TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 6th Lesson రాజపుత్రుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 6th Lesson రాజపుత్రుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజపుత్రుల పరిపాలనా ముఖ్య లక్షణాలను తెలపండి. –
జవాబు.
5 శతాబ్దాల రాజపుత్రుల పాలనలో భారతదేశం ఎన్నో రకాల అభివృద్ధిని సాధించింది. రాజపుత్రులు గుప్తుల, హర్షవర్ధునుని పాలనా వారసత్వాన్ని స్వీకరించారు. కొన్ని దురదృష్ట పరిస్థితుల వల్ల వారి కీర్తిప్రతిష్టలు క్షీణించాయి. మహ్మదీయుల దండయాత్రల వల్ల రాజపుత్రయుగం విషాదంతో ముగిసింది.

పరిపాలనా విధానం : రాజపుత్రులు చిన్న చిన్న రాజ్యాలను స్థాపించడంవల్ల, వీటిల్లో స్థానికమైన మార్పులతో, చాలావరకు పూర్వపాలనా విధానాన్ని అనుసరించారు. వారి శాసనాల్లో మంత్రి, మహామాత్య, ధర్మాధ్యక్ష, సంధివిగ్రహక, బాండాగారాధిపతి, దండాధ్యక్ష మొదలైన పేర్లతో ఉద్యోగులున్నట్లు తెలుస్తుంది. వీరిలో చాలామంది గుప్త, హర్షయుగా ల్లోని ఉద్యోగులే. పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని ‘భోగ’ (రాష్ట్రం) అనే పేరుతో విభజించారు. భోగను కొన్ని విషయాలుగా, విషయాలను మళ్ళీ గ్రామాలుగా విభజించారు. పరిపాలనకు గ్రామమే మౌళికమైన పునాది. సైన్యం : రాజపుత్రులు గొప్ప యోధులు. సమర్థవంతమైన సైన్యాన్ని పోషించారు. రాజపుత్ర సైనికులు సంప్రదాయసిద్ధమైన యుద్ధపద్ధతులను అవలంభించారు. కత్తులు, ఈటెలు, బాణాలు, విల్లంబులు మొదలైనవి ఉపయోగించారు. రాజపుత్రులు .యుద్ధప్రియులైనప్పటికి, వ్యూహరచనలో కాని, ఆయుధాల్లోకాని అవసరమైన మార్పులను తీసుకురాలేకపోవడం వల్ల మహ్మదీయుల దాడిలో సులభంగా ఓడిపోయారు. మహ్మదీయుల సైన్యాలు క్రమశిక్షణ కలిగి యుద్ధంలో ఆరితేరి ఉన్నాయి.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

మతం : గుప్తయుగంలో ప్రారంభమైన మత, సాంస్కృతిక ఉద్యమాలు రాజపుత్రయుగంలో పతాకస్థాయికి చేరుకొన్నాయి. వీరి పోషణలో హిందూ మతానికి నూతన చైతన్యం, బలం చేకూరాయి. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, కుమారిలభట్టు చైతన్యుడు, రామానందుడు మొదలైన మతబోధకుల కార్యక్రమాలవల్ల హిందూ మతానికి నూతన ఉత్తేజం వచ్చింది. పురాణాలే వారికి ప్రామాణిక గ్రంథాలైనవి. పురాణాలు తీర్థయాత్రలు చేయడం, వ్రతాలు చేయడం, పురాణాలను పఠించడం వంటి వాటివల్ల కలిగే ప్రయోజనాలను నిర్దేశించాయి. రాజపుత్రులలో చాలామంది శైవులు. కాని విష్ణు, ఆదిత్య, గణపతి వంటి అనేకమంది దేవతలను పూజించారు. ఈ దేవతలకోసం అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. మఠాలు వెలసి ప్రజల్లో ఆధ్యాత్మిక ఐహికజ్ఞానాన్ని వ్యాప్తి చేశాయి. గుజరాత్లో సోలంకీలు జైనమతాన్ని పోషించారు. గుజరాత్లో వారు నిర్మించిన జైన దేవాలయాలు ఈ యుగంనాటి గొప్ప వాస్తునిర్మాణాలుగా పేర్కొనవచ్చు.

ఆర్థికవ్యవస్థ : ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. రాజపుత్రులు నీటిపారుదల సౌకర్యాలకోసం విశేషమైన కృషిచేశారు. అందుకోసం, తటాకాలు, కాలువలు, బావులను త్రవ్వించారు. పరమార రాజు ముంజరాజు’సుప్రసిద్ధమైన ముంజేశ్వర్ తటాకమును నిర్మించాడు. రాజపుత్రయుగంలో భూమిశిస్తు అధికంగా ఉండేది. 1/3 నుంచి 1/6 వరకు వసూలు చేసేవారు. వ్యవసాయంతోపాటు వడ్రంగి, నౌకానిర్మాణం, యుద్ధసామాగ్రి తయారి లాంటి పరిశ్రమలు కూడా ఉండేవి. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించారు. దేబల్, కాంబే, సొపార, క్విలాన్ పశ్చిమతీరంలోని ప్రధాన ఓడరేవులు. అరబ్ దేశాలతో రాజపుత్రులు వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారు.

సమాజం : ఐదు శతాబ్దాల రాజపుత్రుల పాలనలో సామాజికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. రాజపుత్రయుగంలో వర్ణవ్యవస్థ కఠినమైంది. స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. ఎందరో స్త్రీలు విద్యావంతులై, సాహిత్య, మత చర్చల్లో, లలితకళల్లో, ప్రభుత్వ నిర్వహణలోనే గాక, ఆయుధాలను ఉపయోగించడంలో కూడా ఆరితేరాడు. సుగంధ, దిడ్డ అనే కాశ్మీర్కు చెందిన వితంతురాణులు సైతం విశాల రాజ్యాలను పాలించారు. మందనమిశ్ర భార్య గొప్ప పండితురాలు. మందన మిశ్ర, శంకరాచార్యుల మధ్య జరిగిన సంవాదంలో ఈమే న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. రాజశేఖరుడి భార్య అవంతిసుందరి అసాధారణమైన ప్రతిభ కలిగిన మహిళ.

మొత్తం మీద ఈ యుగంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. వారిని మేధాపరంగా తక్కువగా చూసేవారు. స్త్రీలపై అనేక రకాల ఆంక్షలు విధించబడ్డాయి.

ప్రశ్న 2.
రాజపుత్ర యుగం నాటి సాంస్కృతిక పరిస్థితుల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
సాహిత్యం : రాజపుత్రయుగం నాటి సాహిత్యం, కళలు గుప్తయుగం నుంచి ప్రేరణపొందాయి. రాజపుత్రరాజులు వివిధ రకాల విద్యల్లో పాండిత్యాన్ని సంపాదించారు. వీరు తమ ఆస్థానాల్లో సారస్వతాన్ని, కళలను ప్రోత్సహించారు. నలందా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఖ్యాతిగాంచింది. దూరప్రాచ్యానికి చెందిన శైలేంద్రరాజులు కూడా దీని పోషణకు కృషిచేశారు. బెంగాల్ పాలరాజులు బీహార్లో విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని, ఉద్ధంతపురి, జగద్దల విద్యాకేంద్రాలను స్థాపించి, పోషించారు. పరమార రాజు భోజుడు తన రాజధాని ధారానగరంలో ఒక కళాశాలను స్థాపించాడు. కాశ్మీర్ కవి మంఖ తన శ్రీకంఠచరిత్ర అనే గ్రంథంలో రాజ్యంలో చాలా శాస్త్రపరిషత్తులు ఉండేవని తరువాత. అవి అంతరించిపోయాయని పేర్కొన్నాడు.

రాజపుత్ర రాజుల్లో కొందరు స్వయంగా కవులు, కవి పండిత పోషకులు. పరమార ముంజరాజు, కాశ్మీర్ లొహార రాజులు, అనిహిల్వాడ్ మహిపాలుడు, బెంగాల్ లక్ష్మణసేనుడు, ధారానగరానికి చెందిన భోజరాజు ఈ యుగంనాటి గొప్ప పండితులు. లక్ష్మణసేనుడి ఆస్థానంలో సంస్కృత సాహిత్యంలో “పంచరత్నాలు” అనబడే కవులుండేవారు.. భోజరాజును “కవుల్లో రాకుమారుడు” అంటారు. భోజరాజు కవితలమీద సరస్వతీ కంఠాభరణం, శృంగార ప్రకాశ, రాజనీతిపై యుక్తికల్పతరువు, యోగ సూత్రాలపై వ్యాఖ్యానాలు (రాజమార్తాండ) అనేవి రాసాడు.

వాస్తు శిల్పాలు : రాజపుత్రులు, వాస్తుశిల్పాలకు విశేషమైన కృషిచేశారు. కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చితోడ్, ఉదయ్ పూర్ మొదలైన చోట్ల గిరి దుర్గాలు, అందమైన రాజభవనాలు నిర్మించారు. వారి ఆలయాలు శిథిలాలు నేటికీ ఆ యుగం నాటి కళాత్మక ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యభారతదేశంలో మహ్మదీయుల దండయాత్రల మూలంగా చాలావరకు ఇవి పతనమైనాయి. ఢిల్లీలోని ‘కువత్-ఉల్-ఇస్లాం’ మసీదు నిర్మాణంకోసం 26 దేవాలయాలను కూల్చిన సామాగ్రిని ఉపయోగించారు. అజ్మీర్లోని అర్ఘాయి-దిన్-జోంప్రాలోని వేయిస్తంభాలు కనీసం 50 దేవాలయాలు శిథిలాలతో నిర్మించారు. రాజపుత్రయుగం నాటి దేవాలయాల్లో ఎక్కువగా మహ్మదీయ దాడుల్లో శిథిలం అయినప్పటికి ఇంకా నేటికి సజీవంగా ఉన్న నిర్మాణాలు వారి వాస్తుకళానైపుణ్యాన్ని, వాటిపట్ల వారి కళాభిమానాన్ని చాటుతున్నాయి.

పూరీ జగన్నాథాలయం, కోనార్క్ సూర్యదేవాలయం, ఒరిస్సా ఆలయ వాస్తురీతికి ఉదాహరణలు. కోనార్క్ దేవాలయంలోని శిల్పసంపద అద్భుతమైంది. శిల్పకళకు మరొక ముఖ్యకేంద్రం చందేలుల రాజధాని ఖజుర. రాజస్థాన్, గుజరాత్లోని దేవాలయాలు ఉత్తరభారతవాస్తువు ‘నగర’ శైలిలో నిర్మించారు. అబూ పర్వతంపై వస్తుపాల, తేజపాల అనే ఇద్దరు వర్తక సోదరులు, రెండు ‘అందమైన జైన దేవాలయాలను నిర్మించారు. ఇవి గుజరాత్ శైలికి ఉదాహరణలు. ముగింపు : ప్రతీహారులు, పరమారులు, చౌహారులు, గహద్వాలులు మొదలైన రాజపుత్రవంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పాలించారు. రాజపుత్రవంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పాలించారు. రాజపుత్ర రాజులు ఎంతోమంది కవులను పోషించారు. స్వయంగా వారు కూడా కవులు, నాటకాలు, వివిధ సాహిత్య గ్రంథాలను రాసారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నగర శైలిలో దేవాలయాలు నిర్మించారు. వ్యాపారాభివృద్ధి కోసం ఓడరేవులు నిర్మించారు. విక్రమశిల, వల్లభి మొదలైన విశ్వవిద్యాలయాలు ఈ యుగంలోనే స్థాపించబడ్డాయి.

ప్రశ్న 3.
అరబ్బుల దండయాత్రకు గల కారణాలు, ఫలితాలను పేర్కొనండి.
జవాబు.
ఇస్లాం మత విజృంభణ అరేబియా, మధ్య ఆసియా చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. మహ్మద్ ప్రవక్త క్రీ.శ.570-632 ఇస్లాం మత స్థాపకుడు. క్రీ.శ.612లో మహ్మద్ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. తాను పొందిన జ్ఞానాన్ని అరేబియాలో బోధించాడు. క్రీ.శ. 632లో తన 62వ ఏట మహ్మద్ ప్రవక్త మరణించాడు. ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, పూజారుల ప్రమేయం లేని నిరాడంబర ఆరాధన విధానం, సాంఘిక సమానత్వం మొదలైనవి మహ్మద్ బోధించిన ఇస్లాం మత ముఖ్య సూత్రాలు. ప్రవక్త మరణానంతరం ఉమయ్యద్ వంశ ఖలీఫాలు, ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేశారు. వీరి తర్వాత ‘అబ్బాసిద్’ వంశం ఖలీఫా పదవిని పొందింది. ఇస్లాం మతస్థులు ఖలీఫాను తమ రాజకీయ, మతాధినేతగా గుర్తించి గౌరవించారు.

భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుల్లో అరబ్బులు మొదటివారు. ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో వీరికి వర్తక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఇస్లాం అవతరణ, వ్యాప్తి అరబ్బుల దృక్పథంలో మార్పును తెచ్చింది. అరబ్లు మతం పేరున ఐక్యం అయ్యారు. వారు సిరియా, ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ మొదలైన రాజ్యాలను ఆక్రమించి ఇస్లాం వ్యాప్తి చేసారు. ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్, సింద్లను ఆక్రమించాలని వ్యూహం పన్నారు.

ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పు దిశగా వ్యాప్తి చేయాలన్న అరబ్బుల లక్ష్యం వారిని కాబుల్ ఆక్రమణకు ప్రోత్సహించింది. కాబుల్ విజయం వారిని భారతదేశ సరిహద్దుకు సన్నిహితం చేసింది. వారు అనేకసార్లు భారతదేశ తీరంపై దాడులు చేసి, దోపిడీ చేశారు. క్రీ.శ. 711కంటే ముందు జరిగిన అరబ్బుల దాడులు కేవలం నాటి తీరప్రాంత సిరిసంపదలను కొల్లగొట్టాయి. కానీ భారత భూభాగాలు ఆక్రమించలేదు. ఖలీఫా వాలిద్ అరేబియాను పరిపాలిస్తున్న కాలంలో సింధ్ రాజ్యాన్ని ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్యానికి చెందిన కొందరు సముద్ర దొంగలు. ఖలీఫా వాలిద్ కోసం తీసుకొని వెళుతున్న ఓడలపై దాడిచేసి దోచుకున్నారు. ఈ సంఘటన సింధ్ రాజ్యంలోని దేవాల్ ఓడరేవులో చోటుచేసుకుంది. ఖలీఫా తన వైస్రాయిని సింధ్ ప్రాంత సముద్ర దొంగలను శిక్షించమని ఆదేశించారు. సింధ్ రాజ్య పాలకుడైన దాహిర్ న్ను జరిగిన సంఘటనపై సంజాయిషీ అడిగాడు. కానీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వనందున ఆగ్రహించి ఖలీఫా హజ్జాజ్ను సింధ్ రాష్ట్రంపై భారీ సైన్యంతో దండెత్తమని ఆదేశించాడు. సింధు జయించడానికి రెండుసార్లు బలమైన సైన్యాలను హజాజ్ పంపాడు. కానీ అరబ్బు సేనాధిపతులు ఓడిపోయారు. తుదకు తన అల్లుడైన మహ్మద్ బీన్ ఖాసిం అనేవానిని అపారసైన్యంతో పంపాడు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

ఖాసిం 25,000 అరబ్బు సైన్యంతో దేబాల్ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు. ఇస్లాం మతం స్వీకరించని వారిని కత్తికి బలి ఇచ్చాడు. నెరూన్, శ్వాన్, శాలమ్ ప్రాంతాలు తేలికగా ఆక్రమించుకున్నాడు. క్రీ.శ. 712లో ఖలీఫా సైన్యాలను, హజ్జాజ్ సేనాధిపతి మహ్మబ్బీన్ ఖాసిం నడిపాడు. అలోర్ వద్ద జరిగిన యుద్ధంలో సింధ్ రాజ్యపాలకుడు దాహిర్ ఓడి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విజయం అరబ్బులకు నూతనోత్సాహాన్ని నిచ్చింది. ముల్తాన్పై దండెత్తి ఖాసిం దాన్ని వశపరచుకున్నాడు. ఆ తరువాత ‘కనౌజ్’పై దండెత్తడానికి పథకం రూపొందిస్తున్న సమయంలో తమ యజమాని, ఖలీఫా ఆదేశాలపై స్వదేశం తిరిగి వెళ్ళాడు. అక్కడకు చేరుకోకముందు పన్నిన కుట్రకు బలయ్యాడు.

అరబ్బుల దండయాత్ర విజయవంతం కావడానికి నాటి భారతదేశంలో లోపించిన రాజకీయ అనైక్యత దోహదపడింది. ఈ దండయాత్ర వలన భారతీయ రాజకీయ వ్యవస్థ, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక స్థితి, మతాచారాలు తీవ్రంగా మార్పులకు గురయ్యాయి. సుప్రసిద్ధ చరిత్రకారుడు లేన్పల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయంగా అభివర్ణించారు. భారతదేశంపై అరబ్బుల దండయాత్రలు విజయవంతమైనప్పటికీ అది శాశ్వతంగా వారి అధికారాన్ని నెలకొల్పలేకపోయింది. ఈ తరువాత కొన్ని సంవత్సరాల పాటు భారతీయులకు విదేశీ దాడుల బెడద తప్పింది. అరేబియా ఇతర ప్రాంతాలలో ఖలీఫా ఆధిపత్యం, హోదా క్రమంగా క్షీణించాయి. అరబ్బుల పతనంలో తురుష్కులు క్రియాశీల పాత్ర పోషించారు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

ప్రశ్న 4.
మహమ్మద్ గజనీ దండయాత్రల స్వభావం, ఫలితాలను వివరించండి.
జవాబు.
మహ్మద్ ఘజనీ పూర్వీకులు ‘ఘజనీ’ రాజ్యం కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారు. సబక్తజిన్ కుమారుడైన ఘజనీ మహ్మద్ క్రీ.శ. 998లో రాజ్యసింహాసనం అధిష్టించాడు. ఇతడు గొప్ప సేనాని. పరిపాలన తొలి దశలోనే అనేక యుద్ధాలు చేసాడు. ఘజనీ సైనిక విజయాలతో ప్రభావితుడైన ఖరీఫా అతడికి సుల్తాన్ హోదాతోపాటు ‘యామన్-ఉద్-దౌలా’ అనే బిరుదుతో సత్కరించాడు. ఆ తరువాత భారతదేశ సిరిసంపదలకు ఆకర్షితుడై, భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలన్న పట్టుదలతో తన దృష్టిని భారతదేశంవైపు మరల్చాడు. క్రీ.శ. 1000-1027 మధ్యకాలంలో ఘజనీ భారతదేశంపై దాదాపుగా ప్రతి ఏడాదీ దాడులు జరిపాడని చరిత్రకారుల అభిప్రాయం. తన జీవితకాలంలో సుమారుగా పదిహేడు పర్యాయాలు దాడులు జరిపాడు.

ఘజనీ దండయాత్రల కాలంలో భారతదేశ పరిస్థితులు : నాటికి దేశంలో రాజకీయ అనైక్యత నెలకొంది. అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలున్నాయి. సింధ్, ముల్తాన్లు అరబ్ అధికారంలో ఉన్నాయి. ఇతర రాజ్యాలలో స్వదేశీ హిందూ పాలకులు అధికారంలో ఉన్నారు. వీరి మధ్య తరచు యుద్ధాలు జరుగుతుండేవి. నాటికి దక్షిణ భారతదేశంలో కళ్యాణి చాళుక్యులు, తంజావూరు చోళులు పరిపాలించేవారు. స్వదేశీ పాలకుల్లో నెలకొన్న శతృత్వం, అనైక్యత, దూరదృష్టి లోపం విదేశీ దాడులు విజయవంతం కావడానికి దోహదం చేసాయి.

ఘజనీ దండయాత్రలు : ఘజనీ తొలి దండయాత్ర క్రీ.శ. 1002లో భటిండా రాజ్యంపై జరిగింది. యుద్ధంలో దాని పాలకుడైన జయపాలుడిని బంధించాడు. అవమానభారాన్ని తట్టుకోలేని జయపాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దండయాత్రతో అపార ధన, కనక రాశులను దోచుకున్నాడు.

క్రీ.శ. 1004లో రెండో దండయాత్ర బెహ్రా రాజ్యంపై జరిపాడు. దీని పాలకుడైన రాయ్ పరాజయం పొందాడు. క్రీ.శ. 1005లో ముల్తాన్ రాజ్యంపై దాడి చేశాడు. ఆ తరువాత దాడిలో ఆనందపాలుడ్ని అతడి మిశ్రులను ఓడించాడు.నాగర్ కోట్, నారాయణపూర్, కాశ్మీర్, స్థానేశ్వరం, మధుర మొదలైన ప్రాంతాలపై దాడులు జరిపాడు.

12వ ధండయాత్ర కనౌజ్ రాజ్యంపై చేశాడు. రాజ్యపాలుడు ఘజనీ సేనల చేతిలో పరాజయం పొందాడు. కనౌజ్జ్య సిరి సంపదలను ఘజనీ సేనలు దోచుకున్నాయి. తరువాత జరిగిన 14వ దాడి గ్వాలియర్పై, 15వ దండయాత్ర కళింజర్పై జరిగాయి.

క్రీ.శ. 1025 సంవత్సరంలో ఘజనీ మహ్మద్ గుజరాత్, కదియవార్ లోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన సోమనాథ్ ఆలయంపై దాడిచేశాడు. అక్కడి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఆలయ ధనాన్ని, నగలు, ఆభరణాలు దోచుకున్నాడు. క్రీ.శ. 1027 సంవత్సరంలో చివరి దండయాత్ర జాట్లపై జరిగింది. సోమనాథ్ దండయాత్ర నుంచి అపార ధన, కనకరాశులతో తిరిగి వస్తున్న తన సేనలపై జాట్లు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఘజనీ వారిపై దండెత్తాడు. నిరంతర యుద్ధాలతో, క్షీణించిన ఆరోగ్యంతో క్రీ.శ. 1029లో మరణించాడు.

ఘజనీ ఓటమి : ప్రఖ్యాత చరిత్రకారుడు కొమర్రాజు లక్ష్మణరావు ఘజనీ తన ఏడవ, ఎనిమిదవ, పదవదాడులలో ఓడిపోయాడని భావించారు. అల్బెరూనీ కితాబ్ ఉల్ హింద్ రచన ప్రకారం ఆనందపాలుడి చేతిలో ఘజనీ ఓడిపోయాడు. “నేను “నిన్ను పూర్తిగా పరాభవించాను, ఆ గౌరవం ఇంకెవరికీ దక్కకూడదని నా కోరిక” అని ఉత్తరం కూడా రాసాడని తెలుస్తుంది.

ఘజనీ దండయాత్రల ఫలితాలు : విగ్రహారాధకులను శిక్షించి, ఇస్లాం మతం వ్యాప్తి చేయాలని, భారతదేశంలోని సిరిసంపదలను కొల్లగొట్టాలని అనేకమార్లు జరిపిన దండయాత్రలలో మధుర, కథియావర్, కనౌజ్లలోని అనేక దేవాలయాలు విధ్వంసం అయ్యాయి. ఇస్లాం భారతదేశంలోని అంతర్ భూభాగాలకు విస్తరించింది. ఘజనీకి భారతదేశంపై అధికారాన్ని నెలకొల్పాలనే ఉద్దేశం, లక్ష్యం లేవని చరిత్రకారుల అభిప్రాయం. పంజాబ్ ఆక్రమణ తర్వాత దాన్ని మాత్రమే అతడు ఘజ్నవీడ్ రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.

ఘజనీ మహ్మద్ గొప్ప యోధుడు. పట్టుదలకు మారుపేరు. చిన్న ఘజనీ రాజ్యాన్ని సువిశాల మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఇతడు సున్నీమతశాఖను నిష్టగా ఆచరించాడు. మత ఛాందసవాది. ఇతని వారసుల అసమర్థత వలన ఘజనీ వంశం నుంచి అధికారులు ఘోరీ సర్దారుల కైవసం చేసుకున్నారు.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజపుత్రయుగం నాటి మహిళల స్థితిగతులను వివరించండి.
జవాబు.
ఐదు శతాబ్దాల రాజపుత్రుల పాలనలో సామాజికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. రాజపుత్రయుగంలో వర్ణవ్యవస్థ కఠినమైంది. స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. ఎందరో స్త్రీలు విద్యావంతులై, సాహిత్య, మత చర్చల్లో, లలితకళల్లో, ప్రభుత్వ నిర్వహణలోనే గాక, ఆయుధాలను ఉపయోగించడంలో కూడా ఆరితేరాడు. సుగంధ, దిడ్డ అనే కాశ్మీర్కు చెందిన వితంతురాణులు సైతం విశాల రాజ్యాలను పాలించారు. మందనమిశ్ర భార్య గొప్ప పండితురాలు. మందన మిశ్ర, శంకరాచార్యుల మధ్య జరిగిన సంవాదంలో ఈమే న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. రాజశేఖరుడి భార్య అవంతిసుందరి అసాధారణమైన ప్రతిభ కలిగిన మహిళ. మొత్తం మీద ఈ యుగంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. వారిని మేధాపరంగా తక్కువగా చూసేవారు. స్త్రీలపై అనేక రకాల ఆంక్షలు విధించబడ్డాయి.

ప్రశ్న 2.
తరాయిన్ యుద్ధాల గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు.
మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశేష ప్రాముఖ్యతగల యుద్ధాలివి. క్రీ.శ. 1191, 1192లో జరిగాయి. ఘోరీ పంజాబ్ తర్వాత ఢిల్లీపై దృష్టి కేంద్రీకరించాడు. ఆ రోజుల్లో ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను చౌహాన్ వంశానికి చెందిన ‘పృథ్వీరాజ్ చౌహాన్’ పాలించేవాడు. పృథ్వీరాజ్ రాజపుత్రులలో అసమాన ప్రతిభ, ధైర్యసాహసాలు గల పాలకుడు. తన వైపు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించి సోదర రాజపుత్రులతో కలిసి పోరాడాడు. క్రీ.శ.1191లో మొదటిసారి తరైన్ వద్ద జరిగిన యుద్ధంలో ఘోరీ సేనలను ఓడించాడు. పట్టుదలగా ఘోరీ ఏడాది తిరగకముందే క్రీ.శ. 1192లో రెండోసారి ఢిల్లీ పాలకుడైన పృథ్వీరాజ్పై దాడి చేస్తాడు. ఇరుపక్షాలు రెండోసారి తరైన్ వద్ద తలపడ్డాయి. ఘోరీని రాజపుత్రులు అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నప్పటికీ ఓటమి పాలయ్యారు. పృథ్వీరాజ్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ విజయంతో ఘోరీ ఢిల్లీ, అజ్మీర్ లను వశపరుచుకున్నాడు. ఆ తరువాత ఘోరీ సరస్సుతీ, సమానా, కుహ్రాన్, హన్సీ ప్రాంతాలను ఆక్రమించాడు. భారతదేశంలో తాను ఆక్రమించిన ప్రాంతాలకు తనకు భానిస, విశ్వాసపాత్రుడైన కుతుబుద్దీన్ ఐబకన్ను రాజప్రతినిధిగా నియమించి తన స్వదేశం తిరిగి వెళ్ళాడు. క్రీ.శ.1194లో ఘోరీ మరోసారి రాజపుత్రుల శక్తిని సంపూర్ణంగా అంతమొందించాలని మరోసారి భారీ సైన్యంతో దండెత్తి వచ్చాడు. కనౌజ్ రాజ్యాన్ని పాలిస్తున్న జయచంద్రుడు ఘోరీని ఎదిరించి చందావర్ వద్ద జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ యుద్ధ సందర్భంలో బనారస్ సమీపంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేసాడు. ఆ మరుసటి ఏడాదీ క్రీ.శ.1195 లో బయానా, గ్వాలియర్లపై దండెత్తి వాటిని ఆక్రమించాడు.

మహ్మద్ ఘోరీ క్రీ.శ. 1205లో చివరిసారి భారతదేశంపై ఘక్కర్ల తిరుగుబాటును అణచివేయడానికై దండెత్తాడు. ఘోరీ సేనాధిపతులైన భక్తియార్ ఖిల్జీ, వైస్రాయి కుతుబుద్దీన్లు మీరట్, అలీఘర్, కాశ్మీర్ బులందర్, బెంగాల్, బీహార్ మొదలైన ప్రాంతాలను ఆక్రమించారు. ఘక్కర్ల తిరుగుబాటును అణచివేసి, విజయంతో వెనుతిరుగుతున్న మహ్మద్ ఘోరీ ఘక్కర్లో ఆకస్మిక దాడిలో చనిపోయాడు.

ప్రశ్న 3.
రాజపుత్రయుగం నాటి వాస్తుశిల్పాల గురించి తెలపండి.
జవాబు.
రాజపుత్రులు వాస్తుశిల్పాలకు విశేషమైన కృషిచేశారు. కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చితోడ్, ఉదయ్పూర్ మొదలైన చోట్ల గిరి దుర్గాలు, అందమైన రాజభవనాలు నిర్మించారు. వారి ఆలయాల శిథిలాలు నేటికీ ఆ యుగం నాటి కళాత్మక ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యభారతదేశంలో మహ్మదీయుల దండయాత్రల మూలంగా చాలావరకు ఇవి పతనమైనాయి. ఢిల్లీలోని ‘కువత్-ఉల్-ఇస్లాం’ మసీదు నిర్మాణం కోసం 26 దేవాలయాలను కూల్చిన సామాగ్రిని ఉపయోగించారు. అజ్మీర్ లోని అర్ఘాయి-దిన్-జోంప్రాలోని వేయిస్తంభాలు కనీసం 50 దేవాలయాల శిథిలాలతో నిర్మించారు. రాజపుత్రయుగం నాటి దేవాలయాల్లో ఎక్కువగా మహ్మదీయ దాడుల్లో శిథిలం అయినప్పటికి ఇంకా నేటికి సజీవంగా ఉన్న నిర్మాణాలు వారి వాస్తుకళానైపుణ్యాన్ని, వాటిపట్ల వారి కళాభిమానాన్ని చాటుతున్నాయి.

పూరీ జగన్నాథాలయం, కోనార్క్ సూర్యదేవాలయం, ఒరిస్సా ఆలయ వాస్తురీతికి ఉదాహరణలు. కోనార్క్ దేవాలయంలోని శిల్పసంపద అద్భుతమైంది. శిల్పకళకు మరొక ముఖ్యకేంద్రం చందేలుల రాజధాని ఖజుర. రాజస్థాన్, గుజరాత్లోని దేవాలయాలు ఉత్తరభారతవాస్తువు ‘నగర’ శైలిలో నిర్మించారు. అబూ పర్వతంపై వస్తుపాల, తేజపాల అనే ఇద్దరు వర్తక సోదరులు, రెండు అందమైన జైన దేవాలయాలను నిర్మించారు. ఇవి గుజరాత్ శైలికి ఉదాహరణలు.

TS Inter 1st Year History Study Material Chapter 6 రాజపుత్రుల యుగం

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పృధ్వీరాజ్ రాసో గురించి రాయండి.
జవాబు.
రాజపుత్రుల పుట్టుక గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని “పృధ్వీరాజ్ రాసో” అనే హింది కావ్యంలో చాంద్ బర్దాయ్ అనే కవి తెలియజేసాడు. ఇతడి ప్రకారం అబూ పర్వతం మీద వశిష్ఠుడు చేసిన హోమాగ్ని నుంచి ఉద్భవించిన వీరుడి సంతతి వారైనందువల్ల వీరు అగ్నికుల క్షత్రియులయ్యారని పేర్కొన్నాడు. ఈ యజ్ఞగుండం నుంచి నలుగురు వీరులు ఉద్భవించారని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజపుత్ర రాజ్యాన్ని స్థాపించారనే అభిప్రాయం కలదు. చౌహానులు, సోలంకీలు లేదా చాళుక్యులు, పరమారులు, ప్రతీహారులు ఈ వంశీయులని పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
రాజతరంగిణి ప్రాధాన్యత,
జవాబు.
ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడు రచించిన ‘రాజ తరంగిణి’. ఇది క్రీ.శ. 1148 సం||లో రచించబడినది. ఇది కాశ్మీర్ : రాజుల చరిత్ర. కాశ్మీర్ వారు చరిత్రపట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారని కల్హణుడు తెలియజేసినాడు. చరిత్రపట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా రచించాడు.

ప్రశ్న 3.
భోజరాజు రచనలు ఏవి ?
జవాబు.
భోజరాజును “కవుల్లో రాజకుమారుడు” అంటారు. భోజరాజు కవితల మీద ‘సరస్వతీ కంఠాభరణం’, ‘శృంగార ప్రకాశ’ రాజనీతిపై ‘యుక్తికల్ప తరువు’, యోగ సూత్రాలపై ‘రాజమార్తాండ’ వ్యాఖ్యానం రచించాడు.

ప్రశ్న 4.
అరబ్ దండయాత్రల ప్రభావం.
జవాబు.
ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పుదిశగా వ్యాప్తి చేయాలనేది అరబ్ల లక్ష్యం. దీనికై వారు అనేకసార్లు -దాడులు చేసారు. ఖలీఫా వాలిద్ అరేబియాను పాలిస్తున్న రోజులలో సింధ్ను ‘దాహిర్’ పరిపాలించేవాడు. సింధ్ రాజ్య సముద్ర దొంగలు. ఖలీఫా కోసం తీసుకెళుతున్న ఓడలను దోచుకున్నారు. దీనిపై దాహిర్ను వివరణ అడిగి సరైన సమాధానం లేదనే సాకుతో క్రీ.శ. 712లో మహ్మద్-బీన్-ఖాసిం నేతృత్వంలో దండెత్తాడు. ‘అలోర్’ వద్ద జరిగిన యుద్ధంలో దాహిర్ ఓడి ప్రాణాలు కోల్పోయాడు. భారతీయుల అనైక్యత అరబ్బుల దాడి విజయవంతం కావడానికి తోడ్పడింది. అయితే ఆచార్య లేనప్పూల్ అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలివ్వని ఘనవిజయంగా వర్ణించాడు.

Leave a Comment