Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు Textbook Questions and Answers.
TS Inter 1st Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు : జవాబులు
ప్రశ్న 1.
ఉర్దూ నుంచి తెలుగులోకి చేరినప్పుడు పదాలలో జరిగిల మార్పును వివరించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివ చే రచించ బడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం”, రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగులో ఉ ర్దూ పదాల మూలాలను చక్కగా వివరించారు.
ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు, పారసీ, అరబ్బీ, తర్కీ శబ్దాల కలగాపులగం ఉర్దూ భాష. దీనిని ఇది మన దేశంలో 14వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది. దీనిని తొలుత హిందుయి జబానే హిందూస్థాన్ అన్న పేర్లతో పిలువబడింది. 18వ శతాబ్దానికి కాని అది ఉర్దూ అని పిలువబడలేదు.
తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు యథాతదంగానే చేరాయి. కమలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము రోజు, కూలీ, బాకీ, బజారు, దుకాణం మొదలగు పదాలు ఇందుకు ఉదాహరణము. హలంతమైన ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు ఆ పదాలు అజంతమవటం సహజం. ఉదాహరణకు కలమ్-కలము అయింది. జమీందార్ – జమీందారు అయింది. బజార్- బజారు అయింది.
కొన్ని పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చేటప్పుడు తమ రూపాన్ని మార్చు. కున్నాయి. ఉదాహరణకు బాఖీ అనే ఉర్దూ పదం తెలుగులో బాకీ అయింది. అలాగే ‘నఖద్’ నగదుగా మారింది.
ఉర్దూపదం – తెలుగు పదం
ఉదార్ – ఉద్దర
సొహబత్ – సొబతి
మస్జిద్ – మసీదు
కుర్చీ= కుర్చీ
ఘిలాప్ – గలిబు/గలేబు
జుర్మానా – జుర్మానా
నక్స్ – నగిషీ
అబ్రూ – ఆబోరు
ఇలా ఉర్దూపదాలు తెలుగులో మార్పుచెందాయి.
కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి వచ్చి అర్థాన్ని కూడా మార్చుకున్నాయి. ఉదాహరణకు ‘ముదామ్’ అనే పారసీ పదానికి ‘ఎల్లప్పుడూ అనే అర్థం ఉంది. ఇది తెలుగులో ‘ముద్దాముగా’ మారి ‘ప్రత్యేకించి’ అనే అర్థంలో వాడబడుతుంది. ఇలా పలు మార్పులతో అనేక పదాలు ఉర్దూ నుండి తెలుగు భాషలోకి ప్రవేశించాయి.
ప్రశ్న 2.
భాషల మధ్య జరిగే ఆధానప్రదానాలను చర్చించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన “వ్యాసగుళు చ్ఛం” రెండవ భాగం నుండి గ్రహంచ బడింది. ఇందులో భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజంగానే జరుగుతాయని సదాశివ వివరించారు.
ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్తేమీకాదు. పలు భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసి మెలసి ఉన్నప్పుడు భాషలలో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతుంటాయి. ఒక భాషా పదాన్ని వేరొక భాష స్వీకరించేటప్పుడు ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని చేర్చి ఆ భాషా పదాన్ని మరొక భాషాపదం స్వీకరిస్తుంది. ఒక్కొక్కసారి యథాతదంగాను లేదా ఒక అక్షరాన్ని చేర్చి, ఒక అక్షరాన్ని తీసేసి, లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించటం జరుగుతుంది.
స్వీకరించిన భాష తాను స్వీకరించిన మూల భాషా పద అర్థాన్నే స్వీకరిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరే భాషా పదాన్ని స్వీకరించిన భాష మూల భాష యొక్క అర్థాన్ని కాక కొత్త అర్థంలో కూడ స్వీకరించడం జరుగుతుంది. ఇలా భారతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఆంగ్లభాషా ప్రభావం కూడా! అన్య భాషా పదాలను స్వీకరించడంలో వర్ణాగమ, వర్ణాలోప, వర్ణవ్యత్యయాల ద్వారా ఆదాన ప్రదానాలు జరుగుతుంటాయి.
ఉదాహరణకు :-
లార్డ్ అనే ఆంగ్లపదం ఉర్దూలోకి ‘లాట్సాహెబ్’గా మారటం. ఫిలాసఫీ అనే ఆంగ్లపదం ఫల్సఫాగా ఉర్దూలోకి రావటం సొహబత్ అనే ఉర్దూపదం తెలుగులో ‘సోబతి’ అవటం. ఉర్దూలో ఆబ్రూ అనే పదం తెలుగులో ఆబోరుగా మారటం వర్ణలోప వర్ణాగమ. వర్ణవ్యత్యయాలకు ఉదాహరణులుగా చెప్పవచ్చు.
II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
ఉర్దూ వానా పదాన్ని వివరించండి?
జవాబు:
తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడినది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాసగుళు చ్ఛం’, రెండవ భాగం నుండి గ్రహించబడింది.
మన దేశంలోని భాషలన్నింటిపై సంస్కృత భాషా ప్రభావం ఎలా ఉందో అలాగే ఆంగ్లభాషా ప్రభావం ఉర్దూ భాషపై ఉంది. ఉర్దూ భాషా శాస్త్రవేత్తలు, ‘ఉర్దువానా’ అనే పదాన్ని తరుచుగా వాడుతుంటారు. ఉర్దూ, పండితులు పలు ఆంగ్లపదాలను పద బంధాలను ఉర్దూలోకి అనువదించుకున్నారు. అవిగాక ఒక భాష అన్యభాషా పదాలను స్వీకరించే వర్ణాగమ, వర్ణలోప వర్ణవ్యత్యయ పద్దతులలో ఎన్నో ఆంగ్లపదాలను ఉర్దూభాషలోకి మార్చుకున్నారు. ఆభాషా రూపమే ‘ఉర్దూవానా’.
ఉదా : లార్డ్ అనే ఆంగ్లపదం లాట్ సాహెబ్ ను
కమాండ్ అనే ఆంగ్లపదం కమాన్ ను
ఫిలాసఫీ అనే పదం ఫల్సపా గాను
ఇలా పలు ఆంగ్లపదాలు ఉర్దూలోకి వచ్చాయి. ఆ పదాల సమూహంతో వచ్చిన దానిని ‘ఉర్దూవానా’ అన్నారు.
ప్రశ్న 2.
తెలంగాణ తెలుగు మిగతా ప్రాంతాల తెలుగు కంటే భిన్నమైనది ఎందుకు?
జవాబు:
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే రచించబడింది. డా.సి. నారాయణరెడ్డి, సంపాదకీయంలో వెలువబడిన ‘వ్యాస గుళుచ్చం’, రెండవ భాగం నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది.
ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రజలు మాట్లాడుకునే భాష తెలుగు, తెలుగు గ్రాంథిక రూపంలో ఈ నాలుగు ప్రాంతాలలో ఒకటిగానే ఉంటుంది. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి నాలుగు ప్రాంతాలలోనూ వేరు వేరుగా ఉంటుంది. తెలుంగాణా తెలుగు భాష మిగిలిన మూడు ప్రాంతాల భాష కంటే భిన్నంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో ఉర్దూ, హిందీ మరాఠీ భాషా పదాలు అధికంగా ఉండటం వలన మిగిలిన ప్రాంతాల తెలుగు భాషకన్నా తెలంగాణ తెలుగు భిన్నంగా ఉంటుంది.
ప్రశ్న 3.
తెలంగాణా తెలుగులో యథాతదంగా చేరిన ఉర్దూ పదాలను తెలపండి?
జవాబు:
‘తెలంగాణా తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామన సదాశివచే రచించబడింది. డా. సి. నారాయణరెడ్డి సంపాదకీయంలో వెలువబడి. ‘వ్యాస గుళు చ్చం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.
ఒక భాషలోని పదాలు మరొక భాషలోకి చేరేటప్పుడు వాటి రూపు రేఖలు మారటమో లేకఅర్థం మారటమో జరుగుతుంది. అలా కాకుండా తెలంగాణ తెలుగు భాషలో ఉర్దూ పదాలు యథాతదంగా చేరాయి. అలాంటి పదాలలో కలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాము, రోజు, కూలీ, బాకీ, గురుజు, బజారు, దుకాణం, మాలు, జబర్దస్తీ, జోరు, మొదలగు పదాలున్నాయి. ఇవన్నీ యథాతదంగా ఎలాంటి మార్పును పొందకుండా తెలుగులోకి వచ్చిన ఉర్దూపదాలు.
ప్రశ్న 4.
సామల సదాశివ రచనలను సంగ్రహంగా తెలుపండి ?
జవాబు:
సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలంలోని తెలుగు పల్లెలో మే 11, 1928న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. సదాశివ విభిన్న భాషా సంస్కృతుల కళావారధి, వీరు సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ తెలుగు భాషలలో పండితుడు. వీరి తొలి రచనలలో ప్రభాతము అనే లఘు కావ్యం, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్య దానము, విశ్వామిత్ర మొదలుగునవి ఉన్నాయి.
హిందూస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై, ‘మలయమారుతాలు’ ప్రముఖుల జ్ఞాపకాలు, ఉర్దూ, భాషా కవిత్వ సౌందర్య ఉర్దూకవుల కవితా సామాగ్రి మొదలగునవి ప్రసిద్ధ గ్రంథాలు.
అన్జద్ రుబాయిలు తెలుగు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అనువాద పురస్కారాన్ని ఇచ్చింది. వీరి ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. వీరి రచనలపై విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలు జరిగాయి.
III. ఏక పద/వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు
ప్రశ్న 1.
ఉర్దూ భాషను పూర్వం ఏ పేర్లతో పిలిచేవారు ?
జవాబు:
ఉర్దూ భాషను పూర్వం హిందుయి-జబానె-హిందుస్థాన్ అనే పేర్లతో 18వ శతాబ్దం వరకు పిలిచేవారు.
ప్రశ్న 2.
‘లాట్ సాహెబ్’ పదానికి మూల పదం ఏది?
జవాబు:
‘లాట్ సాహెబ్’ అనే పదానికి మూల పదం ‘లార్డ్’ అనే ఆంగ్లపదం
ప్రశ్న 3.
‘జుర్మానా’ అనే ఉర్దూపదం తెలుగులో ఏ విధంగా మారింది?
జవాబు:
జుర్మానా అనే ఉర్దూపదం తెలుగులో ‘జుల్మానా’గా మారింది.
ప్రశ్న 4.
‘ముహ్జుబాణీ’ అనే ఉర్దూపదానికి అర్థం?
జవాబు:
‘ముహ్ జుబాణీ అనే ఉర్దూపదానికి’ ‘నోటితో’ అని అర్థం.
ప్రశ్న 5.
‘కులాసా’ తెలుగు పదానికి ఉర్దూరూపం?
జవాబు:
కులాసా తెలుగు పదానికి ఉర్దూరూపం ‘ఖులాసా’
ప్రశ్న 6.
‘ఉర్దూ’ భాషకు ‘ఉర్దూ’ అనుపేరు ఏ శతాబ్దంలో వచ్చింది
జవాబు:
18వ శతాబ్దంలో
ప్రశ్న 7.
‘సామల సదాశివ’ రాసిన శతకం?
జవాబు:
‘సాంబశివ’ శతకం
ప్రశ్న 8.
ఏ గ్రంథానికి సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది?
జవాబు:
స్వరలయలు అనే గ్రంథానికి
తెలంగాణ తెలుగుపదాలు – ఉర్దూ మూలాలు Summary in Telugu
రచయిత పరిచయం
రచయిత : డా॥ సామల సదాశివ
పుట్టిన తేదీ : మే 11, 1928
పుట్టిన ఊరు : ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెనుగుపల్లె
తల్లిదండ్రులు : సామల చిన్నమ్మ, నాగయ్యలు
భాషాప్రావీణ్యం : తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఫార్సీ మరాఠీ భాషలు
రచనలు :
- ఏ భాతము, సాంబశివ శతకం, నిరీక్షణము, అంబపాలి, సర్వస్వదానం నవలలు, కథలు చిన్ననాటి రచనలు
- హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుతాలు, ప్రముఖుల జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, ఉర్దూ భాషాకవిత్వ సౌందర్యం, ఉర్దూకవుల కవితాసామాగ్రి గ్రంథాలు ప్రసిద్ధమైనవి.
- అన్జద్ రుబాయిలు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం అందుకున్నారు.
- స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
అవార్డులు :
- కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
- తెలుగు విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్
మరణం : ఆగస్టు 7, 2012
కవి పరిచయం
డా॥ సామల సదాశివ భిన్న భాషా సంస్కృతులకు వారధి ఈయన మే 11, 1928 న ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెలుగు పల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సామల చిన్నమ్మ, నాగయ్యలు. అధ్యాపక వృత్తిని చేపట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, ఫార్సీ, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. ప్రభాతము అనే లఘు కావ్యాన్ని సాంబశివ శతకం, నిరీక్షణ, అంబపాలి, సర్వస్వదానం, విశ్వామిత్రము వీరి తొలి రచనలు.
హిందూస్థానీ సంగీత కళాకారులపై మలయ మారుతాలు ప్రముఖులు జ్ఞాపకాలు, అనుభవాలు గల ‘యాది’ సంగీత శిఖరాలు, వీరి రచనలే. అమాన్ రుబాయిలు’ అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2011లో లభించింది. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. ఈయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆగస్టు 7, 2012న పరమపదించారు.
ప్రస్తుత పాఠ్యభాగ్యం డా॥సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘వ్యాసగు ళచ్ఛం’ రెండవ భాగం నుండి గ్రహించబడింది.
పాఠ్యభాగ సందర్భము
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూమూలాలను విద్యార్థులకు తెలియజేయు సందర్భంలోనిది.
పాఠ్యభాగ సారాంశం
తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అను పాఠ్యభాగం సామల సదాశివచే వ్రాయబడింది. డా.సి. నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన “వ్యాస గుళుచ్ఛం” రెండవ భాగం నుండి గ్రహించబడింది. ఇందులో తెలంగాణా తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎలా మిళితమైనాయో చెప్పబడ్డాయి.
ఆంధ్రదేశంలో దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రజలు మట్లాడుకునే భాష తెలుగు. గ్రంథికంలో ఉన్నప్పుడు ఈ నాలుగు ప్రాంతాలలో తెలుగు ఒకే విధంగా ఉంటుంది. వ్యవహారికం దగ్గరకు వచ్చేసరికి నాలుగు ప్రాంతాల భాష వేరు వేరుగా ఉంటుంది. తెలంగాణ భాష మిగిలిన మూడు ప్రాంతాల భాషల కన్నా భిన్నంగా ఉంటుంది. దానికి కారణం తెలంగాణ తెలుగులో ఉర్దూ, హిందీ, మరాఠీ పదాలు ఎక్కువగా ఉండటం.
ఉర్దూ ఒక ప్రత్యేక భాషకాదు. ఉత్తరాన పలుకృత అపభ్రంశాల శబ్దాలతో పారసీ, అరబ్బీ, తుర్కీ శబ్దాలు కలిసి కలగా పులగంగా ఏర్పడిన భాష ఉర్దూ. ఇది 14వ శతాబ్దాంలో రూపుదిద్దుకొని హిందూయి, జబానె – హిందూస్తాన్ అన్న పేర్లతో పిలవబడి 18వ శతాబ్దానికి ఉర్దూ భాషగా పేరు పొందింది.
దక్కన్ ప్రాంతంలో ముస్లిం పాలకులకు ప్రజలకు వారధిగా ఒక భాష అవసరం ఏర్పడింది. దానిని దక్కనీ ఉర్దూ అన్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో ఏర్పడింది. తెలుంగాణా జిల్లాలు పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో ఉండడం వలన కన్నడ పదాలు తెలుగులో కలిశాయి. కనుక తెలంగాణ తెలుగు ప్రత్యేకతను పొందింది.
ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం సర్వసాధారణం. పలు భాషలు మట్లాడే ప్రజలు ఒకచోట ఉండటంతో భాషలలో ఆధాన ప్రదానాలు సహజమే. భారతదేశ భాషలపై సంస్కృతం ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ఉర్దూ బోధనా మాధ్యం గల ప్రాంతాలలో ఆంగ్ల భాష అంతగా ప్రభావాన్ని చూపించింది. అలా ఆంగ్ల పదాలను ఉర్దూ భాషలోకి అనువదించుకుని దానిని ఉర్దూ వానా అని పిలుచుకున్నారు.
ఒక భాష నుండి. మరొక భాషకు పదాలు వర్ణగమ, వర్ణలోప, వర్ణ వ్యత్యయ పద్ధతుల ద్వారా వెళ్తుంటాయి.. ఒక్కోసారి యధాతదంగా కూడా వస్తుంటాయి. ఉదాహరణకు. లార్డ్ అనే ఆంగ్లపదం ఉ ర్దూలో లాట్సాహెబాను, ఫిలాసఫీ అనే పదం ఫల్సఫా గాను మార్పు చెందింది. కొన్ని పదాలు అర్థాన్ని మార్చుకుని కూడా ప్రవేశిస్తుంటాయి. ఉదాహరణకు ఉపన్యాసమంటే తెలుగులో ప్రసంగం హిందీలో నవల అన్న అర్థాన్ని స్తుంది.
తెలుగులోకి యధాతథంగా వచ్చిన ఉర్దూపదాలు కలము, జమీందారు, ఖుషీ, మొదలగునవి. కొన్ని ఉర్దూ పదాలు హలంలూలు తెలుగులో అజంతాలుగా మార్పుచెందాయి. ఉదాహరణకు రోజ్ రోజు అయింది. బజార్ .. బజారు అయింది. కొన్ని ఉర్దూ పదాలు తమ రూపాన్ని మార్చుకుని తెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకు అబ్రు ఆబూరుగను, జర్మానా, జుల్మాన్గాను మార్పుచెందాయి.
కొన్ని ఉర్దూపదాలు తెలుగులోకి అర్థమార్పిడితో వచ్చాయి. ముదామ్ అన్న పదానికి ఉర్దూలో ఎల్లప్పుడు అని అర్థం. అది తెలుగులో ముద్దాముగా మారి ప్రత్యేకించి అను అర్థాన్ని పొందింది. ఇలా ఉర్దూ పదాలు తెలుగు భాషలోకి వచ్చి చేరాయి.
కఠిన పదాలకు అర్థాలు
ఖరారు = నిర్థారణ
అన్యభాష = ఇతర భాష
యథాతథంగా = ఉన్నది ఉన్నట్లుగా
విద్వాంసులు = పండితులు
భీతిగొల్పేది = భయాన్ని కలిగించేది
సావభావికమే = సర్వసాధారణమే
తరుచుగా = అప్పుడప్పుడు
హలంత పదాలు = హల్లులు అంతంగా గల పదాలు
అజంతపదాలు = అచ్చులు అంతంగా గల పదాలు
భూషణము = అలంకారము
మేజువాణి = పాటకచ్చేరి
గలాభా = గొడవ
రూపుదిద్దుకున్న = తయారైన
భిన్నంగా = వేరుగా