TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 5th Lesson గుప్తుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సముద్రగుప్తుని సైనిక విజయాలను తెలపండి.
జవాబు.
గుప్త చక్రవర్తులలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు. సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” .ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
అవి:

  1. మొదటి ఆర్యావర్త విజయాలు
  2. దక్షిణభారత విజయాలు
  3. రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం ‘ మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సP రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు: 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు 11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.
ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 851లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 2.
గుప్తుల పరిపాలనా ముఖ్యాంశాలను వెలికితీయండి.
జవాబు.
భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం స్వర్ణయుగంగా భావించబడింది. గుప్తుల పాలనలో ప్రధానాంశాలు.

కేంద్రపాలన:
చక్రవర్తి: కేంద్రపాలనలో చక్రవర్తి అత్యున్నత అధికారి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. ‘అలహాబాద్ ప్రశస్తి’ సముద్రగుప్తుడిని దేవుడిగా వర్ణించింది. చక్రవర్తికి అపరిమిత అధికారాలున్నాయి. గవర్నర్లు, ఇతర పౌర అధికారులను అతనే నియమిస్తాడు. వారందరూ చక్రవర్తికి జవాబుదారీగా ఉండేవారు.

మంత్రులు: పాలనా వ్యవహారాలలో మంత్రుల కూటమి చక్రవర్తికి సహాయపడుతుంది. వీరిని ‘మంత్రులు’ లేదా ‘సచివులు’ అంటారు. మంత్రులు వారికి కేటాయించిన శాఖల బాధ్యతలు నిర్వర్తించేవారు.

ఇతర అధికారులు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పరగణాలకు, జిల్లాలకు ప్రత్యేక దూతల ద్వారా తెలిపే అధికారి సర్వాధ్యక్షుడు. సైన్యంపై అధికారాలను కలిగిన మంత్రి ‘మహాసేనాపతి’. మహాదండనాయకుడు, ప్రధాన న్యాయమూర్తి, విదేశీ వ్యవహారాలు, ‘మహాసంధి విగ్రహకుడు’ నిర్వహిస్తాడు. భాండాగారాధికృత అనే అధికారి ప్రభుత్వ ఖజానాధికారి. వీరేగాక ప్రతీహారులు, రాజసన్యాసులు, కుమారామాత్యుడు, ఇలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేవారు. రాష్ట్రపాలన: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్తులు తమ విశాలమైన రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్ర విభాగాలను ‘దేశ’ లేదా ‘భుక్తి’ అంటారు. ‘భుక్తి’ పాలకుడిని ఉపరికుడు అంటారు. యువరాజుకాని, రాజకుటుంబీకులు కాని ఉపరికులుగా నియమింపబడతారు. రాష్ట్రాలను మరల జిల్లాలుగా విభజించారు. వాటిని ‘? చూలు’ అంటారు. ‘విషయ’ పాలనాధికారిని ‘విషయపతి’ అంటారు. డా॥ ఎ.యస్. ఆల్టేకర్ చెప్పినట్లు ప్రభ వికేంద్రీకరించబడింది. చాలావరకు జిల్లా పాలనకు విధులు బదిలీ చేయబడ్డాయి.

పాలనాపరంగా ప్రాంతీయ పాలన: గుప్తుల కాలంలో ప్రాంతీయ పాలన రెండు రకాలుగా అభివృద్ధి చెందింది. 1. మునిసిపల్ లేదా నగర పాలన 2. గ్రామీణ పాలన. నేటి ప్రధాన నగరాలైన పాటలీపుత్ర, తక్షశిల, మండసార్, ఉజ్జయినిలలో నగర పాలన ఉండేది. నగరపాలనను విషయపతి నిర్వహిస్తాడు. ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రాథమిక విద్య మొదలైనవి ‘పరిషత్’ కున్న ప్రధాన విధులు.

గ్రామం పరిపాలనలో అతి చిన్న విభాగం. గ్రామ పాలనను నిర్వహించడానికి ‘గ్రామికుడు’లేదా గ్రామాధ్యక్షుడు నియమించబడ్డాడు. గ్రామ రక్షణ, శాంతిభద్రతలు ఇతడి ప్రధాన విధులు. గ్రామాధ్యక్షుడికి సహాయంగా ‘పంచ మండలం’ అనే సభ ఉంటుంది. గ్రామ పెద్దలతో ఈ సంఘం ఏర్పడుతుంది.

న్యాయపాలన: చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి. గ్రామస్థాయి నుంచి ఉన్నత న్యాయస్థానాల వరకు ఉండేవి. ` ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయకుడు అంటారు. ఫాహియాన్ రచనలలో న్యాయవ్యవస్థ వివరాలు ఉన్నాయి. నాడు చట్టాలు సరళంగా ఉండేవి. శిక్షలు కూడా సాధారణంగా ఉండేవి.

సైనికపాలన: గుప్త పాలకులకు బలమైన సైన్యం ఉండేది. గజబలం, అశ్వికబలం, కాల్బలం ఉండేవి. రథాలు కూడా ఉండేవి. ఎడారి ప్రాంతాల్లో ఒంటెలు కూడా వాడారు. సైన్యంలో ప్రధాన అధికారి ‘మహాసేనాధిపతి’, ‘రణభాండాగారాధికరణ’ సైనికులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసేవారు. అలహాబాద్ స్తంభ శాసనంలో వారు వాడిన ఆయుధాల వివరాలు తెలియజేయబడ్డాయి.

ప్రశ్న 3.
గుప్తులు సాహిత్యం, మతాభివృద్ధికి చేసిన సేవను వివరించండి.
జవాబు.
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు

  1. కాళిదాసు
  2. అమరసింహుడు
  3. శంకు
  4. ధన్వంతరి
  5. క్షపణికుడు
  6. బేతాళభట్టు
  7. ఘటకర్షకుడు
  8. వరరుచి
  9. వరాహమిహిరుడు.

కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి. బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్ధాంత’మనే గ్రంథాన్ని, వరాహ మిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మ గుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తుల కాలంవారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదాహరణకు దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాథ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 4.
హర్షవర్ధనుని అంచనా వేయండి.
జవాబు.
గుప్త సామ్రాజ్య పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. పాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వరాన్ని పాలించిన పుష్యభూతి వంశస్థులలో హర్షుడు ప్రముఖుడు. ఇతను క్రీ.శ. 606 – 647 వరకు రాజ్యపాలన చేస్తాడు. తన దండయాత్రలతో ఉత్తర భారత రాజకీయ ఏకీకరణ సాధించాడు.

చారిత్రక ఆధారాలు: బాణుడి హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సీ- యు- కి హర్షుని శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాల ద్వారా నాటి సాంఘిక పరిస్థితిని అంచనా వేయవచ్చు.

తొలి విజయాలు: తండ్రీ, సోదరుల మరణానంతరం క్రీ.శ. 606లో హర్షుడు తన పదహారవ ఏట రాజ్య సింహాసనాన్ని రాజపుత్ర’ అనే బిరుదుతో అధిష్టించాడు. సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతి భాస్కరవర్మతో మైత్రిని పొంది, తరువాత మాళవ, గౌడాధీశులను శిక్షించాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సోదరి రాజ్యశ్రీని కాపాడుకున్నాడు. కనోజ్ మంత్రివర్గ విన్నపం మేరకు స్థానేశ్వర, కనోజ్ రాజ్యాలను కలిపి ‘కనోజ్ రాజధానిగా పాలించాడు. “శీలాదిత్య” అనే బిరుదు ధరించాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు పరిపాలించాడు.

జైత్రయాత్రలు: హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకుని ఆరు సంవత్సరాల పాటు చేసిన దిగ్విజయ యాత్రలలో మాళవరాజ్యం, వల్లభి, వంగ, మగధ, గంజామ్ ప్రాంతాలను జయించాడు.

ఓటమి: హర్షుని జీవితంలో చూసిన ఏకైక ఓటమి రెండవ పులకేశి చేతిలో ఓటమి ఉత్తరాపథాన్ని జయించిన హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలనుకున్నాడు. కానీ పశ్చిమ చాళుక్యరాజైన రెండవ పులకేశి, హర్షుని నర్మదానదీ తీరంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మద రెండు రాజ్యాలకు సరిహద్దు అయిందని రెండవ పులకేశి ఐహోల్ శాసనం వలన తెలుస్తుంది. ఈ విధంగా హర్షవర్ధనుడు ఆర్యవర్తానికి చక్రవర్తిగా ఉన్నాడనీ ‘సకలోత్తరపధేశ్వరుని’గా ఐహోల్ శాసనం పేర్కొనటం వలన తెలుస్తుంది.
పాలన: హర్షుడు సమర్థుడైన పాలకుడు. ప్రజా సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరాలు అధికంగా ఉండేవని తెలుస్తుంది.

మహామోక్ష పరిషత్: దానధర్మాలలో అశోకునికి సాటిరాగల చక్రవర్తి. ప్రయాగలో మహామోక్ష పరిషత్ ఐదేండ్లకొకసారి జరిపి తన ఖజానాలోని సర్వాన్ని దానం చేసేవాడని, తాను ఆరవ మహామోక్ష పరిషత్కు హాజరయ్యానని హుయాన్త్సాంగ్ రాసుకున్నాడు. ఇందు మొదటిరోజు బుద్ధుని, రెండవరోజు సూర్యుని, మూడవరోజు శివుని పూజించి ఐదు లక్షల జనులకు దానధర్మాలు చేసాడు.

సారస్వత పోషణ: హర్షుడు నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసాడు. స్వయంగా కవి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలు రచించాడు. బాణుడు, భర్తృహరి, మయూమడు, మతంగ దివాకరుడు ఇతని ఆస్థాన కవులు, ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఆఖరు చక్రవర్తి హర్షుడు. ఇతడు బ: ముఖ ప్రజ్ఞాశాలి.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చంద్రగుప్తు విక్రమాదిత్యుని విజయాలపై ఒక లఘు వ్యాసం రాయండి.
జవాబు.
విక్రమాదిత్యునిగా పేరుగాంచిన రెండవ చంద్రగుప్తుడు దాదాపు 35 సంవత్సరాలు పరిపాలించాడు. శకులపై ఇతడు సాధించిన విజయం, ధృవాదేవి గౌరవాన్ని కాపాడటం అనేవి ఇతనికి వీరోచిత, ప్రసిద్ధఖ్యాతిని అందించాయి. విశాఖదత్తుడు రాసిన “దేవీచంద్రగుప్తుం” అనే నాటకంపై విషయాన్ని వివరించింది. ఇతడు శకులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు నాగవంశ కుటుంబానికి చెందిన కుబేరనాగను వివాహం చేసుకోగా ప్రభావతి గుప్తు అనే కూతురు పుట్టింది. ఈమెను వాకాటక రెండవ రుద్రసేనునికిచ్చి వివాహం చేయగా ఆ రాజ్యం కూడా గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. రెండవ చంద్రగుప్తుని పాలన కళా వైభవానికి, సాహిత్య పోషణకు ప్రసిద్ది చెందింది. చాలా ప్రసిద్ధి చెందిన కవి, నాటక రచయిత కాళిదాసు ఇతని ఆస్థానంలోనివాడే. ఈ కాలంలోనే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు.

ప్రశ్న 2.
గుప్త సామ్రాజ్యం పతనానికి గల కారణాలను పరీక్షించండి.
జవాబు.
పురుగుప్తుని కుమారుడైన బుధగుప్తుడు క్రీ.శ. 477లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 500 సంవత్సరంలో చనిపోయి ఉండవచ్చు. జయనాధుడు, మహారాజ లక్ష్మణుడు తదితర సామంతరాజులు చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. దక్షిణ ప్రాంతంలోని గుప్త సామ్రాజ్యాన్ని నరేంద్రసేనుని నాయకత్వంలోని వాకాటకులు ఆక్రమించారు. ఆ కాలంలో హూణుల దాడులు కూడా గుప్తు సామ్రాజ్య పతనానికి ఒక కారణం. ఈ కారణాలన్నింటివల్ల అతి పెద్దదైన గుప్త సామ్రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా, స్వతంత్ర ఉపరాజ్యాలుగా చీలిపోయింది. బుధగుప్తుని మరణానంతరం ‘ గుప్తవంశం పతనమైనందున అతని తరువాత వచ్చినటువంటి రాజుల పేర్లు నిర్దిష్టంగా తెలియరాలేదు. ఆ తరువాత తోరమానుని నాయకత్వంలో హూణులు పంజాబు, పశ్చిమ భారతదేశంలోని పెద్ద భూభాగాన్ని ఎరాన్ వరకు జయించారు. గుప్త పాలకులలో చివరివారు నరసింహగుప్తుడు, కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు. అయితే, ఆనాడు రాజ్యంలో వీరి అధికారం నామమాత్రంగానే ఉండేది.

ప్రశ్న 3.
గుప్తుల కాలంనాటి శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని విశ్లేషించండి.
జవాబు.
గుప్తుల కాలంలో భారతీయులు గణిత, ఖగోళ శాస్త్రాలలో అద్భుత ప్రగతిని సాధించారు. ప్రపంచం ఆశ్చర్యపోయే ఆవిష్కరణలు వచ్చాయి. ఈ యుగానికి చెందిన వారే ‘సున్నా’, ‘దశాంశ’ పద్ధతులకు రూపకల్పన చేశారు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు నాటి ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞులు, గణితశాస్త్ర పండితులు.

ఆర్యభట్టు: క్రీ.శ. 5 – 6 శతాబ్దాల మధ్య కాలంలో ఆర్యభట్టు ‘సూర్య సిద్ధాంతం’ సూర్య, చంద్ర గ్రహణాలు వివరిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట కనుగొన్న మేధావి అతడే. “ఆర్యభట్టీయం” అనే గ్రంథాన్ని రచించాడు. అందులో గణితశాస్త్ర అంశాలున్నాయి.

వరాహమిహిరుడు: ఇతడు బృహత్సంహిత గ్రంథం రాశాడు. అది ఖగోళశాస్త్ర గ్రంథం. భౌతిక భూగోళశాస్త్రం, వృక్షశాస్త్రం, సహజ చరిత్ర అండలో కలదు. పంచ సిద్ధాంతక బృహతాతక మొదలైన గ్రంథాలు రచించాడు. బ్రహ్మగుప్తుడు: క్రీ.శ. 6,7 శతాబ్దాలలోనే న్యూటన్ చెప్పిన అంశాలను చాలా ముందు కాలంలోనే తెలిపిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. ప్రకృతి సూత్రం ప్రకారం అన్ని వస్తువులు భూమిపైన పడాల్సిందే. బ్రహ్మస్ఫుట, సిద్ధాంత, ఖండఖండ్యక `అనే గ్రంథాలు రాశాడు.

ఇతర విజ్ఞాన శాస్త్రాలు: వరాహమిహిరుడు, పాదరసం, ఇనుము ఉపయోగించటం, వైద్యం కోసం లోహసంబంధ తయారీలు రసాయనశాస్త్ర వృద్ధిని సూచిస్తున్నాయి. ‘నవనీతకం’ అనే వైద్య గ్రంథంలో మందుల వివరాలు, వాటి తయారీ వివరించబడింది. పశువైద్యశాస్త్రానికి చెందిన ‘హస్తాయుర్వేద’ గ్రంథాన్ని రచించింది ‘పాలకాప్య’. చరకుడు, సుశ్రుతుడు ఈ కాలానికి చెందిన ప్రసిద్ధ వైద్యులు. ధన్వంతరి కూడా ఈ కాలానికి చెందినవాడే.

ప్రశ్న 4.
గుప్తులు కళలు, శిల్పకళా వైభవానికి చేసిన సేవకై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి:

  1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
  2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాథ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాథ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసుల చిత్రాలు అద్భుతమైనవి.
b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్లోని బుద్ధ విగ్రహం 72 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 5.
హర్షవర్థనుని పరిపాలనా విధానం గురించి రాయండి.
జవాబు.
పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలుగాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి – విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హరిసేనుని సేవ గురించి రాయండి.
జవాబు.
గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలలో ఒకటైన అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుని సర్వ సైన్యాధికారియైన హరిసేనుడు రచించాడు. ఇది సముద్రగుప్తుని సైనిక దండయాత్రలని, అతని విజయాలని, ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయ భౌగోళికతను తెలుపుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ శాసనం సంస్కృత భాషలో రచింపబడింది. హరిసేనుడు కవిగా కూడా గుర్తింపు పొందాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 2.
రామగుప్తునిపై ఒక లఘుటీక రాయండి.
జవాబు.
విశాఖదత్తుని దేవీచంద్రగుప్తుం అనే గ్రంథం సముద్రగుప్తుని మరణానంతర సంఘటనల్లో భాగంగా, శకరాజు దాడులకు భయపడిన రామగుప్తుడు తన పట్టపురాణియైన ధృవాదేవిని అప్పగించాలని భావించడంతో, సహించలేని సోదరుడు రెండవ చంద్రగుప్తుడు శకులను పారద్రోలి, అసమర్థుడైన రామగుప్తుని సంహరించి, రాణిని కాపాడుతాడు.

ప్రశ్న 3.
విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి ఆర్యభట్టు చేసిన సేవను పరీక్షించండి.
జవాబు.
విజ్ఞాన శాస్త్రాలు కూడా గుప్తుల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందాయి. ప్రసిద్ధిగాంచిన భారత ఖగోళ శాస్త్రవేత్తలైన ఆర్యభట్టు తన “ఆర్యభట్టీయం” అనే గ్రంథంలో గ్రీకులతో మనకు గల సంబంధాల వల్ల ఖగోళశాస్త్ర రంగంలో మనం సాధించిన అభివృద్ధిని గురించి వివరించాడు. ఇతడు ఖగోళ శాస్త్రాన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకొని వచ్చినవాడుగా గణతికెక్కాడు. ఇతడు గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు. భూమి తన అక్షంపై తిరగడం వల్ల భూమి నీడ చంద్రునిపై పడుతూందని, తత్ఫలితంగా గ్రహణం ఏర్పడుతుందని ఆర్యభట్టు అభిప్రాయపడ్డాడు. ఇతని సిద్ధాంతాలు శాస్త్రీయంగా ఉండి, మతాన్ని, సంప్రదాయాలను కలిపి ఆచరించే వారిని వ్యతిరేకించాయి. ఇంకా, ఇతడు గణితంలో దశాంశస్థాన విలువల పద్ధతిని కూడా ఆనాడే ఉపయోగించాడు.

ప్రశ్న 4.
ఫాహియాన్ గురించి రాయండి.
జవాబు.
చైనా యాత్రికుడైన ఫాహియాన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో, క్రీ.శ. 405 సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ఇతడు బౌద్ధ సన్యాసి, బుద్ధుని జన్మభూమి అయిన భారతదేశాన్ని సందర్శించాలనే ఉత్సాహం కలిగినవాడు. రెండవ చంద్రగుప్తుని పాలనా కాలంనాటి రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులను తన ‘ఫో-కు-వోకి’ అనే గ్రంథంలో వివరించాడు. గుప్తుల కాలంనాటి చరిత్రకు ఇది ప్రధాన ఆధార గ్రంథం.

ప్రశ్న 5.
అలహాబాద్ స్థంభ శాసన ముఖ్యాంశాలను తెల్పండి.
జవాబు.
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 6.
హూణుల దండ్రయాతను వర్ణించండి.
జవాబు.
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 7.
హర్షుని మహామోక్ష పరిషత్ను వర్ణించండి.
జవాబు.
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు -హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడు.

TS Inter 1st Year History Study Material Chapter 5 గుప్తుల యుగం

ప్రశ్న 8.
హుయానా త్సాంగ్ రచనలపై ఒక వివరణ ఇవ్వండి.
జవాబు.
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (క్రీ.శ. 630 – 644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వ విద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యు-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

Leave a Comment