AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

Reviewing AP Inter 2nd Year Telugu Study Material  Grammarఛందస్సు can help students prepare confidently for exams.

AP Intermediate 2nd Year Telugu Grammar ఛందస్సు

1. ఛందస్సు : “ఛందస్సు” అంటే, పద్య లక్షణాలను, వివరించే శాస్త్రము. ఛందస్సులో ‘లయ’ యొక్క ప్రాధాన్యత, అంతర్గతంగా ఉంటుంది.

2. గణములు : ‘గణములు’, గురులఘువులతో కలిసి ఏర్పడతాయి.
పద్యపాదాలు : నిర్ణీతమైన గణముల కూర్పుతో, “పద్యపాదాలు” ఏర్పడతాయి. పద్యాలలో, ‘యతి, ప్రాసలు’ ఉంటాయి.

3. లఘువు : ఒక మాత్ర కాలములో ఉచ్చరింపబడే అక్షరం, ‘లఘువు’. ‘మాత్ర’ అంటే, రెప్పపాటు కాలం. లేదా చిటికె వేసినంత కాలం లేదా క్షణంలో నాల్గవ భాగం అని అర్థం. లఘువును, అక్షరం పై భాగంలో, ‘l’ గుర్తుతో సూచిస్తారు. లఘువును, సంక్షిప్తంగా ‘ల’ అని పేర్కొంటారు.

4. గురువు : రెండు మాత్రల కాలములో ఉచ్చరింపబడే అక్షరం, “గురువు”, గురువును, అక్షరం పై భాగంలో, “U” గుర్తుతో సూచిస్తారు. గురువును సంక్షిప్తంగా, ‘గ’ అని, పేర్కొంటారు.

5. గణములు (గణాలు) : గణములు, కొన్ని గురువులు, లఘువులు కలసి ఏర్పడతాయి. ఈ గణములలో ‘ప్రధాన గణములు’ అనీ, ‘ఉప గణాలు’ అనీ, ఉన్నాయి.

6. ఉప గణాలు : సూర్య గణములు, ఇంద్ర గణములు, చంద్ర గణములు అనే వాటిని, ‘ఉపగణాలు’ అని పిలుస్తారు.

7. యతి : పద్యపాదంలో, మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. యతిని, వడి, వళి, విరామం, విరతి, విశ్రాంతి, అనే పేర్లతో కూడా, పిలుస్తారు.

8. యతిమైత్రి : పద్యపాదంలోని మొదటి అక్షరానికీ, అదే పాదంలో నియమిత స్థానంలో ఉండే అక్షరానికీ, ఉండే మైత్రిని, “యతిమైత్రి” అని పిలుస్తారు. యతిమైత్రి, అచ్చులతోనూ, హల్లులతోనూ కలిసి ఉండాలి.

9. ప్రాస : పద్యపాదములోని రెండవ అక్షరం యొక్క స్థానమును (స్థానాన్ని), “ప్రాస” లేక “ప్రాసము”, అని పిలుస్తారు.

10. ప్రాస నియమము : పద్యములోని అన్ని పాదాలలో ఉండే ప్రాస స్థానాలలో, అనగా రెండో అక్షర స్థానాలలో, ఒకే హల్లును ప్రయోగించడాన్ని, “ప్రాస నియమము” అని అంటారు.

11. ప్రాసయతి : పద్యపాదములో ప్రాసాక్షరానికి, అంటే రెండవ స్థానంలో ఉండే అక్షరానికీ, నియమిత యతిస్థానం తరువాత ఉండే అక్షరానికీ, జరిగే మైత్రిని, “ప్రాసయతి” అంటారు.

గమనిక : ప్రాసకూ, ప్రాస యతికీ, ఒకే హల్లులు ఉంటే చాలు. ఆ హల్లుల పైన అచ్చులు, వేరు వేరుగా ఉండవచ్చు.

గణ విభజన

1. ఒకే అక్షరం గల గణాలు : ఒకే అక్షరం, గణంగా ఏర్పడితే, అది “ఏకాక్షర గణం”. ఈ గణంలో ఒక గురువు, లేదా ఒక లఘువు, ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 1 = ఈ గణం పేరు ‘గ’.
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 2 = ఈ గణం పేరు ‘ల’.

రెండక్షరాల గణాలు

2. రెండక్షరాల గణాలు : రెండేసి అక్షరాలు కలసి, గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ, గురువులూ, లఘువులూ ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.

అ) ఒక గురువు, ఒక లఘువు కలిసి, గణంగా ఏర్పడితే, ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అంటారు.
ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 3

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలసి, గణంగా ఏర్పడితే, అది ‘లగం’ లేదా ‘వ’ గణం అంటారు.
ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 4

ఇ) రెండూ, గురువులు గల గణాన్ని, “గగము” అంటారు.
ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 5

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని, “లలము” అంటారు.
ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 6

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

మూడక్షరాల గణాలు

మూడు అక్షరాలు గల గణాలు, మొత్తం ఎనిమిది (8).

1. ‘య’ గణం = మొదట లఘువు = IUU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 7

2. ‘ర’ గణం = మధ్య లఘువు = UIU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 8

3. ‘త’ గణం = చివర లఘువు = UUI
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 9

4. ‘భ’ గణం = ఆది గురువు = UII
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 10

5. ‘జ’ గణం = మధ్య గురువు = IUI
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 11

6. ‘స’ గణం = చివర గురువు = IIU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 12

7. ‘మ’ గణం = మూడు గురువులు = UUU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 13

8. ‘న’ గణం = మూడు లఘువులు = III
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 14

నాలుగు అక్షరాల గణాలు (ముఖ్యమైనవి)

1. నలము = నగణంపై, లఘువు = IIII
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 15
(మొత్తం నాలుగునూ లఘువులే)

2. నగము = నగణంపై, గురువు = IIIU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 16
(మూడు లఘువులు తర్వాత గురువు)

3. సలము = సగణంపై లఘువు = IIUI
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 17
(రెండు లఘువులు, గురువు, లఘువు)

గణములలో రకములు

కొన్ని గురువులు, లఘువులు కలిసి, గణాలు ఏర్పడతాయి. ఈ గణాలలో “ప్రధాన గణములు” అనీ, “ఉప గణములు” అనీ, ఉన్నాయి. సూర్యగణాలు, ఇంద్ర గణాలు, చంద్ర గణాలు, ఉపగణాల కోవలోకి వస్తాయి.

అ) ప్రధాన గణములు :

1. మగణం – UUU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 18

2. భగణం – UII
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 19

3. జగణం – I U I
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 20

4. సగణం – IIU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 21

5. నగణం – III
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 22

6. యగణం – UIU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 23

7. రగణం – IUU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 23

8. తగణం – UUI
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 25

ఆ) సూర్య గణాలు – ఇవి రెండు (2)

1. నగణం – III
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 26

2. గలము లేక ‘హ’ గణం – UI
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 27

ఇ) ఇంద్ర గణాలు – ఇవి ఆఱు (6)

1. నలము – IIII
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 28

2. నగము – IIIU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 29

3. సలము – IIUI
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 30

4. భగణం – UII
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 31

5. గణ – UIU
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 32

6. తగణం – UUI
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 33

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పై గణాలు కాకుండా, మరో రెండు గణాలు, పద్యాలలో వస్తాయి

1. ‘వ’గణం – దీనినే ‘లగం’ అని కూడా, అంటారు.
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 34

2. గగము – దీనిలో రెండూ గురువులే ఉంటాయి. ఇది కంద పద్యంలో వస్తూ ఉంటుంది.
ఉదా : AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 35

పద్యములు – రకములు

పద్యములు, ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి.

  1. వృత్తములు
  2. జాతులు
  3. ఉపజాతులు

1. వృత్త పద్యములు – లక్షణాలు

క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి, ఉదాహరణలతో సమన్వయించండి.

1. ఉత్పలమాల : ‘ఉత్పలమాల’ అంటే, కలువ పువ్వుల దండ అని అర్థం. ఈ ఉత్పలమాల పద్యం నడక, కలువపూల మాలవలె, సుకుమారంగా ఉంటుందని, ఈ పద్యానికి “ఉత్పలమాల” అని పేరు పెట్టారు.

లక్షణాలు : ఉత్పలమాల పద్యంలో, నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు పాదాల కంటే ఎక్కువ పాదాలు రాస్తే, దానిని ‘ఉత్పలమాలిక’ అంటారు.)

  1. ప్రతి పాదంలో వరుసగా, భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.
  2. ప్రతి పాదంలోనూ మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోనూ, మొదటి అక్షరానికీ, 10వ అక్షరానికీ యతిమైత్రి ఉంటుంది.
  4. ప్రాస నియమం ఉంటుంది. (అంటే పద్యం నాలుగు పాదాల ప్రాసాక్షరాల లోనూ, ఒకే హల్లు ఉంటుంది.

ఉదా :
AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 36

యతిమైత్రి : 1 – 10 అక్షరాలైన చె – జె లకు యతి పాటించారు.
ప్రాసాక్షరం : ‘చ్చ’ అనే ద్విత్వ హల్లు.

2. చంపకమాల : ‘చంపకమాల’ అంటే, సంపెంగ పూలమాల అని అర్థము. ఈ పద్యం, అంత హృదయంగమంగా ఉంటుందని, దీనికి ఆ పేరు పెట్టారు.

లక్షణాలు : ఈ చంపకమాల పద్యంలో, నాలుగు పాదాలు ఉంటాయి. (నాలుగు’ పాదాల కంటె ఎక్కువ పాదాలు రాస్తే, దానిని “చంపకమాలిక” అంటారు.)

  1. ప్రతి పాదంలోనూ, వరుసగా ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు ఉంటాయి.
  2. ప్రతి పాదంలోనూ, మొత్తం 21 అక్షరాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోనూ, మొదటి అక్షరానికీ, 11 వ అక్షరానికీ “యతిమైత్రి” ఉంటుంది.
  4. ప్రాసనియమం ఉంటుంది. (అంటే అన్ని పద్యపాదాల ప్రాసాక్షరాలలోనూ, ఒకే హల్లు ఉంటుంది)

ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 37

యతిమైత్రి : 1-11 అక్షరాలైన సు సూ లకు, యతిమైత్రి పాటించారు.
ప్రాసాక్షరం : ‘త’ అనే హల్లు ప్రాసాక్షరంగా ఉంది.

3. శార్దూలము : శార్దూలాన్ని, ‘శార్దూల విక్రీడితం’ అని కూడా అంటారు. ‘శార్దూలం’ అంటే, పెద్దపులి అని అర్థం. ఛందస్సు నడక, పెద్దపులి అరుపు లాగ, రౌద్రంగా ఉంటుంది. అందువల్ల, ఈ పద్యానికి ‘శార్దూలం’ అని పేరు పెట్టారు.

లక్షణాలు :

  1. శార్దూల పద్యంలో, నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదంలోనూ వరుసగా ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోనూ, మొత్తం 19 అక్షరాలు ఉంటాయి.
  4. ప్రతి పాదంలో, యతిమైత్రి 1-13 అక్షరాలకు ఉంటుంది.
  5. ప్రాసనియమం ఉంటుంది. (అంటే పద్యంలోని పాదాలలోని రెండవ అక్షరాలైన ప్రాసాక్షరాలన్నీ, ఒకే హల్లులో ఉంటాయి.)

ఉదా:

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 38

యతిమైత్రి : మొదటి అక్షరం ‘ఎ’ అనే అచ్చుకు, 13వ అక్షరం ‘నీ’ లో గల ‘ఈ’ అనే అచ్చుకు, యతిమైత్రి చెల్లింది.
ప్రాసాక్షరం : ‘న్న’ అనే హల్లు; ఇచ్చట ద్విత్వ నకారం, ప్రాసాక్షరంగా ఉంది.

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

4. మత్తేభం : మత్తేభాన్ని ‘మత్తేభ విక్రీడితం’ అని కూడా, అంటారు. ‘మత్తేభం’ అంటే మదించిన ఏనుగు అని అర్థము.

లక్షణాలు :

  1. మత్తేభ పద్యములో, నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదంలోనూ, ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలు వరుసగా ఉంటాయి.
  3. ప్రతి పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి.
  4. పద్య పాదంలో మొదటి అక్షరానికీ, 14వ అక్షరానికీ యతిమైత్రి ఉంటుంది.
  5. ప్రాసనియమం ఉంటుంది.

ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 39

యతిమైత్రి : మొదటి అక్షరమైన ‘క’ కును, 14వ అక్షరమైన ‘క్ష’ కును, యతిమైత్రి చెల్లింది.
ప్రాసాక్షరం : ‘డ’ అనే హల్లు, ప్రాసాక్షరంగా ఉంది.

2. జాతులు

1. కందము : ‘కందము’ రాసినవాడే, కవి, అనే నానుడి ఉంది.

లక్షణాలు :

  1. కంద పద్యంలో, నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ఒకటి, మూడు పాదాలకు, మూడేసి గణాలు, రెండు, నాలుగు పాదాలకు, ఐదేసి గణాలు చొప్పున ఉంటాయి.
  3. మొదటి రెండు పాదాలను ఒక భాగంగానూ, మూడు, నాలుగు పాదాలను రెండవ భాగంగానూ పేర్కొంటారు.
  4. కంద పద్యంలో గగ, భ, జ, స, నలము, అనే నాలుగు మాత్రలు గల, గణాలనే వాడాలి.
  5. ఒకటి రెండు పాదాలు కలసిన మొదటి భాగంలోనూ, 3, 4 పాదాలు కలిసిన రెండవ భాగంలోనూ, బేసి సంఖ్య గల గణాలలో, అనగా (1, 3, 5, 7) గణాలలో, జగణం వాడరాదు. ఆరవ గణం తప్పకుండా ‘జగణం’ కాని, ‘నలము’ కాని, కావాలి.
  6. యతిమైత్రి, రెండు నాలుగు పాదాలలో మాత్రమే, 1-4 గణాల మొదటి అక్షరాలకు, ఉంటుంది.
  7. ప్రాసనియమము ఉండాలి.
  8. రెండు, నాలుగు పాదాల చివరి అక్షరం, తప్పకుండా ‘గురువు’ అయి ఉండాలి.
  9. మొదటిపాదం గురువుతో ప్రారంభమైతే, మిగిలిన మూడు పాదాలలోనూ, మొదట గురువుతోనే, పద్యం ప్రారంభం కావాలి. (లేదా) మొదటిపాదం లఘువుతో ప్రారంభమైతే, మిగిలిన పాదాలన్నీ, లఘువుతోనే ప్రారంభం కావాలి.

ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 40

యతిమైత్రి : రెండవ పాదంలోని మొదటి అక్షరం, ‘నో’ కి, అదే పాదంలోని నాల్గవ గణం మొదటి అక్షరం ‘ను’ కి, యతిమైత్రి చెల్లింది.
ప్రాసాక్షరం : ‘ర’ అనే ఒకే హల్లు, రెండు పాదాలలోనూ, ప్రాసాక్షరంగా ఉంది.

2. ద్విపద : ‘ద్విపద’ ఛందస్సు, దేశి కవిత్వానికి చెందింది. “ద్విపద” అంటే, రెండు పాదాలు అని అర్థము.

లక్షణాలు :

  1. ద్విపద పద్యంలో రెండు పాదాలు, మాత్రమే ఉంటాయి.
  2. ప్రతి పాదంలోనూ, మూడు ఇంద్రగణాలు, తరువాత ఒక సూర్యగణము, ఉంటాయి.
  3. 1-3 గణాల మొదటి అక్షరాలకు, “యతిమైత్రి” ఉంటుంది.
  4. ప్రాసమైత్రి ఉంటుంది.
  5. ప్రాస నియమము లేని ద్విపదను, ‘మంజరీ ద్విపద’ అంటారు.

గమనిక : శ్రీనాథుడు “పల్నాటి వీరచరిత్ర” ను, “మంజరీ ద్విపద’లో రాశాడు.

ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 41

యతిమైత్రి :

  1. మొదటి పాదంలో 1,3 గణాల మొదటి అక్షరాలైన, తు – యతిమైత్రి చెల్లింది.
  2. రెండవ పాదంలో 1-3 గణాల మొదటి అక్షరాలైన ‘వ వా’ లకు యతి చెల్లింది.

ప్రాస నియమం : ఇది ‘మంజరీ ద్విపద’. కాబట్టి ప్రాసనియమం పాటించలేదు.

3. ఉపజాతులు

1. ఆటవెలది :

  1. ఆటవెలది, “ఉపజాతి” పద్యం. ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. 1-3 పాదాలలో, వరుసగా 3 సూర్య గణాలు, 2 ఇంద్ర గణాలు ఉంటాయి.
  3. 2-4 పాదాలలో, 5 సూర్య గణాలు ఉంటాయి.
  4. ప్రతి పాదంలోనూ, అనగా నాలుగు పాదాలలోనూ, 1-4 గణాల మొదటి అక్షరాలకు “యతిమైత్రి” చెల్లుతుంది.
  5. ప్రాసనియమము లేదు. కాన ప్రాసయతిని పాటించవచ్చు.

ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 42

లక్షణ సమన్వయం : పై ఉదాహరణలో, మొదటి పాదంలో మూడు సూర్య’ గణాలు, రెండు ఇంద్ర గణాలు వచ్చాయి. రెండవ పాదంలో, ఐదూ సూర్య గణాలే ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఆటవెలది’ పద్యం.

యతిమైత్రి : మొదటి పాదంలో, మొదటి గణంలో మొదటి అక్షరం ‘చే’ కు, నాల్గవ గణంలో మొదటి అక్షరం ‘చెం’ కు యతి చెల్లింది. రెండవ పాదంలో మొదటి గణంలో మొదటి అక్షరం ‘బం’ కు, నాల్గవ గణంలో మొదటి అక్షరం ‘ప” కు “యతిమైత్రి” చెల్లింది.

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

2. తేటగీతి :

  1. తేటగీతి పద్యము, “ఉపజాతి” పద్యం.
  2. తేటగీతి పద్యంలో, నాలుగు పాదాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
  4. ప్రతి పాదంలోనూ, 1-4 గణాల మొదటి అక్షరాలకు, “యతిమైత్రి” ఉంటుంది.
  5. ప్రాస నియమము ఉండదు. కావున, ‘ప్రాసయతి’ పాటింపవచ్చు.

ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 43

లక్షణ సమన్వయము :
పై పాదంలో 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్యగణాలు వరుసగా ఉన్నాయి. కాబట్టి, ఇది ‘తేటగీతి’ పద్యం.

యతిమైత్రి : మొదటి గణంలో మొదటి అక్షరం ‘గ’ కు, నాల్గవ గణంలో మొదటి అక్షరం ‘కా’ కు, ‘యతిమైత్రి’.

3. సీసము :

  1. ‘సీస పద్యం’ ఉపజాతికి చెందిన పద్యము.
  2. సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  3. ప్రతి పాదానికి ఆఱు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  4. సులభంగా చదవడానికి వీలుగా, సీస పద్యపాదాన్ని, రెండు చిన్న పాదాలుగా విభజించారు. అనగా పద్యంలో, మొత్తం ‘8’ అర్ధపాదాలు ఉంటాయి.
  5. ప్రతి అర్ధపాదంలోనూ, 1-3 గణాలు మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉంటుంది.
  6. ప్రాస నియమము లేదు. కావున ప్రాసయతి పాటింపవచ్చును.
  7. సీస పద్యపాదాలు, నాలుగూ ముగిసిన తర్వాత, అనుబంధంగా ‘తేటగీతి’ పద్యం కాని, ‘ఆటవెలది’ పద్యం కాని, విధిగా చేర్చాలి. దీనిని ‘ఎత్తు గీతి’ అంటారు.

ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 44

లక్షణ సమన్వయము :

  1. పై సీస పద్యపాదంలో, వరుసగా 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది సీస పద్యపాదం.
  2. రెండు అర్ధభాగాలుగా చేసిన 2 పాదాల్లోనూ, మొదటి అర్ధభాగంలో 1వ గణం మొదటి అక్షరం ‘క’ కూ, మూడవ గణం మొదటి అక్షరం ‘కం’ కూ, యతి మైత్రి.

అలాగే రెండవ అర్ధభాగంలో, మొదటి గణం మొదటి అక్షరం ‘చ’ కూ, మూడవ గణం మొదటి అక్షరం ‘క్షం’ కు యతిమైత్రి చెల్లుతుంది.

4. ముత్యాల సరం :

గురజాడ అప్పారావు గారు, 1910లో ‘ముత్యాల సరాలు’ అనే ఖండికను, ‘ముత్యాల సరాలు’ అనే ఛందస్సులో రాశారు. ఒక ఫారసీ గజల్ను విని, ఆ స్ఫూర్తితో, ముత్యాల సరాలు ఛందస్సును, కూర్చినట్లు, గురజాడ చెప్పారు.

“వృషభగతి రగడ”, “భామినీ షట్పది”, వంటి ఛందస్సులలోనూ, ముత్యాల సరాలు ఛందస్సుకు, మూలాలు కనిపిస్తున్నాయి. “ముత్యాల సరాలు”, మాత్రా ఛందస్సుతో కూడిన గేయ ప్రక్రియ.

ముత్యాల సరాలు – లక్షణాలు :

  1. ‘ముత్యాల సరాలు’, మాత్రా గణాలతో ఏర్పడుతుంది.
  2. ఇందులో, నాలుగు పాదాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోనూ, 3 + 4; 3 + 4 క్రమంలో మొత్తం 14 మాత్రలు ఉంటాయి.
  4. నాల్గవ పాదంలో మాత్రం, 7 నుండి 14 దాకా మాత్రలు ఉండవచ్చు.
  5. నాల్గవ పాదంతో, భావం పూర్తి కావాలి.
  6. నాలుగు పాదాలలో భావం పూర్తి కానపుడు, గేయం ఒక్కొక్కసారి, ఐదవ పాదం దాకా పెరుగుతుంది.

దీనిని ‘తోక ముత్యాలసరం’ అని వ్యవహరిస్తారు. మన పాఠం ‘కన్యక’ ఖండికలోనూ, ఈ తోక ముత్యాలసరాలు కొన్ని ఉన్నాయి.

ఉదా :

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 45

లక్షణ సమన్వయము :

  1. మొదటి మూడు గేయ పాదాల్లోనూ, 3 + 4; 3 + 4 మాత్రల చొప్పున ఉన్నాయి.
  2. నాల్గవ పాదంలో మాత్రం, మొత్తం 9 మాత్రలున్నాయి.

ఉదా : (తోక ముత్యాల సరము)

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 46

సమన్వయము : పై ముత్యాలసరంలో, నాల్గు పాదాల్లో, భావం పూర్తి కాలేదు. ఐదవ పాదంతో భావం పూర్తి అయ్యింది. కాబట్టి, ఇది ‘తోక ముత్యాల సరా’నికి ఉదాహరణ.

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

అభ్యాసం

I. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఉత్పలం అంటే ఏమిటి ?
జవాబు:
ఉత్పలం అంటే కలువ అని అర్థం.

ప్రశ్న 2.
చంపకం అంటే ఏమిటి ?
జవాబు:
చంపకం అంటే సంపెంగ పూవు అని అర్థం.

ప్రశ్న 3.
శార్దూలం అంటే ఏమిటి ?
జవాబు:
శార్దూలం అంటే పెద్దపులి అని అర్థం.

ప్రశ్న 4.
మత్తేభం అంటే ఏమిటి ?
జవాబు:
మత్తేభం అంటే మదించిన ఏనుగు అని అర్థం.

ప్రశ్న 5.
పద్యం చిన్నదయినా ఎక్కువ లక్షణాలు కలది ఏది ?
జవాబు:
పద్యం చిన్నదయినా ఎక్కువ లక్షణాలు కలది కంద పద్యం.

ప్రశ్న 6.
సూర్యగణాలు ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు 2. ‘న’ గణం, ‘హ’ గణం.

ప్రశ్న 7.
ఇంద్రగణాలు ఎన్ని ?
జవాబు:
ఇంద్ర గణాలు 6. నల, నగ, సల, భ, ర, త.

ప్రశ్న 8.
సూర్యగణాలు ఏవి ?
జవాబు:
సూర్య గణాలు ‘న’ గణం III, ‘హ’ గణం / ‘గలం’ – UI గురువు, లఘువు).

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 9.
సీసపద్యానికి అనుబంధంగా ఏ పద్యం ఉంటుంది ?
జవాబు:
సీస పద్యానికి అనుబంధంగా (ఉన్న పద్యం) ఆటవెలది గాని తేటగీతి గాని ఉంటుంది.

ప్రశ్న 10.
కంద పద్యానికి వచ్చే గణాలు ఎన్ని ?
జవాబు:
కంద పద్యానికి వచ్చే గణాలు భ, జ, స, నల, గగ.

ప్రశ్న 11.
శార్దూలంలో ఒక్కొక్క పద్యపాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
శార్దూలంలో ఒక్కొక్క పద్యపాదంలో 19 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 12.
ప్రాస అంటే ఏమిటి ?
జవాబు:
ప్రాస అంటే పద్యపాదంలో రెండవ అక్షరం.

ప్రశ్న 13.
ఉపజాతి పద్యాలలో ఏ నియమం ఉండదు ?
జవాబు:
ఉపజాతి పద్యాలలో ప్రాస నియమం ఉండదు.

ప్రశ్న 14.
ఉత్పలమాల పద్యంలో ఏయే అక్షరాలకు యతి ఉంటుంది ?
జవాబు:
ఉత్పలమాల పద్యంలో 1, 10 అక్షరాలకు యతి చెల్లుతుంది.

ప్రశ్న 15.
చంపకమాల పద్యంలో ఏయే అక్షరాలకు యతి ఉంటుంది ?
జవాబు:
చంపకమాల పద్యంలో 1, 11 అక్షరాలకు యతి చెల్లుతుంది.

ప్రశ్న 16.
మత్తేభంలో ఏయే అక్షరాలకు యతి ఉంటుంది ?
జవాబు:
మత్తేభంలో 1, 14 అక్షరాలకు యతి చెల్లుతుంది.

ప్రశ్న 17.
శార్దూలంలో ఏయే అక్షరాలకు యతి ఉంటుంది ?
జవాబు:
శార్దూల పద్యంలో 1, 13 అక్షరాలకు యతి చెల్లుతుంది.

ప్రశ్న 18.
శ్రీనాథునికి ఇష్టమైన ఛందస్సు ఏది ?
జవాబు:
శ్రీనాథునికి ఇష్టమైన ఛందస్సు సీసం.

AP Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 19.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ?
జవాబు:
పద్యాలు ప్రధానంగా 3 రకాలు. అవి – వృత్తాలు, జాతులు, ఉపజాతులు.

ప్రశ్న 20.
ఏకమాత్రా కాలంలో పలుకబడేది ఏది ?
జవాబు:
ఏకమాత్రా కాలంలో పలుకబడేది లఘువు.