These TS 10th Class Telugu Bits with Answers 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు will help students to enhance their time management skills.
TS 10th Class Telugu Bits 2nd Lesson ఎవరి భాష వాళ్ళకు వినసొంపు
బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – I : PART- B
1. సొంతవాక్యాలు (1 మార్కు)
ప్రశ్న 1.
ప్రసంగించు : ………………………….
జవాబు:
పోతనగారి మహాభాగవతంపై, మా గురువుగారు చక్కగా ప్రసంగించారు.
ప్రశ్న 2.
పట్టువడు : ……………………
జవాబు:
మా అమ్మాయి కీర్తనకు, తెలుగు పద్యాలు చదవడం బాగా పట్టువడింది.
ప్రశ్న 3.
వాగ్ధాటి : ………………….
జవాబు:
మా గురువు గారి వాగ్ధాటికి, అంతా మురిసిపోతారు.
ప్రశ్న 4.
యాదికివచ్చు: …………………..
జవాబు:
నేను మా ఊరి గుడి చూడగానే చిన్ననాటి సంగతులు యాదికి వచ్చాయి.
ప్రశ్న 5.
వాజ్ఞయము : …………………..
జవాబు:
సామల సదాశివగారు సంస్కృతాంధ్ర వాఙ్మయాలను ఆపోశన పట్టారు.
2. అర్ధాలు :
ప్రశ్న 1.
నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) మర్చిపోవు
B) గుర్తుకు తెచ్చుకొను
C) కష్టపడిచూచి
D) చిన్నప్పటి విషయాలు
జవాబు:
B) గుర్తుకు తెచ్చుకొను
ప్రశ్న 2.
యుద్ధక్షేత్రమున ఎందరో వీరులు ప్రాణాలు వదిలారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) తక్కువ చోటు
B) ఎక్కువ
C) చోటు
D) అతి తక్కువ
జవాబు:
C) చోటు
ప్రశ్న 3.
భారతదేశం రమ్యమైన దేశము. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) మతాతీతమైన
B) నల్లనైన
C) తెల్లనైన
D) అందమైన
జవాబు:
D) అందమైన
ప్రశ్న 4.
తెలుగు వాఙ్మయం ఎంతో విశిష్ఠమైనది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) సాహిత్యం
B) క్షేత్రం
C) మర్చిపోవు
D) దానశీలము
జవాబు:
A) సాహిత్యం
ప్రశ్న 5.
నా స్నేహితుడి ప్రతిభకు అబ్బుర పడ్డాను. గీతగీసిన పదానికి అర్థం
A) విచారం
B) దుఃఖం
C) ఆశ్చర్యం
D) శోకం
జవాబు:
C) ఆశ్చర్యం
ప్రశ్న 6.
గురువుల సన్నిధానం విద్యార్థుల అభివృద్ధికి కారకం. గీతగీసిన పదానికి అర్థం
A) దూరం
B) సమీపం
C) వైపు
D) ఏవీకావు
జవాబు:
B) సమీపం
ప్రశ్న 7.
మంత్రిగారి ప్రసంగం మమ్మల్ని ఆకట్టుకుంది. గీతగీసిన పదానికి అర్థం
A) వేషం
B) నడక
C) ఉపన్యాసం
D) ఏవీకావు
జవాబు:
C) ఉపన్యాసం
ప్రశ్న 8.
సొంపు అనగా ?
A) ఆనందం
B) వికారం
C) అందం
D) ఏవీకావు
జవాబు:
C) అందం
ప్రశ్న 9.
అవినీతిపరుడైన నాయకుని ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. జప్తు అనగా ?
A) స్వాధీనం
B) కొనుట
C) అమ్ముట
D) ఏవీకావు
జవాబు:
A) స్వాధీనం
ప్రశ్న 10.
నాకు విశ్వనాథ వారితో పరిచయము లేదు. (గీతగీసిన పదానికి అర్థం)
A) స్నేహం
B) విరోధం
C) పగ
D) ఆగ్రహం
జవాబు:
A) స్నేహం
ప్రశ్న 11.
తెలుగు నుడి తీయనైనది. (గీత గీసిన పదానికి అర్థం ?)
A) భాష
B) పాట
C) మాట
D) జాతి
జవాబు:
D) జాతి
ప్రశ్న 12.
నమాజు చదవటానికి ఎందరో వస్తారు. (గీత గీసిన పదానికి అర్థం ?)
A) గ్రంథం
B) ప్రార్థన
C) పద్యం
D) పాట
జవాబు:
B) ప్రార్థన
3. పర్యాయపదాలు :
ప్రశ్న 1.
ఇల్లు, గృహం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.
A) ఈవి, ఈగి
B) పొగడ్త, స్తోత్రం
C) ఆలయం
D) ప్రశంస
జవాబు:
A) ఈవి, ఈగి
ప్రశ్న 2.
ఈవి, ఈగి – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.
A) త్యాగం
B) ఆలయం
C) ప్రశంస
D) పోరాటం
జవాబు:
B) ఆలయం
ప్రశ్న 3.
సోయగం, అందం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.
A) ప్రశంస
B) సొంపు
C) ఇంపు
D) కంపు
జవాబు:
B) సొంపు
ప్రశ్న 4.
సంగ్రామం, సమరం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.
A) ఆరాటం
B) మరాటం
C) గలాట
D) పోరాటం
జవాబు:
D) పోరాటం
ప్రశ్న 5.
ఆ పత్రికలో, చివరి పేజీయే సొంపుగా ఉంటుంది.
A) అందం / సౌందర్యం
B) యాది / ఇంపు
C) ఇంపు / కంపు
D) ఇంపు / తెంపు
జవాబు:
A) అందం / సౌందర్యం
ప్రశ్న 6.
నా మిత్రుడు తరచుగా జాబులు రాస్తాడు. గీతగీసిన పదానికి పర్యాయపదాలు.
A) ఉద్యోగాలు-లేఖలు
B) ఉత్తరాలు లేఖలు
C) పద్యాలు-లేఖలు
D) జావళీలు-లేఖలు
జవాబు:
B) ఉత్తరాలు లేఖలు
ప్రశ్న 7.
కమలగారు లక్ష్మణశాస్త్రిగారి కుమార్తె. గీతగీసిన పదానికి పర్యాయపదాలు.
A) పుతి / పుత్రుడు
B) తనయ / పుత్రిక
C) స్త్రీ / ఇంతి
D) సుత / ఇంతి
జవాబు:
C) స్త్రీ / ఇంతి
ప్రశ్న 8.
గుంటూరు విద్వాంసులు మంచివారు. గీతగీసిన పదానికి పర్యాయపదాలు.
A) కవులు / పండితులు
B) పండితులు / రచయితలు
C) పండితులు / బుధులు
D) పండితులు / గురువులు
జవాబు:
C) పండితులు / బుధులు
ప్రశ్న 9.
తెలుగు భాషలోని నుడికారాలు సొంపైనట్టివి. గీతగీసిన పదానికి పర్యాయపదాలు.
A) జాతీయాలు, పలుకుబడులు, పదబంధాలు
B) మాటలు, పదాలు, జాతీయాలు
C) పలుకుబడులు, వాక్యాలు, పద్యాలు
D) ఏవీకావు
జవాబు:
A) జాతీయాలు, పలుకుబడులు, పదబంధాలు
ప్రశ్న 10.
ప్రధానోపాధ్యాయుల ఉపన్యాసం మాలో స్పూర్తి నింపింది. (ఉపన్యాసంకు పర్యాయపదాలు)
A) ప్రసంగం, ప్రవర్తన, ప్రత్యక్షం
B) ముచ్చటింపు, ముచ్చట, ముఖ్యం
C) ముచ్చటింపు, ప్రసంగం, సుద్ది
D) ఏదీకాదు
జవాబు:
C) ముచ్చటింపు, ప్రసంగం, సుద్ది
ప్రశ్న 11.
భానుడు తూర్పున ఉదయిస్తాడు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) రవి, తార
B) రవి, భాస్కరుడు
C) రవి, మేఘం
D) రవి, భూమి
జవాబు:
B) రవి, భాస్కరుడు
4 వ్యుత్పత్యర్థాలు :
ప్రశ్న 1.
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు. (దీనికి వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)
A) సోదరుడు
B) తండ్రి
C) తల్లి
D) గురువు
జవాబు:
D) గురువు
ప్రశ్న 2.
భాషింపబడునది. (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) ఉపాధ్యాయుడు
B) తండ్రి
C) భాష
D) గురువు
జవాబు:
C) భాష
ప్రశ్న 3.
చర్యలను కనిపెట్టి చూచేవాడు. (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) అధ్యక్షుడు
B) అధికారి
C) యముడు
D) సూర్యుడు
జవాబు:
A) అధ్యక్షుడు
ప్రశ్న 4.
పురాణము తెలిసినవాడు (చెప్పువాడు). (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) పౌరాణికుడు
B) శాస్త్రజ్ఞుడు
C) కవి
D) విద్వాంసుడు
జవాబు:
A) పౌరాణికుడు
ప్రశ్న 5.
శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు (పండస బుద్ధి). (దీనికి వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)
A) కోవిదుడు
B) నిపుణుడు
C) పండితుడు
D) ఏవీకావు
జవాబు:
C) పండితుడు
ప్రశ్న 6.
మిత్రుడు అనగా
A) సర్వభూతముల యందు స్నేహయుక్తుడు
B) ఆధారమైనవాడు
C) సంతోషింపచేయువాడు
D) ఏవీకావు
జవాబు:
A) సర్వభూతముల యందు స్నేహయుక్తుడు
ప్రశ్న 7.
అంతటను వ్యాపించి యుండునది. దీనికి వ్యుత్పత్యర్థం ?
A) వాన
B) దుర్గ
C) సరస్వతి
D) ఏవీకావు
జవాబు:
B) దుర్గ
ప్రశ్న 8.
కవి యొక్క కర్మము. దీనికి వ్యుత్పత్త్యర్థం ?
A) కళ
B) కాగితం
C) కావ్యం
D) ఏవీకావు
జవాబు:
C) కావ్యం
5. నానార్థాలు
ప్రశ్న 1.
ఆశలకు అంతు ఉండాలి. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) కోరిక, దిక్కు
B) చోటు, శరీరం
C) కలయిక, వాఙ్మయం
D) సోయగం, అందం
జవాబు:
A) కోరిక, దిక్కు
ప్రశ్న 2.
తెలంగాణ సాహిత్యం ఎంతో విలువైనది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) కోరిక, దిక్కు
B) కలయిక, వాఙ్మయం
C) చోటు, పుణ్యస్థానం
D) భూమి, శరీరం
జవాబు:
B) కలయిక, వాఙ్మయం
ప్రశ్న 3.
చిలుకూరు బాలాజీ పుణ్యక్షేత్రం. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) చోటు, పుణ్యస్థానం
B) కలయిక, వాఙ్మయం
C) కోరిక, దిక్కు
D) సోయగం, అందం
జవాబు:
A) చోటు, పుణ్యస్థానం
ప్రశ్న 4.
మా అన్నయ్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) ప్రయత్నం, మాట, ఆలోచన
B) ప్రయత్నం, పని, అధికారం
C) పని, కోరిక, వాక్కు
D) ఏదీకాదు
జవాబు:
B) ప్రయత్నం, పని, అధికారం
ప్రశ్న 5.
సభలో మాట్లాడాలంటే కొందరికి భయం. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) ఇల్లు, ఊరు, జూదం
B) జూదం, కొలువుకూటం, పరీక్ష
C) కొలువుకూటం, ఇల్లు, జూదం
D) ఏవీ కాదు
జవాబు:
C) కొలువుకూటం, ఇల్లు, జూదం
ప్రశ్న 6.
వారం పదానికి నానార్థాలు.
A) మంద, వాకిలి, ఏడురోజుల కాలం
B) ఏడు రోజుల కాలం, వంద, రోజు
C) వాకిలి, వాగు, మాట
D) ఏవీకావు.
జవాబు:
A) మంద, వాకిలి, ఏడురోజుల కాలం
ప్రశ్న 7.
మిత్రుడు పదానికి నానార్థాలు.
A) సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు
B) స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు
C) సూర్యుడు, బాట, కవి
D) ఏమీకావు
జవాబు:
B) స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు
ప్రశ్న 8.
తరం పదానికి నానార్థాలు.
A) తెగ, కత్తి, గాయం
B) పద్ధతి, దయ, ఓడ
C) తెగ, పద్ధతి, దాటుట
D) ఏవీకావు
జవాబు:
C) తెగ, పద్ధతి, దాటుట
6. ప్రకృతి – వికృతులు
ప్రశ్న 1.
ప్రభుత్వ ఆజ్ఞలను ప్రజలు గౌరవించాలి. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) ఆన
B) విద్య
C) కార్యం
D) సాజం
జవాబు:
A) ఆన
ప్రశ్న 2.
మన కార్యాలను త్రికరణశుద్ధిగా చెయ్యాలి. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) బాస
B) సత్తి
C) సహజం
D) కర్జం
జవాబు:
D) కర్జం
ప్రశ్న 3.
సహజ సుందరమైనది తెలంగాణ భాష. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) సాజం
B) సత్తి
C) విద్దియ
D) ఆన
జవాబు:
A) సాజం
ప్రశ్న 4.
మహిళాశక్తికి సాటి అయినది మరొకటిలేదు. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) విద్య
B) కర్జం
C) సత్తి
D) కార్యం
జవాబు:
C) సత్తి
ప్రశ్న 5.
నీ మాట నాకు ఆశ్చర్యముగా ఉంది. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) ఐశ్వర్యం
B) అబ్బురం
C) అచ్చెరువు
D) ఆపారం
జవాబు:
C) అచ్చెరువు
ప్రశ్న 6.
యాదికి తగలటం సహజము కదా ! (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) సాజం
B) సైజం
C) అసహజం
D) సహ్యం
జవాబు:
A) సాజం
ప్రశ్న 7.
వారిది పసందైన ప్రాంతీయ భాష. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) భాష
B) బాస
C) బాశ
D) బాష
జవాబు:
B) బాస
ప్రశ్న 8.
రమ్యమైన కావ్యాలు వారివి ఎన్నో ఉన్నాయి. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) గ్రంథాలు
B) పుస్తకాలు
C) కబ్బాలు
D) కవిత్వాలు
జవాబు:
C) కబ్బాలు
ప్రశ్న 9.
ఉర్దూ కవుల్లో కవి తఖీమీర్ అగ్రగణ్యుడు. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)
A) కావ్యం
B) కయి
C) కాకి
D) గోవు
జవాబు:
B) కయి
ప్రశ్న 10.
మా ఊర్లో జరిగే ‘బోనా’ల పండుగంటే నాకెంతో ఇష్టం. ‘బోనం’కు ప్రకృతి పదం.
A) భోగం
B) భోజనం
C) భోగి
D) ఏవీకావు
జవాబు:
A) భోగం
ప్రశ్న 11.
‘పొత్తం’లోని విషయాలన్నీ చదివాను. ‘పొత్తం’కు ప్రకృతి పదం.
A) లేఖ
B) పత్రం
C) పుస్తకం
D) ఏవీకావు
జవాబు:
C) పుస్తకం
భాషాంశాలు (వ్యాకరణం) (\(\frac{1}{2}\) మార్కు)
PAPER – II : PART – B
1. సంధులు
ప్రశ్న 1.
సంస్కృతాంధ్రము – ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 2.
సీమోల్లంఘనం – సంధి పేరు వ్రాయండి.
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి
జవాబు:
B) గుణసంధి
ప్రశ్న 3.
“కూరగాయలమ్మే” – ఇది ఏ సంధి ?
A) అకారసంధి
B) ఇకారసంధి
C) ఉకారసంధి
D) త్రికసంధి
జవాబు:
C) ఉకారసంధి
ప్రశ్న 4.
నాలుగేళ్ళు – విడదీయండి.
A) నాలుగే + ఏళ్ళు
B) నాలు + ఏళ్ళు
C) నాలుగు + ఏళ్ళు
D) నాలుగే + ఎడు
జవాబు:
C) నాలుగు + ఏళ్ళు
ప్రశ్న 5.
‘నాలుగేళ్ళు’ ఈ పదం ఏ సంధి ?
A) ఇత్త్వసంధి
B) ఉత్త్వసంధి
C) అత్త్వసంధి
D) త్రికసంధి
జవాబు:
B) ఉత్త్వసంధి
ప్రశ్న 6.
‘మనుమరాలు’ ఈ పదం ఏ సంధి ?
A) టుగాగమసంధి
B) ఉత్త్వసంధి
C) ఇత్త్వసంధి
D) రుగాగమసంధి
జవాబు:
D) రుగాగమసంధి
ప్రశ్న 7.
అనునాసిక సంధికి ఉదాహరణ.
A) అక్కడక్కడ
B) వాఙ్మయం
C) పురోహితుడు
D) వాగ్ధాటి
జవాబు:
B) వాఙ్మయం
ప్రశ్న 8.
జత్త్వ సంధికి ఉదాహరణ.
A) వాగ్ధాటి
B) మధ్యాహ్నం
C) బ్రహ్మేశ్వరాలయం
D) పురోహితుడు
జవాబు:
A) వాగ్ధాటి
ప్రశ్న 9.
గుణసంధికి ఉదాహరణ.
A) ఇప్పుడంత
B) సొంపయిన
C) సీమోల్లంఘనం
D) శివాలయం
జవాబు:
C) సీమోల్లంఘనం
ప్రశ్న 10.
యజ్ఞులు అనగా-
A) ఏ, ఓ, ఆర్లు
B) య, వ, ర, లు
C) ఆ, ఇ, ఉ, లు
D) ఐఔలు
జవాబు:
B) య, వ, ర, లు
2. సమాసాలు
ప్రశ్న 1.
ఉస్మానియా యూనివర్సిటీ -ఇది ఏ సమాసం ?
A) రూపక సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) అవ్యయీభావ సమాసం
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ప్రశ్న 2.
వ్యాస వాఙ్మయం – ఇది ఏ సమాసం ?
A) షష్ఠీ తత్పురుష
B) రూపక
C) తృతీయా తత్పురుష
D) చతుర్థీ తత్పురుష
జవాబు:
A) షష్ఠీ తత్పురుష
ప్రశ్న 3.
తీయని తెలుగు (దీనికి విగ్రహవాక్యం)
A) తీయనంత తెలుగు
B) తీయనైన తెలుగు
C) తీయనివంటి తెలుగు
D) ఏవీకావు
జవాబు:
B) తీయనైన తెలుగు
ప్రశ్న 4.
బాల్యమిత్రులు (దీనికి విగ్రహవాక్యం)
A) బాల్యంతో మిత్రులు
B) బాల్యంకు మిత్రులు
C) బాల్యం నందు మిత్రులు
D) ఏవీ కాదు
జవాబు:
C) బాల్యం నందు మిత్రులు
ప్రశ్న 5.
బిల్హణ మహాకవి (దీనికి విగ్రహవాక్యం)
A) బిల్హణుడు అనే పేరు గల మహాకవి
B) బిల్హణుడు వంటి మహాకవి
C) మహాకవియైన బిల్హణుడు
D) ఏవీకావు
జవాబు:
A) బిల్హణుడు అనే పేరు గల మహాకవి
ప్రశ్న 6.
వ్యాస వాఙ్మయం (దీనికి విగ్రహవాక్యం ?)
A) వ్యాసుడు చెప్పిన వాఙ్మయం
B) వ్యాసుని యొక్క వాఙ్మయం
C) వ్యాసునితో వాఙ్మయం
D) ఏమీకావు
జవాబు:
B) వ్యాసుని యొక్క వాఙ్మయం
ప్రశ్న 7.
మధ్యాహ్నం (దీనికి విగ్రహవాక్యం ?)
A) మధ్యలో అహ్నం
B) అహ్నం మధ్య భాగం
C) మధ్యయైన అహ్నం
D) ఏవీకావు
జవాబు:
B) అహ్నం మధ్య భాగం
3. గణవిభజన
ప్రశ్న 1.
‘స-భ-ర-న-మ-య-వ’ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి ?
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభం
ప్రశ్న 2.
‘భ-ర-న-భ-భ-ర-వ’ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి ?
A) చంపకమాల
B) శార్దూలం
C) మత్తేభం
D) ఉత్పలమాల
జవాబు:
D) ఉత్పలమాల
ప్రశ్న 3.
‘భ-జ-స-నల-గగ’ అను గణాలు ఏ పద్యపాదములో ఉండును ?
A) చంపకమాల
B) సీసము
C) ఆటవెలది
D) కందము
జవాబు:
D) కందము
ప్రశ్న 4.
‘మ-న-జ-స-త-త-గ’ అనుగణాలు పద్యపాదానికి చెందినవి ?
A) శార్దూలం
B) తేటగీతి
C) కందం
D) ఆటవెలది
జవాబు:
A) శార్దూలం
ప్రశ్న 5.
“పదవ అక్షరం యతిస్థానం గల పద్యం ఏది ?
A) చంపకమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) ఉత్పలమాల
జవాబు:
D) ఉత్పలమాల
4. అలంకారాలు
ప్రశ్న 1.
అజ్ఞానాంధకారమును జ్ఞానజ్యోతితో పారద్రోలుము – ఇందలి అలంకారం ఏది ?
A) అర్థాంతరన్యాస
B) రూపక
C) అతిశయోక్తి
D) ఉపమ
జవాబు:
B) రూపక
ప్రశ్న 2.
ఆ మబ్బులు ఏనుగుపిల్లల్లా ఉన్నవి. – ఇది ఏ అలంకారం ?
A) ఉపమ
B) రూపక
C) అతిశయోక్తి
D) అర్థాంతరన్యాస
జవాబు:
A) ఉపమ
ప్రశ్న 3.
ఉపమేయము నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించే అలంకారం ?
A) ఉపమ
B) రూపక
C) అతిశయోక్తి
D) అర్థాంతరన్యాస
జవాబు:
B) రూపక
5. వాక్య పరిజ్ఞానం
ప్రశ్న 1.
‘బడికి వెళ్ళు’ – ఇది ఏ రకమైన వాక్యం ?
A) విధ్యర్థక వాక్యం
B) నిషేధార్థక వాక్యం
C) అనుమత్యర్థక వాక్యం
D) ప్రశ్నార్ధక వాక్యం
జవాబు:
A) విధ్యర్థక వాక్యం
ప్రశ్న 2.
కిషన్ చదువుతాడో ? లేదో ? వాక్యం ? – ఇది ఏ రకమైన
A) సందేహార్థక వాక్యం
B) అనుమత్యర్థక వాక్యం
C) ప్రశ్నార్ధకం
D) సామర్థ్యార్థకం
జవాబు:
A) సందేహార్థక వాక్యం
ప్రశ్న 3.
‘వాడు చెట్టు ఎక్కగలడు’ – ఇది ఏ రకమైన వాక్యం ?
A) సామర్థ్యార్థకం
C) విధ్యర్థకం
B) అనుమత్యర్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) సామర్థ్యార్థకం
ప్రశ్న 4.
‘నీరు’ లేక పంటలు పండలేదు’ – ఇది ఏ రకమైన వాక్యం ?
A) హేత్వార్థకం
B) అనుమత్యర్థకం
C) నిషేధార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) హేత్వార్థకం
ప్రశ్న 5.
గురువు బడికి వచ్చాడు. గురువు పాఠం చెప్పాడు దీన్ని సంక్లిష్టవాక్యంగా మారిస్తే
A) గురువు బడికి రావాలి, పాఠం బోధించాలి
B) గురువు బడికి వచ్చి పాఠం చెప్పాడు
C) గురువు బడికి వస్తే పాఠం బోధించాలి
D) గురువు బడికి రావడంతో పాఠం చెప్పాడు.
జవాబు:
B) గురువు బడికి వచ్చి పాఠం చెప్పాడు
ప్రశ్న 6.
కూరలు తెచ్చాడు. కూరలు అమ్మాడు. దీన్ని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే
A) కూరలు తెచ్చి అమ్మాడు
B) కూరలు తెస్తూ అమ్మాడు
C) కూరలు తెస్తే అమ్ముతాడు
D) అమ్ముతాడు కూరలు తెస్తే
జవాబు:
A) కూరలు తెచ్చి అమ్మాడు
ప్రశ్న 7.
“మా నాన్న గ్రామంలో లేడు” అని రాజా చెప్పాడు దీనికి పరోక్ష కథన వాక్యం ఏది ?
A) రాజా మా నాన్న గ్రామంలో లేడని చెప్పాడు
B) తమ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
C) తమ నాన్న గ్రామంలో ఉండడని రాజా చెప్పాడు
D) వాళ్ళ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
జవాబు:
B) తమ నాన్న గ్రామంలో లేడని రాజా చెప్పాడు
ప్రశ్న 8.
నాకు పల్లెలంటే ఇష్టం అని రైతు అన్నాడు. – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) రైతు పల్లెయందు ఇష్టం లేదన్నాడు.
B) తనకు పల్లెలంటే ఇష్టమని రైతు అన్నాడు.
C) అతనికి పల్లె యిష్టంగాలేదని రైతు పలికాడు
D) వానికి పల్లెయిష్టం అని రైతు పలికాడు
జవాబు:
B) తనకు పల్లెలంటే ఇష్టమని రైతు అన్నాడు.
ప్రశ్న 9.
తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు – దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) వానికి ముఖ్యమైన పని ఉందని రాము అన్నాడు.
B) ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు.
C) “నాకు చాలా ముఖ్యమైనపని ఉంది” అని రాము అన్నాడు.
D) “నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను” అని రాము అన్నాడు.
జవాబు:
C) “నాకు చాలా ముఖ్యమైనపని ఉంది” అని రాము అన్నాడు.
ప్రశ్న 10.
“నాకు ఏ వ్యసనాలు లేవు” అని రచయిత అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వ్యసనాలు తనకు ఉండవని రచయిత అన్నాడు.
B) రచయితకు వ్యసనాలు ఉండవని అన్నాడు
C) తనకు ఏ వ్యసనాలు లేవని రచయిత అన్నాడు
D) వానికి వ్యసనాలు ఉండవని రచయిత అన్నాడు
జవాబు:
C) తనకు ఏ వ్యసనాలు లేవని రచయిత అన్నాడు
ప్రశ్న 11.
‘నీ విషయం పరిశీలింపబడుతుంది’ – ఈ వాక్యానికి కర్తరి వాక్యం ఏది ?
A) నీ విషయం పరిశీలిస్తారు
B) నీ విషయాన్ని పరిశీలిస్తారు
C) నీ విషయమును పరిశీలన చేయగలరు
D) నీ విషయం పరిశీలనార్హము
జవాబు:
B) నీ విషయాన్ని పరిశీలిస్తారు
ప్రశ్న 12.
‘దున్నేవానికి భూమిహక్కును ఇచ్చారు’ – దీనికి కర్మణి వాక్యం ఏది ?
A) దున్నేవానిచే భూమి హక్కు ఇవ్వబడింది.
B) దున్నేవాడికి భూమిహక్కులు ఇవ్వబడ్డాయి
C) దున్నేవాడికి భూమిహక్కు ఇవ్వబడింది.
D) భూమి హక్కులు దున్నేవాడికి ఇస్తారు
జవాబు:
C) దున్నేవాడికి భూమిహక్కు ఇవ్వబడింది.
ప్రశ్న 13.
రైతులు పంటలు పండించారు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) పండించారు పంటలు రైతులు
B) రైతులచే పంటలు పండించబడినాయి
C) రైతులతో పంటలు పండించబడును
D) రైతులు పండించారు పంటలు
జవాబు:
B) రైతులచే పంటలు పండించబడినాయి
ప్రశ్న 14.
లక్ష్మిచే జాబు రాయబడెను దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) లక్ష్మి యొక్క జవాబు రాయబడెను
B) లక్ష్మికి జవాబు రాయించెను
C) రాయించెను జాబు లక్ష్మి
D) లక్ష్మి జాబు రాసింది.
జవాబు:
D) లక్ష్మి జాబు రాసింది.
ప్రశ్న 15.
పోతన భాగవతం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) రచించాడు భాగవతాన్ని పోతనచేత
B) రచించాడు పోతన భాగవతంతో
C) పోతనచే భాగవతం రచింపబడెను
D) పోతనకు భాగవతం రచించాడు
జవాబు:
C) పోతనచే భాగవతం రచింపబడెను
ప్రశ్న 16.
వర్షాలు బావులను నింపాయి – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) వర్షాల చేత బావులు నింపబడినాయి
B) వర్షాలతో నింపారు బావులను
C) నింపుతున్నాయి వర్షాలు బావులను
D) బావులను వర్షం నింపుతోంది
జవాబు:
A) వర్షాల చేత బావులు నింపబడినాయి