AP Inter 2nd Year Telugu Grammar క్రియలు

Reviewing AP Inter 2nd Year Telugu Study Material  Grammar క్రియలు can help students prepare confidently for exams.

AP Intermediate 2nd Year Telugu Grammar క్రియలు

క్రియలు : ఏదైనా ఒక పనిని తెలిపే పదాలను క్రియలు అంటారు.

క్రియలు ప్రధానంగా రెండు రకాలు :

  1. సమాపక క్రియ,
  2. అసమాపక

1. సమాపక క్రియ : వాక్యార్థాన్ని పూర్తి చేసే సమర్థత గల క్రియలను సమాపక క్రియలు అంటారు. సమాపక క్రియ మౌలికంగా మూడు రకాలు.

1) భూతకాలిక సమాపక క్రియ : జరిగి పోయిన పనిని సూచించే క్రియా రూపం.
ఉదా :

  • రాముడు రావణుని చంపెను.
  • నేను వ్రాసితిని.
  • నీవు తింటివి.

2) వర్తమాన కాలిక సమాపక క్రియ : జరుగుతున్న పనిని సూచించే క్రియారూపం.
ఉదా :

  • నేను వ్రాయుచున్నాను.
  • వ్రాయుచున్నాడు.
  • వ్రాయుచున్నావు.
  • నీవు తినుచున్నావు.
  • తినుచున్నాను.
  • తినుచున్నాడు.

3) భవిష్యత్కాలిక సమాపక క్రియ: రాబోయే కాలంలో, జరగబోయే పనిని సూచించే క్రియారూపం ఇది.
ఉదా : నేను వ్రాయగలను. నీవు తినగలవు.

2. అసమాపక క్రియ : పనిని పూర్తిగా తెలియజేయని క్రియాపదాలను అసమాపక క్రియలు అంటారు. అసమాపక క్రియ మౌలికంగా మూడు రకాలు.

i) భూతకాలిక అసమాపక క్రియ లేదా క్త్వార్థం : భూత కాలాన్ని సూచించే అసమాపక క్రియా స్వరూపాన్ని క్వార్థం అంటారు.

ఉదా : వెళ్ళి, చూసి, వచ్చి, చదివి, మెచ్చి, రాసి మొదలైన రూపాలు క్త్వార్థాలు.
ఉదా : సురేష్ ఇంటికి వచ్చి, స్నానం చేసి, అన్నం తిని, నిద్రపోయాడు.
క్రియా ధాతువుపై – ‘ఇ’ అనే క్త్వార్థక ప్రత్యయం చేరడం వలన ఈ రూపాలు ఏర్పడతాయి.

వ్యతిరేక క్త్వార్థాలు : వెళ్ళక, చూడక, రాక, చదవక, మెచ్చక, రాయక మొదలైన రూపాల్లో వ్యతిరేక క్త్వార్థాలు ఉంటాయి.

ఉదా : ప్రదీప్ సరిగ్గా బడికి వెళ్ళక, చదవక పరీక్ష ఉత్తీర్ణుడవలేదు.
క్రియా ధాతువులపై వ్యతిరేక క్త్వార్థక ప్రత్యయం “అక” చేరడం వల్ల ఈ రూపాలు ఏర్పడతాయి.

ii) వర్తమాన కాలిక అసమాపక క్రియ లేదా శత్రర్థకం : వర్తమాన కాలాన్ని సూచించే అసమాపక క్రియా స్వరూపాన్ని శత్రర్థకం అంటారు.

ఉదా : వెళ్తూ, వస్తూ, చదువుతూ, తెస్తూ, రాస్తూ, లేస్తూ, మోస్తూ మొదలైన రూపాలు శత్రర్థకాలు.
ఉదా : మా నాన్న ఆఫీసు నుంచి వస్తూ తినుబండారాలు తెచ్చినాడు.
క్రియా ధాతువులపై ‘తూ’ అనే శత్రర్థక ప్రత్యయం చేరడం వల్ల ఈ రూపాలు ఏర్పడతాయి.

వ్యతిరేక శత్రర్థకాలు : వెళ్ళకుండా, రాకుండా, చదవకుండా, లేకుండా రాకుండా మొదలైన రూపాల్లో వ్యతిరేక శత్రర్థకాలు ఉంటాయి.

ఉదా : జ్వరం వల్ల రాము బడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు.
క్రియా ధాతువులపై ‘అకుండా’ అనే వ్యతిరేక శత్రర్థక ప్రత్యయం చేరడం వల్ల ఇవి ఏర్పడతాయి.

iii) భవిష్యత్ కాలిక అసమాపక క్రియ లేదా చేదర్థకం : భవిష్యత్ కాలంలోని అసమాపక క్రియా వ్యాపారాన్ని సూచించే పదం చేదర్థకం, కార్యకారణ సంబంధాన్ని తెలియజేసేటప్పుడు కారణ బోధక క్రియగా చేదర్థకం పనిచేస్తుంది.

ఉదా : వెళ్తే, వస్తే, చూస్తే, చదివితే, నచ్చితే, మెచ్చితే, తెస్తే, రాస్తే మొదలైనవి చేదర్థకాలు.
ఉదా : విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుంది.
క్రియా ధాతువులపై – తే అనే చేదర్థక ప్రత్యయం చేరడం వల్ల ఈ రూపాలు ఏర్పడతాయి.

AP Inter 2nd Year Telugu Grammar క్రియలు

వ్యతిరేక చేదర్థకాలు : వెళ్ళకపోతే, రాకపోతే, చూడకపోతే, చదవకపోతే, నచ్చకపోతే, మెచ్చకపోతే, లేకపోతే, రాకపోతే మొదలైన రూపాల్లో ఉంటాయి.

ఉదా : పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు నిరంతరం గమనించకపోతే వారు చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉంది.
క్రియాధాతువుపై – “అకపోతే” అనే వ్యతిరేక చేదర్థక ప్రత్యయం చేరడం వల్ల ఇవి రూపొందుతాయి.

అప్యర్థకం : ‘కూడ’ అనే అర్థాన్నిచ్చే ప్రత్యయం చేరిన క్రియారూపాలను “అప్యర్థకాలు” అంటారు.

ఉదా : వెళ్ళినా, వచ్చినా, చూసినా, చదివినా మొదలైనవి.
ఉదా : అతను వెళ్ళినా కూడా పనికాలేదు, శ్రీనివాసులు పరుగెత్తినా కూడా బస్సు అందలేదు.
వర్షాలు కురిసినా కూడా పంటలు పండలేదు.
క్రియా ధాతువుపై ‘ఇనా’ అనే ప్రత్యయం చేరడం వలన అప్యర్థకాలు ఏర్పడతాయి.

అభ్యాసం

I. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రియ ప్రధానంగా ఎన్ని రకాలు ?
జవాబు:
క్రియ ప్రధానంగా రెండు రకాలు: అవి

  1. సమాపక క్రియ,
  2. అసమాపక

ప్రశ్న 2.
వాక్యార్థాన్ని పూర్తి చేయని క్రియలను ఏమంటారు ?
జవాబు:
వాక్యార్థాన్ని పూర్తి చేయని క్రియలను అసమాపక క్రియలు అంటారు.

ప్రశ్న 3.
సమాపక క్రియ అంటే ఏమిటి ?
జవాబు:
సమాపక క్రియ అంటే వాక్యార్థాన్ని పూర్తి చేసే సమర్థత గల క్రియ.

ప్రశ్న 4.
క్రియా ధాతువుపై ‘ఇనా’ అనే ప్రత్యయం చేరడం వలన ఏర్పడే రూపాలను ఏమంటారు ?
జవాబు:
క్రియా ధాతువుపై ‘ఇనా’ అనే ప్రత్యయం చేరడం వలన ఏర్పడే రూపాలను ‘అప్యర్థకాలు’ అంటారు.

ప్రశ్న 5.
క్త్వార్థం అంటే ఏమిటి ?
జవాబు:
క్త్వార్థం అంటే భూతకాలాన్ని సూచించే అసమాపక క్రియ.

ప్రశ్న 6.
వర్తమాన కాలిక అసమాపక క్రియను ఏమంటారు ?
జవాబు:
వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రర్థకం అంటారు.

ప్రశ్న 7.
అప్యర్థక క్రియకు ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
అప్యర్థక క్రియకు ఉదాహరణ – వెళ్ళినా, వచ్చినా, చూసినా, చదివినా మొదలైనవి.

AP Inter 2nd Year Telugu Grammar క్రియలు

ప్రశ్న 8.
భవిష్యత్కాలిక అసమాపక క్రియను ఏమంటారు ?
జవాబు:
భవిష్యత్ కాలిక అసమాపక క్రియను చేదర్థకం అంటారు.

ప్రశ్న 9.
క్త్వార్థానికి ఉదాహరణలు తెలపండి.
జవాబు:
క్త్వార్థానికి ఉదాహరణలు – వెళ్ళి, చూసి, వచ్చి, చదివి, మెచ్చి, రాసి మొదలైనవి.

ప్రశ్న 10.
రాజరాజనరేంద్రుడు నన్నయచే భారతాన్ని రాయించాడు. ఇది ఏ క్రియా రూప
జవాబు:
రాజరాజ నరేంద్రుడు నన్నయ భారతాన్ని రాయించాడు. ఇది ప్రేరణార్థక క్రియ.

ప్రశ్న 11.
విధ్యర్థక క్రియకు ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
విధ్యర్థక క్రియకు ఉదాహరణ – నీవు ఆ పని చేయి.

ప్రశ్న 12.
రాజేంద్ర బహుమతి గెలుచుకున్నాడు. దీనిలోని క్రియారూపాన్ని వ్రాయండి.
జవాబు:
రాజేంద్ర బహుమతి గెలుచుకున్నాడు. దీనిలోని క్రియా రూపం ‘గెలుచుకున్నాడు’.

ప్రశ్న 13.
ఆత్మార్థక క్రియలు అంటే ఏమిటి ?
జవాబు:
ఆత్మార్థక క్రియలు అంటే క్రియా ఫలం కర్తకు చెందినప్పుడు ఏర్పడేవి. క్రియా ధాతువులపై ‘కొను’ అనే పదం చేరగా ఏర్పడేవి.

ప్రశ్న 14.
ధర్మాన్ని ఆచరించండి ఇది ఏ క్రియా రూపానికి చెందింది ?
జవాబు:
ధర్మాన్ని ఆచరించండి. ఇది విధ్యర్థక క్రియ.

ప్రశ్న 15.
కొనిపించు, వ్రాయించు, చంపించు ………………. లాంటి క్రియా రూపాలను ఏమంటారు ?
జవాబు:
కొనిపించు, వ్రాయించు, చంపించు లాంటి క్రియారూపాలను ప్రేరణార్థక క్రియలు అంటారు.

ప్రశ్న 16.
శేషుకుమారి పూజ చేస్తున్నది – ఇది ఏ క్రియారూపానికి చెందినది ?
జవాబు:
శేషుకుమారి పూజ చేస్తున్నది. ఇది వర్తమాన కాలిక సమాపక క్రియ.

AP Inter 2nd Year Telugu Grammar క్రియలు

ప్రశ్న 17.
రమణమ్మ రాష్ట్రపతిచే ప్రశంసలందుకున్నది ఇందులో కర్త ఎవరు ?
జవాబు:
రమణమ్మ రాష్ట్రపతిచే ప్రశంసలందుకున్నది. దీనిలో కర్త రమణమ్మ.

ప్రశ్న 18.
భూతకాలిక సమాపక క్రియలకు ఉదాహరణ వ్రాయండి.
జవాబు:
భూతకాలిక సమాపక క్రియలకు ఉదాహరణ కృష్ణకాంత్ రామాయణం చదివాడు.