These TS 9th Class Telugu Important Questions 11th Lesson వాయసం will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 11th Lesson Important Questions వాయసం
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
అ) కింది ప్రశ్నకు ఐదు వాక్యాలలో జవాబు రాయండి.
ప్రశ్న 1.
‘స్వర ప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి’ ఎందుకు ?
జవాబు:
ప్రకృతిలో భగవంతుడు పుట్టించిన ప్రాణులన్నీ విలువైనవే. వేటి విలువ వాటికి ఉంటుంది. ప్రాణులన్నీ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించాలి. మనం ప్రతి ప్రాణినీ, వాటి ప్రత్యేకతలను అనుసరించి ఆదరించాలి. ప్రాణులన్నిటి యందూ దయ కలిగి ఉండాలి. స్వార్థచింతనతో స్వలాభాన్నే చూసుకోవడం వల్ల తోటి ప్రాణులకు హాని కలుగుతుంది. మనకు సాయం చేసే పశుపక్ష్యాదులను చులకనగా చూడకుండ, వాటిపట్ల ఆదరణ చూపాలి. ప్రాణుల ఆకారాన్ని బట్టి, అరుపును బట్టి కాక వాటిపైన అభిమానాన్ని చూపాలి.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
“కాకి నలుపు కలుషితమైనది కాదు’ ఎందుకో వివరించండి. (లేదా) ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ‘వాయసం’ పాఠం ఆధారంగా కాకి ప్రత్యేకతలు తెలుపండి. (లేదా) కాకి విశిష్టతను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కాకి మానవులకు మంచి ఉపకారం చేసే పక్షి. కాకులు జనావాసాల నుండి చెత్తాచెదారాన్నీ, మలిన పదార్థాలనూ దూరంగా తీసుకుపోతాయి. ఆ విధంగా కాకులు మన పరిసరాల పరిశుభ్రతకు తోడ్పడుతున్నాయి.
మనం కాకిని చీదరించుకుంటాం అయినా అది నొచ్చుకోదు. అన్న కొడుకు తన పినతండ్రిని, ‘కాక కాక’ అని ప్రేమతో పిలిచినట్లుగా, కాకి ‘కాక’ అని అరుస్తుంది. అది తెలియక కలుపుగోలుతనం లేని మనం, కాకిని చీదరించుకుంటాము.
నిజానికి పాపాత్ముడి మనస్సులో పేరుకుపోయిన నలుపు కంటె, కాకి నలుపు కలుషితమైనది కాదు. శ్రీకృష్ణుడు నలుపు. ఈశ్వరుని కంఠం నలుపు. చంద్రుడి ముఖంలో మచ్చ నలుపు. మనుష్యుల తలలు నలుపు. అటువంటప్పుడు, కాకి నలుపును అసహ్యించుకోడం అనవసరం. అది తప్పు.
కాకి మన ఇళ్ళమీద వాలి, మన క్షేమ సమాచారాన్ని అడుగుతుంది. మనం చీదరించుకున్నా, కాకి మన ప్రాణ స్నేహితుడిలా : వచ్చిపోవడం మానదు కాకిని మనం చీదరించి కొట్టినా, కాకి ఏ మాత్రం విసుక్కోదు. రాయబారివలె చుట్టాలు మన ఇంటికి వస్తున్నారన్న వార్తను తెస్తున్నట్లుగా గొంతు చింపుకొని తన నోరు నొప్పిపెట్టేటట్లు అరుస్తుంది.
ఎప్పుడో ఏడాదికొకసారి వచ్చి కూసే కోయిలను మనం మెచ్చుకుంటాం. అదే రోజూ వచ్చి మనలను పలుకరించే కాకిని మనం చులకనగా చూస్తాం. కాని కాకి నిజానికి మనకు ప్రాణస్నేహితుడిలాంటిది.
ప్రశ్న 2.
‘నలుపంటే ఈసడించుకోవద్దు’ నలుపు లోకమంతటా ఉన్నది. దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
చెడును నల్లని రంగుతోనూ, మంచిని స్వచ్ఛమైన తెల్లని రంగుతోనూ కవులు పోలుస్తారు. ఇది కేవలం పోలిక మాత్రమే. నిజానికి నలుపు రంగు స్థిరమైనది. శాశ్వితమైనది. మిగిలిన రంగులవలె రంగులు మారే గుణం లేనిది నలుపు. సంఘంలో నలుపురంగు పట్ల చులకన భావం ఉంది. అలా నలుపుపై వ్యతిరేక భావం తగదు:
నల్లనైన వర్ణంతో ఉండే మహావిష్ణువు సకల లోకాల్లో పూజింపబడేవాడై వెలయలేదా ? విషాన్ని తాగి నల్లబడిన కంఠంతో వింతగా కనిపించినా, పరమశివుడు శుభకరుడని కీర్తింపబడలేదా ? అందమైన చంద్రుని ముఖంలో నల్లని మచ్చ ఉన్నా, చంద్రుడు చల్లని వెన్నెలలు కురిపించడం లేదా ? మనుషుల తలలు నలుపు. చీకటిదారులు నలుపు.
ఆకాశం, నీరు, రాత్రి, నీడ నలుపు. మాయలో పడిపోయి పొర్లాడే మాయావి అయిన వ్యక్తి నలుపు. చీకటి మయమైన మనిషి అజ్ఞానం కూడా నలుపు. అలాంటప్పుడు నల్లధనాన్ని అసహ్యించుకోవడం ఎందుకు ? ఇలా ఆలోచించగలిగినప్పుడు వర్ణభేదం ఉండదు. మన జీవితంలో, శరీరంలో ఉన్న నలుపును చూసి కూడా నలుపును ఈసడించుకోవడంలో అర్థం లేదు.
ప్రశ్న 3.
“సృష్టిలో ప్రతిజీవి విలువైనదే” సమర్థిస్తూ రాయండి.
జవాబు:
ప్రకృతిలో భగవంతుడు పుట్టించిన ప్రాణులన్నీ విలువైనవే. వేటి విలువ వాటికి ఉంటుంది. ప్రాణులన్నీ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించాలి. మనం ప్రతి ప్రాణినీ, వాటి ప్రత్యేకతలను అనుసరించి ఆదరించాలి. ప్రాణులందరి యందు దయ కలిగి ఉండాలి. సృష్టిలో ప్రతి జీవికి దానికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కాకి రూపం, స్వరం కనులవిందు, వీనుల విందు కానప్పటికి, అది ఎంగిలి మెతుకులు ఏరుకొనితిని, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది.
ఎంత చేసినా పాపం కాకిని ఎవరూ గౌరవంగా చూడరు. విశ్వాసానికి మారుపేరైన కుక్క రేయింబవళ్ళు కుక్క కాపలాకాసి యజమానిని రక్షిస్తుంది. అటువంటి ఆ కుక్కకు ఎంగిలి మెతుకులే దిక్కు గోడల మీద తిరిగే బల్లి దోమలను తిని మనల్ని దోమకాటు నుండి కాపాడుతుంది. దానిపట్ల మనం చూపుతున్న కృతజ్ఞత ఏది ? బల్లి మీద పడితే (పొరపాటున) తలస్నానం చేయాలని, కష్టాలని భావిస్తాము. పొద్దున్నే నిద్రలేపే కోడిని, నిద్రలేచి కూర చేసుకొని తింటున్నాము. ఇలా మేక, గేదె, ఆవు ఇంకా అనేక పక్షులు ప్రధానంగా మనుష్యుల వలనే అంతరించిపోతున్నాయి. కనుక ‘సృష్టిలో ప్రతిజీవి విలువైనదే’ అన్న విషయాన్ని గుర్తెరిగినపుడే జీవరాశుల జీవనానికి సహకరించిన వారౌతాము.
ప్రశ్న 4.
వాయసం పాఠం ద్వారా కాకి గొప్పతనాన్ని తెలుసుకున్నావు కదా, అలాగే చీమ. గొప్పతనాన్ని వివరించుము.
జవాబు:
చీమలు సంఘజీవులు. ఎప్పుడూ బారులు బారులుగా వెళుతుంటాయి. ఎక్కడ ఆహారపు పదార్థం ఉన్నట్టు పసిగట్టినా చట్టుక్కున అక్కడికి వెళతాయి. తమ బరువు కన్నా ఎన్నో రెట్లు బరువున్న ఆహార పదార్థాన్ని కష్టపడి చాలా దూరం వెతుకుతూ ఆహారాన్ని మోస్తూ, బారులుగా పుట్టలోకి తెస్తాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ఒక్కొక్కసారి మనమయినా దారి తప్పుతాము గానీ, చీమలు మాత్రం దారి తప్పకుండా మళ్ళీ తమ పుట్టలోకే వచ్చేస్తాయి.
అవి దారిని గుర్తుపెట్టుకోవడానికి ఒక రకమైన జిగురుని దారి వెంట వదులుకుంటూ వెళతాయి. తిరిగి వచ్చేటప్పుడు ఆ జిగురును వాసన చూసుకుంటూ తికమక పడకుండా నేరుగా వస్తాయి. అందుకే అవి వరుసగా వస్తుంటాయి. అవి వెళ్ళేదారిలో ఏదైనా నీటి ప్రవాహం లాంటిది సంభవించినపుడు అవి వందలాదిగా కలిసి ఉండచుట్టుకొని దొర్లుకుంటూ సురక్షితంగా వచ్చేస్తాయి. చీమలు ఎత్తు నుండి పడినా వాటికి దెబ్బ తగలదు. కారణం చీమలలాంటి తేలిక జీవుల విషయానికొస్తే వాటిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం, గాలి నిరోధక శక్తి చాలా వరకు సమానంగా ఉండటం వల్ల అవి సమవేగంతో నేలను చేరతాయి. అందువల్ల వాటికి హాని జరుగదు.
భూమి మీద జీవనం సాగించిన తొలిప్రాణి చీమ. సూర్యుని నుండి ఒక అగ్ని శకలం వేరుపడి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాతకది చల్లబడి భూమిగా ఏర్పడిందని చెబుతారు. భూమిపైన కాసే ఎండకే మనం ఎంతో బాధపడతాం కదా ! భూమిలోపల జీవించే చీమ ఎంతో వేడిని తట్టుకోగల శక్తి గలదని తెలుస్తున్నది. అల్పప్రాణియైన ఎంతో తెలివైనదిగా చీమను గుర్తించాలి మనం.
PAPER – I : PART – B
భాషాంశాలు – పదజాలం :
I. సొంతవాక్యాలు:
1. కాకి బలగం : దుర్యోధనుని కాకి బలగం అంతా ఉత్తరుని పెండ్లికి తరలివెళ్ళారు.
2. కాకిపిల్ల కాకికి ముద్దు : కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు రాము గీసిన బొమ్మలు రాముకి నచ్చుతాయి.
3. కాకిగోల : చెట్లు కింద పిల్లల కాకిగోల ఏమిటా ? అని ఆరాతీస్తే కోతి వచ్చిందిట.
4. మసిబూసి మారేడు కాయ : పరీక్షల వేళ ప్రాజెక్టు రికార్డును మసిబూసి మారేడుకాయ చేసినట్లు స్టిక్కర్లతో గోపి ఆకర్షణగా తయారుచేశాడు.
5. గావుకేకలు : పూతన పెట్టిన గావుకేకలకు వ్రేపల్లె జనమంతా ఉలిక్కిపడ్డారు.
6. ప్రాణసఖుడు : శ్రీకృష్ణునికి – అర్జునుడు వలే దుర్యోధనునికి – కర్ణుడు ప్రాణసఖుడేగాని స్వామిభక్తి ఎక్కువ.
7. ఏకరువు పెట్టు : ఎన్నో ఏళ్ళకు ఊరికి వచ్చిన మిత్రుడికి గోపి ఊరి సంగతులన్నీ ఏకరువు పెట్టాడు.
8. కలుపుగోలుతనం : సాధారణ జనంలో ఉన్నంత కలుపుగోలుతనం ధనిక కుటుంబాలలో కూడా కనిపించదు.
9. బంధుజనం : చుట్టాలు – మా బంధుజనం ఎప్పుడూ తీర్థయాత్రలలోనే కాలం గడుపుతున్నారు.
II. అర్థాలు :
ప్రశ్న 1.
“వెన్నుడు” అనే పదానికి అర్థం
A) వెన్ను కలవాడు
B) విష్ణువు
C) శివుడు
D) ఇంద్రుడు
జవాబు:
B) విష్ణువు
ప్రశ్న 2.
సొమ్ము, ధనము – అనే అర్థం గల పదము
A) రూపాయి
B) పాడిపంటలు
C) లిబ్బులు
D) మబ్బులు
జవాబు:
C) లిబ్బులు
ప్రశ్న 3.
చెట్టు మీద “బలిపుష్టము” కాకా అని అరిచింది
A) పుష్టి బలం
B) పాప ఫలం
C) రామచిలుక
D) వాయసము
జవాబు:
D) వాయసము
ప్రశ్న 4.
“ప్రేమ” అనే అర్థం గల పదం
A) కులుక
B) పెరిమ
C) తియ్యని
D) కమ్మని
జవాబు:
B) పెరిమ
ప్రశ్న 5.
“చుక్కల దొర” అంటే అర్థం
A) సూర్యుడు
B) చంద్రుడు
C) ముగ్గు
D) రాముడు
జవాబు:
B) చంద్రుడు
ప్రశ్న 6.
అమావాస్య నాటి ఇరులు భయపెడతాయి – గీత గీసిన పదానికి అర్థం
A) రాత్రులు
B) చీకట్లు
C) నక్షత్రాలు
D) ఆకాశం
జవాబు:
B) చీకట్లు
ప్రశ్న 7.
పక్క చూపులు చూచు కపట చిత్తులు మెచ్చరు – గీత గీసిన పదానికి అర్థం
A) దయ
B) జాలి
C) మోసం
D) స్వార్థం
జవాబు:
C) మోసం
ప్రశ్న 8.
లోకాన దీనుల శోకాల కన్నీటి గాథలేకరువు పెట్టుదువు – గీత గీసిన పదానికి అర్థం
A) బాధ
B) కథ
C) నవల
D) వ్యాసం
జవాబు:
B) కథ
ప్రశ్న 9.
మోసంతో మసిబూసి, మారేడుకాయ జేసేవాడు ఖలుడు – గీత గీసిన పదానికి అర్థం
A) నీచుడు
B) మనిషి
C) రాక్షసుడు
D) మంచివాడు
జవాబు:
A) నీచుడు
ప్రశ్న 10.
లొట్టి మీద కాకిలాగ వాగుతున్నావు – గీత గీసిన పదానికి అర్థం
A) లొట్ట
B) చెట్టు
C) ఒక పిట్ట
D) కల్లుకుండ
జవాబు:
D) కల్లుకుండ
III. ప్రకృతి, వికృతులు :
ప్రశ్న 1.
పక్షము – అనే పదానికి వికృతి
A) పక్షి
B) పచ్చము
C) పక్క
D) పాట
జవాబు:
C) పక్క
ప్రశ్న 2.
అంచ – అనే పదానికి ప్రకృతి
A) హంస
B) యంచ
C) రాజపులుగు
D) మంచం
జవాబు:
A) హంస
ప్రశ్న 3.
విష్ణుడు – అనే పదానికి వికృతి
A) కృష్ణుడు
B) వెన్నుడు
C) విషువత్తు
D) వ్యాసుడు
జవాబు:
B) వెన్నుడు
ప్రశ్న 4.
సాయంకాలం గీము వదలి వెళ్ళవద్దు – గీత గీసిన పదానికి ప్రకృతి
A) వరండా
B) గృహము
C) భూగృహము
D) గ్రహము
జవాబు:
B) గృహము
ప్రశ్న 5.
” సేమము” అనే పదానికి వికృతి
A) క్షేమము
B) చేమము
C) ధామము
D) సేకరణ
జవాబు:
A) క్షేమము
ప్రశ్న 6.
అందరి దృష్టి అతడి మీదే – గీత గీసిన పదానికి వికృతి
A) దిస్టి
B) ద్రుష్టి
C) దుష్టు
D) శ్రేష్ఠము
జవాబు:
A) దిస్టి
ప్రశ్న 7.
చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిడడె – గీత గీసిన పదానికి వికృతి
A) నక్షత్రం
B) తార
C) శుక్ర
D) బొట్టు
జవాబు:
C) శుక్ర
ప్రశ్న 8.
విసఫు మేతరి గొంతు విడ్డూరమగు నలుపున్నను శివుడంచు బొగడబడడె – గీత గీసిన పదానికి వికృతి
A) వింత
B) ఆశ్చర్యం
C) అబ్బురం
D) విడ్వరం
జవాబు:
D) విడ్వరం
IV. పర్యాయపదాలు :
ప్రశ్న 1.
వాయసము – అనే పదానికి పర్యాయపదాలు కానివి.
A) ధ్వాంక్షము, కాకి, కాకము
B) బలిపుష్టము, మౌకలి
C) ఆత్మఘోషము, కరటము
D) గేహము, జటాయువు
జవాబు:
D) గేహము, జటాయువు
ప్రశ్న 2.
“గృహం” అనే పదానికి పర్యాయపదాలు
A) ఇల్లు, కొంప, గేహము
B) భవనము, తిన్నె
C) గది, వంటఇల్లు
D) కోట, పేట
జవాబు:
A) ఇల్లు, కొంప, గేహము
ప్రశ్న 3.
సంతోషంగా ఉండటమే వ్యక్తిబలం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) హర్షం, ముదము, ప్రమోదం
B) సంతసం, మాత్సర్యం
C) మంద్రము, తంద్రము
D) స్మితము, దరహాసము
జవాబు:
A) హర్షం, ముదము, ప్రమోదం
ప్రశ్న 4.
ముల్లు – అనే పదానికి పర్యాయపదాలు
A) గడియారం, గంట
B) విల్లు, కుశ
C) కంటకము, ములికి
D) సూది, చాలు
జవాబు:
C) కంటకము, ములికి
ప్రశ్న 5.
మాంసము – అనే పదానికి పర్యాయపదాలు
A) కరకుట్లు, భక్ష్యము
B) పలలము, ఆమిషము
C) కుక్కురము, మేషము
D) బొబ్బర, మాంసలము
జవాబు:
B) పలలము, ఆమిషము
ప్రశ్న 6.
వాయసముల నలుపు రోయనేల – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) కాకి, కుక్క
B) ధాంక్షము, బలిపుష్టం
C) వాయసం, వాసం
D) కరటం, కటకం
జవాబు:
B) ధాంక్షము, బలిపుష్టం
ప్రశ్న 7.
ఆకాశం, నీరు, రాత్రి, నీడ నలుపు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) గగనం, ఘనం
B) అంబరం, వస్త్రం
C) నింగి, ఆకసం
D) అంతరిక్షం, భక్షం
జవాబు:
C) నింగి, ఆకసం
ప్రశ్న 8.
అంధకారమైన అజ్ఞానం నలుపు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) రజని, రాత్రి
B) చీకటి, తిమిరం
C) తమస్సు, తపస్సు
D) ధ్వస్తం, ధ్వంసం
జవాబు:
D) ధ్వస్తం, ధ్వంసం
V. నానార్థాలు :
ప్రశ్న 1.
“కాక” అనే పదానికి నానార్థాలు
A) కాకుండా, కోక
B) చిన్నాన్న, వేడిమి
C) కాకి అరుపు, నలుపు
D) తూర్పు, వెన్నుడు
జవాబు:
B) చిన్నాన్న, వేడిమి
ప్రశ్న 2.
కాకికి ఆహారము బలిగా ఇచ్చిన అన్నం – గీత గీసిన పదానికి నానార్థాలు
A) అంబలి, చెంబలి
B) ఒక రాజు, మేలు
C) ఒక చక్రవర్తి, అర్పణం, యమదండం
D) బలిపీఠం, కంబళి
జవాబు:
C) ఒక చక్రవర్తి, అర్పణం, యమదండం
ప్రశ్న 3.
చిరజీవి – అనే పదానికి నానార్థాలు
A) చిరంజీవి, కాకి
B) విష్ణువు, కాకి
C) తక్కువ వయసు, ఒక జీవి
D) మరణం లేనివాడు, మార్కండేయుడు
జవాబు:
B) విష్ణువు, కాకి
ప్రశ్న 4.
ఆత్మఘోషమా ! చిరజీవివై వెలుంగు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) బుద్ధి, తెలివి
B) మనస్సు, పరమాత్మ
C) దేహం, కాయం
D) జీవుడు, జీవి
జవాబు:
B) మనస్సు, పరమాత్మ
ప్రశ్న 5.
నోరు నొవ్వంగనే రాయబారమేమొ తెచ్చు వార్తలో చుట్టాలు వచ్చు కబురో – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సమాచారం, విషయం
B) నడత, నడక
C) భాషణం, మిరప
D) వృత్తాంతం, నడత
జవాబు:
A) సమాచారం, విషయం
VI. వ్యుత్పత్యర్థములు :
ప్రశ్న 1.
తిరుగుచుండునది – అను వ్యుత్పత్తి గల పదం
A) ద్రిమ్మరి
B) జులాయి
C) వాయసం
D) తిరుగలి
జవాబు:
C) వాయసం
ప్రశ్న 2.
కాకా అని తన పేరునే అరిచేది అను వ్యుత్పత్తి గల పదం
A) కోకిల
B) ఆత్మఘోషము
C) చినాన్న
D) వాయి
జవాబు:
B) ఆత్మఘోషము
ప్రశ్న 3.
“పాషండుడు” అనే పదానికి సరియైన ఉత్పత్తి
A) పాపములను పోగొట్టువాడు
B) సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకొనేవాడు
C) పాప కర్మలు చేయువాడు
D) రాయి వంటి మనస్సు కలవాడు
జవాబు:
B) సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకొనేవాడు
ప్రశ్న 4.
విషమును మింగినవాడు – అనే వ్యుత్పత్తి గల పదము
A) విసపు మేతరి
B) సర్పరాజు
C) శాంతుడు
D) సోక్రటీసు
జవాబు:
A) విసపు మేతరి
ప్రశ్న 5.
మౌకలి – అనే పదానికి సరైన వ్యుత్పత్తి
A) మూకలునికి సంబంధించినది
B) ఎంగిలి తినేది
C) ‘క’ అని పలికేది
D) మాంసం తినేది.
జవాబు:
A) మూకలునికి సంబంధించినది
PAPER – II : PART – A
అపరిచిత పద్యాలు
ప్రశ్న 1.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచినదొర నింద సేయబోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !
ప్రశ్నలు – సమాధానాలు
1. ఎవరిని ఎదిరింపరాదు ?
జవాబు:
ఆచార్యుని (గురువును) ఎదిరింపరాదు.
2. ఎవరిని నింద చేయకూడదు ?
జవాబు:
కాపాడిన (రక్షించిన) వారిని నిందచేయకూడదు.
3. వేటిని ఒంటరిగా చేయకూడదు ?
జవాబు:
పనులకై చేయు ఆలోచనలు ఒంటరిగా చేయకూడదు.
4. విడిచిపెట్టకూడనిది ఏది ?
జవాబు:
మంచి నడవడిని విడిచిపెట్టకూడదు.
5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది కుమార శతకంలోని పద్యం.
ప్రశ్న 2.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక విషయ మెరుగుచున్
కనికల్ల నిజము దెలియుచు
మనవలె మహితాత్ముడుగను మరువక ఎపుడున్.
ప్రశ్నలు – సమాధానాలు
1. చెప్పినది ఎట్లు వినవలెను ?
జవాబు:
చెప్పినది తొందరపడకుండా విషయమును తెలిసి కొనుచు వినవలెను.
2. విని తెలియవలసిన దేమి ?
జవాబు:
విని అబద్ధమేదో, నిజమేదో తెలియవలెను.
3. ఎట్లు మనవలెను ?
జవాబు:
ఎప్పుడు మహితాత్ముడుగ మనవలెను.
4. దీనికి శీర్షికను సూచించండి.
జవాబు:
దీనికి శీర్షిక ‘మహితాత్ముడు’.
5. కల్ల అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
కల్ల అంటే అసత్యం.
ప్రశ్న 3.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్టవిచ్చిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు – సమాధానాలు
1. పిరికివాడు దేనితో పోల్చబడినాడు ?
జవాబు:
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.
2. మేడిపండు పైకి ఏ విధంగా వుంటుంది ?
జవాబు:
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.
3. మేడిపండు లోపల ఎలా ఉంటుంది ?
జవాబు:
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.
4. ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి ?
జవాబు:
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.
5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది వేమన శతకంలోని పద్యం.
ప్రశ్న 4.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు – సమాధానాలు
1. తేనెటీగ తేనెను ఎవరికి యిస్తున్నది?
జవాబు:
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.
2. తాను తినక, కూడబెట్టువారినేమందురు?
జవాబు:
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.
3. పై పద్యము నందలి భావమేమి?
జవాబు:
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.
4. కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు:
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.
5. ఇది ఏ శతకంలోని పద్యం ?
జవాబు:
ఇది వేమన శతకంలోని పద్యం.
ప్రశ్న 5.
క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు – సమాధానాలు
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది ?
జవాబు:
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.
2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.
3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనతో పనులు సమకూరుతాయి.
4. ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.
5. అతిశయిల్లు అంటే ఏమిటి ?
జవాబు:
అతిశయిల్లు అంటే హెచ్చు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
అంతరించిపోతున్న పక్షులు, జంతువులు, అడవులు – వీటిని కాపాడాలని ఐదు నినాదాలు రాయండి.
జవాబు:
- వృక్షో రక్షతి రక్షితః.
- పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.
- రసాయన మందులు వాడకు, పక్షుల జీవితాలతో ఆడకు.
- నీ ప్రయోజనాలకై ప్రాణులను బలీయకు.
- హింస చేసేది మనమే, భూతదయ అనేది మనమే.
- పక్షులను కాపాడు, హింసను విడనాడు.
- సేంద్రియ ఎరువులతో ప్రాణుల మనగడకు సహకరించు.
- ఆకలికి అన్నము ఉండగా జంతుబలులెందుకు.
- చెప్పేది శాఖాహారమూ ! చేసేది మాంసాహారమా ?
- చెప్పినవారు చెప్పినట్లే ఉన్నారు. పక్షులు, జంతువులు ఏమైపోతున్నాయో ?
PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణం
కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
I. సంధులు:
ప్రశ్న 1.
మ్రింగుట + ఏల – సంధి చేయగా
A) మ్రింగుటకేల
B) మ్రింగుట యేల
C) మ్రింగుటేల
D) మ్రింగేలా
జవాబు:
C) మ్రింగుటేల
ప్రశ్న 2.
శివుని విసపు మేతరి అని కూడా అంటారు – గీత గీసిన పదాన్ని సంధి విడదీసి రాయండి.
A) విసపు + మేతరి
B) విసము + మేతరి
C) విష + మేతరి
D) విసమే + మేతరి
జవాబు:
B) విసము + మేతరి
ప్రశ్న 3.
లోకము + న – సంధి నామము
A) ఉత్వసంధి
B) ముగాగమ సంధి
C) లు, ల, నల సంధి
D) ప్రాది సంధి
జవాబు:
C) లు, ల, నల సంధి
ప్రశ్న 4.
తొడన్ + కొట్టి – సంధి జరిగిన విధము
A) గసడదవాదేశ సంధి
B) సరళాదేశ సంధి
C) ఇత్వసంధి
D) ద్వంద్వ సంధి
జవాబు:
B) సరళాదేశ సంధి
ప్రశ్న 5.
పాయసము + ఒల్లక – సంధి కార్యము
A) ఉత్వసంధి
B) లులనల సంధి
C) ముగాగమ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) ఉత్వసంధి
ప్రశ్న 6.
ఈ కింది వానిలో ఉత్వసంధి కానిది.
A) బోనము + అబ్బు
B) సేమములు + అడుగు
C) నాకు + ఏది
D) పాతకున్ + కొలుచు
జవాబు:
D) పాతకున్ + కొలుచు
ప్రశ్న 7.
నిలువు + నిలువు సంధి కలిపి రాయగా
A) నిట్టనిలువు
B) నిలునిలువు
C) నిలిచినది
D) నిండు నిలువు
జవాబు:
A) నిట్టనిలువు
II. సమాసాలు:
ప్రశ్న 1.
కింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కానిది.
A) పరుల కొంపలు
B) చారు సంసారము
C) రోత బ్రతుకు
D) తీపి పాయసము
జవాబు:
A) పరుల కొంపలు
ప్రశ్న 2.
క్రింది వానిలో షష్ఠీ తత్పురుష సమాసము కానిది.
A) కరటరాజు
B) అన్న కొడుకు
C) నరుల తలలు
D) చల్లని వెన్నెల
జవాబు:
D) చల్లని వెన్నెల
ప్రశ్న 3.
కింది వానిలో రూపక సమాసమునకు ఉదాహరణ
A) దినము దినము
B) ప్రాణం వంటి సఖుడు
C) కపటమైన చిత్తము కలవారు
D) విషము అనెడు అగ్ని
జవాబు:
D) విషము అనెడు అగ్ని
ప్రశ్న 4.
ప్రాణము వంటి సఖుడు – ఏ సమాసము ?
A) రూపక సమాసము
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
C) అవ్యయీభావ సమాసము
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
ప్రశ్న 5.
దినము + దినము → ప్రతిదినము – ఏ సమాసము ?
A) అవ్యయీభావ సమాసము
B) ప్రాది సమాసము
C) రూపక సమాసము
D) ద్వంద్వ సమాసము
జవాబు:
A) అవ్యయీభావ సమాసము
ప్రశ్న 6.
కపటమైన చిత్తము కలవారు – సమాసము చేయగా
A) కపటుల చిత్తము
B) కపట చిత్తములు
C) కపట చిత్తులు
D) కపటము గలవారు
జవాబు:
C) కపట చిత్తులు
ప్రశ్న 7.
చెట్టు మీద కాకి పిల్లలు గోల చేస్తున్నాయి – గీత గీసిన పదం ఏ సమాసము ?
A) సప్తమీ తత్పురుష
B) తృతీయా తత్పురుష
C) షష్ఠీ తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
C) షష్ఠీ తత్పురుష
ప్రశ్న 8.
ఎంగిలి మెతుకులు సమాసమునకు సరియైన విగ్రహవాక్యము
A) ఎంగిలియైన మెతుకులు
B) ఎంగిలి మరియు మెతుకులు
C) ఎంగిలి యొక్క మెతుకులు
D) ఎంగిలి వంటి మెతుకులు
జవాబు:
A) ఎంగిలియైన మెతుకులు
III. అలంకారము :
ప్రశ్న 1.
పాఱఁజూచిన రిపుసేన పాఱఁజూచు – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) యమకము
B) వృత్త్యనుప్రాస
C) లాటానుప్రాస
D) ఉపమా
జవాబు:
A) యమకము
ప్రశ్న 2.
ఎన్నికలలో, ఎన్నికలలో ! – ఈ వాక్యంలో ఉన్న అలంకారం –
A) వృత్త్యనుప్రాస
B) యమకము
C) ఉపమా
D) లాటానుప్రాస
జవాబు:
B) యమకము
ప్రశ్న 3.
నంద నందనా వంద వందనాలు ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) వృత్త్యనుప్రాస
B) లాటానుప్రాస
C) ఛేకానుప్రాస
D) యమకము
జవాబు:
C) ఛేకానుప్రాస
IV. ఛందస్సు :
ప్రశ్న 1.
వేసంగి, భళిరా – అనే పదాలు వరుసగా
A) త, ర
B) ర, స
C) త, స
D) ర, ర
జవాబు:
C) త, స
ప్రశ్న 2.
పై పద్యపాదంలో గణవిభజన చేసిన గణాలను ఇలా అంటారు.
A) ఇంద్ర గణాలు
B) సూర్య గణాలు
C) వృత్త గణాలు
D) చంద్ర గణాలు
జవాబు:
B) సూర్య గణాలు
ప్రశ్న 3.
ఈ కింది వానిలో మ గణం
A) UII.
B) UIU
C) IUU
D) UUU
జవాబు:
D) UUU