These TS 10th Class Telugu Bits with Answers 1st Lesson దానశీలము will help students to enhance their time management skills.
TS 10th Class Telugu Bits 1st Lesson దానశీలము
బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కులు)
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు (1 మార్కు)
1. మచ్చుతునక : …………………..
 జవాబు:
 ఆమ్లవర్షాలు పడటం పంటలు దెబ్బతినడానికి మచ్చుతునక.
2. పుట్టినిల్లు : …………………….
 జవాబు:
 మత సామరస్యానికి భాగ్యనగరం పుట్టినిల్లుగా మారింది.
3. దుష్కర్ముడు : ……………………..
 జవాబు:
 దుష్కర్ములకు దూరంగా ఉండాలి.
![]()
4. చిత్రము : ………………………
 జవాబు:
 నీతులు చెప్పేవారే తప్పులు చేయడం చిత్రంగా కనిపిస్తుంది.
2 అర్థాలు :
ప్రశ్న 1.
 విష్ణుమూర్తి కుఱుచువాని అవతారం ఎత్తాడు. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.)
 A) పొడుగు
 B) పొట్టివాడు
 C) నల్లని
 D) బక్కపలుచని
 జవాబు:
 B) పొట్టివాడు
ప్రశ్న 2.
 పోతన కవే కాకుండా హాలికుడుగా కూడా ఘనుడు. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి. )
 A) రైతు
 B) రాజు
 C) కూలీ
 D) దొంగ
 జవాబు:
 A) రైతు
ప్రశ్న 3.
 భారతదేశం సిరికి ఆలవాలమయినది. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.)
 A) పేద
 B) బడుగు
 C) సంపద
 D) దరిద్ర్యము
 జవాబు:
 C) సంపద
![]()
ప్రశ్న 4.
 మహిని ధర్మస్థాపనకు రాముడు అవతరించెను. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.)
 A) భూమి
 B) ఆకాశం
 C) కొండ
 D) గొడుగు
 జవాబు:
 A) భూమి
ప్రశ్న 5.
 పాపాత్ములకు నిర్ణయం తప్పదు. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.)
 A) శిక్ష
 B) జైలు
 C) స్వర్గం
 D) నరకం
 జవాబు:
 C) స్వర్గం
ప్రశ్న 6.
 మా తాత గొప్ప వదాన్యుడు. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.) (June ’15)
 A) వక్త
 B) కవి
 C) దాత
 D) ధనవంతుడు
 జవాబు:
 C) దాత
![]()
ప్రశ్న 7.
 కర్ణుని ఈవి లోకప్రసిద్ధం. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.)
 A) ధైర్యం
 B) త్యాగం
 C) స్నేహం
 D) న్యాయం
 జవాబు:
 B) త్యాగం
ప్రశ్న 8.
 ‘భానువు’ అంటే (June ’16 )
 A) యుద్ధం
 B) సూర్యుడు
 C) చంద్రుడు
 D) బాణము
 జవాబు:
 B) సూర్యుడు
ప్రశ్న 9.
 పాడుబడ్డ గుహల్లో బండజింకలు నివసిస్తున్నాయి. ‘బండజింకలు’ అనగా (June ’16)
 A) సింహాలు
 B) పాములు
 C) గబ్బిలాలు
 D) లేళ్ళు
 జవాబు:
 C) గబ్బిలాలు
![]()
ప్రశ్న 10.
 నీరజభవుడు రాసినది జరుగక మానదు. (గీతగీసిన పదం యొక్క అర్థం గుర్తించండి). (June ’16)
 A) ఇంద్రుడు
 B) శివుడు
 C) బ్రహ్మ
 D) విష్ణువు
 జవాబు:
 C) బ్రహ్మ
ప్రశ్న 11.
 భారతదేశ వెన్నుముక హాలికుడు. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.)
 A) శ్రామికుడు
 B) పరిశ్రామికుడు
 C) రైతు
 D) వ్యాపారి
 జవాబు:
 C) రైతు
ప్రశ్న 12.
 నీవు అలతి ప్రయత్నంతో సాధించావు. (గీత గీసిన పదం యొక్క అర్థం గుర్తించండి.)
 A) గొప్ప
 B) మహత్తరం
 C) విశేషం
 D) కొద్ది
 జవాబు:
 D) కొద్ది
3. పర్యాయపదాలు
ప్రశ్న 1.
 బలిచక్రవర్తిని చంపుటకు విష్ణువు వామనావతారం ఎత్తాడు. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.
 A) రాముడు, సోముడు
 B) నారాయణుడు, కేశవుడు
 C) శివుడు, శంభుడు
 D) వృక్షము, చెట్టు
 జవాబు:
 B) నారాయణుడు, కేశవుడు
![]()
ప్రశ్న 2.
 ఉపనయనమునకు వటువును సిద్ధము చేసారు. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)
 A) బ్రహ్మచారి, వడుగు
 B) బ్రాహ్మణుడు, బాపడు
 C) స్త్రీ, ఉవిద
 D) రాజు, నరుడు
 జవాబు:
 A) బ్రహ్మచారి, వడుగు
ప్రశ్న 3.
 తెలంగాణలో చెఱువులలో జలములు నిండినవి. (గీత గీసిన పదానికి పరియైన పర్యాయపదాలు గుర్తించండి.)
 A) వారి, అర్ధి
 B) నీరు, వారి
 C) జలకము, జలదము
 D) అంబుజం, సముద్రం
 జవాబు:
 B) నీరు, వారి
ప్రశ్న 4.
 జీవచ్ఛవం కావడం కన్నా యశఃకాయుడు కావడం మిన్న. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)
 A) కీర్తి, యశస్సు
 B) కాయము, శరీరం
 C) జీవము, ప్రాణము
 D) వృక్షము, చెట్టు
 జవాబు:
 A) కీర్తి, యశస్సు
![]()
ప్రశ్న 5.
 బ్రహ్మచారి కమండలం, గొడుగు ధరించాడు. (గీత గీసిన పడానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)
 A) వరుడు వటుడు
 B) వర్ణి – మాణవకుడు
 C) పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె
 D) వరుణుడు
 జవాబు:
 B) వర్ణి – మాణవకుడు
ప్రశ్న 6.
 నీ కర్ణములకు కుండలాలు ఉన్నాయి. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)
 A) చెవి, శ్రోత్రం
 B) చెవి, కన్ను
 C) చెవి, మెడ
 D) చెవి, ముక్కు
 జవాబు:
 A) చెవి, శ్రోత్రం
ప్రశ్న 7.
 జలధి అనేక జీవరాశులకు నిలయం. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి). (Mar. ’15)
 A) సముద్రం, నది
 B) సముద్రం, సాగరం
 C) పయోది, సరస్సు
 D) వారది, తటాకం
 జవాబు:
 B) సముద్రం, సాగరం
![]()
ప్రశ్న 8.
 గుడి, ఆలయం అనే పదాలకు సమానార్థక పదం. (Mar. ’15)
 A) గోపురం
 B) దీవెన
 C) కోవెల
 D) భావన
 జవాబు:
 C) కోవెల
ప్రశ్న 9.
 నగరం జనాభాతో క్రిక్కిరిసి పోయింది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) (June ’16’)
 A) పట్నం, పల్లె
 B) పురము, పట్నం
 C) గ్రామం, నది
 D) పల్లె, గ్రామం
 జవాబు:
 B) పురము, పట్నం
ప్రశ్న 10.
 ఈ ధరణీ మండలంలో వర్షాలు లేవు. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)
 A) ధాత్రి – భూమి
 B) భూమి – స్వర్గం
 C) నరకం – భూమి
 D) భూమి – అరణ్యం
 జవాబు:
 A) ధాత్రి – భూమి
![]()
ప్రశ్న 11.
 బ్రహ్మ ప్రజలను సృష్టిస్తాడు. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)
 A) విష్ణువు, శివుడు
 B) నీరజభవుడు, ధాత
 C) బ్రహ్మ, బ్రాహ్మణుడు
 D) బ్రహ్మ, ఇంద్రుడు
 జవాబు:
 B) నీరజభవుడు, ధాత
4. వ్యుత్పత్త్యర్థాలు
ప్రశ్న 1.
 నీరజము నందు పుట్టినవాడు. (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.) (June ’15)
 A) చేప
 B) తాబేలు
 C) కప్ప
 D) నీరజభవుడు
 జవాబు:
 D) నీరజభవుడు
ప్రశ్న 2.
 మూడడుగులచే భూమిని కొలిచినవాడు.
 (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.)
 A) ఇంద్రుడు
 B) శివుడు
 C) త్రివిక్రముడు
 D) బ్రహ్మ
 జవాబు:
 C) త్రివిక్రముడు
![]()
ప్రశ్న 3.
 విశ్వమును భరించేవాడు. (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.)
 A) విశ్వంభరుడు
 B) శివుడు
 C) శుక్రుడు
 D) బలి
 జవాబు:
 A) విశ్వంభరుడు
ప్రశ్న 4.
 భృగువంశమున పుట్టినవాడు. (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.)
 A) బలి
 B) భార్గవుడు
 C) ఇంద్రుడు
 D) వ్యాసుడు
 జవాబు:
 B) భార్గవుడు
ప్రశ్న 5.
 భక్తుల పీడను హరించువాడు. (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి).
 A) హరుడు
 B) హరి
 C) హరిహరనాథుడు
 D) శ్రీహరి
 జవాబు:
 A) హరుడు
![]()
ప్రశ్న 6.
 ‘పారాశర్యుడు’ (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.) (June ’16)
 A) పరశురాముని వెంట వెళ్ళినవాడు
 B) పరశువు దాల్చినవాడు
 C) పరాశర మహర్షి కుమారుడు
 D) శరములు సంధించినవాడు
 జవాబు:
 C) పరాశర మహర్షి కుమారుడు
ప్రశ్న 7.
 కశ్యపునకు దనువునందు పుట్టిన సంతతి. (దీనికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి).
 A) దానవులు
 B) మానవులు
 C) వానరులు
 D) కిన్నెరులు
 జవాబు:
 A) దానవులు
5. నా నానార్థాలు
ప్రశ్న 1.
 రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. (గీత గీసిన పదానికి నానార్ధములను గుర్తించండి.)
 A) ఉపాధ్యాయుడు, తండ్రి
 B) రాజు, చంద్రుడు
 C) మానవుడు, అర్జునుడు
 D) శరీరం, తనువు
 జవాబు:
 A) ఉపాధ్యాయుడు, తండ్రి
![]()
ప్రశ్న 2.
 యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రము. (గీత గీసిన పదానికి నానార్ధములను గుర్తించండి.)
 A) భూమి, వసుధ
 B) చోటు, పుణ్యస్థానము
 C) సంపద, లక్ష్మి
 D) విష్ణువు, శరీరం
 జవాబు:
 B) చోటు, పుణ్యస్థానము
ప్రశ్న 3.
 లక్ష్మీదేవికి భర్త హరి. (గీత గీసిన పదానికి నానార్థములను గుర్తించండి.)
 A) విష్ణువు – శివుడు
 B) విష్ణువు – సింహం
 C) విష్ణువు – బ్రహ్మ
 D) విష్ణువు – సముద్రం
 జవాబు:
 B) విష్ణువు – సింహం
ప్రశ్న 4.
 సిరి సంపదలు కలవాడు పుణ్యాత్ముడు. (గీత గీసిన పదానికి నానార్థములను గుర్తించండి.)
 A) సంపద – లక్ష్మి
 B) సరస్వతి – లక్ష్మి
 C) పార్వతి – లక్ష్మి
 D) శచి – సరస్వతి
 జవాబు:
 A) సంపద – లక్ష్మి
![]()
ప్రశ్న 5.
 సూర్యుడు మంచి తేజము గలవాడు. (గీత గీసిన పదానికి నానార్థములను గుర్తించండి.)
 A) ప్రకాశము – పరాక్రమము
 B) ప్రకాశము – కాంతి
 C) ప్రకాశము – వెలుగు
 D) ప్రకాశము – తేజము
 జవాబు:
 B) ప్రకాశము – కాంతి
ప్రశ్న 6.
 బంధం పదానికి నానార్థాలు ఏవి ?
 A) కట్టు, రోగం, చెఱసాల
 B) రోగం, వేదన, వేయి
 C) చెఱసాల, గాలి, నీరు
 D) ఏవీకావు
 జవాబు:
 D) ఏవీకావు
ప్రశ్న 7.
 మానం పదానికి నానార్థాలు ఏవి ?
 A) గర్వం, మాల, అగ్ని
 B) అభిమానం, గర్వం, గ్రహం
 C) గట్టు, గర్వం, వేడు
 D) అందం, శాంతం, రుధిరం
 జవాబు:
 B) అభిమానం, గర్వం, గ్రహం
![]()
ప్రశ్న 8.
 నేడు పంచభూతాలు కలుషితమైపోయాయి. భూతం పదానికి నానార్థాలు ఏవి ?
 A) ప్రాణి, గడిచినకాలం, భస్మం
 B) భస్మం, సంధి, రాయి
 C) గడిచినకాలం, గ్రామం, పక్క
 D) ఊరు, నగరం, దేశం
 జవాబు:
 A) ప్రాణి, గడిచినకాలం, భస్మం
ప్రశ్న 9.
 ‘మిత్రుడు’ పదానికి నానార్థాలు ఏవి? (June ’16)
 A) స్నేహితుడు, చెలికాడు
 B) రవి, సూర్యుడు
 C) సూర్యుడు, స్నేహితుడు
 D) భానుడు, భాస్కరుడు
 జవాబు:
 C) సూర్యుడు, స్నేహితుడు
ప్రశ్న 10.
 పాత్రలోని పదార్థాలను బంగారు గరిటెతో వడ్డించింది. పాత్రకు నానార్థాలు ఏవి ?
 A) నాట్యవిశేషం, కాయ, పండు
 B) ఆకు, కంచం, నాట్యమాడెడు
 C) కంచం, కర్ణం, కాగితం
 D) మంచం, గిన్నె, ఆకు
 జవాబు:
 B) ఆకు, కంచం, నాట్యమాడెడు
![]()
6. ప్రకృతి – వికృతులు
ప్రశ్న 1.
 ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) ధర్మము
 B) దరుమము
 C) దమ్మము
 D) దరువము
 జవాబు:
 C) దమ్మము
ప్రశ్న 2.
 బలీ ! నీవు ఎన్నుకొన్న కార్యము మంచిది కాదు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) కర్జము
 B) కార్జము
 C) కారుణ్యము
 D) కర్తవ్యము
 జవాబు:
 A) కర్జము
ప్రశ్న 3.
 బలి ధర్మగుణానికి, సత్యవ్రతానికి దేవతలు ఆశ్చర్య పడ్డారు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) అచ్చర్యము
 B) అచ్చెరువు
 C) అచ్చరుము
 D) అవగుణం
 జవాబు:
 B) అచ్చెరువు
![]()
ప్రశ్న 4.
 కులము క్షయం జరుగునని శుక్రాచార్యుడు వచించెను. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) కులంబు
 B) కొంగరము
 C) కొలము
 D) కొంగ
 జవాబు:
 C) కొలము
ప్రశ్న 5.
 నీ భాగ్యము కొద్దీ మంచి వరుడు దొరికాడు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) బ్యాం
 B) బాగెము
 C) భాగ్యం
 D) బాగ్గెం
 జవాబు:
 B) బాగెము
ప్రశ్న 6.
 విద్య లేనివాడు వింత పశువు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) విద్య
 B) విజ్జె
 C) విద్దె
 D) విజ్ఞానం
 జవాబు:
 C) విద్దె
![]()
ప్రశ్న 7.
 అమరవీరుల చాగం మరువలేనిది. (గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి.)
 A) వీరం
 B) యాగం
 C) త్యాగం
 D) రాగం
 జవాబు:
 C) త్యాగం
ప్రశ్న 8.
 హరిశ్చంద్రుడు సత్యవాక్పాలకుడు. (గీత గీసిన పదానికి వికృతిపదాన్ని గుర్తించండి.)
 A) సత్తువ
 B) సరిత్తు
 C) సతి
 D) సత్తెం
 జవాబు:
 D) సత్తెం
ప్రశ్న 9.
 కవుల కల్పన ఆశ్చర్యంగా ఉంటుంది. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) అద్భుతం
 B) అచ్చెరువు
 C) వింత
 D) ఆనందం
 జవాబు:
 B) అచ్చెరువు
![]()
ప్రశ్న 10.
 రాజు ఆజ్ఞను ప్రజలు పాటించాలి. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) ఆన
 B) జాన
 C) కోన
 D) ప్రతిజ్ఞ
 జవాబు:
 A) ఆన
ప్రశ్న 11.
 నీ పాలనలో ధర్మము నాలుగు పాదాలా సాగుతోంది. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
 A) దరమం
 B) దమ్మము
 C) దర్మం
 D) దర్శనం
 జవాబు:
 B) దమ్మము
భాషాంశాలు (వ్యాకరణం) (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – II : PART – B
1. సంధులు
ప్రశ్న 1.
 తెలుగులో నిత్యసంధి ఏది ?
 A) ఉత్వసంధి
 B) గుణసంధి
 C) అత్వసంధి
 D) త్రికసంధి
 జవాబు:
 A) ఉత్వసంధి
![]()
ప్రశ్న 2.
 లేదనక వచ్చాడు. గీత గీసిన పదం విడదీస్తే ?
 A) లేది + అనక
 B) లేదో + అనక
 C) లేదు + అనక
 D) లేదృ + అనక
 జవాబు:
 C) లేదు + అనక
ప్రశ్న 3.
 ఈ క్రింది వానిలో సంస్కృత సంధి ఏది ?
 A) ఉత్వసంధి
 B) త్రికసంధి
 C) టుగాగమసంధి
 D) గుణసంధి
 జవాబు:
 D) గుణసంధి
ప్రశ్న 4.
 ఇ, ఉ, ఋ లకు య, వ, ర లు ఆదేశంగా వచ్చే సంధి ?
 A) యణాదేశసంధి
 B) అత్వసంధి
 C) గుణసంధి
 D) ఇత్వసంధి
 జవాబు:
 A) యణాదేశసంధి
![]()
ప్రశ్న 5.
 క్రింది వానిలో విసర్గసంధికి ఉదాహరణను గుర్తించండి.
 A) అత్తఱి
 B) దుష్కర్మ
 C) నగుమోము
 D) అనియిట్లు
 జవాబు:
 B) దుష్కర్మ
ప్రశ్న 6.
 దురాచారాలను నిర్మూలనం చేయాలి. – దీనిని విడదీస్తే
 A) నిరత + మూలనం
 B) ని : + మూలనం
 C) నె : + మూలనం
 D) నిర్మ + మూలనం
 జవాబు:
 B) ని : + మూలనం
ప్రశ్న 7.
 త్రికములు అనగా
 A) అ, ఏ, ఐ
 B) అ, ఓ, ఏ
 C) ఓ, ఔ, అం
 D) ఆ, ఈ, ఏ
 జవాబు:
 D) ఆ, ఈ, ఏ
![]()
ప్రశ్న 8.
 యడాగమసంధికి ఉదాహరణను గుర్తించండి.
 A) మానవోత్తమ
 B) అనియిట్లు
 C) ఇష్టార్థంబు
 D) అనెనట్లు
 జవాబు:
 B) అనియిట్లు
ప్రశ్న 9.
 ఇక్కాలము – దీనిని విడదీస్తే
 A) ఇ + కాలము
 B) ఇ + క్కాలము
 C) ఈ + కాలము
 D) ఏ + కాలము
 జవాబు:
 C) ఈ + కాలము
ప్రశ్న 10.
 ప్రథమమీది పరుషములకు గసడదవలు ……….
 A) బహుళం
 B) అనిత్యం
 C) నిత్యం
 D) వైకల్పకం
 జవాబు:
 A) బహుళం
![]()
2. సమాసాలు
ప్రశ్న 1.
 ఉత్తరపదార్థ ప్రాధాన్యంగల సమాసం ఏది ?
 A) అవ్యయీభావం
 B) తత్పురుష
 C) ద్వంద్వము
 D) బహువ్రీహి
 జవాబు:
 B) తత్పురుష
ప్రశ్న 2.
 సత్యము చేత హీనుడు – దీనికి సమాసపదం ఏది ?
 A) సత్యహీనుడు
 B) అనుహీనుడు
 C) హీనసత్యుడు
 D) ప్రతిహీనుడు
 జవాబు:
 A) సత్యహీనుడు
ప్రశ్న 3.
 కులము యొక్క అంతము – దీనికి సమాసపదం ఏది ?
 A) అనుకులము
 B) ప్రతికులము
 C) కులాంతము
 D) అంత్యకులము
 జవాబు:
 C) కులాంతము
![]()
ప్రశ్న 4.
 అన్యపదార్థ ప్రాధాన్యం కలిగిన సమాసపదం ఏది ?
 A) ద్వంద్వము
 B) కర్మధారయం
 C) అవ్యయీభావం
 D) బహువ్రీహి
 జవాబు:
 D) బహువ్రీహి
ప్రశ్న 5.
 గర్వోన్నతి పొందాలి. – ఇది ఏ సమాసం ?
 A) కర్మధారయం
 B) తృతీయా తత్పురుష
 C) షష్ఠీ తత్పురుష
 D) అవ్యయీభావం
 జవాబు:
 C) షష్ఠీ తత్పురుష
ప్రశ్న 6.
 ఉభయపదార్థ ప్రాధాన్యంగల సమాసం ఏది ?
 A) కర్మధారయ
 B) ద్వంద్వము
 C) అవ్యయీభావం
 D) బహువ్రీహి
 జవాబు:
 B) ద్వంద్వము
![]()
ప్రశ్న 7.
 విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించండి.
 A) కపటవటువు
 B) పావనజలము
 C) అసురోత్తముడు
 D) వదాన్యోత్తముడు
 జవాబు:
 C) అసురోత్తముడు
ప్రశ్న 8.
 రూపక సమాసమునకు ఉదాహరణను గుర్తించండి.
 A) జీవనధనములు
 B) నలినాక్షుడు
 C) అసురోత్తముడు
 D) మేఘఘటము
 జవాబు:
 A) జీవనధనములు
ప్రశ్న 9.
 మహాత్ముడు – దీనికి విగ్రహవాక్యం ఏది ?
 A) గొప్ప గుణాలు కలవాడు
 B) మహాన్నత ఆశయాలు కలవాడు.
 C) విశేషమైన గుణాలు కలవాడు
 D) గొప్ప ఆత్మకలవాడు.
 జవాబు:
 D) గొప్ప ఆత్మకలవాడు.
![]()
ప్రశ్న 10.
 సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన పదం ఏది ?
 A) అవ్యయీభావం
 B) ద్విగువు
 C) తత్పురుష
 D) రూపక
 జవాబు:
 B) ద్విగువు
3. అలంకారాలు
ప్రశ్న 1.
 నీ కరుణా కటాక్ష వీక్షణములకు నిరీక్షించుదును. ఇందలి అలంకారం ఏమి ?
 A) లాటానుప్రాస
 B) ఛేకానుప్రాస
 C) అంత్యానుప్రాస
 D) వృత్త్యనుప్రాస
 జవాబు:
 D) వృత్త్యనుప్రాస
ప్రశ్న 2.
 ఉపమానోపమేయాలకు మనోహరమైన పోలిక చెప్పినచో అది ఏ అలంకారం ?
 A) ఉపమ
 B) అతిశయోక్తి
 C) రూపక
 D) అర్థాంతరన్యాస
 జవాబు:
 A) ఉపమ
ప్రశ్న 3.
 ఉపమానోపమేయాలకు అభేదం చెప్పినచో అది ఏ అలంకారం ?
 A) అర్థాంతరన్యాస
 B) అతిశయోక్తి
 C) ఉత్ప్రేక్ష
 D) రూపక
 జవాబు:
 D) రూపక
![]()
ప్రశ్న 4.
 మందారమకరంద మాధుర్యము నదేలు మధుపంబు వోవునే మధుపములకు – ఇందలి అలంకారం ఏది ?
 A) శ్లేష
 B) యమకం
 C) అంత్యానుప్రాస
 D) వృత్త్యనుప్రాస
 జవాబు:
 D) వృత్త్యనుప్రాస
ప్రశ్న 5.
 “గలగలమని దశదిక్కులు బళి బళి యని పొగిడె” ఇందలి అలంకారం ఏది ?
 A) అంత్యానుప్రాస
 B) ఛేకానుప్రాస
 C) శ్లేషాలంకారం
 D) వృత్త్యనుప్రాస.
 జవాబు:
 D) వృత్త్యనుప్రాస.
4. గణవిభజన
ప్రశ్న 1.
 మత్తేభంలోని పాదంలో గల అక్షరాల సంఖ్య ?
 A) 23
 B) 21
 C) 19
 D) 20
 జవాబు:
 D) 20
![]()
ప్రశ్న 2.
 చంపకమాలలోని యతిస్థానం ఎంత ?
 A) 11
 B) 12
 C) 14
 D) 16
 జవాబు:
 A) 11
ప్రశ్న 3.
 ఉత్పలమాల – దీనికి గణాలు ఏవి ?
 A) మ, స, జ, స, త, త, గ
 B) న, జ, భ, జ, జ, జ, ୪
 C) స, భ, ర, న, మ, య, వ
 D) భ, ర, న, భ, భ, ర, వ
 జవాబు:
 D) భ, ర, న, భ, భ, ర, వ
ప్రశ్న 4.
 దుష్కర్మ – ఇది ఏ గణము ?
 A) భగణం
 B) తగణం
 C) జగణం
 D) నగణం
 జవాబు:
 B) తగణం
![]()
ప్రశ్న 5.
 పంచనం దీనికి గణాలు గుర్తించండి.
 A) UIU
 B) UUI
 C) IIU
 D) UUU
 జవాబు:
 A) UIU
ప్రశ్న 6.
 వలదీ దానము గీనముం బనుపమా వర్ణిన్ వదాన్యోత్తమా ! – ఇది ఏ పద్యపాదం ?
 A) చంపకమాల
 B) మత్తేభం
 C) ఉత్పలమాల
 D) తేటగీతి
 జవాబు:
 B) మత్తేభం
ప్రశ్న 7.
 మానధనులకు భద్రంబు మఱియుగలదె – ఇది ఏ పద్యపాదం ?
 A) ఉత్పలమాల
 B) తేటగీతి
 C) ఆటవెలది
 D) కందం
 జవాబు:
 B) తేటగీతి
![]()
5. వాక్య పరిజ్ఞానం
ప్రశ్న 1.
 పోతనచేత భాగవతం రచింపబడెను. రకమైన – ఇది ఏ వాక్యం ?
 A) తద్ధర్మార్థక వాక్యం
 B) కర్తరి వాక్యం
 C) అప్యర్థక వాక్యం
 D) కర్మణి వాక్యం
 జవాబు:
 D) కర్మణి వాక్యం
ప్రశ్న 2.
 తాను దానం చేస్తానని బలి చెప్పాడు. ఇది ఏ రకమైన వాక్యం ?
 A) భావార్థకం
 B) పరోక్షకథనం
 C) ప్రత్యక్షకథనం
 D) క్త్వార్థం
 జవాబు:
 B) పరోక్షకథనం
ప్రశ్న 3.
 బలి నీరు పోసాడు. బలి దానం చేసాడు. దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ?
 A) బలినీరు నందు దానం చేసాడు.
 B) బలి నీరు వలన దానం చేసాడు.
 C) బలి దానం చేసి నీరు పోసాడు.
 D) బలి నీరు పోసి దానం చేసాడు.
 జవాబు:
 D) బలి నీరు పోసి దానం చేసాడు.
![]()
ప్రశ్న 4.
 దానం చేయాలి. కీర్తి పొందాలి. – దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే ?
 A) దానం కొరకు కీర్తి కావాలి
 B) దానము నందు కీర్తి కలదు
 C) దానం చేసి కీర్తి పొందాలి
 D) దానంతో కీర్తి పొందవచ్చు
 జవాబు:
 C) దానం చేసి కీర్తి పొందాలి
ప్రశ్న 5.
 బలి దానం చేసాడు. దీన్ని కర్మణి వాక్యంగా మారిస్తే?
 A) బలి కొరకు దానం చేయాలి
 B) బలి వలన దానం చేయవచ్చు
 C) బలి దానంతో చేశారు.
 D) బలిచేత దానం చేయబడింది
 జవాబు:
 D) బలిచేత దానం చేయబడింది
ప్రశ్న 6.
 తాను ఊరికి వెళ్ళానని రవి చెప్పాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) హేత్వర్థకం
 B) పరోక్ష కథనం
 C) ప్రత్యక్ష కథనం
 D) అప్యర్థకం
 జవాబు:
 B) పరోక్ష కథనం
![]()
ప్రశ్న 7.
 దైవం నిన్ను దీవించుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) ధాత్వర్థకం
 B) అప్యర్థకం
 C) కర్మణ్యం
 D) ఆశీర్వచనార్థకం
 జవాబు:
 D) ఆశీర్వచనార్థకం
ప్రశ్న 8.
 బాగా చదివితే మార్కులు వస్తాయి. – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) చేదర్థకం
 B) కర్మణ్యర్థకం
 C) అప్యర్థకం
 D) హేత్వర్థకం
 జవాబు:
 A) చేదర్థకం
ప్రశ్న 9.
 రవి అన్నం తింటూ మాట్లాడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం ?
 A) భావార్థకం
 B) శత్రర్థకం
 C) అప్యర్థకం
 D) హేత్వర్థకం
 జవాబు:
 B) శత్రర్థకం
![]()
ప్రశ్న 10.
 నీరు పల్లంగా ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) అప్యర్థకం
 B) హేత్వర్థకం
 C) భావార్థకం
 D) తద్ధర్మార్ధకం
 జవాబు:
 D) తద్ధర్మార్ధకం
ప్రశ్న 11.
 దయతో నన్ను అనుమతించండి. – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) అప్యర్థకం
 B) ధాత్వర్థకం
 C) ప్రార్థనార్థకం
 D) హేత్వర్థకం
 జవాబు:
 C) ప్రార్థనార్థకం
ప్రశ్న 12.
 అల్లరి చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) నిషేధార్థకం
 B) తద్ధర్మార్థకం
 C) క్త్వార్థకం
 D) అనుమత్యర్థకం
 జవాబు:
 A) నిషేధార్థకం
![]()
ప్రశ్న 13.
 వారు వెళ్ళవచ్చా ? – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) అప్యర్థకం
 B) ప్రశ్నార్థకం
 C) హేత్వర్థకం
 D) ఆశ్చర్యార్థకం
 జవాబు:
 B) ప్రశ్నార్థకం
ప్రశ్న 14.
 కష్టపడితే ఫలితం దక్కుతుంది – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) ధాత్వర్థకం
 B) అప్యర్థకం
 C) క్త్వార్థకం
 D) చేదర్థకం
 జవాబు:
 D) చేదర్థకం
ప్రశ్న 15.
 మీరు లోపలికి రావచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) నిశ్చయా
 B) అనుమత్యర్ధకం
 C) కర్మణ్యర్థకం
 D) ధాత్వర్థకం
 జవాబు:
 B) అనుమత్యర్ధకం
![]()
ప్రశ్న 16.
 రవి బాగా చదువగలడు. – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) హేత్వర్థకం
 B) ప్రార్థనార్థకం
 C) అప్యర్థకం
 D) సామర్థ్యార్థకం
 జవాబు:
 D) సామర్థ్యార్థకం
ప్రశ్న 17.
 నేను తప్పక వెళ్తాను. – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) అప్యర్థకం
 B) నిశ్చయాత్మాకం
 C) హేత్వర్థకం
 D) ప్రార్థనార్థకం
 జవాబు:
 B) నిశ్చయాత్మాకం
ప్రశ్న 18.
 కష్టపడినా ఫలితం దక్కలేదు. – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) నిశ్చయాత్మకం
 B) ప్రార్థనార్థకం
 C) నిర్ణయాత్మకం
 D) అప్యర్థకం
 జవాబు:
 D) అప్యర్థకం
![]()
ప్రశ్న 19.
 వర్షాలు కురువడంవల్ల పంటలు పండాయి. – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) అప్యర్థకం
 B) హేత్వర్ధకం
 C) కర్మణ్యర్థకం
 D) ప్రార్థనార్థకం
 జవాబు:
 B) హేత్వర్ధకం
ప్రశ్న 20.
 పరీక్షలు రాయవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?
 A) ప్రార్థనార్థకం
 B) విధ్యర్థకం
 C) నిశ్చయాత్మకం
 D) అనుమత్యర్థకం
 జవాబు:
 D) అనుమత్యర్థకం