Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 3rd Lesson ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 3rd Lesson ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదాన్ని వివరించండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన సాహితీ నీరాజనం అన్న వ్యాస సంకలనం లోనిది. ఇందులో ఆయన మానవతా వాదాన్ని గురించి చక్కగా వివరించారు.
మానవతావాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని, లక్ష్యంగా పెట్టుకుని ఒక మానవుడు తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనా రీతి. దీనిని మావనతా వాదం అనే కన్నా మానవతా దృక్పధం అనటం సబబని రవ్వాహరి అభిప్రాయం. ఈ మానవతా దృక్పధానికి మూలం ప్రేమ. మానవుడు తోటి మానవుని పట్ల ప్రేమ భావాన్ని స్నేహభావాన్ని చూపించగలిగితే సమాజం ఆనందమయం అవుతుంది.
ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి, మానవతా వాదానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో వేద వాఙ్మయం అతి ప్రాచీనమైంది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. దానిలోని ‘పదవ మండలంలో అన్నదాన మహాత్మ్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. ప్రాచీన సాహిత్యంలో కన్పించే అన్నదాన ఘట్టాలన్నీ మానవతా వాద ప్రతిపాదకాలే! ఆకలితో బాధపడేవానికి అన్నం పెట్టనివాడు చనిపోయన వానితో సమానుడుట.
వాల్మీకి రామాయణం ఆరంభమే మానవతావాదంతో ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్ఠాం….” అన్న ఆది కావ్యా రామాయణ వాక్యాలు పరమ కారుణ్య భావానికి ప్రతీకలు. ప్రేమ భావాన్ని దయాభావాన్ని మానవులపైనే కాక సకల జీవరాశిపై చూపించాలన్నది నిజమైన మానవతావాదం. బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని భాణంతో కొట్టాడు. ఆడపక్షి దుఃఖం – వాల్మీకిని కదిలించిందట. ఇది అసలైన కారుణ్యభావం కదా!-
ఇక ‘మహాభారతంలో ఉన్నదే మరొక చోట కూడా ఉంటుంది. మహాభారతంలో లేనిది మరెక్కగా ఉండదు. ధర్మప్రతిపాదన మహాభారత లక్షణం. దధీచి, శిబి, రంతి దేవుని కథలు మానవతా వాదానికి మచ్చుతునకలు. రంతిదేవుడు నోట వ్యాసుడు “న త్వహం కామయే రాజ్యం…” అన్న శ్లోకం ద్వారా” నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలే వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే కావాలంటాడు. దీనికి మించిన మానవతా వాదం ఇంకా ఎక్కడున్నది.
ఇక దానాలన్నింటిలో అన్నదానం గొప్పదంటారు. ఎందుకంటే అది క్షుద్బాధను తీరుస్తుంది కాబట్టి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఉ దాసీనంగా పట్టనట్లుగా ఉంటే అది మానవత్వం అన్పించుకోదు. ప్రాచీన సాహిత్యమంతటిలో దానమైన నిత్యం చేస్తే అది మానన్తవం అనిపించుకుంటుంని చెప్పబడింది.
భాగవతంలోని సప్తమ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను వ్యాసులవారు వివరించారు. ఏ మానవునికైనా తన కడుపునింపుకునే ధనం మీద మాత్రమే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే అది పాపమే అవుతుంది అన్నాడు. చరకుడు తన చరకసంహితలో సమస్త ప్రాణుల సంతోషాన్ని కోరుకున్నాడు. అష్టాంగ హృదయంలో ‘బాల వృద్ధేభ్యః అన్నమదత్వాన భుజంతీ” అని చెప్పబడింది. అంటే బాలలకు వృద్ధులకు అన్నంపెట్టిన తరువాతే మనం భుజించాలని అర్థం.
మానవులందరూ సుఖంగా ఉండాలి. సర్వజీవులు ఆనందంగా జీవించాలని అన్నది మన ప్రాచీనుల ఆదర్శమని రవ్వాశ్రీహరి పేర్కొన్నారు.
ప్రశ్న 2.
వ్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావాలను తెలపండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదము అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన “సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావం చక్కగా వివరించబడింది.
జీవ కారుణ్యం అంటే సృష్టిలోని సకల జీవులపట్ల కరుణ, జాలి కలిగి ఉండటం. ఋగ్వేదంలో అన్నదానం గురించి వివరిస్తూ ఆకలితో బాధపడేవారికి అన్నం పెట్టనివాడు మృత ప్రాయుడని చెప్పబడింది. రామాయణ రచన జీవకారుణ్యాన్ని చెప్పడంతోనే ప్రారంభమయింది. “మానిషాద ప్రతిష్టాం”… అన్న శ్లోకం జీవకారుణ్యాన్ని చూపమనిచెప్పింది.
కఠిన మనస్సుగల బోయవాడు సుఖంగా కలిసి ఉన్న క్రౌంచ పక్షులలో మగపక్షిని కొట్టాడు. ఆడపక్షి కరుణ స్వరాన్ని విన్న వాల్మీకి మనసులో కారుణ్యం చోటు చేసుకుంది. ప్రేమ భావాన్ని కరుణ భావాన్ని మానవులపైనే గాక పశుపక్ష్యాదులపైన కూడా చూపించడం భారతీయ సంస్కృతిలో కన్పించే ముఖ్యలక్షణం. దీనినే ప్రాచీన కావ్యాలు కూడా ప్రభోదించాయి. “ఆత్మవత్ సతతం పశ్యేదపికీటపిపీలికామ్” అంటే చీమ మొదలైన కీటకాలను కూడా తమలానే భావించాలి అని అష్టాంగ హృదయం చెప్తుంది.
మహాభారతంలోని దధీచి, శిబి, రంతి దేవుడు మొదలుగు కథలలో జీవకారుణ్యం గురించి వివరించబడింది. రంతిదేవుని కథలో “నత్వహంకామయే రాజ్యం….” అన్న శ్లోకంలో వ్యాసుడు రంతిదేవుని మనసులో ఉన్న జీవకారుణ్యాన్ని వివరించాడు. “నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం అసలు వద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగటమే నాకు కావాలి” అంటాడు. దీనికి మించిన జీవకారుణ్యం ఏముంటుంది. ఇలా ప్రాచీనమైన ప్రతి కావ్యంలో కూడా జీవ కారుణ్యాన్ని కవులు తెలియచేశారు.
II. సంగ్రహ రూప ప్రశ్నలు సమాధానాలు
ప్రశ్న 1.
అన్నదాన ప్రాముఖ్యతను తెలియచేయండి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. ఇందులో అన్నదాన మహిమను వర్ణించారు.
దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పది. అది మానవుల ఆకలి బాధను తీరుస్తుంది. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తూంటే చూసి చూడ నట్లుండటం. 1212 ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం మానవత్వం కాదు అని మన ప్రాచీన గ్రంథాలలో వివరించబడింది. తైత్తిరీయ ఉపనిషత్తులో, అన్నాన్ని ఎక్కువగా వండాలని ఆకలితో అలమటించే దీనులకు అన్నం పెట్టాలని అలా పెట్టనివాడు నరకానికి పోతాడని వివరించబడింది. అలా అన్నార్తులకు అన్నం పెట్టనివాడు కేవలం పాపాన్నే భుజిస్తాడని చెప్పింది.
ఎవరు తనకోసం మాత్రమే వండుకుంటాడో అంటే ఎవరు అన్నార్తుల బాధను పట్టించుకోకుండా తన పొట్టమాత్రమే చూసుకుంటాడో వాడు నరకాన్ని పొందుతాడని పాపాన్ని ప్రోగుచేసుకుంటాడని స్మృతులు వివరించాయి. భాగవతంలో కూడా గృహస్థ ధర్మాన్ని వివరిస్తూ తన కడుపు నింపుకోవడానికి అవసరమైన ధనం మీదే మానవునకు అధికారం ఉంటుంది. మిగిలినది అన్నార్తులకు వినియోగించాలని చెప్పింది. ఇలా అన్నదాన ప్రాముఖ్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు వివరించాయి.
ప్రశ్న 2.
అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ‘అన్నపాఠభాగ్యం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.
దుఃఖితులపట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త చక్కగా వివరించాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో న్నవాణ్ణి వారి వారి శక్తిని బట్టి ఆదుకోవాలని అష్టాంగ హృదయం చెప్తుంది. మానవుని సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకుని ఏ జీవనాధారం లేని వారికి వ్యాధిగ్రస్తులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అదే మనవత్వం అనిపించుకుంటుందని అష్టాంగ హృదయంబోధించింది.
ప్రశ్న 3.
రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించిన ధర్మం ఏమిటి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా వాదం అన్న ‘పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అను వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించే అంశాలు కోకొల్లలు. వేదముల నుండి పురాణాల వరకు అన్నింటిలోనూ ఈ ప్రస్తావన ఉంది. మహాభారతం లో దధీచి, శిబి, రంతిదేవుని పాత్రల ద్వారా ఈ విషయాన్ని వ్యాసుల వారు వివ రించారు. మానవతావాది, త్యాగశీలి, దయాశీలి రంతిదేవుని మాటల్లో
“నత్వహం కామయే రాజ్యం”…..
అన్న శ్లోకం ద్వారా “నాకు రాజ్యము వద్దు, నాకు స్వర్గమూ వద్దు, నాకు మోక్షము వద్దు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగి పోవటమేకావాలి” అని చెప్పబడింది. భాగవతంలో కూడా “న కామయే హం గతి మీశ్వరాత్…..” అన్న శ్లోకంలో కూడా దుఃఖపీడితుల హృదయాల్లో తానుడంటూ వాళ్ళ బాధలను తాను అనుభవించైనా వారి దుఃఖాలను పోగొట్టాలి అని రంతిదేవుడు చెప్పిన మాటలు నిజంగా మానవతకు సంబంధించినది.
ప్రశ్న 4.
పురాణాలు ఎవరిపైన దయచూపాలని చెప్పాయి?
జవాబు:
ప్రాచీన సాహిత్యంలో మానవతా విలువలు’ అను పాఠ్యభాగం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంపుటి నుండి గ్రహించ బడింది. దీనిలో మానవతా వాదం ప్రాచీన సాహిత్యంలో ఎలా వివరించబడిందో రవ్వావారు వివరించారు.
మన పురాణాలు వట్టి పురాణాలు కావు. వాటిలో మానవులందరూ సుఖంగా ండాలి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ప్రగతిని సాధించాలి. ఏ ఒక్కరూ దుఃఖంతో జీవించరాదు అని వివరించాయి. కేవలం మానవులందేకాకుండా పశుపక్ష్యాదులపైన కూడా దయ, జాలి కరుణలను చూపించాలని ప్రబోధించాయి.
క్రిమికీటకాదులు పైన, పశు పక్ష్యాదులపైన, ఏ కులం వారిపై నైనా, పతితుతలపైన వర్ణసాంకర్యం గల వారిపైన దయాగుణాన్ని చూపాలని పురాణాలు వివరించాయి. చివరికి తృణ వృక్షాదులను కూడా జీవంగల వానిగా భావించి వాటికి ఏ విధమైన హానిని కలిగించకుండా కాపాడుకోవాలని మన పురాణాలు వివరించాయి.
III. ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులెవరు?
జవాబు:
ఆచార్య రవ్వా శ్రీహరి తల్లిదండ్రులు వెంటకనరసమ్మ, నరసయ్యలు.
ప్రశ్న 2.
ఆచార్య రవ్వా శ్రీహరి రచనలు తెలియచేయండి?
జవాబు:
తెలుగు కవుల సంస్కృతానుకరణలు, తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు, అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలను రచించారు.
ప్రశ్న 3.
ఆచార్య రవ్వాశ్రీహరి సంస్కృతానువాద రచనలేవి?
జవాబు:
డా. సి. నారాయణరెడ్డి ప్రపంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి, వేమన శతకం, నృసింహ శతకాలు శ్రీహరి సంస్కృతాలనువాదాలు
ప్రశ్న 4.
ఆచార్య రవ్వాశ్రీహరికి ‘మహా మహాపాధ్యాయ’ బిరుదును ప్రదానం చేసిన సంస్థ ఏది ?
జవాబు: తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం వీరికి ‘మహా మహెూపాధ్యాయ బిరుదును ఇచ్చింది.
ప్రశ్న 5.
మానవతా దృక్పధానికి మూలమేమి?
జవాబు:
మానవతా దృక్పధానికి మూలం ‘ప్రేమ’
ప్రశ్న 6.
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యమేది?
జవాబు:
సంస్కృత సాహిత్యంలో ఆదికావ్యం వాల్మీకి రచించిన ‘రామాయణం’.
ప్రశ్న 7.
ధర్మసింధువు ఏమని ప్రబోధిస్తుంది?
జవాబు:
బాలురకు వృద్ధులకు అన్నంపెట్టందే భుజింపరాదని ప్రబోధిస్తుంది.
ప్రశ్న 8.
చరక సంహితలో చరకాచార్యుడు ఏమని శాసించాడు?
జవాబు:
మానవుడు నిత్యమూ సమస్త ప్రాణుల కళ్యానాన్ని కోరుకోవాలని శాసించాడు.
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం Summary in Telugu
రచయిత పరిచయం
రచయిత : రవ్వా శ్రీహరి (ఆచార్యలు)
పుట్టిన తేదీ : మే 5, 1943
పుట్టిన ఊర : నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామం
తల్లిదండ్రులు : వేంకట నరసమ్మ, నరసయ్యలు
విద్యాభ్యాసం :
- శ్రీహరి వేదాంత వర్థిని సంస్కృత కళాశాలలో బి.ఓ.ఎల్
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు, సంస్కృతం, (సంస్కృతంలో బంగారు పతకం సాధించారు)
పరిశోధనలు : భాస్కర రామాయణం, విమర్శనాత్మక పరిశీలన, పి.హెచ్.డి చేశారు
ఉద్యోగం :
- ఉస్మానియా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా
- ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.
రచనలు :
- తెలుగు కవుల సంస్కృతాను – కరణములు
- సంకేత పదకోశం
- తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు
- తెలుగులో అలబ్ద వాఙ్మయం
- ఉభయ భారతి
- సంస్కృత వైజయంతి
- సంస్కృత సూక్తి రత్నావళి
- అన్నమయ్య భాషా వైభవం వంటి 40 గ్రంథాలు ప్రచురించారు.
- డా. సి. నారాయణరెడ్డి పంచపదులు, జాషువా, గబ్బిలం, పిరదౌసి వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతంలోకి అనువదించారు.
- సూర్యరాయాంధ్ర నిఘంటువులోలేని 35వేల కొత్త పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువును తయారుచేశారు.
- సంస్కృత, వ్యాకరణ గ్రంథం పాణినీయ అష్టాధ్యాయినిని రెండు భాగాలుగా తెలుగులోనికి అనువదించాడు.
అవార్డులు :
- తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం మహా మహెూపాధ్యాయ బిరుదునిచ్చింది.
- తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సంస్కృత పండిత బిరుదు
- ప్రపంచ పదీయ సంస్కృత అనువాదానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం
- గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణకంకణం
- పరవస్తు చిన్నయసూరి జాతీయ పురస్కారం
- తెలంగాణా ఎస్.ఆర్.పి చే జీవన సాఫల్య పురస్కారం
మహా మహెూపాధ్యాయ రవ్వా శ్రీహరి దక్షిణ భారతంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు పొందారు. వీరు మే 5 1943న నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెల్దుర్తి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ, సరసయ్యలు. ఎం.ఏ. తెలుగు, ఎం. ఏ సంస్కృతం. సంస్కృతంలో బంగారు పతకాన్ని పొందారు.
“భాస్కర రామాయణం- విమర్శనాత్మక పరిశీలన” అన్న అంశంపై పరిశోధన చేశారు. ఉస్మానియా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యునిగా పని చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించారు.
రచనలు
తెలుగు కవుల సంస్కృతానుకరణలు, సంకేత పదకోశం, తెలంగాణ మాండలికాలు, కావ్యప్రయోగాలు, తెలుగులో అబద్దవాఙ్మయం, ఉభయ భారతి, సంస్కృత వైజయంతి, సంస్కృత సూక్తి రత్నాకరం, అన్నమయ్య భాషా వైభవం, వంటి 40 గ్రంథాలను వెలువరించారు.
డా.సి.నారాయణరెడ్డి పంచపదులు, జాషువా గబ్బిలం, ఫిరదౌసి కావ్యాలను, వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతం లోకి అనువదించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేని 35 వేల కొత్త పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువును వెలువరించారు. సంస్కృత వ్యాకరణ గ్రంథం పాణినీయం అష్టాధ్యాయినిని రెండు భాగాలు తెలుగునకు అనువాదంచేశారు. వీరు రచించిన సంకేత పదకోశం ఉపయుక్త గ్రంథం.
అవార్డులు – బిరుదులు – పురస్కారాలు
రవ్వా శ్రీహరి గార్కి తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం మహా మహోూపాధ్యాయ బిరుదునిచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సంస్కృత పండితునిగా పురస్కారం అందించింది.
ప్రపంచ పదీ సంస్కృత అనువాదానికి కేంద్ర ‘సాహిత్య అకాడమీ పురస్కారం 2001 లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణకంకణ పురస్కారం, పరవస్తు చిన్నయసూరి జాతీయ పురస్కారం, తెలంగాణ ఎన్.ఆర్.ఐ అసోషియేషన్ జీవన సాఫల్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గురజాడ ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు.
ప్రస్తుత పాఠ్యభాగం శ్రీహరి గారు రచించిన “సాహితీ నీరాజనం” అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది.
పాఠ్యభాగ సందర్భం
ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలెన్నో ఉన్నాయి. ప్రాచీన రచయితలు కవులు జీవితంలో ఆచరించదగిన మానవీయ విలువలను సందర్భాను సారంగా వివరించారు. ఆకలిచే అలమటించే దీనులను, బాలలను, వృద్ధులను, రోగులను, పశుపక్ష్యాదులను ఆదరించాలని తెలిపారు.
సంపద కొంత మందికే కాకుండా అందరికి అందాలని చెప్పారు. రాజ్యం, మోక్షం, స్వర్గాలకంటే దుఃఖితులకు దుఃఖాన్ని పోగొట్టటం ముఖ్యమన్నారు. వ్యక్తిత్వ వికాసాన్ని విద్యార్థులకు బోధించుటకు ఈ పాఠ్యభాగం ఇవ్వబడింది.
పాఠ్యాభాగ సారాంశం
మానవతా వాదం అంటే మానవ సంక్షేమాన్ని, మానవ ప్రగతిని లక్ష్యంగా చేసుకుని తోటి మానవుని గురించి శుభకామనతో చేసే ఆలోచనగా చెప్పవచ్చు. దీనిని మానవతావాదం అనటం కన్నా మానవతా దృక్పథం అనటం సరైనది. దీనికి మూలం ప్రేమ, మానవుడు తోటి మానువునిపై ప్రేమ, కరుణ, సౌహార్థాలను చూపిస్తూ ఉండాలి.
సంస్కృతంలో వేదవాఙ్మయం అతి ప్రాచీనమైనది. ఆ వేదాలలో ఋగ్వేదం మొదటిది. ఋగ్వేదంలోని 10వ మండలంలో అన్నదాన మహాత్మ్యం చెప్పబడింది. ఆకలితో బాధపడే వానికి అన్నంపెట్టనివాడు మృతి చెందిన వానితో సమానమని అలాంటి వారికి అన్నదానం చేస్తే పుణ్యలోకాలను పొందుతాడని ఆ సూక్త తాత్పర్యం. ఇది మానవతా లక్షణం.
వాల్మీకి రామాయణంలో జీవకారుణ్య భావం మనకు కన్పిస్తుంది.
“మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః యత్రాంచ మిథునా దీక్ష మవధీః కామమోహితం” ఇందులో కఠినాత్ముడైన బోయవాడు సరసల్లాపాలు ఆడుకుంటున్న క్రౌంచ పక్షులలో ఒకదానిని కొట్టాడు. మరొక పక్షి దుఃఖం ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి హృదయం ద్రవించింది. ఈ ఘట్టం జీవకారుణ్యాన్ని తెలియచేస్తుంది. అలాగే అష్టాంగ హృదయంలో “ఆత్మవత్సతతం పశ్యేదపి కీటపిపీలికామ్” సృష్టిలో ఉన్న పిపీలికాది జీవరాశులను మనవలెనే భావించాలని దీని భావం.
“వృద్ధబాల వాధితక్షీణాన్ పుశూన్ బాంధవానివపోషయేత్” అన్నది నీతి వాక్యం. వృద్ధులను, బాలలను, రోగ పీడితులను, పశుపక్ష్యాదులను ఆదరణతో చూడాలి అని నీతి -వాక్యాలు చెపుతున్నాయి.
ఇక మహాభారతంలో చెప్పని విషయాలుంటూ ఏమీ లేవు. మానవతా దృక్పధం కల అంశాలు అడుగడుగునా కన్పిస్తాయి. దదీచి, శిబి, రంటిదేవుడు వంటి వారి కథలు త్యాగానికి మానవత్వానికి దయకు నిదర్శనాలుగా నిలుస్తాయి.
“నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవమ్
కామయే దుఃఖతప్తానాం ప్రాణినా మూర్తినాశనమ్”
నాకు రాజ్యము వద్దు, స్వర్గమూ వద్దూ, మోక్షము అసలేవద్దు. దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తిని తొలగించటమే నాకు కావాలని ఇందలి భావం. దీనిలో ఎంతటి మానవతా దృక్పథం దాగి ఉందో చూడండి. రంతిదేవుని కథాఘట్టంలో కూడా ఇదే చెప్పబడింది.
“నకామయేల హం గతి మీశ్వరాత్ పరాం
అష్టయుక్తా మపునర్భవం నా
ఆర్తిం ప్రపద్యే ఖిల దేహబాజం
అంతఃస్థితో యేన భవంత్యుడుఃఖాః ”
దానాలన్నింటిలో అన్నదానం గొప్పదని సకల శాస్త్రాలు చెప్తున్నాయి. తాను కడుపునిండా తింటూ కొందరు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూసి చూడనట్లుండటం మానవత్వం అనిపించుకోదు. ఏ దానమైన ఒక్కసారి చేయటం కాకుండా నిత్యం చేస్తూనే ఉండాలట
“అదత్వా యత్కించిదపి న నయే ద్దివీసం బుధః”
శుక్రనీతిలో చెప్పబడిన ఈ శ్లోకానికి తెలివిగలవారు రోజూ ఏదో ఒక దానం చేస్తూనే ఉండాలట.
“అహన్వహ జాతవ్యం అదీ నేనాంతదాత్మనా”
ప్రతిరోజూ ఆనందంగా ఏదో ఒకటి దానం చేయాలి. ఇది మానవతావాదం.
భాగవతంలో గృహస్థ ధర్మాలను వివరించే ఘట్టంలో ధర్మాన్ని గురించి వివరించాడు. ప్రాచీనుల ఆలోచనలలో మానవులందరూ సుఖంగా ఉండాలి. వారితో పాటు సకల జీవరాశులు సుఖంగా ఉండాలని భావించారు. ఇక ధర్మసింధువులో బాలురకు, వృద్ధులకు పెట్టిన తరువాతే ఇతరులు భోజనం చేయాలని చెప్పబడింది.
సంస్కృత నాటక కర్తల్లో భవభూతి ఎంతో మానవతా దృక్పథం కలవాడుగా కన్పిస్తాడు. సీతను అడవులకు పంపేటప్పుడు శంబూకుని సంహరించేటప్పుడు రాముడు పశ్చాత్తాపం చెందినట్లు వర్ణించాడు. వేదవ్యాసుడు “ఊర్థ్యబాహుర్విరామ్యేష న చ కశ్చిచ్చణోతిమాన్” గొంతెత్తి గట్టిగా ధర్మాన్ని గురించి ఎంత చెప్పినా వినేవాడు ఒక్కడే లేడని అనడం శోచనీయం.
కఠిన పదాలకు అర్థాలు
అలమటించు = బాధపడు
హితం = మేలు
హితవు = మంచిమాట
సమున్నత = గొప్పవైన
ప్రగతి = అభివృద్ధి
శుభకామన = మంచి ఆలోచన
మృతప్రాయుడు = మరణించిన వానితో సమానుడు
క్షుధార్తి = ఆకలిబాధ
ఆవిర్భావం = పుట్టుక
ద్రవించిపోవు = కరిగిపోవు
ప్రశంసించు = మెచ్చుకొను
దృష్టాంతం = ఉదాహరణ
ఘట్టము = సందర్భము
అధ్యయనం చేయు = చదువు
అలమటించు = బాధపడు
ఆర్తులు = బాధతో ఉన్నవార
కాంక్ష = కోరిక