TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

Telangana TSBIE TS Inter 1st Year History Study Material 8th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం Textbook Questions and Answers.

TS Inter 1st Year History Study Material 8th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాల్బన్ గొప్పతనాన్ని వివరించండి.
జవాబు.
ఘియాసుద్దీన్ – బాల్బన్ (క్రీ.శ. 1266 – 1287) : బానిస వంశ పాలకులందరిలోకెల్లా గొప్ప సుల్తాన్ బాల్బన్. ఇతడు క్రీ.శ. 1205లో మధ్య ఆసియాలోని ఒక చిన్న ‘ఇల్బారీ’ తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. .బాల్యంలో ఇతన్ని మంగోలులు దొంగిలించుకుపోయారు. చివరికి ఎన్నో కష్టాలుపడి భారతదేశానికి చేరుకుని, ఇలుట్మిష్ కొలువులో చేరాడు. జీవిత ఆరంభంలో ఢిల్లీలో నీరుమోసే కూలీగా పనిచేసాడు. క్రీ.శ. 1233 నాటికి ఇలుట్మిష్ కొలువులో ‘ఖాస్టార్’ పదవిని పొందాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి క్రీ.శ. 1233 నాటికే ‘చిహల్గనీ’ ముఠాలో సభ్యుడైనాడు. క్రీ.శ. 1240-1242 నాటి మంగోల్ల దాడి నుంచి ఢిల్లీ రాజ్యాన్ని ప్రజలను రక్షించాడు. సుల్తానా నాసిరుద్దీన్ అభిమానం పొందాడు. సుల్తాన్ తన కూతురునిచ్చి వివాహం జరిపించాడు. క్రీ.శ. 1259, 1260 సంవత్సరాల్లో ఢిల్లీ సుల్తానేత్పై జరిగిన మంగోల్ దాడులను వీరోచితంగా ఎదుర్కొని తిప్పికొట్టాడు. ఇతని శక్తిసామర్థ్యాలు, సుల్తాన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని జీర్ణించుకోలేని బాల్బన్ రాజ ధర్మ స్వరూపం – రాజకీయ భావాలు : బాల్బన్ సాధించిన గొప్ప విజయాల్లో పేర్కొనదగినది, ఢిల్లీ సుల్తాన్ హోదాను, స్థాయిని, గౌరవాన్ని ఇనుమడింపచేయుటం. బాబర్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైంది. రాజరికం దైవదత్తం. సుల్తాన్ భూమిపై భగవంతుని ప్రతినిధి. కాబట్టి అతడు సామాన్య మానవులకంటే ఉన్నతుడు. ప్రజలందరూ అతని మాటను శాసనంగా గౌరవించాలి. ఆచరణలో పెట్టాలి. రాజు ధర్మబద్ధంగా పరిపాలించాలి. సుల్తాన్ పదవి హుందా తనాన్ని పెంచడానికై అతడు పర్షియన్, అరబిక్ రాజరిక సాంప్రదాయాలను తన దర్బారులో ప్రవేశపెట్టాడు. సుల్తాన్ పాదాలకు కాని, సింహాసనాన్ని గాని మంత్రులు, సర్దారులు సాష్టాంగ నమస్కారం చేయాలి. దీన్ని సిబ్డి అని అంటారు. సుల్తాన్ కాలును లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవాలి. దీనినే ‘పైబోస్’ అంటారు. ‘పర్షియనుల పండగ’ ‘నౌరోజ్’ను తన ఆస్థానంలో ప్రవేశపెట్టాడు. సర్దారుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి గూఢాచారులను నియమించాడు. సుల్తాన్ తన సమానులతోనే తిరగాలి. నలుగురిలో నవ్వరాదు. మద్యం సేవించరాదు. దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తీకరించరాదు. తన నాణేలపై ఖలీపా పేరు ముద్రించాడు. చిహాలనీ – నిర్మూలన : బాల్బన్ ఢిల్లీ సింహాసనం అదిష్టించే నాటికే చిహల్గనీ ముఠా బలోపేతమైంది. గతంలో తాను స్వయంగా, ఆ ముఠా సభ్యుడైన బాల్బన్ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించాడు. వీని సభ్యులకు గతంలో సుల్తానులు ఇచ్చిన జాగీర్లను రద్దుచేసాడు. ముఠా సభ్యుల్లో కొందరికి పదవులు ఇచ్చి విభజించారు. గూఢాచారి శాఖ నివేదిక ప్రకారం కొందరిని శిక్షించాడు. ఉదా : బెంగాల్ గవర్నరైన (మాలిక్ బక్)ను అవద్ గవర్నరైన హైబతాఖాన్ మొదలైనవారిని అంతమొందించాడు. సుల్తాన్ పదవికి చిహల్గనీ స్వార్థ రాజకీయాల నుంచి శాశ్వత విముక్తి కలిగించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

తుగ్రిలాఖాన్ తిరుగుబాటు : బెంగాల్ గవర్నర్ తుమ్రిలాన్ 1279లో బాల్బను వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బాల్బన్ తిరుగుబాటును అణచివేసి శిరచ్ఛేధం చేయించాడు.

మంగోలుల దండయాత్ర – మహ్మద్ రాజకుమారుని మరణం : బాల్బన్ సుల్తాన్ గా ఉన్న కాలంలో మంగోలులు ‘ ఢిల్లీ, దాని పరిసరాలపై అనేకసార్లు దండయాత్రలు జరిపినారు. వీరి దాడులను రాజ్యాన్ని, ప్రజానీకాన్ని రక్షించడానికై తన కుమారుడైన ‘మహ్మదు’, బందువులైన షేరన్ను, బుగ్రాఖాణ్ను వ్యాయవ్య సరిహద్దు ప్రాంతాలైన ముల్తాన్, -నయానా, దీపాల్పూర్ రాష్ట్రాల వైస్రాయిలుగా నియమించాడు. ఈ ప్రాంతంలో అదనపు సేనలు నిలిపాడు. క్రీ.శ. 1270లో మంగోలులు ‘లాహోర్’ పై దాడి చేసారు. బాల్బన్ స్వయంగా లాహోర్ సందర్శించి సైన్యాన్ని అక్కడ అదనంగా నిలిపాడు. క్రీ.శ. 1286లో జరిగిన మంగోల్ల దాడిని ఎదుర్కొంటూ బాల్బన్ కొడుకైన మహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో బాల్బన్ మానసికంగా, శారీరకంగా కృంగిపోయి 1287లో మరణించాడు. బాల్బన్ మరణాంతరం అతని మనవడు కైకుబాద్ ఢిల్లీ సుల్తాన్ అయినాడు. ఇతడి నాలుగు సంవత్సరాల అసమర్థ పాలనను అవకాశంగా తీసుకొని జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించి 1290లో ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు.

ప్రశ్న 2.
అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా, మార్కెటింగ్ సంస్కరణలను చర్చించండి.
జవాబు.
అల్లావుద్దీన్ ఖిల్జీ (1296-1316) : ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే అల్లావుద్దీన్ ఖిల్జీ తన మద్దతుదారులైన సర్దారులకు అమీర్లకు అనేక రూపాల్లో బహుమతులు ఇచ్చాడు. ఎవరైతే తన అధికారాన్ని ధిక్కరించారో, వారిని నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు. భారీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. వారి రిపోర్టుల ఆధారంగా తన వ్యతిరేకులను క్రూరంగా అంతమొందించాడు. బహిరంగంగా మద్యం అమ్మకాన్ని, సేవించడాన్ని నిషేధించాడు. పండుగలు, ఉత్సవాలు జరుపుకొనడానికై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశాడు. రాష్ట్రపాలకుల కదలికలపై, గూఢాచారుల నివేదికల ఆధారంగా శిక్షలు విధించాడు.

దండయాత్రలు : అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సైనిక విజేత. విశాల సామ్రాజ్య నిర్మాత. భారీ సైన్యాలను నియమించాడు. వారికి శిక్షణ ఇచ్చాడు. వారికి జీతభత్యాలు చెల్లించడానికి అవసరమైన ధనం ఖజానాలో లేనందువల్ల మిలిటరీ క్యాంటీన్లను పోలిన దుకాణాలను ఢిల్లీ, భటెండా మొదలైన చోట్ల ఏర్పాటు చేసాడు. మార్కెటింగ్ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. మంగోల్దాడులను అరికట్టాడు. వేలకొద్ది మంగోల్లను నిర్ధాక్షిణ్యంగా అంతమొందించాడు. వాయవ్య భారతావని సరిహద్దు రక్షణకై అక్కడి కోటలను పటిష్టంచేసి, అదనపు సేవలను నిలిపాడు. గాజీమాలిక్ ఆ ప్రాంతం రక్షణాధికారిగా నియమించాడు. క్రీ.శ. 1296 1325 మధ్యకాలంలో ఉత్తర, మధ్య, దక్షిణ భారతదేశంలోని అనేక రాజ్యాలపై నిరంతర దండయాత్రలు చేసాడు. క్రీ.శ. 1297లో మొదట గుజరాత్పై దండెత్తినాడు. అల్లావుద్దీన్ సేనాధిపతులైన ఉల్లూఖాన్, నస్రతాన్, గుజరాత్లోజైన వాఘేలా వంశానికి చెందిన కర్ణదేవున్ని ఓడించారు. అపార – ధన, కనకరాశులు అల్లావుద్దీన్ సేనల వశమైనాయి.

మార్కెట్ సంస్కరణలు : అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనవేత్త. సుల్తాన్ అధికారాలను ఎవరూ ప్రశ్నించే హక్కు లేకుండా నిరంకుశంగా పరిపాలన చేశాడు. తన ఆజ్ఞలను, ఆదేశాలను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాడు. ధిక్కరించిన వారిని నిర్ధాక్షిణ్యంగా శిక్షించాడు. సమకాలీన చరిత్రకారులైన పెరిష్టా భారీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసాడనీ, అతని సైన్యం 4,75,000 అశ్వదళం ఉండేదని పేర్కొన్నాడు. ఏ రకమైన మోసాలకు అవకాశం లేకుండా గుర్రాలపై ‘డాగ్’ వేసే పద్ధతి ప్రవేశపెట్టాడు. ప్రతి సైనికుడికి సంబంధించిన వివరాలు ఉన్న ‘హుళియా’ (బయోడాటా) తయారు చేయించాడు. సైన్యానికి చక్కటి శిక్షణ ఇప్పించాడు. సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైనికులకు జీతాలు చెల్లించి, జాగీర్లు ఇచ్చే పద్ధతిని రద్దుచేశాడు. సైనికులకు అవసరమైన ధాన్యాన్ని, ఇతర నిత్యావసర సరుకులను, గుర్రాలను, దాసీలను, మేకలను, వస్త్రాలు, దుప్పట్లు విక్రయించే మండీలను ఏర్పాటు చేశాడు. సుల్తాన్ నిర్ధారించిన ధరలకే ఇక్కడ చౌకగా సైనికులకు అందుబాటులోకి తెచ్చాడు. ‘షహానా-ఇ-మండీ’ కార్యాలయాన్ని ఈ మార్కెటింగ్ సంస్కరణలను పర్యవేక్షించడానికై స్థాపించాడు. ఇది ఢిల్లీ ‘అలమ్ దర్వాజ’ సమీపంలో ఏర్పాటు చేశాడు. మార్కెటింగ్ సంస్కరణలను ధిక్కరించినా, ఆచరణలో పెట్టకపోయినా వర్తకులను శిక్షించడానికి, వారికి లైసెన్సులు జారీ చేయడానికి దివాన్-ఇ-రియాసత్ అనే కార్యాలయాన్ని స్థాపించి దీనికి ఉన్నతాధికారిగా ‘నాయబ్-ఇ-రియాసత్’ అనే ఉన్నతాధికారిని నియమించాడు. అన్ని రకాల వస్తువుల, సరుకుల ధరలు నిర్ణయించి బహిరంగంగా తెలియచేసారు. తక్కువ కొలతలు, తుకాలు వేసి విక్రయించిన వారిని శిక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. శిక్షలు చాలా కఠినంగా ఉండేట్లు ఏర్పాట్లు చేశాడు. బానిస, కూలీ పిల్లల ద్వారా వివిధ రకాల వస్తువులను ఖరీదు చేయించి, తక్కువ తూకం వేసిన వర్తకులను కఠినంగా శిక్షించాడు. ఈ మార్కెటింగ్ సంస్కరణలు యావత్ సామ్రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలకూ, అన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నావన్న కొందరి చరిత్రకారుల వాదన సత్యంకాదు. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు అతని మరణంతోనే అంతరించాయి. అవి ప్రజల ఆమోదంతో కాక సైనిక బలం మీద ఆధారపడి కొనసాగించారు.

అల్లావుద్దీన్ భూమిశిస్తు సంస్కరణలు చేశాడు. గ్రామకరణాల, పట్వారీలవద్ద ఉన్న భూమి రికార్డుల ప్రకారం సర్వే చేయించి, భూమి రికార్డులు, పట్టాదార్ రికార్డులు తయారుచేయించాడు. పెద్ద పెద్ద భూస్వాములు కూడా సుల్తాన్ ఖజానాకు భూమిశిస్తు చెల్లించేటట్లు ఆదేశించాడు. అమలు చేయించాడు. అల్లావుద్దీన్ సైనిక విజయాలు, పరిపాలనా సంస్కరణలు అతనికి మధ్యయుగ చరిత్రలో విశేష స్థానాన్ని సంపాదించి పెట్టాయి.

ప్రశ్న 3.
మధ్యయుగం నాటి భక్తి ఉద్యమంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270–1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ఈ విధంగా భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. హిందూ ప్రజల్లో నూతన నమ్మకాన్ని కలిగించేలా హిందూ మతాన్ని సంస్కరించి, హిందూ, ముస్లిం ప్రజల మధ్య సహృద్భావం సాధించడమే భక్తి ఉద్యమకారుల ప్రధాన లక్షణాలు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇలుట్మిష్ సాధించిన విజయాలను వివరించండి.
జవాబు.
ఇలుట్మిష్ (క్రీ.శ. 1211 – 1236) : ఢిల్లీ సుల్తానుల్లో ఇల్ల్యుట్మిష్ పరిపాలించిన పదహేనేండ్ల కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతడు సాధారణ బానిసస్థాయి నుంచి సుల్తాన్ స్థాయికి ఎదిగినాడు. శక్తిసామర్థ్యాలకు పట్టుదలకు, విశ్వాసానికి ప్రతీక ఇట్టుట మిష్, కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా పనిచేసాడు. సైన్యాలను నడపడంలో గొప్ప దిట్ట. తన తెలివితేటలచే సుల్తానును ఒప్పించి అతని కుమార్తెనే వివాహమాడాడు.

తన పరిపాలనా కాలంలో అంతరంగిక తిరుగుబాట్లను, విదేశీ దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. క్రీ.శ. 1214లో గజనీ రాజ్యపాలకుడైన ‘తాజాఉద్దీనాల్డజ్’, ఢిల్లీపై దండెత్తి రాగా దాన్ని ఇలుట్మిష్ తిప్పికొట్టాడు. తన అధికారాన్ని అంగీకరించక, తిరుగుబాటు లేవదీసిన ముల్తాన్ గవర్నర్ ‘నాసిరుద్దీన్ కబాచాను’ క్రీ.శ. 1217లో అణచివేసాడు. ఇతడు బెంగాల్లో చెలరేగిన తిరుగుబాటును అణచివేసాడు. క్రీ.శ. 1227 నాటికి ఇలుట్మిష్ రాజ్య హద్దులు, అధికారం ఢిల్లీ, గ్వాలియర్, ముల్తాన్, ఉచ్, గుజరాత్, బెంగాల్, మాండా, మాళ్వాల వరకు విస్తరించింది. .ఢిల్లీ సుల్తాన్గా ఇల్గుట్మిష్ ‘ఖలీఫా’ను గౌరవించాడు. క్రీ.శ. 1229లో మొదటి ముస్లిం సుల్తాన్ అబ్లాసిద్ ఖలీఫా అల్ మస్తాన్ బిల్హ’ నుంచి అధికారికంగా ఢిల్లీ సుల్తాన్గా గుర్తింపు పొందాడు. ఇతడి మరో గొప్ప విజయం, ఢిల్లీపై జరిగిన చెంఘీజ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన మంగోల్ దండయాత్రను తిప్పికొట్టుట.

ఇల్టుట్మిష్ గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనవేత్త, భారతదేశంలో ముస్లిం పరిపాలనా వ్యవస్థకు రూపకల్పన చేసి ఆచరణలో పెట్టినది ఇతడే. భారీ సైన్యాన్ని పోషించాడు. ‘ఇక్తా’ దారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇతని కాలంలో ‘చిహల్గనీ’ ముఠా (40 మంది స్వార్థ సర్దారుల ముఠా) ఏర్పడింది.

ప్రశ్న 2.
రజియా సుల్తానా గురించి వివరించండి.
జవాబు.
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఇట్టుట్మిష్ కొడుకులు సమర్థులు కానందువల్ల తన వారసురాలిగా తన కుమార్తె రజియాను సుల్తానుగా ప్రకటించాడు. కాని ఇలుట్మిష్ మరణానంతరం ఢిల్లీ సర్దారులు ఇలుట్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తాన్ ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటంచేత అతడి తల్లి షా తుర్కాన్ పాలించసాగింది. కాని ఆమె అవినీతిపరురాలవటం చేత రజియా సైనికదళ సానుభూర్తి తో ఫిరోజ్న వధించి, ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1236-1240) అధిష్టించింది. ఈమె గొప్ప ధైర్య సాహసాలున్న స్త్రీ, సైన్యాలను నడపటంలోను, ప్రభుత్వ నిర్వహణలోను కడు సమర్థురాలు. కాని ఒక స్త్రీ సుల్తాను కావటం తురుష్క సర్దారులు అవమానంగా భావించారు. ఇట్టుటిష్ కాలంలో బానిసలుగా చేరిన వీరు క్రమంగా అమీరులై తమ ప్రాబల్యమును పెంచుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమినే చిహల్గనీ అంటారు. ఈ కూటమి రజయాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగింది. చిహల్గ్న నిరంకుశాధికారాలను నిర్మూలించి, సుల్తాన్ అధికారమును పెంపొందించటానికి రజియా కొన్ని చర్యలు చేపట్టింది. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నతో ద్యోగములలో నియమించింది. రాష్ట్ర గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. మాలిక్ యాకూబ్ అనే అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించి అతని పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించింది. రజియా యాకూబైపై అభిమానము చూపటాన్ని సహించలేని ఢిల్లీ సర్దారులు రజియాను పదవీచ్యుతురాలిగా చేయుటకు భటిండా రాష్ట్ర పాలకుడైన కబీర్ ఖాన్తో చేతులు కలిపి రజియాపై కుట్రచేసి ఆమెను అంతము చేయదలచారు. ఈ విషయము తెలిసిన రజియా అపార సైనిక బలముతో బయలుదేరి మొదట లాహోర్ పాలకుడైన కబీర్ ఖాన్ తిరుగుబాటును అణచివేసింది. కాని అల్ తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఢిల్లీ సర్దారులు యాకూబు ‘వధించారు. అంతట రజియా ఢిల్లీ నుంచి పారిపోయి. అల్లునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది. కాని మార్గమధ్యంలోనే రజియా, అల్ తునియాలు హత్యకు (క్రీ.శ 1240) గురయ్యారు.

ప్రశ్న 3.
అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను చర్చించండి.
జవాబు.
ఢిల్లీ సుల్తానుల్లో అత్యంత ప్రతిభావంతుడైన పరిపాలనావేత్తగా అల్లావుద్దీన్ ఖిల్జీ కీర్తింపబడ్డాడు. ప్రపంచ విజేత కావాలని భారీ సైన్యాన్ని పోషించి వారికి జీతం చెల్లించలేక, ప్రతి సైనికుడికి నెల జీతం 234 టంకాలుగా నిర్ణయించాడు. ఈ జీతంతోనే సుఖప్రదమైన జీవితం గడపడానికి నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి సరఫరా చేయించాడు. నిర్ధారిత సైనిక శిబిరాలున్న చోట నిర్ణీత ధరలకు సుల్తాన్ నుంచి లైసెన్స్ పొందిన వర్తకుల ద్వారా సరుకుల అమ్మకాలను ఏర్పాటు చేయించాడు. దీని వలన సైనికులు లాభపడ్డారు. అన్ని వర్గాల వారికి ఈ సౌకర్యం లేదు. మార్కెటింగ్ సంస్కరణలు పర్యవేక్షించడానికి ‘మాలిక్ యాకూబ్’ అనే అధికారిని నియమించాడు. మార్కెట్ సంస్కరణలు, ధరల నియంత్రణ చేసే శాఖకు దివాన్-ఇ-రియానత్, దానికి ఉప అధికారిగా ‘షహాన-ఇ-మండీ’ నియమించాడు. బి. సంస్కరణలు పకడ్బందీగా అమలు చేసి, తూనికలు, తూకలు, కొలతల్లో మోసానికి పాల్పడిన వర్తకులను కఠినంగా శిక్షించాడు.

ఈ సంస్కరణల ఫలితంగా సైనికులకు చెల్లించిన 234 టంకాల్లో అన్ని ఖర్చులు పోనూ కొంత ధనం మిగిలేదని సైనికులు సంతృప్తి చెందేవారని మొగల్ చక్రవర్తుల సైన్యం కంటే మెరుగ్గా అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం జీవించారని

ప్రశ్న 4.
మహ్మద్ – బీన్ – తుగ్లక్ కరెన్సీ నాణేలపై ఒక వివరణ రాయండి.
జవాబు.
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 5.
సికందర్లోడి సాధించిన విజయాలు.
జవాబు.
1451-1481 మధ్యకాలంలో పాలించిన బహలూల్ క్రీ.శ. 1481లో మరణించాడు. ఇతని కుమారుడైన సికిందర్ డీ ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. ఇతడు క్రీ.శ. 1489-1517 వరకు పాలించాడు. ఇతడు సమర్థుడు. ఢిల్లీ సింహాసనంపై ’25 ఏండ్లకుపైగా తన ఆధిపత్యం కొనసాగించాడు. బీహార్ను జయించి తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. అనేకమంది రాజపుత్ర యోధులను ఓడించాడు. పంజాబ్పై సుల్తాన్ అధికారాన్ని నెలకొల్పాడు. ఇతడు మంచి పరిపాలనావేత్త, రోడ్లు, రహదారులు వేయించాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. హిందువుల పట్ల ఇతడు క్రూరంగా వ్యవహరించి, అనేక దేవాలయాలను ధ్వంసం చేసాడు. క్రీ.శ. 1517లో ఇతడు మరణించాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 6.
ఫిరోజ్ తుగ్లక్ పరిపాలనా సంస్కరణలను చర్చించండి.
జవాబు.
మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఫిరోజా తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1351-1388) అధిష్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ బీన్ తుగ్లక్ వైఫల్యానికి దారితీసిన కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పూనుకున్నాడు.
1) యమునా నది నుంచి హిస్సార్ వరకు, సట్లేజ్ నుండి గాగ్రా వరకు, సిరూర్ పరిసర ప్రాంతాల నుంచి హన్సీ వరకు, గాగ్రా నుంచి ఫిరోజాబాద్ వరకు, యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు మొత్తం ఐదు కాలువలను త్రవ్వించి నీటి వనరులను కల్పించి, బంజరు భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయమును అభివృద్ధి చేశాడు. దీనివల్ల నీటి పారుదల పన్ను రూపంలో చాలా ఆదాయం రావటమే కాక బంజరు భూముల సాగువల్ల భూమి శిస్తు కూడా గణనీయంగా పెరిగింది.

2) ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జౌన్పూర్ మొదలగు నగరాలను నిర్మించాడు. ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను వేయించాడు. మహమ్మదీయ పకీర్లకు, హిందూ సన్యాసులకు ఎంతో ధనాన్ని విరాళాలుగా ఇచ్చాడు. దివానీ ఖైరత్ అ ౫౦ ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు.

3) సిద్ధ ఏర్పాటు చేయక సామంతరాజులు సరఫరా చేసే సైన్యం మీదనే ఆధారపడ్డాడు.

4) బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ కింద 1,80,000 మంది బానిసలుండే వారు. వీరి నిర్వహణ ఖజానాకు చాలా భారమైంది. పైగా బానిసలు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అనేక కుట్రలు చేసి సుల్తానత్ పతనానికి కారకులయ్యారు.

5) శిస్తును వసూలు చేసుకొనే అధికారాన్ని సర్దారులకిచ్చాడు. కఠిన శిక్షలను రద్దు చేశాడు.

6) రాజ్య పాలనలలో ఉలేమాలను జోక్యం చేసుకోనిచ్చాడు. మత మౌఢ్యంతో ఒరిస్సాలోని భువనేశ్వర ఆలయం, మాళ్వాలోని నాగర్ కోట ఆలయాల ధ్వంసం చేశాడు. ఇతడు షియాల పట్ల కఠినంగా ఉన్నాడు. ఇతని మతవిధానం వలన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది.

ప్రశ్న 7.
బాల్బన్ రాజరిక ధర్మాన్ని వర్ణించండి.
జవాబు.
ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఇనుమడింపచేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు బాల్బన్. ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించాడు. ‘నియాబత్-ఇ-ఖుదాయి’ (కింగ్ ఈజ్ ది వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్) ‘రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని అతని భావం’, సుల్తాన్ హోదాకు గౌరవస్థానం కల్పించి, ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం ‘నిరంకుశత్వానికి ప్రతిబింబం’ అని తన కుమారుడైన బుఖాన్కు బోధించాడు. తాను ‘జిల్లీ ఇల్హా’ (భగవంతుని నీడ) అని ప్రకటించాడు. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న ‘జమిన్బోస్’, ‘ఫాయిబోస్’ సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు.

సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడాలని కోరుకొన్నాడు. తాను సుల్తాన్ పదవిచేపట్టిన తరువాత తన హోదాకు తగిన అధికారులతోనే మాట్లాడేవాడు. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జూదం ఆడటం నిషేధించాడు. క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో ప్రేమతో వ్యవహరించాలనీ, అదే విధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నాడు. పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడు. ‘దివాన్-ఇ-ఆరీజ్’ (సైన్య వ్యవహారాలు) శాఖాధిపతులుగా తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్-ఉల్-ముల్క్న నియమించాడు. సైనికులకు జీతభత్యాల ఏర్పాటు చేశాడు. జాగీరులను రద్దుచేయించాడు. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్-ఇ-అరీజ్ శాఖకు, ఉన్నత సైనికాధికారులకు అప్పగించాడు. కోటలను నిర్మించారు. పాత కోటలకు మరమ్మత్తులు చేయించాడు.

ప్రశ్న 8.
సూఫీలపై ఒక వివరణ రాయండి.
జవాబు.
మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవటానికి ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీమతం. అరేబీ ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాప్తి చెందింది. సూఫీమతాన్ని భారతదేశానికి తెచ్చి దక్కుతుంది.

క్రీ.శ 19వ శతాబ్దంలో ‘సూఫీఇజం’ అనే ఆంగ్లపదం వాడుకలోని వచ్చింది. సూఫీ అనే పదం ‘తసావూఫ్’ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ‘సఫా’ అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘సుఫా” అనే పదం నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే ‘అరుగు’ అని అర్థం. బస్రాకు చెందిన జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. క్రీ.శ 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక, మత జీవనాన్ని ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి.

హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాల్లో సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం వంటి . ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్’గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు.

ప్రశ్న 9.
చిష్ఠీశాఖ – దాని ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు, తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి.

షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిప్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్టీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 10.
భక్తి ఉద్యమంలో రామానందుడు, కబీర్ ల పాత్రను పేర్కొనండి.
జవాబు.
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. “పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ?” అని కబీర్ ప్రశ్నించాడు.

ప్రశ్న 11.
భక్తి ఉద్యమ ప్రభావాన్ని చర్చించండి.
జవాబు.
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270–1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ వంటి, ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 12.
అల్లావుద్దీన్ – ఖిల్జీ సామ్రాజ్యపటంలో ఈ కింది పట్టణాలను, ప్రదేశాలను గుర్తించండి.
(ఎ) లాహోర్
(బి) ముల్తాన్,
(సి) అజ్మీర్,
(డి) మధుర,
(ఇ) రణతంబోర్
(ఎఫ్) చితోడ్
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం 1

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 13.
విజయనగర సామ్రాజ్య విస్తీర్ణాన్ని ఇచ్చిన పటంలో చూపి ఈ క్రింది నగరాలను గుర్తించండి.
(ఎ) హంపి
(బి) కంపిలి
(సి) పెనుగొండ
(డి) చంద్రగిరి
(ఇ) రాయచూర్
(ఎఫ్) ముద్గల్
(జి) ఉదయగిరి
జవాబు.
TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం 2

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కుతుబుద్దీన్ ఐబక్
జవాబు.
ఇతడు మహ్మద్ ఘోరీ వద్ద బానిస. విశ్వసనీయతకు, నిజాయితీకి, సమర్ధతకు మారుపేరు. ఇతడు మహ్మద్ ఘోరీ మరణానంతరం భారతదేశంలోని తన ఆధీనంలో ఉన్న ఘోరీ రాజ్యానికి సుల్తాన్ ప్రకటించుకున్నాడు. సుల్తాన్ అయిన తర్వాత అనేక తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేశాడు. ఇతడు అనేకమంది కవి, పండితులను ఆదరించాడు. ఇతడికి ‘లాభక్ష్’ (లక్షల రూపాయలు ఇచ్చేవాడు) అని బిరుదు. భారతదేశంలో ఇస్లాం విజయానికి, ఇస్లాం మత వ్యాప్తికి చిహ్నంగా ఢిల్లీ నగరంలో కుతుబ్మనార్ నిర్మాణానికి పునాదులు వేశాడు. ప్రసిద్ధ చరిత్రకారుడు ఈశ్వరీప్రసాద్ భారతదేశంలోని ముస్లిం విజేతలలో ఇతడు అగ్రగణ్యుడని పేర్కొన్నాడు. క్రీ.శ. 1210 లాహోర్లో బౌగాన్(పోలో) ఆడుతూ గుర్రం పైనుండి పడి మరణించాడు.

ప్రశ్న 2.
జిల్లే-ఇలాహీ
జవాబు.
బాల్బన్ సాధించిన విజయాలలో పేర్కొనదగినది ఢిల్లీ సుల్తాన్ హోదాను, స్థాయిని, గౌరవాన్ని ఇనుమడింపచేయుట. బాల్బన్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైనది. రాజరికం దైవదత్తం. సుల్తాన్ భూమిపై భగవంతుని ప్రతినిధి అని జిల్లేఇలాహీ భావం. కాబట్టి అతను సామాన్య మానవుల కంటే ఉన్నతుడు. ప్రజలంతా అతని మాట శాసనంగా
గౌరవించాలి.

ప్రశ్న 3.
మహ్మద్ బీన్ తుగ్లక్ నాణేల సంస్కరణలు.
జవాబు.
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 4.
అలయ్ దర్వాజా
జవాబు.
ఇది సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీచే క్రీ.శ. 1311లో కట్టబడింది. ఢిల్లీలోని కవ్వతుల్ ఇస్లామ్. మసీదుకు దక్షిణ ద్వారం ఉంది. ఎర్రటి ఇసుకరాతితో కట్టిన కట్టడం. చతురస్రాకారంలో ఉండి పైన పెద్ద డోమ్ను నిర్మించారు. ఇండో- ఇస్లామిక్ వాస్తు శిల్పకళారీతి ఈ కట్టడంలో ప్రతిఫలిస్తుంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది.

ప్రశ్న 5.
అమీరుస్రో ప్రవేశపెట్టిన సంగీత వాయిద్యాలను, రాగాలను పేర్కొనండి.
జవాబు.
అమీరుస్రో అనేక కొత్త రాగాలను కనుకొన్నాడు. ‘ఘోరా’, ‘సనమ్’ అతడు కనుగొన్న మరిన్ని రాగాలు. ‘ఖవ్వాలి’ అనే సాంప్రదాయాన్ని ఇతడే ఆరంభించాడు. ‘సితార’ను ఇతడే రూపొందించాడు.

ప్రశ్న 6.
మన్ కుతూహల్ అంటే ఏమిటి ?
జవాబు.
రాజామాన్ సింగ్ (గ్వాలియర్) గొప్ప సంగీత ప్రియుడు. ‘మన కుతూహల్’ అనే సంగీత గ్రంథాన్ని రాయడానికి ప్రోత్సహించాడు.

ప్రశ్న 7.
అమీర్ ఖుస్రో.
జవాబు.
అమీర్ ఖుస్రూ ఢిల్లీ సుల్తానుల యుగానికి చెందిన గొప్ప పండితుడు, కవి. ఇతని కాలం క్రీ.శ. 1253 – 1325. ఇతడు అనేక చారిత్రక మస్నవీలను, దివాన్ లను రచించాడు. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన ఆరుగురు ఢిల్లీ సుల్తానులతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం దక్కింది. ‘కోరాన్-ఉస్-సదైన్’, ‘మిఫ్లూ ఉల్పుతూ’, ‘నుహ్-సిఫిర్’, ‘ఆషికా’, ‘తారీఖ్-ఇ-అలాయి’, ‘తుగ్లక్ నామా’ఇతని ప్రసిద్ధ రచనలు.

ప్రశ్న 8.
కుతుబుద్దీన్ ఐబక్ కట్టడాలు.
జవాబు.
ఢిల్లీలోని కుతుబ్మనార్, అలైదర్వాజాలు ఆనాటి అద్భుత, భారీ కట్టడాలు. 71 అడుగుల ఎత్తైన కుతుబ్మినార్ నిర్మాణాన్ని సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ – భక్తియార్ కాకి జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈ భారీ కట్టడాన్ని ఐబక్ ప్రారంభించగా, ఇల్టుట్మిష్ పూర్తి చేసాడు.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 9.
అద్వైత సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు.
భక్తి ఉద్యమకారుల్లో జగద్గురు శంకరాచార్యులు శిఖరం వంటివాడు. ఇతడు క్రీ.శ. 788లో కేరళలోని ‘కలాడి’లో జన్మించాడు. ఇతని బోధనలే ‘అద్వైతసిద్ధాంతంగా’ ఖ్యాతి గడించాయి. బనారస్క చెందిన గోవిందయోగి బోధనలు, శంకరాచార్యులను విశేషంగా ప్రభావితం చేసాయి. సామాన్య ప్రజానీకానికి శంకరులవారి అద్వైతతత్త్వం అంత శీఘ్రంగా అర్థం కాలేదు. నిర్గున బ్రహ్మ, సగుణబ్రహ్మ భావనలు సామాన్య ప్రజానీకానికి అంత తేలిగ్గా అర్థం కావు. శంకరాచార్యులు మోక్షప్రాప్తికి జ్ఞాన మార్గాన్ని సూచించి, ఆచరించారు. ఇతని బోధనలను, అద్వైతాన్ని మరింతగా సులభతరం చేసి ఇతని వారసులు కృషిచేసారు.

ప్రశ్న 10.
రామానుజాచార్యుల బోధనలు.
జవాబు.
భక్తి ప్రబోధకుల్లో శంకరాచార్యుల తర్వాత, ఎక్కువ పేరుగాంచిన వారు రామానుజాచార్యులు. ఇతడు శ్రీ పెరంబుదూర్లో జన్మించాడు. ఇతడు బోధించిన తత్వాన్ని ‘విశిష్టాద్వైతం’ అంటారు. ఇతని ప్రకారం భగవంతుడు ‘సగుణబ్రహ్మ’. యావత్ ప్రపంచం అతని సృష్టి. జీవరాశులు అతని సృష్టి. ఇవి కల్పితం కావు. ఇతని ప్రకారం, దేవుడు. ఆత్మ, పదార్థం అన్ని శాశ్వతం. వాస్తవాలు భగవంతునికి పూర్తిగా సమర్పించుకోవడం (ప్రభత్తి మార్గం ద్వారా మానవులు మోక్షం పొందవచ్చనీ బోధించాడు. అట్టడుగు వర్గాలవారిని ఇతడు వైష్ణవంలోకి ఆహ్వానించాడు.

ప్రశ్న 11.
కబీర్ ‘ బోధనల ప్రభావం.
జవాబు.
మధ్యయుగ భక్తి ప్రబోధకులలో గొప్ప సంఘ, మత, సంస్కరణ భావాలు కలవాడు కబీర్. ఇతడి గురువు రామానందుడు. ఇతడు బనారస్లో ఒక్క బ్రాహ్మణ స్త్రీకి జన్మించాడని కొందరు పడింతులవాదం. ముస్లింనేత పనిచేసే ‘నీరు, నీమా’ అనే దంపతులు ఇతన్ని పెంచి పెద్ద చేసారు. బనారస్ లో ఉన్నప్పుడే హిందూమతం, హిందు ప్రాచీన గ్రంథాల గురించి, వాటి సారాంశాన్ని తెలుసుకున్నాడు. ఇదే కాలంలో ఇస్లాంలోని పవిత్ర సూత్రాలు గ్రహించాడు. ఈ రెండు వర్గాల మధ్య సఖ్యతకు కృషి చేసాడు. ఇతని దృష్టిలో భగవంతుడు ఒక్కడే, నిరాకారుడు, భక్తి ఒక విశ్వాసం, రాయిని, చెట్టును పూజించడం అవివేకం, ఉత్తమ గుణాల ప్రతిరూపమే దైవం. విగ్రహరాధనను, సాంప్రదాయాలను, ఆచారాలను, నమ్మకాలను ఖండించాడు. భగవంతుడు మంచి ఆలోచనలకు, పనులకు ప్రతిరూపం. ‘రాం – రహీం’ ఒక్కటేనని, హిందూ – ముస్లిం ఒకే తల్లి పిల్లలనీ, ఒకే మట్టితో చేసిన కుండలనీ పేర్కొన్నాడు. పవిత్ర హృదయం మంచి ఆలోచనలు, నిజాయితీ, మోక్షానికి మెట్లు అని పేర్కొన్నాడు. ఇతని శిష్యులనే ‘కబీర్ పంథీలు’ అంటారు.

ప్రశ్న 12.
గురునానక్ సూత్రాలు.
జవాబు.
గురునానక్ క్రీ.శ. 1469లో ‘తుల్వండీ’ గ్రామంలో జన్మించాడు. ఇతడు కబీర్ సమకాలికుడు. వీరి ఆలోచనా
`నాలు చాలా వరకు ఏకీభవిస్తాయి. గురునానక్ బోధనలు నమ్మిన శిష్యులే చివరికి ‘శిక్కు’ మతంగా మారారు.
ల ..శోర్, తుల్వండి ఇతని కేంద్రాలు. కులవ్యవస్థను, సామాజిక అసమానతలను ఖండించాడు. నిరాడంబరత, ఆత్మ పవిత్రత, నిజాయితీలో జీవించడం, నిస్వార్థ సేవ మొదలైనవి ఇతడు బోధించాడు. హిందూ – ముస్లిం ప్రజల మధ్య సఖ్యతకు కృషి చేసి, కబీర్ కార్యక్రమాలకు బలం చేకూర్చాడు.

ప్రశ్న 13.
మరాఠీ భక్తి బోధకుల సూత్రాలు.
జవాబు.
మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని నడిపిన తొలి మహానీయుడు సంత్ జ్ఞానేశ్వర్. ఇతని బోధనలను ‘మహారాష్ట్ర ధర్మం’ అంటారు. భగవద్గీతపై ఇతడు రాసిన భాష్యానికే ‘జ్ఞానేశ్వరీ’ అంటారు. నామదేవుడు మరో ప్రధాన భక్తి ప్రబోధకుడు.

ఇతడు మానవులందరూ ఒకటేనని కుల, మతాలు మానవ కల్పితాలనీ, సదాచారం, సచ్ఛీలం ద్వార మోక్షం పొందవచ్చని, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించాడు. మరాఠా వాసుల్లో సంఘ సంస్కరణ ద్వారా ఐక్యతా కల్గించాడు. భావాన్ని సంత్ ఏకనాథ్ కులవ్యవస్థను వ్యతిరేకించాడు. మానవులందరూ ఒక్కటేనని ప్రచారం చేసాడు. నిమ్న కులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. అనేక భజనలు, సంకీర్తనలు రాశాడు. సంత్ తుకారం మరో ప్రసిద్ధ మరాఠి భక్తి సన్యాసి, ఇతడు శివాజీ సమకాలికుడు.

ప్రశ్న 14.
అష్టదిగ్గజాలు.
జవాబు.
శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప పండితులు ‘ఆముక్తమాల్యద’ శ్రీకృష్ణదేవరాయల మహోన్నత రచన. దీన్ని పండితులు ఎంతో ప్రశంసించారు. ఇతని ఆస్థానంలో ‘అష్టదిగ్గజాలనీ’ పేరుగాంచిన ఎనిమిది మంది కవులున్నట్లు ప్రతీతి. అల్లసాని పెద్దన్న ఇతని ఆస్థానకవి.

TS Inter 1st Year History Study Material Chapter 8 ఢిల్లీ సుల్తానుల యుగం

ప్రశ్న 15.
వాస్తు – శిల్ప కళలకు విజయనగర రాజుల సేవ.
జవాబు.
హిందుమతం, హిందూధర్మ పరిరక్షణలో భాగంగా వీరు అనేక గొప్ప దేవాలయాలను పునరుద్ధరించారు. కొత్తవి నిర్మించారు. వీటికి భారీ ఎత్తున ధాన ధర్మాలు చేశారు. అనేక మఠాలను పరిరక్షించారు. కవులను, కళాకారులను ఆదుకొన్నారు. తమ ఆస్థానాల్లో సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు. హంపి, తిరుపతి, పెనుగొండ, లేపాక్షి మొదలైనచోట్ల ఉన్న పాతదేవాలయాలకు మరమ్మతులు చేయించారు. కొత్తవి కట్టించారు. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణ రంగ మంటపాలు, నునుపుగా చెక్కిన స్తంభాలు. హంపీలోని శ్రీవిరూపాక్ష ఆలయం, హజార రామాలయం, విఠలా స్వామి ఆలయం, శ్రీకృష్ణదేవరాయలు కొత్తగా కట్టించిన బాలకృష్ణ స్వామి (ఈ విగ్రహం ఒరిస్సా నుంచి కళింగ దండయాత్ర విజయవంతం అయిన సందర్భంగా తీసుకొచ్చాడు) ఆలయం ముఖ్యమైనవి. హంపి శిథిలాల్లో `నేటికీ గంభీరంగా నిలబడి ఉన్న ఉగ్రనరసింహస్వామి శిలా విగ్రహం ఆనాటి శిల్పుల పనితనానికి ప్రతీక.

Leave a Comment