TS Inter 1st Year Physics Notes Chapter 1 భౌతిక ప్రపంచం

Here students can locate TS Inter 1st Year Physics Notes 1st Lesson భౌతిక ప్రపంచం to prepare for their exam.

TS Inter 1st Year Physics Notes 1st Lesson భౌతిక ప్రపంచం

→ భౌతిక శాస్త్రము : భౌతికశాస్త్రం ప్రకృతి, ప్రకృతి సహజమైన దృగ్విషయాల అధ్యయనం. పరిశీలన ద్వారా మరియు ప్రయోగాలు చేసి చూడటం వల్ల శాస్త్రజ్ఞులు ప్రకృతిని నియంత్రిస్తూ పరిక్రియ జరిపే నిబంధనలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు.

→ ప్రకృతిలోని ప్రాథమిక బలాలు : భౌతికశాస్త్రంలో

  • గురుత్వాకర్షణ బలం
  • విద్యుదయస్కాంతబలం
  • ప్రబల కేంద్రకబలం
  • దుర్బల కేంద్రక బలాలను ప్రాథమిక బలాలుగా భావిస్తున్నారు.

1) గురుత్వాకర్షణ బలం : రెండు వస్తువుల ద్రవ్యరాశుల ఆధారంగా వాటి మధ్య గల ఆకర్షణ బలమే గురుత్వాకర్షణ బలం. ఇవి చాలా బలహీనమైన బలాలు. వీటి ప్రభావం చాలా ఎక్కువ దూరం వరకు విస్తరిస్తుంది. గ్రహాలు, నక్షత్రాల వంటి చాలా ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువుల విషయంలో ఈ బలాల పరిమాణం లెక్కించదగినంత పెద్దది. గ్రహాల గమనం, నక్షత్రాలు ఏర్పడటం, గెలాక్సీలు ఏర్పడటం వంటి దృగ్విషయాలలో ఈ బలాల ప్రాధాన్యం ఎక్కువ.

2) విద్యుదయస్కాంత బలం : ఆవేశిత కణాలు లేదా వస్తువుల మధ్య పనిచేసే బలం విద్యుదయస్కాంత బలం. ఇవి సజాతి ఆవేశాల మధ్య వికర్షణ బలంగాను, విజాతి ఆవేశాల మధ్య ఆకర్షణ బలంగాను ఉంటాయి. ఇవి చాలా బలమైన బలాలు. వీటి పరిధి ఎక్కువ. ఇవి గురుత్వాకర్షణ బలాల కన్న సుమారు 1036 రెట్లు పెద్దవి.

TS Inter 1st Year Physics Notes Chapter 1 భౌతిక ప్రపంచం

3) ప్రబల కేంద్రక బలాలు : ఇవి కేంద్రకంలోని కేంద్రక కణాలైన ప్రోటాన్లు, న్యూట్రాన్లను పట్టి బంధించే బలీయమైన బలాలు. ఇవి ప్రకృతిలోని ప్రాథమిక బలాలన్నింటిలో కన్న బలమైనవి. ప్రబలమైన కేంద్రక బలాలు విద్యుదయస్కాంత బలాల కన్న దాదాపు 100 రెట్లు బలమైనవి. ఇవి కేంద్రక కణాలు ఆవేశంపై ఆధారపడవు. ఇవి స్వల్ప వ్యాప్తి గల బలాలు. వీటి పరిధి సుమారు 10-15 మీటర్లు. కేంద్రక స్థిరత్వానికి ఇవి పూర్తి బాధ్యత వహిస్తాయి.

4) దుర్బల కేంద్రక బలాలు : కేంద్రకంలో సంభవించే కొన్ని β – క్షయం వంటి కొన్ని నిర్దిష్ట కేంద్రక చర్యలలో ఈ దుర్బల కేంద్రక బలాలు ప్రత్యక్షమవుతాయి. ఇవి ప్రబల కేంద్రక బలాలు, విద్యుదయస్కాంత బలాల కన్న బలహీనమైనవి. వీటి వ్యాప్తి చాలా తక్కువ. ఈ దుర్బల కేంద్రకబలం వ్యాప్తి 10-16 మీ.ల క్రమంలో ఉండే అత్యంత స్వల్పమైనది.

→ నిత్యత్వరాశులు : భౌతిక శాస్త్రంలో విభిన్న బలాలను నియంత్రించే భౌతిక దృగ్విషయాలు లేదా కొన్ని ప్రత్యేక భౌతిక రాశులు ఏదైనా ప్రక్రియలో మార్పు లేకుండా స్థిరంగా ఉంటాయి. ఇటువంటి వాటిని నిత్యత్వ రాశులు లేదా నిత్యత్వ నియమాలు అంటారు.
ఉదా : స్వేచ్ఛగా కిందికి పడే వస్తువులో స్థితిశక్తి, గతిశక్తుల విలువలు కాలంతోపాటు మారుతున్నప్పటికి ఆ రెండు శక్తుల మొత్తం స్థిరంగా ఉంటుంది. అనగా ఈ సందర్భంలో శక్తినిత్యత్వం చెందినది అంటారు.

Leave a Comment