Telangana TSBIE TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ Textbook Questions and Answers.
TS Inter 1st Year Economics Study Material 5th Lesson మార్కెట్ విశ్లేషణ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
మార్కెట్ల వర్గీకరణను విశదీకరించండి.
జవాబు.
వాడుక భాషలో మార్కెట్ అంటే వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపే ఒక ప్రత్యేక స్థలం. మూడు అంశాల ఆధారంగా మార్కెట్ వర్గీకరణ జరుగుతుంది.
- కాలానుసారం మార్కెట్లు లేదా కాలవ్యవధి మార్కెట్లు
- స్థలానుసారం మార్కెట్లు
- పోటీ ఆధార మార్కెట్లుదీనిని ఈ క్రింది పట్టిక ద్వారా చూపించవచ్చు.
I. కాలానుసారం మార్కెట్లు : కాలవ్యవధి ఆధారంగా మార్కెట్లు మూడు రకాలుగా విభజించవచ్చు.
1. అతిస్వల్పకాలం :
ఉత్పత్తిదారుడు అతిస్వల్పకాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పుచేయలేదు. సప్లయ్ మార్పులు తేవడానికి ఉత్పాదకాలను మార్చవలసి ఉంటుంది. ఉత్పాదకాలను అతిస్వల్పకాలంలో మార్చడం సాధ్యం కాదు. అందువల్ల సప్లయ్ స్థిరంగా ఉంటుంది.
ఉదా : నశ్వర వస్తువులయిన పూలు, పాలు మొదలగునవి.
2. స్వల్పకాలం :
స్వల్ప కాలంలో సప్లయ్ని కొంతమేరకు మార్చవచ్చు. కొన్ని ఉత్పాదకాలను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. చర ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యం.
3. దీర్ఘకాలం :
మార్కెట్లో వస్తువులుండే డిమాండ్ను బట్టి ఉత్పత్తిదారుడు దీర్ఘకాలంలో అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేస్తాడు. దీర్ఘకాలంలో సప్లయ్లో కావలసిన మార్పులు చేయవచ్చు.
మార్కెట్ల వర్గీకరణను విశదీకరించండి.
II. స్థలానుసారం మార్కెట్లు : స్థలాన్ని బట్టి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లుగా వర్గీకరించబడ్డాయి.
1. స్థానిక మార్కెట్ :
ఒక వస్తువు అమ్మకాలు అది ఉత్పత్తి అయిన ప్రాంతంలోనే జరిగితే దానిని స్థానిక మార్కెట్ అంటారు..
ఉదా : కూరగాయలు, పండ్లు మొదలగునవి.
2. జాతీయ మార్కెట్లు :
ఒక వస్తువుకు దేశంలోని వివిధ ప్రాంతాలలో డిమాండ్ సప్లయి ఉన్నట్లయితే ఆ వస్తువుకు జాతీయ మార్కెట్ ఉన్నట్లుగా చెప్పవచ్చు.
ఉదా : గోధుమ, పంచదార, పత్తి మొదలగునవి.
3. అంతర్జాతీయ మార్కెట్లు :
ఒక వస్తువును ఇతర దేశాల్లో అమ్మకాలు, కొనుగోళ్ళు జరిపినట్లయితే ఆ వస్తువుకు అంతర్జాతీయ మార్కెట్ ఉంటుంది.
ఉదా : బంగారం, వెండి, పెట్రోలు మొదలగునవి.
III. పోటీని బట్టి మార్కెట్లు : పోటీని బట్టి మార్కెట్లు రెండు రకాలు
- సంపూర్ణ పోటీ మార్కెట్
- అసంపూర్ణ పోటీ మార్కెట్.
1. సంపూర్ణ పోటీ మార్కెట్ :
అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉండేదే సంపూర్ణ పోటీ మార్కెట్. కృత్రిమ అడ్డంకులు లేకుండా అందరు సజాతీయ వస్తువునే కొనడం, అమ్మడం జరుగుతుంది.
2. అసంపూర్ణ పోటీ మార్కెట్:
కొనుగోలుదార్ల మధ్యకాని, అమ్మకందార్ల మధ్యకాని సంపూర్ణ పోటీ లేనటువంటి దానిని అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. అందువల్ల వస్తువుకు వేరువేరు ధరలు ఉంటాయి. ఈ అసంపూర్ణ పోటీ మార్కెట్లు నాలుగు రకాలు.
- ఏకస్వామ్యం
- ద్విస్వామ్యం
- పరిమితస్వామ్యం
- ఏకస్వామ్య పోటీ మార్కెట్.
ప్రశ్న 2.
సంపూర్ణ పోటీ లక్షణాలు ఏవి ?
జవాబు.
అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదార్లు, వినియోగదార్లుండే మార్కెట్ను సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. మార్కెట్ అంతట ఒకే ధర ఉంటుంది.
1. అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు:
ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఉంటారు. ఏ ఒక్క అమ్మకందారుడు కాని, కొనుగోలుదారుడు కాని మార్కెట్ ధరను ప్రభావితం చేయలేడు. ఒక వస్తువు ధర దానికుండే డిమాండ్, సప్లయ్లు నిర్ణయిస్తాయి. ఈ ధరను కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అంగీకరించాలి. సంస్థ మార్కెట్ ధరను అనుసరించాలి.
2. సజాతీయ వస్తువులు :
ఈ మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి. ఈ వస్తువులకుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం సంపూర్ణం. అందువల్ల మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది.
3. ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ:
ఈ మార్కెట్లో నూతన పరిశ్రమలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి స్వేచ్ఛ ఉంటుంది. సంస్థ గరిష్ట లాభాలు పొందుతున్నప్పుడు నూతన సంస్థలు ప్రవేశించుటకు, నష్టాలు వచ్చేటప్పుడు నిష్క్రమించుటకు స్వేచ్ఛ కలదు.
4. సంస్థ, పరిశ్రమ వేరువేరు :
ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ వేరువేరుగా ఉంటాయి. సంస్థ అంటే వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్. పరిశ్రమ అనగా సంస్థల సముదాయం.
5. రవాణా ఖర్చులు ఉండవు :
రవాణా ఖర్చు ఉండనందువల్ల మార్కెట్ అంతటా వస్తువుకు ఒకే ధర ఉంటుంది.
6. ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు సంపూర్ణ గమనశీలత :
ఈ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు వెళ్ళవచ్చు. అదే విధంగా వస్తు మార్కెట్లో పూర్తి గమనశీలత ఉంటుంది.
7. మార్కెట్ సంపూర్ణ పరిజ్ఞానం:
ఈ మార్కెట్లో మార్కెట్ను గురించి సంపూర్ణ పరిజ్ఞానం కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు ఉంటుంది. ప్రతి కొనుగోలుదారుకు, అమ్మకందారుకు ధర తెలుస్తుంది.
ప్రశ్న 3.
సంపూర్ణ పోటీ అర్థాన్ని వివరించండి. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయ విధానాన్ని చిత్రీకరించండి.
జవాబు.
సంపూర్ణ పోటీ మార్కెట్ వ్యవస్థలో వైయక్తిక సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు. నిత్యం వాడుకలో ఉన్న అర్థానికి భిన్నంగా ఆర్థిక సిద్ధాంతంలో సంపూర్ణ పోటీ పదాన్ని వాడుతున్నాం. వర్తకులు ‘పోటీ’, ‘ప్రతిస్పర్థ’ అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు.
సిద్ధాంతరీత్యా సంపూర్ణపోటీలో సంస్థల మధ్య ప్రతిస్పర్ధ ఉండదు. సజాతీయ వస్తువులను తయారుచేసే సంస్థలు అధికసంఖ్యలో ఉండి, పరిశ్రమలోనికి సంస్థలు ప్రవేశించడానికి, పరిశ్రమ నుంచి నిష్క్రమించడానికి స్వేచ్ఛ, కొనుగోలుదారునికి సంపూర్ణ పరిజ్ఞానం, ఉత్పత్తికారకాలకు పూర్తి గమనశీలత, రవాణా వ్యయాలు లేకుండటం అనే లక్షణాలుంటే దానిని సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు.
ధర నిర్ణయం :
మార్కెట్లో సప్లయ్, డిమాండ్ ను బట్టి వస్తువు ధరను నిర్ణయిస్తారు. మార్కెట్లోనికి అమ్మకానికి వచ్చే వస్తువులకు, కొనుగోలుదార్లు డిమాండ్ చేసే వస్తువులకు మధ్య సమతౌల్యాన్ని తెస్తుంది. సప్లయ్, డిమాండ్ సమానంగా ఉన్నచోట మార్కెట్ సమతౌల్య ధరను నిర్ణయిస్తుంది. మార్కెట్ నిర్ణయించిన ధరను ఉత్పత్తిదారులు అనుసరిస్తారు.
ధర | డిమాండ్ పరిమాణం | సప్లయ్ పరిమాణం |
1 | 10 | 50 |
2 | 20 | 40 |
3 | 30 | 30 |
4 | 40 | 20 |
5 | 50 | 10 |
పై పట్టికలో ధరలో మార్పులు జరిగినప్పుడు వస్తువు సప్లయ్, డిమాండ్లో కూడా మార్పులు జరిగాయి. వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం తగ్గింది. అంటే ధరకు, డిమాండ్కు విలోమ సంబంధం ఉంది. అయితే ధర పెరిగితే సప్లయ్ పరిమాణం పెరిగింది. అనగా సప్లయ్కి, ధరకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ₹ 3/- వద్ద సప్లయ్ డిమాండ్ సమానం అయినాయి. దీనిని సమతౌల్య ధర అంటారు. దీనిని ఈ క్రింది రేఖాపటం ద్వారా తెలియజేయవచ్చు.
పై రేఖాపటంలో DD డిమాండ్ రేఖ, SS సప్లయేఖలు. ఈ రెండు ‘e’ బిందువు ఖండించుకున్నప్పుడు ధర OP గా, సప్లయ్, డిమాండ్ 0Q గా ఉన్నాయి. అందువల్ల OP సమతౌల్యపు ధర.
ప్రశ్న 4.
సంపూర్ణ పోటీలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది. అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది.
సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి
- స్వల్పకాలం
- దీర్ఘకాలం.
1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది. స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.
A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.
B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.
సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.
∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.
2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది. ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం 0Q గా ఉండును.
ప్రశ్న 5.
ఏకస్వామ్యం అంటే ఏమిటి ? ఏకస్వామ్యంలో ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివరించండి.
జవాబు.
అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. ఒక వస్తువుకు ఒకే అమ్మకం దారుడుండి, ఆ వస్తువుకు సన్నిహిత ప్రత్యామ్నాయాలు లేని మార్కెట్ను ఏకస్వామ్య మార్కెట్ అంటారు. కనుక ఏకస్వామ్యదారుడు వస్తువు సప్లైని, వస్తువు ధరను నియంత్రించగలడు.
కాని రెండింటినీ ఒకే సమయంలో నియంత్రించలేడు. ఉత్పత్తిని నియంత్రిస్తే మార్కెట్ ధరను స్వీకరిస్తాడు. మార్కెట్ ధరను నిర్ణయిస్తే ఉత్పత్తిని మార్కెటు వదిలివేస్తాడు.
లక్షణాలు :
- మార్కెట్లో ఒక సంస్థ మాత్రమే వస్తూత్పత్తిని చేస్తుంది.
- ఈ మార్కెట్లో వస్తువులకు సమీప ప్రత్యామ్నాయాలుండవు.
- ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ ఒక్కటే.
- మార్కెట్లోనికి నూతన సంస్థలు ప్రవేశించడానికి వీలులేని నిబంధనలుంటాయి.
- ఏకస్వామ్యదారుడే వస్తుధరను, వస్తు సప్లయ్న నియంత్రిస్తాడు.
ధర నిర్ణయం :
గరిష్ట లాభాలను ఆర్జించటం ఏకస్వామ్య సంస్థ ధ్యేయం. ఏకస్వామ్యంలో ఉత్పత్తిదారుడు వస్తూత్పత్తిని తగ్గిస్తూ ధరను పెంచగలడు. వస్తూత్పత్తిని పెంచుతూ ధరను తగ్గించగలడు. ఈ విధమైన ధర నిర్ణయం వల్ల ఏకస్వామ్యదారుడు గరిష్ట లాభాలను ఆర్జిస్తాడు.
ఏకస్వామ్యంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైన పరిస్థితిలో ఏకస్వామ్య సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఏకస్వామ్యంలో ధర నిర్ణయాలు క్రింది రేఖాపటం ద్వారా తెలుసుకోవచ్చు.
పై రేఖాపటంలో ‘X’ అక్షంపై ఉత్పత్తి పరిమాణంను, Y అక్షంపై వ్యయం రాబడిని చూపాము. AR సగటు రాబడి రేఖ, MR ఉపాంత రాబడిరేఖ, AC సగటు వ్యయరేఖ, MC ఉపాంత వ్యయరేఖ. MR రేఖ MC ని ‘E’ బిందువు వద్ద ఖండించడం వల్ల, MC MR అవుతుంది. కనుక OM ఉత్పత్తి వద్ద సంస్థ సమతౌల్యంలో ఉంది.
E నుండి గీయబడిన రేఖ ‘X’ అక్షంపైన ఉత్పత్తి పరిమాణంను, AR రేఖపై వస్తువు ధరను తెలియజేయును. AR, ACల మధ్య తేడా సంస్థ లాభనష్టాలను సూచించును. AC కంటే AR ఎక్కువగా ఉంటే అసాధారణ లాభాలు వచ్చును. పై రేఖాపటంలో OM వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం OCBM వచ్చే ఆదాయం OPAM.
మొత్తం లాభం = మొత్తం రాబడి – మొత్తం వ్యయం
= OCBM – OPAM = CPAB
∴ CPAB పై రేఖాపటంలో సంస్థ ఆర్జించే లాభాలు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
కాలాన్నిబట్టి మార్కెట్ వర్గీకరణపై ఒక వ్యాఖ్యను రాయండి.
జవాబు.
సాధారణంగా వస్తుసేవల అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగే ప్రదేశాన్ని మార్కెట్గా పరిగణిస్తాం. ఆధునిక కాలంలో మార్కెట్ భావనలో గొప్ప మార్పులు ఏర్పడ్డాయి. మార్కెట్ అనే పదాన్ని కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, బంగారం, వెండి మార్కెట్, షేర్ మార్కెట్ మొదలైనవాటిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు.
ఆధునిక కాలంలో ఒక “వ్యక్తి ఒక వస్తువును కొనడానికి, అమ్మడానికి మార్కెట్కు వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రస్తుతం వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్ళు మార్కెట్కు వెళ్ళకుండానే సమాచార సౌకర్యాల ద్వారా జరపవచ్చు.
ప్రజలు టెలిఫోన్, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ (అంతర్జాలం) సదుపాయాల ద్వారా దూర ప్రాంతాల నుండి వస్తు సేవల కొనుగోళ్ళు, అమ్మకాలు జరపడాన్ని మనం గమనించవచ్చు. అమ్మకందార్లకు, కొనుగోలుదార్లను ఒక దగ్గరికి చేర్చే యంత్రాంగమే మార్కెట్ అని ఎడ్వర్డ్స్ (Edwards) నిర్వచించాడు.
కాలానుసార మార్కెట్లు (Time Based Markets) :
కాలానుసారం వస్తు సప్లయ్ లో సర్దుబాట్లు జరుగుతాయి. కాలవ్యవధి ఆధారంగా మార్కెట్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి : అతిస్వల్పకాలిక మార్కెట్, స్వల్పకాలిక మార్కెట్, దీర్ఘకాలిక మార్కెట్.
a) మార్కెట్ కాలం లేదా అతిస్వల్ప కాలం (Market Period or Very Short Period) :
ఉత్పత్తిదారుడు అతిస్వల్ప కాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పు చేయలేడు. అందువల్ల సప్లయ్ స్థిరంగా ఉంటుంది. ఉత్పాదకాలను మార్చడం వల్ల సప్లయ్లో మార్పులు తీసుకురావచ్చు. ఉత్పాదకాలను అతిస్వల్ప కాలంలో మార్చలేం. నశ్వర వస్తువులకు (perishable goods) ఈ మార్కెట్ వర్తిస్తుంది.
b) స్వల్పకాలం (Short Period) :
స్వల్పకాలంలో సప్లయ్ను కొంతవరకు మార్చవచ్చు. కొన్ని ఉత్పాదకాలను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. శ్రమలాంటి చర ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యం.
c) దీర్ఘకాలం (Long Period) :
పెరిగే డిమాండు తీర్చడానికి తగినట్లుగా దీర్ఘకాలంలో సప్లయ్లో మార్పు చేయవచ్చు. దీర్ఘకాలంలో వస్తువుకుండే డిమాండ్ ఆధారంగా ఉత్పత్తిదారుడు అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేస్తాడు. దీర్ఘ కాలంలో సప్లయ్లో కావాల్సిన సర్దుబాట్లు చేయవచ్చు.
ప్రశ్న 2.
సంపూర్ణ పోటీలో స్వల్పకాలంలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది. అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు.
ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి
- స్వల్పకాలం
- దీర్ఘకాలం.
1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది.
స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.
A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.
B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది.
దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.
సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.
∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.
2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది.
ఈ ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం 0Q గా ఉండును.
ప్రశ్న 3.
సంపూర్ణ పోటీలో, దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యాన్ని వివరించండి.
జవాబు.
సంస్థ సమతౌల్యం :
సంపూర్ణ పోటీలో వస్తువు ధరను మార్కెట్ను నిర్ణయిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ ధరను స్వీకరించి తన ఉత్పత్తిని నిర్ణయించుకుంటాడు. ఒక సంస్థ అధిక లాభాలను పొందాలనుకుంటుంది. కాబట్టి ఎక్కువ లాభాలనిచ్చే ఉత్పత్తిని ఎంపిక చేస్తుంది.
అధిక లాభాలనిచ్చే ఉత్పత్తిని చేసినప్పుడు సంస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. సమతౌల్య ఉత్పత్తి చేసే సంస్థ తన ఉత్పత్తిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ స్థితి నుంచి ఉత్పత్తిని పెంచుకోవడానికి, తగ్గించడానికి ఇష్టపడదు. సంస్థ సమతౌల్య స్థితిని రెండు కాలాల్లో వివరిస్తారు. అవి
- స్వల్పకాలం
- దీర్ఘకాలం.
1. స్వల్పకాల సమతౌల్యం :
స్వల్పకాలంలో సంస్థ స్థిర ఉత్పత్తి కారకాలు అంటే యంత్రాలు, భవనాలు మొదలగునవి మార్చలేదు. చరకారకాలు మాత్రమే మార్చి ఉత్పత్తిని పెంచుకుంటుంది. స్వల్పకాలంలో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనప్పుడు స్వల్పకాలిక సమతౌల్య ఉత్పత్తి జరుగుతుంది. స్వల్పకాలంలో సంస్థ గరిష్ట లాభాన్ని లేదా సాధారణ లాభాన్ని లేదా నష్టాన్ని పొందుతుంది. దీనిని ఈ క్రింది రేఖాపటాల ద్వారా తెలియజేయవచ్చు.
A రేఖాపటంలో ‘OX’ అక్షంమీద ఉత్పత్తి పరిమాణంను, ‘OY’ అక్షం మీద ధరను చూపినాము.
B రేఖాపటంలో OX అక్షంపై ఉత్పత్తి పరిమాణాన్ని, OY పై వ్యయం, రాబడిని కొలుస్తాం. A రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద డిమాండ్, సప్లయ్ సమానమయినాయి. అందువల్ల పరిశ్రమలో OP సమతౌల్యపు ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనికి సమతౌల్య ధర నిర్ణయించబడుతుంది. ఇదే ధరను సంస్థ అంగీకరిస్తుంది. దీనిని సంస్థలో క్షితిజరేఖ ద్వారా చూపించడం జరిగింది. దీనినే ‘ధర రేఖ’ అంటారు.
సంస్థలో ఉపాంత వ్యయం = ఉపాంత రాబడి అయినప్పుడు ఉండే ఉత్పత్తి వల్ల లాభాలు గరిష్టంగా ఉంటాయి. రేఖాపటంలో 0Q ఉత్పత్తి దగ్గర లాభాలు గరిష్టంగా ఉంటాయి. సమతౌల్య బిందువు ‘E’ దగ్గర ధర P; సగటు వ్యయం QB సగటు లాభం BA.
∴ మొత్తం లాభం PABC కి సమానం. అనగా OQ వస్తుపరిమాణంను ఉత్పత్తి చేయటానికి అయిన వ్యయం OCBQ; రాబడి OPAQ.
2. దీర్ఘకాలిక సమతౌల్యం :
దీర్ఘకాలంలో సంస్థ ఉత్పాదకాలు అన్నింటికి మార్చడం ద్వారా ఉత్పత్తిలో మార్పులు చేస్తుంది. సంస్థ దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమైనచోట సమతౌల్యం ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన అంశం సంస్థల ప్రవేశం, నిష్క్రమణ ఈ కాలంలో జరుగుతుంది. ఈ ఈ కారణం వల్ల ప్రతి సంస్థ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతుంది. దీర్ఘకాలిక సమతౌల్యాన్ని ఈ ప్రక్క రేఖాపటం ద్వారా వివరించవచ్చు.
పై రేఖాపటంలో ‘OX’ అక్షంపై వస్తుపరిమాణాన్ని, ‘OY’ అక్షంపై ధర వ్యయం, రాబడులను కొలుస్తాము. పై రేఖాపటంలో ‘E’ బిందువు వద్ద AR = MR = LMC LAC గా ఉంది. అప్పుడు ధర OP గా, పరిమాణం OQ గా ఉండును.
ప్రశ్న 4.
ఏకస్వామ్యం అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఏవి ?
జవాబు.
సంపూర్ణ పోటీతో పోల్చినప్పుడు ఏకస్వామ్యం పూర్తిగా భిన్నమైన మార్కెట్. ఏకస్వామ్యం అంటే ఒకే ఉత్పత్తిదారుడు ఉన్న మార్కెట్ అని అర్థం. మార్కెట్లో సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లేని వస్తువును ఒకే సంస్థ సప్లయ్ చేసినప్పుడు ఏకస్వామ్య మార్కెట్ ఉన్నట్లు.
‘బిలాస్’ మాటల్లో సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లేని వస్తూత్పత్తిని చేసే ఒకే అమ్మకందారుడు ప్రాతినిధ్యం వహించే మార్కెట్ను ఏకస్వామ్యమంటారు. మార్కెట్లో అమ్మబడే ఇతర వస్తువులు, వాటి ధరల వల్ల ఏకస్వామ్యదారుడు ప్రభావితం కాడు, వాటిని ప్రభావితం చేయలేడు.
ఏకస్వామ్యం ముఖ్య లక్షణాలు :
- మార్కెట్లో ఒక్క సంస్థ మాత్రమే వస్తూత్పత్తిని చేస్తుంది.
- ఏకస్వామ్యంలో తయారయ్యే వస్తువుకు సమీప ప్రత్యామ్నాయాలుండవు.
- మార్కెట్లోనికి నూతన సంస్థలు ప్రవేశించడానికి వీలులేని నిబంధనలుంటాయి.
- పరిశ్రమ, సంస్థ రెండూ ఒక్కటే.
- ఉత్పత్తిదారుడు వస్తువు ధరను, వస్తు సప్లయ్ను నియంత్రిస్తాడు. అయితే ఒక సమయంలో వస్తువు ధరను లేదా వస్తువు సప్లయ్ను ఏదో ఒకదాన్ని మాత్రమే నియంత్రించగలడు.
ఏకస్వామ్యంలో సమతౌల్యం – ధర నిర్ణయం :
ఏకస్వామ్యంలో వస్తువు డిమాండ్, సప్లయ్ ఆధారంగా దాని ధర, వస్తూత్పత్తి, లాభాలు నిర్ణయించబడతాయి. ఏకస్వామ్యదారుడు వస్తువు సరఫరాపై పూర్తి నియంత్రణను కలిగిఉంటాడు. అంతేకాకుండా గరిష్ఠ లాభం వచ్చే విధంగా ధరను నిర్ణయించగలడు. అయితే రెండింటిని ఒకేసారి నిర్ణయించలేడు.
ఏకస్వామ్యదారుడు వస్తువు ధరను నిర్ణయించితే, ఆ ధరకు మార్కెట్లోని వినియోగదారుని డిమాండ్ వల్ల సప్లయ్ నిర్ణయించబడుతుంది.
ప్రశ్న 5.
ఏకస్వామ్య పోటీ లక్షణాలు ఏవి ?
జవాబు.
సంపూర్ణ పోటీ లేదా నిరపేక్ష ఏకస్వామ్యం లేనటువంటి ఏకస్వామ్య పోటీ మాత్రమే వాస్తవంగా ఉంటుంది. ఈ. హెచ్. చాంబర్లిన్ (E.H. Chamberlin), జోన్ రాబిన్సన్ (Joan Robinson) ఈ రకమైన మార్కెట్ విశ్లేషణను ప్రతిపాదించారు.
ఏకస్వామ్య పోటీ లక్షణాలు (Characteristics of Monopolistic Competition) :
చాంబర్లిన్ ప్రకారం ఏకస్వామ్య పోటీకి కింది ముఖ్య లక్షణాలు ఉంటాయి.
a) తక్కువ సంఖ్యలో సంస్థలు :
సంపూర్ణ పోటీలోని సంస్థల కంటే ఏకస్వామ్య పోటీలో సంస్థల సంఖ్య తక్కువ. సంస్థలకు ఈ పోటీలో కొంతమేరకు ఏకస్వామ్య అధికారం ఉంటుంది. వస్తూత్పత్తి ప్రక్రియలో తగినంత పరిమాణంలో ఉత్పత్తిదారులు పాల్గొంటారు. మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్నందువల్ల ఏ ఒక్క ఉత్పత్తిదారుడు మార్కెట్కు సంబంధించిన మొత్తం ఉత్పత్తిని ప్రభావితం చేయలేడు.
b) వస్తు వైవిధ్యం (Product Differentiation) :
ఏకస్వామ్య పోటీ లక్షణాలలో ముఖ్యమైంది వస్తు వైవిధ్యం. అనేక సంస్థలు వస్తువులను తయారుచేసినా, ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువును మార్కెట్లోని ఇతర సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పోల్చినప్పుడు కొన్ని తేడాలుంటాయి. ఈ పోటీలో సజాతీయ వస్తువులు కాకుండా విజాతీయ వస్తువులే ఉంటాయి.
వస్తువు వైవిధ్యమనేది బ్రాండ్ నేమ్, ట్రేడ్ మార్క్ మొదలైన రూపాల్లో ఉంటుంది. అంటే సంస్థ ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలుంటాయి. వీటికుండే జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం అధికం.
c) నూతన సంస్థలు ప్రవేశించే, నిష్క్రమించే స్వేచ్ఛ:
ప్రతీ సంస్థ తన వస్తూత్పత్తిపై ఏకస్వామ్య అధికారాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇదే పోలికలున్న వస్తువులను తయారుచేసే ఇతర సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటుంది. కాబట్టి పరిశ్రమలోకి వీలుంది. అలాగే పరిశ్రమ నుంచి నిష్క్రమించే స్వేచ్ఛ ఉంది.
d) పోటీతో కూడుకున్న ప్రకటనలు లేదా అమ్మకం వ్యయాలు :
వస్తువుల వైవిధ్యం వల్ల తమ అమ్మకాల్లో పెరుగుదల కోసం పోటీ ప్రకటనలను సంస్థలు అనుసరిస్తాయి. వినియోగదారుల మనస్సులో బ్రాండ్ ‘ఏ’, బ్రాండ్ ‘బి’ మధ్యగల తేడాలు ఏర్పడటానికి వ్యాపార ప్రకటనలు ఇస్తారు.
అమ్మకాల పెంపుదల కోసం ప్రకటన వ్యయాలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడమనేది ఏకస్వామ్య పోటీ ముఖ్య లక్షణం. ఈ వ్యయాలను ‘అమ్మకం వ్యయాలంటారు.’ అమ్మకం వ్యయాలు, ఉత్పత్తి వ్యయాలు వేరువేరుగా ఉంటాయి.
e) అధిక డిమాండ్ వ్యాకోచత్వం :
ఏకస్వామ్య పోటీలోని సంస్థకుండే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందకు వాలుతుంది. ఈ డిమాండ్ రేఖ అధిక వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది. అయితే సంపూర్ణ పోటీ మాదిరిగా సంపూర్ణ వ్యాకోచత్వాన్ని మాత్రం కలిగివుండదు.
f) సంస్థ పరిశ్రమ :
ఈ పోటీలో సంస్థ, పరిశ్రమ రెండూ ఉంటాయి. అయితే పరిశ్రమ గ్రూప్ గా ఉంటుంది.
ప్రశ్న 6.
పరిమితస్వామ్యం అంటే ఏమిటి ? దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
Oligopoly అనే పదం గ్రీకు పదాలయిన ‘Oligos’, ‘Pollein’ అనే పదాల నుండి గ్రహించడమైంది. ‘Oligos’ అంటే కొద్దిమంది అని, Pollein అంటే అమ్మడం అని అర్థం. పరిమిత స్వామ్యంలో కొద్దిమంది అమ్మకపుదార్లు నుండి వారు సజాతీయమైన వస్తూత్పత్తిని గాని లేదా వైవిధ్యం ఉన్న వస్తూత్పత్తిని గాని చేస్తూ ఉంటారు. ఈ కొద్దిమంది అమ్మకందారుల మధ్య పోటీ ఉంటుంది. పరిశ్రమలోని ఇతర సంస్థలపై ప్రతి సంస్థ ప్రత్యక్షంగా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
లక్షణాలు :
- వస్తువును అమ్మే సంస్థలు చాలా కొద్ది సంఖ్యలో ఉంటాయి.
- దీనిలో డిమాండ్ రేఖ అనిశ్చితత్వంగా ఉంటుంది.
- ధరల దృఢత్వం ఉంటుంది.
- ప్రకటనలపై అధిక వ్యయాన్ని చేస్తారు.
- సంస్థల మధ్య పరస్పర ఆధార సంబంధం ఉంటుంది.
ప్రశ్న 7.
ద్విదాధిపత్యం భావనను దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
గ్రీకు భాషలో ‘duo’ అంటే ఇద్దరు అని, ‘poly’ అంటే అమ్మకందారులు అని అర్థం. ఈ రకమగు వ్యవస్థలో ఇద్దరు ఉత్పత్తిదారులు మాత్రమే వస్తూత్పత్తిని కొనసాగిస్తారు. వీరు మార్కెట్పై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు.
పరిమితస్వామ్యంలోని భాగమే ద్విదాధిపత్యం. ఇద్దరు అమ్మకందార్లే వస్తూత్పత్తిని చేస్తారు. ద్విదాధిపత్యం సూక్ష్మ ” రూపంలో ఉండే పరిమితస్వామ్యం. ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసే వస్తువులు సజాతీయాలు కాని లేదా భిన్నమైన వస్తువులుగా కాని ఉండొచ్చు. ఇద్దరు ఉత్పత్తిదారులు ఉన్నందువల్ల ఒకరి నిర్ణయాలు మరొకరి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని ఇద్దరికీ తెలుసు.
ఉత్పత్తిదారుల మధ్య పోటీ ఉండవచ్చు లేదా ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి రావచ్చు. మార్కెట్లో ఈ రెండు సంస్థలు చెప్పుకోదగ్గ నియంత్రణను కలిగి ఉంటాయి. ప్రస్తుతం పారిశ్రామిక వ్యవస్థలో సులభంగా అధ్యయనం చేయబడుతున్న మార్కెట్ వ్యవస్థ ఇదే.
1838లో ఫ్రెంచి ఆర్థికవేత్త ఆగస్టిన్ కూర్నాట్ ద్విదాధిపత్యం నమూనాను అభివృద్ధి చేసాడు. రెండు సంస్థల ఉదాహరణతో కూర్నాట్ తన నమూనాను వివరించాడు. అమ్మకందారులు పోటీదారుని పూర్వపు ప్రతిచర్యలను పరిగణించకుండానే తన చర్యకు ఉపక్రమించు ప్రవర్తనను కలిగి ఉంటారు.
ఫలితంగా ప్రతీ సంస్థ మొత్తం ఉత్పత్తిలో 1/3వ వంతు, రెండు సంస్థలు కలిసి 2/3వ వంతు మాత్రమే ఉత్పత్తిని చేస్తాయి. ప్రతి సంస్థ లాభాలను గరిష్ఠం చేసుకొంటుంది. పరిశ్రమలో మాత్రం లాభాలు గరిష్ఠం కావు. సంస్థలు పరస్పరం ఆధారపడడాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది.
ద్విదాధిపత్యం లక్షణాలు :
- ఇద్దరు అమ్మకందార్లు ఉంటారు.
- సజాతీయ ఉత్పత్తి.
- ఉత్పత్తి వ్యయం శూన్యం
- అమ్మకందార్లు పరస్పరం ఆధారపడడాన్ని గుర్తించరు.
ప్రశ్న 8.
సంపూర్ణ పోటీని, ఏకస్వామ్యాన్ని పోల్చండి.
జవాబు.
సంపూర్ణ పోటీలో అనేకమంది అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉండి సజాతీయమైన వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. మార్కెట్లో నిర్ణయమైన ధరను సంస్థ అంగీకరిస్తుంది. కాని సంస్థకు ధర నిర్ణయంలో ప్రాధాన్యత ఉండదు. సంస్థ గరిష్ట లాభాలనైతే గరిష్ట స్థాయికి పెంచటానికి, నష్టాలనైతే కనిష్ట స్థాయికి తగ్గించటానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానమయ్యేట్లు సంస్థ ప్రయత్నిస్తుంది.
ఏకస్వామ్యంలో ఒక వస్తువుకు ఒకే ఉత్పత్తిదారుడుంటాడు. మార్కెట్లో తన వస్తువుకు ఎటువంటి సన్నిహిత ప్రత్యామ్నాయాలు లభించవు. సంస్థ వస్తువు ధరను, వస్తురాశిని నిర్ణయించగలదు. కాని ఒకే సమయంలో రెండు నిర్ణయాలను చేయలేదు. సంస్థ సమతౌల్యంలో ఉండటానికి ఉపాంత వ్యయం, ఉపాంత రాబడికి సమానం అవ్వాలి.
సంపూర్ణ పోటీ, ఏకస్వామ్యాల మధ్య పోలిక :
సంపూర్ణ పోటీ | ఏకస్వామ్యం |
1. అత్యధిక సంఖ్యలో అమ్మకందార్లు ఉంటారు. | 1. ఒకే ఒక్క ఉత్పత్తిదారుడు ఉంటాడు. |
2. సంస్థలకు ప్రవేశానికి, నిష్క్రమించటానికి స్వేచ్ఛ ఉంటుంది. | 2. నూతన సంస్థల ప్రవేశాలకు స్వేచ్ఛ ఉండదు. |
3. ఇక్కడ వస్తువులన్నీ సజాతీయాలు. | 3. ఇక్కడ సజాతీయత ఉండదు. ఉత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. |
4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమకు తేడా ఉంది. | 4. ఈ మార్కెట్లో సంస్థ, పరిశ్రమ రెండు ఒక్కటే. |
5. మార్కెట్ వస్తువు ధరను నిర్ణయిస్తుంది. ఉత్పత్తి దారుడు ధరను స్వీకరిస్తాడు. | 5. ఉత్పత్తిదారుడే ధరను నిర్ణయిస్తాడు. |
6. మార్కెట్లో ఒకే ధర ఉంటుంది. | 6. మార్కెట్లో ధర విచక్షణ చేస్తాడు. |
7. సగటు, ఉపాంత రాబడులు సమానం. ఇవి ‘X’ అక్షంకు సమాంతరంగా ఉంటాయి. | 7. సగటు రాబడి, ఉపాంత రాబడి కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రేఖలు ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటాయి. |
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
మార్కెట్ని నిర్వచించండి.
జవాబు.
సాధారణంగా మార్కెట్ అంటే వస్తువుల క్రయ, విక్రయాలు జరిగే ప్రదేశం అని భావిస్తాం. కాని అర్థశాస్త్రంలో మార్కెట్ అంటే అమ్మకందార్లు, కొనుగోలుదార్లు కలిసి ధరలు నిర్ణయించుకోవటానికి ఉపయోగపడే యంత్రాంగం.
ప్రశ్న 2.
కాలాన్నిబట్టి మార్కెట్లపై ఒక వాక్యం వ్రాయండి.
జవాబు.
కాలాన్ని ఆధారంగా చేసుకుని మార్కెట్లో వస్తు సప్లయ్లో సర్దుబాట్లు జరుగుతాయి. కాల వ్యవధి ఆధారంగా మార్కెట్ను నాలుగు రకాలుగా విభజిస్తారు. అవి :
- మార్కెట్ కాలం లేదా అతిస్వల్ప కాలం
- స్వల్ప కాలం
- దీర్ఘకాలం
- అతిదీర్ఘ కాలం.
ప్రశ్న 3.
ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు.
జవాబు.
ఒక వస్తువుకు ఉండే మార్కెట్ విస్తీర్ణం దానికుండే డిమాండ్, రవాణా సౌకర్యాలు, వస్తువు మన్నికపై ఆధారపడి ఉంటుంది. కాలం ఆధారంగా మార్కెట్ను క్రింది విధంగా వర్గీకరిస్తారు.
- స్థానిక మార్కెట్
- జాతీయ మార్కెట్
- ప్రాంతీయ మార్కెట్
- అంతర్జాతీయ మార్కెట్ లేదా విదేశీ మార్కెట్.
ప్రశ్న 4.
పోటీని బట్టి మార్కెట్లు.
జవాబు.
మార్కెట్లోని పోటీ ఆధారంగా మార్కెట్ను క్రింది విధంగా వర్గీకరిస్తారు.
(a) సంపూర్ణ పోటీ మార్కెట్ :
ఈ మార్కెట్లో అధిక సంఖ్యలో అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఉండి, అందరూ సజాతీయ వస్తువులను అమ్మడం, కొనడం చేస్తారు. ఒకే ధర మార్కెట్లో ఉంటుంది.
(b) అసంపూర్ణ పోటీ మార్కెట్ :
ఈ మార్కెట్లో వివిధ సంఖ్యలలో అమ్మకందార్లు, అధిక సంఖ్యలో కొనుగోలుదార్లు ఉండి, వైవిధ్యం గల వస్తువులు వేరువేరు ధరల వద్ద అమ్మటం జరుగుతుంది. ఉదా : ఏకస్వామ్యం, ద్విస్వామ్యం, ఏకస్వామ్య పోటీ.
ప్రశ్న 5.
సంపూర్ణ పోటీ అంటే ఏమిటి ?
జవాబు.
సంపూర్ణ పోటీ మార్కెట్ వ్యవస్థలో వైయక్తిక సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు. నిత్యం వాడుకలో ఉన్న అర్థానికి భిన్నంగా ఆర్థిక సిద్ధాంతంలో సంపూర్ణ పోటీ పదాన్ని వాడుతున్నాం. వర్తకులు ‘పోటీ’, ‘ప్రతిస్పర్ధ’ అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. సిద్ధాంతరీత్యా సంపూర్ణ పోటీలో సంస్థల మధ్య ప్రతిస్పర్థ ఉండదు.
సజాతీయ వస్తువులను తయారుచేసే సంస్థలు అధిక సంఖ్యలో ఉండి, పరిశ్రమలోనికి సంస్థలు ప్రవేశించడానికి, పరిశ్రమ నుంచి నిష్క్రమించడానికి స్వేచ్ఛ, కొనుగోలుదారునికి సంపూర్ణ పరిజ్ఞానం, ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత, రవాణా వ్యయాలు లేకుండటం అనే లక్షణాలుంటే దానిని సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు.
ప్రశ్న 6.
ఏకస్వామ్యం నిర్వచించండి.
జవాబు.
అసంపూర్ణ పోటీలో ఏకస్వామ్యం ఒకటి. దీనినే గుత్తాధిపత్యం అంటారు. మార్కెట్లో ఒకే ఒక అమ్మకందారుడుండి, సమీప ప్రత్యామ్నాయ వస్తువులు లభ్యంకాని మార్కెట్ని ఏకస్వామ్యం అంటారు. ఈ మార్కెట్లో ధర విచక్షణకు అవకాశం ఉంటుంది.
ప్రశ్న 7.
ఏకస్వామ్యపు పోటీ అంటే ఏమిటి ?
జవాబు.
ఈ మార్కెట్లో వస్తు వైవిధ్యం ఉంటుంది. అనగా అనేక సంస్థలు కొంత భేదంతో ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ సన్నిహిత ప్రత్యామ్నాయాలు. ఉదా : బూస్ట్, బోర్నవిటా మొదలగునవి.
ప్రశ్న 8.
పరిమితస్వామ్యంని నిర్వచించండి.
జవాబు.
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు పరిమితంగా ఉంటారు. సంస్థలు స్వతంత్రంగా లేదా ఉమ్మడి అంగీకారంతో సంస్థలు వస్తువుల ధరలను నిర్ణయిస్తాయి.
ప్రశ్న 9.
ద్విదాధిపత్యం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ మార్కెట్లో ఉత్పత్తిదారులు ఇద్దరుంటారు. వీరి మధ్య పోటీ అధికంగా ఉంటుంది. ఒక సంస్థ తన మార్కెట్ విధాన రూపకల్పనలో తనకు పోటీగా ఉన్న సంస్థ ప్రవర్తనను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంది.
ప్రశ్న 10.
సమతౌల్యపు ధరను వివరింపుము.
జవాబు.
ఒక సంస్థ తన తరహాని లేదా పరిమాణాన్ని ఏవిధంగాను మార్చటానికి ఇష్టపడని పరిస్థితిని సమతౌల్యస్థితి అంటారు. ఏ ధర వద్ద సప్లయ్, డిమాండ్ సమానంగా ఉంటాయో దానిని సమతౌల్యపు ధర అని అంటారు.
ప్రశ్న 11.
వస్తు వైవిధ్యం / ఉత్పాదనా భిన్నత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఏకస్వామ్య పోటీ మార్కెట్లో అనేక సంస్థలు వస్తువులను తయారుచేసినా, ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువును మార్కెట్లోని ఇతర సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పోల్చినపుడు బ్రాండ్నేమ్, ట్రేడ్మార్క్, వస్తువు లక్షణాలు మొదలైన వాటి విషయంలో భేదం ఉంటుంది. అంతేగాక వస్తువుకు సమీప ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అలాగే | జాత్యంతర డిమాండ్ వ్యాకోచత ఎక్కువ.
ప్రశ్న 12.
అమ్మకపు వ్యయాలు.
జవాబు.
సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాలను మార్కెట్లో పెంచుకోవడానికి చేసే ఖర్చులను అమ్మకపు వ్యయాలు అని అంటారు. పత్రికలు, టెలివిజన్, ప్రదర్శనలు మొదలగునవి వాటి కోసం సంస్థ అధిక మొత్తంలో అమ్మకాల అభివృద్ధికి ఖర్చు చేస్తుంది.