ శత్రుత్వాలు ఏర్పడతాయి. అందుచేత మా వంటి రాజులకు, మీ వంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు అని ద్రుపదరాజు ఐశ్వర్యగర్వంతో తిరస్కరించి మాట్లాడగా ద్రోణుడు అవమానం వలన కలిగిన కోపంతో కలత చెందిన మనసుకలవాడై ఏమీ చేయటానికి తోచక, భార్యా, కొడుకు, అగ్నిహోత్రంతో, శిష్య సమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు ఆ పట్టణం బయట ధృతరాష్ట్రుని కుమారులు పాండురాజు కుమారులు చెండాట ఆడుతుండగా విళ్ళాడుతున్న బంగారు బంతి బావిలో పడింది. అప్పుడు
10వ పద్యం :
నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ
మొక్కొ యనఁగ వెలుఁగుచున్నదాని
రాచకొడుకులెల్లఁ జూచుచునుండిరి
దానిఁ బుచ్చుకొను విధంబు లేక.
ప్రతిపదార్థం :
నీరిలోన = నీటిలో
తోఁచు= కనిపిస్తున్న
తారక = నక్షత్రం
ప్రతిబింబము+ఒక్కొ = ప్రతిబింబమా?
అనఁగ = అనేట్లుగా
వెలుగుచున్నా = ప్రకాశిస్తున్నా
దానిన్ = ఆ బంతిని
రాచకొడుకులెల్లఁ = రాకుమారులంతా
పుచ్చుకొను = తీసే
విధంబు = విధానం
లేక = తెలియక
చూచుమనుండిరి = చూస్తూ ఉన్నారు.
భావం :
నీటిలో ప్రతిసలిస్తున్న నక్షత్రమా అన్నట్లుగా వెలుగుతున్నా ఆ బంగారు బంతిని తీసుకునే మార్గం లేక రాకుమారులంతా ఊరకే చూస్తున్నారు.
విశేషం :
ఉత్ప్రేక్షాలంకారము
11వ పద్యం :
అట్టి యవసరంబున
ప్రతిపదార్థం :
అట్టయవసరంబున = ఆ సమయంలో
“దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదం జూడుఁ డీ విద్య యొరు లెవ్వరు నేర’ రని
ద్రోణుం డొక్కబాణంబభిమంత్రించి దృష్టి ముష్టి సౌష్ఠవంబు లొప్ప నక్కందుకంబు
నాటనేసి దాని పుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖంబొండొకబాణంబున
నేసి వరుసన బాణరజ్జువు గావించి దానిందిగిచికొని యిచ్చిన జూచి రాజకుమారులెల్ల
విస్మయంబంది ద్రోణుందోడ్కొనిచని భీష్మునకంతయు నెఱింగించిన నాతండును.
ప్రతిపదార్ధం :
దీనిన్ = ఈ బంతిని
బాణ = బాణముల
పరంపరం + చేసి = వరసతో
పుచ్చి = తీసుకొని
ఇచ్చెదన్ = మీకు ఇస్తాను.
చూడుఁడు = చూస్తూ ఉండండి
ఈ విద్య = ఈ విలువిద్యను
ఒరులు + ఎవ్వరున్ = ఇతరులెవ్వరూ
నేరరు = నేర్వలేదు
అని = ఆ విధంగా
ద్రోణుండు = ద్రోణుడు
ఒక్క బాణంబు = ఒక్క బాణాన్ని
అభిమాత్రించి = మంత్రంతో పిలిచి
దృష్టి = చూపు
ముష్టి = పిడికిలి
సౌష్టవంబులు = చక్కదనాలు
ఒప్పన్ = ఒప్పునట్లుగా
ఆ + కందకంబు = ఆ బంతిని
నాసిన్ + ఏట = గుచ్చుకునేట్లుగా కొట్టి
దాని = ఆ బాణం యొక్క
ప్రంఖలంబు = క్రింది చివర
మరియొక బాణంబున్ = ఇంకొక బాణంతో
ఏసి = కొట్టి
తద్ + పుంఖంబు = దాని యొక్క చివరి అంచును
బండు + ఒక = యేరొక
బాణంబునన్ = బాణ చేత
ఏసి = కొట్టి
వరుసన = వరుసగా
బాణ రజ్జువు = బాణాలు తాడును
కావించి = వచ్చునట్లుచేసి
దానిన్ = ఆ బంతిని
ఇచ్చినన్ = ఈయగా
చూచి = చూసిన
రాజకుమారులు + ఎల్లన్ = రాజకుమారులందరూ
విస్మయంబు+అంతి = ఆశ్చర్యపడి
ద్రోణుని = ద్రోణుణ్ణి
తోడ్కొని = తీసుకొని
చని = వెళ్ళి
భీష్మునకున్ = భీష్మునకు
అంతయున్ = విషయమంతా
ఎఱించినన్ = తెలుపగా
అతండున్ = అతను కూడా
భావం :
ఈ బంతిని బాణపరంపరతో తీసి ఇస్తాను చూడండి. ఈ విద్య ఇతరులెవ్వరికీ రాదు అని ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి చూపును పిడికిలిని చక్కగా నిలిపి, ఆ బంతిని నాటుకునే విధంగా ఆ బాణాన్ని కొట్టి ఆ బాణం చివరకి మరో బాణాన్ని దాని చివరకు ఇంకో బాణాన్ని కొట్టి, వరుసగా బాణాల తాడు చేసి బంతిని లాగి వారికి ఇచ్చాడు. అది చూసి రాకుమారులందరూ ఆశ్చర్యపడి ద్రోణుడుని తీసుకుని వెళ్ళి, భీష్మునికి జరిగినదంతా తెలిపారు. ఆయనకూడా,
12వ పద్యం :
ఈ. ఎండుంది వచ్చి అందుల
కేందుండఁగ నీకు నిష్ట మేఱిఁగింపుము న
‘ద్వందిత యనియదగిన నా
నందుఁడు ద్రోణజుండు భీష్మునకు నిట్లనియెన్
ప్రతిపదార్థం :
ఎందు + ఉండి = ఎక్కడ నుండి
ఇందులకున్ = ఇక్కడికి
వచ్చితివి = వచ్చాను?
నీకున్ = నీకు
ఎందు+ఉండఁగన్ = ఎక్కడ ఉండటానికి
ఇష్టమ = అభిలాష
ఎఱిఁగింపుము = తెలియజేయుము
సద్ + వందిత = సజ్జనులచే కీర్తింపబడేవాడా
అని = ఆ విధంగా
అదిగినన్ = అడుగగా
స + ఆనందుడు = ఆనందంతో
ఇట్ల + అని = ఇలా అన్నాడు.
భావం :
సజ్జనులచే కీర్తిపండే ఓ ద్రోణాచార్య నీవు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చావు? ఎక్కడ ఉండటం నీకిష్టం ? చెప్పుము అని అడుగగానే ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా అన్నాడు.
13వ పద్యం :
వ. ఏను ద్రోణుండనువాఁడ, భరద్వాజపుత్రుండ సగ్నివేశ్యుందను మహామునివరుగొద్ద
బ్రహ్మచర్యాశ్రమంబున వేదాద్యయనంబు సేసి ధనుర్వేదంబభ్యసించుచున్న రెండు
పాంచాలపతియైన పృషతుపుత్రుండు ద్రుపదుందనువాఁడు నా క్లిష్టనుండయి
యెల్లవిద్యలు గలచి యెము పొందాల విషయంబునకు రాజయనన్యాకు
యొద్దకు వచ్చునది; నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండవని నన్నుఁ
బ్రార్థించి చని, సృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రాజయియున్న, నేను గురుని
యుక్తుండనై గౌతమిం బాణి గ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధిక
తేజస్వినాత్మజులబడసి, ధనంబు లేమిం గుటుంబ భరణంబునంద సమర్థుందనయి.
యుండియు
ప్రతిపదార్థం :
ఏను = నేను
ద్రోణుండు + అనువాఁడన్ = ద్రోణుడు అనువాడిని
భరద్వాజ పుత్రుండన్ = భరద్వాజుని కుమారుడను
అగ్నివేశ్యుండు = అగ్నివేశ్యుడనే
మహామునినరున్ + ఒద్ద = గొప్ప మునిశ్రేష్ఠుని వద్ద
బ్రహ్మచర్య + ఆశ్రమంబున్ = బ్రహ్మచర్చాశ్రమంలో (విద్యార్థిగా)
వేద + అధ్యయనంబు = వేదాలు చదవటం
చేసి = చేసాను
ధనుర్వేదంబు = విలువిద్యను
అభ్యసించుచున్ = నేర్చుకుంటూ
ఉన్ననాడు = ఉన్నప్పుడు
పాంబాపతి + ఐన = పాంచాల రాజైన
పృషమ పుత్రుండు = పృషతుడనే వాని కుమారుడు
ద్రుపదుండు + అనువాడు = ద్రుపదుడనేవాడు
నాకు = నాకు
ఇష్టసఖండ + ఐ = ప్రియ స్నేహితుడై
ఎల్ల విద్యలు = అన్ని విద్యలు
కఱచి = నేర్చుకుని
ఏను = నేను
పాంచాల విషయమునకు = పాంచాల రాజ్యమునకు
రాజు + అయినాఁడు = రాజైనప్పుడు
నా ఒద్దకున్ = నా దగ్గరికి
వచ్చునది = రమ్ము
నారాజ్యభోగంబులు = నా యొక్క రాజ్య భోగాలు
నీవున్ = నీవుకూడా
అనుభవింపన్ = అనుభవించడానికి
అర్హుండవు = తగినవాడివి
చని = వెళ్ళి
పృషతు పరోక్షంబునన్ = పృషతుని తర్వాత
తద్ + దేశంబునకున్ = ఆ దేశానికి
రాజు + అయి ఉన్నాన్ = ప్రభువై ఉండగా
నేను = నేను
గురు నియుక్తుండను + ఐ = తండ్రి ఆజ్ఞచే
గౌతమిన్ = కృపిని
పాణిగ్రహణంబు + చేసి = వివాహమాడి
ఈ + కుమారున్ = అశ్వత్థామను
అధిక తేజస్విని = మిక్కిలి తేజశ్శాలిని
అత్మజక్ =కుమారునిగా
పడసి = పొంది
ధనంబులేమిన్ = ధనం లేకపోవడంతో
కుటుంబభరణంబు+అందు = కుటుంబ భారాన్ని మోయడంతో
అసమర్థుండనయి = అసమర్ధడనయ్యాను
ఉండియు = అలా ఉండి కూడా
భావం :
నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడను. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య దశలో వేదాద్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో, పాంచాలరాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలూ గురువు దగ్గర నేర్చి, నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా!
14వ పద్యం :
నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు నేను తండ్రి ఆజ్ఞచేత కృషిని వివాహమాడి, తేజశ్శాలి అయిన బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది, ధనం లేమి చేత సంసారాన్ని భరించలేని వాడై ఉండి కూడా,
పురుషావిశేశావివేక
పరిచయులగు ధరణీపతులు పాలికిం
ఖరులందు దుష్ప్రతిగ్రహ
భర మదలో రోసి ధర్మపధమున నున్నన్
ప్రతిపదార్థం :
పురుష = పురుషుని యొక్క
వివేక యాలు+అగు = గొప్పతనాన్ని గుర్తించిన ఆలోచనబందు పరిచయం లేని
ధరణిపతుల పాలికిన్ = రాజుల దగ్గరికి
పోవన్ = వెళ్ళటం
పరులందు = ఇతరుల దగ్గర
దుష్ప్రతిగ్రహభారము = చెడుదానాలను తీసుకునే కష్టాన్ని
ఎదలో = మనసులో
రోసి = అసహ్యించుకుని
ధర్మపథమునన్ = ధర్మమార్గంలో
ఉన్నన్ = ఉండగా
భావం :
“వ్యక్తుల యోగ్యత గుర్తించలేని రాజులు దగ్గరికి వెళ్ళటానికి, ఇతరుల నుండి చెడుదానాలు తీసుకొనడానికి ఇష్టపడక, ధర్మమార్గంలో జీవితం గడుపుతుండగా,
15వ పద్యం :
క. ధనపతుల బాలురు ముదం
బున నిత్యముఁ బాలు ద్రావంబ యిన సస్మ
తనయుందు వీఁదు బాల్యం
బుననేర్పెను బాలు నాకుఁ బోయుండనుచున్,
ప్రతిపదార్థం :
ధనపతులు = ధనవంతుల
బాలరు = పిల్లలు
వలుదంబునన్ = సంతోషంతో
నిత్యమున్ = ప్రతిదినం
పాలుత్రావన్పోయినన్ = పాలుత్రాగుచుండగా
అస్మద్ + తనయుండు = నా కుమారుడు
వీఁదు = ఈ బాలుడు
బాల్యంబునన్ = బాల్యంలో
నాకున్ = నాకూ
పాలు = పాలు
పోయుండని = తాగటానికి ఇవ్వమని
అనుచున్ = అంటూ
ఏడెన్ = రోధించాడు
భావం :
ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు తాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయడని ఏడ్చాడు.
16వ పద్యం :
ధు ; దానించి దారిద్య్ర లయిన కంటెఁ గష్టం బొందెద్దియు లేదు. దీని నా బాలసుఖంచ
ధ ; పొందాలు పాలికిం బోయి పాలికొండ్రు నాతందు తన దేశంబున కలిసికుండు గా
బోవుచుండి సన్ను రాం బనిచిపోయే!”
ప్రతిపదార్థం :
దానిన్ + చూచి = ఆ సన్నివేశాన్ని చూచి
దారిద్ర్యంబునకంటెన్ =దరిద్రం కంటే
కష్టంబు = కష్టము
ఒండు+ ఎద్దియున్ = మరొకటి ఏదీలేదు.
దీనిన్ = ఈ పేదరికాన్ని
నాబాలసఖుండు = నా చిన్ననాటి స్నేహితుడు
అగు = అయినట్టి
పాంచాల పాలకిన్ = పాంచాలదేశపురాజైన ద్రుపదుని దగ్గరికి
పోయి = వెళ్ళి
పాచికొందున్ = పొగొట్టుకుంటాను
అతండు = ఆ ద్రుపదుడు
తన దేశంబునకు = తన రాజ్యమునకు
అభిషిక్తుండు+కాన్ = రాజు కావడానికి
పోవుచుండి = పోతూ ఉండి
నన్నున్ = నన్ను
రాన్+పనిచి = రమ్మని చెప్పి
పోయేన్ = వెళ్ళిపోయాడు
భావం :
దానిని చూచి దారిద్ర్యం కంటే కష్టం మరొకటి లేదని భావించి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళాడు.
17వ పద్యం :
మ. కో. వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధనమోపఁడేనియు వీని మాత్రకు నాలుగేన్
పాఁడి కుట్టుల నీఁదే వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్.
ప్రతిపదార్థం :
ఎంతయున్ = మిక్కిలి
కష్టము + ఐనన్ = కష్టమైన పని అయినప్పటికి
వేఱులేని = బేధంలేని
సుహృత్+జనున్ = మిత్రుడిని
వేడికోలు = వేడుకోవటం
ఉచితంబు + అ = సరైనదే
కావునన్ = కావున
వేడ్కతోన్ = సంతోషంతో
చని = వెళ్ళి
సోమకున్ = ద్రుపదుడిని
వేఁడినన్ = ప్రార్దింపగా
ధనము+ఓపడు+ఏనియున్ =ధనం ఇవ్వకపోయినప్పటికీ
వీని మాత్రమే = వీడికి (అశ్వత్థామ) సరిపోయేంతగా
నాలుగు + ఏన్ = నాలుగైనా
పాఁడి కుఱ్ఱులన్ = పాడి ఆవులను
వీనికిన్ = ఈ అశ్వత్థామకు
పాలు త్రావుచున్ = పాలు తాగడానికి
ఉండగన్ = ఉండటానికి
ఈడే = ఇవ్వడా !
భావం :
యాచించటం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోయినా, అశ్వత్థామ పాలు తాగడానికి సరిపోయేటట్లుగా నాలుగుపాడి ఆవులనైనా ఇవ్వడా?
18వ పద్యం :
వ. అని నిశ్చయించి ధ్రుపడునొద్దకుంబోయి నన్నెఱింగించిన, నాతండు ధన రాజ్యమదంబున
నన్నును దన్నును నెఱుంగక ‘యేసు రాజను నీవు పేద పాలుండవు; నాకును
నీకును నెక్కడి సఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండనయి వచ్చితి’ నని
ద్రోణుండు దనవృత్తాంతంబంతయుఁ జెప్పిన.
ప్రతిపదార్థం :
అని = ఆ ప్రకారం
నిశ్చయించి = నిర్ణయించుకుని
ద్రుపదు + ఒద్దుకున్ = ద్రుపదుని దగ్గరికి
పోయి = వెళ్ళి
నన్నున్ + ఎఁరింగించినన్ = నన్ను నేను పరిచయం చేసుకొనగా
అతండు = ఆ ద్రుపదుడు
తన రాజ్య మదంబునన్ = తన రాజ్యం వలన కలిగిన పొగరుతో
నన్నువు = నన్ను
తన్నును = తనను
ఎఱుంగక = తెలియక
ఏను = నేను
రాజును = రాజువు
నీవు = నీవు
వేదపాండవు = పేదబ్రాహ్మణుడు
నాకున్నీకున్ = నాకు, నీకూ
ఎక్కడి = ఎక్కడ
సఖ్యంబు = స్నేహం
అని పలికినన్ = అనగా
వాని చెతన్ = ఆ ద్రుపదునితో
అవమానితుండున+ అయి = అవమానింపబడిన వాడినై
వచ్చితిని = వచ్చావు
తోన + వృత్తాంతము + అంతయు = తన వృత్తాంతం అంతా చెప్పగా
తాత్పర్యం :
అని నిర్ణయించుకొని ద్రుపదుని దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదం చేత నన్ను తననూ ఎరుగకుండా నేను రాజును, నీవు బీద బ్రాహ్మణుడివి, నాకూ నీకూ స్నేహం ఎక్కడిది? అని పలికాడు. ఆ విధంగా అతని చేత అవమానం పొంది వచ్చానని ద్రోణుడు తన వృత్తాంతం అంతా తెలిపాడు.
19వ పద్యం :
సిని రోయా తింగ గాళం
……………………………
……………………………
……………… దనిపెస్
ప్రతిపదార్థం :
విని = ద్రోణుడి వృత్తాంతాన్ని విన్న భీష్ముడు
రోయు తీఁగ = వెదుకుతున్న తీగ
తాన్ = తానే
కాళ్ళన్ పెనఁగన్ = కాళ్ళకు చుట్టుకొన్నాడు
అనుచున్ = అంటూ
పొంగి = సంతోషించి
ఘనభుజున్ = గొప్పభుజాలు కలిగినవాడు అయిన
ద్రోణున్ = ద్రోణుణ్ణి
అభీష్టపూజ = ఇష్టమైన గౌరవాలు
ధనదాన విద్యాములన్ = ధన దానాలిచ్చుట ద్వార
ముదంబున = సంతోషంతో
తనిపెన్ = తృప్తి పరచాడు.
భావం :
అది విన్న భీష్ముడు వెదకబోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లు సంతోషించి, ద్రోణునికి ఇష్టమైన పూజలు చేసి, ధనదానాలిచ్చి ద్రోణుని సంతృప్తి పరచాడు.
20వ పద్యం :
మనుమలనెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు ‘వీరింజే’
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరకరాసిన విద్యలెల్లఁ బెం
పున జమదగ్నిసూనుఁడును బోలందు నిన్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమ గర్వసంపదన్
ప్రతిపదార్థం
ముతిమంతుడు = గొప్ప బుద్ధిగలవాడు
శాంతనవుండు = భీష్ముడు
మనుములను = మనుమలను
ఎల్ల + చూపి = అందరినీ చూపించి
వీరిని = వీరందరినీ
చేకొని = గ్రహించి
ఘోర + శర + ఆసన = భయంకర ధనుర్విద్య
విద్యలు + ఎల్లన్ = అన్నింటినీ
పెంపున = అతిశయంగా (బాగా
గురువృత్తిమైన్ = గురుత్వం చేత
కఱపు = నేర్పుము
నిన్నున్ = నీకు
విల్లునేర్చునన్ = విలువిద్యలో
నయనైపుణ్యంబునన్ = నీతి నేర్పులో
భూరి పరాక్రమ = గొప్పబలంకలిగిన
గర్వసంపదన్ = గర్వయనే కలిమిలో
జమదగ్నిసూనఁడును = జమదగ్ని కుమారుడైన పరశురాముడుకూడా
పోలడు = సరిపోలడు
అని విందున్ = అని విన్నాను
భావం :
మతిమంతుడైన భీష్ముడు తన మనమళ్ళనందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పుము. విలువిద్యలో నీతిలో, పరాక్రమం లో పరశురాముడు కూడా నిన్ను పోలడని విన్నాను.
21వ పద్యం :
అని కుమారుల నెల్లంజూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన
ప్రతిపదార్థం :
అని = ఆ విధంగా పలికి
కుమారులను + ఎల్లన్ = కుమారులందరినీ చూసి
ద్రోణునకు = ద్రోణునికి
శిష్యులన్ +కాన్ = శిష్యులయ్యేట్లుగా
సమర్పించినన్ = అప్పగించగా
భావం :
ఆ విధంగా పలికి కుమారులందరినీ చూపి, వాళ్ళను ద్రోణునికి శిష్యులుగా సమర్పించాడు.
22వ పద్యం :
క. నరుఁడస్త్ర శస్త్ర విద్యా
పరిణతి నధికుఁడయి వినయవరుఁడయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునం
బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్.
ప్రతిపదార్థం :
నరుడు = అర్జునుడు
అణ, శస్త్ర, విద్యాపరితిన్ = అస్త్రశస్త్ర విద్యాదులలో పక్వతలో
అధికుడు + అయి = గొప్పవాడై
వినయపరుడు + అయి = అణుకువ ప్రధానంగా కలవాడై
శశ్వత్ + గురుపుజాయాత్మంబునన్ = నిరంతరం గురువును పూజించే ప్రయత్నంతో
పరఁగుచున్ = ప్రవర్తిస్తూ
భారద్వాజున్ = భరద్వాజుని కుమారుడైన ద్రోణుణ్ణి
సంప్రీతు = సంతోషించిన వాడిగా
చేసెన్ = చేసెన్
భావం :
అర్జునుడు శస్త్రాస్త్ర విద్యానైపుణ్యంలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరిచాడు.
23వ పద్యం :
సీ. ఆతని యస్త్రవిద్యాభియోగమునకుఁ
బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
‘యన్న! ధనుర్ధరు లన్యులు నీకంటె
నధికులు గాకుండునట్లు గాఁగఁ
గఱపుడు విలువిద్య ఘనముగా’ నని పల్కి
ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథ మహీ వాజి వారణములపై నుండి
దృఢచిత్ర సౌష్ఠవస్థితుల నేయ
తే. బహువిధ వ్యూహ లేదనోపాయములను
“సంప్రయోగ రహస్యాతిశయము గాఁగం
గలప నర్జునుఁ దొంటి భార్గవుఁడు వింట
నిష్టం చేయని పొగడంగ నెల్ల జనులు.
అర్థాలు :
అతని = ఆ అర్జునుని
అస్త్రవిద్య + అభియోగమునకున్ = అస్త్ర విద్యలందలి ఆసక్తికి
ప్రియ శిష్యవృత్తికిన్ = ప్రియమైన శిష్యుడి నడవడికకి
పెద్ద మెచ్చి = మిక్కిలి సంతోషించి
అన్న = అన్న అని ప్రేమపుర్వకంగా పిలిచి
అన్యులు = ఇతరులైన
ధనుర్థరులు = విలువిద్యను చేపట్టినవాళ్ళు
నీకంటెన్ = నీకన్నా
అధికులు = గొప్పవారు
కాకుండునట్లు = అవ్వకుండా
ఘనముగాన్ = గొప్పగా
విలువిద్యకఱపుదున్ = ధనుర్విద్యనేర్పుతాను
అని = అని పలికి
ద్వంద్వ = ఇద్దరి మధ్య యుద్ధం
సంకీర్ణ యుద్ధము = అనేకులతో చేయుయుద్ధం
తెఱగు = పద్ధతులు
రథ = రథం మీద
మహి = నేలమీద
వాజి = గుర్రం మీద
వారణముల పైన్ = ఏనుగుమీద ఉండే
ధృఢ, చిత్ర = గట్టిగా, చిత్రంగా
సౌస్టివ = చక్కగా ఉన్న
స్థితులన్ = స్థితులలో
ఏయన్ = బాణములు వేయుట
బహువిధ = అనేకమైన
వ్యూహ = వ్యూహములను
భేదన + ఉపాయములను = అనేక విధాలైన వ్యూహాలను భేధించే ఉపాయాలను
సంప్రయోగ = ప్రయోగవిధాన
రహస్య + అతిశయము = రహస్య అతిశయంతో
కాఁగన్ = కూడినట్లుగా
తొంటి = ఒకనాటి
భార్గవుడు = పరశురాముడు
మిటన్ = విలువిద్యలో
అని = అని
పొగడంగ = ఇటువంటివాడా
కఱపెన్ = నేర్పాడ
భావం :
అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అన్నా! నీకంటే వేరెవ్వరూ అధికులు కానట్లుగా విలువిద్య నేర్పిస్తానన్నాడు. ద్వంద్వయుద్ధ, సంకులయుద్ధ పద్ధతులను, రథం మీద నేలమీద, గుర్రాల మీద, ఏనుగులమీద ఉండి దృఢం చిత్రం, సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయటాన్ని, బహువిధాలైన వ్యూహాలను ఛేదించే ఉపాయాలను, బాణ ప్రయోగ రహస్యాలను ఇది వరకటి ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటివాడుకాడని ప్రజలు అర్జునుని పొగిడేటట్లుగా అతనికి నేర్పాడు.
24వ పద్యం :
మ.కో. భూపనందము లివ్విధంబున భూరి శస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న సందఱయందు వి
ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
పరిశ్రమకౌశలంబున దండితారి నరుండిలన్.
అర్థాలు :
భూపనందనులు = రాకుమారులు
ఈ + విధంబునన్ = ఈ విధంగా
భూరి = గొప్ప
శస్త్ర = శస్త్రాలు
మహా+అస్త్ర = మహాస్త్రాలు
విద్య + ఉపదేశ = విద్యయొక్క బోధన
పరిగ్రహస్థితి = గ్రహించటం అనే స్థితిలో
ఉన్నాన్ = ఉండగా
అందున్ = అందరిలో
విద్య + ఉపదేశము = విద్యాబోధన
తుల్యము = సమానం
అయినను = అయినప్పటికినీ
దండిత + అ = శిక్షించబడిన శత్రువులు కలవాడు
నరుండు = అర్జునుడు
విద్యాపరిశ్రమ = విద్యాభ్యాసపు నేర్పు చేత
ఇలన్ = భూమిలో
ఉత్తమ + ఉత్తములు = శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అయ్యెను
భావము :
రాజకుమారులు ద్రోణుని వలన గొప్ప వస్త్రాస్త్ర విద్యాబోధనను పొందటంలో అంతా సమానమే అయినా, అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్ఠుడయ్యాడు.
25వ పద్యం :
వ. అక్కుమారులు ధనుర్విద్యాకౌశలంబెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు
కృత్రిమంబయిన భాసంబను పక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి,
దాని నందఱకుఁ జూపి ‘మీమీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన
యప్పుడ యిప్పక్షి తలఁ దెగ నేయుం; డే నొకళ్ళి ? కళ్ళన పంచెద’ నని ముందఱ
ధర్మనందనుఁ బిలిచి ‘యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి
మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు’ మనిన నతండును వల్లె యని
గురువచనంబు సేసియున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుండిట్లనియె.
ప్రతిపదార్థం :
ఆ+ కుమారులు = ఆ కురు కుమారుల యొక్క
ధనుర్విద్యా కౌశలంబు = విలువద్యలో నేర్పు
ఎఱుంగన్ = తెలిసికొనాలని
వేఁడి = కోరి
ఒక్కనాడు = ఒక్కరోజు
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
కృత్రివుంబు+అయిన = కల్పించబడిన
భాసంబు = గద్ద
అనుపక్షిన్ = అనే పక్షిని
ఒక్క. = ఒక
వృక్షశాఖ = చెట్టుకొమ్మ
అగ్రంబున = చివరన
లక్ష్యంబుగాన్ = గురిగా
రచియించి = కూర్చి
దానివి = దాన్ని
అందఱకున్ = అందరికీ చూపి
సంధించి = ఎక్కుపెట్టి
నాపంచిన అప్పుడు+అ = నేను ఆజ్ఞాపించిన సమయంలో
ఈ పక్షి తలన్ = ఈ పక్షి తలను
తెగెన్ = తెగేటట్టుగా
ఏయుండు = కొట్టండి
ఏన్ = నేను .
ఒకళ్లు + ఒకళ్ళన = ఒక్కొక్కరిని
పంచెదన్ = ఆజ్ఞాపిస్తాను
అని = ఆ ప్రకారంగా
ముందఱ = మొదటి
ధర్మనందనుని పిలిచి = ధర్మరాజును పిలిచి
యీవృక్షశాఖా గ్రంబున = ఈ చెట్టుకొమ్మకొనలో
ఉన్న = ఉండిన
పక్షిని = పక్షిని
ఇమ్ముగాన్ = తగిన విధంగా
ఈక్షించి = చూచి
మద్ + వచన = నామాట
అనంతర = తర్వాత
శరమోక్షణంబు = బాణాన్ని వదులుము
అనినన్ = అనగా
అతండును = ఆ ధర్మరాజును
వల్లె అని = సరే అని
గురువచనంబు = గురువుగారి వనిను
చేసి = సిద్ధము గావించి
ఉన్నాన్ = ఉండగా
ఆ+యుధిష్ఠిరునకున్ = ఆ ధర్మరాజుతో
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
ఇట్లు + అనియన్ = ఇట్లున్నాడు.
భావం :
ఆ కురుకుమారులు విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొనగోరి ఒకనాడు ద్రోణుడు భాసమనే పక్షిని రూపొందించి, ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి దానిని అందరికీ చూపి నేను చెప్పినప్పుడు, మీమీ ధనువులు ఎక్కుపెట్టి, ఆ పక్షితలను తెగకొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను అని, ముందుగా ధర్మరాజును పిలిచి ఈ చెట్టు కొమ్మ కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము అనగా అతడు సర్ అని గురువు మాట ప్రకారం సిద్ధంగా ఉండగా, ద్రోణుడు ఇట్లా అన్నాడు.
26వ పద్యం :
శే. వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము
బెల్లముగఁ జూచితే మహీవల్లభుండ!”
యనిన నిమ్ముగఁ జూచితి ననిన, వెండి
యును గురుఁడు ధర్మజున కిట్టు అనియెఁ బ్రీతి.
ప్రతిపదార్థం :
మహీవల్లభుండు = ఓ రాజా
వృక్షశాఖాగ్రమునన్ = చెట్టుకొమ్మ చివరన
పక్షి శిరము = పక్షి తల
తెల్లముగన్ = స్పష్టంగా
చూచితే = చూచావా
అనినన్ = అనగా
ఇమ్ముగాన్ = చక్కగా
వెండియును = మఱియును
గురుఁడు = ద్రోణుడు
ప్రీతిన్ = ప్రీతిలో
ఇట్టలు = ఇలా
అనియున్ = అన్నాడు.
తాత్పర్యం
ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా అని అడుగగా, చక్కగా చూచానని అతడు చెప్పగా, మరల ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు.
27వ పద్యం :
క. ‘జననుత! యా మ్రానిని న
న్నును మణి- నీ భ్రాతృవరులనుం జూచితే నీ?”
వనవుడుఁ జూచితి నన్నిటి
ననఘా! వృక్షమున సున్న యవ్విహగముతోన్.
ప్రతిపదార్థం :
జననుత = జనులచేత పొగడబడేవాడా ఓ ధర్మరాజా!
ఆ మ్రునిని = ఆ చెట్టును
పద్యభాగం 141-420
నన్నున్ = నన్ను
ముఱి = ఇంకా
నీ భ్రాతృనమున్ = నీ తమ్ములను
చూచితె = చూసావా
అనవుడు = అని అనగా
అనఘా = పాపంలేని వాడా! ఓ ద్రోణాచార్య !
వృక్షముననున్న = చెట్టుపైనున్నా
ఆ+విహంగములోన్ = ఆపక్షితో సహ
అన్నిటి = అన్నిటినీ
చూచితి = చూసాను
భావం :
జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆ మానును, నన్ను, నీ తమ్ముళ్ళను చూశావా? అని ద్రోణుడు అడుగగానే పుణాత్మ! చెట్టు మీదనున్న ఆ పక్షితో పాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు.
28వ పద్యం :
వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి ‘నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు
పాయు’ మని యివ్విధంబున దుర్యోధనాదులైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల
సహదేవులను నానాదేశాగతులైన రాజపుత్రులను గ్రమంబున నడిగిన వారలు
ధర్మనం దను చెప్పినట్ల చెప్పిన, నందఱనిందించి, పురందరనందనుంబిలిచి
వారినడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుండిట్లనియె.
ప్రతిపదార్థం :
అనినన్ = అనగా
విని = విని
పదరి = మందలించి
నీ దృష్టి = నీ చూపు
చెదరెన్ = చెదరింది
దీనిన్ = ఈ పక్షిని
ఏయన్ ఓపవు = కొట్టలేవు
పాయుము = తప్పుకో
ఈ + విధంబునన్ = ఈ రీతిగా
దుర్యోధనాదులు = దుర్యోధనుడు మొదలైనవారు
దార్తరాష్ట్రులను = ధృతరాష్ట్ర పుత్రులను
నానాదేశగతులైన = వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను
క్రమంబంనన్ = వరుసగా
అడిగినన్ = అడుగగా
వారలు = వాళ్ళు
ధర్మనందను చెప్పినట్లే = ధర్మరాజు చెప్పినట్లే
చెప్పినన్ = చెప్పగా
అందఱన్ = అందరినీ
నిందించి = మందలించి
పురందర నందనున్ = దేవేంద్రుని కుమారుడైన అర్జునుని
పిలిచి = చెంతకు పిలిచి
వారిన్ = వాళ్ళను
అడిగిన అట్లు = అడిగిన విధంగానే
అడిగినన్ = అడుగగా
ఆచార్యనకున్ = ద్రోణునకు
అర్జునుడు = అర్జునుడు
ఇట్లు + అనియె = ఇలా అన్నాడు.
భావం :
అనగా విని ద్రోణుడు ధర్మరాజును మందలించి నీ దృష్టి చెదిరింది, నీవుదానిని కొట్టలేవు. పక్కకు తప్పుకొమ్ము అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమునకుల, సహదేవులను వివిధ దేశాల నుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా వాళ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అందరినీ మందలించి తరువాత అర్జునుని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగగా అతడిట్లా అన్నాడు.
29వ పద్యం :
క. “పక్షిశిరంబు దిరంబుగ
నిక్షించితి; నొండు గాన నెద్దియు” ననినస్
లక్షించి యేయు మని సూ
కేక్షలు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్.
ప్రతిపదార్థం :
పక్షిశిరంబు = పక్షివలన
తిరంబుగన్ = చక్కగా
ఈక్షించితిన్ = చూచాను
ఒండు = ఇతరం
ఎద్దియున్ = ఏదీ కూడా
కానన్ = చూడటం లేదు
అనినన్ = అని తెల్పగా
లక్షించి = గురి పెట్టి
ఏయుము = కొట్టుము
అని = ఆ ప్రకారం
ద్రోణుండు = ద్రోణుడు
సూక్ష్మ + ఈక్షణున్ = సునిశిత దృష్టిగల
ఇంద్రతనూజున్ = అర్జునుని
పనిచెన్ = ఆజ్ఞాపించెను
భావం :
పక్షితలను చక్కగా చూచాను. ఇంకేదీ నాకు కనిపించడం లేదు అని అర్జుడు అనగా ద్రోణుడు గురిచూసి కొట్టుము అని సూక్ష్మదృష్టిగల అర్జునుని ఆజ్ఞాపించాడు.
30వ పద్యం :
క. గురువచనానంతరమున
నరుఁ డప్పుడు శరవిమోక్షణము సేయుఁడుఁ జె
చ్చెరం బక్షిశిరము దెగి త
రుహశాఖనుండి ధారుణిఁ బడియెన్.
ప్రతిపదార్థం :
గురువచన + అనందరములన్. = గురువు మాట తర్వాత
నరుఁడు = అర్జునుడు
శరమోక్షణము = బాణాన్ని విడవటం
చేయుఁడున్ = చేయగా
చెరన్ + చెరన్ = తత్క్షణమే
పక్షి శిరము = పక్షితల
తద్ + ధరుణీరూహశాఖ నుండి = ఆ చెట్టుకొమ్మ నుండి
ధారుణిన్ = భూమిమీద
పడియెన్ = పడింది
భావం :
గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్క్షణమే తెగి చెట్టుకొమ్మ నుండి నేలమీద పడింది.
31వ పద్యం :
ప. ఇట్లశ్రమంబునఁ గృత్రిమ పక్షితలఁ దెగనేసిన యర్జును నచలిత దృష్టికి
లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుందాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె;
నంత.
ప్రతిపదార్థం :
ఆశ్రమంబునన్ = సులువుగా
కృత్రిమ పక్షితలన్ = కల్పింపబడిన పక్షియొక్క తలను
తెగన్ ఏసిన = తెగునట్లు కొట్టిన
అర్జున = అర్జునుని యొక్క
అచలిత దృష్టికి = చెదిరిపోయిన దృష్టికి
లక్ష్యవేధిత్వంబునకున్ = గురిని కొట్టగలిగినందుకు
మెచ్చి = పొగిడి
ద్రోణుండు = ద్రోణాచార్యుడు
అతనికి = అర్జునునికి
ధనుర్వేద రహస్యంబులు = విలువిద్యలోని రహస్యాలు
ఉపదేశించెన్ = ఉపదేశించాడు.
అంతన్ = తర్వాత
భావం :
ఈ విధంగా సులువుగా ఆ కల్పిత పక్షి తలను తెగగొట్టిన అర్జునుని నిశ్చిలదృష్టికీ, గురిని కొట్టే సామర్ధ్యానికీ ద్రోణుడు మెచ్చి, అతనికి విలువిద్యా రహస్యాలు ఉపదేశించాడు. తరువాత
32వ పద్యం :
క. మానుగ రాజకుమారులు
తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థం మరిగి యందు మ
హా నియమస్థుఁడయి నీళ్ళనాడుచునున్నన్.
ప్రతిపదార్థం :
మానుగన్ = ఒప్పుగ
రాజకుమారులతోన్ = కురు రాకుమారులన
ఒక్కటన్ = ఒక్కటిగా
గంగాస్నాన+అర్థము = గంగానదిలో స్నానం చేయుటకు
అరిగి = వెళ్ళి
అందున్ = ఆ నదిలో
మహానియస్థుఁడు+అయి = గొప్ప నియమంగలిగినవాడై
నీళ్ళన్ ఆడుచున్ = నీళ్ళలో స్నానం చేస్తూ
ఉన్నాన్ = ఉండగా
భావం :
ఒకనాడు రాకుమారులందరితో కలిసి ద్రోణుడు గంగాస్నానం చేయటానికై వెళ్లి, ఎంతోనిష్ఠతో నీటిలో స్నానం చేస్తుండగా
33వ పద్యం :
క. వెఱచఱవ నీరిలో నా
క్కె నొక మొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు
చిఱుతొడ వడిఁ బట్టిఁ కొనియె శిష్యులు బెదరన్.
ప్రతిపదార్థం :
వెఱచఱవ = భయపడేటట్లుగా
నీరిలోన = నీరిలో
ఒక్కెఱగాన్ = భయంకరంగా
చూడ్కికిన్ = చూడటానికి
అగోచరము +ఐ = కనిపించనిదై
పఱతెంచి = వచ్చి
కుంభసంభవుడు = ద్రోణుడు
చిఱుతొడ = ద్రోణుని పిక్కను
శిష్యులుబెదరన్ = శిష్యులంతా బెదురునట్లు
వడిన్ = వేగంగా
పట్టుకొనియొక = పట్టుకొన్నది
భావం :
చూసేవారు భయపడేటట్లుగా నీటిలో భయంకరంగా ఒక మొసలి కంటికి కనపడకుండా వచ్చి శిష్యులంతా బెదిరేటట్లుగా ద్రోణుని పిక్కను వెంటనే పట్టుకుంది.
34వ పద్యం :
క. దాని విడిపింప ద్రోణుఁడు
దానపుడు సమర్థుఁడయ్యుఁ దడయక పనిచెన్
“దీని విడిపింపు” డని నృప
సూనులు శరసజ్యచాపశోభితకరులన్.
ప్రతిపదార్థం :
దానిన్ = ఆ మొసలిని
విడిపింపన్ = విడిపించటానికి
ద్రోణుకడు = ద్రోణాచార్యుడు
తాన్ = తాను
అపుడు = ఆ సమయంలో
సమర్థుఁడయ్యున్ = సమర్ధుడై ఉండికూడా
తడయక = ఆలస్యం చేయకుండా
దీనిన్ = ఈ మొసలిని
శర = బాణములు
సజ్య = అథ్లె త్రాళ్లుచే
చాప = కూడిన ధనస్సులలో
శోభితకరుల = ప్రకాశిస్తున్నా చేతులు కలవారిని
నృపసూనులన్ = రాజకుమారులను
పనిచెన్ = ఆజ్ఞాపించాడు.
భావం :
ఆ మొసలిని విడిపించటానికి ద్రోణుడపుడు తాను సమర్థుడై కూడా ఆలస్యం లేకుండా దీన్ని విడిపించండని ధనుర్భాణా చేత ధరించి ఉన్న రాకుమారులను ఆజ్ఞాపించాడు
35వ పద్యం :
తా. దానిష్ నేరక యందటున్ వివశులై తా రున్న, నన్నిరిలోం
గానంగాని శరీరముంగల మహోగ్ర గ్రాహమున్ గోత్ర బి.
సహనం నేను ధరంబులన్ విపుల రిజుండేసి శక్తిన్ మహా
సేన ప్రభ్యుఁడు ద్రోణుణంఘ విడిపించిన విక్రమం చొప్పఁగన్.
ప్రతిపదార్థం :
దానిన్ = ఆ మొసలిని విడిపించటం
నేరక = చేతకాక
అందయిన్ = అందరూ
వివశులు + ఐ = మైమరచిన వాళ్ళయి
తారు = తాము
ఉన్నాన్ = ఉండగా
ఆ + వీరిలోన్ = ఆ నీటిలో
కానన్ + కాని = చూడటానికి సాధ్యపడని
శరీరమున్ + కల = దేహం ఉండే
మహా + ఉగ్ర+గ్రాహమున్ = మిక్కిలి భయంకరమైన మొసలిని
విపులతేజుండు = ఎంతో పరాక్రమం కలవాడు.
శక్తి = బలంలో
మహాసేన ప్రఖ్యుడు = కుమారస్వామితో సమానుడు
గోత్రభిత్+సూనుండు = కొండలను చీల్చిన ఇంద్రుని కుమారుడు
ఏను = ఐదు
విక్రమంబు = పరాక్రమం
ఒప్పఁగన్ = ప్రకాశించేటట్లు
ద్రోణు జంఘన్ = ద్రోణాచార్యుని యొక్క పిక్కను విడిపించెను
భావం :
ఆ రాజకుమారులంతా మొసలిని విడిపించటం చేతకాక దిక్కు తెలియని స్థితిలో ఉండగా, మహాపరాక్రమశాలి శక్తిలో కుమారస్వామి, వంటివాడు పర్వతాలు రెక్కలు నరికిన దేవేంద్రుని పుత్రుడు అయిన అర్జునుడు, నీటిలో కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని అయిదు బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని విడిపించాడు.
36వ పద్యం :
…………………………………..
జూచి, ద్రోణుందర్లును ధనుః కౌశలంబునకుఁ దనయందని స్వేగ మారడు గుచ్చి,
దీనిచే ద్రుపమందు బంధుసహితంబు పడతుందగునని తన దిములు
సంతోషించి, దానికి అనేక దివ్యబాణంబు లిచ్చేను) ఎరుకు కొంద కనాంటి పరాక్రమ
గుణకంపదలు వైశంపాయనుందు జనను జయనమం జెప్ప
ప్రతిపదార్థం :
అ + మహా + ఉగ్ర = ఆ గొప్ప భయంకరమైన
గ్రాహంబు = మొసలి
పార్థ బాణ పంచక = అర్జునుని ఐదు బాణాలతో
విభిన్న దేహంబయి = చీల్చబడిన శరీరం కలదై
పంచత్వంబున = మరణాన్ని
పొందినన్ = పొందగా
చూచి = కనుగొని
ధనుస్+కౌశలంబునకున్ = విలువిద్యా నైపుణ్యానికి
తనయందు = తనపై గల
అతిస్నేహంబునకున్ = మిక్కిలి ప్రీతికి
మెచ్చి = పొగిడి
వీనిచే = వీనివల్ల
బంధుసహితంబు = బంధువులతో సహా
పరాజితుండు = ఓడగొట్టబడినవాడు
అగున్ = కాగలడు
మనంబున = మనసులో
వానికిన్ = అర్జునునకు
దివ్యబాణంబులు = దేవతాసంబంధమైన బాణాలు
ఇచ్చేన్ = ఇచ్చాడు.
కొండుకనాటి = అర్జునుని యొక్క చిన్ననాటి
పరాక్రమ గుణసంపదలు = పరాక్రమ గుణాల యొక్క గొప్పలు
వైశంపాయనకలు = వైశంపాయన మహర్షి
జనమేజయునకు = అర్జునుని మనమడికి చెప్పెను
భావం :
అతి భయంకరమైన మొసలి అర్జునుని అయిదు బాణాల చేత శరీరం చలీ మరణించింది. అది చూసి ద్రోణుడు అర్జునుని విలువిద్యా నైపుణ్యానికి, తనపట్ల గల ప్రేమకు మెచ్చి అతనిచేత ద్రుపదుడు బంధువులతో సహా ఓడిపోగలడని సంతోషించి అనేక దివ్యబాణాలు అతనికిచ్చాడు, అని అర్జునుని చిన్ననాటి పరాక్రమ గుణ విశేషాలు వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు.
విద్యాలక్ష్యం Summary in Telugu
కవి పరిచయం
నన్నయ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. ఉభయభాషా కావ్యరచనాభి శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకొనే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అను వాదం చేసాడు.
నన్నయ ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అంటూ సంస్కృత శ్లోకంతో మహా భారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విజ్ఞుడు, ఉద్దండపండితుడు అయిన నన్నయ మహాభారతంలో ఆది, సభా, అరణ్యపర్వంలోని నాల్గవ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు. వాటితోపాటు ఆంధ్ర శబ్దచింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు.
మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో నన్నయ భారతానువాదానికి ఉపక్రమించాడు. మహాభారతాన్ని చంపూ పద్ధతిలో అనువదించిన నన్నయ భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. నన్నయ తదనంతర కవులెందరికో మార్గదర్శకుడై “ఆదికవి” అనిపించుకున్నాడు.
రచనా విధానం
నన్నయ కథా నిర్వహణలో, భాషలో, శైలిలో, దృక్పథంలో మూలంలోకన్నా స్వతంత్రంగా వ్యవహరించాడు. మార్గ పద్ధతిలో సాగిన నన్నయ రచనలో అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే లక్షణాలు కనిపిస్తాయి. నన్నయ వచనం కూడా పద్యంలా సొగసుతో ప్రౌఢ సమాసాలతో రసభరితంగా సాగింది.
నన్నయభట్టు తెలుగులో భాషాసంస్కరణల్ని ప్రవేశపెట్టి ‘శబ్దశాసనుడు’గా పేరు గాంచాడు. వ్యాసభారతంలోని ధర్మాన్ని నన్నయ కావ్యశైలిలోకి మార్చి తెలుగు సాహిత్యంలో కావ్య రచనకు మార్గం సుగమం చేశాడు. ఆధ్యాత్మిక ధర్మప్రబోధం, లోకజ్ఞత, రాజనీతి, లౌకిక నీతులు, శాస్త్ర వైదుష్యం నన్నయ రచనలో గాఢంగా కనిపిస్తాయి.
ప్రస్తుత పాఠ్యభాగం ‘విద్యాలక్ష్యం’ నన్నయ భట్టు విరచితమైన ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ లోని ఆదిపర్వం, పంచమ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది.
పాఠ్యాంశ సందర్భం
భరద్వాజ మహర్షి పుత్రుడైన ద్రోణాచార్యుడు గొప్ప అస్త్రవిద్యా నిపుణుడు. కౌరవ పాండవులకు విలువిద్యను నేర్పడానికి భీష్ముడు ద్రోణాచార్యుడిని నియమించాడు. కురు పాండవులు ద్రోణాచార్యుని వద్ద గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నారు. ద్రోణాచార్యుడు తన అస్త్రవిద్యా నైపుణ్యాలను వేటినీ దాచుకోకుండా తన శిష్యులకు నేర్పించాడు.
అందులో తన ప్రియశిష్యుడైన అర్జునుడికి అనేక ధనుర్విద్యా రహస్యాలను బోధించాడు. గురుకులంలో శిక్షితులందరినీ పరీక్షించడానికి, వాళ్ళ నైపుణ్యం తెలుసుకొనేందుకు ఒక పరీక్షను ఏర్పాటు చేసాడు. గురువు పెట్టే పరీక్షలను అర్థం చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలను తెలుపుతుంది ఈ పాఠ్యాంశం.