TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

Telangana TSBIE TS Inter 1st Year Telugu Study Material 1st Lesson పాల్కురికి సోమనాథుడు Textbook Questions and Answers.

TS Inter 1st Year Telugu Study Material 1st Lesson పాల్కురికి సోమనాథుడు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న 1.
పాల్కురికి సోమన జీవిత విశేషాలు, కవితా గుణాలను పేర్కొనండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ కవిచే రచించబడిన “చైతన్యలహరి” వ్యాస సంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి సోమనాథుని జీవిత విశేషాలు, కవితా గుణాలు వివరించబడ్డాయి.

పాల్కురికి సోమన కాకతీయ చక్రవర్తులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంవాడు. 13వ శతాబ్ధమునకు చెందినకవి. సోమన ఓరుగంటికి సమీపంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామానికి దగ్గరలో సోమేశ్వరాలయం ఉ ంది. ఈ దేవునిపేరే తమ కుమారునికి పెట్టుకున్నారు.

సోమన తల్లిదండ్రులు శ్రియాదేవి విష్ణురామిదేవుడు. సోమనకు గురువులు నలుగురు. వీరమాహేశ్వర దీక్షనిచ్చిన గురువు. గురులింగార్యుడు. శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు. సాహితీగురువు కరస్థలి విశ్వనాధయ్య.

సోమన వ్యక్తిత్వము, విశిష్టమైనది. వీరశైవలోకానికి మూలపురుషుడు, వీరశైవవాఙ్మయమంతా ఇతని రచనలపైనే ఆధారపడిఉన్నది. వీరశైవ మతాన్ని బసవేశ్వరుడు స్థాపించగా, పండితారాధ్యుడు ప్రచారం చేయగా, పాల్కురికి సోమనాధుడు వీరశైవసాహిత్యాన్ని సృష్టించాడు.

ఇతని తరువాతి వారు సోమనాధుని భృంగీశ్వరుని అవతారంగా భావించారు. సంస్కృత భాషను కాదని ఆంధ్రభాషను అందలం ఎక్కించాడు. తెలుగు భాష భావరూపాలలో నూతనత్వాన్ని తీసుకువచ్చాడు. బ్రాహ్మణమతానికి ధీటుగా వీరశైవమతాన్ని నిలబెట్టాలని భావించి శైవంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్య స్తుత్యాదులన ప్రవేశపెట్టాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

అనుభవసారం, రుద్రభాష్యం, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, బసవరగడ, బసవోదాహరణలను రచించాడు. ఆయన రచనలు దేశీ ఛందస్సుకు పట్టం కట్టాయి. తెలుగుభాషలో ద్విపద ఛందస్సుకు ఆధ్యుడు పాల్కురికే! సోమనాధుడు శైవమత ప్రచారానికే సాహిత్యాన్ని సృష్టించాడు. భాష చందస్సులను గురించి సోమన

భాష:
“ఉ రుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వసామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిదైవార”

అని అన్నాడు. జానుతెనుగు అంటే “లోక వ్యవహారములోని సుబోధకమైన తెనుగు అని అర్థం. ఈయన రచనలన్నీ నిత్య వ్యవహార భాషలోనే సాగాయి.

ఛందస్సు : సోమన అనుసరించిన ఛందస్సు కూడా నూతనమైంది. వృత్తపద్యాలు కొన్ని రాసినా జాతులు ఉపజాతులనే ఎంచుకున్నారు. ద్విపద ఛందస్సుకు ప్రాధాన్యమిచ్చాడు. ద్విపద ఛందస్సులోనే బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అను వీరశైవమత గ్రంథాలను రచించాడు.

వర్ణన : సోమనాధుని ప్రకృతి వర్ణనలు స్వభావోక్తికి దగ్గరగా ఉంటాయి. తెల్లలవారుజామున కోడికూత వర్ణనం దీనికో ఉదాహరణ. పండితారాధ్య చరిత్రలో

“తొలికోడి కనువిచ్చి నిలచి మైపెంచి
జలజల రెక్కలు సడలించి నీలి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కిమిన్సూచి
కొక్కొరో కు అని కూయక మున్న…..”

ఈ ద్విపద వాక్యాలలో కోడి కూతను అతి సహజ సిద్ధంగా సోమనాథుడు వర్ణించాడు. ఇలా సోమనాథుడు వీరశైవ సంప్రదాయ ప్రవర్తకునిగా, దేశీకవితా కవిగా కీర్తి నార్జించాడు.

ప్రశ్న 2.
సోమన రచనలను తెలిపి, వాటిని సంక్షిప్తంగా వివరించండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మచే రచించబడిన “చైతన్యలహరి” అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో పాల్కురికి జీవితం, రచనలు, కవితాగుణాలు వివరించబడ్డాయి.
పాల్కురికి సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

 1. బసవపురాణం
 2. పండితారాధ్య చరిత్ర
 3. అనుభవసారం
 4. చతుర్వేద సారము
 5. సోమనాథభాష్యం
 6. రుద్రభాష్యం
 7. బసవరగడ
 8. గంగోత్పత్తి రగడ
 9. శ్రీ బసవారాధ్య రగడ
 10. సద్గురు రగడ
 11. చెన్నముల్లు సీసములు
 12. నమస్కార గద్య
 13. వృషాధిపశతకము
 14. అక్షరాంక గద్య అష్టకం
 15. పంచప్రకార గద్య
 16. పంచకము
 17. ఉదాహరణ యుగములు మొదలగునవి వాటిలో ముఖ్యమైనవి.

1. అనుభవసారం : సోమనాథుని మొదటి రచన ఇది. దీనిలో 245 పద్యాలున్నాయి. ఈ కావ్యంలో భక్తి స్వరూపం, లక్షణాలు, పూజా విధానం, జంగమ సేవ మొదలగు వీరశైవ ధర్మములు చెప్పబడ్డాయి.

2. బసవపురాణం : సోమన శ్రీశైల క్షేత్రమును దర్శించి భక్తి పారవశ్యముతో వ్రాసిన గ్రంథము ఇది. దీనిలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటు దీనిలో 75 గురు భక్తుల కథలున్నాయి. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూడికథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలున్నాయి.

3. లఘుకృతులు : సోమనాథుడు శివ స్తుతిపరమైన కొన్ని లఘుకృతులను రచించాడు. వాటిలో 4 గద్యలు, 1. రగడ, 2. ఉదాహరణములు 11 పంచకములు 2 అష్టకములు 1 స్తవము ఉన్నాయి.

4. వృషాధిపశతకం : బసవేశ్వరుని శివస్వరూపునిగా భావించి ఆయనపై 108 చంపక ఉత్పలమాలలతో రచించిన శతకమిది. సోమనాథుని అష్టభాసా ప్రావీణ్యమునకు ఇది ఒక ఉదాహరణ.

5. చతుర్వేదసారం: దీనిలో ‘బసవలింగ’ మకుటము గల 357 సీసపద్యాలున్నాయి. శైవమునకు సంబంధించిన భక్తి విషయాలు ఇందులో ఉన్నాయి.

6. చెన్నమల్లు సీసములు : ఇది 32 సీసద్యాలు గల చిన్న కృతి.

7. రుద్రభాష్యం: ఇది లభ్యం కాలేదు.

8. సోమనాథ భాష్యం: ఇది ఒక సంస్కృత గ్రంథం. 25 ప్రకరణములున్నాయి. దీనినే బసవరాజీయం అంటారు. వీరశైవమతం తాంత్రికం కాదని శుద్ధవైదికమని నిరూపించటానికి ఈ గ్రంథాన్ని రచించాడు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

9. పండితారాధ్య చరిత్రము : ఇది సోమనాథుని చివరికృతి, ద్విపద రచించబడిన ప్రౌఢ పురాణ కావ్యం. దీనిలో మల్లికార్జున పండితారాధ్యుని పుణ్యచరిత్రతోపాటుగా పలువురి శివ భక్తులు చరిత్రలు వ్రాయబడ్డాయి. ఇది 12వేల ద్విపదలతో రాయబడిన కావ్యం. సోమన కావ్యకళా విశిష్టతను, బహుభాషా పాండిత్యమును, సంగీత, నాట్య రసవాద, వైద్య శాస్త్రాల పరిజ్ఞానమును లోకానుభవంతో వ్రాయబడ్డాయి.

భాషలో ద్విపద రచనలో పాల్కురికి తరువాత తరాల వారికి మార్గదర్శ కుడయ్యాడు. పోత భక్తి పారవశ్యానికి శ్రీనాథుని నుడికారమునకు, కృష్ణదేవరాయల వర్ణనాపటిమకు ఇతరుల విశిష రచనలకు సోమనాథుని ద్విపదలైన బసవపురాణం పండితారాధ్య చరిత్రలే మార్గదర్శకాలని పండితుల అభిప్రాయం.

II. సంక్షిప్తరూప ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కావ్య భాషను గురించి సోమన అభిప్రాయాలు తెలపండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించబడిన చైతన్యలహరి అను వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. దీనిలో సోమనాథునకు కావ్యభాష పట్ల ఉన్న అభిప్రాయాన్ని వివరించాడు.

గుడ్డెద్దు చేలో పడినట్లు కాకుండా కావ్య భాష, భాష, భావము, రూపాలలో నూతనత్వాన్ని పొందాలన్నాడు. ఎక్కడా కావ్యభాషకు మర్యాద గౌరవాలు తక్కువ కాకూడదన్నాడు. కావ్యభాషను గురించి వివరిస్తూ

“ఉరుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరిగిన జాను తెనుంగు……

అని చెప్తూ కావ్యభాష లోక వ్యవహారంలో సర్వజనులకు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. నిఘంటువులలోని మారుమూల పదాలుకాక, మారుమూలల్లోని అచ్చతెలుగు పదాలు కాక నిత్య వ్యవహారంలో సుపరిచితమైన పదాలతో కావ్య భాష ఉ ండాలన్నారు. వర్ణనలు, సహజ సుందరంగా ఉండాలన్నాడు. సోమనాథుడు శైవమత ప్రచారానికే సాహిత్య సృష్టి చేసినప్పటికీ కావ్యభాషకు ఎక్కడా లోపాన్ని రానీయలేదు.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 2.
‘బసవపురాణం’ కావ్యం గురించి సంక్షిప్తంగా రాయండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణ శర్మ రచించిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడింది.

బసవపురాణం పాల్కురికి ద్విపద రచన. ఆయన ఒకనాడు శ్రీశైల క్షేత్రమును దర్శించి అక్కడ భక్తుల ద్వారా బసవేశ్వరుని దివ్య చరితమును విని బసవపురాణాన్ని రచించాడు. ఈ ద్విపద కావ్యంలో నందికేశ్వరుని అవతారమైన బసవేశ్వరుడు కథానాయకుడు. బిజ్జలుడు ప్రతినాయకుడు. బసవేశ్వరుని చరిత్రతోపాటుగా ఈ కావ్యంలో 75 మంది శివభక్తుల కథలున్నాయి. ఈ కావ్యమందు సోమనాథుని కథా కథననైపుణ్యం కన్పిస్తుంది. ముగ్ధ సంగయ్య కథ, బెజ్జమహాదేవికథ, గొడగూచి కథ, ఉడుమూరి కన్నకప్పకథ, మడిమేలు మాచయ్య కథలు చక్కగా వర్ణించబడ్డాయి.

సోమనాథుని రచనా రీతిలో అంత్యానుప్రాసల ప్రభావం అధికం. ఇది పోతన లోని అంత్య ప్రాసరచనకు కారణమైందని చెప్పవచ్చు. ద్విపద రచనలలో సోమనాథునికి మంచిపేరు తెచ్చిన కావ్యం బసవపురాణం.

ప్రశ్న 3.
సోమన లఘుకృతులను గురించి క్లుప్తంగా రాయండి?
జవాబు:
పాల్కురికి సోమనాథుడు అను పాఠ్యభాగం గడియారం రామకృష్ణశర్మచే రచించనబడిన ‘చైతన్యలహరి’ అను వ్యాససంపుటి నుండి గ్రహించబడినది. దీనిలో సోమనాథుని రచనలలోని భాష ఛందస్సులలో నూతనత్వాన్ని ఎలా తీసుకువచ్చాడో వివరించ బడింది. సోమనాథుని రచనలను, వర్ణనానైపుణ్యాన్ని ఇందులో వివరించాడు. పాల్కురికి రాసిన 21 రచనలను పేర్కొంటూ వాటిలో లఘు కృతులను తెలియజేశాడు.

సోమనాథుడు శివభక్తి తత్పరుడైన బసవేశ్వరుని పై భక్తి తన్మయత్వంతో కొన్ని లఘుకృతులను రచించాడు. అవి 1. రగడ 4 గద్యలు, 2 ఉదాహరణలు 11 పంచకములు 2 అష్టకములు, 1. స్తవము ఉన్నాయి. ఇవన్నీ వైరశైవమత సంబంధ రచనలే.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 4.
గడియారం రామకృష్ణశర్మ సాహిత్యసేవను తెలుపండి?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ సుబ్బమ్మ జ్వాలాపతి దంపతులకు మార్చి 6. 1919న అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఆయన జీవితమంతా మహబూబ్ నగర్ జిల్లా అలంపురంలోనే గడిచింది. ఈయన తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి వద్ద విద్యలనభ్యసించాడు.

సంస్కృతం, తెలుగు, కన్నడ, ఆంగ్ల సాహిత్యాలలో పండితు డయ్యాడు. కవిగా, పండితునిగా, కావ్య పరిష్కర్తగా, శాసన పరిశోధకునిగా, చరిత్రకారునిగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకర్తగా క్రియాశీలక పాత్రను పోషించాడు.

నిజాం రాష్ట్రంలో తెలుగు భాషను చిన్నచూపు చూడటం సహించలేక ఆంధ్ర మహాసభల ఏర్పాటుకు కృషి చేశారు. తెలంగాణమంతా పర్యటించి ‘భాగ్యనగర్ రేడియో’ ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. బాలవితంతువును వివాహమాడటంతోపాటు వితంతు వివాహాలు జరిపించాడు. ‘సుజాత’ పత్రికను ప్రారంభించారు.

మెకంజీ కైఫీయత్తులను వ్రాయించారు. ‘తెలంగాణ శాసనాలు’ రెండవ సంపుటిని తీసుకువచ్చారు. కన్నడ సాహిత్య చరిత్రను రాశారు. కన్నడకవి రన్నడు రాసిన ‘గదాయుద్ధాన్ని’ తెలుగునకు అనువదించినాడు. అలంపురం చరిత్ర, విద్యారణ్యుల చరిత్రలను రాశాడు. వీరి ఆత్మకథ ‘శతపత్రం’ 2006లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డునందుకుంది.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘పాల్కురికి సోమనాథుడు’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
జవాబు:
గడియారం రామకృష్ణ శర్మ

ప్రశ్న 2.
సోమన జన్మస్థలం ఏది?
జవాబు:
ఓరుగల్లుకు 12మైళ్ళ దూరంలోని జనగామ తాలూకా పాలకుర్తి గ్రామం.

ప్రశ్న 3.
సోమన తల్లిదండ్రులెవరు?
జవాబు:
తల్లి శ్రియాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 4.
సోమన గురువులెవరు.
జవాబు:
సోమనకు 4గురు గురువులు. ఒకరు దీక్షాగురువు గురులింగార్యుడు, శిక్షాగురువు కట్టకూరి పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు, సాహిత్యగురువు కరస్థలి విశ్వనాథయ్య.

ప్రశ్న 5.
ద్విపదలో సోమన రచించిన గ్రంథాలేవి?
జవాబు:
సోమన ద్విపద గ్రంథాలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర,

ప్రశ్న 6.
సోమన మొదటికృతి ఏది?
జవాబు:
సోమన మొదటి కృతి ‘అనుభవసారము’

ప్రశ్న 7.
బసవపురాణంలో ఎంతమంది భక్తుల కథలున్నాయి?
జవాబు:
బసవపురాణంలో 75మంది శివభక్తుల కథలున్నాయి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

ప్రశ్న 8.
తెలుగులో తొలి విజ్ఞానసర్వస్వంగా ఏ గ్రంథాన్ని పరిగణించారు?
జవాబు:
తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా పరిగణించిన గ్రంథం పండితారాధ్య చరిత్ర.

పద్యాలలో ద్విపదలలో కఠినపదాలకు అర్థాలు

1వ పద్యం :

“భృంగిరిటి గోత్రుడను గురు
లింగ తనూజుఁడ శివకులీనుండ దుర్వ్యా
సంగ వివర్జిత చరితుఁడ
జంగమలింగ ప్రసాద సత్ప్రణుండన్”

భృంగిరిటి గోత్రుడను = భృంగీశ్వరుని గోత్రమువాడిని
తనూజుడను = కుమారుడును
శివకులీనుండిను = శివభక్తుడును
దుర్వాసంగ = చెడ్డపనులను
వివర్జిత = విసర్జించినవాడను
సత్ + ప్రాణుండన్ = మంచివాడను

2వ పద్యం :

“ధరను మామాత పితారుద్రయనెడు
వర పురాణోక్తి నీశ్వర కులజుండ
భక్త కారుణ్యాభిషిక్తుండఁ బాశ
ముక్తుండ గేవలభక్తి గోత్రుండ
భ్రాజిష్ణుడగు విష్ణు రామి దేవుండు
జిష్ణువగు శ్రియాదేవి యమ్మయును
గారవింపఁగ నొప్పు గాదిలి సుతుఁడ
వీర మాహేశ్వరాచార వ్రతుండ

ధరను = భూమిపై
డ.మామాత = పార్వతీదేవి
పిత = తండ్రి
రుద్ర = శివుడు
కారుణ్య + అభిషిక్తుండు = కరుణచేత అభిషేకింపబడినవాడు
పాశముక్తుండ = కోరికలను వదలివేసినవాడు
గాదిలిసుతుడ = ముద్దుల కొడుకును

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

3వ పద్యం :

“ఉరుతర గద్యపద్యోక్తులకంటే
సరసమై బరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వ సామాన్యమగుట
గూర్చెద ద్విపదలు గోర్కిడైవార
తెలుగు మాటలనంగ వలదు వేదముల
కొలదియగా జూడుడిల నెట్టులనిన…. (బసవపరాణం)

ఉరుతర = గొప్పవైన
పరగిన = ఒప్పిన
కోర్కెదైవారు = కోర్కెలు తీరేవిధంగ

4వ పద్యం :

“తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి.
జలజల రెక్కలు సడలించి నీల్లి
గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి
కొక్కొరో కుఱ్ఱని కూయకమున్న

మై = శరీరము
గ్రక్కున = వెంటనే
కాలు + ఆర్చి = కాళ్ళు చాపి
చక్కొల్పి = విదిలించి
మిన్ను చూసి = ఆకాశమువైపు చూసి.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

పాల్కురికి సోమనాథుడు Summary in Telugu

రచయిత పరిచయం

రచయిత : గడియారం రామకృష్ణ శర్మ

తల్లితండ్రులు : సుబ్బమ్మ, జ్వాలాపతి

పుట్టినతేది : మార్చి 6, 1919

పుట్టిన ఊరు : అనంతపురం జిల్లా,

స్థిరనివాసం : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అలంపురం

గురువులు : తిరుపతి వేంకటకవుల శిష్యుడైన వేలూరి శివరామశాస్త్రి

నేర్చిన భాషలు : సంస్కృతం, తెలుగు, కన్నడం, ఆంగ్లం

రచనలు

 1. మెకంజీకై ఫీయత్తులను రాయించారు.
 2. తెలంగాణా శాసనాలు గ్రంథం రెండవ సంపుటిని ప్రచురించారు.
 3. కన్నడ సాహిత్య చరిత్రను పరిశోధనాత్మకంగా రాశారు.
 4. కన్నడ కవి ‘రన్నడు’ రచించిన గదాయుద్ధాన్ని తెలుగులో అనువాదం చేశాడు.
 5. అలంపురం చరిత్ర, విద్యారణ్యస్వామి చరిత్ర, ప్రామాణిక చారిత్రాక గ్రంథాలను రచించారు.
 6. గడియారం ఆత్మకథ “శతపత్రం” దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

నడిపిన పత్రికలు:

 1. ‘భాగ్యనగర్ రేడియో’ ద్వారా వార్తా ప్రచారం
 2. సుజాత పత్రికను పునరుద్ధరించాడు.

మరణం : జులై 2006లో మరణించారు.

పోతిదేవర, జ్ఞానగురువు బెలిదేవి వేమనారాధ్యుని మనుమడు. ఇతని పేరు పేర్కొనలేదు. సాహిత్యగురువు కరస్తలి విశ్వనాథయ్య.

సోమనాధుని వ్యక్తిత్వం

సోమనాధుడు వీరశైవలోకానికి మూలపురుషుడు. వీర శైవ వాఙ్మయమంతా పాల్కురికి రచనలపైనే ఆధారపడింది. వీరశైవాన్ని ఉద్ధరించినవాడు బసవేశ్వరుడు ప్రచారం చేసినవాడు. పండితారాధ్యుడు. పండితపామర జనరంజకంగా శైవమతగ్రంథాలను రచించినవాడు పాల్కురికి. ఇతని తరువాతి వీరశైవులు పాల్కురికిని భృంగీశ్వరుని అవతారంగా భావించారు.

గుడ్డెద్దు చేలోపడినల్లుగాకాక ఆంధ్రవాఙ్మయాన్ని భాష, భావం, రూపాలలో క్రొత్తదనాన్ని తీసుకువచ్చినవాడు పాల్కురికి. వీరశైవ వాఙ్మయంలో శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్యస్తుత్యాదులను తీసుకువచ్చాడు సోమనాథుడు. అనుభవ సారము, రుద్రభాష్యము, బసవపురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిపశతకం, బసవరగడ, బసవోదాహరణాలను రచించాడు. దేశీయ ఛందమగు ద్విపదలో జానుతెనుగు భాషలో రచన చేశాడు.

సోమనాధుని సాహిత్య సృష్టికి ప్రధాన కారణం మతం. ఈతనిపై వీరశైవమత ప్రభావం, కన్నడసాహిత్య ప్రభావాలున్నాయి. ఈయన తన భాషాఛందస్సులనుగూర్చి

“ఉరుతర గద్య పద్యోక్తుల కంటే
సరసమై బరిగిన జాను తెనుంగు…..”

అని ‘జాను తెనుగు’లో కృతులు రచించాడు. జాను తెనుగు అంటే లోక వ్యవహారములోని సర్వజన సుబోధకమై తెలుగు భాష అని అర్థం.

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

సోమనాథుడు అనుసరించిన ఛందస్సు కూడా కొత్తది. వృత్తపద్యాలు కొన్ని వ్రాసినా జాతులు, ఉపజాతులలోనే రచనను సాగించాడు. ఈయన వ్రాసిన ఛందస్సు ‘ద్విపద’.

ఇక సోమనాథుని వర్ణనలు ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. స్వభావోక్తితో కూడి ఉంటాయి. వేకువజామును కోడికూతను ఎంత చక్కగా వర్ణించాడో చూడండి.

“తొలికూడి కనువిచ్చి, నిలిచిమై వెంచి
జల జల రెక్కలు సడలించి నీలి…….

అన్న ద్విపద పద్యంలో సహజత్వం కూర్చడబడింది.

సోమనాథుని రచనలు.

సోమనాథుడు దాదాపు 21 రచనలు చేశాడు. 1. బసవపురాణం 2. పండితారాధ్య చరిత్ర 3. అనుభవసారం 4. చతుర్వేద సారము 5. సోమనాథ భాష్యం 6. రుద్రభాష్యం 7. బసవరగడ 8. గంగోత్పత్తి రగడ 9. శ్రీ బసవారాధ్య రగడ 10. సద్గురు రగడ 11. చెన్నముల్లు సీసములు 12. నమస్కార గద్య 13. వృషాధిపశతకము 14. అక్షరాంక గద్య 15. పంచప్రకార గద్య 16. పంచకము 17. ఉదాహరణయుగములు.

భాషలో ద్విపదలో తరువాత కవులకు పాల్కురికి మార్గదర్శకుడయ్యాడు.

కఠిన పదాలకు అర్ధాలు

దీక్షాగురువు = శివదీక్షను ఇచ్చిన గురువు
శిక్షాగురువు = భక్తితో శిక్షణను ఇచ్చిన గురువు
జ్ఞానగురువు = జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు
సాహిత్యగురువు = సాహిత్యమును నేర్పిన గురువు
ప్రతివాద భయంకరుడు = వాదనలో ఎదుటివారికి భయాన్ని కలిగించే వాడు.
యశము = కీర్తి

TS Inter 1st Year Telugu Study Material Chapter 1 పాల్కురికి సోమనాథుడు

పరివర్తనము = మార్పు
గ్రాహ్యము = గ్రహించు
రమణీయ = అందమైన
బహుభాషాకోవిదుడు = పలు భాషలలో పండితుడు
సుగ్రాహ్యము = తేలికగా గ్రహించగలిగినది
గ్రక్కున = వెంటనే
అష్టభాషాప్రావీణ్యము = ఎనిమిది భాషలలో నేర్పుగల
కృతి = కావ్యము
నగము = పర్వతము
ఆధ్యుడు = మొదటివాడు
పామరులు = సామాన్యజనులు

Leave a Comment