TS Inter 1st Year Economics Notes Chapter 1 Introduction to Economics

Here students can locate TS Inter 1st Year Economics Notes Chapter 1 Introduction to Economics to prepare for their exam.

TS Inter 1st Year Economics Notes Chapter 1 Introduction to Economics

→ Economics is a social science. It explains how an economy and different individuals behave while managing their economic activities.

→ The term Economics is originated from greek words ‘OIKOS’ and ‘Nemein’.

→ Economic problem is concerned with economizing scarce resources. Wants, efforts and satisfaction constitute the essence of economics.

  1. Wealth definition – Adam Smith
  2. Welfare definition – Alfred Marshall
  3. Scarcity definition – Lionel Robbins
  4. Growth definition – Samuelson

TS Inter 1st Year Economics Notes Chapter 1 Introduction to Economics

→ Modern economists have divided economic theory into two parts,

  • Micro Economics
  • Macro Economics.

The two terms were first coined and used by ‘Ragnar Frisch’ in 1933. Micro Economics was popularised by Alfred Marshall, and J.M. Keynes popularised Macro Economics. Both approaches are essential for a proper understanding of a problem. The two approaches are interdependent.

→ The method of studying economic phenomena by taking assumptions and deducing conclusions from assumptions is called deduction.

→ Inductive method is the process in which one can arrive generalization on the basis of observed facts.

→ Economic static – analysis where establishing the functional relationship between two variables whose values are related to the same point of time.

→ Economic dynamics is the study of in relation to the preceding and succeeding events.

→ A positive science may be defined as a body of systematized knowledge concerning ‘What it is’.

→ A normative science may be defined as a body of systematized knowledge relating to the object of “What ought to be”?

→ Anything which satisfies human want is good.

→ Goods can be divided into two types: i) Free goods ii) Economic goods.
Economic goods are again divided into three types: i) Consumer goods ii) Capital goods iii) Intermediary Goods.
Semi-finished and under-finished products are called intermediary goods.

→ Wealth means money but in Economics all economic goods including land is treated as wealth. Wealth has three characters.

  1. Utility
  2. Exchange value
  3. Transferability
  4. Scarcity

→ Income is a flow over a period of time. Income flow is circular in character. There are two types of income, i) Money income ii) Real income.

→ Wants satisfying capacity of good is called utility. There are four types of utilities,

  1. Form utility
  2. Place utility
  3. Time utility
  4. Service utility.

→ Value means the exchange value of goods in economics. A good has value in use and value in exchange.

→ The value of a good expressed in terms of money is its price.

TS Inter 1st Year Economics Notes Chapter 1 Introduction to Economics

→ Human wants are starting points of all economic activities. They are unlimited, competitive, complementary, and recur. Wants are classified into necessities, comforts, and luxuries.

→ In Economics welfare means utility of satisfaction. Welfare indicates better living conditions of people in society. Wealth and welfare are closely related to one another.

TS Inter 1st Year Economics Notes Chapter 1 అర్థశాస్త్ర పరిచయం

→ అర్థశాస్త్రం అనే పదం గ్రీకు భాషలోని “Okinomickos” అనే పదం నుంచి ఆవిర్భవించింది.

→ ఆడమ్ స్మిత్ అభిప్రాయం ప్రకారం అర్థశాస్త్రం ప్రధానంగా “సంపదను” గూర్చి చర్చిస్తుంది.

→ మార్షల్ అర్థశాస్త్రంలో సంపద కన్నా శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

→ రాబిన్స్ ప్రకారం ఆర్థిక సమస్యలన్నింటికి మూలకారణం ‘కొరత’,

→ శామ్యూల్సన్ తన నిర్వచనములో ప్రస్తుత వినియోగానికే కాక భవిష్యత్ వినియోగానికి కూడా ప్రాధాన్యతను ఇచ్చాడు.

→ జేకబ్ వైనర్ ప్రకారం ఆర్థికవేత్తల ప్రశ్నలు వాటికి సంబంధించిన చర్చల ద్వారా అర్థశాస్త్రంను అర్థం చేసుకోవచ్చును.

→ రాగ్నార్ ఫ్రిష్ మొట్టమొదటిసారిగా 1933 సం॥లో సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం అనే పదాలను ఉపయోగించడం జరిగింది.

→ సూక్ష్మ అర్థశాస్త్రం వైయుక్తిక యూనిట్లను పరిశీలిస్తుంది. దీనిని ‘ధరల సిద్ధాంతం’ అని కూడా అంటారు.

→ స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒకే యూనిట్గా పరిశీలిస్తుంది. దీనిని ‘ఆదాయ ఉద్యోగిత’ సిద్ధాంతం అని కూడా అంటారు.

→ నిగమన పద్ధతి సార్వత్రిక ప్రతిపాదనల నుంచి ఆరంభమై ప్రత్యేక ప్రతిపాదనలకు దారితీస్తుంది.

→ ఆగమన పద్ధతిలో ప్రత్యేక ప్రతిపాదనల నుంచి సార్వజనీన ప్రతిపాదనలు రూపొందిస్తారు.

→ ఆర్థిక నిశ్చలత్వం అనగా కాలంతో సంబంధం లేకుండా ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించడం.

→ ఆర్థిక చలనత్వం అనగా కాలంతో పాటు మార్పు చెందే వివిధ చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేయడం.

→ ఉనికిలో ఉన్న విషయాలను గురించి ఒక క్రమబద్ధమైన అధ్యయనం చేయడాన్ని నిశ్చయాత్మక అర్థశాస్త్రం అంటారు.

TS Inter 1st Year Economics Notes Chapter 1 Introduction to Economics

→ ‘ఎలా ఉండాలి’ అనే విషయాన్ని గురించి క్రమబద్ధమైన పద్ధతిలో అధ్యయనం చేసేది నిర్ణయాత్మక శాస్త్రం.

→ అర్థశాస్త్రంలో మానవ కోరికను సంతృప్తిపరచగలిగే భౌతిక, అభౌతికాంశాలన్నింటిని వస్తువులుగా పరిగణిస్తారు.

→ ప్రకృతి నుండి ఉచితంగా లభించే వస్తువులను ఉచిత వస్తువులంటారు.

→ మానవులచే ఉత్పత్తి చేయబడే వస్తువులన్నింటిని ఆర్థిక వస్తువులంటారు.

→ మానవ కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరిచే వస్తువులన్నింటిని వినియోగ వస్తువులంటారు.

→ ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి కారకాన్ని ఉత్పాదక వస్తువులంటారు.

→ ఉత్పత్తి ప్రక్రియలో పూర్తిగా తయారు కాకుండా ఉన్న ముడి సరుకులను మాధ్యమిక వస్తువులంటారు.

→ అర్థశాస్త్ర పరిభాషలో భూమితోపాటుగా ఆర్థిక వస్తువులన్నింటిని కలిపి సంపదగా పరిగణిస్తారు.

→ ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఈ ప్రవాహానికి మూలం సంపద.

→ మానవుని కోర్కెలను తీర్చగలిగే వస్తు సేవల యొక్క శక్తినే ప్రయోజనం అంటారు. ఇది నాలుగు రకాలు.

  1. ఆకార ప్రయోజనం
  2. స్థాన ప్రయోజనం
  3. కాల ప్రయోజనం
  4. సేవా ప్రయోజనం.

→ అర్థశాస్త్రంలో విలువ భావనను రెండు రకాలుగా వివరిస్తారు.

  1. వినియోగపు విలువ
  2. మారకపు విలువ.

→ వస్తువు యొక్క విలువను ద్రవ్య రూపంలో తెలియజేయటాన్ని ‘ధర’ అంటారు.

→ మానవుని కోర్కెలు అనంతాలు. వనరులు పరిమితం, మానవుని కోర్కెలు ఆర్థిక కార్యకలాపములకు మూలం.

TS Inter 1st Year Economics Notes Chapter 1 Introduction to Economics

→ ఆర్థికపరమైన ఒక విరామస్థితిని సమతౌల్యం అంటారు.

→ ఒక వ్యక్తి లేదా సమాజం సంపద నుండి పొందే సంతృప్తిని తెలియజేస్తుంది సంక్షేమం.

Leave a Comment