These TS 9th Class Telugu Important Questions 8th Lesson ఉద్యమ స్ఫూర్తి will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 8th Lesson Important Questions ఉద్యమ స్ఫూర్తి
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘ఉద్యమ స్పూర్తి’ పాఠం రచయిత్రి ఎవరు ? ఆమె గురించి రాయండి.
జవాబు:
పాఠం : ”ఉద్యమ స్పూర్తి’
రచయిత్రి : సంగెం లక్ష్మీబాయి
దేని నుండి గ్రహించబడినది : రచయిత్రి రాసిన “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” అనే ఆత్మకథ నుండి గ్రహించబడినది.
జన్మస్థలము : ఈమె రంగారెడ్డి జిల్లాలోని ‘ఘటకేశ్వరం’ అనే గ్రామంలో జన్మించింది.
జనన-మరణాలు : జననము 27 -07-1911. మరణము 1979 వ సంవత్సరం
ఉద్యోగం : హైదరాబాదు నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలిగా ఈమె పనిచేసింది.
పదవులు : ఈమె బూర్గులవారి మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. ఈమె 1957 నుండి 1971 వరకు 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు.
పాల్గొన్న ఉద్యమాలు :
- గాంధీజీ పిలుపుతో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని, జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళ ఈమె.
- 1951లో తెలంగాణలో వినోబాభావే చేసిన భూదానోద్యమ యాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ ఈమె.
ప్రశ్న 2.
మణిలాల్సేన్ అనే 17 సం॥ బాలుడి మరణవార్త పాలకుల్ని గడగడలాడించింది. ఆ సంఘటనను వివరించండి.
జవాబు:
ముర్షాబాద్ జైలులో మణిలాల్సేన్ అనే 17 సంవత్సరాల బాలుడు 60 రోజులు నిరసన వ్రతం చేసి ప్రాణాలు కోల్పోయాడు. జైలులో రాజకీయ ఖైదీలకు కల్తీ సరుకు ఇచ్చినంతకాలం తాను భుజింపనని జతీంద్రనాథ్ మతమవలంబించి నిరసన వ్రతం సాగించిన మణిలాల్ విషయం పట్టించుకున్న పాలకుడే లేకపోయాడు. పార్లమెంట్లో ఈతని మరణవార్త బాంబు పేలినట్లు పేలి పాలకుల్ని గడగడలాడించింది.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘సంగెం లక్ష్మీబాయి మహిళలకు స్ఫూర్తి ప్రదాత’- ఎందుకు ? సొంతమాటల్లో రాయండి.
జవాబు:
స్వాతంత్ర్య సమర యోధురాలిగా, సంఘసేవా పరాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి సంగెం లక్ష్మీబాయి. చిన్నతనంలో తల్లిని, వివాహమైన కొంతకాలానికే భర్తను కోల్పోయినా లక్ష్మీబాయి నిరాశపడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలను ఓర్చి చదువుకొన్నది. స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగెం లక్ష్మీబాయి.
లక్ష్మీబాయి హైదరాబాదులో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళగా పేరుపొందింది. 1951 సం॥లో తెలంగాణ ప్రాంతంలో వినోబాభావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న తొలిమహిళగా గుర్తింపు పొందారు.
స్త్రీలు వంట ఇంటికే పరిమితమైన కాలంలోనే దేశం కోసం, సంఘంలోని దురాచారాలు రూపుమాపటానికై తన జీవితాన్నే పణంగా పెట్టిన లక్ష్మీబాయి మహిళలకే కాదు అందరికీ స్ఫూర్తి ప్రదాతే. లక్ష్మీబాయి తెలుగు పండితురాలు. తన సాహిత్యంతో ప్రజలలో దేశభక్తిని, మన బాధ్యతను గుర్తుచేసింది. తన రచనలతో ఎందరినో ప్రభావితం చేసింది. బూర్గుల మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికై 15 సం॥ల పాటు దేశోన్నతికై శ్రమించిన లక్ష్మీబాయి మహిళలకు స్ఫూర్తి ప్రదాత.
ప్రశ్న 2.
‘ఉద్యమస్ఫూర్తి’ పాఠం ఆధారంగా, భారతీయ సంస్కృతిని బ్రిటిష్ పాలకులు ఏ విధంగా ఎగతాళి చేశారు ?
జవాబు:
‘ఉద్యమస్ఫూర్తి’ పాఠ్యాంశం సంగెం లక్ష్మీబాయి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు’ అనే ఆత్మకథలోనిది.
ఆ రోజుల్లో మన భారతీయులు పాముల్నీ, వృక్షాలనూ పూజించటం ‘హారిబుల్’ అని విదేశీయులు తమ గ్రంథాలలో రాసేవారు. గోచీలు పెట్టుకొని భూములు దున్నుతారని, కట్టుగుడ్డలేని నిరుపేదలంటూ పరిహసించేవారు. బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సాగుతున్న రోజుల్లో ఒక యువకుణ్ణి అన్యాయంగా ప్రభుత్వ అండదండలున్న వ్యాపారి. కారుతో చంపేస్తాడు. ఆ సందర్భంగా ప్రజలు నివాళులర్పించడానికి వచ్చిన ప్రజలు గంధపుష్పాక్షతలు చల్లి సానుభూతిని తెలియజేయడాన్ని ప్రభుత్వం అడ్డుకుంది.
భారతీయులను బానిసలుగా, అనాగరికుల్లా పరిగణిస్తూ మన సంపదలో మనకింత భిక్ష పెట్టిన బ్రిటిష్ పాలకులు పచ్చినెత్తురు తాగే కిరాతకులుగా మనవాళ్ళకు కనిపించేవారు. మన ఆరోగ్య సూత్రాలను, ఆధ్యాత్మిక భావనలను తప్పుపడుతూ, మనల్ని ఛాందసులుగా పరాన్నభుక్కులైన పాశ్చాత్యులు భావించేవారు. మనలో మనకు తారతమ్యాలు ఏర్పరచి అంతఃకలహాలు రగిలించారు. ఈ విధంగా భారతీయ సంస్కృతిని బ్రిటిష్ పాలకులు ఎగతాళి చేశారు.
PAPER – I : PART – B
భాషాంశాలు – పదజాలం :
I. సొంతవాక్యాలు :
అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
1. స్వానుభవం : కులవృత్తులు స్వానుభవం వల్ల పిల్లలు తొందరగా నేర్చుకొని నైపుణ్యం పొందేవారు..
2. శతవిధాలు : అమ్మానాన్న శతవిధాలుగా చెప్పినా వినకుండా తమ్ముడు తుపాకి బొమ్మ కొన్నాడు.
3. ఉడుకు నెత్తురు ప్రవహించు : నాజర్ బృందం పల్నాటి చరిత్ర బుర్రకథ చెబుతూ ఉంటే అందరిలో ఉడుకు నెత్తురు ప్రవహిస్తుంది.
4. జేజేలు కొట్టు : పి.వి. సింధూ ఒలింపిక్ రజత పతకం సాధించగానే ఆమెకు భారత యువత జేజేలు కొట్టింది.
5. అండదండలు : తెలివిగల యువకులు ప్రభుత్వం ఇచ్చే అండదండలు అందుకొని స్వయంఉపాధి సాధించారు.
6. అధోగతిపాలగు : దుర్వ్యసనాలకు అలవాటుపడిన వారి కుటుంబాలు అధోగతిపాలవటం చూస్తూనే ఉన్నాం.
7. గుండెలు మండు : నా దేశాన్ని ఎగతాళి చేస్తూ ఎవరైనా మాట్లాడితే నా గుండెలు మండుతాయి. ఆరుగాలం కష్టం చేసిన రైతు పంటను వడ్డీ వ్యాపారులు దోచుకుంటుంటే ఆ రైతు గుండెలు మండవా మరి ?
8. పరాన్నభుక్కు : పరీక్షలలో కాపీలు కొట్టి ఉత్తీర్ణులయ్యే పరాన్నభుక్కులను నేను ప్రోత్సహించను.
9. చెల్లాచెదురు : అమ్మ బజారుకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి చెల్లాచెదురుగా పడేసిన కాగితాలు చూసి కోప్పడింది కాని నాకు పతంగి చేయటం వచ్చింది.
10. గడగడలాడించు : మా స్కూలు కబడ్డీ కెప్టెన్ తన ఆటతో ఎదుటి టీం వారిని గడగడలాడించాడు.
11. అట్టుడికినట్లు : తీవ్రవాదులు సైనికశిబిరంపై దాడి చేశారని వినగానే సైన్యం మొత్తం అట్టుడికినట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.
II. అర్థాలు :
ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
ప్రశ్న 1.
“అభ్యున్నతి” అనే పదానికి అర్థం
A) చదువు
B) ప్రగతి
C) స్వేచ్చ
D) ఉద్యోగం
జవాబు:
B) ప్రగతి
ప్రశ్న 2.
వాహిని – అనే పదానికి అర్థం . .
A) సైన్యము
B) తటాకం
C) రథము
D) పగలు
జవాబు:
A) సైన్యము
ప్రశ్న 3.
సేవలు బహిష్కరించారు – గీత గీసిన పదానికి అర్థం
A) బయటకు నెట్టు
B) బయటపెట్టు
C) వెలివేయు
D) కాదనుచెప్పు
జవాబు:
C) వెలివేయు
ప్రశ్న 4.
ఎవరడిగినా కర్కశంగా ఒక్కసారిగా కాదనలేం – గీత గీసిన పదానికి అర్థం
A) కరక్కాయ
B) చేదు
C) కఠినంగా
D) నిర్లక్ష్యం
జవాబు:
C) కఠినంగా
ప్రశ్న 5.
చిహ్నము, గుర్తు – అని అర్థం వచ్చే పదం
A) సౌంజ్ఞ
B) మచ్చ
C) బాణం
D) సంకేతము
జవాబు:
D) సంకేతము
ప్రశ్న 6.
పాశ్చాత్యదేశాలు – అనే అర్థం వచ్చే పదం
A) అప్రాచ్యము
B) ప్రాచ్యము
C) ప్రతీచి
D) ఉదీచి
జవాబు:
A) అప్రాచ్యము
ప్రశ్న 7.
లౌకిక సుఖాల కోసం పరితపించవద్దు – గీత గీసిన పదానికి అర్థం
A) తపస్సు
B) దుఃఖించు (విచారించు)
C) కాదను వద్దను)
D) ఆనందించు
జవాబు:
B) దుఃఖించు (విచారించు)
ప్రశ్న 8.
“అడపాదడపా” అనే పదానికి అర్థం
A) ఒక విధమైన ఆకు
B) అప్పుడప్పుడు
C) మెల్లమెల్లగా
D) తడబడు
జవాబు:
B) అప్పుడప్పుడు
ప్రశ్న 9.
“ప్రాధేయపడు” అనే పదానికి అర్థం
A) బ్రతిమలాడు
B) భంగపడు
C) పాటుపడు
D) విధేయపడు
జవాబు:
A) బ్రతిమలాడు
ప్రశ్న 10.
అశ్వత్థవృక్షము – అంటే అర్థం
A) మట్టిచెట్టు
B) మద్దిచెట్టు
C) జమ్మిచెట్టు
D) రావిచెట్టు
జవాబు:
D) రావిచెట్టు
ప్రశ్న 11.
ఆ శ్రేణిని విడదీయడం మాత్రం ఆ రోజు పోలీసుల తరం కాలేదు – గీత గీసిన పదానికి అర్థం
A) ఒకటి
B) పది
C) వరుస
D) జంట
జవాబు:
C) వరుస
ప్రశ్న 12.
ఆ వ్యాపారికి ప్రభుత్వపు అండదండలు బాగా ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం
A) సహాయములు
B) అధికారం
C) అర్హత
D) పేరు
జవాబు:
A) సహాయములు
III. ప్రకృతి, వికృతులు :
ప్రశ్న 1.
భిక్ష – అను పదానికి వికృతి
A) భైక్షము
B) బిచ్చము
C) పిచ్చము
D) ముష్టి
జవాబు:
B) బిచ్చము
ప్రశ్న 2.
జీతం – అనే పదానికి ప్రకృతి
A) జీబూతం
B) జీరు
C) జీవితం
D) చేతము
జవాబు:
C) జీవితం
ప్రశ్న 3.
సంతసము – అనే పదానికి ప్రకృతి
A) సంతానము
B) సంతోషము
C) సంతాలు
D) సంతలు
జవాబు:
B) సంతోషము
ప్రశ్న 4.
స్తంభము – అనే పదానికి వికృతి
A) స్తంబము
B) సంబము
C) కంబము
D) తంబము
జవాబు:
C) కంబము
ప్రశ్న 5.
ఆ ప్రదర్శనశాల అద్భుతంగా ఉంది గీత గీసిన పదానికి వికృతి
A) ఆశ్చర్యము
B) అబ్బురము
C) ఆతురము
D) అభ్రము
జవాబు:
B) అబ్బురము
ప్రశ్న 6.
ప్రజల క్షేమము నాయకుల బాధ్యత – గీత గీసిన పదానికి వికృతి
B) క్లేశము
C) చామన
D) చురుకు
జవాబు:
A) సేమము
ప్రశ్న 7.
సన్న్యాసి – అనే పదానికి వికృతి
A) సన్నాసి
B) తాపసి
C) సత్తెనాసి
D) సంతు
జవాబు:
A) సన్నాసి
ప్రశ్న 8.
వేదాలు స్త్రీని శక్తిరూపంగా వర్ణించారు – గీత గీసిన పదానికి వికృతి
A) శ్రీ
B) సిరి
C) శక్తి
D) ఇంతి
జవాబు:
D) ఇంతి
ప్రశ్న 9.
అక్షరము – అనే పదానికి వికృతి
A) అచ్చరము
B) అక్కరము
C) అబ్బరము
D) అచ్చు
జవాబు:
B) అక్కరము
ప్రశ్న 10.
శృంఖల – అనే పదానికి వికృతి
A) శంకము
B) పంకిలము
C) శంక
D) సంకెల
జవాబు:
D) సంకెల
ప్రశ్న 11.
భగవంతుడు, భక్తుడు ఒక్కటే – గీత గీసిన పదానికి వికృతి
A) భక్తి
B) భగనానుడు
C) బత్తుడు
D) బద్రి
జవాబు:
C) బత్తుడు
ప్రశ్న 12.
పిల్లలకు బట్టలెంత తక్కువ తొడిగితే అంత మంచిది – గీత గీసిన పదానికి వికృతి
A) వస్త్రం
B) పటః
C) గుడ్డ
D) అంబరం
జవాబు:
B) పటః
ప్రశ్న 13.
నాలుగు గంటలపాటు గిజగిజ తన్నుకుని అతను ప్రాణం విడిచాడు – గీత గీసిన పదానికి వికృతి
A) 60 నిముషాలు
B) గడియ
C) ఘడియ
D) ఘంటా
జవాబు:
D) ఘంటా
IV. పర్యాయపదాలు :
ప్రశ్న 1.
పాములు ఉన్న లోకం నాగలోకం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) పాము, పసరిక
B) భుజగం, వ్యాళం, సర్పం
C) త్రాచు, త్రాసు
D) పడగ, పాపతేడు
జవాబు:
B) భుజగం, వ్యాళం, సర్పం
ప్రశ్న 2.
సమరంలో ప్రాణభయం ఉండదు – గీత గీసిన పదానికి పర్యాయపదం కానిది..
A) రణం
B) యుద్ధం
C) సంగరం
D) సేన
జవాబు:
D) సేన
ప్రశ్న 3.
అగ్ని – అనే పదానికి పర్యాయపదాలు
A) అనలం, నిప్పు
B) జ్వాల, శిఖ
C) అనిలం, మంట
D) దగ్ధం, దాహం
జవాబు:
A) హృదయం, డెందము
ప్రశ్న 4.
ప్రకృతి అందాలు గుండెతో చూడాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) హృదయం, డెందము
B) గుండు, ఎద
C) మనస్సు, యశము
D) హర్దికము, మది
జవాబు:
A) అనలం, నిప్పు
ప్రశ్న 5.
“అసువులు, ఉసురు, ఆయువు” – పర్యాయపదాలుగా కల పదం.
A) మనస్సు
B) హృదయం
C) ప్రాణం
D) రక్తం
జవాబు:
C) ప్రాణం
ప్రశ్న 6.
తరువు, భూరుహం, ఉద్భిజ్జము – అనే పర్యాయపదాలు గల పదం
A) భూమి
B) మహీధరము
C) వృక్షం
D) తాళము
జవాబు:
C) వృక్షం
ప్రశ్న 7.
“నెత్తురు” – అనే పదానికి పర్యాయపదాలు
A) రక్తవర్ణం, ఆర్జవం
B) రుధిరం, రక్తం
C) అసృక్కు, త్వక్కు
D) మాంసలము, పిశితము
జవాబు:
B) రుధిరం, రక్తం
ప్రశ్న 8.
యోధుడు బలహీనులకు అండ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) జూదరి, పోటరి
B) వీరుడు, ధీరుడు
C) బంటు, తుంటరి
D) ఎక్కటి, మాటకారి
జవాబు:
B) వీరుడు, ధీరుడు
ప్రశ్న 9.
స్త్రీ – అనే పదానికి పర్యాయపదాలు
B) రాణి, యువతి
C) అతివ, పతివ్రత, ఇల్లాలు
D) లలన, భార్య
జవాబు:
A) ఇంతి, పడతి, కొమ్మ
V. నానారాలు:
ప్రశ్న 1.
వాహిని ముందు కదిలింది – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సేన, నది
B) ఒక చిత్రము, కళ
C) అందమైన స్త్రీ, రథము
D) కళ, మోహిని
జవాబు:
A) సేన, నది
ప్రశ్న 2.
ప్రయత్నము, సేద్యము – అను నానార్ధములు గల పదము
A) పొలము
B) వ్యవసాయము
C) కాలము
D) నాగలి
జవాబు:
B) వ్యవసాయము
ప్రశ్న 3.
వృత్తాంతం, సమాచారం, ప్రవర్తన – అనే నానార్థాలు గల పదం
A) పంక్తి
B) కథ
C) వార్త
D) చాటువు
జవాబు:
C) వార్త
ప్రశ్న 4.
స్త్రీల అభ్యున్నతికి కృషి చేసినవారిలో సంగెం లక్ష్మీబాయి ఒకరు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ప్రయత్నం, పన్ను
B) సేద్యం, ప్రయత్నం
C) వ్యవసాయం, సేద్యం
D) పని, సమర్థత
జవాబు:
B) సేద్యం, ప్రయత్నం
ప్రశ్న 5.
ఆ గాథలు కలలు కావని స్పష్టం చేస్తున్నా – గీత గీసిన పదానికి నానార్థాలు
A) కళ, వల
B) అసలు, వడ్డి
C) బలం, రేతస్సు
D) అవ్యక్త మధురం, పెరుగు
జవాబు:
C) బలం, రేతస్సు
ప్రశ్న 6.
ఘోరమైన దారుణాలు ఎన్నో ప్రతినిత్యం వార్తా పత్రికలలో వచ్చేవి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) వృత్తాంతం, దబ్బచెట్టు
B) సమాచారం, నడత
C) భాషణం, వేషం
D) వంగచెట్టు, నీడ
జవాబు:
B) సమాచారం, నడత
ప్రశ్న 7.
గంధ పుష్పాక్షతలు చల్లి ప్రజలు వీరావేశంతో జేజేలు కొట్టారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) వాసన, సువాసన
B) గర్వం, గరువం
C) వాసన, స్వల్పం
D) గంధకం, కందకం
జవాబు:
C) వాసన, స్వల్పం
VI. వ్యుత్పత్యర్థములు :
ప్రశ్న 1.
భర్త – అను పదానికి వ్యుత్పత్తి
A) వివాహమాడినవాడు
B) భరించువాడు
C) పోషించువాడు
D) ధనధాన్యములు ఇచ్చువాడు.
జవాబు:
B) భరించువాడు
ప్రశ్న 2.
సగరులచే త్రవ్వబడినది – అనే వ్యుత్పత్తి గల పదం
A) సగరచక్రవర్తి
B) ప్రగతి
C) సాగర
D) జలధి
జవాబు:
C) సాగర
ప్రశ్న 3.
‘మానవులు’ అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) మారని బుద్ధి కలవారు
B) మనువు సంతతికి చెందినవారు
C) మానమంటే గౌరవం కలవారు
D) మానని నవ్యత గలవారు
జవాబు:
B) మనువు సంతతికి చెందినవారు
ప్రశ్న 4.
భర్తను కోల్పోయినా లక్ష్మీబాయి నిరాశపడలేదు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థము
A) తాళికట్టినవాడు
B) భరించువాడు
C) ఏడడుగులు నడిచినవాడు
D) అరుంధతిని చూపినవాడు
జవాబు:
B) భరించువాడు
ప్రశ్న 5.
వ్యధ,పెట్టునది – అనే వ్యుత్పత్తి గల పదం.
A) భార్య
B) దారిద్య్రం
C) వ్యాధి
D) కష్టం
జవాబు:
C) వ్యాధి
PAPER – II : PART – A
అపరిచిత గద్యాలు
ప్రశ్న 1.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
చదువుకోని సామాన్య ప్రజలకు తరతరాలుగా వస్తున్న నోటిమాటల భాష ఒక్కటే వాడుకలో ఉండగా, చదువుకున్న వాళ్ళకు, ఆ భాషతో పాటు గ్రంథాల్లో ఉన్న కావ్య భాష కూడా అవసరమైంది. కావ్యాలు రాసేటప్పుడు తమకు పూర్వులు రాసిన భాషలోనే తాము కూడా రాస్తూ వచ్చారు. పూర్వులు ఉపయోగించిన ఛందస్సులనే తామూ ఉపయోగిస్తూ వచ్చారు. కానీ కావ్యాలను గురించి నోటితో చెప్పేటప్పుడు వాడుక భాషలోనే వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ వచ్చిన ఆ వివరణలనూ, వ్యాఖ్యానాలను రాయడం మొదలుపెట్టేసరికి కావ్య భాషా ప్రభావం కొంత చొరబడుతూ వచ్చింది. ఇది వ్యావహారిక, గ్రాంథిక భాషలను కలిపినట్లనిపిస్తుంది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి వీలులేదు. అయినా వచన రచనా సంప్రదాయానికి వాడుక భాషే ప్రధానంగా ఉండేది.
జవాబు:
ప్రశ్నలు
- చదువుకున్న వాళ్లకు ఏ భాష అవసరమైంది ?
- కావ్యాలను నోటితో ఏ భాషలో చెప్పేవారు ?
- వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ఏ భాష ఉండేది ?
- వచన రచనకు వాడిన భాష ఏది ?
- చదువుకోని వాళ్ళ భాష ఏమిటి ?
ప్రశ్న 2.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబ నియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్కు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.
జవాబు:
ప్రశ్నలు
- కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి ?
- ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు ?
- మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది?
- 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది ?
- ఎప్పుడు కుటుంబ నియంత్రణను బూతుమాట కింద జమకట్టేవారు ?
ప్రశ్న 3.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు.
‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు ముందు స్ఫురించేది బ్రౌను నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌను ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి రచించిన కాశీయాత్ర గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.
జవాబు:
ప్రశ్నలు
- తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం ?
- బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు ?
- పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి ?
- నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది ?
- కాశీయాత్రను గురించి పుస్తకము రచించినదెవరు ?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
విదేశీ సంస్కృతిని పారద్రోలి మన సంస్కృతిని కాపాడుదాం అని ప్రజలను చైతన్యపరుస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
ఓ యువతా.! ఓ జనతా ! మేల్కొనండి.
పాశ్చాత్య సంస్కృతిని విడవండి. ప్రాచ్య సంస్కృతిని కాపాడండి. విదేశీ మోజులో స్వదేశీ విధానాన్ని మరువకండి. మమ్మీ డాడీ అనకండి. అమ్మా ! నాన్నా! అని పిలవండి. భారతీయతను నిలపండి. “ధర్మం చర – సత్యం వద” అన్న సనాతనమైన మన సంస్కృతిని కాపాడండి. వేషభాషలతో పాటు వినయ విధేయతలకు పెద్దపీట వేయండి. ‘కొత్త వింత, పాత రోత’ అన్న చందాన జీవించకండి. ‘గత కాలమే మేలు వచ్చు కాలము కంటెన్’ అని పెద్దలు ఊరకే అనలేదు. భ్రమలలో బ్రతుకద్దు. నిజంలో జీవించండి.
అనురాగ ఆప్యాయతల కొలువు మనదేశం. ఇరుగు పొరుగను కూడ పిన్ని, బాబాయి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అని పిలిచే ధర్మం మన భారతదేశం. శత్రువైనా కష్టంలో ఉంటే అయ్యో పాపం అనే తత్వం మనది. పాములకు పాలు, చీమలకు పంచదార పంచే సనాతన ధర్మం కలిగిన కర్మభూమి భారతదేశం. కన్నతల్లికి కూడు పెట్టను పినతల్లి చేతికి బంగారు గాజులు తొడుగుతానన్నట్లు మనదేశీయ సంస్కృతి సంప్రదాయాలు విడిచి విదేశీ సంస్కృతిపై మోహం పెంచుకోకు. ఎప్పటికైనా మన సంస్కృతే నీకు తోడు నీడ. విదేశీ సంస్కృతి విడనాడు, మన సంస్కృతిని కాపాడు.
ఇట్లు,
స్వదేశీ సంస్కృతి పరిరక్షణ సంఘం.
PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణాని
కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
I. సంధులు:
ప్రశ్న 1.
“మనకు + ఎందుకు” – కలిపి రాయగా
A) మనకునేందుకు
B) మనెందుకు
C) మనకుయెందుకు
D) మనకెందుకు
జవాబు:
D) మనకెందుకు
ప్రశ్న 2.
“సత్య + ఆగ్రహం” – సంధి నామము
A) అత్వ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యడాగమ సంధి
D) సరళాదేశ సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 3.
కింది వానిలో “గుణసంధి”కి ఉదాహరణ
A) అభ్యున్నతి
B) ఏడ్చేదెవరు
C) స్వాతంత్ర్యోద్యమము
D) రంపపుకోత
జవాబు:
C) స్వాతంత్ర్యోద్యమము
ప్రశ్న 4.
స్వానుభవము – అనే పదాన్ని విడదీయగా
A) స్వా + నుభవము
B) స్వాను + భవము
C) స్వ + అనుభవము
D) సు + అనుభవము
జవాబు:
C) స్వ + అనుభవము
ప్రశ్న 5.
“మేము + ఎంత” – దీనిలో పూర్వపరస్వరములు
A) ఉ + ఎ
B) మేము – ఎంతం
C) ము + ఎ .
D) ఉ + ఎంత
జవాబు:
A) ఉ + ఎ
ప్రశ్న 6.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ కానిది.
A) సంతోషాస్పదము
B) దిక్కేమిటి
C) ఛాందసాచారము
D) వీరావేశము
జవాబు:
B) దిక్కేమిటి
ప్రశ్న 7.
“అధః + గతి → ఉత్వ విసర్గ సంధి” – సంధి చేసిన తరువాత.
A) అధోగతి
B) అధఃగతి
C) అధిగతి
D) అధిర్గతి
జవాబు:
A) అధోగతి
ప్రశ్న 8.
“అతి + అవసరము → అత్యవసరము” – సంధి పేరు
A) యడాగమ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) అకార సంధి
జవాబు:
C) యణాదేశ సంధి
ప్రశ్న 9.
“యణాదేశ సంధి”కి ఉదాహరణ కానిది.
A) విషాద + అంతం
B) ప్రతి + ఏకం
C) అణు + అస్త్రం
D) పితృ + ఆర్జితం
జవాబు:
A) విషాద + అంతం
II. సమాసములు :
ప్రశ్న 1.
కర్కశమైన హృదయం – అనే విగ్రహవాక్యాన్ని సమాసంగా మార్చగా
A) కర్కశులహృదయం
B) కర్కశ కాయము
C) కర్కశహృదయం
D) కర్కశహృదయులు
జవాబు:
C) కర్కశహృదయం
ప్రశ్న 2.
“షష్ఠీ తత్పురుష సమాసము”నకు ఉదాహరణ
A) శాస్త్రదృష్టి
B) చక్రపాణి
C) హైదరాబాదు నగరం
D) సహాయనిరాకరణ
జవాబు:
A) శాస్త్రదృష్టి
ప్రశ్న 3.
గంధపుష్పములు – విగ్రహవాక్యము
A) గంధములతో పుష్పములు
B) గంధములు, పుష్పములు
C) గంధమైన పుష్పములు
D) గంధము వంటి పుష్పములు
జవాబు:
B) గంధములు, పుష్పములు
ప్రశ్న 4.
“శతవిధాలు → శత సంఖ్యగల విధాలు” – సమాసము పేరు
A) బహువ్రీహి సమాసము
B) ద్వంద్వ సమాసము
C) షష్ఠీ తత్పురుష సమాసము
D) ద్విగు సమాసము
జవాబు:
D) ద్విగు సమాసము
ప్రశ్న 5.
‘అజ్ఞానము’ అనే పదానికి విగ్రహవాక్యము
A) అతోకూడిన జ్ఞానము
B) జ్ఞానము కానిది
C) అందరిలోని జ్ఞానము
D) అనేకమైన జ్ఞానము
జవాబు:
B) జ్ఞానము కానిది
ప్రశ్న 6.
సృష్టియు, స్థితియు, లయయును ఇది ఏ సమాసము ?
A) ద్వంద్వ సమాసము
B) బహుపద ద్వంద్వ సమాసము
C) ద్విగు సమాసము
D) ప్రాది సమాసము
జవాబు:
B) బహుపద ద్వంద్వ సమాసము
ప్రశ్న 7.
గాంధీ మొదలగువారు స్వతంత్ర సమరములో నాయకులు – గీత గీసిన పదానికి సమాసనామం గుర్తించండి.
A) చతుర్థీ తత్పురుష
B) తృతీయా తత్పురుష
C) షష్ఠీ తత్పురుష
D) సప్తమీ తత్పురుష
జవాబు:
A) చతుర్థీ తత్పురుష
ప్రశ్న 8.
“ద్విగు సమాసము”నకు ఉదాహరణ
A) దేశక్షేమం
B) నిర్జన ప్రదేశం
C) అప్రాచ్యము
D) నాలుగు గంటలు
జవాబు:
D) నాలుగు గంటలు
ప్రశ్న 9.
ఈ కింది వానిలో “సప్తమీ తత్పురుష”కు సంబంధించిన విగ్రహవాక్యం
A) ప్రపంచమందలి దేశాలు
B) నిరశనమనెడి వ్రతం.
C) నరాల యొక్క పుష్టి
D) దేశం యొక్క క్షామం
జవాబు:
A) ప్రపంచమందలి దేశాలు
ప్రశ్న 10.
భారతము అను పేరుగల దేశం, అశ్వర్ధము అను పేరుగల వృక్షము – అను విగ్రహవాక్యాలు గలవి ఏ సమాసమునకు చెందినవి ?
A) రూపక సమాసము
B) బహువ్రీహి సమాసము
C) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
జవాబు:
C) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
ప్రశ్న 11.
“ద్వంద్వ సమాసము”నకు ఉదాహరణ
A) నాలుగు గంటలు
B) శతవిధాలు
C) రెండు రూపాలు
D) కరవుకాటకాలు
జవాబు:
D) కరవుకాటకాలు
ప్రశ్న 12.
“నఞ తత్పురుష సమాసము”నకు ఉదాహరణ
A) అశ్వత్థవృక్షం
B) అప్రాచ్యము
C) నిరసనవ్రతం
D) కర్తవ్యపాలన
జవాబు:
B) అప్రాచ్యము
III. ఛందస్సు:
ప్రశ్న 1.
“వాడుక భాషలో తెలుగు” – ఈ వాక్యాన్ని గణవిభజన చేయగా వరుసగా వచ్చు గణములు
A) భ, ర, త
B) ర, ర, న
C) భ, ర, న
D) న, ర, జ
జవాబు:
C) భ, ర, న
ప్రశ్న 2.
ఉత్పలమాల ఛందస్సు వరుసగా వచ్చు గణములు
A) భ, ర, న, త, త, గ
B) భ, ర, న, భ, భ, ర, వ
C) మ, స, జ, స, త, త,
D) స, భ, ర, న, మ, య, వ
జవాబు:
B) భ, ర, న, భ, భ, ర, వ
ప్రశ్న 3.
మ, స, జ, స, త, త, గ – అను గణములు వచ్చు పద్యము
A) చంపకమాల
B) శార్దూలము
C) మత్తేభము
D) తేటగీతి
జవాబు:
B) శార్దూలము
IV. అలంకారములు :
ప్రశ్న 1.
“క్షణం, క్షణం, ప్రతిక్షణం, నిరీక్షణం సరిహద్దు రక్షణం, సైనికుని బాధ్యత.” – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) యమకం
B) వృత్త్యనుప్రాస
C) ఉపమా
D) ఛేకానుప్రాస
జవాబు:
B) వృత్త్యనుప్రాస
ప్రశ్న 2.
భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి. – ఈ కవితలో ఉన్న అలంకారము
A) ఛేకానుప్రాస
B) అంత్యానుప్రాస
C) యమకము
D) ముక్తపదగ్రస్తము
జవాబు:
B) అంత్యానుప్రాస
V. వాక్యాలు:
ప్రశ్న 1.
నా చేత శతకం రచింపబడినది. – దీనిని కర్తరి వాక్యంలోకి మార్చగా
A) నా చేత రచింపబడిన శతకం.
B) నేను రాసిన శతకం
C) నేను శతకమును రచించాను.
D) శతకం చేత నేను రచింపబడ్డాను.
జవాబు:
C) నేను శతకమును రచించాను.
ప్రశ్న 2.
సీత రంగు రంగుల ముగ్గులు వేసింది. – కర్మణి వాక్యంలోకి మార్చగా
A) సీత చేత రంగు రంగుల ముగ్గులు వేయబడ్డాయి.
B) సీత రంగు ముగ్గులు వేయగలదు.
C) రంగు రంగుల ముగ్గులు వేయడం సీతకు వచ్చు.
D) రంగు రంగుల చేత ముగ్గులు సీత వేసింది.
జవాబు:
A) సీత చేత రంగు రంగుల ముగ్గులు వేయబడ్డాయి.