Here students can locate TS Inter 1st Year Economics Notes Chapter 6 Theories of Distribution to prepare for their exam.
TS Inter 1st Year Economics Notes Chapter 6 Theories of Distribution
→ Land: Land is a free gift of nature. In economics, land refers to the soil, forests, water, minerals, atmosphere etc.
→ Contract Rent: Contract rent is the reward paid for the services of land, buildings etc., according to an agreement made earlier.
→ Piece Wage: Piece wage is the amount paid for labourers according to the volume of work done by them.
→ Time Wage: Time wage is the amount paid to labourers for a fixed period of work, i.e., daily, weekly and monthly etc.
→ Money Wage: Money wage is the reward received by a labourer in cash for his labour.
→ Real Wage: Real wage is the purchasing power of money wages in terms of goods and services.
→ Capital: Capital is that part of wealth other than land which is used for further production.
→ Net Interest: Net interest is the reward for the service of the capital alone.
→ Normal Profit: No profit no loss situation. In this situation, both the firm and industry will be in equilibrium.
→ Supernormal Profit: Supernormal Profit is the total revenue of the firm will be more than the total cost. Only in the short run firm gets these profits.
TS Inter 1st Year Economics Notes Chapter 6 పంపిణీ సిద్ధాంతాలు
→ మొత్తం ఉత్పత్తి విలువ నాలుగు ఉత్పత్తి కారకాల మధ్య ఏవిధంగా పంపిణీ చేయబడుతుందో తెలియ జేసేది పంపిణీ.
→ పంపిణీని ఆదాయ పంపిణీ, వైయక్తిక ఆదాయ పంపిణీ అని రెండు విధాలుగా పరిశీలించవచ్చును.
→ నిశ్చల పరిస్థితిలో ఉద్యమదారునితో సహా ప్రతి ఉత్పత్తి కారకము దాని ఉపాంత ఉత్పాదనకు సమానంగా ప్రతిఫలం పొందుతుందని జె.బి. క్లార్క్ ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతాన్ని తెలిపెను.
→ ఉత్పత్తి కారకంగా భూమి అందించే సేవలకు లభించే ప్రతిఫలం భాటకం. భూమికున్న సహజమైన నశింపులేని శక్తులను ఉపయోగించుకున్నందుకుగాను రైతు తన పంటలో భూస్వామికి చెల్లించే భాగం భాటకం.
→ శ్రామికుల సేవలకు ఒప్పందం ప్రకారం, యజమాని ప్రతిఫలంగా ఇచ్చే మొత్తం ద్రవ్యాన్ని వేతనం అంటారు. వేతనాలు నాలుగు రకాలు.
- ద్రవ్యవేతనం
- వాస్తవిక వేతనం
- పనినిబట్టి వేతనం
- కాలాన్నిబట్టి వేతనం.
→ ద్రవ్యత్వాభిరుచిని వీడినందుకుగాను ఋణగ్రహీత, ఋణదాతకు చెల్లించే ప్రతిఫలం వడ్డీ అని కీన్స్ అభిప్రాయం.
→ ఋణగ్రహీత నుండి ఋణదాత పొందే మొత్తం వడ్డీని స్థూలవడ్డీ అంటారు. కేవలం మూలధనం సేవకిచ్చే ప్రతిఫలం నికర వడ్డీ.
→ ఉత్పత్తిలో అనిశ్చితత్వం భరించినందుకు వ్యవస్థాపనకు వచ్చే ప్రతిఫలం లాభమని ప్రొ నైట్ అభిప్రాయం.
→ మొత్తం రాబడి నుండి వ్యయాన్ని తీసివేస్తే వచ్చేది స్థూలలాభం. కేవలం వ్యవస్థాపకుని సేవకు లభించే ప్రతిఫలం నికర లాభం.