Here students can locate TS Inter 1st Year Physics Notes 13th Lesson ఉష్ణోగతిక శాస్త్రం to prepare for their exam.
TS Inter 1st Year Physics Notes 13th Lesson ఉష్ణోగతిక శాస్త్రం
→ ఉష్ణగతిక శాస్త్రము ఉష్ణశక్తి మరియు యాంత్రిక శక్తుల మధ్యగల సంబంధాలను వివరిస్తుంది.
→ ఉష్ణ సమతాస్థితి : ఒక వ్యవస్థలో స్థూల చలరాశులైన పీడనం, ఘనపరిమాణం, ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి వాటి సంఘటన కాలంతోపాటు మారకుండా ఉంటే ఆ వ్యవస్థ ఉష్ణ సమతాస్థితిలో ఉంది అంటారు.
రెండు వ్యవస్థలు ఉష్ణ సమతాస్థితిలో ఉండాలంటే ఆ రెండు వ్యవస్థల ఉష్ణోగ్రతలు సమానంగా ఉండాలి.
→ ఉష్ణగతికశాస్త్ర శూన్యాంక నియమం : రెండు వ్యవస్థలు (A, B) విడివిడిగా మూడవ వ్యవస్థ ‘C’ తో ఉష్ణ సమతా స్థితిలో ఉంటే ఆ వ్యవస్థలు A, B లు కూడా ఒక దానితో ఒకటి ఉష్ణసమతాస్థితిలో ఉంటాయి.
→ అంతరికశక్తి (U) : ప్రతివ్యవస్థ అసంఖ్యాకమైన అణువుల సముదాయము. వ్యవస్థలో గల మొత్తం అణువుల స్థితిశక్తి మరియు గతిశక్తుల మొత్తాన్ని అంతరికశక్తి అంటారు.
లేదా
వ్యవస్థలో ఉన్న అణువుల క్రమరహితచలనం వల్ల వస్తువు కలిగి ఉండే స్థితిశక్తి, గతిశక్తుల మొత్తాన్ని అంతరికశక్తి అంటారు.
→ ఉష్ణగతికశాస్త్ర మొదటి నియమం : ఏదైనా వ్యవస్థకు అందించిన మొత్తం ఉష్ణరాశి ΔQ, ఆ వ్యవస్థ జరిపిన పని ΔW మరియు వ్యవస్థ అంతరికశక్తిలోని మార్పుల ΔU ల మొత్తానికి సమానము.
ΔQ = ΔU + ΔW లేదా ΔQ = ΔU + PΔV
→ విశిష్టోష్ణ సామర్ధ్యం (S) : ప్రమాణ ద్రవ్యరాశిగల పదార్థంలో ఏకాంక ఉష్ణోగ్రతా మార్పు కోసం అందజేసిన ఉష్ణరాశిని లేదా కోల్పోయిన ఉష్ణరాశిని విశిష్టోష్ణ సామర్థ్యము అంటారు.
విశిష్టోష్ట సామర్థ్యం S = \(\frac{1}{m} \frac{\Delta Q}{\Delta T}\) ప్రమాణము J/kg-k
→ స్థిరఘనపరిమాణ మోలార్ విశిష్టోష్ణ సామర్ధ్యము (C) : స్థిరఘనపరిమాణము వద్ద ఒక గ్రామ్ మోల్ ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రతను 1°C లేదా 1 కెల్విన్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని స్థిరఘనపరిమాణ మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యము Cగా నిర్వచించినారు.
Cv = \(\frac{1 \mathrm{dQ}}{\mu \mathrm{dT}}\) μ = వాయువులోని మోల్ల సంఖ్య
→ స్థిరపీడన మోలార్ విశిష్టోష్ణ సామర్ధ్యము (C): స్థిరపీడనము వద్ద ఒక గ్రామ్ మోల్ ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రతను 1°C లేదా 1 కెల్విన్ మేరకు పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని స్థిరపీడన మోలార్ విశిష్టోష్ట సామర్థ్యము Cp గా నిర్వచించినారు.
Cp = \(\frac{1}{\mu} \frac{d Q}{d T}\) μ = వాయువులోని గ్రామ్ మోల్ల సంఖ్య
గమనిక : విశిష్టోష్ణము మరియు విశిష్టోష్ణ సామర్ధ్యములను ఒకే అర్థంలో వాడతారు.
→ సమ ఉష్ణోగ్రతా ప్రక్రియ : ఉష్ణ యాంత్రిక మార్పులు జరుగుతున్నంతసేపు ఒక వ్యవస్థ ఉష్ణోగ్రత T ని స్థిరంగా ఉంచితే ఆ ప్రక్రియను సమఉష్ణోగ్రతా ప్రక్రియ అంటారు.
→ సమ పీడన ప్రక్రియ : ఈ విధమైన ప్రక్రియలో ఉష్ణ యాంత్రిక మార్పులు జరుగుతున్నంత సేపు వ్యవస్థ పీడనం (P) స్థిరము.
→ సమ ఘనపరిమాణ ప్రక్రియ : ఇటువంటి ప్రక్రియలో ఉష్ణ యాంత్రిక మార్పులు జరుగుతున్నంతసేపు వ్యవస్థ ఘనపరిమాణం (V) స్థిరంగా ఉండాలి.
→ స్థిరోష్ణక ప్రక్రియ : ఇటువంటి ప్రక్రియలో ఉష్ణ యాంత్రిక మార్పులు జరుగుతున్నంతసేపు వ్యవస్థ మొత్తం శక్తి (Q) స్థిరంగా ఉండాలి.
→ చక్రీయ ప్రక్రియ : చక్రీయ ప్రక్రియలో ఉష్ణ యాంత్రిక వ్యవస్థపై అన్ని ప్రక్రియలు జరిపిన తరువాత చివరికి అది తొలి ఉష్ణోగ్రతా పీడనాలను పొందుతుంది. చక్రీయ ప్రక్రియలో ΔU = 0 కావున వ్యవస్థ శోషించుకున్న ఉష్ణరాశి చక్రీయ ప్రక్రియలో జరిగినపని. (చక్రీయ ప్రక్రియలో dW – dQ)
→ ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమము :
a) కెల్విన్ – ప్లాంక్ ప్రవచనము : ఒక ఉష్ణాశయం నుంచి ఉష్ణశక్తిని గ్రహించి ఏ ఇతర ఫలితాలు కలుగజేయకుండా మొత్తం శక్తిని పనిగా మార్చే చక్రీయ ప్రక్రియ సాధ్యం కాదు.
b) క్లాసియస్ ప్రవచనము : తక్కువ ఉష్ణోగ్రత గల ఒక వస్తువు నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత గల మరొక వస్తువుకు తనంతట తాను ఉష్ణరూపంలో శక్తిని బదిలీ చేసే ఏ ప్రక్రియ సాధ్యం కాదు.
→ ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం ఉష్ణ ప్రసార దిశను తెలుపుతుంది.
→ ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం ప్రకారము ఏ ఉష్ణ యంత్రం దక్షత η విలువ 1 కి సమానం కాదని మరియు శీతలీకరణ యంత్రం క్రియాశీలతా గుణకం (∝) విలువ అనంతం కాదని చెపుతుంది.
→ ద్విగత ప్రక్రియలు లేదా ఉత్రమణీయ ప్రక్రియలు : ఉష్ణగతిక ప్రక్రియలు తొలిస్థితి (i) నుండి తుదిస్థితి (f) కి చేరేలోపు ఉష్ణరాశి (Q) ని గ్రహించి పని (W) ని జరుపుతాయి. వేరే ఏ ఇతర ఫలితాలు లేకుండా వ్యవస్థను తుదిస్థితి నుండి తొలిస్థితికి తీసుకొనిపోగలిగితే అటువంటి ప్రక్రియలను ద్విగత ప్రక్రియలు లేదా ఉత్రమణీయ ప్రక్రియలు అంటారు.
→ అనుత్రమణీయ ప్రక్రియ లేదా ఏకగతప్రక్రియ : ఈ విధమైన ప్రక్రియలను తొలిస్థితి (i) నుండి తుదిస్థితి (f) కి మారునపుడు ఉష్ణరాశి గ్రహించి పనిని చేయడం జరుగుతుంది. కాని ఏ ఇతర ఫలితాలు లేకుండా వ్యవస్థను తుదిస్థితి (f) నుండి తొలిస్థితి (1) కి తేవడం సాధ్యం కాదు.
ప్రకృతిలో తమంతట తాముగా జరిగే అన్ని ప్రక్రియలు ఏకగత లేక అనుమణీయ ప్రక్రియలే.
→ కార్నో యంత్రము రెండు ఉష్ణోగ్రతల మధ్య ఆదర్శవాయువుతో పనిచేసే ఉత్రమణీయ ఉష్ణయంత్రము.
దీని దక్షత η = \(\frac{w}{Q_l}\) = 1 – \(\frac{\mathrm{Q}_2}{\mathrm{Q}_1}\) లేదా η = 1 – \(\frac{\mathrm{T}_2}{\mathrm{~T}_1}\)
(T1 = జనకం ఉష్ణోగ్రత, T2 = ఉష్ణాశయం ఉష్ణోగ్రత, W = జరిగిన పని)
→ వస్తువు స్థితి ‘మార్పు లేకుండా వేడిచేయడానికి అందించిన ఉష్ణరాశి Q = mct.
→ స్థితి మార్పు పొందటానికి వస్తువుకు అందజేసిన ఉష్ణరాశి Q = mL.
→ జౌల్ నియమం నుండి పని W ∝ Q లేదా W = JQ.
J = ఉష్ణయాంత్రిక తుల్యాంకము
→ స్థితి శక్తి ఉష్ణంగా మారినపుడు
(a) జరిగిన పని మొత్తం వస్తువును వేడిచేయటానికి ఉపయోగిస్తే mgh = mct లేదా Δt = \(\frac{\mathrm{Mgh}}{\mathrm{mL}}\)
(b) జరిగిన పని వస్తువు స్థితి మార్పుకు ఉపయోగపడితే mgh = mL లేదా ద్రవీభవించిన వస్తువు ద్రవ్యరాశి m = \(\frac{\mathrm{Mgh}}{\mathrm{L}}\)
→ గతిశక్తి ఉష్ణంగా మారిన సందర్భంలో
(a) గతిశక్తి వస్తువును వేడిచేయటానికి మాత్రమే ఉపయోగపడితే
\(\frac{1}{2}\)mv2 = mct ⇒ Δt = \(\frac{\mathrm{mv}^2}{2 \mathrm{mc}}\)
(b) గతిశక్తి వస్తువు స్థితి మార్పు వరకు మాత్రమే ఉపయోగపడితే \(\frac{\mathrm{mv}^2}{2 \mathrm{mc}}\)mv2 = ML
ద్రవీభవించిన వస్తువు ద్రవ్యరాశి M = \(\frac{\mathrm{mv}^2}{2 \mathrm{mc}}\)
→ ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం నుండి dQ = dU + dW
→ వస్తువు ఉష్ణధారణ సామర్థ్యము \(\frac{\Delta \mathrm{Q}}{\Delta \mathrm{t}}\) = mc (i.e., ద్రవ్యరాశి × విశిష్టోష్ణము)
→ విశిష్టోష్టము S లేదా C
→ మిశ్రమ పద్ధతి నియమం నుండి వేడిగా ఉన్న వస్తువు కోల్పోయిన ఉష్ణరాశి = చల్లగా ఉన్న వస్తువు గ్రహించిన ఉష్ణరాశి
a) మిశ్రమ పద్దతి నియమంలో ఘపపదార్థపు విశిష్టోష్ఠము S = \(\frac{\mathrm{m}_1 \mathrm{~S}_1+\left(\mathrm{m}_2 \mathrm{~m}_1\right) \mathrm{S}_2\left(\mathrm{t}_2-\mathrm{t}_1\right)}{\left(\mathrm{m}_3-\mathrm{m}_2\right)\left(\mathrm{t}_2-\mathrm{t}_1\right)}\)J/kg-k
b) ద్రవాల విశిష్టోష్టము S = \(\frac{\left(m_3-m_2\right) S_1\left(t_2-t_1\right)}{\left(m_2-m_1\right)\left(t_3-t_1\right)}-\frac{m_1 S_2}{m_2-m_1}\)
→ రెండు గోళాల వ్యాసార్థాల నిష్పత్తి r1: r2 విశిష్టోష్ణముల నిష్పత్తి S1 : S2 మరియు సాంద్రతల నిష్పత్తి ρ1 : ρ2 అయితే
వాటి ఉష్ణధారణ సామర్థ్యాల నిష్పత్తి = \(\frac{m_1 S_1}{m_2 S_2}=\left(\frac{r_1}{r_2}\right)^3\left(\frac{\rho_1}{\rho_2}\right)\left(\frac{s_1}{S_2}\right)\)
a) వాయువుల విశిష్టోష్టము Cp = ΔQ / mΔT
b) మోలార్ విశిష్టోష్ఠముల నిష్పత్తి Cp = \(\frac{\Delta Q}{\mu \Delta t}\) (μ = మోల్ల సంఖ్య)
c) విశిష్టోష్ఠముల నిష్పత్తి γ = Cp/ Cv; Cv = \(\frac{\gamma \mathrm{R}}{\gamma-1}\). Cp = \(\frac{\gamma \mathrm{R}}{\gamma-1}\)
→ స్థిర పీడనానికి వ్యతిరేకంగా వాయువు వ్యాకోచించుటలో జరిగిన పని dW = P dV.
→ ఆదర్శవాయువు వ్యాకోచించుటలో జరిగిన పని
a) W = P (V2 – V1) లేదా W = R (T2 – T1)
μ = వాయువులోని మోత్ల సంఖ్య; R = సార్వత్రిక వాయు స్థిరాంకము
→ Cp మరియు Cv ల మధ్య సంబంధము Cp – Cv = R.
→ సమోష్ణోగ్రతా ప్రక్రియలో P, V మరియు T ల మధ్య సంబంధము PV = RT లేదా PV = μRT.
→ సమ ఉష్ణప్రక్రియ (adiabatic process) లో P, V మరియు T ల మధ్య సంబంధాలు
- PVγ = స్థిరరాశి
- TVγ-1 = స్థిరరాశి
- PV1-γ Tγ = స్థిరరాశి.
→ సమోష్ణోగ్రతా ప్రక్రియలో జరిగిన పని
a) W = RT loge\(\frac{v_2}{v_1}\)
b) W = 2.303 RT log10\(\frac{v_2}{v_1}\)
→ సమోష్ణ ప్రక్రియలో జరిగిన పని
a) W = \(\frac{1}{\gamma-1}\)(P1V1 – P2V2) మోల్-1 (లేదా)
b) W = \(\frac{\mu \mathrm{R}}{\gamma-1}\)(T1 – T2); μ = మోల్ల సంఖ్య
→ ఉష్ణయంత్రపు దక్షత η = 1 – \(\frac{\mathrm{Q}_2}{\mathrm{Q}_1}\) లేదా η = 1 − \(\frac{\mathrm{T}_2}{\mathrm{~T}_1}\)
T1 = జనకం ఉష్ణోగ్రత, T2 = ఉష్ణాశయం ఉష్ణోగ్రత.
→ వస్తువు స్థితి మార్పు లేకుండా వేడిచేయడానికి అందించిన ఉష్ణరాశి Q = mct.
→ స్థితి మార్పు పొందటానికి వస్తువుకు అందజేసిన ఉష్ణరాశి Q = mL.
→ ప్రయోగశాలలో నీటి బాష్పీభవన గుప్తోష్ణము కనుగొనుటలో
L = \(\frac{\left[\mathrm{m}_1 \mathrm{~S}_{\mathrm{c}}+\left(\mathrm{m}_2-\mathrm{m}_1\right) \mathrm{S}_{\mathrm{w}}\right]\left(\mathrm{t}_1-\mathrm{t}_2\right)}{\mathrm{m}_1-\mathrm{m}_2}\) – (t – t2)Sw
Sw = నీటి విశిష్టోష్టము ; Sc = కెలోరీ మీటరు విశిష్టోష్టము