AP Inter 2nd Year Telugu Grammar వర్ణమాల పారిభాషిక పదాలు

Reviewing AP Inter 2nd Year Telugu Study Material  Grammar వర్ణమాల పారిభాషిక పదాలు can help students prepare confidently for exams.

AP Intermediate 2nd Year Telugu Grammar వర్ణమాల పారిభాషిక పదాలు

తెలుగు భాషకు వర్ణాలు 56.

అచ్చులు : అ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ – ౠ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ – అం – అః

ఉభయాక్షరాలు : (ఁ), (ం), (ః) (3) (అరసున్న, నిండుసున్న, విసర్గ)

హల్లులు :

క – ఖ – గ – ఘ – జ్ఞ
చ – ఛ – జ – ఝ – ఞ
ట – ఠ – డ – ఢ – ణ
త – థ – ద – ధ – న
ప – ఫ – బ – భ – మ (27)

య – ర – ల – వ – శ – ష – స – హ – ళ – క్ష – ఱ

AP Inter 2nd Year Telugu Grammar వర్ణమాల పారిభాషిక పదాలు 1

అచ్చులు : “అ” నుంచి “అః” వరకు 16 అక్షరాలు.

హల్లులు : ‘క’ నుంచి ‘అ’ వరకు ఉన్న వర్ణాలను ‘హల్లులు’ అంటారు. వీటికే “వ్యంజనాలు” అని కూడా పేరు. అచ్చుల సహాయంతో ఇవి పలుకబడుతాయి. అందువల్ల వీటిని “ప్రాణులు” అని కూడా పిలుస్తారు.

పరుషాలు : క-చ-ట-త-ప లను పరుషాలు అంటారు. వీటికే వర్గ ప్రథమాక్షరాలు అని పేరు.

సరళాలు : గ-జ-డ-ద-బ లను సరళాలు అంటారు. వీటికే వర్గ తృతీయాక్షరాలు అని పేరు.

AP Inter 2nd Year Telugu Grammar వర్ణమాల పారిభాషిక పదాలు

అనునాశికాలు : ఙ, ఞ, ణ, న, మ అనే ఐదు అక్షరాలకు “అనునాసికాలు” అని పేరు. వీటికే “వర్గ పంచమాక్షరాలు” అని కూడా పేరు.

అజంత భాష : అచ్చు అంతంలో కల భాషను “అజంత భాష” అంటారు.
ఉదా : రామ అనే పదంలో చివరి అక్షరం ‘మ’ అంటే (మ్ + అ), ‘అ’ అనేది అచ్చు.

అల్పప్రాణాలు : వత్తులేని అక్షరాలను “అల్పప్రాణాక్షరాలు” అంటారు. అచ్చులన్నీ అల్పప్రాణాలే. క – గ – చ – జ – ప…………. వంటి హల్లులు కూడా అల్పప్రాణాక్షరాలు.

మహాప్రాణాలు : వత్తు ఉన్న అక్షరాలను ‘మహాప్రాణాక్షరాలు’ అంటారు. వర్గ ద్వితీయ, వర్గ చతుర్థ అక్షరాలన్నీ మహాప్రాణాలే. వీటికే “వర్గయుక్కులు” అని పేరు.
ఉదా : ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ వంటివి

వక్రాలు : వంకరగా ఉన్న అచ్చులను వక్రాలు అంటారు.
ఉదా : ఎ, ఏ, ఒ, ఓ

వక్రతమాలు : ఎక్కువ వంకరగా ఉన్న అచ్చులను వక్రతమాలు అంటారు.
ఉదా : ఐ, ఔ

ఉభయాక్షరాలు : (ఁ) (అర్థానుస్వారం), (ం) (పూర్ణానుస్వారం), (ః) (విసర్గ) మూడింటిని ‘ఉభయాక్షరాలు’ అని పిలుస్తారు.

స్థిరాలు : పరుష, సరళాలు కాకుండా మిగిలి ఉన్న హల్లులను ‘స్థిరాలు’ అంటారు.

సరళ రేఫ : “ర” అనే అక్షరాన్ని లఘురేఫ (లేదా) సాధురేఫ (లేదా) సరళరేఫ అని అంటారు.

శకటరేఫ : ‘ఱ’ అనే అక్షరాన్ని అలఘురేఫ (లేదా) అసాధురేఫ (లేదా) శకటరేఫ అని అంటారు.

ద్విత్వాక్షరం : ఒకేరకమైన హల్లులు రెండు ఒక అచ్చుతో కూడి ఉంటే దానిని ‘ద్విత్వాక్షరం’ అంటారు.
ఉదా : గ్ + గ్ + అ = గ్గ
త్ + త్ + అ = త్త

సంయుక్తాక్షరం : రెండుగానీ అంతకంటే ఎక్కువగానీ వేరువేరు హల్లులు అచ్చుతో కూడి ఉంటే ‘సంయుక్తాక్షరం’ అని అంటారు.
ఉదా : మ్ + ర్ + అ = మ్ర
క్ + ష్ + మ్ + ఆ = క్ష్మా

ధ్వని ఉత్పత్తి స్థానాలు : ధ్వనిని ఉత్పత్తి చేసేందుకు ఉపకరించే అవయవాలనే ధ్వని ఉత్పత్తి స్థానాలు అంటారు. ఇవి స్థానం, కరణం, ప్రయత్నం.

స్థానం : : అంటే ధ్వనిని ఉచ్చరించేటప్పుడు కదలని అవయవాలు.
ఉదా : నోటి పై పెదవి, అంగుటి.

కరణం : అంటే ధ్వనిని ఉచ్చరించేటప్పుడు కదలిక ఉన్న అవయవాలు.
ఉదా : నోటి కింది భాగాలు.

ప్రయత్నం : అంటే ఊపిరితిత్తుల నుండి గాలి, కంఠం నుంచి పెదవులను దాటే క్రమంలో జరిగే మార్పులే ప్రయత్నం.

దంత్యాలు : దంతాల సహాయంతో పలుకబడే అక్షరాలు.
ఉదా : త – థ – ద – ధ – న

కంఠ్యాలు : కంఠం సాయంతో పలికేవాటిని కంఠ్యాలు అంటారు.
ఉదా : అ, ఆ, క, ఖ, గ, ఘ మొదలైనవి.

తాలవ్యాలు : నోటిలోని దవడల సహాయంతో పలికే వాటిని తాలవ్యాలు అంటారు.
ఉదా : ఇ, ఈ, చ, ఛ, జ, ఝ మొదలైనవి.

మూర్ధన్యాలు : అంగిలి సాయంతో పలికే వాటిని మూర్ధన్యాలు అంటారు.
ఉదా : ట, ఠ, డ, ఢ, ణ, ర, ష

AP Inter 2nd Year Telugu Grammar వర్ణమాల పారిభాషిక పదాలు

ఓష్ఠ్యాలు : పెదవుల సాయంతో పలుకబడేవి.
ఉదా : ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ

నిరోష్ట్ర్యాలు : ఓష్ఠ్యాలు కాని వాటిని “నిరోష్ట్ర్యాలు” అంటారు.
ఊష్మాలు : ఊదుతూ పలుకబడే వాటిని ఊష్మాలు అంటారు.
ఉదా : శ, ష, స, హ

అభ్యాసం

I. ఏక వాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘సుందర తెలుంగు’ అని తెలుగు భాషను కీర్తించిన తమిళ జాతీయకవి ఎవరు?
జవాబు:
‘సుందర తెలుంగు’ అని తెలుగు భాషను కీర్తించిన తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి.

ప్రశ్న 2.
తెలుగు భాషకు వర్ణాలు ఎన్ని ?
జవాబు:
తెలుగు భాషకు వర్ణాలు 56.

ప్రశ్న 3.
‘స్వరాలు’ ‘ప్రాణాలు’ అని వేటిని అంటారు ?
జవాబు:
‘స్వరాలు’, ‘ప్రాణాలు’ అని ‘అచ్చు’లను అంటారు.
ఉదా : అ నుండి ఔ వరకు కలవి.

ప్రశ్న 4.
తెలుగు వర్ణమాలలో ఉభయ అక్షరాలు ఎన్ని ?
జవాబు:
తెలుగు వర్ణమాలలో ఉభయాక్షరాలు మూడు.
ఉదా : c, o, ః

ప్రశ్న 5.
పరుషాలు అంటే ఏవి ?
జవాబు:
పరుషాలు అంటే పరుషంగా పలుకబడే అక్షరాలైన “క,చ,ట,త,ప” లు.

ప్రశ్న 6.
సరళాలు అంటే ఏవి ?
జవాబు:
సరళాలు అంటే సులువుగా పలుకబడే అక్షరాలైన “గ, జ, డ, ద, బ” లు.

AP Inter 2nd Year Telugu Grammar వర్ణమాల పారిభాషిక పదాలు

ప్రశ్న 7.
అనునాసికాలు అంటే ఏవి ?
జవాబు:
అనునాసికాలు అంటే నాసిక (ముక్కు) సహాయంతో పలికే “ఙ, ఞ, ణ, న, మ” లు.

ప్రశ్న 8.
వక్రాలు అంటే ఏవి ?
జవాబు:
వక్రాలు అంటే వంకరగా ఉన్న “ఎ, ఏ, ఒ, ఓ” అనే అచ్చులు.

ప్రశ్న 9.
వక్రతమాలు అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
వక్రతమాలు అంటే ఎక్కువ వంకరగా ఉన్న అచ్చులు అని అర్థం.
ఉదా : ఐ, ఔ

ప్రశ్న 10.
ద్విత్వాక్షరం అంటే ఏమిటి ?
జవాబు:
ద్విత్వాక్షరం అంటే ఒకేరకమైన హల్లులు రెండు ఒక అచ్చుతో కూడినది.
ఉదా : అమ్మ

ప్రశ్న 11.
సంయుక్తాక్షరం అంటే ఏమిటి ?
జవాబు:
సంయుక్తాక్షరం అంటే రెండు గానీ అంతకంటే ఎక్కువగానీ వేరు వేరు హల్లులు అచ్చుతోకూడి ఉన్నవి.
ఉదా : చంద్ర

ప్రశ్న 12.
ఓష్ఠ్యాలు అంటే ఏవి ?
జవాబు:
ఓష్ట్యాలు అంటే పెదవుల సాయంలో పలుకబడేవి అయిన “ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ లు.

ప్రశ్న 13.
ఊష్మాలు అంటే ఏవి ?
జవాబు:
ఊష్మాలు అంటే ఊదుతూ పలుకబడేవి అయిన “శ,ష,స,హ”లు (ఊష్మం పాము పడగ)

ప్రశ్న 14.
కంఠ్యాలు అంటే ఏవి ?
జవాబు:
కంఠ్యాలు అంటే కంఠం సాయంతో పలికే “అ, ఆ, క, ఖ, గ, ఘ”లు.

ప్రశ్న 15.
శకట రేఫను రాయండి.
జవాబు:
శకట రేఫ “ఱ”.

ప్రశ్న 16.
మూర్ధం అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
మూర్ధం అంటే ‘అంగలి’ అని అర్థం.

ప్రశ్న 17.
మహాప్రాణాక్షరాలు అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
మహా ప్రాణాక్షరాలు అంటే ఒత్తు ఉన్న అక్షరాలు అని అర్థం.

AP Inter 2nd Year Telugu Grammar వర్ణమాల పారిభాషిక పదాలు

ప్రశ్న 18.
మహాప్రాణాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మహా ప్రాణులకు ఉదాహరణ “ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ” లు.

ప్రశ్న 19.
అజంత భాష అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
అజంత భాష అంటే అచ్చు అంతంలో కల భాష అని అర్థం.
ఉదా : రామ (మ్ + అ)

ప్రశ్న 20.
నిరోష్ఠ్యం అంటే ఏమిటి ?
జవాబు:
ఓష్ఠ్యాలు కాని వాటి వానిని నిరోష్ట్యాలు అంటారు.

ప్రశ్న 21.
దంత్యాలు అంటే ఏమిటి ?
జవాబు:
దంత్యాలు అంటే దంతాల సాయంతో పలుకబడే అక్షరాలని అర్థం.
ఉదా : త, థ, ద, ధ, న