TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

Telangana TSBIE TS Inter 1st Year English Study Material 13th Lesson The Short-sighted Brothers Textbook Questions and Answers.

TS Inter 1st Year English Study Material 13th Lesson The Short-sighted Brothers

Paragraph Answer Questions (Section – A, Q.No. 5, Marks : 4)

Question 1.
Is the title, “The Short-sighted Brothers” apt to the story ? Explain.
Answer:
Yes. The name “The Short-sighted Brothers” and the content of the story look like made-for- each-other things. The title matches perfectly well with the theme. Three brothers are the lead characters. All the three brothers were very short-sighted. It was a physical disability. And they all suffered from the related mental disability too. They failed to see the possible result of their crooked,plans. They were selfish. They were greedy. They tried to cheat one another. Finally their follies were exposed. As the entire story deals with their physical and mental short- sightedness, the title is appropriate to this ancient chinese folk tale.

అవును. “హ్రస్వదృష్టి కల సోదరులు” అనే పేరు, ఆ కథ ప్రధానాంశం ఒకరికోసం ఒకరు సృష్టించబడినవి లాగా కనిపిస్తాయి. కథ నామము, కథ అంశము సరిగ్గా జతకలుస్తాయి. ముగ్గురు సోదరులు ప్రధాన పాత్రలు. ముగ్గురికీ తీవ్ర హ్రస్వదృష్టి. అది భౌతిక, శారీరక లోపము. అయితే వారికి సంబంధిత మనోవైకల్యం కూడా ఉంది. వారి యొక్క హేయ, దురుద్దేశ పూర్వక ఎత్తుగడల పరిణామాలను ఊహించలేకపోయారు. వారు స్వార్థపరులు. వారిది అత్యాశ. వారు ఒకరినొకరు మోసం చేయాలనుకున్నారు. అంతిమంగా వారి మూర్ఖత్వం బహిర్గతం చేయబడింది. కథ మొత్తం కూడా వారి యొక్క భౌతిక, మనోవైకల్యాల (హ్రస్వదృష్టి) గురించిన చర్చే కాబట్టి, ఈ ప్రాచీన చైనీయుల జానపద గాథకు ఆ పేరు సరిగ్గా సరిపోయింది.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

Question 2.
How did the three brothers try to outsmart one another ?
Answer:
“The Short-sighted Brothers” is a famous Chiness folk story. It exposes the folly of the three brothers. All the three brothers were very short-sighted. Even their personality suffered from the same flaw. They tried to deceive themselves and one another. The youngest brother one day proposed to take charge of their family finances.

He cited his eldest brother’s short- sightedness to support his claim. The second brother too joined the race. The eldest brother proposed a test to prove the power of their sight. They should read the inscription on the newly installed tablet on the door way of the nearest monastery. To outsmart one another, each met the monk secretly and learnt about the writing on it.

“హ్రస్వదృష్టి కల సోదరులు” అనేది ప్రఖ్యాత చైనీయుల జానపద గాథ. అది ఆ ముగ్గురు సోదరుల మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతుంది. ఆ ముగ్గురు సోదరులూ చాలా తీవ్రంగా హ్రస్వదృష్టి కలవారు. వారి వ్యక్తిత్వంలో కూడా అదే లోపము. వారిని వారు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక రోజున అందరిలో చిన్న సోదరుడు కుటుంబ ఆర్థిక వ్యవహారాల బాధ్యతను తనకు అప్పగించమని ప్రతిపాదన చేస్తాడు.

అందుకు మద్దతుగా పెద్దన్నయ్య హ్రస్వదృష్టిని కారణంగా పేర్కొంటాడు. రెండవ సోదరుడూ పోటీలో జతకలుస్తాడు. వారి చూపుడు శక్తిని పరీక్షించుకోవడానికి పెద్ద సోదరుడు ఒక ప్రతిపాదన చేస్తాడు. వారు కొత్తగా, సమీప సన్యాశ్రమ ద్వారంపై ఏర్పాటు చేసిన శిలాఫలకంపై రాతను చదవాలి. మోసపూరితంగా తమదే పై చేయి అనిపించుకొనుటకు, ప్రతి ఒక్కరూ రహస్యంగా ఒక సన్యాసిని కలిసి, ఆ రాతి పలకపైన ఉన్న రాత గురించి తెలుసుకుంటారు.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

Question 3.
Were the three brothers successful in executing their tricks ? Support your answer.
Answer:
No. The three brothers failed in their efforts. The famous Chinese folk tale “The Short-sighted Brothers”, explains their failure. All the three brothers were very short-sighted. Once, they wanted to prove the power of their sight. They were to read an inscription. Each learnt secretly from the monk about the writing.

They thought they could outsmart the others. They visited the monastery the next day. They started READING from the TABLET. Each one READ out. Then the monk came out. He told them that the TABLET was not yet put up! They READ from the TABLET that WAS NOT there! Their folly was exposed. They realised it!

లేదు. ఆ ముగ్గురు సోదరులు తమ ప్రయత్నాలలో విఫలమయ్యారు. ఈ ప్రఖ్యాత చైనీయుల జానపద గాథ. “హ్రస్వదృష్టి కల సోదరులు” వారి వైఫల్యాన్ని వివరిస్తుంది. ఆ ముగ్గురు సోదరులు అందరిదీ తీవ్ర హ్రస్వదృష్టి లోపము. ఒకసారి వారు తమ దృష్టి శక్తిని నిరూపించుకోదలిచారు. వారు ఒక రాతిపలక మీద రాతను చదవాలి. ఒక సన్యాసి ద్వారా వారిలో ప్రతి ఒక్కరూ రహస్యంగా ఆ రాత గురించి తెలుసుకున్నారు.

వారు ప్రతి ఒక్కరు ఇతరులపై తమదే పై చేయి అని నిరూపించగలము అనుకున్నారు. మరుసటి రోజు వారు ఆ సన్యాసాశ్రమాన్ని సందర్శించారు. వారు ఆ శిలాఫలకము చూసి చదవనారంభించారు. ప్రతి ఒక్కరూ చదివారు. అప్పుడు ఆ సన్యాసి బయటకు వచ్చారు. వారితో ఆ రాతి పలకను ఇంకా ఏర్పాటు చేయలేదు అని వివరిస్తారు. అక్కడ లేని రాతిపలకపై రాతను వారు చదివారు ! వారి మూర్ఖత్వం బహిర్గతమైంది. వారూ గుర్తించారు దాన్ని,

Question 4.
Does the story “The Short-sighted Brothers’ support the wise saying, ‘Honesty is the best policy’ ? Discuss. * (Imp) (Model Paper)
Answer:
Yes. Honesty is undoubtedly the best policy. It is certainly very difficult to practise the policy. The story, The Short-sighted Brothers’ proves both these points clearly. All the three brothers were short-sighted. They were selfish. They had no ethical values. They thought they could easily cheat others.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

They got by heart the inscription ‘Be Honest At All Times’. But they never understood its meaning or its importance. They followed dishonest means to prove the power of their sight. Their follies were exposed. Thus, they learnt that their deceptive tricks failed. Only honesty shines forever! And through the brothers, the readers too get a valuable lesson.

అవును. నిజాయితీ నిస్సందేహంగా అత్యుత్తమ విధానం. ఆ విధానాన్ని పాటించడం నిశ్చయంగా చాలా కష్టము. “హ్రస్వదృష్టి కల సోదరులు” అనే కథ ఈ రెండు విషయాలను స్పష్టంగా నిరూపిస్తుంది. వారికి నైతిక విలువలు లేవు. వారు ఇతరులను తేలికగా మోసం చేయగలము అనుకున్నారు. ‘అన్ని వేళలా నిజాయితీగా ఉండండి’ అనే శిలాక్షరాలను కంఠస్థము అయితే చేశారు.

కాని దాని భావాన్ని అర్థం చేసుకోవటం కాని, దాని ప్రాధాన్యతను గుర్తించటం కానీ ఎప్పుడూ చేయలేదు. వారి దృష్టి శక్తిని నిరూపించుకోవడానికి తప్పుడు మార్గాలు అవలంబించారు. వారి మూర్ఖత్వము బహిర్గతం చేయబడింది. ఈ విధంగా వారు గ్రహించారు తమ మోసపూరిత ఎత్తుగడలు విఫలమయ్యాయని. కేవలం నిజాయితీ మాత్రమే శాశ్వతంగా వర్ధిల్లుతుంది. ఆ ముగ్గురు సోదరుల ద్వారా పాఠకులకు కూడా ఒక విలువైన పాఠం అందుతుంది.

The Short-sighted Brothers Summary in English

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers 1
The folk tale, ‘The Short-sighted Brothers’ makes an interesting reading. With its gripping narration, the story excites the reader thoroughly. In the end takes a sudden twrist, stunning and surprising the reader. Equally shocked were the brothers in the story. It exposes the follies of the brothers, prompting many a reader to introspent.

The three aged brothers were the central characters in the story. They were short sighted, both physically and mentally. They were selfish and greedy. Citing their eldest brother’s short- sightedness as a reason, the youngest brother proposed to manage their family finales. He was blind to his own disability. All of them suffered from the same flow, sight problems and lack of values. Yet, each tried to outmart the other.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

Therefore, they planned to test their own vision by reading the inscription above the doorway of nearby monastery. Each knew that he couldn’t read it. So, they secretly and separately enquired with monk there as to what was written on the tablet. And later, they pretended they were reading the inscription with their own eyes. In the process, they fooled themselves they memorised the quotation, “Be honest at all times”. But, they did not adopt it in their own lives! They failed to see the outcome of their evil plans. It was then, that the monk revealed that the tablet was not put up yet. The brothers realized how foolish they were !

Finally, the story clearly shows the physical weakness of the brothers. It also exposes their follies. Hence, we can very strongly say that the title suits the story well. If at once tells us what we are going to find in it.

The Short-sighted Brothers Summary in Telugu

హ్రస్వదృష్టి కల సోదరులు. (The Short-sighted Brothers) అనే కథ ఒక చైనీయుల జానపద గాథ. అది చక్కని సందేశాన్ని, ఆకట్టుకునే రీతిలో తెలుపుతుంది. మితిమీరిన స్వార్థం, ముందు చూపు లోపించి చేసే తప్పుడు పనులు మనల్ని నవ్వుల పాలు చేస్తాయి అని వివరిస్తుంది ఈ కథ. ఒక నగరంలో (చైనాలో) ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు. ముగ్గురికీ తీవ్ర స్థాయిలో హ్రస్వదృష్టి. చాలా దగ్గరలో ఉంటే మాత్రమే కనిపిస్తాయి. అపరిమిత స్వార్థం. అడ్డదారిలో కోరికలు నెరవేర్చుకోవాలని తపన. ఒక రోజు చిన్న తమ్ముడు అంటాడు : పెద్ద అన్నయ్య చూపు లోపాన్ని ఇతరులు దుర్వినియోగం చేసుకుంటారు.

కావున ఇంటి డబ్బు విషయాలు నేను చూస్తాను అని. ఆ విషయానికి వస్తే, అందరికన్నా నా చూపు మెరుగు, కావున ఆ పెత్తనం నాకు కావాలి అంటాడు, రెండవ సోదరుడు. అలానా ? అయితే, ఎవరి చూపు నిజంగా బాగా ఉందో పరీక్షించుకుందాము అని పెద్ద సోదరుడు ప్రతిపాదిస్తాడు. ఊరి చివరి ఉన్న ఒక సన్యాసాశ్రమం ముఖద్వారంపై ఒక మంచి సూక్తి చెక్కబడిన శిలాఫలకాన్ని ఈ రాత్రి ఏర్పరుస్తారట.

రేపు ఉదయం _ ముగ్గురం అక్కడికి వెళ్ళి, ఎవరు ఎంత చక్కగా చూడగలరో తేల్చుకుందాము అంటాడు. అందరూ ఒప్పుకుంటారు. ఆ రాత్రి ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యంగా ఆ ఆశ్రమానికి వెళ్ళి, అక్కడి సన్యాసిని వివరాలు అడుగుతారు. “ఎప్పటికీ నిజాయితీగా ఉండు” అనే సూక్తి, చైనీయుల ప్రసిద్ధ తత్వవేత్త కన్ఫ్యూషన్ చెప్పినది, ఆ రాతి పలక మీద చెక్కించాము అని సన్యాసి వివరిస్తారు పెద్ద అన్నయ్యకు.

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

రెండవ సోదరుడు ఏమైనా అలంకారం ఉందా అని ప్రశ్నించి, పువ్వుల తీగ అలంకారం ఉంది అనే సమాధానాన్ని పొంది, తన తెలివికి తానే సంతోషిస్తూ వెను తిరుగుతాడు. అందరికంటే చిన్నవాడు, మరింత అదనపు సమాచారం కింద ఒక మూలగా, దాత పేరు ఉన్నట్లు సేకరిస్తాడు. మరునాడు ఏమీ ఎరగనట్లు ముగ్గురు సోదరులూ సన్యాశ్రమం చేరుకుంటారు. పెద్దవాడు ముఖ ద్వారం వైపు చూస్తూ, రాత్రి తెలుసుకున్న సూక్తిని “చదువుతాడు”.

దానికి అదనంగా రెండవ వాడు పూవుల తీగ అలంకారం ఉంది అంటాడు. ఆ ఇద్దరికన్నా మిన్నగా దాత పేరు “చదువుతాడు” చిన్నవాడు. ఒకరిని మరొకరు ఓడించగలిగినట్లు సంబరపడుతున్న సమయంలో, రాత్రి వీరు ముగ్గురూ మాట్లాడిన సన్యాసి బయటికి వచ్చి, వారితో “క్షమించండి. రాత్రి ఆ శిలాఫలకం పెట్టలేకపోయాము. ఈ రోజు ఏర్పరుస్తాము. మీరు అది చూడాలని వచ్చారు” అంటాడు. వారి మూర్ఖత్వం బయటపడింది. తమ తెలివితక్కువతనం బయటపడగా, తలలు వంచుకున్నారు. “ఎప్పుడూ నిజాయితీగా ఉండండి” అనే సూక్తిని కంఠస్థం చేశారు. ఆచరించలేకపోయారు.

The Short-sighted Brothers Summary in Hindi

‘हस्व दुष्टि होनेवाले भाई” – The Short- Sights Brootters’ नामक कहानी चीनी देश को लोक कथा है | यह कथ शिक्षा देती है कि अति स्वार्थ, दुर दर्षित के अभाव के कारण होने वाली वाले गलत काम हमें अपहास करते है । एक चीनी शहर में तीन भाई रहते हैं। तीनों ह्रस्व दृष्टि वाले हैं। सभी अपरमित स्वार्थी, बेर्ढतनी से अपनी इच्छाएँ पूरे करने के लिए छटपटानेवाले हैं । एक दिन छोटा भाई कहता है कि वड़े बाई की ह्रस्व दृष्टि का दूसरे लोग दुरुपयोग करते है ।

इसलिए प्यार के पैसे का मामला मैं देख लेता हुँ । दुसरा भाई कहता है कि ऐसा है। बड़ाभाई कहता है कि किसकी दृष्टि अच्छी है, इसकी जाँच करेंगे । गाँव के एक कोने में स्थित सन्यासाश्रम के मुख्यद्वार पर इस रात को सूक्ति अचित शिलाफलक आयोगित किया जाएगा । पालुस करेगे कि कल सबेरे तीनों जाकर कौन कितना अच्छा देख सकता है । सभी मान लेते हैं । उस रात को सभी एक-एक करके रहस्य से अश्रम जाकर वहाँ के सन्यासी से जानाकारी लेते हैं। अगले दिन तीनों जाकर बडा भाई पहली पंक्ति याद रखकर पढता है । दूसरा भाई दूसरी पंक्ति याद रखकर पढता है ।

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

छोटा भाई अंतिम पंक्ति याद रखकर पढता है। हर एक भाई खुशी में है कि उसने बाकी दूसरों को हराया है । इनकी बातों को सुनकर सन्यासी बाहर आकर बताता है कि माफ़ कीजिए, कल रात को शिलाफलक का प्रबंध नहीं हो पाया । आज इसका आयोजन किया जाएगा । इस देखने आप लोग आए होंगे। उनकी मूर्खता मालूम होने पर सब अपना-अपना सिर ॠकाते हैं। शिलाफलक पर उत्कीर्ण सूक्ति ‘हमेशा ईमानदारी से रहो का कंठस्थ करते हैं, लेकिन ने उस सूक्ति का पालन नहीं कर पाते हैं ।

Meanings and Explanations

short-sighted (adj) /sɔ:(r)t saıtıd/ (షో(ర్)ట్ సైటిడ్) (trisyllabic) = not able to see things etc clearly when they are not very near to that person; హ్రస్వదృష్టి లోపం కల; దగ్గరి వస్తువులను మాత్రమే చూడగల.

folklore (n) /fǝuklɔ:(r)/ (ఫఉక్ లో(ర్)) (disyllabic) a collection of conventional tales passed on to posterity orally : మౌఖికంగా భావితరాలకు అందించబడే సాంప్రదాయ కథలు; జానపద గాథలు

to take charge of (phrasal verb) to be in the control of; to take responsibility of : అదుపులో, అధీనంలో ఉంచుకొను; బాధ్యత వహించు

to take advantage of (phrasal verb) = to make use of a situation for one’s selfish interests: ఒక పరిస్థితిని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకొను

sneer (v) /sniǝ(r)/ (స్నిఅ(ర్)) (monosyllabic) = speak harshly; say something without respect: కఠినంగా, అవమానకరంగా మాట్లాడు, अवहेलना, तिरस्कार

monastery (n) /monǝstri/ (మొనస్ ట్ రి) (trisyllabic) = a place where sages, ascetics, etc. live: సన్యాసాశ్రమము, मट

tablet (n) /tæblet/ (ట్యాబ్ లెట్ ) (disyllabic) = a slab of stone/clay for carving: రాతి (మట్టి) పలక; pill = మాత్ర; an electronic device = ఒక ఎలక్ట్రానిక్ పరికరము; చిన్న కంప్యూటర్, गोली

inscription (n) /inskripsən/ (ఇన్ స్ క్రిప్ షన్) (trisyllabic) = writing or carving on a stone surface : రాతిపలకపైని రాత

strain (n) /strein/ (స్ట్రైఇ న్) (monosyllabic) pressure; difficulty: ఒత్తిడి, కష్టము, कसकर तीनाना

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

in unison (phrase – functions as an adverbial) = all together and at a time: అందరూ కలిసి ఒకే సమయంలో (చెప్పు)

get a few winks (idiom) = sleep for a little while: కొద్దిసేపు నిద్రించు

sneak (v) /sni:k/(స్నేక్ ) (monosyllabic) = go without anyone’s knowledge: ఎవరికీ తెలియకుండా (రహస్యంగా) వెళ్ళు, जाव

monk (n) /maŋk/ (మంక్ ) (monosyllabic) a member of an all male-member religious group : సన్యాసి; అందరూ మగవారు మాత్రమే ఉండే మత బృంద సభ్యుడు, मट

Confucius (proper noun) /kənfjʊ:səs/ (కన్ ఫ్యూషన్) = a very famous philosopher from ancient China (550-479 B.C) : చైనాకు చెందిన ప్రాచీన కాలపు ప్రఖ్యాత తత్వవేత్త

chuckle (v) /tsakǝl/ (చకల్) (disyllabic) = laugh silently and inwardly : తమలో తాము నిశ్శబ్దాన్గా నవ్వుకొను

triumphantly (adv) /trai^mfǝntli/ (ట్రయ్ అమ్ షన్ ట్ లి) (polysyllabic-4 syllables) over the success : విజయ గర్వంతో, ఆనందంగా

applaud (v) /ǝplɔ:d/ (అప్లౌడ్) (disyllabic) = praise; appreciate; పొగడు, మెచ్చుకొను

TS Inter 1st Year English Study Material Chapter 13 The Short-sighted Brothers

besides (preposition) /basardz/ (బసైడ్) (disyllabic) = in addition to : అదనముగా

face falling (phrase) = looking sad; విచారంగా కనిపించు

intone (v) /Intaun/ (ఇన్టఉన్) (disyllabic) = say something and emphatically; నెమ్మదిగా, నొక్కి, నొక్కి అను, చెప్పు

follies (n-pl. of ‘folly’) /foliz/ (ఫొలిజ్) = foolishness; మూర్ఖత్వము, క్లాత్

Leave a Comment